క్రియయోగసాధన--వేదాంతం

క్రియయోగసాధన--వేదాంతం
రమాత్మపొందుకై మూగజంతువులను బలిఇవ్వవలసిన అవసరములేదు. బలులవలన నీలోనిమానవత్వముక్షీణించి క్రూరత్వముపెరుగును. ప్ర్రాణాయామపద్ధతులతొ సాధించ వచ్చు. సాధించాలి.ఈసాధనసశాస్త్రీయము. ఒకఇంజనీర్, ఒకడాక్టరు లేదా ఒకశాస్త్రవేత్త కావలయునన్న 15,20సంవత్సరముల కఠోరపఠనం అవసరముకదా. అదేవిధముగా ఆధ్యాత్మికసాధనకికూడా కొన్నిసంవత్సరముల కఠోరసాధన అవసరము. ఈఉపన్యాసము   లోనివిషయములు నాహృదయంలోనుండివచ్చినవి. సశాస్త్రీయమైనవిషయములు తేలికగాఉండేఉదాహరణలతోఉటంకించబడినవి. పరమాత్మనుఅర్థంచేసికొనటానికిఅర్థంగాని శ్లోకములు విజ్ఞాన లేదా పండిత ప్రకర్ష అనవసరము  ఒకరాయినితీసికొని 10వేల మారులు పెద్దదిగా ఊహించుకొనిచూస్తే పర్వతముఅగునంటె విద్యార్థికి అర్థముకాదు. పర్వతముదగ్గిరకితీసికెళ్ళి చూపించవలయును.  ఆధ్యాత్మవిద్యకూడా ఉద్రంథ పఠనముతో అర్థముకాదు.  సాధనచేసి ప్రత్యక్షముగా తెలుసుకొనవలయును.
ప్రాణాయామక్రియలు నియమముతప్పకచేస్తె cancer,diabetes,kidney,heart problems లాంటి అపాయకరరోగములు తప్పక ఉపశమించును. ఏస్వామివద్దకుపోనవసరములేదు.
శ్+లోక=శ్లోక.నీలోనిలోకములనునిశ్శబ్దపఱచు.నీకుపరమాత్మతప్పకదర్శనంఇస్తాడు.
ఎక్కువెక్కువపుస్తకాలుచదివితే నీలోని అహంకారం పెరుగుతుంది.
మామిడిపండు రుచిపుస్తకంలోచదివితేతెలుస్తుందా?కడుపునిండుతుందా?తినిఅర్థంచేసికో.
పరమాత్మవిషయమూఅంతే. సాధనచెయ్యి. ప్రసన్నంచేసికో.అర్థంచేసికో.  
శ్రీకృష్ణావతారము ---జన్మ వివరణ
శ్రీమహావిష్ణువుయొక్కఅవతారములలొశ్రీక్రిష్ణావతాముచాలాముఖ్యమైనది.శూరశేనుడుమధురాపట్టణమునకురాజు.ఆరాజుపుత్రుడువసుదేవుడు.వసుదేవునికిఇద్దరు
భార్యలు.ఒకభార్యదేవకి,ఇంకొకభార్యరోహిణి.భోజదేశపురాజుఉగ్రశేనుడు.ఉగ్రశేనుని కుమారుడుకంసుడు.కుమార్తెదేవకి.కంసుడుతనరథముపైదేవకిసుదేవులనుకూర్చుం డబెట్టుకొనివస్తుండగాఆకాశవాణిఇటులబలికెనుఓయీకంసా,నీసోదరిదేవకిగర్భమునపుట్టుఎనిమిదవశిశువునీమరణమునకుకారణమగును.అదివిన్నవెంటనెకంసుడు చెల్లెలుబావలనుచంపబోయెను.పుట్టినవెంటనెనాపిల్లలనునీకిచ్చెదనన్నవాగ్దానముపైదేవకివసుదేవులనిద్దరినీకారాగారమునబడవేసెను.ఆరుగురుశిశువులనునిర్దాక్షిణ్యముగావధించును.యోగమాయపరమాత్మఆదేశముతోదేవకిగర్భముననున్నపరమాత్మఅంశమైనఆదిశేషునితీసికొనివెళ్ళివ్రజదేశముననందుడిఇంటతలదాచుకున్నవసుదేవునిఇంకొకభార్యఅయినరోహిణికడుపునఉంచును.దేవకిఏడవగర్భమువిఛ్ఛిన్నమైనదనిఅందరుతలపోస్తారు.పరమాత్మస్వయముగదేవకిగర్భమునఎనిమిదవశిశువుగాజన్మించును.యోగమాయపరమాత్మఆదేశముతోస్వయముగనందుడికిభార్యఅయినయశోదగర్భమునజన్మించును.అటుపిమ్మటవసుదేవుడుపరమాత్మప్రేరణతోతనకుపుట్టినపుత్రునితీసుకొనియమునానదిదారిఇవ్వగావ్రజవెళ్ళితనపుత్రనియశోదపడకపైఉంచి,యశోదగర్భమునజన్మించినయోగమాయనుతీసుకొనివచ్చితనభార్యదేవకిపడకపైఉంచును.పిల్లఏడుపువినికంసుడుపరుగునవచ్చును.ఎనిమిదవగర్భమునఆడపిల్లపుట్టినది.నిన్నుచంపునదిఎనిమిదవగర్భమునపుట్టెమగబిడ్డ.కనుకఈపిల్లనుచంపవద్దనివేడుకున్ననూ,చెల్లెలుదేవకిమాటవినకచంపబోవును.ఆఎనిమిదవశిశువుయోగమాయనుచంపబోవఆబిడ్డపైకెగిరిఓకంసా,నిన్నుచంపుపరమాత్మఅయినశ్రీకృష్ణుడుఉదచెననిచెప్పెను.నందునిభార్యఅయినయశోదకుమారుడుగాపెరుగుతున్నశిశువుకుశ్రీకృష్ణుడుఅని,వసుదేవునిఇంకొకభార్యఅయినరోహిణికుమారుడుగాప్రస్తుతముపెరుగతున్నదేవకిగర్భాంసుడైనశేషునికిబలరాముడుఅనినామకరణముచేస్తాడునందుడు.ఆతరువాతశ్రీకృష్ణుడుపూతన(పూర్తీభవించినతనువుఅనగాతామసగుణప్రతీక)ను,శకటాసుర(చంచలమనస్సు),తృణావర్తుడు(తామసగుణప్రతీకుడు),మొదలగురాక్షసులనుపిన్నవయస్సులోనెసంహరించును.నందుడుపూర్వజన్మలోఒకవసువు.పేరుద్రోణ.అతనిభార్యధర(భూమిఅనిఅర్థము).ద్రోణుడువ్రజదేశమునందునందుడుగను,ధరయశోదగనుజన్మించిరి.శ్రీకృష్ణుడుశ్రావణబహుళఅష్టమినందుజన్మించెను.ఆ దినము జన్మాష్టమిగాప్రసిద్ధిగాంచినది. యమ నియమ ఆసన ప్రత్యాహార ప్రాణాయామ ధారణ ధ్యాన మరియు సమాధి అని అష్ట అంగములు కలదే యోగము.
శ్రీ కృష్ణ లీలలు  
పరమాత్మఅయినశ్రీకృష్ణుడుఅతిపిన్నవయసులోనేతనలీలావినొదములుచూపించెను .శ్రీకృష్ణునికిఆవుపాలు,పెరుగుమరియువెన్నయన్నచాలాఇష్టము.ఇవియోగికికావలసినస్వఛ్ఛతకిచిహ్నం.ఆవుపాలు,పెరుగుమరియు వెన్నత్రాగుతున్నశ్రీకృష్ణుని పెద్ద రోలుకికట్టటానికిత్రాడుతెస్తెఆత్రాడురెండుఅంగుళములుతగ్గటము,ఎన్నిసార్లుత్రాళ్ళు తెస్తెఅన్నిసారులుతగ్గటము,చివరికిఅలసినతల్లినిచూచిత్రాడుకట్టించుకోవటముఅనగాపరమాత్మభక్తవశుడనిచెప్పటమేకదా.ఆతరువాతనారదుడిశాపముపొంది మద్దిచెట్ల రూపములోనున్నగర్వాంధులైనకుబేరపుత్రులైననలకూబర మరియు మణిగ్రీవులను ఆరోలునిఆచెట్లమధ్యనుండిపోనిచ్చిపడగొట్టివారిశాపవిమోచనముగావిస్తాడు.అనగాపరమాత్మపొందుఎంతటిఅహంకారమునైనపోగొట్టుననుటకిదినిదర్శనము.అటులనెగోకులములోసుడిగాలిరూపములోవచ్చినవృత్రాసుర,బకాసురమరియుకొండసిలువ(అజగరము)రూపములోనిఅఘాసురసంహారములుగుణాలకిఅతీతుడవైమనస్సునుస్థిరముచేసికోవలయుననిచెప్పటమే.ఒకనాడుగోకులములోయమునానదితీరమునదూడలు,ఆవులు,గోపాలురుకనబడకుండాపోతేశ్రీకృష్ణుడుతనేఒకసంవత్సరముపాటుఅన్నివేషములుధరించితల్లులు,యజమానులకుఅనుమానముమరియుదుఃఖము రాకుండాచూడటముపరమాత్మయొక్కసర్వవ్యాపకస్థితినిమరియుపరమాత్మని నమ్ముకున్నవానికిఏదుఃఖముఉండదనితెలియజెప్పటము.కాళిందిమడుగులోనున్నకాళియసర్పమునుసంహరించబూనుట మనలోని,కామ,క్రోధ,లోభ,మోహ,మద, మరియుమాత్సర్యఅనేఅరిషడ్వర్గాలనెవిషమునుతీసివేస్తెమానవుడుదివ్యాత్మస్వరూపుడవుతాడనితెలియజెప్పటము. గోపిఅనేదిగోప్యములోనుండివచ్చినదిఅనగాఆలోచనఅనిఅర్థము.ప్రతిఆలోచనలో ఉండేచైతన్యమెకృష్ణచైతన్యము.గోపికావస్త్రాపహరణముయొక్కఉద్దేశ్యము.నీ ఆలోచ నంతానామీదనేఉండవలయుననిచెప్పటమే.యజ్ఞముచేయుచున్నబ్రాహ్మణులదగ్గిరకిఆకలిగాఉన్నగోపాలురనుఆహారముకొఱకైపంపుట,వారుతిరస్కరించుట,ఆతరువాతబ్రాహ్మణస్త్రీలుఆహారమునుతీసుకొనివచ్చిశ్రీకృష్ణునికిఅర్పించుటలోఉద్దేశ్యముక్రతువుయొక్కతంతుమీదకన్నక్రతువుఉద్దేశ్యమైనపరమాత్మమీదఏకాగ్రతఅవసరమనిచెప్పటమే.గోవర్ధనపర్వతమునుఏడురోజులుతనచిటికినవ్రేలుమీదనిలిపిఇంద్రుడు(మనస్సు)కురిపించినవర్షము(ఆలోచనల)నుండిగోపికలను,గోపాలురను,ఆవులనురక్షించుటసంసారబంధమునుత్రెంపుకొనిపరమాత్మబంధమునుపెంచుకొనుటఉత్తమమని చెప్పుటయే.కంసుడువ్రజకుపంపినకేశిఅనేరాక్షసుణ్ణిశ్రీకృష్ణుడుచంపుటతమోగుణమునుచంపుటకుప్రతీక.కేశిఅనగాజుట్టు.జుట్టుతమోగుణమునకుప్రతీక.భోజదేశపురాజయినకంసుడు శ్రీకృష్ణబలరాములను తెమ్మని తనమంత్రి అక్రూరుణ్ణి వ్రజ అనగాబృందా వనమునకుపంపుతాడు.దారిలోకంసుడిప్రోద్భలమువలనవచ్చిన ముష్టికుణ్ణి శ్రీబల రాముడు,చాణూరుణ్ణిశ్రీకృష్ణుడుసంహరిస్తారు. వీరిద్దరు మల్లయుద్ధప్రవీణులు. ఆ తరువాత కువలయాపీడుడు అనే మత్తగజమును శ్రీకృష్ణుడుసంహరించుట, ప్రాణాయామతత్పరుడియొక్క  ఆత్మబలమునుచాటటమే. కుబ్జ అనే కంసునిదాసీ శ్రీకృష్ణునిమీదభక్తిమరియుప్రేమతోగంధముపూలుఅర్పించగాశ్రీకృష్ణుడుకుబ్జయొక్కగూనితనమునుమరియుఅంగవైకల్యమునుపోగొట్టివివాహమాడుటపరమాత్మదయాళుత్వమునుతెలియజెప్పుతుంది.సాందీపమహర్షిశ్రీకృష్ణబలరాములగురువు.ప్రభాస క్షేత్రములోసముద్రములోకొట్టుకొనిపోయినగురుపుత్రుణ్ణితీసికొనివచ్చితిరిగిగురువైనసాందీపమహర్షికిగురుదక్షిణగాఅప్పగించుటగురువుయొక్కగొప్పతనమునుచాటిచెప్పటమే.కంసుడి భార్యలు అస్తి,మరియుప్రాప్తి. వారిరువురు కంసుని మరణానంతరము మగధరాజైనతనతండ్రిజరాసంధునివద్దకువెల్తారు.మధురపైశ్రీకృష్ణునిజంపుటకుజరాసంధుడు17మారులుదండెత్తిఓడిపోయిపారిపోతాడు.శ్రీకృష్ణుడుదయతోజంపకవదిలిపెడ్తాడు.శ్రీకృష్ణుడుసముద్రములోనగరమునునిర్మించియాదవులనుఅందులో,బలరామునిమధురాపురమునఉంచుతాడు.జరాసంధునిమితృడైనమహాబలవంతుడైనకాలయవనుడువెంటతరుమగాశ్రీకృష్ణుడుమాంధాతకుమారుడైనముచికుందుడుతపస్సుచేసియోగనిద్రలోఉన్నగుహలోప్రవేశించిదాక్కుంటాడు.ఆముచికుందుడ్నిశ్రీకృష్ణుడుగాతలంచికాలయవనుడుకాలితోతన్నగాఆముచికుందుడుయోగనిద్రనుండిమేల్కొనితనతీక్ష్ణమైననేత్రములతో కాలయవనునిచూడగా భస్మమగుట యోగమునకున్న శక్తినిచెప్పకనేచెప్తుంది.
గీతలోశ్రీకృష్ణునినామధేయములు  1)అచ్యుత..దేనితోనూత్రాకబడనివాడు,2)అనంత..అన్నిదిక్కులావ్యాపించినవాడు,3)అద్య...అందరికన్నామొదటవాడు,4)కేశినిషూదన..కేశిఅనేరాక్షసునిసంహరించినవాడుఅనగాతమోగుణసంహారకుడు.కేశములుతమోగుమునకుప్రతీక.5)కమలపత్రాక్ష..జ్ఞానమునకుప్రతీకుడు,6)గోవింద..జీవములకుఆధారము,7)అప్రతిమప్రభావ--అనంతశక్తివంతుడు,8)కృష్ణ..అందరినీఆకర్షించేవాడు,9)జగత్పతి..జగత్తుకుభర్త,10)అరిసూదన..అంతర్బహిర్శతృసంహరాకుడు,11)కేశవ..అంతర్బహిర్శతృవులనుశవములుగామార్చిపరమార్థతత్వముతెలుపువాడు,12)జగన్నివాస..జగత్తులోనుమరియుమనలొనూనివసించువాడు,13)జనార్దన..భక్తజనులనురక్షించువాడు,14)భూతభావన..భూతములలోనిప్రాణశక్తికారకుడు,15)వార్ష్ణేయ..వృష్ణిఅనేరాక్షసుణ్ణిసంహరించినవాడులేదాతమోగుణసంహారకుడు,16)దేవ..పరమాత్మ,17)భూతేశ..భూతములకుయజమాని,18)వాసుదేవ..వసుదేవుని,పుతృడు,19)దేవదేవ..దేవుళ్ళకేదేవుడు, 20)మధుసూదన..వాసనాసంహారకుడు,21)విశ్వమూర్తి..విశ్వమునకేమూర్తి, 22)దేవవర..దేవుళ్ళలోశ్రేష్ఠుడు,23)మహాత్మ..గొప్పఆత్మ,24)విశ్వేశ్వర..విశ్వానికిఈశ్వరుడు,25)దేవేశ..దేవుళ్ళకేయజమాని,26)మహాబాహు..మహాబలవంతుడు, 27)విష్ణు..పరమాత్మ..సర్వవ్యాప్తివంతుడు,28)పరమేశ్వర..పరమాత్మ,29)మాధవ..బుద్ధికిరాజు,30)సర్వ..సర్వముతానెఅయినవాడు,31)పురుషోత్తమ..పురుషులలో ఉత్తముడు,32)యాదవ..యదువంశీయుడు,33)సహస్రబాహు..మహాబలవంతుడు,34)ప్రభు..యజమాని,35),యోగి,36)హృషీకేశ,37)భగవంత..భక్తి,జ్ఞాన,వైరాగ్యమరియుతత్వజ్ఞానపరుడు,38)యోగీశ్వర..యోగులకేయోగి. 
