క్రియాయోగాసాధన--లలితాసహస్రనామావళిలో రెండవభాగము

751) ఓంమహాకాళ్యైనమః=మహాశక్తిఅయిన ఆ దివ్యమాతకి నమస్కారము.
752) ఓంమహాగ్రాసాయైనమః=మహాఆహారప్రదాయిని అయిన ఆ దివ్యమాతకి నమస్కారము.
753) ఓంమహాశనాయైనమః=మహాఆహారప్రదాయిని అయిన ఆ దివ్యమాతకి నమస్కారము.
754) ఓంఅపర్ణాయైనమః=నామరహిత అయిన ఆ దివ్యమాతకి నమస్కారము.
 755) ఓంచండికాయైనమః= క్రియాయోగసాధనాపరులయందు ఇష్టము, కానివారి యందు అఇష్టము, యున్న ఆ దివ్యమాతకి నమస్కారము.
756) ఓంచండముండాసురనిషూదిన్యైనమః= క్రియాయోగసాధనాపరులకు అడ్డుపడు నకారత్మకశక్తులను చీల్చిచండాడు ఆ దివ్యమాతకి నమస్కారము.
757) ఓంక్షరాక్షరాత్మికాయైనమః=క్షరులనగా నాశనమయ్యే జీవులు. అక్షరుడు అనగా భ్రూమధ్యములోని కూటస్థుడు. రెండూ ఆమెయే అయిన ఆ దివ్యమాతకి నమస్కారము.
758) ఓంసర్వలోకేశ్యైనమః=సర్వలోకాధిపతి అయిన ఆ దివ్యమాతకి నమస్కారము.
759) ఓంవిశ్వధారిణ్యైనమః=విశ్వధారిణి అయిన ఆ దివ్యమాతకి నమస్కారము.
760) ఓంత్రివర్గదార్త్రైనమః=ధర్మము అర్థము కామము మూడూ తానే అయిన ఆ దివ్యమాతకి నమస్కారము.
761) ఓంసుభగాయైనమః=సుభగా అనగా నిత్యయౌవని. నిత్య భక్తి జ్ఞాన స్వరూపిణి అయిన ఆ దివ్యమాతకి నమస్కారము.
762) ఓంత్ర్యంబకాయైనమః=సృష్టి స్థితి లయ స్వరూపిణి అయిన ఆ దివ్యమాతకి నమస్కారము.
763) ఓంత్రిగుణాత్మికాయైనమః=సత్వ రజో తమో గుణ స్వరూపిణి అయిన ఆ దివ్యమాతకి నమస్కారము.
764) ఓంస్వర్గాపవర్గదాయైనమః=స్వర్గ మోక్షములను ప్రసాదించు ఆ దివ్యమాతకి నమస్కారము.
765) ఓంశుద్ధాయైనమః= క్రియాయోగసాధనాపరులకు శుద్ధజ్ఞానమును ప్రసాదించు ఆ దివ్యమాతకి నమస్కారము.
766) ఓంజపాపుష్పనిభాకృత్యైనమః=క్రియాయోగసాధనాపరులకు జపాపుష్పమువలె ప్రకాశించు ఆ దివ్యమాతకి నమస్కారము.
767) ఓంఓజోవత్యైనమః=ఓజోస్వరూపిణి అయిన ఆ దివ్యమాతకి నమస్కారము.
768) ఓంద్యుతిధరాయైనమః= క్రియాయోగసాధనాపరులకు కాంతిస్వరూపిణిగా కూటస్థములో కనిపించు ఆ దివ్యమాతకి నమస్కారము.
769) ఓంయజ్ఞరూపాయైనమః= క్రియాయోగసాధనయే యజ్ఞము. అట్టి యజ్ఞ స్వరూపిణి అయిన ఆ దివ్యమాతకి నమస్కారము.
770) ఓంప్రియవ్రతాయైనమః=క్రియాయోగసాధనయే లలితకు ప్రియమయిన వ్రతము. అట్టి ప్రియమయిన వ్రతమును ఆచరించు సాధకులను చూచి ఆనందించు ఆ దివ్య మాతకి నమస్కారము.
771) ఓందురారాధ్యాయైనమః=క్రియాయోగసాధనచేయకపోవటము అనేది దురాచారమును. అట్టిదురాచారులచే ఆరాధింపశక్యముగాని ఆ దివ్య మాతకి నమస్కారము.
772) ఓందురాదర్షాయైనమః=క్రియాయోగసాధనచేయకపోవటము అనేది దురాచారమును. అట్టిదురాచారులచే ఆరాధింపశక్యముగాని ఆ దివ్య మాతకి నమస్కారము.

773) ఓంపాటలీకుసుమప్రియాయైనమః=ఎరుపు తెలుపుకలిగిన పాటలీకుసుమము మాదిరి క్రియాయోగసాధకులకు కూటస్థములో కనిపించు ఆ దివ్య మాతకి నమస్కారము.
774) ఓంమహత్యైనమః=మహత్ రూపిణి అయిన ఆ దివ్య మాతకి నమస్కారము.
775) ఓంమేరునిలయాయైనమః=శిరస్సేమేరు పర్వతము. ఆశిరస్సులోని  భ్రూ మధ్యములోని కూటస్థనిలయయైన ఆ దివ్య మాతకి నమస్కారము.
776) ఓంమందారకుసుమప్రియాయైనమః=క్రియాయోగసాధన ద్వారా స్థిరమయిన  మనస్సు అను పుష్పములకు ప్రియయైన ఆ దివ్య మాతకి నమస్కారము.
777) ఓంవీరారాధ్యాయైనమః=క్రియాయోగసాధకులు అనే వీరులచే ఆరాధించబడు  ఆ దివ్య మాతకి నమస్కారము.
778) ఓంవిరాడ్రూపాయైనమః=విరాట్ రూప స్వరూపిణి అయిన ఆ దివ్యమాతకి నమస్కారము.
779) ఓంవిరజాయైనమః=క్రియాయోగసాధకులను పాపరహితులనుజేయు ఆ దివ్య మాతకి నమస్కారము.
780) ఓంవిశ్వతోముఖీయైనమః=విశ్వమంతా తానే అయిన ఆ దివ్యమాతకి నమస్కారము.
781) ఓంప్రత్యగ్రూపాయైనమః=ఆత్మరూప స్వరూపిణి అయిన ఆ దివ్యమాతకి నమస్కారము.
782) ఓంపరాకాశాయైనమః=పరాశక్తి స్వరూపిణి అయిన ఆ దివ్యమాతకి నమస్కారము.
783) ఓంప్రాణదాయైనమః=జీవులకు ప్రాణశక్తి ప్రదాయిని అయిన ఆ దివ్యమాతకి నమస్కారము.
