క్రియయోగసాధన--విష్ణుసహస్రనామము(kriyayogasadhana--vishnusahasranaamamu
ఓం శ్రీ యోగానందగురు పరబ్రహ్మనేనమః
శ్రీవిష్ణుసహస్రనామము అనగా పరమాత్మని అనేక
నామములతో ధ్యానము చేయుట. పరమాత్మపొందుకు రెండే మార్గములు. అవి చంచల మనస్సును
స్థిరము చేయుట లేదా చంచల ప్రాణమును స్థిరము చేయుట.
చంచల ప్రాణమును స్థిరము చేయుటద్వారా చంచల
మనస్సు స్థిరము అగును. దీనినే ప్రాణాయామము అందురు. ఇది సాధకులకు సులభమైన
మార్గము. చంచల మనస్సును స్థిరము
చేయుటద్వారా చంచల ప్రాణము స్థిరము అగును. ఇది జ్ఞానమార్గము. జటిలమైనది.
పరమాత్మని అనేక నామములతో ధ్యానము చేయుట ద్వారా
చంచల మనస్సు స్థిరము అగును. పరమాత్మపొందు
సులభమగును.
సత్ అనగా సత్తా గలది. దానికిరణములే మాయ అనే
గోళములో పడుతున్నవి. ఆలోపలి కిరణములనే ‘తత్’ అంటారు. అవి బయటికి వికేంద్రీకరించేటప్పుడు ‘ఓం’ అనే శబ్దముతో
హరించిపోయే సృష్టి ఏర్పడుతున్నది. సమస్త జీవకోటి ఆ సృష్టిలోని అంతర్భాగమే. ఉన్నది
ఒకటే. అదే సత్. అది సర్వశక్తివంతము, సర్వవ్యాపి, మరియు సర్వజ్ఞత్వముగలది. సత్ చిత్ ఆనందము.
దీనికి నామరూపములు జోడిస్తే ఏర్పడేది హరించిపోయే సృష్టి. సృష్టికి కారణము అనేకముగా కనిపించే అనిపించే మాయ. మా అనగా కాదు, య అనగా యదార్థము, కనుక యదార్థము కానిది మాయ. పదార్థము
యదార్థముకాదు. పరమాత్మ కలయే మాయ. భయంకరమైన
కల కని భయంతో గడగడలాడే మానవుడు కళ్ళుతెరిస్తే భయము పోయినట్లుగానే, మాయ నుండి బయటపడుటకు క్రియాయోగసాధన అవసరము. అది
అన్నిజన్మలలోను దుర్లభమైన
మానవజన్మలోనే సాధ్యము. అన్నిజన్మల
లోను మానవజన్మ ఉత్తమము. సత్తు అనగా
పరమాత్మ. పరమాత్మను చేరాలంటే హరి నుండి, శబ్దబ్రహ్మమైన
ఓం లోకి,
తరువాత తత్ లోకి తద్వారా
సత్ లోకి చేరాలి.
|
మొదటిది సత్. ఒకప్రకాశవంతమైన దీపము
అనుకోండి.
రెండవది తత్. ఇది ఒక గాజు గోళము అనుకోండి. సత్
అనే దీపములోని కొన్ని కిరణములు మాత్రమె దీనిలోకి ప్రవేశిస్తాయి. కనుక సత్ తత్ లోనూ
ఉంటుంది,
తత్ కి అతీతంగానూ
ఉంటుంది. సత్ ఉంటేనే తత్ ఉంటుంది.
మూడవది ఓం. అనగా సృష్టికి కారణము. తత్ యొక్క
పరావర్తనము. ఏదైనా ఉత్పత్తి అవాలంటే ముందర శబ్దము వస్తుంది. తరువాత కంటికి
కనిపించే వస్తువు ఉత్పత్తి అవుతుంది. ఇదే హరించిపోయే ప్రపంచము (హరి).
అందువలననే
ఏ శుభకార్యమయిననూ హరి ఓం తత్ సత్
అని ప్రారంభించాలి. అనగా నాశమయ్యే హరినుంచి నాశముకాని సత్ లోకెళ్ళాలి.
ఒక్కొక్క నామము ఒక్కొక్క బీజమంత్రము. ఆ
ఒక్కొక్క బీజమంత్రము తత్ సంబంధిత చక్రమును ప్రకాశవంతమును చేయును. ఈ నామములలో ఆయా
చక్రమునకు సంబంధించిన బీజమంత్రము లేదా నామము(లు) ఏవో విడమర్చిచెప్పుటకు చేసిన
ప్రయత్నము ఇది. శ్రీ భగవత్ గీత లో ప్రప్రథమశ్లోకము “ ధర్మక్షేత్రే
కురుక్షేత్రే” అని ప్రారంభము అవుతుంది.
క్షేత్రే క్షేత్రే ధర్మకురు అనగా ప్రతిక్షేత్రములోను ధర్మము చేయి అని అర్థము.
ఇక్కడ క్షేత్రము అనగా చక్రము అని అన్వయించుకోవాలి. ప్రతి చక్రమును స్పందింప
చేయి. ఆయా చక్రము జాగృతి అగును. జాగృతి
చెందిన చక్రములోని చీకటి పోయి తన తన అద్భుత ప్రకాశముతో వెలుగొందును. జ్ఞానప్రాప్తి
సులభమగును. పరమాత్మ ప్రాప్తికి చేరువగును. శ్రీవిష్ణువు అనగా పరమాత్మ లేక సత్. సహస్రనామములు అనే
బీజమంత్రములద్వారా చక్రములను స్పందింప చేసి, ఆయా చక్రములను
ప్రకాశవంతము చేసి మనస్సును స్థిరపరచిన సాధకుడు ఆ సత్ లో మమైకం అగుటకు
ఉద్దేశించినదే ఈ అద్భుతమైన శ్రీవిష్ణుసహస్రనామము.
ఈవెయ్యినామములలో మొదటిశ్లోకములోని
తొమ్మిదినామములు మొదటిచక్రమయిన
మూలాధారచక్రమును స్పందింపజేయును. అనగా స్పందన మొదటిచక్రమయిన
మూలాధారచక్రముతో ప్రారంభమగును.
మన శరీరములో 72,000 సూక్ష్మనాడులు ఉన్నవి. వాటిలో ఇడా
పింగళ మరియు సుషుమ్న సూక్ష్మనాడులు అతి
ముఖ్యమయినవి. మేరుదండములో ఎడమ
ప్రక్కనున్నది ఇడాసూక్ష్మనాడి, కుడిప్రక్కనున్నది
పింగళ సూక్ష్మనాడి, మేరుదండముమధ్యలోనున్నది సుషుమ్న సూక్ష్మనాడి. మన శరీరములోని మేరుదండములో ఏడు చక్రములున్నవి.
ముడ్డివద్దనున్నమూలాదారచక్రము మొదటిది. మూత్రవిసర్జనద్వారమువెనకాలఉన్న స్వాధిష్ఠాన
చక్రము రెండవది. నాభివెనకాల ఉన్న మణిపురచక్రము మూడవది. హృదయము దగ్గరగా మేరుదండములో
నున్న అనాహతచక్రము నాలుగవది. కంఠములోనున్న విశుద్ధచక్రము అయిదవది.
మెడుల్లకేంద్రమువద్దనున్నది ఆజ్ఞా నెగటివ్, భ్రూమధ్యములోనున్నది
ఆజ్ఞా పాజిటివ్ చక్రము. ఈ ఆజ్ఞా నెగటివ్, మరియు
భ్రూమధ్యములోనున్న ఆజ్ఞా పాజిటివ్ రెండునూ కలిపి ఆరవచక్రమయిన ఆజ్ఞాచక్రము.
ఈఒక్కచక్రమునకు మాత్రము నెగటివ్, పాజిటివ్
పొలారిటీలు ఉండును. తలలో బ్రహ్మరంధ్రమునానుకొని ఏడవదయిన సహస్రారచక్రము ఉండును.
మూలాదారచక్రము స్వాధిష్ఠాన చక్రము మణిపురచక్రము
అనాహతచక్రము విశుద్ధచక్రము ఆజ్ఞా నెగటివ్, ఆజ్ఞా పాజిటివ్ చక్రము, మరియు సహస్రారచక్రము అనేది ఆరోహణాక్రమము.
సహస్రారచక్రము ఆజ్ఞా పాజిటివ్ చక్రము ఆజ్ఞా
నెగటివ్ విశుద్ధచక్రము అనాహతచక్రము మణిపురచక్రము స్వాధిష్ఠాన చక్రము మరియు
మూలాదారచక్రము అనేది అవరోహణాక్రమము.
మూలాదారచక్రము స్వాధిష్ఠాన చక్రము మణిపురచక్రము
వరకు వ్యాప్తించియున్నది బ్రహ్మగ్రంథి. ఇదియే కురుక్షేత్రము. ఋగ్వేద కాలము.
మణిపురచక్రము అనాహతచక్రము విశుద్ధచక్రము వరకు
వ్యాప్తించియున్నది రుద్రగ్రంథి. ఇదియే కురుక్షేత్ర - ధర్మక్షేత్రము.
యజుర్వేదకాలము
విశుద్ధచక్రము ఆజ్ఞా నెగటివ్, ఆజ్ఞా
పాజిటివ్ చక్రము, మరియు
సహస్రారచక్రము వరకు వ్యాప్తించియున్నది విష్ణుగ్రంథి. ఇదియే ధర్మక్షేత్రము. సామవేద
కాలము
శ్రీవిష్ణుసహస్రనామములోని కొన్ని నామములు లేదా
బీజాక్షరాలు ఉచ్చరించునపుడు ఒకేసారి ఆరోహణా లేదా అవరోహణా క్రమములో రెండు లేదా మూడు
చక్రములు స్పందింపజేయుటను గమనించవచ్చు. బ్రహ్మ రుద్ర లేదా విష్ణుగ్రంథి విచ్ఛేదన
జరుగుట గమనించవచ్చు. ఒకగ్రంథి విచ్ఛేదన
జరిగిన తదుపరి ఆ విచ్ఛేదన స్థిరపడుటకు ఒకే చక్రములో అనగా మణిపుర విశుద్ధ లేదా
ఆజ్ఞా(కూటస్థము) చక్రములో మాత్రమె స్పందన కలుగుటను గమనించవచ్చు. గ్రంథి విచ్ఛేదన
క్రియాయోగములో అతి ముఖ్యమయినది.
క్రియాయోగము:
క్రియాయోగములో1)హఠయోగం(శక్తిపూరక
అభ్యాసములు), 2)లయయోగము(సోహం
మరియు ఓం ప్రక్రియలు), 3)కర్మయోగము(సేవ),4)మంత్రయోగము(చక్రములలోబీజాక్షరధ్యానము)మరియు
5)రాజయోగము(ప్రాణాయామ పద్ధతులు) ఉండును.
అన్నియోగముల సమ్మేళనమేక్రియాయోగము.
శ్రీవిష్ణుసహస్రనామములోని ఒక్కొక్క నామము
ఒక్కొక్క బీజమంత్రము. క్రియాయోగములో చక్రములలో బీజాక్షరధ్యానము అతి ముఖ్యమయినది.
తూర్పు
లేదా ‘’ఉత్తర దిక్కును చూస్తూ మేరుదండమును మరియు మెడను
నిఠారుగా ఉంచుకొని, వజ్రాసనములో, పద్మాసనములో, లేదా సుఖా’’సనములో, జ్ఞానముద్ర లేదా
లింగముద్ర లోగాని కూర్చుండ వలయును. కొంచెము రిలాక్స్ (Relax)అవ్వాలి.
కూటస్థము’’లో దృష్టి నిలిపి
ఖేచరీ ముద్రలో ఉండాలి. ఇలా ధ్యానముద్రలో కూర్చొని ఈ నామములను/ మంత్రములను ఉచ్చరించవలయును.
1)విశ్వం విష్ణుః వషట్కారః భూతభవ్యభవత్ప్రభుః భూతకృద్ భూతభృద్
భావో భూతాత్మా భూతభావనః
విశ్వం(సాధకుని దేహము), విష్ణుః(సర్వదేహము వ్యాపించియున్న), వషట్కారః(యజ్ఞము) భూతభవ్యభవత్ప్రభుః(భూత
భవిష్యత్ వర్తమానముల ప్రభువు) భూతకృద్(సృష్టికర్త) భూతభృద్(ప్రాణుల స్థితికర్త)
భావః(శుద్ధ భావన) భూతాత్మా(సర్వ ప్రాణుల
ఆత్మ) భూతభావనః(ప్రాణుల కారకుడు).
ఈ తొమ్మిది నామములు మూలాధారచక్రమును
స్పందింపజేయును.
2)పూతాత్మా పరమాత్మా
చ ముక్తానాం పరమాగతిః అవ్యయఃపురుషః సాక్షీ క్షేత్రజ్ఞఃఅక్షర ఏవచ
పూతాత్మా(శుద్ధాత్మ) పరమాత్మా(సత్) చ
ముక్తానాంపరమాగతిః(సాధకుల పరమ లక్ష్యం) అవ్యయః(తరగని వాడు) పురుషః(ఆది పురుషుడు)
సాక్షీ(సాక్షీ) క్షేత్రజ్ఞః(ఈ దేహమును తెలిసినవాడు) అక్షర (నాశముకానివాడు) ఏవచ
ఈ ఎనిమిది నామములు మూలాధారచక్రమును
స్పందింపజేయును.
3)యోగః యోగవిదాంనేతా ప్రధానపురుషేశ్వరః నారసింహవపుః శ్రీమాన్ కేశవః పురుషోత్తమః
యోగః(యోగమువలనసాధించగలవాడు) యోగవిదాంనేతా(సాధకులకు నాయకుడు)
ప్రధానపురుషేశ్వరః (మాయకు జీవునకు ప్రభువు) నారసింహవపుః(నారసింహఅవతారకుడు—సాధకుడు నరుడు కాదు సింహము)
శ్రీమాన్(లక్ష్మీపతి—శక్తినిచ్చువాడు ) కేశవః
(కేశవుడు)పురుషోత్తమః(పురుషోత్తముడు).
ఈ ఏడునామములు మణిపురచక్రమును స్పందింపజేయును.
