క్రియాయోగాసాధన అభ్యసించండి
జైగురు, భూతకాలము చచ్చిపోయింది, భవిష్యత్ కాలము ఇంకా పుట్టలేదు. వీటిగురించి
ఎందుకు చర్చ? వర్తమాన కాలము పరమాత్మ మనకు ఇచ్చిన గొప్ప బహుమతి అవకాశము.
మనము భూతకాలములోని మహాత్ములగురించి చెప్పుకొని మురిసిపోతూ ఉంటాము. భవిష్యత్
కాలము గురించి ధనము ఎంతో శ్రమటోర్చి కూడబెడతాము. రోగములవలన తినలేకపోవచ్చు, ముసలితనమువలన
ఎంతో విలువయిన ధ్యానముచేయలేకపోవచ్చు, కూడబెట్టిన రంగుకాగితముల నోట్లను చెదలు
తినివేయవచ్చును.
అనసూయ అహల్య అరుంధతి మహా పతివ్రతలని వాళ్ళని పొగడుతూ ఉంటాము. మన కోసరము మన
పిల్లల కోసరము అహర్నిశలు కష్టపడే మన స్త్రీలు వీరికి దేనిలోనూ తీసిపోరు కదా?
వీరిని కొంచెం పొగుడుతే హిమాలయములు ఎక్కినంతగా సంతోషపడతారు.
వశిష్టుడు విశ్వామిత్రుడు వివేకానంద యోగానంద వాళ్ళని పొగడుతూ ఉంటాము. వారంతా
భూతకాలములోని మహాత్ములు. మనము వారిలా ఉండటానికి ప్రయత్నము చేస్తున్నామా? వారి
బోధనలను పాటిస్తున్నామా? కేవలము వారి గురించి చదివి ఉపయోగము ఏమిటి? క్రియాయోగము
చేయండి. ఆనందముగా ఉండండి.
Prem
&OM
K.M.Sastry, Kriya Yoga Dhyanamandir, Ramalayam St, DN76,
Devinagar,RK Puram Gate, Hyderabad
500056, Andhra Pradesh, India.
Comments
Post a Comment