యోగప్రదాత శ్రీకృష్ణ
ఇమంవివస్వతేయోగంప్రోక్తవానహమవ్యయంవివస్వాన్మనవేప్రాహమనురిక్ష్వాకవేబ్రవీత.             గీత--- 4---1
శ్రీకృష్ణుడు అర్జునితో ఇట్లనెను:
నాశరహితమగు ఈనిష్కామకర్మయోగమును అనగా జీవబ్రహ్మైక్యజ్ఞానమును పూర్వమునేనుఆత్మసూర్యునికిచప్పితిని.సూర్యుడుమనువునకుఅనగామనస్సునకుచెప్పెను.మనస్సుఇక్ష్వాకునకుఅనగామూడవనేత్రముకుబోధించెను.ఇక్ష్అనగా నేత్రము.నేత్రములనడుమనున్నప్రదేశమునుకూటస్థముఅందురు.ధ్యానపరుడైన యోగికిఆకూటస్థములోనున్నమూడవనేత్రముతెరుచుకొనును.తరువాతరాజర్షులు తెలిసికొనిరి.రాజర్షులుఅనగాఇంద్రియములు.చాలాకాలముగడచినందునఆయోగముఇపుడుప్రచారములోలేదు.అనగాపరమాత్మచైతన్యముముందుగాబ్రహ్మరంధ్రములోనిసహస్రారములోనికిచ్చును.దీనినేఆత్మసూర్యుడందురు.అక్కడనుండిఅంతఃకరణ లోనికి,అంతఃకరణనుండికూటస్థములోనిఆజ్ఞా(+)చక్రమునకు,ఆజ్ఞా(+)చక్రమునుండిఆజ్ఞా(+)చక్రములోమూడవనేత్రమునకు,మూడవనేత్రమునుండిఇంద్రియములలోనికివచ్చును.తద్వారాశరీరమంతటనూవ్యాపించును.అందువలనమాయాపూరితమైనఈ ప్రాపంచికవిషయములలోబడి పరమాత్మచైతన్యమును మఱచిపోవుటజరిగి కష్టములుఅనుభవించినతదుపరితిరిగిసద్గురువుద్వారాయోగమునేర్చుకొని వచ్చిన త్రోవనేతిరిగివెళ్ళిపరమాత్మనుచేరేప్రయత్నమేఈసాధన.ఈసాధనలోముందుగాఇంద్రియవ్యాపారములనునియంత్రించి,ప్రాణాయామపద్ధతులద్వారాచంచలప్రాణమును మరియుచంచలమనస్సునుస్థిరముచేస్తాము.తద్వారాఆజ్ఞా(+)చక్రములోనిమూడవనేత్రముతెరుచుకొనును.ఆతదుపరిపట్టువిడవనినిరంతరధ్యానముద్వారాసహస్రారములోనిఆత్మసూర్యునిచేరుతాము.ఆతరువాతబ్రహ్మరంధ్రముద్వారాపరమాత్మచైతన్యములోకలిసిపోతాము.దీనినేజీవబ్రహ్మైక్యతందురు.దీనినిశ్రీకృష్ణపరమాత్మఅనేక ప్రాణాయామ యజ్ఞములద్వారా శ్రీమద్భగవద్గీతలో తెలియచెప్పారు.
శ్రీకృష్ణునిఅవతారకాలము125సం.7మాసముల,8దినములు. గీతబోధించుసమయమునశ్రీకృష్ణునివయస్సు87సంవత్సరములు. అర్జునవిషాద,సాంఖ్య,కర్మ,జ్ఞాన,కర్మసన్యాసమరియుఆత్మసంయమయోగములు, కర్మషట్కముఅనగాశ్రవణము. విజ్ఞాన,అక్షరపరబ్రహ్మ,రాజవిద్యారాజగుహ్య,విభూతి,విశ్వరూపసందర్శనమరియు భక్తియోగములు,భక్తిషట్కముఅనగామననము. క్షేత్రక్షేత్రజ్ఞవిభాగ,గుణత్రయవిభాగ,పురుషోత్తమప్రాప్తి,దైవాసురసంపద్విభాగ,శ్రద్ధాత్రయవిభాగమరియుమోక్షసన్యాసయోగములు  జ్ఞానషట్కముఅనగానిధిధ్యాసనము.
ఆధ్యాత్మికత-------ఆధునికవైజ్ఞానికశాస్త్రము
ఆత్మ కార్యకారణనియతికి లొంగియుంటుందనే వాదన మానవుని వ్యక్తిత్వపు లోతులను తరచిచూచుటలో విఫలమై ఆవ్యక్తిత్వాన్ని వంకరగామలచి ,మానవ జీవితపువిలువలనితగ్గిస్తుంది.ఈపరిస్థితిలోమానవునిబుద్ధి,చిత్తంఎదురుతిరుగుతవి.మానవుడుతుఫానులోసాగరకెరటాలపైగతికానకకొట్టుకొనుచుండుచిన్నదోనెయా? నురుగులనువెలిగ్రక్కుచుపొంగిపొరలివచ్చుకెరటాలచేఈక్షణంమీదకిఎత్తబడుచుమరుక్షణం అగాధంలోకి  విసిరికొట్టబడుచుండు చిన్నపడవయా? అనివార్యమయి సదా విజృంభించు కార్యకారణప్రవాహంలో పుణ్యపాపకర్మాధీనమై, శక్తిహీనమై నిస్సహాయమై, అనాథయై అటునిటుఊగిసలాడు నావయా? వితంతవుల కన్నీటిని అనాథశిశువులవిలాపాలను గమనింపక తనదారిలోని ప్రతివస్తువును చూర్ణంచేస్తూ పరిభ్రమించు కార్యకారణచక్రంక్రింద పడవేయబడిన క్షుద్రకీటకమా? తలంచుకొన్ననే గుండెఝల్లుమనుప్రకృతినియమం ఇట్లున్నది. నిరాశాహతహృదయాంతరాళనుండి ఆశలేదా?తరుణోపాయములేదా?”అనుఆక్రందనఆకరుణాపయోనిధికివినబడినది.తోడనేఆశాజనకఅభయవాక్కుఅవతరించినది.దానిచేప్రేరితుడైనఒకవేదర్షివిశ్వంఎదుటనిలచిజలదగంభీరస్వరంతోఇట్లుచాటెను.వినండి,దివ్యలోకనివాసులగుఅమృతపుతృలారా!అజ్ఞానాంధకారానికిఆవలవెలుగొందుపరమపురుషుని కనుగొన్నాను. వానిని కనుగొనుటవలననేమీరుమృత్యువునుండి తరించెదరు.  వేరుమార్గంలేదు. అత్మ నిత్యముక్తమనీకార్యాకారణజాలంలోచిక్కుకొనియుండలేదనివ్యావహారికజగత్తులో బంధింపబడలేదనీమనమహర్షులుకనుగొన్నారు.-----స్వామివివేకానంద  జీవితమనేనదికిరెండుగట్లు.1)శ్రద్ధవాన్లభతేజ్ఞానంఅనగాశ్రద్ధగలవాడజ్ఞానవంతుడగు ను,2)సంశయాత్మావినశ్యతిఅనగాఅనుమానస్తుడునాశముచెందును………గీత                                                        సత్సంగత్వేనిస్సంగత్వంనిస్సంగత్వేనిర్మోహత్వం నిర్మోహత్వేనిశ్చలతత్వంనిశ్చలతత్వేజీవన్ముక్తిః-----ఆదిశంకరాచార్య                                                         జీవితమొకఛాలెంజ్,ఎదుర్కొను,జీవితమొకఆట,ఆడు,జీవితమంటేప్రేమ,ఆనందించు,జీవితమొకస్వప్నము,అర్ధంచేసుకో.సద్గురువునిఅనుసరించు,శతృవునుఎదుర్కొ,ఆఖరివఱకుపోరాడు,ఆటపూర్తిచెయ్యి--సత్యశాయిబాబా                                                             
గతజన్మలలోనికోట్లకొలదివాసనలుమానవకపాళములోఅనగాసూక్ష్మశరీరములో పొందుపరచబడిఉంటాయి.యోగసమాధిద్వారానేఈవాసనలుసమూలముగానాశనముచేయబడతాయి.యోగసమాధిచెందినయోగితనచుట్టూఉన్నవాళ్ళకికూడామేలు చేకూరుస్తాడు.యోగిధ్యానములోఅధిచేతనాస్థితికిఅనగా తీటా(theeta) తరంగస్థితికి వెల్తాడు. ఈతీటాతరంగస్థితివలన నరములకు మామూలుకన్నా తక్కువ గ్లూకోజ్ ఖర్చుఅవుతుంది.దివ్యత్వముపొందిదివ్యుడుగామారటమేసాధకునిలక్ష్యము. బాహ్యమైనవిషయములకుస్పందించునదిబుర్ర.అంతర్గతవిషయములకుస్పందించునదిమనస్సు:అందువలనమనముఅంతర్ముఖత్వముచెందిమనదృష్టినిలోపలికి మరల్చుతేఅంతాదివ్యత్వమే.
మానవతలలోనిభాగాల్లోచేతనాకేంద్రము(centre of consciousness) మరియు స్వేచ్ఛాపూరకపద్ధతికిఆలవాలము(VoluntaryProcess)అయినదిపెద్దమెదడు (cerebrum). సమన్వయకేంద్రము(coordinatingCentre)అయినది చిన్నమెదడు (Cerebellum).ఈరెండూఅతిముఖ్యమైనవి.సరైనదృక్పథంఉన్నంతకాలము సమన్వయకేంద్రమయినచిన్నమెదడుఏమాత్రంసందేహములేకుండాపెద్దమెదడుతోపాటుకలిసిపనిచేసిశాంతిప్రశాంతికలగచేయుటకుదోహదపడుతుంది.వ్యతిరేకదృక్పథంఉన్నంతకాలముసమన్వయకేంద్రమయినచిన్నమెదడుసందేహముతోపెద్దమెదడుతోపాటుకలిసిపనిచేయలేదు.అందువలనమనిషిమానసికతడబాటుతోతప్పులుచేస్తూఉంటాడు.  లోభము,ద్వేషము,పిసినారితనములతోకొట్టుమిట్టాడుతుంటాడు. అందు మూలకముగా అబద్ధాలుచెప్పటము మనఅవచేతనములో నిక్షిప్తమైఉంటాయి.   పరిపూర్ణమైన దైవీప్రకృతిఏర్పడుతున్నపుడు సాధకుడికి ఓంకారనాదము విన బడతూఉంటుంది.దీనిఅర్థం కుండలినీజాగ్రతలేదామేల్కొనటము జరుగుతున్నదని అర్థము. 
బుర్రలోని డైఎన్సెఫెలానుద్వారా మేల్కొన్నకుండలిని త్వరిత పెట్టబడుతుంది. బుర్రలోని మొదటిదైనపెద్దమెదడు మరియు పినియల్(Pineal)గ్రంథి అధిచేతనకి    లేదా ఆధ్యాత్మికతత్వానికిఆలవాలము.ఈ పినియల్(Pineal)గ్రంథి 7వ సంవత్సరమునుండిఎండిపోవటముమొదలగుతుంది.అందుమూలకముగానిర్మాణాత్మకదృక్పథముక్రమక్రమముగానశించిపోతుంది.బుర్రలోనితరువాతదయిన లింబిక్ అనేది మానసికకేంద్రము, సూక్ష్మశరీరము లేదా ఆదిదైవిక కేంద్రము. హైపోథెల్మస్(Hypothelmus)గ్రంథి ఆదిదైవికకేంద్రమునకు ఆలవాలము. ఈ హైపోథెల్మస్(Hypothelmus)గ్రంథికంటివెనకాలఉండేపిట్యుటరీగ్రంథికిపినియల్ గ్రంథికిమధ్యలోఉంటుంది. పిట్యుటరీగ్రంథికూటస్థములోకంటివెనకాలఆజ్ఞాచక్రములొఉంటుంది. పిట్యుటరీగ్రంథిఆదిభౌతికకేంద్రము.ఈఆజ్ఞాచక్రముస్థూలశరీరమునకుఅవసరమైన సూచనలుఇస్తూఉంటుంది.       
చిన్నమెదడుఆదిభౌతికమరియుఆధ్యాత్మికతత్వములసమన్వయకర్త. నిర్మాణాత్మకతఊహలపెరుగుదలకు పినియలుగ్రంథిని ఉత్తేజపఱచుట తప్పనిసరి. పినియల్(Pineal)గ్రంథిని ఉత్తేజపఱచుటకు కూటస్థములోని మూడవకన్నును ఉత్తేజపఱచుటఅవసరము.దీనికిక్రియాయోగముమరియుగాయత్రిమంత్రోపాసనఅవసరము.కూటస్థములోనిమూడవకన్నునుఉత్తేజపఱచుటద్వారామానసికంగామరియుభౌతికంగామనిషిఆరోగ్యముగాఉంటాడు. మెలటోనియమ్అనేరసాయనముసుఖనిద్రకుఅవసరము..ఈమెలటోనియమురోజుకుఒకటిన్నరగంటఉత్తేజితంగాఉంటేచాలు. సుఖనిద్రపడుతుంది. దీనిని పినియల్ (Pineal)గ్రంథి నియంత్రిస్తూఉంటుది. కాని ఈగ్రంథి హరించుకుపోతూ ఉండటము వలనమనకిసుఖనిద్రకఱవుఅవుతూఉంటుంది.కూటస్థములోఉన్నఆజ్ఞాచక్రము(+)కంటివెనకాలఉన్న పిట్యుటరీ(Pituitarygland)గ్రంథిద్వారా తనసూచనలను ఆజ్ఞాచక్రము(-)నకు తద్వారాఇతరఎండోక్రినుగ్రంథులకుపంపుతుంది. అనగా నాభి(మణిపుర)లోనిఅడ్రినలీనుగ్రంథికి,హృదయం(అనాహత) లోని థైమసుగ్రంథికి, గొంతు(విశుద్ధ) లోని థైరాయిడుగ్రంథికి సూచనలను పంపుతూఉంటుంది. యోగాభ్యాసముద్వారామరియుఆరోగ్యమైనఅలవాట్లద్వారాచక్రములనుఉత్తేజపఱచుటమనిషికిఅవసరము.
ఉదాహరణకి ఉదయము నిద్రలేవగానె దొడ్డికివెళ్ళి దంతధావనము చేసి గోరువెచ్చనినీళ్ళతో స్నానముచేసి సూర్యనమస్కారములుచేస్తే మూలాధార చక్రము తద్వారా దానిసంబంధితఅవయవములు చక్కగా పని చేయును. న్యాయముగఆర్జించినధనముతో మితభోజనముచేస్తే స్వాధిస్ఠానము దానిసంబంధిత అవయవములుచక్కగాపనిచేయును.
పూలు,ఫలములు,ప్రకృతిలోనుపరమాత్మనుదర్శిస్తెమణిపురచక్రముదానిసంబంధితఅవయవములుచక్కగాపనిచేయును. సత్యముమాట్లాడితేఅనాహతచక్రముదానిసంబంధితఅవయవములుచక్కగాపనిచేయును. భజనలు,మృదువైనశాస్త్రీయసంగీతముమరియుఓంకారమువినుటకుప్రయత్నిస్తె విశుద్ధచక్రముదానిసంబంధితఅవయవములుచక్కగాపనిచేయును. ఓంకారమువినబడితేకుండలినిమేలుకొన్నట్లులెక్క. గుండెలోనిథైమసుగ్రంథిసరిగాపనిచేయుటకుయోగాభ్యాసముచాలాఅవసరము. యోగాభ్యాసముద్వారా రక్తప్రసరణ వృద్ధిచెందును. శరీరములోని ప్రతి రక్త కణమునకు ప్రాణవాయువు అందుతుంది. అప్పుడు సింఫథటికు మరియు పారాసింఫథటికు నరములు సమన్వయపద్ధతిలో నడచుకుంటాయి. బుర్రనుండివచ్చేమూడురకములైన న్యూరోహార్మోనులవలననే వాత(పిత్తులు) పిత్త(ఉష్ణము)మరియుశ్లేష్మము(కళ్ళె)పద్ధతులుఏర్పడును.ఆరొగ్యకరమైనశరీరమునకురోగనిరోధకశక్తి,మిటొఖోండ్రియామరియు వాత పిత్త శ్లేష్మముల సమన్వయము అవసరము.