784) ఓంప్రాణరూపిణ్యైనమః=జీవులకు ప్రాణశక్తిరూపిణి అయిన ఆ దివ్యమాతకి నమస్కారము.
785) ఓంమార్తాండభైరవారాధ్యాయైనమః=క్రియాయోగసాధకులచే ఆరాధించబడు ఆ దివ్య మాతకి నమస్కారము.
786) ఓంమంత్రిణీన్యస్తరాజ్యధురేనమః=మంత్రిణీ అనగా రహస్యము. రహితమయిన హాస్యముగాలది. అనగా తీవ్రమయిన క్రియాయోగసాధకులచే ఆరాధించబడు ఆ దివ్య మాతకి నమస్కారము.
787) ఓంత్రిపురేశ్యైనమః=స్థూల సూక్ష్మ మరియు కారణ లోకములకు అధికారిణి అయిన ఆ దివ్య మాతకి నమస్కారము.
788) ఓంజయేత్సానాయైనమః=క్రియాయోగసాధకులకు జయమునొందించు సకారాత్మకసేనతో ఆరాధించబడు ఆ దివ్యమాతకి నమస్కారము.
789) ఓంనిస్త్రైగుణ్యాయైనమః=క్రియాయోగసాధకులను సత్వ రజో తమో గుణరహితులను చేయు ఆ దివ్యమాతకి నమస్కారము.
790) ఓంపరాపరాయైనమః=పరా అపరా శక్తులకు అధికారిణి అయిన ఆ దివ్యమాతకి నమస్కారము.
791) ఓంసత్యజ్ఞానానందరూపాయైనమః=సత్య జ్ఞాన ఆనంద రూపిణియైన ఆ దివ్యమాతకి నమస్కారము.
792) ఓంసామరస్యపరాయణాయైనమః= క్రియాయోగసాధకుల ఎక్కువ తక్కువలు అనే అహంకారమునుండి రహితులను చేయు ఆ దివ్యమాతకి నమస్కారము.
793) ఓంకపర్దిన్యైనమః=జ్ఞానస్వరూపిణి అయిన ఆ దివ్యమాతకి నమస్కారము.  
794) ఓంకళామాలాయైనమః=సర్వ కళాస్వరూపిణి అయిన ఆ దివ్యమాతకి నమస్కారము.
795) ఓంకామధుఘేనమః=కామధేనుస్వరూపిణి అయిన ఆ దివ్యమాతకి నమస్కారము.
796) ఓంకామరూపిన్యైనమః=మాయాస్వరూపిణి అయిన ఆ దివ్యమాతకి నమస్కారము.
797) ఓంకళానిధాయేనమః=సర్వకళానిధిస్వరూపిణి అయిన ఆ దివ్యమాతకి నమస్కారము.
798) ఓంకావ్యకళాయైనమః=కావ్యకళాస్వరూపిణి అయిన ఆ దివ్యమాతకి నమస్కారము.
799) ఓంరసజ్ఞాయైనమః=ప్రేమస్వరూపిణి అయిన ఆ దివ్యమాతకి నమస్కారము.
800) ఓంరససేవధయేనమః=వేదసామ్రాజ్యరసమే ఆత్మగాగల ఆ దివ్యమాతకి నమస్కారము.
801) ఓంపుష్టాయైనమః=క్రియాయోగసాధకులకు పుష్టి కలిగించు ఆ దివ్యమాతకి నమస్కారము.
802) ఓంపురాతనాయైనమః=ఆది అంతములు లేని ఆ దివ్యమాతకి నమస్కారము.
803) ఓంపూజ్యాయైనమః=పరమపూజనీయమయిన ఆ దివ్యమాతకి నమస్కారము.
804) ఓంపుష్కరాయైనమః=పుష్కరము అనగా పద్మము. తను సృష్టించిన సృష్టిలో తగులములేని పరమపూజనీయమయిన ఆ దివ్యమాతకి నమస్కారము.
805) ఓంపుష్కరేక్షణాయైనమః=పుష్కరము అనగా పద్మము. తను సృష్టించిన సృష్టిలో తగులములేని పద్మమువంటి ఈక్షణములతో పరమపూజనీయమయిన ఆ దివ్యమాతకి నమస్కారము.
806) ఓంపరంజ్యోతిషేనమః=పరాశక్తి స్వరూపిణి అయిన ఆ దివ్యమాతకి నమస్కారము.
807) ఓంపరంధామ్నేనమః=క్రియాయోగసాధకుల పరమలక్ష్యమయిన ఆ దివ్యమాతకి నమస్కారము.
 808) ఓంపరమాణవేనమః=అణువులలోఅణువు పరమాణువు స్వరూపిణి అయిన ఆ దివ్యమాతకి నమస్కారము.
809) ఓంపరాత్పరాయైనమః=పరాశక్తి స్వరూపిణి అయిన ఆ దివ్యమాతకి నమస్కారము.
810) ఓంపాశహస్తాయైనమః=క్రియాయోగసాధకుల నకారాత్మకశక్తులను తన హస్త పాశముతో నాశనముచేసి రక్షించు ఆ దివ్యమాతకి నమస్కారము.
811) ఓంపాశహంత్ర్యైనమః=క్రియాయోగసాధకుల నకారాత్మకశక్తులను భవబంధములను తన హస్తపాశముతో నాశనముచేసి రక్షించు ఆ దివ్యమాతకి నమస్కారము.
812) ఓంపరమంత్రవిభేదిన్యైనమః=క్రియాయోగసాధకుల పరమంత్రమయిన ఓంకార ఉచ్ఛారణతో విభేదములేక ఆనందించు ఆ దివ్యమాతకి నమస్కారము.
813) ఓంమూర్తాయైనమః=క్రియాయోగసాధకులకు కూటస్థములో అంగుష్ఠ మాత్రముగా సగుణరూపముగాకనబడు ఆ దివ్యమాతకి నమస్కారము.
814) ఓంఅమూర్తాయైనమః=క్రియాయోగసాధకులకు నిర్గుణముగా నిర్వికల్ప సమాధినొసగి ఆనందింపజేయు ఆ దివ్యమాతకి నమస్కారము.
815) ఓంనిత్యతృప్తాయైనమః=క్రియాయోగసాధకులకు నిత్యతృప్తినొసగి ఆనందింపజేయు ఆ దివ్యమాతకి నమస్కారము.
816) ఓంమునిమానసహంసికాయైనమః=క్రియాయోగసాధకుల సాధనలోని మౌనమును స్థిరమనస్సును చూసి ఆనందించు ఆ దివ్యమాతకి నమస్కారము.