4)సర్వః శర్వః శివః స్థాణుః భూతాదిః నిధిరవ్యయః సంభవః భావనః భర్తా ప్రభవః ప్రభుః ఈశ్వరః
సర్వః(సర్వుడు) శర్వః(పవిత్రమయినవాడు)
శివః(మంగళస్వరూపుడు) స్థాణుః(ఇంటికి స్తంభములలాంటివాడు)
భూతాదిః(జీవకారకుడు)నిధిరవ్యయః(నాశముకాని ఐశ్వర్యము)సంభవః(అవతారకుడు)
భావనః(ధర్మబద్ధమయిన కోరికలననొసగువాడు)
భర్తా(భరించువాడు) ప్రభవః(పంచమహాభూతముల కారకుడు) ప్రభుః(ప్రభువు)
ఈశ్వరః(సర్వము తానె అయినవాడు—ఈక్షణములే శ్వరములుగా
నున్నవాడు)
ఈ పన్నెండు నామములు మణిపురచక్రమును
స్పందింపజేయును.
5)స్వయంభూః శంభుః ఆదిత్యః పుష్కారాక్షః మహాస్వనః
అనాదినిధనః దాతా విధాతా ధాతురుత్తమః
స్వయంభూః(స్వయంప్రకాశకుడు)శంభుః(పవిత్రతనొసగువాడు)
ఆదిత్యః(సూర్యుడు) పుష్కారాక్షః(పద్మనేత్రుడు) మహాస్వనః(వేదములే—ఓంకారమే శ్వాసగాయున్నవాడు)
అనాదినిధనః(రూపరహితుడు) ధాతా(సర్వకారకుడు) విధాతా(సిద్ధాంత కర్త)
ధాతురుత్తమః(సూక్ష్మాతిసూక్ష్ముడు)
ఈతొమ్మిదినామములు మణిపురచక్రమును స్పందింపజేయును.
6)అప్రమేయః హృషీకేశః పద్మనాభః అమరప్రభుః
విశ్వకర్మా మనుః త్వష్టా స్థవిష్ఠః స్థవిరోధృవః
అప్రమేయః(నిర్వచనరహితుడు)
హృషీకేశః(ఇంద్రియములకురాజు) పద్మనాభః(జ్ఞానకేంద్రుడు) అమరప్రభుః (అమర ప్రభు)
విశ్వకర్మా (సృష్టికర్త)మనుః(మనువు) త్వష్టా(పంచమహాభూతములను దంచువాడు)
స్థవిష్ఠః(సర్వోత్త ముడు) స్థవిరోధృవః(పురాతనుడు మరియుఅచలుడు)
ఈ తొమ్మిది నామములు క్రమముగా అనాహత మణిపుర చక్రములను
స్పందింపజేయును. బ్రహ్మగ్రంథి విచ్ఛేదనకు తోడ్పడును.
7)అగ్రాహ్యః శాశ్వతః కృష్ణః లోహితాక్షః ప్రతర్దనః ప్రభూతః త్రికకుబ్ధామ
పవిత్రం మంగళంపరం
అగ్రాహ్యః(సంగ్రహరహితుడు)
శాశ్వతః(శాశ్వతుడు) కృష్ణః(కృష్ణుడు)లోహితాక్షః(ఎఱ్ఱనినేత్రములుగలవాడు—దుర్మార్గులను కర్మసిద్ధాంతముద్వారా దండించువాడు)
ప్రతర్దనః(లయకారకుడు)ప్రభూతః(కల్మషరహితుడు) త్రికకుబ్ధామ(మూడు లోకములనుభారించువాడు—భౌతిక, సూక్ష్మ మరియు కారణ)
పవిత్రం(శుద్ధి కారకుడు) మంగళంపరం(ఉత్క్రుష్టపుమంగళస్వరూపుడు)
ఈతొమ్మిదినామములు క్రమముగా అనాహత మణిపుర చక్రములను
స్పందింపజేయును. బ్రహ్మగ్రంథి విచ్ఛేదనకు తోడ్పడును.
8)ఈశానః ప్రాణదః ప్రాణః జ్యేష్ఠః శ్రేష్ఠః ప్రజాపతిః హిరణ్యగర్భః భూగర్భః మాధవః మధుసూదనః ఈశానః(పరిపాలనాదక్షకుడు)
ప్రాణదః(ప్రాణులకు మూలకారకుడు) ప్రాణః(ప్రాణశక్తియుతుడు) జ్యేష్ఠః(మొదటి వాడు)
శ్రేష్ఠః(శ్రేష్ఠుడు) ప్రజాపతిః(సృష్టికర్త) హిరణ్యగర్భః(జగత్తునకు ఉదరము) భూగర్భః(పృథ్వీ రక్షకుడు) మాధవః(సాక్షీభూతుడు)
మధుసూదనః(సాధకుల వాసనాసంహారకుడు)
ఈపదినామములు మణిపురచక్రమును స్పందింపజేయును.
బ్రహ్మగ్రంథి విచ్ఛేదనకు తోడ్పడును.
9)ఈశ్వరః విక్రమీ ధన్వీ మేధావీ
విక్రమః క్రమః అనుత్తమః దురాఘర్షః కృతజ్ఞః కృతిః ఆత్మవాన్
ఈశ్వరః(సర్వశక్తిమంతుడు)
విక్రమీ(సర్వధైర్యవంతుడు) ధన్వీ(మేరుదండముఅను ధనుస్సును ధరించినవాడు)
మేధావీ(సర్వజ్ఞుడు)విక్రమః(విశిష్టమయినక్రమశిక్షణగలవాడు)క్రమః(క్రమశిక్షణగలవాడు)అనుత్తమః(అసమానుడు)దురాఘర్షః(సర్వశక్తిమంతుడు)కృతజ్ఞః(అన్నీతెలిసినవాడు)కృతిః(సత్కర్మకుప్రతిఫలమునొసగువాడు)ఆత్మవాన్(స్వయం
స్థితివంతుడు)
ఈ పదకొండునామములు విశుద్ధచక్రమును
స్పందింపజేయును.
10)సురేశః శరణం శర్మ విశ్వరేతాః
ప్రజాభవః అహః సంవత్సరః వ్యాలః ప్రత్యయః సర్వదర్శనః
సురేశః(దేవదేవుడు)
శరణం(సర్వులకు ఆశ్రయమునిచ్చువాడు) శర్మ(పరమానందము) విశ్వరేతాః(జగత్తుకు బీజము)
ప్రజాభవః(సర్వప్రాణులకు మూలము) అహః(ప్రకాశము) సంవత్సరః(కాలుడు)
వ్యాలః(అస్పర్శనీయుడు) ప్రత్యయః(శుద్ధజ్ఞానము) సర్వదర్శనః(సర్వమును చూచువాడు)
ఈ పదినామములు విశుద్ధచక్రమును స్పందింపజేయును.
11) అజః సర్వేశ్వరః సిద్ధః సిద్ధిః సర్వాదిః
అచ్యుతః వృషాకపిః అమేయాత్మా సర్వయోగవినిస్సృతః
అజః(జన్మరహితుడు)సర్వేశ్వరః(ప్రభువు)సిద్ధః(పరిపూర్ణుడు)
సిద్ధిః(ఆనందానికిపరాకాష్ట) సర్వాదిః (ఆదికారకుడు) అచ్యుతః(నిత్యశుద్ధుడు)వృషాకపిః(గొప్పకోతిఆంజనేయుడు)అమేయాత్మా(అనంతుడు)సర్వయోగవినిస్సృతః(సర్వస్వతంత్రుడు)
ఈ తొమ్మిదినామములు విశుద్ధచక్రమును
స్పందింపజేయును.
12)వసుః వసుమనాః సత్యః సమాత్మా సస్మితః సమః అమోఘః పుండరీకాక్షః వృషకర్మా
వృషాకృతిః
వసుః(సర్వపదార్ధములకుసారము)వసుమనాః(ఉత్కృష్టశుద్ధమనస్సు)సత్యః(సత్యము)సమాత్మా(అన్నింటిలోనూసమానముగానున్నవాడు)సస్మితః(ఆదరణీయుడు)సమః(సముడు)అమోఘః(నిత్యమూఅవసరమయినవాడు)పుండరీకాక్షః(హృదయవాసి)వృషకర్మా(ఉత్కృష్టకార్మికుడు)
వృషాకృతిః(ఉత్కృష్ట ఆకృతుడు)
వసుః వసుమనాః అమోఘః నామములు మూలాధారచక్రమును స్పందింపజేయును.
సత్యః సమాత్మా సస్మితః
సమః నామములు స్వాధిష్ఠానచక్రమును స్పందింపజేయును.
పుండరీకాక్షః వృషకర్మా
వృషాకృతిః నామములు మణిపురచక్రమును స్పందింపజేయును.
13)రుద్రః బహుశిరః బభ్రుః విశ్వయోనిః శుచిశ్రవః అమృతః శాశ్వతస్థాణుః వరారోహః
మహాతపాః
రుద్రః(దుఃఖనాశకుడు)బహుశిరః(సర్వచైతన్యవంతుడు)బభ్రుః(రాజు)విశ్వయోనిః(జగత్కారకుడు)
శుచిశ్రవః(దివ్యనామకుడు)అమృతః(నాశారహితుడు)శాశ్వతస్థాణుః(నిత్యస్థితివంతుడు)వరారోహః(ఉత్కృష్ట
ఆరోహకుడు) మహాతపాః(ఉత్కృష్ట తపస్కుడు)
ఈ తొమ్మిదినామములు అనాహతచక్రమును
స్పందింపజేయును.
14) సర్వగః సర్వవిద్భానుః విష్వక్సేనః జనార్దనః వేదః వేదవిత్ అవ్యంగః వేదాంగః
వేదవిత్ కవిః
సర్వగః(సర్వవ్యాపి)సర్వవిద్భానుః(సర్వప్రకాశకుడుమరియుసర్వజ్ఞుడు)విష్వక్సేనః(పరమాత్మ)జనార్దనః(ఆనందదాత)వేదః(వేదము)వేదవిత్(వేదజ్ఞాని)అవ్యంగః(అన్నివిధములసరిఅయినవాడు)
వేదాంగః (వేదములే అంగములుగా గలవాడు)వేదవిత్(వేదములు తెలిసినవాడు) కవిః(ఋషి)
ఈ పదినామములు విశుద్ధచక్రమును స్పందింపజేయును.
15)లోకాధ్యక్షఃసురాధ్యక్షః ధర్మాధ్యక్షఃకృతాకృతః
చతురాత్మా చతుర్వ్యూహః చతుర్దష్ట్రఃచతుర్భుజః
లోకాధ్యక్షః(లోకాధ్యక్షుడు)సురాధ్యక్షః(దేవతాధ్యక్షుడు)ధర్మాధ్యక్షః(ధర్మాధ్యక్షుడు)కృతాకృతః(సృష్టికర్త
మరియుసృష్టి)చతురాత్మా(జాగ్రత స్వప్న కారణ మరియు తురీయ అవస్థలలోఉన్నవాడు)చతుర్వ్యూహః(ఈ
నాలుగుఅవస్థలలోనూవ్యక్తీకరణకుకారకుడు)చతుర్దంష్ట్రః(చతురమయినజ్ఞానదంతములుగలవాడు)చతుర్భుజః(చతురమయిన
భుజములు గలవాడుఅనగా ధ్యానమునకు అనుకూలుడు).
ఈ ఎనిమిది నామములు మణిపురచక్రమును
స్పందింపజేయును.
16)భ్రాజిష్ణుః భోజనం భోక్తా సహిష్ణుః జగదాదిజః
అనఘః విజయః జేతా విశ్వయోనిః పునర్వసుః
భ్రాజిష్ణుః(స్వయంప్రకాశికుడు)భోజనం(భోజనము)భోక్తా(అనుభవి)సహిష్ణుః(సహిష్ణు)జగదాదిజః(సృష్టికర్త)అనఘః(అమలినుడు)విజయః(విజయుడు)జేతా(నిత్యవిజయుడు)విశ్వయోనిః(జగత్కారకుడు)పునర్వసుః(ఎప్పటికీమనలో
నివసించేవాడు)
ఈ పదినామములు విశుద్ధచక్రమును స్పందింపజేయును.
17) ఉపేంద్రఃవామనః
ప్రాంశుఃఅమోఘః శుచిఃఊర్జితఃఅతీంద్రఃసంగ్రహః సర్గః ధృతాత్మా నియమః యమః
ఉపేంద్రః(ఇంద్రియములకుసమీపుడు—మనస్సు)వామనః(వరిష్ఠమయిన మనస్సుగలవాడు)
ప్రాంశుః(ఉన్నతుడు) అమోఘః(అద్భుతసంకల్పుడు)శుచిః(నిత్యశుద్ధుడు)ఊర్జితః(శక్తిగలవాడు)అతీంద్రః(ఇంద్రియములకుఅతీతుడు)సంగ్రహః(స్వకీయసంకల్పుడు)సర్గః(సృష్టి)ధృతాత్మా(ఆత్మనియామకుడు)నియమః(నియామకుడు)యమః(పరిపాలకుడు)
ఈ పన్నెండునామములు విశుద్ధచక్రమును
స్పందింపజేయును.
18)వేద్యః వైద్యః సదాయోగీ వీరహా మాధవః మధుః అతీన్ద్రియః మహామాయః మహోత్సాహః మహాబలః
వేద్యః(తెలుసుకోదగినవాడు)
వైద్యః(వైద్యుడు) సదాయోగీ(నిత్యయోగి) వీరహా(సాధకునిలోని దుష్టలక్షణ
సంహారకుడు) మాధవః(జ్ఞానప్రభు)
మధుః(అమృతానందుడు)
అతీన్ద్రియః(ఇంద్రియాతీతుడు) మహామాయః(మహామాయ) మహోత్సాహః(మహోత్సాహి)
మహాబలః(సర్వశక్తిమంతుడు)
ఈ పదినామములు విశుద్ధచక్రమును స్పందింపజేయును.