మిటొఖోండ్రియాఅనగాశక్తినిపుట్టించేవి. శ్వాసపద్ధతిసరిగాలేనియడల రక్తములోని బొగ్గుపులుసువాయువును తీసివేసి ప్రాణవాయువును కలిపెడిగుణము ఊపిరితిత్తులలో తగ్గును. ఇదినిమిషమునకు 15సార్లుజరుగవలయును. దీనినే    పల్స్(Pulse rate)రేట్అందురు. కనుకరోగము చోటుచేసికొనును.   200 సంవత్సరముల క్రితము ప్రకృతిలో35%ఉన్నప్రాణవాయువు ప్రస్తుతము19% మాత్రమె ఉన్నది.కనుకప్రాణాయామము మిక్కిలి అవసరము. అంతఃకుంభకము ద్వారా పల్సురేటునుపెంచుకొనవచ్చును. బాహ్యకుంభకముద్వారాపల్సురేటును తగ్గించుకొనవచ్చును.ఈఅంతఃబాహ్యకుంభకములద్వారాఅటానమస్ నరముల (autonomous nerves) మీదపట్టు, రోగనిరోధకశక్తి తద్వారా ఆరోగ్యము కలగ చేసేగుణము ఈప్రాణాయామమునకుఉన్నది. ఓంకారనాదాన్నివినగలిగిన సాధకుడు రోగగ్రస్తమైనభాగములనుతిరిగిఆరోగ్యవంతముగాచేసికోగలుగుతాడు.కుండలినీశక్తిని తద్వారాప్రాణశక్తినిపెంచుకొనిఆనందముగాఉండగలుగుతాడు. సాధారణముగాయోగితనప్రశ్నలన్నిటికీసమాధిస్థితిలోసమాధానముకనుగొంటాడు. ఇదితర్కానికిఅతీతము.  దీనినే ఆత్మబోధ అంటారు.మనము ఎన్నోజన్మలనుండి కూడగట్టుకున్నవాసనలుతీసివేయటానికిపదిలక్షలసంవత్సరములఆరోగ్యకరమైన జీవితముఅవసరము.అప్పుడేమానవపశువునుండిమానవుడుగానూ,మానవుడినుండిదివ్యుడుగానూ,దివ్యుడినుండిపరమాత్మగానూ మారగలడు. ఇది కేవలము పాతంజలిమహర్షిఅష్టాంగయోగముద్వారానే సుసాధ్యము. చదువురానివాడు తన మేథని5%వఱకు,విద్యావేత్త8%వఱకు,యోగిమిగిలిన92%తోపాటుమొత్తము100%మేథనిఅష్టాంగయోగముద్వారావినియోగిస్తాడు.కనుకధ్యానములోఉన్నఉపయోగములనుమానవాళికిఅర్థమయ్యేలాచెప్పటముయోగివిధి. వినకపోవటము,వినినాచేయకపోవటమువాళ్ళవాళ్ళఖర్మ.పరిమితమైనప్రపంచములోఅపరిమితమైనసుఖముకోసరమువెదుకులాట ఎండమావులలొని నీటికోసరము వెదకులాటలాంటిది. కేవలము యోగిమాత్రమే ధ్యానములో అపరిమితానందమును అనుభవించగలుగుతాడు. కనుకజడత్వమునుండిదివ్యత్వమునకు సాగిపోవుటకు మూలాధారచక్రములో సుషుప్తమైఉన్న  కుండలినీశక్తిని జాగృతిచేసి సహస్రారమునకు మళ్ళించాలి.
సూర్యనాడి--చంద్రనాడి చంద్రనాడిఎడమముక్కులోనూ,సూర్యనాడికుడిముక్కులోనూఉండును.ఈనాడులనేస్వరములుఅనికూడాఅందురు.ఆది,మంగళ,గురు(కృష్ణపక్షము)మరియుశని(ఉదయము))వారములలోసూర్యనాడి,సోమ,బుధ,గురు(శుక్లపక్షము),శుక్రమరియుశని(రాత్రి)వారములలో చంద్రనాడి ఉండటముయుక్తము. లేనియడల వ్యతిరేక ఫలితములు అనగాగృహకలహములు,కార్యహాని,వ్యర్ధప్రయాణములు మరియు అనారోగ్యములు కలగవచ్చును. యోగదండము ఎడమచంకలో పెట్టుకొని గట్టిగావత్తితే లేదా చదునైనబల్లమీద లేదా నేలమీద ఎడమచేతిమీద పడుకున్నను కూడా కుడిముక్కునకు స్వరము/నాడిమారును. అనగా చంద్రనాడినుండి సూర్యనాడికి స్వరముమారును. అదేవిధముగా యోగదండము కుడిచంకలోపెట్టుకొని గట్టిగావత్తితేలేదా చదునైనబల్లమీద లేదా నేలమీదకుడిచేతిమీదపడుకున్ననుకూడా ఎడమముక్కునకు స్వరము/నాడిమారును. అనగా సూర్యనాడినుండిచంద్రనాడికి స్వరముమారును.వ్యష్టిలోనికుండలినీశక్తినిసమిష్టిలోమాయ అందురు. ఋషులు కుండలినీశక్తి ఈ సృష్టి స్థితి లయలకు కారణమనికనిపెట్టారు. ప్రతి చరాచర అణువులోనూఈశక్తిఉన్నది. 
ప్రతిజీవకణములోనూ ప్రాణశక్తి జెనెసు(genes)రూపములోనిక్షిప్తమైఉన్నది.ఈ జెనె క్రోమోజోమ్లో(chromosome)ఉన్నది.ప్రాణశక్తికలిగిన జెనెసు వంశపారంపర్యముగా వచ్చే లక్షణములనుమోసే వాహికలు. ఈక్రోమోజోములో DNAఅనేమాలిక్యూలు (molecule)అతిముఖ్యమైనది.ఈఅతిముఖ్యమైన డి ఎన్ ఎ. లో ఉండే ఆరురకాలఆమ్లములను సమన్వయపరిస్తే వ్యాధి,ముసలితనములనుండి విముక్తులముఅవ్వచ్చు. మనుష్యులందరిలోనూ 99.9%జెనెస్ఒకేరీతిలోఉంటాయి.ఈమిగిలిన 0.01% వైవిధ్యమైనజెనెస్ వలననే వివిధరకములైన లక్షణములుకలిగినవ్యక్తులపుట్టుకకుకారణము.
క్రియాయోగము                                           
దైనందిన కార్యక్రమములకు దాదాపు 40వేల ప్రొటీన్స్ అవసరము. ప్రొటీన్సు వృద్ధిచేసికొని తద్వారా వ్యాధి,ముసలితనములను త్వరగా దగ్గిరకి చేరనీయకుండా క్రియాయోగము సహాయపడుతుంది. జీవకణములకు వాటిసంబంధిత కాలేయము (liver) లేదా ఊపిరితిత్తులు(lungs)లాంటి అవయవములకు సమన్వయత లోపించడమే రోగములకు కారణము.  జెనెసుమాత్రమేవీటిని తిరిగి ఆరొగ్యవంతము చేయగలవు. అవసరముమేరకు ఈజెనెసుకి కావలిసిన ప్రేరణని ఇవ్వటము ఇవ్వకపోవటము తద్వారా రోగగ్రస్థ జీవకణములకు వాటిసంబంధితకాలేయము లేదా ఊపిరితిత్తులు లాంటి అవయవములకు సమన్వయత కలగచేయటము యోగాద్వారాసుసాధ్యము.
హైడ్రొజెనుబాంబు అనేది ఫ్యూజను(fusion)అనే పద్ధతిమీద ఆధారపడి చేసినది. బాహ్యకుంభకము హైడ్రొజెను(Hydrozen)బాంబు అనగా ఫ్యూజను లాంటిది. రోగగ్రస్థజీవకణములను బాహ్యకుంభకముద్వారా తగ్గించవచ్చు. ఫ్యూజను (హైడ్రొజెనుబాంబు)అనగాబాహ్యకుంభకములోజీవకణమునుబయటనేవదిలిశక్తిపుట్టించబడుతుంది.  
ఆటంబాంబు(Atom bomb)అనేది ఫిజను(fision) అనే పద్ధతిమీద ఆధారపడి చేసినది. అంతఃకుంభకము ఆటంబాంబు అనగాఫిజనులాంటిది. ఆరోగ్యమైన జీవకణములను అంతఃకుంభకముద్వారా వృద్ధిచేయవచ్చు.   ఫిజను (ఆటంబాంబ్)అనగా అంతఃకుంభకముతో జీవకణమును కూటస్థములోని ఆజ్ఞా(+) చక్రములోకుదించి శక్తిపుట్టించబడుతుంది. 
ప్రతిజీవకణము మనిషిప్రతిరూపమే. ప్రతిజీవకణములోపల జెనె, జెనెలోపల క్రోమొజోమ్, క్రోమొజోమ్ లోపల డి ఎన్ ఎ ఉంటుంది.  డి ఎన్ ఎ మాలిక్యూల్  జీవకణము లోఅతిముఖ్యమైనది. ప్రతిజీవకణముకూడా పోషకపదార్థములను, జెనెసుమరియు యనజైమ్సు(enzymes) మొదలగు వాటిని నిర్మించగలదు. జెనెసు వంశపారంపర్యలక్షణములనుతెలియచెప్తుంది.హార్మోన్సు(Harmones)అనేవిఈజెనేసుకిఅవసరమైనప్రేరణకలగచేసి,శరీరఆరోగ్యమునకుదోహదపడతాయి.వేలసంఖ్యలో ఉన్న వ్యాధికారకమైన జెనెసులో కేవలము కొన్ని మాత్రమె కనుగొనటమైనది ఇప్పటికి. మిగిలిన వ్యాధికారకమైన జెనెసును కనుగొనటకు చాలాసమయము పట్టవచ్చు. క్రియాయోగాభ్యాసములోనిచక్రధ్యానము,చక్రములోబీజాక్షరధ్యానము,  మొదలగువాటిద్వారా నిత్యము శరీరమునకు కావలిసిన 40-50వేల పోషక పదార్థములనువృద్ధిచేసికొనిచిరకాలముఆరోగ్యముగా,ఆనందముగా,నిత్యయౌవ్వనములో ఉండవచ్చు.   ఇంద్రియములను అవసరానికిమించి ఉపయోగించటము ద్వారా జీవకణములో ఉండే తియ్యటిసోమరసమును మనిషి అనుభవించ జాలడు.  ప్రతిజీవకణములోనూ ఆరు ఆమ్లములు (Deoxy adenylic, guanylic, Ribosy & cytedylic acids, thymidylic & phosphoric acids) మరియు తియ్యదనము అనేవిఉంటాయి.చక్రములలో ఓంకారధ్యానముచేస్తూ చివరికి సహస్రారములో ఓంకారధ్యానముతో ఖేచరీలో స్థిరపడుయోగికి ఆ తియ్యదనము అనగా సోమరస అనుభూతి తప్పకపొందుతాడు. ఈసోమరసము సూక్ష్మముద్వారా భౌతికశరీరము లోనికి ప్రవేశించి ఆధ్యాత్మికఆనందముతోపాటు మానసిక మరియు భౌతికఆరోగ్య ఆనందములను కలగచేస్తుంది. ఇడానాడిని గంగ, పింగళని యమున, సుషుమ్నని సరస్వతిఅంటారు.ఈమూడునాడులుఆజ్ఞాచక్రముదగ్గిరకలవటమేత్రివేణీసంగమము.అటుపిమ్మట ఆజ్ఞాచక్రములోని జీవాత్మ లేక ప్రాణశక్తి లేక కుండలినీశక్తి బ్రహ్మరంధ్రములోని పరమాత్మను కేవలము సుషుమ్నద్వారా చేరుకోవటమే సమాధిస్థితి. 
కూటస్థములోని ఆజ్ఞా(+)చక్రమువఱకు పూరకముచేసి అనగా శ్వాసనిపీల్చి, ఆపీల్చినశ్వాసని మూలాధారచక్రముద్వారా పూర్తిగా రేచకముచేసి వదిలివేస్తే విద్యుదయస్కాంత శక్తి పుడుతుంది. ఈశ్వరప్రణిధామమునకు అనగా పరిపూర్ణముగా అంకితమగుటకు అర్థింపునకు లేదా ప్రార్థనకు ఇంద్రియములు, ఇంద్రియములకు సహాయముగాప్రాణములను ఇడ,పింగళమరియుసుషుమ్నలను అభిషెకపునీరుగా, అంతఃకరణనుదీపముగా, ఆరుచక్రములనుపూవులుగా, అగ్ని తత్వము(మణిపురచక్రము)ను సుగంధము(అగర్బత్తి)గా, ఆనందమును నైవేద్యముగా అర్పించవలయును.
చక్రధ్యానము చేయుటవలన మూలాధారములోని  కౄరత్వము,ద్వేషము, దొంగతనము, స్వాధిష్ఠానములోని సందేహపూరితమనస్సు, మణిపురలోని కౄరత్వము,ద్వేషము,ఎదుటివాడికంటెఎలాగైనాగొప్పగాఉండాలనేఅర్థరహితపట్టుదల,అనాహతలోని ఉద్వేగపూరితమైనమనస్సు,తనమతమెగొప్పదన్నభావన,ప్రతీకార వాంఛ,విశుద్ధలోనిలోభత్వము,అతివాగుడు మరియు ఆజ్ఞాలోని అహంభావము, తొందరపాటుగుణములు తొలిగిపోవును.
తపఃస్వాధ్యాయేశ్వరప్రణిధానానిక్రియాయోగః- జీవబ్రహ్మైక్యజ్ఞానమునకప్రతీకపతంజలి.శరీరవ్యాయామముమనోనిగ్రహముమరియు,ఓంకారధ్యానముకలిపిక్రియాయోగముఅనిపైశ్లోకమునకుఅర్థము.......పతంజలి                        
చేతులతోపరమాత్మకి అంజలిఘటిస్తూఉంటే ఆతండ్రికి పుట్టినవాడు పతంజలి అనిచెప్తారు. అనగా తపము, ఉద్గ్రంధపఠనము మరియు ఈశ్వరప్రణిధానము లేదా అనన్యభక్తి అనే క్రియాయోగమువలన పుట్టేవాడేపతంజలి. కర్మఫలములను ఈశ్వరునికిఅర్పించుటయేఈశ్వరప్రణిధానము.  
క్రియాయోగము ఒకభౌతికమానసికవిధానము. క్రియాయోగాభ్యాసమువలన సాధకునిశరీరములోని రక్తము కర్బనమునుకోల్పోయి ప్రాణశక్తితోశక్తివంతమగును. బుర్రలోనిజీవకణములు ధనధృవములు. మిగిలినశరీరమంతటిలోని జీవకణములు ఋణధృవములు.ప్రాణశక్తితోశక్తివంతమయినరక్తములో జీవకణనాశనముతగ్గును. తద్వారాహృదయమునకుపనితగ్గివిశ్రాంతిదొరుకుతుంది.  రాజయోగములోశ్వాసదిగ్బంధనకుప్రాముఖ్యతఎక్కువ. అదేక్రియాయోగములో శ్వాసనియంత్రణేకాక మేరుదండము(వెన్నెముక)ను అయస్కాంతీకరణముచేసి తద్వారా ప్రాణశక్తిని సహస్రారమునకుచేర్చటమునకు ప్రాముఖ్యతఇవ్వటంద్వారా బుర్ర, బుర్రలోనినరములకు విశ్రాంతి మరియు శక్తిచేకూరుతుంది. శ్వాసకి జాగృతిలేదు.శక్తిమాత్రమేఉన్నది.   ప్రాణశక్తికిజాగృతిమరియుశక్తిరెండూఉన్నవి.
తస్యవాచకఃప్రణవః.....పతంజలి...1...27 ధ్యానములోవినిపించేఓంకారనాదమేభగవంతునినామధేయము..
తస్మిన్సతిశ్వాసప్రశ్వాసయోఃగతివిచ్ఛేదఃప్రాణాయామః  పతంజలి.......249        ఆసనసిద్ధితదుపరిఉఛ్వాస నిశ్వాసాల గతినిరోధమైన ప్రాణాయామం సిద్ధిస్తుంది.  అనగా ముక్తినిస్తుంది. సాధకుడికితనసాధనద్వారా ఓంకారం వినగలుగుతాడు. తద్వారా దివ్యక్షేత్రాలతో అనుబంధంఏర్పడుతుంది.