817) ఓంసత్యవ్రతాయైనమః=క్రియాయోగసాధకుల సత్యవ్రత సాధనకు  ఆనందించు ఆ దివ్యమాతకి నమస్కారము.
818) ఓంసత్యరూపాయైనమః=క్రియాయోగసాధకుల తీవ్రమయిన సత్యవ్రత సాధనా రూపమునకు  ఆనందించు ఆ దివ్యమాతకి నమస్కారము.
819) ఓంసర్వాంతర్యామిన్యైనమః=సర్వము తానే వ్యాపించియున్న ఆ దివ్యమాతకి నమస్కారము.
820) ఓంసత్యైనమః=సత్యరూపిణియిన ఆ దివ్యమాతకి నమస్కారము.
821) ఓంబ్రహ్మాణ్యైనమః=పరబ్రహ్మస్వరూపిణియిన ఆ దివ్యమాతకి నమస్కారము.
822) ఓంబ్రహ్మణేనమః=పరబ్రహ్మస్వరూపిణియిన ఆ దివ్యమాతకి నమస్కారము.
823) ఓంజనన్యై నమః=జగత్తుకు తల్లిఅయిన ఆ దివ్యమాతకి నమస్కారము.
824) ఓంబహురూపాయైనమః=సమస్తరూపములుతానే అయిన ఆ దివ్యమాతకి నమస్కారము.
825) ఓంబుధార్చితాయైనమః=బుధులు లేక జ్ఞానులయిన క్రియాయోగసాధకులచే ఆరాధించబడు ఆ దివ్యమాతకి నమస్కారము.
826) ఓంప్రసవిత్రేనమః=క్రియాయోగసాధకులకు తమ సాధనలో ప్రకాశవంతమయిన మూడవనేత్రముగా కనబడి ఆనందింపజేయు ఆ దివ్యమాతకి నమస్కారము.
827) ఓంప్రచండాయైనమః=క్రియాయోగసాధకులకు తమ సాధనలోవచ్చు నకారాత్మకశక్తులపై క్రోధించి నాశనముజేయుఆ దివ్యమాతకి నమస్కారము.
828) ఓంఆజ్ఞాయైనమః=ఆజ్ఞాచక్రస్థిత అయిన ఆ దివ్యమాతకి నమస్కారము.
829) ఓంప్రతిష్ఠాయైనమః=క్రియాయోగసాధకులకు తమ సాధనవలన ప్రతిష్ఠ కలగజేయుఆ దివ్యమాతకి నమస్కారము.
830) ఓంప్రకటాకృత్యైనమః=క్రియాయోగసాధకులకు కూటస్థములో మూడవ నేత్రము ఆకృతిగా ప్రకటితముజేయుఆ దివ్యమాతకి నమస్కారము.
831) ఓంప్రాణేశ్వర్యైనమః=జీవులకు ఈశ్వరి అయిన ఆ దివ్యమాతకి నమస్కారము.
832) ఓంప్రాణదాత్ర్యైనమః=జీవులకుప్రాణదాతఅయిన ఆ దివ్యమాతకి నమస్కారము.
833) ఓంపంచాశత్పీఠరూపిణ్యైనమః=మూలాధారములోని నాలుగు అక్షరములు, స్వాధిష్ఠానములోని ఆరు అక్షరములు, మణిపురలోని పది అక్షరములు, అనాహతలోని పన్నెండు అక్షరములు, విశుద్ధలోని పదహారు అక్షరములు, ఆజ్ఞాలోని రెండు అక్షరములు, మొత్తము యాబదిఅక్షరములకు పీఠరూపిణిగా విలసిల్లు ఆ దివ్యమాతకి నమస్కారము.
834) ఓంవిశృంఖలాయైనమః=క్రియాయోగసాధకుల సంసార శృంఖలములు అనగా సంకెళ్ళు త్రెంపి మోక్షము కలగజేయుఆ దివ్యమాతకి నమస్కారము.
835) ఓంవివిక్తస్థాయైనమః=వివిక్తస్థాయి అనగా ఏకాంతములో క్రియాయోగసాధన చేయు వారలను చూసి ఆనందించు ఆ దివ్యమాతకి నమస్కారము.
836) ఓంవీరమాతాయైనమః=వీరులయిన క్రియాయోగసాధకులకు తల్లి అయిన ఆ దివ్యమాతకి నమస్కారము.
837) ఓంవియత్ప్రసవేనమః=వియత్ అనగా ఆకాశము, వాయువు, అగ్ని, జలము, మరియు పృథ్వీ అను పంచామహాభూతములకు తల్లి అయిన ఆ దివ్యమాతకి నమస్కారము.
838) ఓంముకుందాయైనమః=క్రియాయోగసాధకులకు ముక్తి ప్రదాయిని అయిన ఆ దివ్యమాతకి నమస్కారము.
839) ఓంముక్తినిలయాయైనమః=క్రియాయోగసాధకులకు ముక్తిస్థానమయిన ఆ దివ్యమాతకి నమస్కారము.  
840) ఓంమూలవిగ్రహరూపిణ్యైనమః=క్రియాయోగసాధకులకు మూలవిగ్రహ రూపిణిఅయిన ఆ దివ్యమాతకి నమస్కారము. 
841) ఓంభావజ్ఞాయైనమః=క్రియాయోగసాధకుల భావముల జ్ఞాత అయిన ఆ దివ్యమాతకి నమస్కారము.
842) ఓంభవరోగఘ్న్యైనమః=క్రియాయోగసాధకుల భవరోగముల వినాశిని అయిన ఆ దివ్యమాతకి నమస్కారము.
843)ఓంభవచక్రప్రవర్తిన్యైనమః=సంసారచక్ర సృష్టికర్త అయిన ఆ దివ్యమాతకి నమస్కారము.
844) ఓంఛందస్సారాయైనమః=వేదాంత సారమయిన ఆ దివ్యమాతకి నమస్కారము.
845) ఓంశాస్త్రసారాయైనమః=శ్వాసను అస్త్రముగా ఉపయోగించటమే శ్వాస్త్రము. అది వాడుకలో శాస్త్రము అయినది. అట్టి శాస్త్రసారమయిన ఆ దివ్యమాతకి నమస్కారము.
846) ఓంమంత్రసారాయైనమః=ఓంకారమంత్రసారమయిన ఆ దివ్యమాతకి నమస్కారము.
847) ఓంతలోదర్యైనమః=సూక్ష్మరూపి అయిన ఆ దివ్యమాతకి నమస్కారము.
848) ఓంఉదారకీర్త్యైనమః=క్రియాయోగసాధకులయందు ఔదార్యము చూపించి కీర్తిని బడయచేయు ఆ దివ్యమాతకి నమస్కారము.