19)మహాబుద్ధిఃమహావీర్యః మహాశక్తిః మహాద్యతిః అనిర్దేశ్యవపుః శ్రీమాన్ అమేయాత్మా
మహాద్రిధృక్
మహాబుద్ధిః(సర్వజ్ఞుడు)మహావీర్యః(సర్వవీర్యమంతుడు)
మహాశక్తిః(సర్వశక్తిమంతుడు) మహాద్యతిః(స్వయం ప్రకాశకుడు) అనిర్దేశ్యవపుః(ఇది అని
నిర్ణయించలేనిరూపము—రూపరహితుడు)
శ్రీమాన్(అద్భుతుడు) అమేయాత్మా(ఉత్కృష్టమైనవాడు) మహాద్రిధృక్(మహాబలవంతుడు)
ఈ ఎనిమిదినామములు విశుద్ధచక్రమును
స్పందింపజేయును.
20)మహేష్వాసఃమహీభర్తా శ్రీనివాసః సతాంగతిఃఅనిరుద్ధః సురానందః గోవిందః గొవిదాంపతిః
మహేష్వాసః(గొప్ప
మేరుదండమును ధరించినవాడు) మహీభర్తా(భూమిని భరించువాడు) శ్రీనివాసః(పవిత్రమయిన
నివాసముగలవాడు) సతాంగతిః(సాధకులలక్ష్యుడు)అనిరుద్ధః(సర్వులకు కావలసినవాడు)
సురానందః(దేవతలకు ఆనందమును కలుగచేయువాడు) గోవిందః(సాధకుల ఇంద్రియముల రక్షకుడు)
గోవిదాంపతిః(సాధకులకు ప్రభు)
ఈ ఎనిమిదినామములు విశుద్ధచక్రమును
స్పందింపజేయును.
21)మరీచిః దమనః హంసః సుపర్ణః భుజగోత్తమః హిరణ్యనాభః సుతపాః పద్మనాభః ప్రజాపతిః
మరీచిః(ప్రకాశవంతుడు)
దమనః(దుష్ట నాశకుడు) హంసః(అహం-నేను-సః-పరమాత్మ)
సుపర్ణః(సుందరమయిన రెక్కలుగలవాడు—ప్రతిచక్రమునకు ఉండే
దళములేరెక్కలు) భుజగోత్తమః(ఇంద్రియములే
పాములు, కుండలినీ శక్తి కూడా పామే, పరమాత్మని అయిదుతలల
అనంతుడు అనే పాముమీద పడుకున్నట్లు చూపిస్తారు, అనగా ఇంద్రియముల అనంతమయిన కోరికలను అధీనములోనుంచుకొనుటకు గుర్తు ఇది) హిరణ్యనాభః(బ్రహ్మను తన నాభి అనే కమలముమీద
ఉన్నవాడు అనగా జ్ఞానకేంద్రుడు)
సుతపాః(మంచి తపస్సు గలవాడు) పద్మనాభః(కమలము నాభిగా గలవాడు—కమలము నీటిలో ఉన్నను కుళ్ళిపోదు, అదేవిధముగా మనిషి
సంసారము అనే నీటిలో ఉన్నను కుళ్ళిపోకూడదు)
ప్రజాపతిః(జీవులకు భర్త)
ఈ తొమ్మిదినామములు విశుద్ధచక్రమును
స్పందింపజేయును.
22)అమృత్యుః సర్వదృక్ సింహః సంఘాతా సంధిమాన్
స్థిరః అజః దుర్మర్షణః శాస్తా విశృతాత్మా సురారిహా
అమృత్యుః(మరణరహితుడు)సర్వదృక్(సర్వముదర్శించువాడు)సింహః(లయకర్త)
సంఘాతా(పరస్పరసంబంధము గలవాడు)సంధిమాన్(ఆనందస్వరూపుడు)స్థిరః(స్థిరుడు)
అజః(సృష్టికర్త) దుర్మర్షణః(అజేయుడు) శాస్తా(శాసకుడు) విశృతాత్మా(వేదములకు ఆత్మ)
సురారిహా(దుష్ట సంహారకుడు)
అమృత్యుః(ఒక నామము)
మూలాధార చక్రమును స్పందింపజేయును.
సర్వదృక్ సింహః (రెండునామములు)అనాహత చక్రమును
స్పందింపజేయును.(బ్రహ్మగ్రంథి విచ్ఛేదనకు తోడ్పడును)
సంఘాతా సంధిమాన్ స్థిరః అజః దుర్మర్షణః శాస్తా
విశృతాత్మా సురారిహా(ఎనిమిది)నామములు విశుద్ధచక్రమును స్పందింపజేయును.
23)గురుః గురుతమః ధామ సత్యః సత్యపరాక్రమః నిమిషః
అనిమిషఃస్రగ్వీ వాచస్పతిరుదారఘీః
గురుః(ప్రథమగురు)గురుతమః(ఉత్తమగురు)ధామ(సాధకులలక్ష్యము)సత్యః(సత్యము)సత్యపరాక్రమః(సత్యపరాక్రమము)నిమిషః(ధ్యానమగ్నుడైన
యోగియొక్కనిమీలిత నేత్రములవంటివాడు)అనిమిషః(ధ్యానమగ్నుడైన యోగి యొక్క
తెరచుకున్ననేత్రములవంటివాడు)స్రగ్వీ(దివ్యమయిన మాలనుధరించినవాడు) వాచస్పతిరుదారఘీః
(పవిత్రసత్సంగవాచనాపటిమగలవాడు)
ఈ తొమ్మిదినామములు విశుద్ధచక్రమును
స్పందింపజేయును.
24) అగ్రణీః గ్రామణీః
శ్రీమాన్ న్యాయః నేతా సమీరణః సహస్రమూర్ధా విశ్వాత్మా సహస్రాక్షః సహస్రపాత్
అగ్రణీః(దారిచూచూవాడు) గ్రామణీః(నాయకుడు)
శ్రీమాన్(శక్తియుతుడు—పవిత్రమయిన
మనస్సుగలవాడు) న్యాయః(న్యాయము)నేతా(న్యాయాధికారి) సమీరణః(న్యాయప్రచారకుడు)
సహస్రమూర్ధా(అనంతమయిన తలలు గలవాడు—సర్వము
తెలిసినవాడు) విశ్వాత్మా(జగత్తుకు ఆత్మ) సహస్రాక్షః(అనంతమయిననేత్రములు గలవాడు—సర్వము చూచువాడు) సహస్రపాత్(అనంతమయినపాదములు
గలవాడు—సర్వశక్తివంతుడు)
ఈ పదినామములు విశుద్ధచక్రమును స్పందింపజేయును.
అందులో మొదటి నామము అగ్రణీః బ్రహ్మగ్రంథి విచ్ఛేదనకు తోడ్పడును.
25) ఆవర్తనః
నివృత్తాత్మా సంవృతః సంప్రదర్శనః అహః సంవర్తకః వహ్నిః అనిలః ధరణీధరః
ఆవర్తనః(కనబడనికాలయంత్రము) నివృత్తాత్మా(స్థిరమయిన)
సంవృతః(బయటికికనబడనివాడు) సంప్రమర్దనః (అహంకారుల్నిశిక్షించువాడు) అహః
సంవర్తకః(సూర్యుడు) వహ్నిః(అగ్ని) అనిలః(ముఖ్యప్రాణము) ధరణీధరః (భూమిని
భరించువాడు)
ఈ తొమ్మిదినామములు విశుద్ధచక్రమును
స్పందింపజేయును.
26)సుప్రసాదః ప్రసన్నాత్మావిశ్వధృగ్ విశ్వభుక్ విభుః సత్కర్తా సత్కృతః సాధుః
జహ్నుః నారాయణః నరః
సుప్రసాదః(ఉత్తమఅనుగ్రహము)
ప్రసన్నాత్మా(ఆనందమయుడు)విశ్వధృగ్(జగత్తుకు సహకారి) విశ్వభుక్ (సర్వము భుజించువాడు)
విభుః(అనంతావతార మూర్తి) సత్కర్తా(ధర్మమును ఆదరించువాడు) సత్కృతః (ధర్ములచే
కీర్తింపబడువాడు) సాధుః(సాధువు) జహ్నుః(నాయకుడు)నారాయణః(సర్వము వ్యాపించినవాడు)
నరః(దారిచూపువాడు)
ఈ పదకొండునామములు విశుద్ధచక్రమును
స్పందింపజేయును.
27)అసంఖ్యేయః అప్రమేయాత్మా విశిష్టః శిష్టకృత్
శుచిః సిద్ధార్థఃసిద్ధసంకల్పః సిద్ధిదః సిద్ధిసాధనః
అసంఖ్యేయః(అనంతరూపములు)
అప్రమేయాత్మా(ప్రమేయరహితుడు) విశిష్టః(విశిష్టుడు) శిష్టకృత్(శిష్టరక్షకుడు)
శుచిః(నిత్య శుచివంతుడు)
సిద్ధార్థః(పరిపూర్ణుడు) సిద్ధసంకల్పః(పరిపూర్ణమయిన సంకల్పము గలవాడు)
సిద్ధిదః(సిద్ధులనొసంగువాడు)
సిద్ధిసాధనః(పరమానందమునకు మార్గము)
అసంఖ్యేయః అప్రమేయాత్మా మూలాధారచక్రమును
స్పందింపజేయును.
విశిష్టః శిష్టకృత్ శుచిః విశుద్ధచక్రమును
స్పందింపజేయును.
సిద్ధార్థఃసిద్ధసంకల్పః సిద్ధిదః సిద్ధిసాధనః
అనాహత చక్రమును స్పందింపజేయును. బ్రహ్మగ్రంథి విచ్ఛేదనకు తోడ్పడును.
28)వృషాహీవృషభః విష్ణుః వృషపర్వా వృషోదరః వర్ధనః వర్ధమానఃవివిక్తః శ్రుతిసాగరః
వృషాహీ(జగత్
ధర్మపరిపాలకుడు) వృషభః(అనుగ్రహప్రదాత) విష్ణుః(సర్వవ్యాపి)
వృషపర్వా(అంతిమలక్ష్యము) వృషోదరః(దయాఉదరము) వర్ధనః(జీవములకుఆహారప్రదాత)
వర్ధమానః(నిత్యవర్ధనుడు) వివిక్తః(దేనికీచలించ నివాడు) శ్రుతిసాగరః(వేదములకు
ఆధారము)
ఈ తొమ్మిదినామములు మూలాధారచక్రమును
స్పందింపజేయును.
29)సుభుజః దుర్ధరః వాగ్మీ మహేన్ద్రః వసుదః
వసుఃనైకరూపః బృహద్రూపః శిపివిష్టః ప్రకాశనః
సుభుజః(మంచిభుజములుగలవాడు—దయార్ద్రచిత్తుడు)దుర్ధరః(పరిమానరహితుడు)వాగ్మీ(ఘనకీర్తి)
మహేన్ద్రః (ఇంద్రియములకురాజు—మనస్సు)వసుదః(ఐశ్వర్యప్రదాత)వసుః(అంతర్యామి)నైకరూపః(ఒకరూపము
అంటూలేని వాడు) బృహద్రూపః(విరాట్ రూపుడు) శిపివిష్టః(సూర్యునికి
ప్రకాశమునిచ్చువాడు) ప్రకాశనః(ప్రకాశము)
ఈ పదినామములు మణిపురచక్రమును స్పందింపజేయును.
30) ఓజస్తేజో్ద్యుతిధరఃప్రకాశాత్మా ప్రతాపనః
ఋద్ధఃస్పష్టాక్షరఃమంత్రః చంద్రాంశుః భాస్కరద్యుతిః
ఓజస్తేజో్ద్యుతిధరః(సత్యం శివం
సుందరం)ప్రకాశాత్మా(స్వయంప్రకాశీ) ప్రతాపనః(తాపము లేదా వేడితో కూడియున్నవాడు—సర్వశక్తిమంతుడు) ఋద్ధః(సర్వ
ఐశ్వర్యవంతుడు)స్పష్టాక్షరః(ఓంకారము)మంత్రః(పవిత్ర వేద మంత్రము) చంద్రాంశుః(చల్లని
ప్రకాశము) భాస్కరద్యుతిః(సూర్యప్రకాశాతీతుడు)
ఓజస్తేజో్ద్యుతిధరః అనే మంత్రము మూలాధార
స్వాదిస్ఠాన మణిపుర మరియు అనాహతచక్రములను క్రమముగా స్పందింపజేయును. బ్రహ్మగ్రంథి
విచ్ఛేదనకు తోడ్పడును.
ప్రతాపనః ఋద్ధః స్పష్టాక్షరః మంత్రః చంద్రాంశుః
భాస్కరద్యుతిః అను ఆరుమంత్రములు
అనాహతచక్రములను స్పందింపజేయును.
31)అమృతాంశూద్భవః భానుః శశబిన్దుః సురేశ్వరః ఔషధం
జగతస్సేతుః సత్యధర్మపరాక్రమః
అమృతాంశూద్భవః(నాశరహితుడు)భానుః(స్వయంప్రకాశికుడు)
శశబిన్దుః(చల్లనిబిందువు—శక్తి)
సురేశ్వరః(దేవత లకు ప్రభువు) ఔషధం(అన్నిసంసారదుఃఖములకు దివ్యమయిన ఔషధం) జగతస్సేతుః(సాధకునికి లేక జగత్తుకు పరమాత్మకు
సేతువు) సత్యధర్మపరాక్రమః(సత్యధర్మములను చాటిచెప్పే పరాక్రమవంతుడు).
అమృతాంశూద్భవః అను మంత్రము మూలాధార స్వాదిస్ఠాన మణిపుర అనాహత మరియు
విశుద్ధ చక్రములను క్రమముగా
స్పందింపజేయును. బ్రహ్మగ్రంథి మరియు రుద్రగ్రంథి విచ్ఛేదనకు తోడ్పడును.
భానుః శశబిన్దుః సురేశ్వరః ఔషధం జగతస్సేతుః
సత్యధర్మపరాక్రమః అను ఆరుమంత్రములు
విశుద్ధచక్రమును స్పందింపజేయును.
