Talavya kriya Telugu
తాళవ్యక్రియ:
తాళవ్యక్రియ మూడు భాగములు. ఇది క్రియాయోగములో ఒక భాగము. దీనివలన మణిపురచక్రములో స్పందనలు కలుగును.
అంతేకాదు, మణిపురనుండి కూటస్థము వరకు యే అడ్డంకులు కలగవు. Currents శీఘ్రగతిని
సహస్రారము చేరి సాధకునకు సమాధి స్థితి కలుగ చేయును.
తూర్పును చూస్తూ కూర్చోండి, మేరుదండమును సీదాగా ఉంచండి. మనస్సు మరియు దృష్టి కూటస్థము లో ఉంచండి.
ఒకటవ భాగము:
నాలుకను అంగిలి (palate)ని తాకించి శబ్దము వచ్చునట్లుగా క్రిందకి తేవలయును.
అట్లా 108 పర్యాయములు చేయవలయును.
రెండవ భాగము:
నాలుకను పాము మాదిరి ప్రక్కలకి, పైకి క్రిందకి 108 పర్యాయములు ఆడించవలయును.
మూడవ భాగము:
నాలుకను మడిచి కొండనాలుక(Uvula) ప్రక్కనున్న
బిళములోనికి చొచ్చుటకు ప్రయత్నించ వలయును. అట్లా 108 పర్యాయములు చేయవలయును.
Comments
Post a Comment