849) ఓంఉద్దామవైభవాయైనమః=పరిమితిరహితమయిన ఆ దివ్యమాతకి నమస్కారము.
850) ఓంవర్ణరూపిణ్యైనమః=సర్వవర్ణరూపిణిఅయిన ఆ దివ్యమాతకి నమస్కారము.
851) ఓంజన్మమృత్యుజరాతప్తజనవిశ్రాంతిదాయిన్యైనమః=జననమరణ ముసలి తనములనే వ్యథలనుండి క్రియాయోగసాధకులను తప్పించి విశ్రాంతి కలగజేయు ఆ దివ్యమాతకి నమస్కారము.
852) ఓంసర్వోపనిషదుద్ఘుష్ఠాయైనమః=వేదాంతసారమయిన సర్వ ఉపనిషత్తులచే తెలియదగినది అయిన ఆ దివ్యమాతకి నమస్కారము.
853) ఓంశాంత్యాతీతకళాత్మికాయైనమః=క్రియాయోగసాధకులకు అతీతశాంతి కలగజేయు కళాత్మికాయైన ఆ దివ్యమాతకి నమస్కారము.
854) ఓంగంభీరాయైనమః=గంభీర అనగా లోతయిన ఆ దివ్యమాతకి నమస్కారము.
855) ఓంగగనాంతస్థాయైనమః=ఆకాశస్థిత అయిన ఆ దివ్యమాతకి నమస్కారము.
856) ఓంగర్వితాయైనమః=పరాశాక్తిస్వరూపిణి అయిన ఆ దివ్యమాతకి నమస్కారము.
857) ఓంగానలోలుపాయైనమః=ఓంకార గానమునందు ఇష్టురాలు  అయిన ఆ దివ్యమాతకి నమస్కారము.
858) ఓంకల్పనారహితాయైనమః=కల్పనారహితయైన ఆ దివ్యమాతకి నమస్కారము.
859) ఓంకాష్ఠాయైనమః=కాష్ఠము అనగా 18 రెప్పపాటులకాలము. కాలమునకు
అతీతయైన ఆ దివ్యమాతకి నమస్కారము.
860) ఓంఅకాంతాయైనమః=క్రియాయోగసాధకులను పాపరహితులనుజేసి ముక్తినిచ్చు ఆ దివ్యమాతకి నమస్కారము.
861) ఓంకాంతార్ధవిగ్రహాయైనమః=అర్థనారీశ్వరమూర్తి అయిన ఆ దివ్యమాతకి నమస్కారము.
862) ఓంకార్యకారణవినిర్ముక్తాయైనమః=కార్యకారణరహిత అయిన ఆ దివ్యమాతకి నమస్కారము.
863) ఓంకామకేళీతరంగితాయైనమః=సృష్టి అనేది ఆ తల్లికి ఒక ఆటవంటిది. అట్టి ఆ దివ్యమాతకి నమస్కారము.
864) ఓంకనత్కనకతాటంకాయైనమః=క్రియాయోగసాధకులకు కూటస్థములోని మూడవ నేత్రములో సువర్ణ రంగులో కనబడు ఆ దివ్యమాతకి నమస్కారము.
865) ఓంలీలావిగ్రహధారిణ్యైనమః=సృష్టి అనేది ఆతల్లికి ఒక లీల. అట్టి విశిష్ట గ్రహధారణగల ఆ దివ్యమాతకి నమస్కారము.
866) ఓంఅజాయైనమః=జన్మరహితమయిన ఆ దివ్యమాతకి నమస్కారము.
867) ఓంక్షయవినిర్ముక్తాయైనమః=క్రియాయోగసాధకులకు తమ సాధన లోని క్షయము అనగా తిరోగమనమును అరికట్టి రక్షించు ఆ దివ్యమాతకి నమస్కారము.
868) ఓంముగ్ధాయైనమః=క్రియాయోగుల సాధనకులకు ముగ్ధురాలగు ఆ దివ్యమాతకి నమస్కారము.
869) ఓంక్షిప్రప్రసాదిన్యైనమః=క్రియాయోగుల సాధనకులకు అతిశీఘ్రముగా ప్రసన్నురాలగు ఆ దివ్యమాతకి నమస్కారము.
870) ఓంఅంతర్ముఖసమారాధ్యాయైనమః=క్రియాయోగులు అంతర్ముఖమయ్యి   తమ తమ సాధనలో ఆరాధించబడు ఆ దివ్యమాతకి నమస్కారము.
871) ఓంబహిర్ముఖసుదుర్లభాయైనమః=బహిర్ముఖులయిన సాధకులకు దుర్లభమైన  
ఆ దివ్యమాతకి నమస్కారము.
872) ఓంత్రయ్యైనమః=ఋగ్వేదము, యజుర్వేదము మరియు సామవేదము అని వేదములు మూడు. ఈ మూడింటినుండి తీయబడినది అథర్వణవేదము. మూడు వేదముల స్వరూపిణి అయిన ఆ దివ్యమాతకి నమస్కారము.
873) ఓంత్రివర్గనిలయాయైనమః=సృష్టిలోని ధర్మ అర్థ కామములకునిలయము అయినఆ దివ్యమాతకి నమస్కారము.
874) ఓంత్రిస్థాయైనమః=సత్వ రజో తమో గుణములు మూడు. వేదములు మూడు. ధర్మ అర్థ కామములు మూడు. సృష్టి స్థితి లయములు మూడు. ఇట్లా అన్ని మూడులకు నిలయము అయినఆ దివ్యమాతకి నమస్కారము.
875) ఓంత్రిపురమాలిన్యైనమః=స్థూల సూక్ష్మ మరియు కారణ పురములకు నిలయము అయినఆ దివ్యమాతకి నమస్కారము.
876) ఓంనిరామయాయైనమః=క్రియాయోగాసాధకునకు తన సాధనకు అడ్డువచ్చు రోగములను నివారించు అయినఆ దివ్యమాతకి నమస్కారము.
877) ఓంనిరాలంబాయైనమః= సృష్టికి ఆధారమయిన ఆ దివ్యమాతకి నమస్కారము.
878) ఓంస్వాత్మారామాయైనమః= క్రియాయోగాసాధకునకు తనలోతను ఆనందము అనుభవించుటకు చేయూతనిచ్చునది అయిన ఆ దివ్యమాతకి నమస్కారము.
879) ఓంసుధాసృత్యైనమః=క్రియాయోగాసాధకునకు తన సాధనలో సహస్రార చక్రమునుండి తియ్యని అమృతమును వర్షింపజేయు ఆ దివ్యమాతకి నమస్కారము.