32)భూతభవ్యభవన్నాయఃపవనః పావనః అనలః కామహా కామక్రుత్ కాంతః కామః కామప్రదః ప్రభుః
భూతభవ్యభవన్నాయః(భూతభవిష్యత్
వర్తమానములకుప్రభువు)పవనః(ప్రాణశక్తి)పావనః(పవిత్రుడు) అనలః (ముఖ్యప్రాణము)కామహా(సాధకులకోరికలనునాశముచేసిముక్తినొసగువాడు)కామక్రుత్(ధర్మబద్ధమయినకోరికలనొసగువాడు) కాంతః(సౌందర్యమునకుపరాకాష్ఠ) కామః(సర్వులకుఇష్టుడు) కామప్రదః(సాధకుల ధర్మ
బద్ధమయిన కోరికలనొసగువాడు) ప్రభుః(సర్వజీవరాసికి ప్రభువు)
ఈ పదినామములు విశుద్ధచక్రమును స్పందింపజేయును.
33)యుగాదిక్రుత్ యుగావర్తః నైకమాయః
మహాశనః అదృశ్యః వ్యక్తరూపః సహస్రజిత్ అనంతజిత్
యుగాదిక్రుత్(యుగములసృష్టికర్త)యుగావర్తః(యుగములపరిపాలకుడు)నైకమాయః(అనంతశక్తివంతుడు)
మహాశనః(మహాభక్షకుడు) అదృశ్యః(గ్రాహ్యరహితుడు) వ్యక్తరూపః(సాధకులకు వ్యక్తుడు) సహస్రజిత్(వేలవేల
దుష్ట శక్తుల విజేత) అనంతజిత్(నిత్యవిజేత)
ఈఎనిమిదినామములు క్రమముగా అనాహత మణిపురచక్రములను
స్పందింపజేయును. బ్రహ్మగ్రంథి విచ్ఛేదనకు తోడ్పడును.
34)ఇష్టః విశిష్టః శిష్టేష్టఃశిఖండీ నహుషఃవృషః
క్రోధహాక్రోధకృత్కర్తావిశ్వవాహుఃమహీధరః
ఇష్టః(ప్రేమభాండాగారము)
విశిష్టః(విశిష్టుడు) శిష్టేష్టః(సాధకులప్రేమికుడు)శిఖండీ(తటస్థుడు) నహుషః(మాయతో
జీవుల్నివశపరచుకోనేవాడు)వృషః(ధర్మావతారము)క్రోధహా(క్రోధవినాశి)క్రోధకృత్కర్తా(దుష్టసంహారకుడు)విశ్వవాహుః(అనంతమయిన
శక్తిగలవాడు)మహీధరః(భూమిని భరించువాడు)
ఈ
పదినామములు మణిపురచక్రమును స్పందింపజేయును.
35)అచ్యుతః ప్రథితః ప్రాణః ప్రాణదః వాసవానుజః అపాంనిధిః అధిష్టానం అప్రమత్తః
ప్రతిష్ఠితః
అచ్యుతః(అస్పర్శనీయుడు)ప్రథితః(ప్రథముడు)ప్రాణః(స్థితికారకుడు)ప్రాణదః(బలకారకుడు)వాసవానుజః(మనస్సుకు
అన్న) అపాంనిధిః(సముద్రము) అధిష్టానం(మూలకారకుడు) అప్రమత్తః(ఎల్లవేళలా జాగరూకతతో
ఉండేవాడు) ప్రతిష్ఠితః(స్వయం స్థితివంతుడు)
ఈతొమ్మిదినామములు స్వాధిష్ఠానచక్రమును
స్పందింపజేయును.
36)స్కందః స్కందధరః ధుర్యఃవరదః వాయువాహనః వాసుదేవః బృహద్భానుః ఆదిదేవః పురందరః
స్కందః(సాధకునిఆత్మనిగ్రహశక్తి)స్కందధరః(ఆత్మనిగ్రహశక్తినిధరించినవాడు)ధుర్యః(అన్నిటినీభరించువాడు)వరదః
(ధర్మబద్ధమైనవరములనొసగువాడు)వాయువాహనః(ఏడుముఖ్యవాయువులకుప్రతినిధి)వాసుదేవః(వాసుదేవుడ్ని)
బృహద్భానుః(ఉత్తమ సూర్యుడు)ఆదిదేవః(ముఖ్యకారకుడు) పురందరః(స్థూల సూక్ష్మ మరియు
కారణ శరీరములలోనుండువాడు)
స్కందః స్కందధరః
ధుర్యఃవరదః మూడు నామములు
స్వాధిష్ఠానచక్రమును స్పందింపజేయును.
వాయువాహనః వాసుదేవః
రెండు నామములు మణిపురచక్రమును స్పందింపజేయును.
బృహద్భానుః ఆదిదేవః
పురందరః మూడునామములు అనాహతచక్రమును స్పందింపజేయును.
37)అశోకః తారణఃతారః శూరః శౌరిఃజనేశ్వ రః అనుకూలఃశతావర్తః పద్మీ పద్మనిమేక్షణః
అశోకః(శోకరహితుడు)
తారణః(సాధకులను భవసాగరమునుండితరింపజేయువాడు) తారః(రక్షకుడు) శూరః(ధైర్యముగలవాడు)
శౌరిః(శౌర్యవంతుడు)జనేశ్వ రః(జీవులప్రభువు) అనుకూలః (సాధకులకుఅనుకూలుడు)
శతావర్తః(అనంతమయిన అవతారములుగలవాడు)
పద్మీ(పద్మమునీళ్ళకంటనట్లుగాతనవలనవ్యక్తీకరించిన
సంసారములోతగులములేనివాడు) పద్మనిమేక్షణః(సంసారమును నిర్లిప్తతో
చూచువాడు)
ఈ పదినామములు అనాహతచక్రమును స్పందింపజేయును.
38)పద్మనాభః అరవిన్దాక్షఃపద్మగర్భః శరీరభృత్ మహర్ధిః ఋద్ధః వృద్ధాత్మ మహాక్షః
గరుడధ్వజః
పద్మనాభః(సంసారములోతగులములేనిజ్ఞాననాభిగలవాడు)
అరవిన్దాక్షః(సంసారములోతగులములేని జ్ఞాననేత్రము
గలవాడు)పద్మగర్భః(సంసారములోతగులములేనిహృదయముగలవాడు)శరీరభృత్(శరీరమునుస్థితివంతముచేయువాడు) మహర్ధిః(అద్భుత ప్రకాశి) ఋద్ధః(సర్వవ్యాపి)
వృద్ధాత్మ(సనాతనుడు) మహాక్షః (సర్వమును దర్శించు వాడు)
గరుడధ్వజః(జ్ఞానారూఢుడు)
ఈ పదినామములు విశుద్ధచక్రమును స్పందింపజేయును.
39)అతులః శరభః భీమః సమయజ్ఞః హవిర్హరిః సర్వలక్షణలక్షణ్యః లక్ష్మీవాన్ సమితింజయః
అతులః(సాటిలేని)శరభః(స్వయంప్రకాశి)భీమః(భయంకరుడు)సమయజ్ఞః(సమయమునుగుర్తించువాడు)హవిర్హరిః(హవిస్సును
భుజించువాడు) సర్వలక్షణలక్షణ్యః(విచారణద్వారాపొందగలవాడు)లక్ష్మీవాన్(శక్తికిభర్త)
సమితింజయః (నిత్యజయుడు)
ఈ ఎనిమిదినామములు అనాహతచక్రమును
స్పందింపజేయును.
40)విక్షరః రోహితః మార్గః హేతుః దామోదరః సహః మహీధరః మహాభాగః వేగవాన్ అమితాశనః
విక్షరః(అవినాశి) రోహితః(మత్స్యావతారము—నీటిలో ఉన్నప్పటికీ నీరు చేపనంటవు. అదేమాదిరి సంసారము అనే నీటిలోనున్నప్పటికీ
సంసారతగులములేనివాడు)మార్గః(పరమాత్మే మనకు దిక్కు)హేతుః(కారకుడు) దామోదరః(పరమాత్మ)
సహః(సర్వమునుసహించువాడు) మహీధరః(భూమిని భరించువాడు) మహాభాగః(నిత్య ఐశ్వర్యవంతుడు) వేగవాన్(అమితవేగవంతుడు)
అమితాశనః(అమిత భక్షకుడు)
ఈ పదినామములు అనాహతచక్రమును స్పందింపజేయును.
41)ఉద్భవః క్షోభణః దేవః శ్రీగర్భఃపరమేశ్వరః కరణం
కారణం కర్తా వికర్తా గహనః గుహః
ఉద్భవః(మూలకారకుడు)క్షోభణః(దుష్టులనుక్షోభించువాడు)దేవః(ప్రకాశవంతమయినచేతన)శ్రీగర్భః(పవిత్రమయినహృదయముగలవాడు)
పరమేశ్వరః(పరమాత్మా) కరణం(నిమిత్తకారణము) కారణం(ద్రవ్యకారణం) కర్తా(చేసేవాడు)
వికర్తా(బ్రహ్మాండ సృష్టికర్తా) గహనః(రహస్యము—పరమాత్మపొండుకై
చేసే యోగసాధన రహితమయిన హాస్యముగలది)గుహః(మాయతో కప్పబడినది).
ఈ పదకొండునామములు విశుద్ధచక్రమును స్పందింపజేయును.
42)వ్యవసాయః వ్యవస్థానః సంస్థానః స్థానదః ధృవః పరిర్ధిః పరమస్పష్టః తుష్టః పుష్టః
శుభేక్షణః
వ్యవసాయః(నిశ్చయుడు)వ్యవస్థానః(ఆధారము)
సంస్థానః(సర్వమునకుస్థానము)
స్థానదః(యోగులకు స్థానమునొసగువాడు) ధృవః(స్థిరుడు) పరిర్ధిః(ఉన్నతకీర్తి)
పరమస్పష్టః(పరమఖచ్చితము) తుష్టః(నిత్యసంతోషి) పుష్టః(నిత్యతృప్తుడు)
శుభేక్షణః(శుభదృష్టి).
ఈ పదినామములు అనాహతచక్రమును స్పందింపజేయును.
43)రామః విరామః విరజః మార్గః నేయః నయః అనయః వీరః
శక్తిమతాంశ్రేష్టఃధర్మః ధర్మవిదుత్తమః
రామః(నిత్యానందం)విరామః(ఉత్తమోత్తమశయనము)విరజః(కామరహితుడు)మార్గః(అమరత్వమునకుమార్గము)
నేయః(మార్గదర్శి)నయః(నాయకుడు)అనయః(ఆయనకిఇంకొకనాయకుడులేడు)వీరః(వీరుడు)శక్తిమతాంశ్రేష్టః(శక్తివంతులకే
శక్తివంతుడు)ధర్మః(ధర్మమూ) ధర్మవిదుత్తమః(ధర్మము తెలిసిన జ్ఞాని).
రామః విరామః విరజః మూడునామములు క్రమముగా
విశుద్ధ అనాహత మణిపురచక్రములను స్పందింప జేయును. బ్రహ్మగ్రంథి విచ్ఛేదనకు
తోడ్పడును.
మార్గః నేయః నయః అనయః వీరః శక్తిమతాంశ్రేష్టః
ధర్మః ధర్మవిదుత్తమః ఎనిమిదినామములు మణిపురచక్రమును స్పందింపజేయును. బ్రహ్మగ్రంథి
విచ్ఛేదన దృఢపరచుటకు తోడ్పడును.
44)వైకుణ్ఠః పురుషః
ప్రాణఃప్రణాదఃప్రణవఃపృథుఃహిరణ్యగర్భః శత్రుఘ్నః వ్యాప్తః వాయుః అధోక్షజః
వైకుణ్ఠః(పంచమహాభూతములను కలిపి
సృష్టివ్యక్తీకరణకికారకుడు)పురుషః(పురుషోత్తముడు) ప్రాణః(ప్రాణశక్తి)
ప్రణాదః(సృష్టిలయకారకుడు)ప్రణవః(ఓం)పృథుః(వ్యాపించినవాడు)హిరణ్యగర్భః(సృష్టికర్త)శత్రుఘ్నః(దుష్టసంహారకుడు)
వ్యాప్తః(సర్వవ్యాపి) వాయుః(ప్రాణశక్తిప్రదాత) అధోక్షజః(బలప్రదాత).
ఈ పదకొండునామములు మణిపురచక్రమును
స్పందింపజేయును.
45)ఋతుఃసుదర్శనః కాలః పరమేష్టీపరిగ్రహః
ఉగ్రఃసంవత్సరః దక్షః విశ్రామః విశ్వదక్షిణః
ఋతుః(ఋతువులకుప్రభువు)సుదర్శనః(సహస్రారచక్రం)కాలః(కాలము)పరమేష్టీ(అనంతకీర్తికేంద్రం)పరిగ్రహః(సాధకుని
నకారాత్మకశక్తులను పరిగ్రహించేవాడు)ఉగ్రః(దుష్టులకు
ఉగ్రస్వరూపుడు)సంవత్సరః(కాలము)దక్షః(దక్షతగల వాడు)
విశ్రామః(సంసారులకువిశ్రాంతికలగజేయువాడు) విశ్వదక్షిణః(ఉత్కృష్టుడు).
ఈ పదినామములు అనాహతచక్రమును స్పందింపజేయును.
బ్రహ్మగ్రంథివిచ్ఛేదనకు తోడ్పడును.
46)విస్తారః స్థావరఃస్థాణుఃప్రమాణం బీజమవ్యయం అర్థః అనర్థఃమహాకోశః మహాభోగః మహాధనః
విస్తారః(అనంతవిస్తారుడు)స్థావరఃస్థాణుః(గట్టిమరియుచలనరహితుడు)ప్రమాణం(జ్ఞానమునకుమార్గము)బీజమవ్యయం(తరగని
బీజము) అర్థః(అర్థము) అనర్థః(పరిపూర్ణము)మహాకోశః(మహాకోశుడు) మహాభోగః(మహాభోగి)
మహాధనః(మహాశక్తివంతుడు).
ఈ తొమ్మిదినామములు విశుద్ధచక్రమును
స్పందింపజేయును.