సవికల్పసమాధిస్థితిలోచేతన విశ్వాత్మలో లీనమగుతున్న అనుభవంతోపాటు ప్రాణశక్తి ఉపసంహరించబడుట, శరీరంబిగుసుకుపోవుట అంతాతెలుస్తూనేఉంటుంది. నిర్వికల్పసమాధిస్థితిలో విశ్వాత్మలో లీనమగుతున్నఅనుభవమేకాక సాధారణ లౌకికవ్యవహారములుచేస్తున్నాఆఅనుభవమునుపోగొట్టుకోడు.  మూలాధారమునుండి కూటస్థములోనిఆజ్ఞా(+)చక్రమువఱకు ప్రతిచక్రమునకు ఇరువైపులా రెండేసిరాశులచొప్పున 12రాశులుఉన్నవి. క్రియాయోగి తనప్రాణశక్తిని ఆరుచక్రములలోమూలాధారమునుండికూటస్థమునకు. కూటస్థమునుండిమూలా ధారమునకుత్రిప్పుతూ,తద్వారాఆత్మసూర్యునిఈఆరుచక్రములలోఇరువైపులారెండేసిరాశులచొప్పునఉన్న12రాశులలోదర్శిస్తూప్రతిచుట్టుకూ(మూలాధారమునుండి కూటస్థమునకు, కూటస్థమునుండిమూలాధారమునకుకలిపి ఒకచుట్టు) ఒక సంవత్సరముచొప్పున కర్మని దగ్ధంచేసికుంటాడు. సూర్యుడు ప్రతిమాసమునకు ఒకరాశి చొప్పున12రాశులలో12మాసములుసంచరించును. సూర్యుడు రాశులలో సంచరించుటను సంక్రమణముఅందురు. ఈసూర్యసంక్రమణములు పన్నిండింటిలో రెండుసూర్యసంక్రమణములుముఖ్యమైనవి. అవి సూర్యుడు మకరరాశిలో సంచరించు మకరసంక్రమణము, కర్కాటకరాశిలోసంచరించుకర్కాటక సంక్రమణము. ఈమకరసంక్రమణమునే మకరసంక్రాంతిఅందురు. ఈమకరసంక్రాంతినుండే ఉత్తరాయణ పుణ్యకాలము ప్రారంభం. ఈకర్కాటకసంక్రమణమునుండే దక్షిణాయణ పుణ్యకాలము ప్రారంభం. సూర్యుడు12రాశులలో 12మాసములు సంచరించుటతో ఒకసంవత్సరప్రారబ్ధకర్మనుఅనుభవంచినట్లులెక్క.మనసంచితకర్మనిదగ్ధంచేసికొనుటకు10లక్షలఆరోగ్యకరమైనజీవితంఅవసరము.అదిదుస్సాధ్యం.ఈదుస్సాధ్యంసుసాధ్యంచేసేదేక్రియాయోగం.హైద్రాబాదునుండిఢిల్లీకివిమానములోవెళ్ళుటకురెండుగంటలేపట్టును.అదేఇంకొకవాహనముఅయిన ఎక్కువసమయముపట్టవచ్చు. క్రియాయోగం విమానములోప్రయాణించటములాంటిది.కేవలముఒక్కజీవితకాలములోనేపట్టుదలగలక్రియాయోగి10లక్షలక్రియలుచేసికొనిజీవబ్రహ్మైక్యముపొందవచ్చు.రోజుకు1000క్రియలచొప్పునమూడుసంవత్సరములలో10లక్షలసంవత్సరాలప్రగతినిక్రియాయోగిసాధించగలడు.సాధారణముగా 6 12 18 24 30 36 42 లేదా48సంవత్సరములలోఒకపద్ధతిప్రకారముక్రియలుమరియు ధ్యానము చేస్తే 10లక్షల సంవత్సరాల ప్రగతిని క్రియాయోగిసాధించగలడు.ఒకవేళసంపూర్ణప్రగతినిసాధించకుండానేక్రియాయోగిమరణిస్తేతనతోపాటేక్రియాయోగసాధనాఫలితాన్నితీసికెల్తాడు. క్రియాయోగిజీవితం అతనిసంచితకర్మలతోప్రభావితంకాదు.అదిపూర్తిగాఆత్మచూపేమార్గదర్శకత్వంలోనేకొనసాగుతుంది.క్రియాయోగంమితభోజనముతోను,పూర్తిగాఏకాంతములోనుచేయవలయును.   క్రియాయోగములో(1)హఠయోగము(శక్తిపూరకఅభ్యాసములు)(2)లయయోగము(సోహంమరియుఓం ప్రక్రియలు),3)కర్మయోగము(సేవ),4)మంత్రయోగము(చక్రములలోబీజాక్షరఉఛ్ఛారణ),(5)రాజయోగము(ప్రాణాయామపద్ధతులు)ఉండును. కనుబొమ్మలమధ్యప్రదేశమునుకూటస్థము లేక ఆజ్ఞా(+) అంటారు.ఈకూటస్థముధనధృవము.మూలాధారచక్రముఋణధృవము.ఈఋణధృవముఅనగామూలాధార చక్రమునుండి ధనధృవము అనగా కూటస్థమువఱకు, తిరిగికూటస్థమునుండిమూలాధారచక్రమువఱకుప్రాణశక్తినిత్రిప్పటమువలనమేరుదండము(వెన్నెముక)శక్తివంతమైనఅయస్కాంతమగును.తద్వారామూలాధారమునుండికంఠములోనివిశుద్ధఱకుఉన్నకరెంట్లుఅన్నీకూడాఅయస్కాంతీకరణచెందినమేరుదండముద్వారాబ్రహ్మరంధ్రములోనిసహస్రారచక్రములోనికిచేర్చబడిసాధకుడు అనంతమైనఆనందాన్నిపొందుతాడు.దీనికితోడుకొన్నిముద్రలుకూడాప్రాణాయామముతోబాటుచేయుటవలన మేరుదండముమరింతశక్తివంతమగును.  శక్తి మరియు జాగృతిరెండూఉన్నదేప్రాణశక్తి.ప్రాణవాయువులోఒక్క శక్తిమాత్రమేఉండును.శరీరముమరియుమనస్సురెండిటి రుగ్మతలనూక్రియాయోగమురూపుమాపుతుంది.క్రియాయోగములోకొన్నిప్రక్రియలుమంత్రములు,హఠయోగఅభ్యాసములు,యమ,నియమ,ఆసనమొదలగుఅష్టాంగయోగపద్ధతులుమరియుప్రాణాయామపద్ధతులుంటాయి.ఈక్రియాయోగఅభ్యాసముద్వారాశరీరము మరియు మనస్సు రెండూ సాంత్వనచెందటమేకాక మనస్వాధీనములోనికి వస్తాయి.తద్వారా కుండలినీజాగృతిచెంది సాధకుని శుద్ధచేతనాస్థితికి చేర్చుతుంది. స్వామివివేకానంద అన్నట్లుగా మనఅసలైనస్థితి శుద్ధచేతనాస్థితియే. మనస్సు శ్వాస ప్రాణశక్తి మరియు కామము అనేనాలిగింటినీ అదుపులోఉంచగలుగుతే మనఅసలైనస్థితిశుద్ధచేతనాస్థితినిపొందగలుగుతాము.  ఇడానాడిమానసికవ్యవహారాన్ని,పింగళానాడిభౌతికవ్యవహారాన్ని,సుషుమ్నానాడిమానసికభౌతికవ్యవహారములురెండింటినీసమన్వయపఱచటానికిఉపయోగిస్తాయి. చక్రములనేవిఅనుసంధానపెట్టెలు.అస్థిరశ్వాస అస్థిరమనస్సుకి కారణము.కాముడు రాముడవ్వాలన్నా తృష్ణ  కృష్ణ అవ్వాలన్నా శవంశివంఅవ్వాలన్నా ప్రాణాయామమే ఏకైకమార్గము. మనస్సనేదిఎనిమిదవసంవత్సరమునుండిఏర్పడుతుంది. అంతకుముందు వఱకు ఆత్మయొక్కసలహామీదనే జీవితము ఆనందముగా గడుస్తూఉంటుంది. అందుకనే పిల్లలు దేవుళ్ళు అనేది.
సర్వభూతేషుచాత్మానంసర్వభూతానిచాత్మని విజ్ఞాయనిరహంకారోనిర్మమస్త్వంసుఖీభవ...............అష్టావక్రగీత.    
మోహం, ద్వేషంవదలు. నేనుబ్రహ్మానందాన్నని గ్రహించు.  సుఖముగాఉండు.   సత్యేనలభ్యఃతపసాహిఏషాఆత్మసమ్యక్జ్ఞానేనబ్రహ్మచర్యేననిత్యం అంతఃశరీరేజ్యోతిర్మయోహిసుభ్రోయంపశ్యంతియతఃక్షీణదోషాః..........ముండకోపనిషత్ సత్యం, తప్పస్సు, బ్రహ్మచర్యము బ్రహ్మలోచరించటము లేదా సదామనస్సును సహస్రారములోఉంచటముద్వారా దోషములుపోయి ఆజ్యోతిర్మయ పరమాత్మను దర్శించి ఐక్యమగుము.       
యోగఃకర్మసుకౌశలం.........గీత2-50, ఫలితంఆశించక చేసే సుకర్మయే యోగం.
యోగస్థః.కురుకర్మాణి గీత......48. యోగస్థుడవై కర్మలు చెయ్యి.
యోగోభవతిదుఃఖః... సర్వ దుఃఖములనుహరింపచేసేదియోగము.. గీత617    
యోగఃచిత్తవృద్ధినిరోధః యోగమువలన అనవసరమైన ఆలోచనలు నిరోధించబడును.....పతంజలి యోగసూత్రము
పతాంజలిఅష్టాంగయోగము: 1)యమ=అహింస,సత్యం,ఆస్తేయం(దొంగతనముచేయకుండుట),బ్రహ్మచర్యం, అపరిగ్రహంఅనగాఇతరులనుండిఏమీఆశించకుండుట, 2)నియమ=సౌచం(శరీర,మనస్సులశుభ్రత),సంతోషం(తృప్తి)స్వాధ్యాయం(శాస్త్రపఠనం),ఈశ్వరప్రణిధానంఅనగాపరమాత్మకుఅంకితమగుట, 3)ఆసనఅనగా స్థిరత్వము, 4)ప్రాణాయామఅనగాశ్వాసనియంత్రణ,5)ప్రత్యాహారఅనగాఇంద్రియవిషయోపసంహరణ,6)ధారణఅనగావస్తుఏకాగ్రత,7)ధ్యానఅనగాకేవలముపరమాత్మపై ఎడతెగని ఏకాగ్రత,8)సమాధిఆనగాఅన్నిరూపములనువిసర్జించుట, పరమాత్మతో ఐక్యమగుట.   
ధారణధ్యాన మరియు సమాధి అనేమూడింటినీ కలిపి సమ్యమంటారు. ధ్యానముబీజముతోమొదలయ్యినిర్బీజంఅవ్వాలి.
నతస్యరోగోనజరానమృత్యుప్రాప్తస్యయోగాగ్నిమయంశరీరం----   
రోగము, ముసలితనము, మరణమువీడి సాధకుడు యోగాగ్నితో ప్రజ్వరిల్లిపోవాలి.  లలితలోచెప్పినట్లుయోగముఅంతర్ముఖులకేసాధ్యము.         ఏడుచక్రాలు,ఏడుధాతువులు.చక్రధ్యానమేధాతువిద్య. మనోహిద్వివిధంప్రోక్తంశుద్ధంఅశుద్ధంఏవచఅశుద్ధంకామసంకల్పంశుద్ధంకామవివర్జితం
మనఏవమనుష్యాణాంబంధమోక్షకారణంబంధాయవిషయాసక్తంముక్తాయనిర్విషయంస్మృతం                        
మనస్సుస్థిరం,అస్థిరంఅనిరెండువిధాలు.స్థిరమనస్సేనిష్కామముగాను,నిర్విష్యమైఆనందముగానూఉంటుంది.అందుకే మనస్సే బంధానికి మోక్షానికి కారణము.
గ్రంధులు…..చక్రములు   గ్రంధులు1)ఎక్సోక్రిన్,2)ఎండోక్రినుఅనిరెండువిధములు.ఈగ్రంధులుఉత్పత్తిచేసే హార్మోన్సు అనేవి సంబంధితఅవయవములమీద పనిచేస్తూ ఆయాఅవయములు శరీరములో(తో)మనకిఉపయోగకరమైనపనులనుచేయించుటకుమరియుశరీరమునుఆరొగ్యకరముగాఉంచుటకుతోడ్పడతాయి.మూత్రపిండములపైనఉన్నఎడ్రినలు ఎండోక్రినుగ్రంథిసక్రమముగాపనిచేయుటకుస్వాధిస్ఠానచక్రముసక్రమముగాఉండాలి. తద్వారా అతిమూత్రము, మూత్రపిండములలో రాళ్ళువగైరాలుఉండవు. మణిపూర చక్రముసక్రముగాఉంటే ఇన్సులిను మరియు గ్లూకగానుహార్మోన్సు పద్ధతిలో పాన్క్రియాసు విడుదలచేసి మధుమేహములేకుండా చేయును.
గీతలోచెప్పినయజ్ఞములు                           యదృచ్ఛాలాభసంతుష్టోగీతా.......4......22    లభించినదానితోతృప్తిచెందువాడును,సుఖదుఃఖాదిద్వందములకుఅతీతుడును,మాత్సర్యములేనివాడును,ఫలముసిద్ధించినను,సిద్ధించకపోయినను,సమముగాఉండువాడునుఅగుసాధకుడుకర్మచేసిననుబంధింపబడడు.. బ్రహ్మార్పణంబ్రహ్మహవి.................గీతా4....24   యజ్ఞమునందలిహోమసాధనములు(శ్వాస),హోమద్రవ్యములుప్రాణశక్తి),హోమాగ్ని(సహస్రారప్రకాశమనేఅగ్ని),హోమముచేయువాడు(సాధకుడు),హోమముచేయబడినది(ప్రాణశక్తి)....అన్నియుబ్రహ్మస్వరూపములేఎందుకనగాపరమాత్మతక్కఅన్నీజడములే).ఆవిధమైనసంకల్పముతోనేప్రాణాయామసాధనాయజ్ఞముచేయుసాధకుడు చివరికిపొందేదిఆబ్రహ్మమె. .                           
దైవమేవాపరేయజ్ఞం....గీతా4......25                  కొందరుసాధకులుదేవతలనుగురించేధ్యానముచేయుచున్నారు.కొందరుతనను(జీవాత్మని)పరమాత్మలోఐక్యంచేసేసాధనచేస్తున్నారు. శ్రోత్రాదీనీన్ద్రియాణ్యేసంయమాగ్నిషుజుహ్వతి-గీతా 4-26
కొందరు  చెవి, ముక్కు మొదలగు జ్ఞానేంద్రియములను వాటి శ్రోత్రము, ఘ్రాణము మొదలగుసంబంధితశక్తులందు శ్రోత్రము,ఘ్రాణము మొదలగు సంబంధితశక్తులను వాటిసంబంధితచెవి,ముక్కుమొదలగుజ్ఞానేంద్రియములందు ఐక్యములేదాహోమము చేయుచున్నారు.అనగాఅనవసరమైనవిషయములందుసాధకుడుఇంద్రియములు తత్సంబంధిత తన్మాత్రలను వృధాచేయని యోగప్రక్రియని ఉపయోగించును. సర్వాణీంద్రియకర్మాణి..గీతా...4......27
కొంతమందిసాధకులు ఇంద్రియవ్యాపారములైన శబ్ద స్పర్శ రూప రస గంధములను ఉపసంహరించుకొని సహస్రారములోని సహస్రాగ్నిలో అర్పించి స్థిరమనస్కులవు తున్నారు.దీనినేప్రత్యాహారపద్ధతిఅందురు. ద్రవ్యయజ్ఞాస్తపోయజ్ఞా........గీతా4.........28 కొందరుదానధర్మములుఅనేయజ్ఞములుచేసి మనస్సును స్థిరపఱచుకొని లౌకిక విషయములనుండిబయటపడుతూప్రయత్నముతోఇంకాముందుకివెళ్ళికూటస్థములో పరమాత్మధ్యానముఅనే తపస్సుచేస్తూ, నేనుఎవరిని అని తెలుసుకొనుటకు దృఢప్రయత్నముతోఉన్నారు.
అపానేజుహ్వతిప్రాణంప్రాణేపానంతథాపరేప్రాణాపానగతీరుధ్వాప్రాణాయామపరాయణాః     గీతా....4.......29 కొందరుసాధకులు ప్రాణాపానగతులనులేదామార్గములను నిరోధించి, ప్రాణమును అపానములో,అపానమును ప్రాణములో హోమముచేయుచూ మనోస్థిరత్వముపొంది తద్వారా జీవబ్రహ్మైక్యమునుపొందుచున్నారు..
అపరేనియతాహారాఃప్రాణాన్ప్రాణేషుజుహ్వతి........గీతా4.....30 కొందరుసాధకులు ఆహారనియమములనుపాటిస్తూ మితాహారులై ప్రాణశక్తిని ప్రాణశక్తియందే హోమముచేస్తున్నారు. కర్మేంద్రియవ్యాపారములైన గమనశక్తి విసర్జనాశక్తి మొదలగునవి మరియు జ్ఞానేంద్రియవ్యాపారములైన శ్రవణశక్తి, వాసనాశక్తి, చూసే శక్తిమొదలగునవినిరోధించి మనోస్థిరత్వముపొంది తద్వారా జీవబ్రహ్మైక్యమును పొందుచున్నారు.                 .    అపిచేదసిపాపేభ్యఃసర్వేభ్యఃపాపకృత్తమః......గీతా4........36   మనముఎన్నితప్పులుచేసినాలేదాఇంతకుముందుసాధనచేయకపోయినాఇకనైనచేస్తేజీవబ్రహ్మైక్యజ్ఞానము సుసాధ్యమేఅని పరమాత్మచెప్తున్నాడు. ప్రతిపాపికి భవిష్యత్తు ఉన్నది.ప్రతిసద్గురువుకుగతచరిత్రఉన్నది.     తపస్విభ్యోధికోయోగీజ్ఞానిభ్యోపిమతోధికఃకర్మిభ్యశ్చాధికోయోగీతస్మాత్యోగీభవార్జున......గీతా6..........46 యోగికృచ్ఛ్రచాంద్రాయణాది తపస్సులు చేయువారికంటెను, శాస్త్రజ్ఞానము కలవారి కంటెను, అగ్నిహోత్రాదికర్మలు చేయువారికంటెను శ్రేష్ఠుడు.                       ఇంజనీరింగుచదువు చదివి కరెంటుపోతే ఫ్యూజువేయలేకపోతే ఆచదువు ఎంత వ్యర్థమో అదేవిధముగా లక్ష్యముయొక్క పరాకాష్ఠఅయిన జీవబ్రహ్మైక్యజ్ఞానము కలిగించనివన్నీ వ్యర్థమే.
