క్రియాయోగము నేర్చుకోండి, సాధన చేయండి
క్రియాయోగము నేర్చుకోండి,
సాధన చేయండి
భౌతికమైన మరియు ఆధ్యాత్మకమయిన వ్యత్యాసములు మనుషులకు
పశువులు మరియు ఇతర నీచ జాతులకు ఎన్నో ఉన్నవి. ఉదాహరణకు:
ఆత్మవిశ్వాసము, సౌందర్యోపాసన, హాస్య ప్రవృత్తి, మరణము తథ్యము అనే జ్ఞానం, కాలముయొక్క జ్ఞానం, శబ్దములమధ్య ఉన్న వ్యత్యాసము లేదా , శబ్ద జ్ఞానం, సంగీత జ్ఞానం, జీవిత పరమార్థం
యొక్క జ్ఞానం, శీతోష్ణస్థితుల జ్ఞానం, శీతోష్ణస్థితులకు అనుగుణముగా దుస్తులు ధరించగల జ్ఞానం, ప్రకృతినియమాలను
ఉల్లంఘించి రైలు, రోడ్డు, ఆకాశ (విమాన), మార్గముల ప్రయాణించగలిగిన జ్ఞానం, ఒకే కుటుంబానికి, గోత్రమునకు
సంబంధించిన వారితో వివాహముమరియు సంభోగము
కూడదనే నిషేధ నియమముల జ్ఞానం, ఆవేశముతోను, జన్మతహా వచ్చే స్వభావము(instinct)లతో కాక ఆలోచనాపూర్వక క్రియా జ్ఞానం, ప్రేమ ఆప్యాయత
సహోదరభావ జ్ఞానం, కట్టు బొట్టుల జ్ఞానం, తన శరీర స్వభావమునుబట్టి ఆరోగ్య పరిస్థితులనుబట్టి తీసుకోవలసిన లేదా పాటించవలసిన ఆహార నియమముల
జ్ఞానం, కృషితో అన్ని
రంగములలోను పైకి వచ్చే జ్ఞానం, ఇంకొకడి ఆరోగ్యము ఐశ్వర్యం, ఉన్నతికై భగవంతుని ప్రార్థించే జ్ఞానం, ఇట్లా చెప్పుకుంటూ
పొతే ఎన్నో.
అందువలననే మనిషి మానవ రాక్షసుడు, మానవ పశువు, మానవ మానవుడు
అవస్థలను(stages) దాటి మానవ దేవుడు అవ్వాలి. దానికి ఏకైక మార్గము క్రియాయోగ సాధనే. ఏదయినా వేడి
వస్తువు ముట్టుకున్నప్పుడు మనలోని పంచజ్ఞానేంద్రియములలో ఒకటయిన స్పర్శేంద్రియము
చర్మము గ్రహించి సెన్సర్ (senser nerves) నరములద్వారా
బుర్రకు(cerebrum) సమాచారము చేరవేస్తుంది. బుర్ర మోటార్ (motor nerves) నరములద్వారా చేతులు వెనక్కి తీసుకొమ్మని సంకేతము పంపుతుంది. అదేవిధముగా చూపు, శ్రవణము, ఘ్రాణము, మరియు రుచిలకి సంబంధించిన ఇతర జ్ఞానేంద్రియముల ద్వారా అందిన సమాచార సేకరణనిబట్టి ఆయా సంబంధిత ఇంద్రియములకు అవయవములకు పాటించవలసిన
ఆజ్ఞలు (orders) బుర్ర పంపుతుంది.
కాని మనము చాలా సందర్భములలో అనుభవము పొందకమునుపే, సెన్సర్ (senser nerves) మరియు మోటార్ (motor nerves) నరముల ప్రమేయము
లేకుండానే పనులు చేస్తూ ఉంటాము. ఉదాహరణకి: వేడివస్తువుని చూచి ముట్టుకోకపోవటము, పాము, తేలులాంటి విష జంతువులనుండి
దూరముగా ఉండటము, ఇత్యాదివి ఎన్నో. అనగా మనిషికి
ఆలోచనా సరళి(కారణమనస్సు- causal mind), అవచేతనా మనస్సు (sub-conscious mind), మరియు చేతనా మనస్సు (conscious mind)అనేవి ఉన్నవి అనటములో ఏమాత్రము సందేహములేదు.
కారణమనస్సు(causal mind)కి ప్రతీక అయిన బుర్ర(cerebrum)లో ఊహలు మరియు ప్రణాలికలు (Ideas & plans) రచించబడుతాయి. అవచేతనా మనస్సు (sub-conscious mind)కి ప్రతీక అయిన చిన్నమెదడు
(cerebellum)లో ఊహలు మరియు ప్రణాలికలను పాటించుటకు
లేదా నెరవేర్చుటకు వలసిన శక్తి గ్రహించబడుతుంది. చేతనా మనస్సు (conscious mind)కి ప్రతీక అయిన బుర్రకాడ (brain stem) దానిని నేరవేర్చుతుంది.
ఆత్మజ్ఞానము (intuition)
ఒక్క మానవుడికి మాత్రమె జన్మతః పరమాత్మ ఇచ్చిన వరం. దీనిని వృధా చేసుకొనుట అవివేకము. కనుక రండి, క్రియాయోగము నేర్చుకుందాం, పరమాత్మతో అనుసంధానం పొందుదాం. జీవిత పరమార్ధమును సాకల్యము చేసికుందాం.
Comments
Post a Comment