47)అనిర్విణ్ణఃస్థవిష్ఠఃఅభూఃధర్మయూపఃమహామఖః నక్షత్రనేమిఃనక్షత్రీ క్షమః క్షామః
సమీహనః
అనిర్విణ్ణః(అద్వేషీ)స్థవిష్ఠః(మొత్తము)అభూః(జన్మరహితుడు)ధర్మయూపః(ధర్మసారము)మహామఖః(మహాయజ్ఞం)
నక్షత్రనేమిః(నక్షత్రకేంద్రము)నక్షత్రీ(చంద్రుడు) క్షమః(క్షమ)
క్షామః(ప్రళయములోకూడా ఉండేవాడు) సమీహనః (సాధకుల క్షేమము కోరేవాడు).
ఈ పదినామములు విశుద్ధను తరువాత అనాహతచక్రమును
స్పందింపజేయును. రుద్రగ్రంథి విచ్ఛేదనకు తోడ్పడును.
48)యజ్ఞః ఈజ్యః మహేజ్యః క్రతుఃసత్రంసతాం గతిఃసర్వదర్శీవిముక్తాత్మా సర్వజ్ఞః
జ్ఞానముత్తమం
యజ్ఞః(యజ్ఞము)ఈజ్యః(క్రియాయజ్ఞముద్వారాపిలిచినపలుకువాడు)మహేజ్యః(ఉత్తమోత్తమఆరాధ్యుడు)క్రతుః(కామక్రోధలోభమోహమదమాత్సర్యములుఅనేజంతువులనుబలిఇచ్చేక్రియాయజ్ఞము)సత్రం(సర్వులకునీడనిచ్చేసత్రము)
సతాంగతిః(సాధకులలక్ష్యము)సర్వదర్శీ(సర్వముతెలిసినవాడు)విముక్తాత్మా(నిత్య్విముక్తుడు)సర్వజ్ఞః(సర్వజ్ఞుడు)
జ్ఞానముత్తమం(ఉత్కృష్టపుజ్ఞానము).
ఈ పదినామములు అనాహతను
తరువాత మణిపురచక్రమును స్పందింపజేయును. రుద్రగ్రంథి విచ్ఛేదనకు తోడ్పడును.
49)సుబ్రతః సుముఖః సూక్ష్మఃసుఘోషఃసుఖదః సుహృత్ మనోహరః జితక్రోధఃవీరబాహుః విదారణః
సుబ్రతః(పరిశుద్ధుడు)సుముఖః(అద్భుతమైనదయ)సూక్ష్మః(సూక్ష్ముడు)సుఘోషః((పవిత్రశబ్దము—ఓం)
సుఖదః(సుఖప్రదాత)సుహృత్(పవిత్రమిత్రుడు)మనోహరః(మూర్తీభవించిన అందము)
జితక్రోధః(క్రోధమును జయించినవాడు)వీరబాహుః(బలవంతుడు) విదారణః(దుష్టసంహారకుడు)
ఈ పదినామములు అనాహతను తరువాత మణిపురచక్రమును
స్పందింపజేయును. రుద్రగ్రంథి విచ్ఛేదనకు తోడ్పడును.
50)స్వాపనః స్వవశః వ్యాపీ నైకాత్మా నైకకర్మకృత్
వత్సరః వత్సలః వత్సీ రత్నగర్భః ధనేశ్వరః
స్వాపనః(అద్భుతమైనమైకము)స్వవశః(స్వవశుడు)వ్యాపీ(సర్వవ్యాపి)నైకాత్మా(అనంతాత్మా)నైకకర్మకృత్(అనేకకర్మలుచేయువాడు)వత్సరః(పరమాత్మ)వత్సలః(వత్సలుడు)వత్సీ(జగత్పితా)రత్నగర్భః(వివేకహృదయుడు)ధనేశ్వరః(సర్వశక్తివంతుడు)
ఈ పదినామములు అనాహతను తరువాత మణిపురచక్రమును
స్పందింపజేయును. రుద్రగ్రంథి విచ్ఛేదనకు తోడ్పడును.
51)ధర్మగుప్ ధర్మకృత్ ధర్మీ సత్ అసత్ క్షరం అక్షరం అవిజ్ఞాతా సహస్రాంశు విధాతా
కృతలక్షణః
ధర్మగుప్(ధర్మరక్షకుడు)ధర్మకృత్(ధర్మకర్త)ధర్మీ(ధర్మరక్షకుడు)సత్(సత్తు)అసత్(జగత్తు)క్షరం(క్షరుడు)అక్షరం(అక్షరుడు)
అవిజ్ఞాతా(తర్కమునకు దక్కనిదోరకనివాడు)సహస్రాంశు(వెయ్యి దళములవాడు)విధాతా((బ్రహ్మ)
కృతలక్షణః(వేదములకర్త)
ఈ పదకొండునామములు విశుద్దనును తరువాత మణిపురచక్రమును
స్పందింపజేయును. రుద్రగ్రంథి విచ్ఛేదనకు తోడ్పడును.
52)గమస్తినేభిః సత్వస్థఃసింహఃభూతమహేశ్వరః ఆదిదేవః మహాదేవః దేవేశః దేవభ్రుద్గురుః
గమస్తినేభిః(చేతనాప్రకాశము)సత్వస్థః(సాత్వికుడు)సింహః(సింహము—వీర్యమునుతనఅధీనములోనుంచుకున్న
వాడు)భూతమహేశ్వరః(జీవములకుప్రభువు)ఆదిదేవః(ప్రథమదేవత)మహాదేవః(మహాదేవుడు)దేవేశః(దేవతలకు
ప్రభువు) దెవభ్రుద్గురుః(ఇంద్రునికి గురువు—ఆత్మ బోధకుడు)
ఈ ఎనిమిదినామములు క్రమముగా మణిపుర స్వాధిష్ఠాన
మరియు మూలాధార చక్రములను స్పందింపజేయును. బ్రహ్మగ్రంథి విచ్ఛేదనకు తోడ్పడును.
53)ఉత్తరః గోపతిః గోప్తా జ్ఞానగమ్యః పురాతనః శరీరభూతబృత్ భోక్తా కపీన్ద్రః
భూరిదక్షిణః
ఉత్తరః(ఉత్తమోత్తముడు)
గోపతిః(ఇంద్రియములకురాజు) గోప్తా(జీవరక్షకుడు) జ్ఞానగమ్యః(జ్ఞానమునకు గమ్యము పురాతనః(పురాతనుడు—జీవునిశరీరమేతనశరీరము)
శరీరభూతబృత్(జీవునిశరీరమునుపోషించువాడు) భోక్తా (భోక్త) కపీన్ద్రః(శ్రీరాముడు—ఖేచరీముద్రకిమారుపేరు
కోతిముద్ర—ఈముద్రలోనేసాధకుడు క్రియాయోగసాధన చేయవలె)భూరిదక్షిణః(సాధకునకు
ధర్మబద్ధమయిన కోరికలనొసగువాడు)
ఈ తొమ్మిదినామములు క్రమముగా విశుద్దనును తరువాత
మణిపురచక్రమును స్పందింపజేయును. రుద్రగ్రంథి విచ్ఛేదనకు తోడ్పడును.
54)సోమపః అమృతపః సోమః పురుజిత్ పురుసత్తమః వినయః జయః సత్యసంధః దాశార్హః సాత్వతాం
పతిః
సోమపః(సోమపానముచేయువాడు)అమృతపః(అమృతుడు)సోమః(సోముడు)పురుజిత్(సాధకులలోని
శత్రువులనుజయించువాడు) పురుసత్తమః (పురుషోత్తముడు)వినయః(సరిఅయిననాయకుడు)
జయః(జయుడు) సత్యసంధః(సత్యమును పాటించువాడు) దాశార్హః(ఆహూతులను అందుకునేవాడు)
సాత్వతాం పతిః(సాత్వికుల ప్రభు)
ఈ పదినామములు మణిపురచక్రమును స్పందింపజేయును.
55)జీవః వినయితాసాక్షీ ముకున్దః అమితవిక్రమః అంబోనిధిః అనంతాత్మా మహోదధిశయః అంతకః
జీవః(జీవుడు)వినయితాసాక్షీ(వినయమునకుసాక్షీభూతుడు)ముకున్దః(ముక్తిప్రదాత)అమితవిక్రమః(అమితవిశిష్టమయిన
క్రమశిక్షణగలవాడు)అంబోనిధిః(సముద్రము) అనంతాత్మా(అనంతాత్ముడు) మహోదధిశయః(జ్ఞాన
సముద్రముమీద విశ్రాంతినొందువాడు) అంతకః(యముడు)
ఈ ఎనిమిదినామములు మణిపురచక్రమును
స్పందింపజేయును.
56)అజః మహార్హః స్వాభావ్యః జితామిత్రః ప్రమోదనః ఆనందః నందనః నందః సత్యధర్మా
త్రివిక్రమః
అజః(పుట్టుకలేనివాడు)
మహార్హః(మహాగౌరవమునకుఅర్హుడు)స్వాభావ్యః(కారణరహితుడు)జితామిత్రః(సాధకుని
అంతఃమరియుబాహ్య
శతృవులనుజయింపచేయుమిత్రుడు)ప్రమోదనః(నిత్యసంతోషి)ఆనందః(శుద్ధఆనందము)
నందనః(ఆనందప్రదాత)నందః(ప్రాపంచికవిషయములనుండిముక్తుడు)సత్యధర్మా(ఉత్తమనిత్యధర్మము)
త్రివిక్రమః (మూడులోకములను-స్థూల సూక్ష్మ మరియు కారణ-జయించినవాడు)
ఈ పదినామములు మణిపురచక్రమును స్పందింపజేయును.
57)మహర్షిః కపిలాచార్యః కృతజ్ఞః మేదినేపతిః త్రిపదః త్రిదశాధ్యక్షః మహాశృంగః
కృతాన్తకృత్
మహర్షిఃకపిలాచార్యః(మహర్షికపిలాచార్య)కృతజ్ఞః(క్రియాయోగసాధననిఆదరించెవాడు)మేదినేపతిః(పృథ్వీపతి)త్రిపదః(స్థూల సూక్ష్మ మరియు
కారణ లోకములను మూడు పదములు గలవాడు) త్రిదశాధ్యక్షః(జాగ్రత, స్వప్న మరియు
సుషుప్తిఅవస్థలకుఅధ్యక్షుడు)మహాశృంగః(మహామహుడు)కృతాన్తకృత్(మాయనిఅధీనములోనుంచుకున్నవాడు)
ఈ ఏడునామములు క్రమముగా విశుద్దనును తరువాత అనాహతచక్రమును
స్పందింపజేయును. రుద్రగ్రంథి విచ్ఛేదనకు తోడ్పడును.
58)మహావరాహః గోవిందః సుషేణః కనకాంగదీ గుహ్యః గభీరః గహనః గుప్తః చక్రగదాధరః
మహావరాహః(మహావరిష్టమయినమార్గము)గోవిందః(ఇంద్రియములకుభర్త)సుషేణః(మంచిసైన్యము)కనకాంగదీ(సువర్ణ
కంకనధారి—ఓంకారం) గుహ్యః(పరమ రహస్యము—రహితమయినహాస్యము—క్రియాయోగాసాధన అనేది చాలా
తీవ్రమయినది)గభీరః(కొలతకు అందనిది) గహనః(అస్పర్శనీయుడు) గుప్తః(రహస్యమయుడు)
చక్రగదాధరః(సహస్రారచక్రముగలవాడు)
ఈ తొమ్మిదినామములు క్రమముగా విశుద్దను తరువాత
అనాహతచక్రమును స్పందింపజేయును. రుద్రగ్రంథి విచ్ఛేదనకు తోడ్పడును.
59)వేధాఃస్వాన్గః అజితః కృష్ణఃదృఢఃసంకర్షణోచ్యుతః వరుణః వారుణఃవృక్షః పుష్కరాక్షః
మహామనాః
వేధాః(సృష్టికర్త)స్వాన్గః(నిమిత్తద్రవ్యసాధనకారణము)అజితః(కనిపించని)కృష్ణః(కృష్ణ)దృఢః(నిశ్చితుడు)సంకర్షణోచ్యుతః(మార్పుచేందని
బ్రహ్మాండభర్త) వరుణః(ఉదయభానుడు) వారుణః(ఉదయభానుని పుత్రుడు—బ్రహ్మాండచేతన) వృక్షః(బ్రహ్మాండ
వృక్షము—అశ్వత్థ వృక్షము) పుష్కరాక్షః(సర్వవ్యాపి)
మహామనాః(మహాదయాళు)
ఈ పదకొండునామములుమూలాధారచక్రమును
స్పందింపజేయును.
60)భగవాన్ భగహా ఆనందీ వనమాలీ హలాయుధః ఆదిత్యః జ్యోతిరాదిత్యః సహిష్ణుః గతిసత్తమః
భగవాన్(పరమాత్మ)
భగహా(ప్రళయాన్తకుడు) ఆనందీ(ఆనందస్వరూపుడు)వనమాలీ(వైజయంతీమాలను ధరించినవాడు)
హలాయుధః(భూమిని హలముతో దున్నువాడు—బలరాముడు) ఆదిత్యః(ఆదిత్యుడు) జ్యోతిరాదిత్యః(ఆదిత్యుని
లోని ప్రకాశము) సహిష్ణుః(సర్వమూ సహించువాడు) గతిసత్తమః(క్రియాయోగసాధకుల
అంతిమలక్ష్యము)
ఈ తొమ్మిదినామములు క్రమముగా అనాహతను తరువాత మణిపురచక్రమును
స్పందింపజేయును. బ్రహ్మగ్రంథి విచ్ఛేదనకు తోడ్పడును.
61) సుధన్వా ఖండపరశుఃదారుణఃద్రవిణప్రదః దివఃస్పృక్ సర్వద్రుగ్వ్యాసః వాచస్పతిరయోనిజః
సుధన్వా(మంచిధనుస్సుధరించినవాడు—సాధకునిధనుస్సునిఠారుగాఉంచినమేరుదండము)
ఖండపరశుః (జ్ఞాన పరశునుధరించినసాధకుడు—జ్ఞానపరశురాముడు)దారుణః(దుష్టులనుదారుణముగాదండించువాడు)ద్రవిణప్రదః
(భక్తులకు ఐశ్వర్యమునొసగువాడు) దివఃస్పృక్(ఆకాశామంతావ్యాపించినవాడు)
సర్వద్రుగ్వ్యాసః(సర్వజ్ఞుడయిన వ్యాసమహర్షి) వాచస్పతిరయోనిజః(జన్మరహితుడయిన జ్ఞాని)
ఈ ఏడునామములు క్రమముగా అనాహతను తరువాత మణిపురచక్రమును
స్పందింపజేయును. బ్రహ్మగ్రంథి విచ్ఛేదనకు తోడ్పడును.