100సంవత్సరములు  .
కుర్వన్నేవేహకర్మణిజిజీయవిశేత్శతంసమాః ఏవంత్వయినాన్యథేతఃఅస్తినకర్మలిప్యతేనరే-            ఈశోపనిషత్       మంచిపనులు లోకోపకారమునకైచేస్తూ నూరుసంవత్సరములు జీవంచాలనికోరుకో. అట్లా ప్రతిఫలం ఆశించకుండా నిష్కామకర్మలుచేస్తేనే జీవబ్రహ్మైక్యజ్ఞానము కలిగి కర్మఫలముల నుండి విముక్తుడవవుతావు. 
పొగడ్తలు ప్రత్యక్షేగురవస్తుత్యాఃపరోక్షేమిత్రబాంధవాఃకార్యాంతేదాసభృత్యాశ్చనస్వపుత్రఃకదాచన                 సద్గురువునుప్రత్యక్షముగాను,స్నేహితులనుమరియుబంధువులనుపరొక్షముగాను,పనిఅయినపిమ్మటసేవకులనుపొగడవలయును.పుత్రులనుఎన్నడూపొగడకూడదు.
స్పందన(లు)                       
స్పందనఅనేది శబ్దమునకు కారణము.అనగా స్పందన కారణము, శబ్దముకార్యము. ఓంకారముస్పందనారహిత శబ్దము. ఈ ఓం శూన్యము అనగా అంతరిక్షముగుండా కూడా ప్రవహిస్తుంది.దీనినేవ్యోమముఅందురు. అంతరిక్షము లేదా వ్యోమమును అర్థముచేసుకొనుటకు సాధారణస్థూలఅంతఃకరణ లేదా సాధారణమనస్సు చాలదు. సూక్ష్మఅంతఃకరణ లేదా సూక్ష్మమనస్సు లేదా అనంతమనస్సు కావాలి.  శబ్దము ఆఖరికి వ్యోమములో కలిసిపోతుంది.అన్నిశబ్దాలకుఆలవాలము ఈ వ్యోమము అని ఋషులు కనిపెట్టారు.  తీవ్రమైనఏకాగ్రతతతో,భూతమరియువర్తమాన శబ్దములను వినవచ్చు. తరంగం పొడుగు  ఎంతతక్కువగాఉంటే స్పందన అంతఎక్కువగా ఉంటుంది.అంతఎక్కువ దూరము తరంగం ప్రయాణిస్తుంది. అనాహతనాదం అనగాస్పందనారహితశబ్దమైనఓంకారము దేశమరియుకాలరహితము అనగా ఎంత దూరమైనామరియుఎంతకాలమైనాఅనగాఅనంతదూరముమరియుఅనంతకాలముప్రవహిస్తునేఉంటుంది. ఈఓంకారము ఎన్నివిశ్వములనైనా సృష్టించగలదు,నాశనము చేయగలదు,తిరిగినాశనముచేసినవాటినితిరిగిసృష్టించగలదు.శబ్దంయొక్కప్రారంభమేస్ఫోటం.ప్రతిఊహ ఈ స్ఫోటములోనుండివచ్చినదే. సృష్టికిమూలము స్ఫోటమే. బిందు అనేది అనంతమైనసింధువులోని వ్యక్తిగత తరంగమే. ఆవరణ అనగా దాచేశక్తి. విక్షేపణ అనగా వితరణాశక్తి. బాల్యము అనగా వృద్ధిచెందని శూద్రావస్థ. యౌవనంఅనగా సంపదకూడగట్టుకునే వైశ్యావస్థ. కౌమారం అనగా పూర్తిగా వృద్ధిచెంది పరిపాలనాదక్షతగల క్షత్రియావస్థ. వార్ధక్యం అనగా భౌతికవిషయ వాంఛలందు నిర్లిప్తత, కేవలము జీవ బ్రహ్మైక్య జ్ఞానముకొఱకు పరితప్తత.
కొన్ని విషయములప్రస్థావన
కాపాళికమతము నరశీర్షకుశేశయైరకృత్యారుధిరాక్తైర్మైథునాచభైరవార్చామ్ఉమయాసమాయాసరోరుహాక్ష్యాకథమాశ్లిష్టవపుర్ముదంప్రయాయాత ....శంకరవిజయం15...21....14 కాపాళికులకు క్రచుడు అనేనాయకుడుఉండేవాడు. రక్తసిక్తములైన కపాళములు మాలగాధరించాలి, మద్యముచే భైరవార్చనగావించాలి. లేనియడల పార్వతీదేవితో వెలయు కాలభైరవుడు సంతోషముచెంది ప్రసన్నుడుకాడు. కాపాళికులకుఆనందమే ప్రధానం. అందువలన మద్యసేవనం, తరతమభేదములేక, వావివరసలులేక స్త్రీ సంపర్కముచేయుట తప్పుకాదు. స్త్రీపురుషసంయోగజనిత సుఖస్వరూపుడైవెలిగే దైవమేఆకాలభైరవుడనివారిసిద్ధాంతము.భైరవోపాసనేముక్తికిమార్గమనేదికాపాళికులనియమముమరియునమ్మకము.ఆదిశంకరాచార్యులవారుఆసమయములోశ్రీపద్మపాద,హస్తామలక,సమిత్పాణి,చిద్విలాస,జ్ఞానకంద,విష్ణుగుప్త,శుద్ధకీర్తి,భానుమరీచి,కృష్ణదర్శన,బుద్ధివృద్ధి,విరించిపాద,శుద్ధానంత,ఆనందగిరిమొదలగుశిష్యోత్తములువెంటరాగా దిగ్విజయశ్రీని పొందుటకు దక్షిణమునఉన్న రామేశ్వరమునకు వెళ్ళుచుండిరి. సుధన్వుడు అనే మహారాజు తనసైన్యముతో ఆదిశంకరాచార్యుల రక్షణ నిమిత్తమై వెన్నంటియుండెను.ఈసుధన్వుడు బ్రాహ్మణుల్నిహింసిస్తున్నక్రకచుని అనుచరులగు వేలకొలదికాపాలికులను సంహరించెను. అంతకుపితుడైన ఆ క్రకచుడు గండ్రగొడ్డలితో ఆదిశంకరాచార్యులశిష్యులనుసంహరించుటకుఉపక్రమించెను. 
అసితోమరపట్టిశత్రుశూలైఃప్రజిఘాంసూన్ఛృశముజ్ఘితాట్టహాసాన్, యతిరాట్,చకారభస్మసాత్తానిజహుంకారభువాగ్నినాక్షణేన శంకరవిజయం15.21. 21
అదిచూచి ఆదిశంకరాచార్యులవారు క్రకచుని కాపాలికులతో హింసించబడుతూ కకావికలైపరిగిడుతున్న తనశిష్యులను కాపాడునిమిత్తమై దుష్టశిక్షణ శిష్టరక్షణ అత్తుతమ ధర్మముగా తలచినవాడై మరపట్టిన త్రిశూలముతో కాపాలికులందరినీ సంహరించునిమిత్తమై సర్వత్రవిజృంభించుచూ ప్రళయకాలరుద్రుడై అందరినీ తన హుంకారాగ్నిచే ఒక్కక్షణములోచంపివేసెను. అటుపిమ్మట ఆదిశంకరునియడ ప్రసన్నుడైన కాలభైరవుడు తనభక్తుడైన క్రకచుని సంహరించెను.
చార్వాకమరియుసౌగతమతములు చార్వాకఇత్థంహ్యాకరోద్విచారంమూర్ఖైర్జనైర్వ్యాప్తమిదంసమస్తందేహాద్యతీతాత్మవిబోధి భిత్సంగాత్,గతామూఢమత్వమన్యే……శంకరవిజయం1523….31 ఈలోకములోదేహేంద్రియములకన్నను అతీతమై అప్రత్యక్షమగు ఆత్మతత్వమును బోధించు మూఢజనులు పుంఖానుపుంఖములుగా ఉన్నారు. ప్రత్యక్షముగా కనబడుతున్నదేహమే ఆత్మ. ఈదేహమే ప్రథమమున ఏర్పడినది కావున దేహేంద్రియాదిరూపమున జీవుడున్నాడు. దేహేంద్రియములకన్న జీవుడు వేరు కానేకాడు. ఎదురుగాకనబడుతున్నదానినిభ్రమ అనుట, కనబడనిదానిని సత్యం అనుట మూఢమతుల శుష్కవేదాంతముతప్ప వేరేఏమీకాదు.
భస్మీభూతస్యదేహస్యపునరాగమనంకుతః?  కాలిబూడిదఅయినశరీరముతిరిగిపుట్టుటకల్ల. దేహనాశమేముక్తి మరియు సత్యం. స్వర్గం,నరకం,పరలోకము, తిరిగిరానిమనుష్యులు పరలోకములో సుఖపడుదురని చేసేశ్రాద్ధకర్మలునమ్మశక్యంగానివి,సుఖంమరియుదుఃఖంఈలోకమునకేపరిమితము.వేదనిందితులు చార్వాకులు. భూమి,జలము,అగ్ని,వాయువు అనే భూతముల కలయికవలననే చైతన్యము కలుగును. శరీరముఉత్పన్నమగునపుడు జీవుడు  స్థూల శరీరములోనికివచ్చును.శరీరపతనానంతరముజీవుడువెలుపలికివెడలును.  గమనంరూపహీనత్వైవసంభ్కవతిక్వచిత్తస్మాదస్మన్మృతంసమ్యగిత్యుక్తఃప్రాహశంకర    శంకరవిజయం15..23..40 పంచభూతాత్మకములగుదేహేంద్రియములునష్టముకాగాఏమియు మిగలనపుడు పరలోకమునకు పోయేవాడు ఎవ్వడుఉండడు. ఒకవేళదేహమువేరుజీవుడు వేరు అన్నట్లైతే ఘటమునష్టముఅయినతదుపరి అందులోని ఆకాశము రూపశూన్య మగుటచేఎక్కడికిపోనట్లు?అందులోనిజీవుడునూరూపహీనుడైఎక్కడికీపోవుటలేదు.కావునజీవుడు,దేహముఒక్కటేఅనిచార్వాకసిద్ధాంతం.  తతప్రేతతత్వవిముక్త్యర్థంపుణ్యలోకస్యచాప్తయేగయాదౌపిండదానంచకర్తవ్యంతస్యముక్తయే,                              శంకరవిజయం…..15..,23…….48 జీవుడుమరణించిన తదుపరి జీవుడు ప్రేతశరీరమును ధరించుచున్నాడు. కర్మఫలానుభవమునకై జీవునకుపరలోకగమనాదులు తప్పనిసరిఅని స్పష్టమై ఉన్నది.కర్మశేషమువలననే కర్తయగుజీవునకు పునర్జన్మకారణమైయున్నది. అని ఆదిశంకరాచార్యులవారు అన్నారు. 
బౌద్ధమతం                                              బౌద్ధులలో  సౌత్రాంతికులుఅనుమానప్రమాణమునునమ్ముతారు.తెలియదగినవస్తువులజ్ఞానమంతాఅనుమానప్రమాణముచేకలుగునుఅంటారు.వైభాషికులుప్రత్యక్షప్రమాణమునేనమ్ముతారు.కళ్ళకుకనిపించినదేసత్యమంటారు.  
దానికిఆదిశంకరాచార్యులవారుఇట్లనెను. యోయోయాంయాంతనుంభక్తఃశ్రద్ధయార్చితుమిచ్ఛతితస్యతస్యాచలాంశ్రద్ధాంతామేవవిదధామ్యహం……గీతా…..7……21  ఏయేభక్తుడుఏయేదేవతారూపమునుశ్రద్ధతోపూజించుటకు ఇష్టపడుచున్నాడో దాని దానికితగినశ్రద్ధనే వానివానిఇష్టమునకుతగినటుల కలగచేయుచున్నాను. సిద్ధంతస్మాన్నదేహస్యపాతమాత్రాద్విముచ్చతే శంకరవిజయం…..15.....27.......90 జీవునికిపరలోకగమనాదికమునిశ్చయము,సత్యము.కావునస్థూలదేహముపతనమైనంతమాత్రమునముక్తిరాదు.     
అద్వైతము---ఆదిశంకరుడు                  పరమాత్మయేఈజగత్తుకిసృష్టికర్త.జగత్తు,జీవుడు మిథ్య. పరమాత్మ తనమాయచేత జగత్తునుసృజించి,చరించి,నశింపజేయుచున్నాడు.జీవుడు,జగత్తుస్వప్నమువంటివి.  పరమేశ్వరుడు తానే స్వయముగ  జగత్ రూపము ధరించి క్రీడించుచున్నాడు.
సాంఖ్యం
ప్రకృతివేరు, పురుషుడువేరు. కారణమునుఅర్థంచేసికొనేవాడు, తెలిసినవాడు, పురుషుడు లేదా బ్రహ్మ. ఈపురుషుడు, నిర్గుణుడు, నిరాకారుడు, కేవలము సాక్షీభూతుడు.  స్వయముగా పరమేశ్వరుడు ఏమీచెయ్యనప్పటికీ ప్రకృతికిదగ్గిరగా ఉండుటవలన వేడికిదగ్గిరగాఉండుటవలన వెన్నకరుగునట్లుగా  ప్రకృతిలో అలజడి బయలుదేరి సృష్టి ప్రారంభమగును.   ఆత్మమరియుపురుషుడు ఒక్కటె. అన్నిటికీ కారణముఇదే.కానితనుస్వయముగాఏమీచెయ్యడు.మాయయేసృష్టిఅంతటికీకారణము.మాయనేప్రకృతిఅందురు.  బ్రహ్మాండం అంతా 24 తత్వములతోకూడియున్నది. అందులో ఒకటైన ప్రకృతి మొదటిది. దీనినే ప్రధానము అందురు. రెండవది మహత్తు. మానవమేధలాగానే మొదటిదైనప్రకృతియొక్కమేధమహత్తు. రెండవది అయిన మహత్తునుండి మూడవదిఅయిన అహంకారమువచ్చినది. సాంఖ్యం ఈశ్వరుని గురించి మాట్లాడదు.
పరమాత్మమాయ మరియు ప్రకృతి అంతాఒక్కటె. వేరుకాదుఅంటుంది వేదాంతం.
సాంఖ్యం మరియు వేదాంతం రెండూకూడా త్రిగుణములను అంగీకరిస్తాయి. మనిషికి దుఃఖహేతువుకనుక త్రిగుణములను సరిగ్గావుంచాలంటుంది సాంఖ్యం. వేదంనిస్త్రైగుణ్యోభవఅనగా త్రిగుణములను వర్జించుఅని చెప్పటమేకాక ఈశ్వర ప్రణిధానము భక్తి లేదా పరిపూర్ణముగా భగవంతునికిఅంకితమగుట ఆత్మశోధన మొదలగువాటిద్వారా పరిష్కారమార్గముచూపించును. పురుషుడు అనగా పరబ్రహ్మ  సర్వచేతనాస్వరూపుడు సర్వవ్యాప్తుడు, సర్వశక్తిస్వరూపుడు. మిగిలినదంతాజడమే అంటుందివేదము. సాధకుడుతనతత్వములనువిడనాడితే,పరిపూర్ణముగాజడత్వముబోగొట్టుకొని అత్యుత్తమమైన ఆ పురుషపదవిని పొందగలుగుతాడు.  అదేకైవల్యం అంటుంది సాంఖ్యం.                        
ప్రకృతియే ద్రవ్య(ఉపాదాన) నిమిత్త మరియు సాధన కారణములు. ద్రవ్యకారణముమట్టి,నిమిత్తకారణము  కుమ్మరి,సాధనాకారణముఅనగాకుండలుచేసే పనిముట్టు మూడున్నూ ప్రకృతియే. సత్వ  రజస్ తమస్  అనే మూడుగుణములే ద్రవ్యము.  ఈమూడింటినీ కలిపి బ్రహ్మాండముఅంటారు.  ఈమూడుగుణముల వ్యక్తీకరణే సమిష్టిలో మహత్ అంటారు.   వ్యష్టిలో బుద్ధి అంటారు.  బుద్ధినుండిరాయి వఱకుఉన్నదంతాఈమూడుగుణములుకలిసిన ఒకేవస్తువు. తేడా స్థూలం సూక్ష్మం పరమ సూక్ష్మం.  కారణము పరమసూక్ష్మం.. 