880) ఓంసంసారపంకనిర్మగ్నసముద్ధరపండితాయైనమః=క్రియాయోగాసాధకుని సంసారమనే బురదనుండిరక్షించు ఆ దివ్యమాతకి నమస్కారము.
881) ఓంయజ్ఞప్రియాయైనమః=క్రియాయోగాసాధన అనే యజ్ఞప్రియయైన ఆ దివ్యమాతకి నమస్కారము.
882) ఓంయజ్ఞకర్త్రైనమః=క్రియాయోగాసాధన అనే యజ్ఞప్రియయైన ఆ దివ్యమాతకి నమస్కారము.

883) ఓంయజమానస్వరూపిణ్యైనమః=క్రియాయోగాసాధన అనే యజ్ఞమునకు అధికారిణి అయిన ఆ దివ్యమాతకి నమస్కారము.
884) ఓంధర్మాధారాయైనమః=ధర్మమునకు ఆధారమైన ఆ దివ్యమాతకి నమస్కారము.
885) ఓంధనాధ్యక్షాయైనమః=శక్తికి ఆధారమైన ఆ దివ్యమాతకి నమస్కారము.
886) ఓంధనదాన్యవివర్ధిన్యైనమః=శక్తికి ఆహారమునకు ఆధారమైన ఆ దివ్యమాతకి నమస్కారము.
887) ఓంవిప్రప్రియాయైనమః=క్రియాయోగాసాధనజేయు సాధకుని జాగృతిజెందిన కుండలిని మణిపురచక్రమును తాకినయడల విప్రుడగును.అట్టి సాధకునియడల ప్రియమొనరించు ఆ దివ్యమాతకి నమస్కారము.
888) ఓంవిప్రరూపాయైనమః=క్రియాయోగసాధనజేయు సాధకుని జాగృతిజెందిన కుండలిని మణిపురచక్రమును తాకినయడల విప్రుడగును.అట్టి సాధకునియడల ప్రియమొనరించు ఆ దివ్యమాతకి నమస్కారము.
889) ఓంవిశ్వభ్రమణకారిణ్యైనమః=విశ్వభ్రమణకారిణి అయిన ఆ దివ్యమాతకి నమస్కారము.
890) ఓంవిశ్వగ్రాసాయైనమః=విశ్వమునకు ఆహారమునిచ్చు ఆ దివ్యమాతకి నమస్కారము.
891) ఓంవిద్రుమాభాయైనమః=క్రియాయోగసాధకునికి కూటస్థములో ఎర్రని రంగులో కనబడు ఆ దివ్యమాతకి నమస్కారము.
892) ఓంవైష్ణవ్యైనమః=స్థితికారిణి అయిన ఆ దివ్యమాతకి నమస్కారము.  
893) ఓంవిష్ణురూపిణ్యైనమః=స్థితికారకరూపిణి అయిన ఆ దివ్యమాతకి నమస్కారము.
894) ఓంఅయోన్యైనమః=యోనిరహిత అయిన ఆ దివ్యమాతకి నమస్కారము.
895) ఓంయోనినిలయాయైనమః=జగత్కారణమయిన ఆ దివ్యమాతకి నమస్కారము.
896) ఓంకూటస్థాయైనమః=కూటస్థురాలయినయిన ఆ దివ్యమాతకి నమస్కారము.
897) ఓంకులరూపిణ్యైనమః=షట్ చక్రములను కులము అందురు. అది తానే అయిన  ఆ దివ్యమాతకి నమస్కారము.
898) ఓంవీరగోష్ఠిప్రియాయైనమః=క్రియాయోగసాధనజేయువారే వీరులు. అట్టి వీరుల గోష్ఠి అనగా సభయందు ప్రియఅయిన ఆ దివ్యమాతకి నమస్కారము.
899) ఓంవీరాయైనమః=అనంతశక్తిమంతురాలయిన  ఆ దివ్యమాతకి నమస్కారము.
900) ఓంనైష్కర్మ్యాయైనమః=క్రియాయోగసాధనజేయువారలను కర్మరహితులనుజేసి ముక్తి ప్రసాదించు ఆ దివ్యమాతకి నమస్కారము.
901)ఓంనాదరూపిణ్యైనమః=ఓంకార నాదస్వరూపిణిఅయిన ఆ దివ్యమాతకి నమస్కారము.
902) ఓంవిజ్ఞానకలనాయైనమః=క్రియాయోగసాధనజేయువారలకు బ్రహ్మ సాక్షాత్కారమునిప్పించు ఆ దివ్యమాతకి నమస్కారము.
903) ఓంకల్యాయైనమః=సృష్టికర్త అయిన ఆ దివ్యమాతకి నమస్కారము.
904) ఓంవిదగ్ధాయైనమః=క్రియాయోగసాధనజేయువారలకునేర్పు చేకూర్చు ఆ దివ్యమాతకి నమస్కారము.
905) ఓంబైందవాసనాయైనమః=కూటస్థమే తన ఆసనముగాగల ఆ దివ్యమాతకి నమస్కారము.
906) ఓంతత్వాధికాయైనమః=సర్వతత్వములకు అతీతురాలయిన  ఆ దివ్యమాతకి నమస్కారము.
907) ఓంతత్వమయ్యైనమః=తత్ అనగాసృష్టిలోని పరమాత్మ తానె అయిన ఆ దివ్యమాతకి నమస్కారము.
908) ఓంతత్వమర్థస్వరూపిణ్యైనమః=తత్ అనగాసృష్టిలోని పరమాత్మస్వరూపిణి అయిన ఆ దివ్యమాతకి నమస్కారము.
909) ఓంసామగానప్రియాయైనమః=సామవేదగానప్రియఅయినఆ దివ్యమాతకి నమస్కారము.
910) ఓంసౌమ్యాయైనమః=క్రియాయోగసాధనజేయువారలకు శాంతము కలగజేయు  ఆ దివ్యమాతకి నమస్కారము.
911) ఓంసదాశివకుటుంబిన్యైనమః=తత్ అనగాసృష్టిలోని పరమాత్మస్వరూపిణి అయిన ఆ దివ్యమాతకి నమస్కారము.
912) ఓంసవ్యాపసవ్యమార్గస్థాయైనమః=సవ్యము అనగా కుండలినీశక్తి మూలాధార స్వాధిష్ఠాన మణిపుర అనాహత విశుద్ధ ఆజ్ఞానెగటివ్  ఆజ్ఞాపాజిటివ్ సహస్రార చక్ర మార్గములగుండా ప్రయాణకాలములో వెడలుట.దీనినే ఆరోహణాక్రమము లేదా   ఉత్తరాయణము అంటారు.  అపసవ్యము అనగా సహస్రార ఆజ్ఞాపాజిటివ్ ఆజ్ఞానెగటివ్ విశుద్ధ అనాహత మణిపుర స్వాధిష్ఠాన మరియు మూలాధార చక్ర మార్గములగుండా ప్రయాణకాలములో వెడలుట.దీనినే అవరోహణాక్రమము లేదా దక్షిణాయణము అంటారు. రెండు మార్గముల స్వరూపిణి అయిన ఆ దివ్యమాతకి నమస్కారము.