62)త్రిసామా సామగః సామ నిర్వాణం భేషజం భిషక్ సంన్యాసక్రుత్ శమః శాంతః నిష్ఠా
శాంతిః పరాయణం
త్రిసామా(మూడువేదములలోనూ
పూజనీయుడు)సామగః(సామవేదములోని గానము)సామ(సామవేదము) నిర్వాణం(జ్ఞానలక్ష్యము)భేషజం(సంసారములోనిదుఃఖమును
హరించువాడు)భిషక్((దివ్యమయిన వైద్యుడు) సంన్యాసక్రుత్(సన్యాసాశ్రమమునకుఅధ్యక్షుడు)శమః(నిశ్శబ్దీ)శాంతః(శాంతుడు)నిష్ఠా(నిష్ఠుడు)శాంతిః(శాంతి)
పరాయణం(అంతిమలక్ష్యం)
ఈ పన్నెండునామములు మణిపురచక్రమును స్పందింపజేయును.
63)శుభాన్గః శాంతిదః స్రష్టా కుముదః కువలేశయః గోహితః గోపతిఃగోప్తా వృషభాక్షః
వృషప్రియః
శుభాన్గః(శుభమయినఅంగములుగలవాడు)శాంతిదః(శాంతిప్రదాతా)స్రష్టా(సృష్టికర్త)కుముదః(తనసృష్టిని
ఆనందిపచేయువాడు)కువలేశయః(అనంతుడనే శేషనాగుమీద పవళించువాడు)గోహితః(ఇంద్రియములకు
హితుడు)గోపతిః(ఇంద్రియములకుభర్త—మనస్సు)గోప్తా(మాయవలన తెలియనివాడు) వృషభాక్షః(ధర్మరక్షకుడు)
వృషప్రియః (ధర్మమును ఆదరించువాడు)
ఈ పదినామములుమూలాధారచక్రమును స్పందింపజేయును.
64)అనివర్తీ నివృత్తాత్మా సంక్షేప్తా క్షేమకృత్ శివః శ్రీవత్సవక్షాః శ్రీవాసః
శ్రేపతిః శ్రీమతాంవరః
అనివర్తీ(నిశ్చయము) నివృత్తాత్మా(విషయములందు నివృత్తి)
సంక్షేప్తా(అంతర్యామి) క్షేమకృత్(సాధకులకు మేలుచేకూర్చువాడు)శివః(మంగళస్వరూపుడు)
శ్రీవత్సవక్షాః(పవిత్రమయిన వక్షముగలవాడు) శ్రీవాసః(పవిత్రనివాసుడు) శ్రేపతిః(పవిత్రతకుభర్త)
శ్రీమతాంవరః(పవిత్రమనస్కులకు వరుడు)
ఈ తొమ్మిదినామములుమణిపురచక్రమును స్పందింపజేయును.
65)శ్రీదః శ్రీశః
శ్రీనివాసః శ్రీనిధిః శ్రీవిభావనః శ్రీధరః శ్రీకరః శ్రేయః శ్రీమాన్ లోకత్రయాశయః
శ్రీదః(పవిత్రతనుసాధకులకునొసగువాడు)శ్రీశః(పవిత్రతకుప్రభువు)శ్రీనివాసః(పవిత్రతకువాసము)శ్రీనిధిః(పవిత్రతకునిధి)శ్రీవిభావనః(పవిత్రతనుసాధకులకుఇచ్చువాడు)శ్రీధరః(పవిత్రతనుధరించువాడు)శ్రీకరః(పవిత్రతచేయువాడు)శ్రేయః(మోక్షమునుసాధకులకునొసగువాడు)శ్రీమాన్(పవిత్రమనస్సునుసాధకులకునొసగువాడు)లోకత్రయాశయః(మూడులోకములకు
ఆశ్రయము నొసగువాడు)
ఈ పదినామములుమణిపురచక్రమును స్పందింపజేయును.
66)స్వక్షః స్వమ్గః శతానందఃనన్దిఃజ్యోతిర్గనేశ్వరః
విజితాత్మా విధేయాత్మా సత్కీర్తిః ఛిన్నసంశయః
స్వక్షః(సుందరమైననేత్రములుగలవాడు)స్వమ్గః(సుందరమైనఅంగములుగలవాడు)శతానందః(అనంతానందమూర్తి)నన్దిః(అనంతానందమూర్తి)జ్యోతిర్గనేశ్వరః(ప్రకాశాములకు
ప్రభువు)విజితాత్మా(ఇంద్రియజయుడు)విధేయాత్మా (సాధకులకు విధేయుడు) సత్కీర్తిః(శుద్ధ
కీర్తిమంతుడు) ఛిన్నసంశయః(సంశయరహితుడు)
ఈ తొమ్మిదినామములుమణిపురచక్రమును
స్పందింపజేయును.
67)ఉదీర్ణఃసర్వతశ్చక్షుఃఅనీశః శాశ్వతస్థిరఃభూశయఃభూషణఃభూతిః
విశోకః శోకనాశనః
ఉదీర్ణః(ఉత్తమోత్తమాధ్యాత్మికత)సర్వతశ్చక్షుః(అన్నిప్రక్కలానేత్రములుగలవాడు)అనీశః(సర్వోత్తమము)శాశ్వతస్థిరః
(నిత్యస్థిరుడు)భూశయః(భూమికి
ఆధారము)భూషణః(జగత్తుకు ఆభరణము)భూతిః(పవిత్రమయిన స్థితివంతుడు)
విశోకః(శోకరహితుడు)శోకనాశనః(శోకనాశకుడు)
ఈ తొమ్మిదినామములుఅనాహతచక్రమును
స్పందింపజేయును.
68)అర్చిష్మాన్ అర్చితః కుమ్భః విశుద్ధాత్మా
విశోధనః అనిరుద్ధః అప్రతిరథః ప్రద్యుమ్నః అమితవిక్రమః
అర్చిష్మాన్(అద్బుత
ప్రకాశము)అర్చితః(పూజనీయుడు)కుమ్భః(ప్రప్రథమకళశము)విశుద్ధాత్మా(విశుద్ధాత్ముడు) విశోధనః(శుద్ధిపరచేవాడు—లయకారకుడు)అనిరుద్ధః(సూక్ష్మాతిసూక్ష్ముడు)
అప్రతిరథః(అజేయుడు) ప్రద్యుమ్నః (ఐశ్వర్యవంతుడు)అమితవిక్రమః(సర్వశక్తిమంతుడు)
ఈ తొమ్మిదినామములుఅనాహతచక్రమును
స్పందింపజేయును.
69)కాలనేమినిహా వీరః శౌరిఃశూరజనేశ్వరః
త్రిలోకాత్మా త్రిలోకేశః కేశవః కేశిహా హరిః
కాలనేమినిహా(కాలనేమిఅనేఅసురునిచంపినవాడు—క్రియాయోగసాధకులుకాలమునకు
అతీతముగా ధ్యానము చేయసమర్థులు)వీరః(వీరుడు)శౌరిః(శూరుడు)శూరజనేశ్వరః(శూరజనులకుప్రభువు)
త్రిలోకాత్మా(స్థూల సూక్ష్మ కారణలోకములకుఆత్మ)త్రిలోకేశః(స్థూలసూక్ష్మకారణలోకములకుప్రభువు)కేశవః(కేశవుడు)కేశిహా(తమోగుణసంహారకుడు)
హరిః(భవరోగనాశకుడు).
ఈ తొమ్మిదినామములుఅనాహతచక్రమును
స్పందింపజేయును.
70)కామదేవః కామపాలః కామీ కాంతః కృతాగమః అనిర్దేశ్యవపుఃవిష్ణుఃవీరః అనంతః ధనంజయః
కామదేవః(ధర్మబద్ధమయినకామము)కామపాలః(ధర్మబద్ధమయినకామములనుతీర్చువాడు)కామీ(తృప్తిపొందినవాడు)కాంతః(అమితమైనసుందరుడు)కృతాగమః(వేదకర్త)అనిర్దేశ్యవపుః(ఇదిఅనివర్ణించలేనిరూపము)విష్ణుః(సర్వవ్యాపీ)వీరః(వీరుడు)
అనంతః(అనంతుడు) ధనంజయః(అర్జునుడు)
ఈ కామదేవః కామపాలః కామీ కాంతః కృతాగమః అనిర్దేశ్యవపుపుః
ఆరునామములుమణిపురచక్రమును
స్పందింపజేయును.
విష్ణుఃవీరః అనంతః
ధనంజయః నాలుగునామములు అనాహతచక్రమును
స్పందింపజేయును.
71)బ్రహ్మణ్యఃబ్రహ్మకృత్ బ్రహ్మా బ్రహ్మ బ్రహ్మవివర్ధనః బ్రహ్మవిత్ బ్రాహ్మణః
బ్రహ్మీ బ్రహ్మజ్ఞః బ్రాహ్మణప్రియః
బ్రహ్మణ్యః(బ్రహ్మజ్ఞులనుఆదరించువాడు)బ్రహ్మకృత్(బ్రహ్మజ్ఞులరచయిత)బ్రహ్మా(సృష్టికర్త)బ్రహ్మ(సృష్టికర్త)
బ్రహ్మవివర్ధనః(బ్రహ్మజ్ఞులనుఆదరించువాడు)బ్రహ్మవిత్(బ్రహ్మజ్ఞానముతెలిసినవాడు)బ్రాహ్మణః(మంత్రములకను
గుణముగా యజ్ఞము చేయువారిని ఆదరించువాడు) బ్రహ్మీ((సృష్టికర్త) బ్రహ్మజ్ఞః(బ్రహ్మజ్ఞుడు)
బ్రాహ్మణప్రియః (బ్రహ్మజ్ఞులను ఆదరించువాడు).
ఈ పదినామములు క్రమముగా విశుద్ధ అనాహత తరువాత మణిపురచక్రమును
స్పందింపజేయును. బ్రహ్మగ్రంథి విచ్ఛేదనకు తోడ్పడును.
72)మహాక్రమః మహాకర్మా మహాతేజాః మహోరగః మహాక్రతుఃమహాయజ్వా మహాయజ్ఞః మహాహవిః
మహాక్రమః(మహాక్రమశిక్షణ)
మహాకర్మా(మహాకర్మలనుచేయువాడు) మహాతేజాః(మహాతేజోవంతుడు) మహోరగః
(మహాసర్పము)మహాక్రతుః(మహాయజ్ఞము)మహాయజ్వా(మహాయజ్ఞములనుచేయువాడు)మహాయజ్ఞః(మహాయజ్ఞము)
మహాహవిః(మహాహవిస్సు)
ఈ ఎనిమిదినామములు అనాహత చక్రమును
స్పందింపజేయును.
73)స్తవ్యః స్తవప్రియః స్తోత్రం స్తుతిః)స్తోతా రణప్రియః పూర్ణః పూరయితా పుణ్యః
పుణ్యకీర్తిఃఅనామయః
స్తవ్యః(పొగడబడువాడు)స్తవప్రియః(ప్రార్థనాప్రియుడు)స్తోత్రం(స్తోత్రము)స్తుతిః(స్తుతి)స్తోతా(పూజనీయుడు)రణప్రియః
(క్రియాయోగాసాధనారణప్రియుడు)పూర్ణః(పూర్ణుడు)పూరయితా(కోరికలనుతీర్చువాడు)పుణ్యః(పవిత్రుడు)
పుణ్యకీర్తిః(పవిత్రుకీర్తివంతుడు)
అనామయః(నామరహితుడు)
ఈ పదకొండునామములు అనాహత చక్రమును
స్పందింపజేయును.
74)మనోజవః తీర్థకరః వసురేతా వసుప్రదః వసుప్రదః వాసుదేవః వసుః వసుమనాః హవిః
మనోజవః(తీవ్రమయినఆలోచన)తీర్థకరః(జ్ఞానప్రదాత)వసురేతా(బంగారములాంటిసారము)వసుప్రదః(మోక్షప్రదాత)
వసుప్రదః(మోక్షప్రదాత) వాసుదేవః(కృష్ణ) వసుః(అంతర్యామి) వసుమనాః(సర్వవ్యాపీ) హవిః(హవిస్సు)
ఈ తొమ్మిదినామములు అనాహత చక్రమును
స్పందింపజేయును.
75)సద్గతిః సత్కృతిః సత్తా సద్భూతిః సత్పరాయణః శూరసేనః యదుశ్రేష్ఠః సన్నివాసః
ముయామునః
సద్గతిః(మంచిలక్ష్యము)
సత్కృతిః(సత్కార్యములను చేయువాడు)సత్తా(సత్తాగలవాడు)సద్భూతిః(నిత్యమయిన
విభూతులుగలవాడు) సత్పరాయణః(సాధకుల అంతిమలక్ష్యం) శూరసేనః(అమితధైర్యముగలసైన్యము)
యదుశ్రేష్ఠః(కృష్ణ) సన్నివాసః(సత్ నివాసము) ముయామునః(ధర్ములచే చుట్టబడినవాడు)
ఈ తొమ్మిదినామములు అనాహత చక్రమును
స్పందింపజేయును.
76)భూతవాసః వాసుదేవః సర్వాసునిలయః అనలః దర్పహా దర్పదః దుప్తః దుర్ధరః అపరాజితః
భూతవాసః(భూతములకువాసము)వాసుదేవః(మాయనిఅధీనములోనుంచుకున్నవాడు)
సర్వాసునిలయః (సర్వ జీవశక్తులనిలయము)అనలః(అమితమయినకీర్తి మరియు
శక్తిమంతుడు)దర్పహా(అహంకారనాశకుడు) దర్పదః (ధర్ములకుగర్వకారణము)దుప్తః(అనంతానందముమత్తుతోనుండువాడు)దుర్ధరః(ఇదిఅనిగ్రహింపశక్యముకానివాడు)అపరాజితః(అజేయుడు)
ఈ తొమ్మిదినామములు అనాహతచక్రమును
స్పందింపజేయును.