కార్యం అనేది స్థూలం.అన్నిభావములను ప్రోగుచేసి బుద్ధికి చేరవేయటము అనేది మనస్సుపని.ఏమిచేయాలనేదిబుద్ధి(సమిష్టిలోనిమహత్)నిర్ణయిస్తుంది.ఈమహత్.నుండిఅహంకారము దానితరువాత సూక్ష్మపరమాణువులు వచ్చినవి.  ఈ సూక్ష్మ పరమాణులు పరస్పరముకలిసి బాహ్యజగత్తుఏర్పడినది.  ఈప్రకృతికి మూడు గుణములకలయికకుఅతీతమైనవాడుపురుషుడు.
బుద్ధిలేకమనస్సు,తన్మాత్రలు,స్థూల,సూక్ష్మ,పరమసూక్ష్మపదార్థముకాదు ఈపురుషుడు. పురుషుడుఅమరుడు. ఈ పురుషులులేదాఆత్మలు  అనంతం. బుద్ధి(సమిష్టిలోనిమహత్) ముందరవచ్చినది, పదార్థముతరువాతవచ్చినది. అంతర్గతమైనపరమసూక్ష్మశక్తులను మనస్సుఅంటారు.  ఈ అంతర్గతమైన మనస్సు బయటిస్థూలశక్తులకలయికతోఈస్థూలప్రపంచములేదాఈశరీరములుఏర్పడినవి.  గుణసామ్యంప్రధానంస్యాత్ మత్తత్వాదికారణం శంకరవిజయం...............................................15...40...254 అవ్యక్తంవ్యక్తభావంచజగత్యేకంపరాత్పరం శంకరవిజయం.........1540255                    త్రిగుణములనుప్రధానముఅందురు.ఈత్రిగుణసామ్యావస్థఅనగాకలయికయే మహత్తత్వమునకు ఆతదుపరి సృష్టికి కారణము.  జగత్తులో ఆఏకమగు ప్రధానము పరముకంటెపరమై,మిగులశ్రేష్టమై,అవ్యక్తరూపముగను,వ్యక్తరూపముగనుఉన్నది.అవ్యక్తంఅనగాసూక్ష్మము,ప్రధానమువ్యక్తంఅనగాస్థూలము,ప్రపంచము.ఈప్రధానోపాసనచేమానవులకుముక్తికలుగును.  తంకాపిలఃప్రాహుచమూలయోనిఃకీంవాస్వతంత్రాచిదధిష్ఠితావాజగన్నిదానంవదసర్వవిత్త్వాన్నొచేత్ప్రవేశస్తవదుర్లభస్యాత్. ......శంకరవిజయం........166---71 మూలప్రకృతిస్వతంత్రముగనేజగత్తుకుకారణమగుచున్నదా?లేకచైతన్యబ్రహ్మమునుఆశ్రయించిజగత్తుకు మూలకారణమగుచున్నదా?
స్వయంస్వతంత్రాత్త్రిగుణాత్మికాసతీ.
సాంఖ్యులుమూలప్రకృతి జడముకాదని స్వతంత్రమైనదని, జగత్తుకుకారణము అని విశ్వసించుదురు.మూలప్రకృతిసత్వరజోమరియుతమోగుణత్రయాత్మకమై,బహురూపములనొందుచు సర్వజగత్తుకు కారణమగుచున్నది.ఆ మూలప్రకృతియే సర్వ స్వతంత్రమై, సర్వమును సృష్టించుచున్నది. మూలప్రకృతి అనగా స్వభావము.  స్వభావమువలననేసృష్టి,స్థితి,లయములుజరుగుచున్నవి. దానికిఆదిశంకరాచార్యులవారుఇట్లనిరి.నాశబ్దమీక్షతేఅనుబ్రహ్మసూత్రముప్రకారము, శబ్దముచూడలేదు.ప్రధానముఅనగాత్రిగుణములకలయికశబ్దరహితముకాదుగదా.  శబ్దరహితముకాని ప్రధానము జగత్తుకి కారణముకాలేదు. పరమాత్మ ప్రమేయము లేనివస్తువుజడము. చైతన్యవంతమైన, సత్యస్వరూపమైన పరబ్రహ్మమే జగత్తుకి కారణము.
పరమాణువాదం
విధాయసృష్ట్వావివిధాంశ్చజీవానానైస్వయంసాక్షివదేషపూర్ణః శంకరవిజయం 1542294
పరమేశ్వరుడు సర్వజగమునకు కర్తయైయున్నాడు.  అయినను నిత్యములగు భూమ్యాదులనుజేర్చి (ఆకాశం వాయు,అగ్ని,జలం,పృథ్విలోకములను సృజియించు చున్నాడు. లయమందు పరమాణువులను వేరుచేయుచున్నాడు. పరమాణువుల సంయోగముచేసృష్టి మరియు  వియోగముచేప్రళయము సంభవిస్తున్నాయి. అనగా పరమాణువుల సంయోగవియోగములు ఈజగత్ సృష్టి ప్రళయముల రెండింటికీ కారణము. దానికిఆదిశంకరాచార్యులవారిట్లనిరి.పరమాత్మవలననేఆకాశాదిపంచభూతములుకలిగినవి.పరమేశ్వరుడుఒక్కడేనిత్యుడు.పరమేశ్వరునివలనజనించినవన్నియుఆయనఅదుపులోనే సంయోగవియోగములుజెందును. జడములైనఅవిస్వయముగా సంయోగవియోగములుచెందలేవు. 
యజ్ఞాదికర్మలుఇష్టము,తటాకాదినిర్మాణము పూర్తము.ఈఇష్టపూర్తాదిరెండుకర్మలనుసత్కర్మలుఅందురు.                                         రాష్ట్రంవాఅశ్వమేథః శతపథ13163.
రాజు న్యాయముగ, ధర్మానుకూలముగా ప్రజాపాలనచేయుటయే అశ్వమేథం.                                          అన్నగంహిగౌః .......శతపథ43125 
అగ్నిర్వాఅశ్వః శతపథ3555 ఆజ్యంమేథః శతపథ132112 అన్నముఅనగాఆహారము,ఇంద్రియములుపరిశుద్ధముగాఉంచుటయేగోమేథము. మనిషిచనిపోయినతదుపరివిధిపూర్వకముగాకర్మకాండచేయుటయేనరమేథము.
చతుర్దశవిద్యా                                                 విద్యలుపదునాలుగువిధములు.
అవి1)నాలుగువేదములు 2)శిక్ష, వ్యాకరణము, నిరుక్తము, కల్పము, ఛందస్సు, జ్యొతిష్యము,అనేఆరుఅంగములు3)మీమాంసన్యాయ,పురాణములుమరియుధర్మ శాస్త్రములుఅనే నాలుగు ఉపాంగములు.
వేదములు............మహావాక్యములు ప్రజ్ఞానంబ్రహ్మఅనగాజ్ఞానమేబ్రహ్మఅనేఈమహావాక్యము ఋగ్వేదంలోని ఐతరేయ ఉపనిషద్ లోనిది. ఇందులో హోత అనే బ్రాహ్మణుడు ఋక్ లు అనేమంత్రముల చదువును.  అహంబ్రహ్మాస్మిఅనగా నేనే బ్రహ్మను అనే ఈమహావాక్యము యజుర్వేదంలోనిబృహదారణ్యకోపనిషద్ లోనిది.  ఇందులో యజ్ఞానికిబాద్యత అధర్వుడు అనే బ్రాహ్మణునిది.
ఆంధ్రత్వంఆంధ్రభాషాశ్చాఆంధ్రదేశస్వజన్మభూః తత్రాపియజుషిశాఖానఇప్యశ్యతపసఃఫలః
ఆంధ్రుడుగాపుట్టడము, తనభాష తెలుగుగా ఉండటము, తనజన్మభూమిగా ఉండటము,అందునాయజుర్వేద సంప్రదాయములో ఉండటముఅనేది ఎంతోతపస్సు చేస్తే కాని కలగదు.             తత్వమసి అనగా ఆబ్రహ్మవు నీవేఅయిఉన్నావనే ఈ మహావాక్యము సామవేదంలోని ఛాందోగ్యోపనిషద్ లోనిది. ఇందులో సామవేద మంత్రములుచదివేబాద్యతఉద్గాతఅనేబ్రాహ్మణునిది.     అయంఆత్మాబ్రహ్మఅనగా ఈఆత్మయేబ్రహ్మ  అనే ఈమహావాక్యముఅధర్వణవేదంలోనిమాండూక్యోపనిషద్ లోనిది. ఇందులోహోత,అధర్వుడు,ఉద్గాత, యజ్ఞంచేయిస్తారు. కానీ మొత్తంయజ్ఞం బాధ్యతబ్రహ్మది.
కొన్నిమంత్రములు ఉదత్త అనగా స్వరముపెంచిపైకి,కొన్ని అనుదత్త అనగా స్వరము తగ్గించిక్రిందకి,కొన్నిస్వరితఅనగాస్వరముసమానముగాను,ఉండవలయును. నటఅనగాపాత్రధారుడులేదానాట్యముచేసేవాడు.విటఅనగాసంగీతముమరియుసాహిత్యములలోచక్కటిఅవగాహనఉన్నవాడు.గాయకఅనగాసంగీతవిద్వాంసుడు. ఉచ్ఛారణము,స్వరము,మాత్ర.బల,సమమరియుసాంత్వనఉన్న పాటలు సంగీతము మనోరంజకము.          
ఉత్తిష్ఠత జాగ్రత ప్రాప్య వరాన్నిబోధిత  క్షురస్యధారా నిశితా దురత్యాయ దుర్గం పతస్త కవయో వదంతి.       కఠ 314          
అవిద్య అనే నిద్రనుండి లెమ్ము, నీవు ఆ పరమాత్మను పొందేవఱకు జాగ్రత్తగా ఉండు. ఈఆధ్యాత్మవిద్యఅనేది కత్తిమీదనడకవంటిది. విద్వాంసులు ఆమార్గము కష్టమనే చెప్పుచున్నారు.                             
వేదములోముఖ్యమైనవి1)సంహితచెట్టు,మంత్రములనుచదువు,2)బ్రాహ్మణములు...పుష్పం...మంత్రముతోకూడినయజ్ఞం,మంత్రములకనుగుణముగాయజ్ఞములుచెయ్యి,3)అరణ్యకములు... ఫలం,పరఅపరమధ్యనున్నగోడనిదాటు,4)ఉపనిషద్సారాంశము--అంతఃకరణములో అంతర్ముఖంచెందుట అనేదిఆయావేదముయొక్కసారాంశము యాజ్ఞవల్క్యుడిశిష్యుడుజనకుడు,శిష్యురాలుగర్గి.జనకుడిశిష్యుడుశుకుడు.యాజ్ఞవల్క్యుడి ఆదిత్యోపాసనము ద్వారా శుక్లయజుర్వేదము ప్రపంచానికి లభించినది.  కాత్యాయని,మైత్రేయి,యాజ్ఞవల్క్యుడిభార్యలు.  యాజ్ఞవల్క్యుడు తనఆస్థినంతటిని భార్యలిద్దరికీపంచదలుచుకుంటాడు. అప్పుడు మైత్రేయి ఆర్థికసంపత్తి తనకు అమరత్వమును ప్రసాదించదని తెలుసుకుంటుంది. ఆమైత్రేయి యాగ్నవల్క్యుల అద్భుతమైనసంభాషణే బృహదారణ్యకోపనిషద్.
యజ్ఞములుమూడురకములు 1)పాకయజ్ఞం..అష్టక,స్థాళీపాక,పర్వాణ,శ్రావణి, అగ్రహయాణి, చైత్రి మరియు అశ్వాయుజ అని ఏడురకములు. వీటిలో బలులుండవు.    
2) హవిర్ యజ్ఞం...అగ్నియథన, అగ్నిహోత్ర,దర్శపూర్ణమాస,అగ్రాయణ,చాతుర్మాశ్య, నిరూఢపశుబంధ మరియు సత్రామణి అని ఏడురకములు. మొదటిఅయిదురకములలోబలులుండవు.మిగిలినరెండురకములలోబలులుండును. 3)సోమయజ్ఞంఅగ్నిస్తోమా, అత్యాగ్నిస్తోమా, ఉక్త్య, షోడశి, వాజపేయ, అతిరత్ర మరియు ఆపోర్యమా అని ఏడురకములు. అన్నింటిలో బలులుండును. )                                     ఈఏడురకములసోమయజ్ఞంలో 1)వాజపేయము ఇందులోతనలోని ఇరువది మూడురకముల పశులక్షణములను బలిచేయవలయును. ఇదికాక, 2)అశ్వమేధం.... క్షత్రియుడుచేసేది.ఇందులోతనలోనినూరురకముల పశులక్షణములనుబలిచేయవలయును.   అసలుబలి అనగాసాధకుడు తనలోని పరమాత్మపొందుకు అడ్డుతగులుతున్న లేదా ప్రతికూలమైన ఇంద్రియలక్షణములను బలిచేయుటయే. 
ప్రతివక్తభాషణ లేదా ఉపన్యాసముఇచ్చునపుడు ఉపన్యాసపు అంగములైన 1)ఉపక్రమ--మొదలెట్లాపెట్టాలి 2)అభ్యాస.....చెప్పదలచుకున్నదేమిటి?, 3)అపూర్వత....  తనసందేశముయొక్క ఉద్దేశ్యము లేదా విశిష్టత, 4)ఫలముఅనగా పొందేది లేదా ఉపయోగముఏమిటి? 5)అర్థవాద-పనియొక్కఉద్దేశ్యము, 6)ఉపపత్తి...చెప్పదలచుకున్నది స్థిరీకరించటము మరియు 7)ఉపసంహారం.. ముగింపులను  గుర్తుంచుకోవాలి.                                   
వేదాంగములు                                                       
శిక్ష         ప్రతిఅక్షరము తగురీతిన ఉఛ్ఛముగా, నీచముగా(మంద్రము) మరియు మధ్యస్తముగా లేక సమానముగా ఉఛ్ఛరించవలయును. శిక్షవేదమునకు ముక్కు లాంటిది.                                                   
వ్యాకరణము  
వేదమునకునోరులాంటిదివ్యాకరణము.భాషయొక్కగొప్పతనమునుతెలియచేయును.           నిరుక్తము నిరుక్తమనేది నిఘంటువు(Dictionary).ఆయాశబ్దముయొక్క మూలము తెలియజేయును. మొదట అంతటాసంస్కృతభాషఉండెడిది. ఆతరువాత ప్రాంతీయభాషలు ఉత్పన్నమైనవి. వేదమునకు చెవుల్లాంటిది నిరుక్తము.                కల్పము 
పుట్టుక మొదలు మరణమువఱకు ముక్తికికావలిసిన గృహమరియుస్రౌత సంస్కారములను 40 సంస్కారములుగా విభజించి తెలియపఱచునది కల్పము. కల్పము వేదమునకుహస్తములు.                        
ఛందస్సు సామమరియుఋగ్వేదములలోనిమంత్రములుపద్యరూపములోను,వేదమునకుసంబంధించనిపద్యములు శ్లోకంరూపములోనుఉండును. వేదములోఎక్కువభాగము పద్యరూపములో తక్కువభాగము గద్యరూపములోనుండును. ఒకసరియైనపద్ధతి ప్రకారము ఆపద్యనిర్మాణముచేయుటకు ఛందస్సుతోడగును. యజుర్వేదములో పద్యముమరియుగద్యము రెండూఉండును. ఛందస్సు వేదమునకు పాదములు. వేదములలోను ఆతరువాతవచ్చిన కవిత్వములోను వివిధరకములైన వ్యాకరణము అనగాఛందస్సుసూత్రములనుఉపయోగించారు. నాలుగుపాదములుగాను,అచ్చులు,అచ్చులు మరియు హల్లులు కలిపి సంయుక్తంగా ఏర్పడిన ఎనిమిదిఅక్షరములతోకూడినశ్లోకములను అనుష్తుభ్ ఛందస్సు అంటారు. 
ఉదాహరణకి.....శు క్లాం బ ర ధ రం వి ష్ణుం అనేది ఎనిమిది అక్షరములతోకూడిన అనుష్తుభ్ ఛందస్సు.                                                            ప్రతిమంత్రమునకుఒకదేవత,పైనఉదాహరించినఒకపద్ధతి,దానికిసంబంధించినఋషిఉంటారు. ఆఋషికాళ్ళు మనతలమీదఉన్నట్లుగా భావించాలి. ఆయామంత్రం చదువుతూ మనతలమీద చేతులుపెట్టుకోవాలి. దీనిఅర్థం ఆమంత్రంప్రసాదించిన ఆఋషి కాళ్ళుపట్టుకొని ఆయనికి గౌరవం ఇచ్చినట్లులెక్క.
