భోగి సంక్రాంతి కనుమ ముక్కనుమ


            భోగి సంక్రాంతి కనుమ ముక్కనుమ
శ్రీ కాళహస్తి కోటిలింగాలక్షేత్రము మరియు ద్వాదశ లింగ క్షేత్రములలో ఒకటయిన శ్రీశైలము అనే మూడులింగ క్షేత్రములు చాలా ముఖ్యమయినవి. ఈ త్రిలింగ క్షేత్రముల మధ్యనున్నదే త్రిలింగజాతి. కాలక్రమేణ తెలుంగు తత్తదుపరి తెలుగు జాతిగా రూపాంతరము చెందినది. ఆధ్యాత్మికముగా ఉన్నతమయిన వారు గాన ఆంధ్రులుగాకూడా పేర్కొనబడ్డారు. వారి పండగలు కూడా ఆధ్యాత్మిక రూపముగానుండుటలో అబ్బురపడనవసరము లేదు. ఆ విధముగా ఆధ్యాత్మిక రూపముగా  పండుగలకు పేరు పెట్టారు.  
భోగి సంక్రాంతి కనుమ ముక్కనుమ. వాటిగురించి ఈక్రింది వివరణ పరిశీలించండి.
ఒక హంస = ఒక శ్వాస+ ఒక నిశ్వాస
మనిషి యొక్క దశలు యోగి భోగి మరియు రోగి అని మూడు రకములు. సాధారణ మనిషి అనగా ఆరోగ్యకరమయిన మనిషి రోజుకి 21600 హంసలు చేస్తాడు, అనగా ఒక నిమిషమునకు 15 హంసలు చేస్తాడు,  అనగా 4 సెకనులకు ఒక హంస చేస్తాడు.
ఒక నిమిషమునకు 15 హంసలు చేయు మనిషిని భోగి అంటారు.
ఒకనిమిషమునకు 15కంటే ఎక్కువ హంసలు చేయు మనిషిని రోగి అంటారు.
ఒకనిమిషమునకు 15కంటే తక్కువ హంసలు చేయు మనిషిని యోగి అంటారు.
భోగి:
క్రియాయోగసాధనతో నీ కర్మలను దగ్ధము చెయ్యి. భోగి నుండి యోగివి అవ్వు. ఇది తెలియచెప్పుటకు గుర్తుగా వేసేవే  భోగిమంటలు.  
సంక్రాంతి:         
సూర్యుడు ప్రతి మాసము ఒక్కొక్క రాశిలో ప్రయాణము చేస్తాడు. దానిని సంక్రమణము అంటారు. ఈ విధముగా సంవత్సరములో 12 సంక్రమణములు ఉంటాయి.  వాటిలో రెండు సంక్రమణములు అనగా 1) మకర మరియు 2)కర్కాటక సంక్రమణములు ముఖ్యమయినవి.
సూర్యుడు మకరరాశిలో ప్రవేశించుటను  మకరసంక్రమణము లేదా మకర సంక్రాంతి అంటారు. దీనితో ఉత్తరాయణము ప్రారంభమవుతుంది. ఆరునెలల తరువాత సూర్యుడు కర్కాటక రాశిలో ప్రవేశించుటను  కర్కాటక సంక్రమణము అంటారు. దీనితో దక్షిణాయణము ప్రారంభమవుతుంది.
ఉత్తరాయణము ఆరు నెలలు క్రియాయోగాసాధకుని కర్రెంట్స్ దక్షిణము అనగా మూలాధారచక్రము నుండి  ఉత్తరము అనగా సహస్రారచక్రము వరకు బాగా ఎక్కువగా ప్రవహిస్తాయి. అందువలన ఇది సాధకులకు చాలా ఉపయోగము. తక్కువ ప్రయత్నముతోనే సాధకుడుకు ఎక్కువ ఆధ్యాత్మికఫలితము  పొందుతాడు.
దక్షిణాయణము ఆరు నెలలు క్రియాయోగాసాధకుని కర్రెంట్స్ ఉత్తరము అనగా సహస్రారచక్రమునుండి  దక్షిణము అనగా మూలాధారచక్రము వరకు బాగా ఎక్కువగా ప్రవహిస్తాయి. అందువలన ఆ కర్రెంట్స్ మూలాధారచక్రము వయిపు దిగకుండుటకు చాలా చాలా తీవ్రసాధన ఈ ఆరునెలలు అవసరము.
క్రియాయోగాసాధన చేస్తే సంక్రాంతి వచ్చును. అనగా  ఉత్తరమువయిపు ప్రయాణము చేస్తావు అనగా ఉత్తరాయణములో ఉంటావు అని తెలియచెప్పుటకు గుర్తుగా మకర సంక్రాంతి జరుపుకుంటారు.  
కనుమ:
తీవ్ర క్రియాయోగాసాధన చేసిన సాధకుడు తనలోని అజ్ఞానమును కనుటకు గుర్తుగా కనుమ జరుపుకుంటారు.      
ముక్కనుమ:
రెండు భ్రూమధ్యముల మధ్యనున్నది కూటస్థము. ఆ కూటస్థములో తీవ్ర క్రియాయోగధ్యానములో మూడవకన్ను కనబడును. దానికి గుర్తుగా ముక్కనుమ జరుపుకుంటారు.

Comments

  1. Sir,
    Thanks for en lighting us on this subject
    regards
    deekshitulu

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

Mantrapushpam with Telugu meaning మంత్రపుష్పం

49 Maruts mentioned by Sri Sri Yogiraj LahiriMahasya Maharaj

Shree vidya upaasana