913) ఓంసర్వాపద్వినివారిణ్యైనమః=క్రియాయోగసాధనజేయువారల సర్వ ఆపదల నివారిణి అయిన ఆ దివ్యమాతకి నమస్కారము.
914) ఓంస్వస్థాయైనమః=క్రియాయోగసాధనజేయువారల చంచలత్వమును తొలగించి స్వస్థత చేకూర్చునది అయిన ఆ దివ్యమాతకి నమస్కారము.
915) ఓంస్వభావమధురాయైనమః=క్రియాయోగసాధనజేయువారల చంచల స్వభావమును తొలగించి మధురముగానొనర్చు ఆ దివ్యమాతకి నమస్కారము.
916) ఓంధీరాయైనమః=క్రియాయోగసాధనజేయువారలపిరికి స్వభావమును తొలగించి ధీరత్వమునొనర్చు ఆ దివ్యమాతకి నమస్కారము.
917) ఓంధీరసమర్చితాయైనమః=క్రియాయోగసాధనజేయువారలపిరికి స్వభావమును తొలగించి ధీరత్వమునొనర్చు ఆ దివ్యమాతకి నమస్కారము.
918) ఓంచైతన్యార్ఘ్యసమారాధ్యాయైనమః=క్రియాయోగసాధనజేయువారలు తమ  చైతన్యము అనే అర్ఘ్యమును సమర్పించి ఆరాధిస్తారు ఆ తల్లిని. అట్టిది అయిన ఆ దివ్యమాతకి నమస్కారము.  
919) ఓంచైతన్యకుసుమప్రియాయైనమః=క్రియాయోగసాధనజేయువారల చైతన్య కుసుమములయందు ప్రీతియైన ఆ దివ్యమాతకి నమస్కారము. 
920) ఓంసదోదితాయైనమః=సర్వదా ప్రకాశించు ఆ దివ్యమాతకి నమస్కారము.
921) ఓంసదాతుష్టాయైనమః=క్రియాయోగసాధనజేయువారలయందు సదాతుష్టురాలయిన ఆ దివ్యమాతకి నమస్కారము.
922) ఓంతరుణాదిత్యపాటలాయైనమః=సర్వదా ప్రకాశించు ఆ దివ్యమాతకి నమస్కారము.
923) ఓందక్షిణాదక్షిణారాధ్యాయైనమః=క్రియాయోగసాధనజేయువారలు తమ క్రియలతో దక్షిణ అదక్షిణ రెండు మార్గాములద్వారా ఆరాధిస్తారు. అట్టిదియైన ఆ దివ్యమాతకి నమస్కారము.
924) ఓందరాస్మేరముఖాంబుజాయైనమః=క్రియాయోగసాధనజేయువారలు నిత్యమూ చిరునగవుతో ప్రకాసించుటకు కారణభూతురాలయిన ఆ దివ్యమాతకి నమస్కారము.
925) ఓంకౌళినీకేలనాయైనమః=క్రియాయోగసాధనజేయువారలకు శుద్ధ జ్ఞానమును ప్రసాదించు ఆ దివ్యమాతకి నమస్కారము.
926) ఓంఅనర్ఘకైవల్యపదదాయిన్యైనమః=క్రియాయోగసాధనజేయువారలకు కైవల్యమును ప్రసాదించు ఆ దివ్యమాతకి నమస్కారము.
927) ఓంస్తోత్రప్రియాయైనమః=క్రియాయోగసాధనజేయువారల స్తోత్రములకు ప్రియమునొందు ఆ దివ్యమాతకి నమస్కారము.
928) ఓంస్తుతిమత్యైనమః=క్రియాయోగసాధనజేయువారల స్తోత్రములకు ప్రియమునొందు ఆ దివ్యమాతకి నమస్కారము.
929) ఓంశ్రుతిసంస్తుతవైభవాయైనమః=వేదములచే స్తుతించబడు ఆ దివ్యమాతకి నమస్కారము.
930)ఓంమనస్విన్యైనమః=క్రియాయోగసాధనజేయువారలకు స్థిరమనస్సును ప్రసాదించు ఆ దివ్యమాతకి నమస్కారము.

931) ఓంమానవత్యైనమః=క్రియాయోగసాధనజేయువారలకుఆత్మయందు అభిమానము ప్రసాదించు ఆ దివ్యమాతకి నమస్కారము.
932) ఓంమహేశ్యైనమః=మహాశక్తిమతి అయిన ఆ దివ్యమాతకి నమస్కారము.
933) ఓంమంగళాకృత్యైనమః=క్రియాయోగసాధనజేయువారలకు కూటస్థములో మంగళమయిన ఆకృతి అనగా మూడవ నేత్రముగా కనబడు ఆ దివ్యమాతకి నమస్కారము.
934) ఓంవిశ్వమాత్రేనమః=విశ్వమునకు మాత్రుదేవత అయిన ఆ దివ్యమాతకి నమస్కారము.
935) ఓంజగద్ధాత్ర్యైనమః=జగత్తును ధరించిన ఆ దివ్యమాతకి నమస్కారము.
936) ఓంవిశాలాక్ష్యైనమః=క్రియాయోగసాధనజేయువారలకు కూటస్థములో విశాలమయిన అక్షి అనగా మూడవ నేత్రముగా కనబడు ఆ దివ్యమాతకి నమస్కారము.
937) ఓంవిరాగిణ్యైనమః=క్రియాయోగసాధనజేయువారలయందు విరాగిణి అనగా విశిష్టమయిన రాగము(మోహము)గల ఆ దివ్యమాతకి నమస్కారము.
938) ఓంప్రగల్భాయైనమః=క్రియాయోగసాధనజేయువారలను నేర్పరులనుచేయు ఆ దివ్యమాతకి నమస్కారము.  
939) ఓంపరమోదారాయైనమః=క్రియాయోగసాధనజేయువారలయందు  పరమ ఉదారమూర్తియైన ఆ దివ్యమాతకి నమస్కారము.
940) ఓంపరామోదాయైనమః=క్రియాయోగసాధనజేయువారలయందు  పరమ మోదముకలిగించు ఆ దివ్యమాతకి నమస్కారము.
941) ఓంమనోమయ్యైనమః=పంచకోశములలో మనోమయకోశములోనుండు ఆ దివ్యమాతకి నమస్కారము.