77)విశ్వమూర్తిః మహామూర్తిః దీప్తమూర్తిః అమూర్తిమాన్ అనేకమూర్తిః అవ్యక్తః
శతమూర్తిః శతాననః
విశ్వమూర్తిః(బ్రహ్మాండరూపి)మహామూర్తిః(మహారూపి)దీప్తమూర్తిః(ప్రకాశవంతమైనరూపి)అమూర్తిమాన్(రూపరహితుడు)అనేకమూర్తిః(అనంతరూపుడు)అవ్యక్తః(అవ్యక్తుడు)శతమూర్తిః(అనేకరూపి)శతాననః(క్రియాయోగాసాధకులకు
అమితమయిన అనురాగి)
ఈ ఎనిమిదినామములు మణిపురచక్రమును
స్పందింపజేయును.
78)ఏకః నైకః సవః కః కిం యత్ తత్ పదమనుత్తమం లోకబన్ధుః లోకనాథః మాధవః భక్తవత్సలః
ఏకః(ఒక్కడే)
నైకః(అనేకుడు) సవః(సోమయజ్ఞము)కః(అత్యుత్తమ ఆనందము) కిం(సాధకుల విచారణ ఈయన
గురించే)యత్(ఏదైతేసర్వమో)తత్(అదిఆయనే)పదమనుత్తమం(ఉత్తమపదము)లోకబన్ధుః(సర్వులకుబంధువు)లోకనాథః(సర్వులకునాథుడు)మాధవః(భూమిని
భరించువాడు) భక్తవత్సలః(క్రియాయోగసాధకులకువాత్సల్యము చూపువాడు)
ఈ పన్నెండునామములు మణిపురచక్రమును
స్పందింపజేయును.
79)సువర్ణవర్ణః హేమాన్గః వరాన్గః చందనామ్గదీ వీరహా విషమః శూన్యః ఘృతాశీ అచలః చలః
సువర్ణవర్ణః(సుందరవర్ణుడు)హేమాన్గః(సుందర
అంగుడు)వరాన్గః(అద్భుత అంగుడు)చందనామ్గదీ(చందనములాంటి సువాసనతోకూడిన అంగుడు)వీరహా(దుష్టసంహారక
వీరుడు)విషమః(అసమానుడు)శూన్యః(శూన్యుడు) ఘృతాశీ(కోరికరహితుడు) ఆచలః(ఆచలుడు) చలః(చలుడు)
ఈ పదినామములు మణిపురచక్రమును స్పందింపజేయును.
80)అమానీ మానదః మాన్యః లోకస్వామీ త్రిలోకధృక్ సుమేధా మేధజః ధన్యః సత్యమేధః ధరాధరః
అమానీ(అమితమయినసాధుతత్వము)మానదః(గౌరవమునొసగువాడు)మాన్యః(పూహనీయుడు)లోకస్వామీ(లోకమునకుస్వామీ)త్రిలోకధృక్(మూడులోకములకుప్రభువు)సుమేధా(శుద్ధజ్ఞానం)మేధజః(శుద్ధమేధస్సు)ధన్యః(ధన్యుడు)సత్యమేధః(అద్భుతమయినజ్ఞానం)ధరాధరః(భూమినిధరించువాడు)
ఈ పదినామములు అనాహతచక్రమును స్పందింపజేయును.
81)తేజోవృషః ధృతిధరః సర్వశాస్త్రభృతాంవరః ప్రగ్రహః నిగ్రహః వ్యగ్రః నైకశృంగః గదాగ్రజః
తేజోవృషః(అద్భుతప్రకాశము)ధృతిధరః(అద్భుతప్రకాశముగలవాడు)సర్వశాస్త్రభృతాంవరః(మహాయోద్ధ)ప్రగ్రహః(సాధకులప్రార్థనలనుస్వీకరించువాడు)నిగ్రహః(నిర్దిష్టమయినగ్రహణశక్తిగలవాడు)వ్యగ్రః(సాధకులధర్మబద్ధమయిన
కోరికలనుతీర్చువాడు)నైకశృంగః(అనంతమైనచేతనగలవాడు)గదాగ్రజః(మంత్రములద్వారాఆహ్వానిస్తే
పలుకువాడు)
ఈ ఎనిమిదినామములు క్రమముగా విశుద్ధ అనాహత తరువాత
మణిపురచక్రమును స్పందింపజేయును. బ్రహ్మగ్రంథి విచ్ఛేదనకు తోడ్పడును.
82) చతుర్మూర్తిః చతుర్బాహుః చతుర్వ్యూహః చతుర్గతిః చతురాత్మా చతుర్భావః
చతుర్వేదవిత్ ఏకపాత్
చతుర్మూర్తిః(జాగ్రత
స్వప్న సుషుప్తి మరియు తురీయ రూపీ) చతుర్బాహుః(మనోబుద్ధిచిత్త మరియు అహంకారం
అనేనాలుగుభుజములుగలవాడు)చతుర్వ్యూహః(జాగ్రతస్వప్నసుషుప్తిమరియుతురీయఅనే
నాలుగువ్యూహములు గలవాడు) చతుర్గతిః(నాలుగువర్ణముల అంతిమ లక్ష్యము) చతురాత్మా(మనోబుద్ధిచిత్త
మరియు అహంకారం అనేనాలుగుపనిముట్లు గలవాడు) చతుర్భావః((ధర్మ అర్థ కామ మరియు
మోక్ష అనే నాలుగు పురుషార్థములకు మూలము)చతుర్వేదవిత్(నాలుగువేదముల
జ్ఞాని) ఏకపాత్(బ్రహ్మాండకేంద్రము)
ఈ ఎనిమిదినామములు అనాహతచక్రమును
స్పందింపజేయును.
83)సమావర్తః నివృత్తాత్మా దుర్జయః దురతిక్రమః దుర్లభః దుర్గమః దుర్గః దురావాసః
దురారిహా
సమావర్తః(జీవితచక్రమునుసమముగాత్రిప్పేవాడు)నివృత్తాత్మా(విషయములందునివృత్తిగలవాడు)దుర్జయః(అజేయుడు)దురతిక్రమః(ఆక్రమించలేనివాడు)
దుర్లభః(దుర్లభుడు) దుర్గమః(చొరబాటుకు దక్కనివాడు) దుర్గః(దుష్టులయందు
నిర్దయగలవాడు) దురావాసః(ఆయన హృదయములోస్థానము పొందుట కష్టతరము) దురారిహా(అసుర
సంహారకుడు)
ఈ తొమ్మిదినామములు క్రమముగా అనాహత తరువాత మణిపురచక్రమును
స్పందింపజేయును. బ్రహ్మగ్రంథి విచ్ఛేదనకు తోడ్పడును.
84)శుభాన్గః లోకసారంగః సుతన్తుః తంతువర్ధనః ఇంద్రకర్మా మహాకర్మా కృతకర్మా కృతాగమః
శుభాన్గః(శుభాన్గుడు)
లోకసారంగః(ఓంకారముద్వారాపొందదగినవాడు)సుతన్తుః(మంచిగా వ్యాప్తిచెందినవాడు)
తంతువర్ధనః(సర్వులకుతండ్రి)ఇంద్రకర్మా(అద్భుతమయినకార్యములనుచేయువాడు)మహాకర్మా(మహాకార్యములను
చేయువాడు) కృతకర్మా(కార్యములను చేయుతలో పరిపూర్ణత) కృతాగమః(వేదముల కర్త)
ఈ ఎనిమిదినామములు క్రమముగా విశుద్ధ అనాహత తరువాత
మణిపురచక్రమును స్పందింపజేయును. బ్రహ్మగ్రంథి విచ్ఛేదనకు తోడ్పడును.
85) ఉద్భవః సుందరః సున్దః రత్ననాభః సులోచనః అర్కః వాజసనః శ్రుంగీ జయంతః
సర్వవిజ్జయీ
ఉద్భవః(అంతిమలక్ష్యము)సుందరః(అమితమయిన
సుందరుడు)సున్దః((దయాళువు)రత్ననాభః(జ్ఞానకేంద్రము) సులోచనః(మత్తుగొలిపేనేత్రములు)అర్కః(సూర్యుడు)వాజసనః(ఆహారప్రదాత)శృంగీ(అన్నిఅంశలుతానేఅయినవాడు)జయంతః(అజేయుడు)సర్వవిజ్జయీ(సర్వజ్ఞుడు).
ఈపదినామములు క్రమముగా అనాహత తరువాత మణిపురచక్రమును
స్పందింపజేయును. బ్రహ్మగ్రంథి విచ్ఛేదనకు తోడ్పడును.
86)సువర్ణబిందుఃఅక్షోభ్యఃసర్వవాగీశ్వరఃమహాహ్లాదః మహాగర్తః మహాభూతః మహానిధిః
సువర్ణబిందుః(సువర్ణమయినఅంగములుగలవాడు)అక్షోభ్యః(అచలితుడు)సర్వవాగీశ్వరః(మంచివక్త)మహాహ్లాదః(మహానందప్రదాత)మహాగర్తః(మహారంధ్రము)మహాభూతః(మహాభూతము)మహానిధిః(మహానిధి)
ఈఏడునామములు మణిపురచక్రమును స్పందింపజేయును.
87)కుముదః కుందరః కుందః పర్జన్యః పావనః అనిలః అమృతాశః అమృతవపుః సర్వజ్ఞః
సర్వతోముఖః
కుముదః(భూమిని
అనుభవించేవాడు)కుందరః(స్థూలములోనికి చొచ్చుకుబోయేవాడు)కుందః(సుందరమైనవాడు)
పర్జన్యః(మేఘములు)పావనః(పవిత్రుడు)అనిలః(సర్వచేతనాస్వరూపము)అమృతాశః(అమృతత్వమునుకోరువాడు)
అమృతవపుః(అమృతరూపము)సర్వజ్ఞః(సర్వజ్ఞుడు)సర్వతోముఖః(అన్నిప్రక్కలాముఖములుగలవాడు)
ఈపదినామములు క్రమముగా అనాహతమణిపురచక్రములను స్పందింపజేయును. బ్రహ్మగ్రంథి విచ్ఛేదనకు తోడ్పడును.
88)సులభః సువ్రతః సిద్ధః శతృజిత్ శతృతాపనః న్యఘ్రోధః ఉదుంబరః అశ్వత్థః చాణూరాన్ధ్రనిషూదనః
సులభః(క్రియాయోగసాధకులకుసులభుడు)సువ్రతః(సువ్రతుడు)సిద్ధః(సిద్ధుడు)శతృజిత్(క్రియాయోగసాధకులశతృవులనుజయించువాడు)శతృతాపనః(శతృవులనుదహించువాడు)న్యఘ్రోధః(అమరత్వపువృక్షము)ఉదుంబరః(అంతరిక్షుడు)అశ్వత్థః(అశ్వత్థవృక్షము)చాణూరాన్ధ్రనిషూదనః(కృష్ణ)
ఈతొమ్మిదినామములు అనాహతచక్రమును
స్పందింపజేయును.
89)సహస్రార్చిః సప్తజిహ్వః సప్తైధాః సప్తవాహనః అమూర్తిః అనఘః అచింత్యః భయకృత్
భయనాశనః
సహస్రార్చిః(సహస్రారచక్రము)సప్తజిహ్వః(ఏడునాలుకలఅగ్ని)సప్తైధాః(ఏడునాలుకలఅగ్ని)సప్తవాహనః(ఏడుఅశ్వములసూర్యుడు)అమూర్తిః(రూపరహితుడు)అనఘః(ఎవరికీతూగనివాడు)అచింత్యః(మానవచేతనకుఅందనివాడు)భయకృత్(దుష్టులకుభయము
కలుగజేయువాడు)భయనాశనః(సాధకులభయనాశకుడు)
ఈతొమ్మిదినామములు క్రమముగా అనాహత తరువాత మణిపురచక్రమును
స్పందింపజేయును. బ్రహ్మగ్రంథి విచ్ఛేదనకు తోడ్పడును.
90)అణుః బృహత్ కృశః స్థూలః గుణభ్రుత్ నిర్గుణః మహాన్ అధృతః స్వధృతః స్వాస్థః
ప్రాగ్వశః వంశవర్ధనః
అణుః(సూక్ష్మాతిసూక్ష్ముడు)బృహత్(గరిష్టానికిగరిష్టం)కృశః(సున్నితుడు)స్థూలః(అతిస్థూలుడు)గుణభ్రుత్(సగుణుడు)నిర్గుణః(నిర్గుణుడు)మహాన్(మహాత్మా)అధృతః(ఆధారరహితుడు)
స్వధృతః(స్వయంఆధారసహితుడు)స్వాస్థః (ప్రకాశవంతుడు)ప్రాగ్వశః(సనాతుడు)వంశవర్ధనః(వంశవర్ధనుడు)
ఈపన్నెండునామములు క్రమముగా అనాహత తరువాత మణిపురచక్రమును
స్పందింపజేయును. బ్రహ్మగ్రంథి విచ్ఛేదనకు తోడ్పడును.
92)ధనుర్ధరః ధనుర్వేదః దండః దమయితా దమః అపరాజితః సర్వసహః నియంతా నియమః యమః
ధనుర్ధరః(కారణ సూక్ష్మ
మరియు స్థూల మేరుదండమును ధరించినవాడు)ధనుర్వేదః(మేరుదండమును సాధనలో
ఉపయోగించుటఎటులనోక్రియాయోగసాధకులకుతెలియజెప్పువాడు)దండః(మేరుదండము)దమయితా(నియమించువాడు)దమః(జయుడు)అపరాజితః(అజేయుడు)సర్వసహః(సర్వమునుభరించువాడు)నియంతా(సర్వంసహాధికారి)నియమః((సర్వనియామకుడు)యమః(అమరుడు)
ఈపదినామములు క్రమముగా అనాహత తరువాత మణిపురచక్రమును
స్పందింపజేయును. బ్రహ్మగ్రంథి విచ్ఛేదనకు తోడ్పడును.
