వినాయకచవితి:
వినాయకచవితి:
వినాయకచవితి—దక్షిణాయణం—వర్షఋతువు—భాద్రపదమాసము—శుక్లపక్షము—చవితి
దక్షిణాయణం, వర్షఋతువు, భాద్రపదమాసము, శుక్లపక్షము, చవితినాడు వినాయక చవితి పండగ చేసికుంటారు.
వినాయకుడు అనగా విశిష్టమయిన నాయకుడు. అనగా మనస్సు. అన్ని విఘ్నములను నాశనము
చేసేది మనస్సే. ఆ మనస్సు నిశ్చలముగా ఉండాలి, వర్షఋతువు వలన మనస్సు
చీకాకు పడకుండా ఉండాలనే ఉద్దేశ్యముతో ఈ పండగ చేసికుంటారు.
గణేశ మూలమంత్రం:
తూర్పును చూస్తూ
కూర్చోండి, మేరుదండమును సీదాగా ఉంచండి. మనస్సు మరియు దృష్టి కూటస్థము లో ఉంచండి.
ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే నమః
ఓం – మూలాధార --పృథ్వి ముద్ర
శ్రీం --
స్వాధిష్ఠాన-- వరుణ
హ్రీం – మణిపుర -- అగ్ని
క్లీం – అనాహత – వాయు
గ్లౌం – విశుద్ధ – శూన్య
గం – ఆజ్ఞా నెగటివ్ – జ్ఞాన
గణపతయే – కూటస్థము – జ్ఞాన
నమః – సహస్రార – సహజ ముద్ర
ఈ మంత్రము
ఆయాచక్రములను tense చేసి సంబంధిత ముద్రలు వేసి ఆయాచక్రములలో మనస్సు
మరియు దృష్టి పెట్టి 108 సారులు కనీసము 41 దినములు
ఉదయము సాయంత్రము పఠించవలయును. లేదా జ్ఞాన ముద్ర లేదా సహజముద్ర వేసి కూటస్థములో
మనస్సు మరియు దృష్టి పెట్టి 108 సారులు చేయ వలయును.. కార్యసిద్ధి లభించును.
సర్వ విఘ్నములు తొలగును. సమాధి
లభించును.
అగజానన పద్మార్కం
గజాననం అహర్నిశం అనేక దం తం భక్తానాం ఏకదం
తం ఉపాస్మహే.
అగజ = పార్వతి, ఆనన = ముఖము, పద్మ= పద్మము, అర్కం = సూర్యుడు, గజ = ఏనుగు, ఆననం = ముఖం, (అహ = పగలు, నిశం = రాత్రి) అహర్నిషం = అన్నివేళలు లేదా రాత్రింబవళ్ళు, అనేక = వివిధములయిన, దం = ఇచ్చేవాడు, తం = నీయొక్క, భక్తానాం = భక్తులకు, ఏక = ఒకటి, దంతం = పన్ను, ఉపాస్మహే = ప్రార్థిస్తున్నాను.
గజముఖుడయిన విఘ్నేశ్వరుని
నిత్యమూ పూజిస్తూ ఉంటే, సూర్యుని చూసిన కమలము మాదిరిగా పార్వతి ముఖము
వెలిగిపోతున్నది. భక్తులకి కోరిన వరములను
ఇచ్చు ప్రభువు విఘ్నేశ్వరుని నేను ప్రార్థిస్తున్నాను.
యోగి దృష్టిలో
అగజ = కదలని
(నిశ్చలమయిన), ఆనన పద్మార్కం = పరమాత్మ చేతనతో అనగా ఆత్మ
సూర్యునితో వెలుగొందు ముఖము గలవాడు,
గజ ఈతగాడు అనగా గొప్ప
ఈతగాడు, అలాగే గజానన మహర్నిశం అనగాశుద్ధ జ్ఞానము అనే గొప్ప
ముఖముతో నిత్యమూ వెలుగొందు వాడునూ,
అనేకదం తం భక్తానాం అనగా ఆయన యొక్క భక్తులు
అనేక విధములయిన రూపములతో ఆయనని పూజిస్తున్నప్పటికీ,
ఏకదం తం ఉపాస్మహే అనగా
అనేక విధములయిన రూపములు ఒక్కడే అయిన ఆ ప్రభువు, పరమాత్మ అయిన
విఘ్నేశ్వరుని నేను ప్రార్థిస్తున్నాను.
పరమాత్మ చేతనతో అనగా
ఆత్మ సూర్యునితో వెలుగొందు ముఖము గలవాడు, శుద్ధ జ్ఞానము అనే
గొప్ప ముఖముతో నిత్యమూ వెలుగొందు వాడునూ, ఆయన యొక్క భక్తులు
అనేక విధములయిన రూపములతో ఆయనని పూజిస్తున్నప్పటికీ, అనేక విధములయిన రూపములు ఒక్కడే అయిన ఆ ప్రభువు, పరమాత్మ అయిన
విఘ్నేశ్వరుని నేను ప్రార్థిస్తున్నాను.
Comments
Post a Comment