గాయత్రి, ఉస్నిక్,అనుష్తుభ్,బృహతి,పంక్తి,త్రిష్తుభ్,జగతి అనేవి వేద మంత్రములలోని వివిధఛందస్సులు.  వీటిలో 9, 11, మరియు12అక్షరములుఉపయోగించారు.  వేదకాలములోమొట్టమొదటగా బయటికివచ్చిన కవిత వాల్మీకిరామాయణము.  అందు మొదటి శ్లోకముమానిషాదప్రతిష్ఠమ్ త్వం అగమఃశాశ్వతీసమఃయత్ క్రౌంచంమిథునాదేకంఅవధిఃకామమోహితం.
దీనికి రెండు అర్థములు---
మొదటిఅర్థము---  ఓయీ బోయవాడా! తనభార్యతో హాయిగా ముచ్చటించుకుంటున్న ఆక్రౌంచపక్షిని చంపావు.  నీవు అశాంతిగా కాలము గడుపుదువుగాక.
రెండవఅర్థము.....అజ్ఞానముతోను,కామముతోనుకూడిన రావణ మరియు మండోదరి జంటలో ఒకరైన రావణుని చంపావు. శ్రీలక్ష్మిభర్తవైన ఓశ్రీమహావిష్ణు, నీకుశాశ్వతమైన కీర్తికలుగుగాక.   బోయవాడు శ్రీమహావిష్ణు అవతారమైన శ్రీరాముడు.             
జ్యోతిషము(astronomy..astrology)... వేదమునకునేత్రములలాంటిదిజ్యోతిషము.ఖగోళమరియుభవిష్యత్తునితెలియపఱచేరెండుశాస్త్రములనుకలిపిజ్యోతిష్యముఅందురు.
3)ఉపాంగములు                                           
మీమాంస
జైమినీ(మీమాంశ).......సాంఖ్య,మీమాంసకులుఉభయులూ, జగత్కర్త ఈశ్వరుడు కాదు అంటారు. ఈశ్వరుడు కేవలంజ్ఞానస్వరూపుడు. రాళ్ళురప్పలతో కూడిన ఈజగత్తుకుకర్తకానేరడు అంటారు సాంఖ్యులు. కేవలంజ్ఞానస్వరూపుడైన ఈశ్వరుడు మనకుకర్మకితగినఫలమునుఇచ్చేస్వల్పమైనపనులుచేయడు.మనకుకర్మకితగిన ఫలమునుమనమేపొందుతాము.    వైదికకర్మలుమాత్రమేఆచరణీయముఅంటారుమీమాంసకులు.సాంఖ్యులుచెప్పేపురుషుడెనిర్గుణబ్రహ్మ. ఆయన సగుణబ్రహ్మగా ప్రపంచాన్నిరచించి దానిఫలితాన్నికూడా నిర్ణయిస్తాడుఅంటారువేదాంతులు.  పూర్వమీమాంసకులుద్రవ్యమునిత్యముఅంటారు. వర్ణములు అనగా అక్షరములు నిత్యములు, సర్వవ్యాపకములు, శ్రోత్రేంద్రియవేద్యములు లేదా గ్రాహ్యములు. వర్ణములు,వర్ణసముదాయరూపశబ్దములునిత్యములు.అవియేద్రవ్యములు.అవియే సర్వవ్యాపకములు.  జైమినీయులకు వేదమునిత్యము. జీవుడుయోగముద్వారా పాపరహితుడై ఐశ్వర్యయుక్తుడై,తనఅంతర్యామియైనబ్రహ్మనుబొంది ఆనందమును అనుభవించును.
కణాదుడు(వైశేషికం)                                             
ఇది న్యాయశాస్త్రంలోనిదే, కానీదీనిప్రత్యేకతవలన దీనికి వైశేషికంఅనిపేరువచ్చినది. ఈప్రపంచాన్నిపరమాత్మవివిధరకములఅణువులకలయికతోచేశాడు.వ్యష్టాత్మఅనగాప్రతిప్రాణిలోనూఉండేఆత్మ, బ్రహ్మాండం ఈరెండూనూ ఈశ్వరునికంటే భిన్నమైనవి అని న్యాయవైశేషికములు రెండింటిలోనూచెప్తారు. గుణసంబంధము సంపూర్ణముగా నాశనముకావలయును. తత్తదుపరి ఆకాశమువలె ఉండు సర్వవ్యాపకస్థితి లేదా నిర్వికారస్థితిని మోక్షముఅంటారు. ఈశ్వరుడే సర్వజగత్తుకి నిమిత్తకారణము. పదార్థవిజ్ఞానముచేతనే పరమశ్రేయస్సు అగుముక్తిలభ్యమగును. పదార్థముల వాస్తవికతలను స్పష్టముగాతెలియగా మిగిలినది పరమాత్మస్వరూపము.    ఏడుపదార్థములు:....
ద్రవ్యగుణకర్మసామాన్యవిశేషసమవాయాభావాఃసప్తపదార్థాః1)ద్రవ్య,2)గుణ,3)కర్మ,4)సామాన్య,5)విశేష,6)సమవాయ,7)అభావ.                     ద్రవ్యఅనగాస్థూలం.ఈద్రవ్యమును పృథివి,ఆప లేక నీరు  తేజఃలేకఅగ్ని,వాయు, ఆకాశ, కాలం, దిక్కు, ఆత్మ మరియు  మనస్సు అని తొమ్మిదివిధములుగా విభజించారు.  మొదటి ఐదు అనగా పృథివి, ఆప లేక నీరు, తేజః లేక అగ్ని,వాయు,ఆకాశములను,పంచభూతములంటారు.  గుణఅనగాజ్ఞాన,కోరిక,సంతోషం, దుఃఖం, రంగు మొదలగునవి. కర్మఅనగాపని. సామాన్యఅనగామానవపశువు,పక్షిమొదలగుజాతులు. విశేషఅనగాబాగాపాలిచ్చేఆవులు మరియు ఇవ్వనిఆవులు అని ఒకేజాతిలో వ్యత్యాసములు.
సమవాయఅనగా సూర్యుడు,సూర్యకిరణములు వేరుచేయలేనిపరిస్థితి, అభావ అనగా ఏభావమూవ్యక్తపఱచకుండుట.        
ఈశ్వరుడేకుండలుచేసేకుమ్మరిలాగా సర్వజగత్తుకినిమిత్తకారణము.అణువులుకుండకుపయోగించేమన్నులాగాఉపాదానకారణము.
గౌతముడు(న్యాయలేకతర్క) గగనమువలెసర్వవ్యాపకమై,నిర్వికారమై,జ్ఞానస్వరూపమై,స్వస్వరూపముతోభాసిల్లుమహోత్తమస్థితియేమోక్షము.
ఈశ్వరుడేకుండలుచేసే కుమ్మరిలాగా సర్వజగత్తుకి నిమిత్తకారణము. ఈశ్వరుడువేరు, జగత్తువేరు.  జగత్తు నిత్యము. అనిత్యమైనమాయకాదు.   ప్రమాణ, ప్రమేయ, సంశయ, ప్రయోజన, దృష్టాంత, సిద్ధాంత, పయస, తర్క, నిర్ణయ, వాద, జల్ప, వితండా, హేత్వభాస, ఛ్ఛలజాతి, నిగ్రహస్థానానాం, తత్వజ్ఞానాత్ నిశ్శ్రేయసామధిగమః  అనేవి షోడశపదార్థములు. 16670(గౌతమన్యాయ)
పరమేశ్వరుడేఈజగత్కర్తఅనినిరూపించటమేనైయ్యాయికుల ముఖ్య ఉద్దేశ్యము.
అష్టాదశపురాణములు 
బ్రాహ్మంపాద్మంవైష్ణవంచశైవంలైంగంసగారుడం నారదీయంభాగవతంఆగ్నేయంస్కాందసంజ్ఞాత
మ్భవిష్యంబ్రహ్మవైవర్తంమార్కండేయంసవామానం
వారాహంమాత్స్యకూర్మంచబ్రహ్మాండాఖ్యమితిత్రిషట్           
 బ్రహ్మ, పద్మ,విష్ణు, శివ, లింగ, గరుడ, నారద, భాగవతం, అగ్ని, స్కంద, భవిష్య, బ్రహ్మవైవర్తం, మార్కండేయం, వామన, వరాహ, మత్స్య, కూర్మ, బ్రహ్మాండ అనే అష్టాదశ అనగా పదునెనిమిది పురాణములను వ్యాస భగవానుడు రచియించెను.
ధర్మశాస్త్రములు  
మనుస్మృతి,యాజ్ఞవల్క్య మరియు పరాశరస్మృతి ఇత్యాది స్మృతులన్నియు ధర్మ శాస్త్రములపరిధిలోనికి వస్తాయి.  సంఘములోని వివిధవర్ణముల ధర్మముల గురించి ప్రస్థావించి ఆయావర్ణమునుబట్టి చేయవలసిన విద్యుక్తధర్మములగురించి సూచనలనిస్తాయి.జాతకకర్మలు(జన్మనెత్తిశిశువుకుచేయవలసినకర్మలు),శిశు నామకరణము, అన్నప్రాసన, చౌలలేక చూడకర్మ(శిశువుపుట్టెంటికలు కత్తిరించు కర్మ), పాణిగ్రహణము మరియు గర్భాధారణక్రియలు ఇత్యాది నలుబదిరకముల సంస్కారములప్రస్థాపన ఈధర్మశాస్త్రములలోఅనగా స్మృతులలో ఉండును. 
ఆదిశంకరాచార్యులవారు                                 వేదములు కూడా నిత్యములు కావు.  ఆపరబ్రహ్మమే నిత్యము. వేదాంతములైన ఉపనిషత్తులు మాత్రము పరబ్రహ్మబోధకములు.పరబ్రహ్మజ్ఞానముకలుగువఱకుఆఉపనిషత్తులునిత్యములు.తదితరములుదృశ్యములు,నాశశీలములు.ఇదివేదాంతమతము. 
అష్టవిధప్రమాణములు                 
1)ప్రత్యక్షము...ప్రత్యక్షంకింప్రమాణం?
ప్రత్యక్షముగా చూసిన మరియు విన్నదానికంటె ప్రమాణము ఏమున్నది? ఇంద్రియార్థసన్నికర్షోత్పన్నంజ్ఞానమన్యపదేశ్యమవ్యభిచారివ్యవసాయాత్మకంప్రత్యక్షం                     గౌతమన్యాయదర్శనం  14 .
శబ్ద, స్పర్శ, రూప, రస, గంధములతో శ్రోత్ర, త్వక్, చక్షు, జిహ్వ, ఘ్రాణములకు సంబంధముకలిగిసంశయరహితమైనది.  2)అనుమానము....కారణమునుచూచుటవలన కార్యజ్ఞానము కలుగుట, మేఘమును చూచి వర్షముకలుగును అనుకొనుట. కార్యజ్ఞానమును చూచుటవలన కారణము తెలుయుట, వర్షముకురుయుట(కార్యము), మేఘము(కారణము) అయినట్లు, దూరమునుండిపొగనుచూచి నిప్పుఉన్నదికాబట్టి పొగవస్తున్నది అనుకోవటంలాంటిదికూడాఅనుమానప్రమాణమే. 3)ఉపమానము...ఒకవస్తువునుపోలికలతోగుర్తుపట్టుట.  మచ్చలు కోఱలు గోళ్ళు అడుగుజాడలు మొదలగునవిచూచి పులి అని గుర్తుపట్టటంలాంటిది. 4)శబ్దప్రమాణముఓంకారము వినబడుటవలన పరమేశ్వరునికి చేరువవుతున్నా మని విశ్వశించుట, 5)ఐతిహ్యము(ఇతిహ) అనగా  ఇట్లుండును ఇట్లుండెను 6)అర్థాపత్తికారణములేనిదే కార్యములేదు. చలిపుట్టుట కార్యము దానికి కారణము శరీర అస్వస్థత లేదా వాతావరణములో మార్పు7) సంభవముసృష్టి క్రమమునకు అనుకూలమైనది, 8)అభావముసరియైనవస్తువుని తప్పుడిది అనుకొనుట,  తప్పుడు వస్తువును సరియైనది అనుకొనుట . 
వేదముఅందరూచదవవచ్చు.   
యథేమాంవాచకల్యాణీ మావదానిజనేభ్యః  బ్రహ్మ రాజన్యాభ్యా గ్శూద్రాయ చార్యాయ చస్వాయచ                      యజుర్వేదం 26---2
పరమాత్మఅయిననేనుప్రజలందరికోసరము కళ్యాణకారి అయిన ఈవాక్కులను బ్రాహ్మణులు,క్షత్రియులు, శూద్రులు, స్త్ర్రీలు మొదలగు మానవజాతికంతటికీ విశద పఱచుచున్నాను. 
నాస్తికోవేదనిందకః    
వేదములను నిందించువాడునాస్తికుడు. గార్గి,మైత్రేయిమొదలగువారు వేదవిద్యను నేర్చుకొనియుండిరి.
బ్రహ్మచర్యేణకన్యాయువానాంవిందతేపతి          అథర్వణవేదం                                 వేదవిద్యనేర్చుకొని బ్రహ్మచారిణులైనస్త్రీలు తమకుతగిన బ్రహ్మచారులను వివాహ మాడవలయును.  జగత్తుయొక్కఉత్పత్తినిగురించిఒక్కొక్కశాస్త్రముఒక్కొక్కవిధముగతెలియపఱచినది. ఉదాహరణకిమీమాంసయందుకర్మముచేతను,వైశేషికమందుకాలముచేతను.న్యాయమునందుపరమాణువులచేత,యోగమందు పురుషార్థముచేతను, సాంఖ్యమునందు ప్రకృతిచేతను, వేదాంతమందు బ్రహ్మచేతను, జగత్తుయొక్క ఉత్పత్తికలిగినదని వ్రాయబడినది.   
రాగము, ద్వేషము, ప్రయత్నము లేక పురుషార్థము, సుఖము, దుఃఖము, తెలివి మరియు సత్వ రజ తమో గుణములు కలిగినది జీవాత్మ.  యుక్తాయుక్త విచక్షణాజ్ఞానముకలిగినది బుద్ధి.  సంశయాత్మకమైనది మనస్సు.
స్త్రీ
యత్రనార్యస్తుపూజ్యంతెరమంతె తత్రదేవతాః
యత్రైతాస్తు నపూజ్యంతేసర్వాస్తత్రాఫలాఃక్రియాః         మను 3--56  స్త్రీలకుగౌరవముఉన్న దేశములో దేవతలు ఆనందముతో ఆడుకుంటారు. స్త్రీలకు గౌరవములేని దేశములోఅన్నికార్యములు నిష్ఫలములగును.      
ఎవని అధీనమునందు శరీరము,ప్రాణము,ఇంద్రియములు,అంతఃకరణము ఉండునో వాడుస్వతంత్రుడు. కేవలము పుట్టుకకు,పుట్టుకతదుపరి కొంతసమయమువఱకు మాత్రమే తల్లిదండ్రులు కారణము. పెరిగిపెద్దవారైనతదుపరి ఆయాపిల్లలపనులకు  పిల్లలే కారణమగుదురు.ఆయాఫలితములను ఆపిల్లలే అనుభవించవలయును. అదేవిధముగామనచేష్టలకి సృష్టికర్తయైనపరమాత్మకారణముకాజాలడు. హత్యచేసిన హంతకునిపోలీసులుపట్టుకెళ్ళుదురు.హత్యకిఉపయోగించిన కత్తినితీసికొని జైల్లో పెట్టరు.
జీవుడుపరమాత్మ పరమాత్మచైతన్యముతోజడుడైనజీవుడుచైతన్యవంతుడగును.పరమాత్మచైతన్యము లేనిదిశవం.పరమాత్మచైతన్యముతోకూడినది శివం. సృష్టి ఉత్పత్తి స్థితి ప్రళయము సర్వజగత్తునూనియమములోఉంచుట,జీవులకుకర్మఫలములనుబట్టిజన్మములు కలగజేయుట,అనునవి నిత్యజ్ఞానము, నిత్యానందము, అనంతబలము, కలిగిన సర్వ వ్యాపిఅయినపరమాత్మలేదాఈశ్వరునిపని.సంతానోత్పత్తి, సంతానపాలన,విద్యాబుద్ధులునేర్పుట,నేర్చుకొనుట మొదలగునవి జీవునికర్మలు. ఇఛ్ఛ,అనిఛ్ఛప్రయత్నము లేక పురుషార్థము సుఖము దుఃఖము జ్ఞానము లేదా అజ్ఞానము జీవునికి కలవు. 
