kriyayogasadhana-Vinayak-Yogic meaning in Telugu


అగజానన పద్మార్కం గజాననం అహర్నిశం అనేక దం  తం భక్తానాం ఏకదం తం ఉపాస్మహే.
అగజ = పార్వతి,   ఆనన = ముఖము,  పద్మ= పద్మము,   అర్కం =  సూర్యుడుగజ = ఏనుగుఆననం = ముఖం, (అహ పగలు,  నిశం =  రాత్రి) అహర్నిషం అన్నివేళలు లేదా రాత్రింబవళ్ళు, అనేక = వివిధములయిన దం = ఇచ్చేవాడు,  తం = నీయొక్క భక్తానాం = భక్తులకు,  ఏక = ఒకటి,  దంతం = పన్ను, ఉపాస్మహే = ప్రార్థిస్తున్నాను.
గజముఖుడయిన విఘ్నేశ్వరుని నిత్యమూ పూజిస్తూ ఉంటేసూర్యుని చూసిన కమలము మాదిరిగా పార్వతి ముఖము వెలిగిపోతున్నది.   భక్తులకి కోరిన వరములను ఇచ్చు ప్రభువు విఘ్నేశ్వరుని నేను ప్రార్థిస్తున్నాను.
యోగి దృష్టిలో
అగజ = కదలని (నిశ్చలమయిన)ఆనన పద్మార్కం = పరమాత్మ చేతనతో అనగా ఆత్మ సూర్యునితో వెలుగొందు ముఖము గలవాడు,
గజ ఈతగాడు అనగా గొప్ప ఈతగాడుఅలాగే గజానన మహర్నిశం అనగాశుద్ధ జ్ఞానము అనే గొప్ప ముఖముతో నిత్యమూ వెలుగొందు వాడునూ,
అనేకదం  తం భక్తానాం అనగా ఆయన యొక్క  భక్తులు  అనేక విధములయిన రూపములతో ఆయనని పూజిస్తున్నప్పటికీ,    
ఏకదం తం ఉపాస్మహే అనగా అనేక విధములయిన రూపములు ఒక్కడే అయిన ఆ ప్రభువుపరమాత్మ అయిన విఘ్నేశ్వరుని నేను ప్రార్థిస్తున్నాను.
పరమాత్మ చేతనతో అనగా ఆత్మ సూర్యునితో వెలుగొందు ముఖము గలవాడుశుద్ధ జ్ఞానము అనే గొప్ప ముఖముతో నిత్యమూ వెలుగొందు వాడునూ, ఆయన యొక్క  భక్తులు  అనేక విధములయిన రూపములతో ఆయనని పూజిస్తున్నప్పటికీఅనేక విధములయిన రూపములు ఒక్కడే అయిన ఆ ప్రభువుపరమాత్మ అయిన విఘ్నేశ్వరుని నేను ప్రార్థిస్తున్నాను.

కౌతా మార్కండేయ శాస్త్రిక్రియాయోగి, DN76, YSS Dhyanamandir, Devinagar, RK Puram Gate, Hyderabad 500056, PH: 9440364947.



Comments

Popular posts from this blog

Mantrapushpam with Telugu meaning మంత్రపుష్పం

49 Maruts mentioned by Sri Sri Yogiraj LahiriMahasya Maharaj

Shree vidya upaasana