కొన్ని విషయములు:
కొన్ని విషయములు:
ఉదయము 5 నుండి 7
గంటల మధ్య పెద్దపేగు(large intestine) క్రియాశీలకముగా (active)
ఉంటుంది. శరీరవ్యర్ధములను పంపే పనిలో ఉంటుంది. ఈ సమయములో నీరు ఎక్కువగా త్రాగాలి.
నడక, పరిగెత్తుట లాంటి వ్యాయామములు చేయాలి. కాఫీ టీ లాంటివి త్రాగకూడదు.
ఉదయము 7 నుండి 9
గంటల మధ్య ప్రోటీన్లు, తక్కువ
పిండిపదార్థములు (Carbohyd rates) ఉన్న ఆహారము, ఆరోగ్యకరమైన క్రొవ్వులు(less Cholesterol)
కలిగిన ఆహారాన్ని, పండ్లను తీసుకోవాలి.
ఉదయము 9 నుండి 11
గంటల మధ్య ప్లీహం (spleen) ఉత్తేజముగా ఉంటుంది. శరీరములో జీవక్రియను గాడిలో పెడుతుంది. తిన్న ఆహారములోని పోషక పదార్థముల ను శరీరము గ్రహించేలా చేస్తుంది.
ఉదయము 11 నుండి
1 గంటల
మధ్య హృదయము
క్రియాశీలకముగా (active) ఉంటుంది. రక్తము శరీర భాగాలకు రక్తము బాగా సరఫరా
అయ్యేలా చూస్తుంది. దీనివల్ల శరీర కణములకు శక్తి చేకూర్తుంది.
మధ్యాహ్నము 1 నుండి
3 గంటల
మధ్య సమయములో చిన్న ప్రేగు (small intestine) క్రియాశీలకముగా (active)
ఉంటుంది. మనము తిన్న టిఫిన్ మధ్యాహ్నపు భోజనముల జీర్ణప్రక్రియకు తోడ్పడుతాయి.
మధ్యాహ్నము 3
నుండి 5 గంటల మధ్య సమయములో మూత్రాశయము క్రియాశీలకముగా (active)
ఉంటుంది. శరీర వ్యర్థములను బయటకు పంపుతుంది. ఈ సమయములో నీరు ఎక్కువగా త్రాగాలి.
సాయంత్రము 5
నుండి 7 గంటల మధ్య సమయములో మూత్రపిందములు (kidneys)
బాగా పనిచేస్తాయి. రాకమును వదపోయటము, వ్యర్థములను
మూత్రాశయమునకు పంపటము చేస్తూ ఉంటాయి.
రాత్రి 7
నుండి 9 గంటల మధ్య సమయములో హృదయ
ఆవరణము (pericardium)
బాగా పనిచేస్తుంది. ఈ సమయములో రాత్రి భోజనమును తప్పక ముగించాలి. మెదడి,
ప్రత్యుత్పత్తి అవయవములను హృదయ ఆవరణము (pericardium) క్రియాశీలకము చేస్తుంది.
పెరికార్డియం (pericardium) అనగా అది ఒక ద్రవము (fluid filled sac)తో నింపబడిన సంచీ. అది హృదయము మరియు ఆరోటా సమీపములోని చివరలను (proximal ends of the aorta, vena cava, and the pulmonary artery), వెనకావాను, మరియు పల్మనరీ ఆర్టరీ లను చుట్టిఉంటుంది.
పెరికార్డియం (pericardium) కి చాలా పనులు ఉంటాయి. హృదయము దాని బొక్కలో (chest cavity) లో చక్కగా ఉంచుట, రక్తము
వాల్యూమ్ పెరిగినప్పుడు హృదయము అమితముగా వ్యాకోచము చెందకుండా ఆపుట (overexpanding), మరియు హృదయము కదలికలను పరిమితులలో ఉంచుట.
రాత్రి 9
నుండి 11 గంటల మధ్య సమయములో భోజనము అస్సలు
చేయకూడదు. థైరాయిడ్ మరియు అడ్రినల్
గ్రంధులు బాగా పనిచేస్తాయి. శరీర మెటబాలిజం ప్రక్రియను చురుగ్గా సాగేలా చేస్తాయి.
శరీర ఉష్ణోగ్రతను క్రమబద్ధీకరణచేస్తాయి. కణములకు శక్తి అందేలా చేస్తాయి.
రాత్రి 11
నుండి 1 గంటల మధ్య సమయములో మూత్రాశయము క్రియాశీలకముగా (active)
ఉంటుంది. గాల్
బ్లాడర్ లో రాళ్ళు ఉన్నవారికి ఈ సమయములో సాధారణంగా నొప్పి వస్తుంది.
రాత్రి 1
నుండి 3 గంటల మధ్య సమయములో కాలేయము
(liver)
క్రియాశీలకముగా (active) ఉంటుంది. ఈ సమయములో నిద్ర అత్యంత అవసరము. మేల్కొని
ఉంటె కాలేయము (liver) దెబ్బతిని వ్యర్ధములు బయటికి పోవు.
రాత్రి 3
నుండి 5 గంటల మధ్య సమయములో ఊపిరితిత్తులు(lungs)
క్రియాశీలకముగా (active) పనిచేస్తాయి. ఆ సమయములో దగ్గు వస్తే మంచిదే.
విషపదార్థాలను ఊపిరితిత్తులు(lungs) బయటికి పంపుతున్నట్లు లెక్క.
Comments
Post a Comment