93)సత్వవాన్ సాత్వికః సత్యః సత్యధర్మపరాయణః అభిప్రాయః ప్రియార్హః ప్రియకృత్
ప్రీతివర్ధనః
సత్వవాన్(అమితపరాక్రమీ)సాత్వికః(అమితసాత్వికుడు)సత్యః(సత్యము)సత్యధర్మపరాయణః(సత్యముధర్మమునకునివాసము)అభిప్రాయః(సాధకుల
లక్ష్యము) ప్రియార్హః(ప్రేమార్హుడు) ప్రియకృత్(ప్రేమదాత)ప్రీతివర్ధనః(ప్రీతిని
పెంపొందించేవాడు)
ఈఎనిమిదినామములు క్రమముగా అనాహత తరువాత మణిపురచక్రమును
స్పందింపజేయును. బ్రహ్మగ్రంథి విచ్ఛేదనకు తోడ్పడును.
94)విహాయసగతిః జ్యోతిః సురుచిః హుతభుక్ విభుః రవిః విరోచనః సూర్యః సవితా రవిలోచనః
విహాయసగతిః(ఆకాశమునందుసంచరించువాడు)జ్యోతిః(స్వయంప్రకాశీ)సురుచిః(మంచిఇచ్ఛ)హుతభుక్(ఆహుతులనుఆస్వాదించువాడు)విభుః(సర్వవ్యాపి)రవిః(రవి)విరోచనః(నానావిధప్రకాశము)సూర్యః(సూర్యుడు)సవితా(జగత్కారకుడు)రవిలోచనః(సూర్యుడేనేత్రములుగా
గలవాడు)
ఈపదినామములు అనాహతచక్రమును స్పందింపజేయును.
95)అనంతః హుతభుక్ భోక్తా సుఖదః నైకజః అగ్రజః అనిర్విణ్ణః సదామర్షీ లోకాధిష్టానం
అద్భుతః
అనంతః(అనంతుడు)హుతభుక్(ఆహుతులనుఆస్వాదించువాడు)భోక్తా(అనుభవించేవాడు)సుఖదః(ఆనందప్రదాత)
నైకజః(అనేకుడు)అగ్రజః(అన్నలకుఅన్న)అనిర్విణ్ణః(వ్యాకులరహితుడు)సదామర్షీ(నిత్యదయాళు)లోకాధిష్టానం(లోకకారకుడు)అద్భుతః(అద్భుతుడు)
ఈపదినామములు అనాహతచక్రమును స్పందింపజేయును.
96)సనాత్ సనాతనతమః కపిలః కపిః అవ్యయః స్వస్తిదః స్వస్తికృత్ స్వస్తి స్వస్తిభుక్
స్వస్తిదక్షిణః
సనాత్(నిత్యుడు)సనాతనతమః(మంచి
ఆశరీరుడు)కపిలః(సాంఖ్యులలోని కపిలుడు)కపిః(ఆవిరిచేయువాడు—సూర్యుడు)అవ్యయః(తరిగిపోనివాడు)
స్వస్తిదః(శుభాశీర్వచన ప్రదాత)స్వస్తికృత్(శుభకార్యప్రదాత) స్వస్తి(శుభము)
స్వస్తిభుక్(శుభనివాశి) స్వస్తిదక్షిణః((శుభప్రదాత)
ఈ పదినామములు క్రమముగా విశుద్ధ అనాహత తరువాత మణిపురచక్రమును
స్పందింపజేయును. బ్రహ్మగ్రంథి విచ్ఛేదనకు తోడ్పడును.
97)అరౌద్రః కుండలీ చక్రీ విక్రమీ ఊర్జితశాసనః శబ్దాతిగః శబ్దసహః శిశిరః శర్వరీకః
అరౌద్రః(దుర్గుణరహితుడు)కుండలీ(కుండలినీశక్తినిఅధీనములోనుంచుకున్నవాడు)చక్రీ(సహస్రారచక్రము)విక్రమీ(విక్రముడు)ఊర్జితశాసనః(వీరసైన్యాధ్యక్షుడు)శబ్దాతిగః(అనిర్వచనీయుడు)శబ్దసహః(వేదములలక్ష్యము)శిశిరః(ప్రాపంచికులకు
చల్లని శిశిరఋతువు)శర్వరీకః(చీకటి సృష్టికర్త)
ఈతొమ్మిదినామములు విశుద్ధచక్రమును స్పందింపజేయును.
98)అకౄరః పేశలః దక్షః దక్షిణః క్షమిణాంవరః విద్వత్తమః వీతభయః పుణ్యశ్రవణకీర్తనః
అకౄరః(కౄరరహితుడు)పేశలః(అమితమృదుశాలి)దక్షః(అమితనేర్పరితనము)దక్షిణః(దాత)క్షమిణాంవరః(అమితమయినఓర్పుగలవాడు)విద్వత్తమః(ఉత్తమజ్ఞానము)వీతభయః(భయరహితుడు)పుణ్యశ్రవణకీర్తనః(పుణ్యశ్రవణకీర్తనుడు)
ఈ ఎనిమిదినామములు క్రమముగా విశుద్ధ అనాహత తరువాత
మణిపురచక్రమును స్పందింపజేయును. బ్రహ్మగ్రంథి విచ్ఛేదనకు తోడ్పడును.
99)ఉత్తారణః దుష్కృతిహా పుణ్యః దుస్స్వప్ననాశనః వీరహా రక్షణః సంతః జీవనః
పర్యవస్థితః
ఉత్తారణః(రక్షకుడు)దుష్కృతిహా(పాపసంహారి)పుణ్యః(పుణ్యుడు)దుస్స్వప్ననాశనః(దుస్స్వప్ననాశకుడు)వీరహా(దుష్టసంహారి)రక్షణః(రక్షకుడు)సంతః(ధర్ముడు)జీవనః(మన
జీవితమూ పరమాత్మే)పర్యవస్థితః(సర్వవ్యాపి)
ఈతొమ్మిదినామములు క్రమముగా విశుద్ధ అనాహత తరువాత
మణిపురచక్రమును స్పందింపజేయును. బ్రహ్మగ్రంథి విచ్ఛేదనకు తోడ్పడును.
100) అనంతరూపః అనంతశ్రీ జితమన్యుః భయాపహః చతురస్రః గభీరాత్మా విదీశః వ్యాదిశః దిశః
అనంతరూపః(అనంతరూపుడు)అనంతశ్రీ(అనంతశక్తివంతుడు)జితమన్యుః(క్రోధమునుజయించినవాడు)
భయాపహః(సంసారభయమునుపారద్రోలువాడు)చతురస్రః(అద్భుతమయినన్యాయాధికారి)గభీరాత్మా(అంతులేని
లోతుగలవాడు)విదీశః(కర్మఫలమునొసగువాడు)వ్యాదిశః(అసమానసేనాని)దిశః(సద్గురు)
ఈతొమ్మిదినామములు క్రమముగా విశుద్ధచక్రమును తరువాత
ఆజ్ఞాచక్రమును స్పందింపజేయును. రుద్ర
విష్ణు గ్రంథి విచ్ఛేదనకు తోడ్పడును.
101)అనాదిఃభూర్భువః లక్ష్మీః సువీరః రుచిరాన్గదః జననః జనజన్మాదిః భీమః భీమపరాక్రమః
అనాదిః(ఆదిరహితుడు)భూర్భువః(క్రియాశక్తి)లక్ష్మీః(జగత్తుకిశక్తిప్రదాత)సువీరః(సువీరుడు)రుచిరాన్గదః(అద్భుతమైనఅంగుడు)జననః(జగత్పితా)జనజన్మాదిః((జీవకారకుడు)భీమః(భయంకరుడు)భీమపరాక్రమః(భయంకరపరాక్రమఃవంతుడు)
ఈతొమ్మిదినామములు క్రమముగా విశుద్ధచక్రమును తరువాత
ఆజ్ఞాచక్రమును స్పందింపజేయును. రుద్ర
విష్ణు గ్రంథి విచ్ఛేదనకు తోడ్పడును.
102)ఆధారనిలయః ధాతా పుష్పహాసః ప్రజాగరః ఊర్ధ్వగః సత్పథాచారః ప్రాణదః ప్రణవః పణః
ఆధారనిలయః(సర్వమునకుఆధారనిలయము)ధాతా(సర్వనియంత్రణశక్తి)పుష్పహాసః(పుష్పముమాదిరివికాసము)ప్రజాగరః(నిత్యజాగారూకుడు)ఊర్ధ్వగః(ఆరోహణుడు)సత్పథాచారః(సత్ప్రవర్తన)ప్రాణదః(ప్రాణప్రదాత)ప్రణవః(ఓంకారము)పణః(ఉత్తమ
కార్యాధికారి)
ఈతొమ్మిదినామములు క్రమముగా విశుద్ధచక్రమును తరువాత
ఆజ్ఞాచక్రమును స్పందింపజేయును. రుద్ర
విష్ణు గ్రంథి విచ్ఛేదనకు తోడ్పడును.
103) ప్రమాణం ప్రాణనిలయః ప్రాణభృత్ ప్రాణజీవనః తత్వం తత్వవిత్ ఏకాత్మా
జన్మమృత్యుజరాతిగః
ప్రమాణం(జ్ఞానమునకుమార్గము)ప్రాణనిలయః(ప్రాణమునకునిలయము)ప్రాణభృత్(ముఖ్యప్రాణనిలయము)ప్రాణజీవనః(ముఖ్యప్రాణము)తత్వం(అదిఆయనే)తత్వవిత్(సత్యజ్ఞాని)ఏకాత్మా(ఒకేఒకటి)జన్మమృత్యుజరాతిగః(జన్మమృత్యుజరాతీతుడు)
ఈఎనిమిదినామములు క్రమముగా విశుద్ధచక్రమును తరువాత
ఆజ్ఞాచక్రమును స్పందింపజేయును. రుద్ర
విష్ణు గ్రంథి విచ్ఛేదనకు తోడ్పడును.
104)భూర్భువఃస్వస్తరుః తారః సవితా ప్రపితామహః యజ్ఞః యజ్ఞపతిః యజ్వా యజ్ఞాంగః
యజ్ఞవాహనః
భూర్భువఃస్వస్తరుః(మూడులోకములకు
మూలవృక్షము)తారః(నిత్య తార)సవితా(నిత్యమయినజగత్పిత) ప్రపితామహః(తాత)యజ్ఞః(యజ్ఞము)యజ్ఞపతిః(యజ్ఞమునకుపతి)యజ్వా(యజ్ఞకర్త)యజ్ఞాంగః(యజ్ఞమునకు
అంగములు)యజ్ఞవాహనః(యజ్ఞపరిపూర్ణుడు)
ఈతొమ్మిదినామములు క్రమముగా విశుద్ధచక్రమును తరువాత
ఆజ్ఞాచక్రమును స్పందింపజేయును. రుద్ర
విష్ణు గ్రంథి విచ్ఛేదనకు తోడ్పడును.
105) యజ్ఞభృత్ యజ్ఞకృత్ యజ్ఞీ యజ్ఞభుక్ యజ్ఞసాధనః యజ్ఞాంతకృత్ యజ్ఞగుహ్యం అన్నం
అన్నాదః ఏవచ
యజ్ఞభృత్(యజ్ఞరక్షకుడు)యజ్ఞకృత్(యజ్ఞములనుసృష్టించినవాడు)యజ్ఞీ((యజ్ఞములనుఅనుభవించువాడు)
యజ్ఞభుక్((యజ్ఞములనుఆస్వాదించువాడు)యజ్ఞసాధనః((యజ్ఞములద్రవ్యములు)యజ్ఞాంతకృత్((యజ్ఞములను
చేయువాడు) యజ్ఞగుహ్యం((యజ్ఞములలోని రహస్యము)అన్నం (ఆహారము)అన్నాదః(అన్నభక్షకుడు)
ఏవచ
ఈతొమ్మిదినామములు క్రమముగా విశుద్ధచక్రమును తరువాత
ఆజ్ఞాచక్రమును స్పందింపజేయును. రుద్ర
విష్ణు గ్రంథి విచ్ఛేదనకు తోడ్పడును.
106)ఆత్మయోనిః స్వయంజాతః వైఖానః సామగాయనః దేవకీనందనః స్రష్టా క్షితీశః పాపనాశనః
ఆత్మయోనిః(ద్రవ్యకారణము)స్వయంజాతః(స్వయంభూ)వైఖానః(ఉత్తమోత్తమమార్గము—ఆత్మజ్ఞానము)
సామ గాయనః(సామవేదముపాడేవాడు)దేవకీనందనః(కృష్ణ)స్రష్టా(సృష్టికర్త)క్షితీశః(పృథ్వీ
భర్త)పాపనాశనః(సాధకుల పాపములను నాశనము చేయువాడు)
ఈఎనిమిదినామములు క్రమముగా విశుద్ధచక్రమును తరువాత
ఆజ్ఞాచక్రమును స్పందింపజేయును. రుద్ర
విష్ణు గ్రంథి విచ్ఛేదనకు తోడ్పడును.
107)శంఖభ్రుత్ నందకీ చక్రీ శామ్గధన్వా గదాధరః రథాన్గపాణిః అక్షోభ్యః
సర్వప్రహరణాయుధః
శంఖభ్రుత్(పాంచజన్యశంఖమునుధరించినవాడుపంచమహాభూతములతోసృష్టినిరచించువాడు)నందకీ(అజ్ఞాననాశకుడు)చక్రీ(సహస్రారచక్రమునుధరించినవాడు)శామ్గధన్వా(యోగమయమేరుదందమునుధరించినవాడు)గదాధరః(కౌమోదకీఅనేగదనుధరించినవాడు)రథాన్గపాణిః(యోగసాధనకుతగినశరీరముఅంగములుగలవాడు)అక్షోభ్యః(కలతనొందనివాడు)
సర్వప్రహరణాయుధః(సర్వమూ జయించగల ఆయుధములు గలవాడు)
ఈఎనిమిదినామములు క్రమముగా విశుద్ధచక్రమును తరువాత
ఆజ్ఞాచక్రమును స్పందింపజేయును. రుద్ర
విష్ణు గ్రంథి విచ్ఛేదనకు తోడ్పడును.
Jaiguru, the explanation is simple, crisp and clear.
ReplyDelete