942) ఓంవ్యోమకేశ్యైనమః=విరాట్ రూపిణి అయిన ఆ దివ్యమాతకి నమస్కారము.
943) ఓంవిమానస్థాయైనమః=విమాన అనగా విశిష్టమయిన మానము అనగా కొలత గలది అనగా అనంతమయినస్థాయిగల ఆ దివ్యమాతకి నమస్కారము.
944) ఓంవజ్రిణ్యైనమః=క్రియాయోగసాధనజేయువారలకు వజ్రములాంటి మేరుదండమును ప్రసాదించు ఆ దివ్యమాతకి నమస్కారము.
945) ఓంవామకేశ్వర్యైనమః=క్రియాయోగసాధనజేయువారలకు వామభాగములోని   హృదయమునందుండు ఆ దివ్యమాతకి నమస్కారము.
946) ఓంపంచయజ్ఞప్రియాయైనమః=దేవయజ్ఞ పితృయజ్ఞ బ్రహ్మయజ్ఞ మనుష్యయజ్ఞ భూతయజ్ఞ ప్రియయైన ఆ దివ్యమాతకి నమస్కారము.
947) ఓంపంచప్రేతమంచాధిశాయిన్యైనమః=పంచమహాభూతములే తను శయనించు  మంచముగా గల ఆ దివ్యమాతకి నమస్కారము.
948) ఓంపంచమ్యైనమః=పంచమహాభూతములే తను అయిన ఆ దివ్యమాతకి నమస్కారము.
949) ఓంపంచభూతేశ్యైనమః=పంచమహాభూతములకు అధికారిణి అయిన ఆ దివ్యమాతకి నమస్కారము.
950) ఓంపంచసంఖ్యోపచారిణ్యైనమః=పంచమహాభూతములే తన సేవకులయిన ఆ దివ్యమాతకి నమస్కారము.
951) ఓంశాశ్వత్యైనమః=శాశ్వతమయిన ఆ దివ్యమాతకి నమస్కారము.
952) ఓంశాశ్వత్యైశ్వర్యాయైనమః=శాశ్వతశక్తి స్వరూపిణి అయిన ఆ దివ్యమాతకి నమస్కారము.
953) ఓంశర్మదాయైనమః=క్రియాయోగసాధనజేయువారలకు సుఖసంతోషములను ప్రసాదించు  ఆ దివ్యమాతకి నమస్కారము.
954) ఓంశంభుమోహిన్యైనమః=క్రియాయోగసాధనజేయువారలకు పరమాత్మయందు మోహము కలగజేయు ఆ దివ్యమాతకి నమస్కారము.

955) ఓంధరాయైనమః=భూమిని ధరించు ఆ దివ్యమాతకి నమస్కారము.
956) ఓంధరాసుతాయైనమః=భూమిని ధరించు ఆ దివ్యమాతకి నమస్కారము.
957) ఓంధన్యాయైనమః=క్రియాయోగసాధనజేయువారలకు ముక్తినిచ్చి ధన్యులను జేయు ఆ దివ్యమాతకి నమస్కారము.
958) ఓంధర్మిణ్యైనమః=క్రియాయోగసాధనజేయువారలకు ముక్తినిచ్చి ధర్మస్వరూపు లను జేయు ఆ దివ్యమాతకి నమస్కారము.
959) ఓంధర్మవర్ధిన్యైనమః=క్రియాయోగసాధనజేయువారలకు ముక్తినిచ్చి వారిలో  ధర్మము వర్ధిల్లునట్లుజేయు ఆ దివ్యమాతకి నమస్కారము.
960) ఓంలోకాతీతాయైనమః=సర్వలోకాతీతాయైన ఆ దివ్యమాతకి నమస్కారము.
961) ఓంగుణాతీతాయైనమః=సర్వగుణాతీతాయైన ఆ దివ్యమాతకి నమస్కారము.
962) ఓంసర్వాతీతాయైనమః=సర్వమునకు అతీతయైన ఆ దివ్యమాతకి నమస్కారము.
963) ఓంశమాత్మికాయైనమః=క్రియాయోగసాధనజేయువారలకు శాంతిని కలగజేయు ఆ దివ్యమాతకి నమస్కారము.
964) ఓంబంధూకకుసుమప్రఖ్యాయైనమః=క్రియాయోగసాధనజేయువారలకు బంధూక కుసుమ ప్రఖ్యా అనగా ఎర్రని కాంతితో కూటస్థములో కనిపించు ఆ దివ్యమాతకి నమస్కారము.
965) ఓంబాలాయైనమః=శక్తికి ముసలితనము ఉండదు. నిత్య యౌవని ఆ దివ్యమాతకి నమస్కారము.
966) ఓంలీలావినోదిన్యైనమః=సృష్టి అనేది ఆమెకు లీలావినోదము. అట్టి ఆ దివ్యమాతకి నమస్కారము. 
967) ఓంసుమంగళ్యైనమః=క్రియాయోగసాధనజేయువారలకు శుభకరము మంగళప్రదము అయిన రూపముతో కూటస్థములో కనిపించు ఆ దివ్యమాతకి నమస్కారము.

968) ఓంసుఖకర్యైనమః=క్రియాయోగసాధనజేయువారలకు సుఖములు కలగజేయు  ఆ దివ్యమాతకి నమస్కారము.
969) ఓంసువేషాఢ్యైనమః=క్రియాయోగసాధనజేయువారలకు సుందరమయిన వేసముతో రూపముతో కూటస్థములో కనిపించు ఆ దివ్యమాతకి నమస్కారము.
970) ఓంసువాసిన్యైనమః=క్రియాయోగసాధనజేయువారలకు వాసనారహితుడ్నిచేసి పరమాత్మలో మమైకము అగుట అనే సువాసన కలగజేయు ఆ దివ్యమాతకి నమస్కారము.
971) ఓంసువాసిన్యర్చనప్రీతాయైనమః=క్రియాయోగసాధనజేయువారల పరమాత్మలో మమైకము అగుట అనే సువాసనలతో అర్చనలిందు ప్రీతియైన ఆ దివ్యమాతకి నమస్కారము.
972) ఓంశోభనాయైనమః=క్రియాయోగసాధనజేయువారలకు శుభకరము శోభనప్రదము అయిన రూపముతో కూటస్థములో కనిపించు ఆ దివ్యమాతకి నమస్కారము.
973) ఓంశుద్ధమానసాయైనమః=క్రియాయోగసాధనజేయువారలకు శుద్ధమానసును ప్రసాదించు ఆ దివ్యమాతకి నమస్కారము.
974) ఓంబిందుతర్పణసంతుష్ఠాయైనమః=క్రియాయోగసాధనజేయువారల జ్ఞానము
అను తర్పణములచే సంతుష్ఠముజెందు  ఆ దివ్యమాతకి నమస్కారము.
975) ఓంపూర్వజాయైనమః=తత్ అనగా సృష్టిలోని పరమాత్మ స్వరూపిణి అయిన    ఆ దివ్యమాతకి నమస్కారము.
976) ఓంత్రిపురాంబికాయైనమః=స్థూల సూక్ష్మ మరియు కారణ అనే మూడు పురములకు అమ్మ అయిన ఆ దివ్యమాతకి నమస్కారము.
977) ఓందశముద్రాసమారాధ్యాయైనమః=పృథ్వీ వరుణ అగ్ని వాయు శూన్య జ్ఞాన లింగ ఖేచరీ ఇత్యాది దశముద్రలతో క్రియాయోగసాధకులచే ఆరాధించబడు    అయిన ఆ దివ్యమాతకి నమస్కారము.
978) ఓంత్రిపురాశ్రీవశంకర్యైనమః=క్రియాయోగసాధనజేయువారలకు స్థూల సూక్ష్మ మరియు కారణ అనే పవిత్రమయిన మూడుపురములను వశముజేయు   ఆ దివ్యమాతకి నమస్కారము.
979) ఓంజ్ఞానముద్రాయైనమః=క్రియాయోగసాధనజేయువారలకు జ్ఞానముద్ర ప్రసాదిని అయిన ఆ దివ్యమాతకి నమస్కారము.
980) ఓంజ్ఞానగమ్యాయైనమః=క్రియాయోగసాధనజేయువారల జ్ఞానగమ్య అయిన ఆ దివ్యమాతకి నమస్కారము.
981) ఓంజ్ఞానజ్ఞేయస్వరూపిణ్యైనమః=క్రియాయోగసాధనజేయువారల జ్ఞానము (తెలిసుకోవలసినది)జ్ఞేయము(చేరవలసినది) స్వరూపిణి అయిన ఆ దివ్యమాతకి నమస్కారము.
982) ఓంయోనిముద్రాయైనమః=క్రియాయోగసాధనజేయువారల యోనిముద్రలో భాసిల్లునది అయిన ఆ దివ్యమాతకి నమస్కారము.
983) ఓంత్రిఖండేశ్యైనమః=స్థూల సూక్ష్మ మరియు కారణ అనే మూడు పురములు త్రిఖండములు. వాటికి అధిపతి అమ్మ. అట్టి ఆ దివ్యమాతకి నమస్కారము.
984) ఓంత్రిగుణాయైనమః=సృష్టిలోని సత్వ రజో తమో అనే త్రిగుణములకు అధిపతి తానేయైన ఆ దివ్యమాతకి నమస్కారము.
985) ఓంఅంబాయైనమః=సర్వజీవులకు అమ్మయైన ఆ దివ్యమాతకి నమస్కారము.
986) ఓంత్రికోణగాయైనమః=మూలప్రకృతి అనే సత్వ రజో తమో అనే త్రిగుణములనే త్రికోణము అందురు. మూలప్రకృతి స్వరూపిణి అయిన ఆ దివ్యమాతకి నమస్కారము.
987) ఓంఅనఘాయైనమః=క్రియాయోగసాధనజేయువారలను పాపరహితులను చేయునది అయిన ఆ దివ్యమాతకి నమస్కారము.
988) ఓంఅద్భుతచారిత్రాయైనమః=క్రియాయోగసాధనజేయువారలను అద్భుత చారిత్రులను చేయునది అయిన ఆ దివ్యమాతకి నమస్కారము.  
989) ఓంవాంఛితార్ధప్రదాయిన్యైనమః=క్రియాయోగసాధనజేయువారల ధర్మబద్ధ మయిన వాంఛితములను ప్రసాదించునది అయిన ఆ దివ్యమాతకి నమస్కారము.
990) ఓంఅభ్యాసాతిశయజ్ఞాతాయైనమః=క్రియాయోగసాధకుల అద్భుతసాధనా యజ్ఞము ద్వారా తెలియబడునది అయిన ఆ దివ్యమాతకి నమస్కారము.
991) ఓంషఢధ్వాతీతరూపిణ్యైనమః=వివిధ ఉపాసనామార్గములకు అతీతము ఆ తల్లి. కేవలము క్రియాయోగసాధకుల అద్భుతసాధనా యజ్ఞము ద్వారా తెలియబడునది అయిన ఆ దివ్యమాతకి నమస్కారము.
992) ఓంఅవ్యాజకరుణామూర్త్యైనమః=క్రియాయోగసాధనజేయువారలమీద అవ్యాజ మయిన కరుణ చూపించు ఆ దివ్యమాతకి నమస్కారము.
993) ఓంఅజ్ఞానధ్వాంతదీపికాయైనమః=క్రియాయోగసాధనజేయువారల అజ్ఞానమును ధ్వంసముజేయు దీపికయైనఆ దివ్యమాతకి నమస్కారము.
994) ఓంఆబాలగోపవిదితాయైనమః=క్రియాయోగసాధనద్వారా సర్వులు తెలియదగిన ఆ దివ్యమాతకి నమస్కారము.
995) ఓంసర్వానుల్లంఘ్యశాసనాయైనమః=సర్వశాసనములు అనగా సృష్టి స్థితి లయ ధర్మములకు అతీతమయిన ఆ దివ్యమాతకి నమస్కారము.
996) ఓంశ్రీచక్రరాజనిలయాయైనమః=మూలాధార స్వాధిష్ఠాన మణిపుర అనాహత విశుద్ధ ఆజ్ఞా మరియు సహస్రార చక్రముల నిలయయైన ఆ దివ్యమాతకి నమస్కారము.
997) ఓంశ్రీమత్రిపురసుందర్యైనమః=స్థూల సూక్ష్మ కారణములనే త్రిపురములలో సుందరముగా విలసిల్లు ఆ దివ్యమాతకి నమస్కారము.
998) ఓంశ్రీశివాయైనమః=మంగళస్వరూపిణి అయిన ఆ దివ్యమాతకి నమస్కారము.
999) ఓంశ్రీశివశక్తైక్యరూపిణ్యైయైనమః=మంగళశక్తిస్వరూపిణి అయిన ఆ దివ్యమాతకి నమస్కారము.
1000) ఓంలలితాంబికాయైనమః=ఆ దివ్యమాతకి నమస్కారము.

                         శ్రీలలితాపరదేవతార్పణమస్తు

Comments

Popular posts from this blog

Mantrapushpam with Telugu meaning మంత్రపుష్పం

49 Maruts mentioned by Sri Sri Yogiraj LahiriMahasya Maharaj

Shree vidya upaasana