ఈవిషయములో న్యాయ వైశేషికులు ఇద్దరూను ఒకేఅభిప్రాయముతో ఉంటారు. ప్రాణముపీల్చుట,వదలుట,కన్నులుతెఱచుట,మూయుట,వృద్ధి,క్షత,ప్రరోహణాదులు,నిశ్చయించుట,స్మరించుట,అహంకరించుట,గతి,ఆకలి,దప్పిక,సుఖించుట,దుఃఖించుటఅనునవిజీవునిగుణములుగావైశేషికులుపరిగణిస్తారు.  ఆత్మఈశరీరములో ఉండునంతవఱకే గుణములుఉండును. ఆత్మలేనియడల గుణములుఉండవు.  పరమాత్మకి అంతావర్తమానమే. భూత,భవిష్యత్,కాలములుఉండవు. పరమాత్మ జ్ఞానముఏకకాలజ్ఞానముఅనగాఅంతావర్తమానమే.
వేదములుభారతదేశము                               
ఆగ్నేర్ ఋగ్వేదో వాయోర్ యజుర్వేదోసూర్యాత్ సామవేదః......శతపథ 1142.3 సృష్ట్యాదియందుపరమాత్మ,అగ్ని,వాయువు,ఆదిత్య, ఆంగీరసఅనుఋషుల ఆత్మల యందు ఒక్కొక్కవేదమును ప్రకాశింపజేసెను.
అగ్నివాయురవిభ్యస్తుత్రయంబ్రహ్మసనాతనందుదోహయజ్ఞసిద్యర్థమృగ్యజు స్సామలక్షణం    మను 1---23       
పరమాత్మ  సృష్టిప్రారంభమున మనుష్యులను ఉత్పాదించి నలుగురుమహర్షుల ద్వారా నాలుగువేదములను బ్రహ్మకు ప్రాప్తింపజేసెను.  ఇక్కడ బ్రహ్మ అనగా పరబ్రహ్మకాదు,కార్యబ్రహ్మఅనిగుర్తుంచుకొనవలయును. అగ్ని అనగా మణిపుర, వాయువు అనగా అనాహత, ఆదిత్య అనగా సహస్రార, ఆంగీరస అనగా స్వాధిస్ఠానచక్రములు. వేదముఅనగా వినబడునది అని అర్థము అనగా ఓంకారమే.                                         ఓంఇత్యేకాక్షరంబ్రహ్మవ్యాహారన్మాంఅనుస్మరన్యః ప్రయాతిత్యజన్దేహంసయాతిపరమాంగతి.......            గీతా 8---13
పరబ్రహ్మమునకు వాచకము ఓం అనుఅక్షరమే.  ఆ  ఓం అను శబ్దమును అనుక్షణము స్మరించుము. ఎవడట్లా ఆఓం అనుశబ్దమునుఅనుక్షణముస్మరించుచూ దేహమునువిడుచునోఅతడుపరమోత్కృష్టమోక్షస్థానమునుపొందును. పరబ్రహ్మప్రథమోగురుఃపరబ్రహ్మప్రథమోభిషక్ పరమేశ్వరుడేప్రథమగురువు.పరమేశ్వరుడేతనవాచకముఓంఅనుఅక్షరముద్వారా మనకుఅన్నీనేర్పాడు,నేర్పును,నేర్పుతున్నాడు. పరమేశ్వరుడేప్రథమవైద్యుడు. ఓంకారమే ఆయనమనకిచ్చు దివ్యౌషధము. ఓంకారధ్యానముద్వారా అనగా ప్రాణాయామముద్వారా సకలఐశ్వైర్యములు, ఆయురారోగ్యములు కలుగును.  సమాథిస్థితిలోపరమేశ్వరుడినుండిగ్రహించినవిషయములనుబ్రాహ్మణములందురు. వీటినేవ్యాఖ్యానగ్రంథములందురు. ఋక్,యజు,సామ,అథర్వణ వేదములలోని మంత్రములను వేదములందురు.  ఈ మంత్రములను ఋషులకు ప్రసాదించినది ప్రథమమున పరమేశ్వరుడే.  ఋషులువాటివ్యాఖ్యానకర్తలు. ఈవ్యాఖ్యాన విషయములను బ్రాహ్మణములందురు. ఋషులుక్రాంతిదర్శులు.  నిస్వార్థపరులు. వారు తమతమ సర్వస్వమంతా ప్రజాశ్రేయస్సుకే ధారపోశారు. అప్పటిఋషులు కనిపెట్టినవిషయములకుపేర్లుపెట్టుకోలేదు. అన్నివేదములలోను మొత్తము 1127 శాఖలు ఉన్నవి. 
భూమినుండి పైకివెళ్ళిన పృథివి,జలముమరియు అగ్నిలత్రసరేణువులకలయికవల్ల తటాకములోఆకాశమునీలముగా కనబడును. పృథివి,జలము మరియు అగ్నిల త్రసరేణువుల కలయికవల్ల వర్షమువచ్చును.  ఆకలయికకొఱకై యజ్ఞములు చేయుదురు.                
మనకు అనగా భారతదేశము క్రింద అమెరికాదేశము ఉన్నది, మన క్రిందఉన్నదాన్నిపాతాళలోకముఅంటారు.మహాభారతములో సంప్రదించిన పాత్రలలో కొన్ని  ఉదాహరణకి....బభ్రువాహనుడు అమెరికాదేశమునుండి, శల్యుడు ఇప్పుడున్న ఇరానునుండి,భగదత్తుడుఇప్పుడున్న చైనానుండి, బిడాలాక్షుడు ఇప్పుడున్నయూరపు  నుండి వచ్చిఉండవచ్చు.  మంత్రము, మంత్రాంగము, మంత్రిఅనునదిఆలోచనలకుపేరు.   ఆలోచనలవలననే పూర్వమునుండి ఇప్పటివఱకు అనేక అస్త్రశస్త్రములు పదార్థముతోనేఏర్పడినవి.ఆగ్నేయాస్త్రముఅనగా నిప్పు పుట్టించునది, వారుణాస్త్రము అనగా నీరుపుట్టించునది, నాగపాశము అనగా ఇంద్రియములను బంధించునది, మోహన లేక సమ్మోహనాస్త్రము  అనగా మైకము కమ్మించునది. దీనికిసమానమైనఅస్త్రములు ఆలోచించినయడల ఇప్పుడూఉన్నవి.  కాకపోతే పేరులోమార్పు.  మోహన లేక సమ్మోహానాస్త్రము అనగా ప్రస్తుతములో   ఉపయోగించే భాష్పవాయుప్రయోగము అని అర్థమగు చున్నది.
నిరస్తపాదపేదేశేఏరండోపిద్రుమాయతేయస్మిన్ దేశేద్రుమోనాస్తితత్రఏరండోపిద్రుమాయతే.      ఏమీలేనిచోట ఆముదపుచెట్టే మహావృక్షము. 
సమస్తమతములు, విద్యలు, ఆర్యావర్తదేశమునుండే వ్యాపించినవి. గొప్పగొప్ప విద్వాంసులు,రాజులు, మహారాజులు, ఋషులు, మహర్షులు అనేకులు మహాభారత ఇతిహాసకాలమునబలిగానర్పింపబడిరి.అనంతరమువిద్యయు,వేదోక్తధర్మప్రచారమునష్టముకాసాగెను.బలవంతుడైనవాడుతనచేతికిజిక్కినదేశములోబఱచుకొని,తానొకరాజయికూర్చుండెను.  ఇట్లు భారతదేశమంతా తునాతునకలైపోయింది.  గుణకర్మ స్వభావములచే కలుగుచుండిన కులవ్యవస్థ రద్దుపఱచబడి జన్మచేవర్ణమును స్థిరపడుటవలన ఇంకా ఇంకా పాడయిపోతూవచ్చినది. 
ఉపదేశ్యోపదేష్టృత్వాత్ తత్సిద్ధిఃఇతరథాంథపరంపరా.    సాంఖ్యం 37981 ఉత్తములయిన ఆచార్యులుఉన్నపుడే ధర్మార్థకామ మోక్షములు చక్కగాసిద్ధించును.  లేనియడల గుడ్డి ఆచారములు వ్యాపించును.
కార్యకారణములు                                               సత్వ రజస్తమో గుణములు మూడూ కలిసినదే ప్రకృతి. ప్రకృతిచేఉత్పన్నమైన పరమసూక్ష్మాణువులుకలియుట అనగా సంసర్గము వలన ఏర్పడు సూక్ష్మ తత్ పశ్చాత్ స్థూలపరిమాణము లను సృష్టిఅందురు.మొదటిసంసర్గమునకుకావలిసినపదార్థమునుకారణము(catalyst)అంటారు.సంసర్గమువలనఏర్పడినపదార్థమునుకార్యమంటారు.సంసర్గమరియు వియోగానంతరము పదార్థముల రూపురేఖలుతత్పశ్చాత్ వాటిగుణములు మార్పు జెందును.  హైడ్రొజెను(ఉదజని) ఆక్సిజెను(ప్రాణవాయువు)  అనే పదార్థములు రెండూనూ సంసర్గమునకుముందు కంటికికనిపించనివాయువులు. సంసర్గమునకు తదుపరి కంటికికనిపించు జలముగా మార్పుచెందువిధముగాపదార్థముల రూపు రేఖలు సంసర్గ మరియు వియోగానంతరము మార్పుజెందును. సృష్టిసమయములో పరమాత్మ పరమసూక్ష్మాణువులుకలియుటకుకావలిసినచేతననుచేకూర్చును.  ఇది ప్రప్రథమావస్థ.  పరమసూక్ష్మమగు  ప్రకృతిఇదే. పరమసూక్ష్మమగు ప్రకృతినే ప్రధానము అందురు.ఈపరమసూక్ష్మమగు ప్రప్రథమావస్థప్రకృతి అయిన ప్రధానము నుండిఉత్పన్నమగుసూక్ష్మమగు(అనగాఇంకొంచెంస్థూలమగుదానిని)ప్రథమావస్థనిమహత్తత్వము అందురు. ఈమహత్తత్వము గోచరమగు అనగా కనిపించుసృష్టికి కారణము.ఆకాశ,వాయు,అగ్ని,జల,పృథివి,తత్తదుపరిఅనేకములుఉత్పన్నమైనవి.  మనుష్యాఋషయశ్చయేతతోమనుష్యాఅజాయంత యజుర్వేదము............31---9 ఆదియందుమనుష్యులు,ఋషులుఅనేకములుఉత్పన్నమైనవి. విజానీర్యాన్యేచదస్యవఃఋగ్వేదంఉతశూద్రెఉతార్యే                               అథర్వ
మొదట మనుష్యులందరు ఒక్కటిగనేఉండిరి. తత్తదుపరి వారివారికర్మలనుబట్టి నాలుగువర్ణములుగా బ్రహ్మ, క్షత్రియ, వైశ్య, శూద్రులుగా విభజించబడిరి. విద్వాంసులనుఆర్యులని, అవిద్వాంసులను అనార్యులని, దస్యులని అందురు.  విద్వాంసులగు ఆర్యులు నివసించయోగ్యమగు ప్రదేశమైన ఈహిందూదేశమునకు ఆర్యావర్తము అని పేరువచ్చినది. సృష్టిఇప్పటికి196కోట్లచిల్లరసంవత్సరములు జరిగినదనిఒకలెక్క.పరమసూక్ష్మమైవిభజించబడని పదార్థమును పరమాణువు అందురు.
 ఆకాశము---నీలంరంగు                                     
60పరమాణువులు=ఒకఅణువు.                                2అణువు = ద్వ్యణుకము లేదా స్థూలవాయువు         3ద్వ్యణుకములు = ఒక అగ్నిలేదా త్రస రేణువు          4 ద్వ్యణుకములు = ఒకజల రేణువు        5 ద్వ్యణుకములు = ఒక పృథివి రేణువు.
4ద్వ్యణుకములుకలిగిన జలరేణువుల జలభాగమువలన ఆకాశమున నీలముగ కనబడును.  2 అణువులుకలిగిన ద్వ్యణుకము ఒకస్థూలవాయువగును. అనగా ఒక ద్వ్యణుకము అనిననూ లేదా ఒకస్థూలవాయువు అనిననూఒకటే. 5ద్వ్యణుకములుకలిసిన ఒకపృథివిరేణువుఅగును. అనగా ఒకద్వ్యణుకము(ఒక స్థూలవాయువు)మరియువాయువునందు తిరుగు 5 ద్వ్యణుకములుకలిగిన ఒక పృథివిరేణువుపొగలాగకనబడును. ధూమ్రముఅనగా పొగ యొక్క ప్రతిబింబము నీళ్ళలో కనబడుతుంది.
సత్యేనోత్తమితాభూమిః     ఋగ్వేదం 108514
ఉక్షాదాధారపృథివీముతద్యామ్.   ఋగ్వేదం 10318
భూమిని ఆదిత్యుడు, ఆదిత్యుని పరమాత్మ తన ఆకర్షణచే ధరించెను.  36వేల పర్యాయముల సృష్టిలయములకు ఎంతసమయముపట్టునో అంతసమయము వఱకు దుఃఖమునుండి విడివడిన ముక్తిబొందినజీవుడు అసామాన్యమైన ఆనందమును అనుభవించును. 
యమలోకం         
 యమేనవాయునా ఋగ్వేదం 10148 అథర్వ  201412 యమఅనగావాయువు.  శరీరమునువదిలినజీవుడువాయుమండలమునఉండును.  ఆ జీవుడు పరమేశ్వరప్రేరణచే కర్మానుసారముగా వాయు, జల, అన్న పురుషశరీరములోని వీర్యము ద్వారా స్త్రీయోనిలోప్రవేశించి, గర్భమందుస్థిరపడి శరీరధారణతోవెలుపలికి వచ్చును. మనిషిచావటంఖాయమయినా, నిర్లిప్తతగా ఉండకుండా,విద్వాంసుడయ్యో, వ్యాపారవేత్తయ్యో, శాస్త్రవేత్తయ్యో, నటుడయ్యో మరో విధముగానో ధనము సంపాదించిసుఖంగాఉండాలని కోరుకుంటాడు.  జీవుడు సాంసారికసుఖమును కోరుకుంటాడు.  ముక్తుడు పరామేశ్వరునితో రమిస్తాడు.  పరమానందంగాఉంటాడు.    రాష్ట్రపతిహోదాలోఉన్నవ్యక్తికిహోదాకితగినవిధముగాఉండుటకుఇల్లులభ్యమగును. ఆఇంట్లో ఆరాష్ట్రపతిహోదాలోఉన్నవ్యక్తికి సంబంధించిన బంధుగణమంతా స్వేచ్ఛగా తిరుగాడుదురు.ఆవిధముగాముక్తుడుఅనంతవ్యాప్తకబ్రహ్మమందుస్వచ్ఛందముగాసంచరిస్తాడు.శుద్ధజ్ఞానముచేసమస్తసృష్టినిచూడగలుగుతాడు.ఇతరముక్త పురుషులతోకలిసిసంచరించగలుగుతాడు..సృష్టిక్రమమునుగురించిపూర్తిజ్ఞానముతో సమస్తలోకములలోసంచరించగలుగుతాడు..ముక్తిపొందినజీవాత్మఎంతనిర్మలుడైతేఅంతపూర్ణజ్ఞానిఅవుతాడు...పరమేశ్వరప్రాప్తియేవిశేషస్వర్గము. విషయతృష్ణలందు తగులుకొనుటయేనరకము.  తగులుకొనిదుఃఖపడుటయేనరకము.నదులుసముద్రములో కలిసిన తదుపరి తమతమ ఉనికినికోల్పోయి సముద్రమేఅయిపోవువిధముగా పరిపూర్ణజ్ఞాని ఆఖరికి పరమాత్మలో ఐక్యమైతన ఉనికినికోల్పోయి పరమాత్మేఅగుతాడు.
సత్వగుణమువలనజ్ఞానము,రజోగుణమువలనలోభము,తమోగుణమువలనభ్రమ,అజ్ఞానము,అజాగ్రత లేదా మఱపు పుట్టుచున్నవి.  
ప్రతిమపూజ              జగత్తు అంతటావ్యాపించుయుండు నిరాకార,నిర్గుణ బ్రహ్మకిప్రతిమలేదు.కనుకమూర్తిపూజలకంటె,తల్లిదండ్రులసేవ,అతిథిసేవ,దరిద్రనారాయణసేవ,భార్యాభర్తలుఒకరినొకరుగౌరవించుకొనుట,ధర్మాసుపత్రులనిర్మాణము,బీదవారికై పాఠశాలల నిర్మాణము అన్నదానములు మొదలగునవి ఉత్తమమైనవి. ఈప్రతిమ పూజలు షుమారు మూడులేకనాలుగువేలసంవత్సరముల తరువాత ముఖ్యముగామహాభారతగ్రంథకాలముతరువాతపుట్టినవి.  ఋగ్వేదము21శాఖలు,యజుర్వేదము101శాఖలు,సామవేదము1000శాఖలు,అథర్వణవేదము9శాఖలు   మొత్తం కలిపి 1131శాఖలు.    జైమినీ మీమాంసయందు కర్మకాండను, పతంజలియోగశాస్త్రమున అనుపాసనాకాండను, వ్యాసమహర్షియొక్క బ్రహ్మసూత్రములందుజ్ఞానకాండను, వేదానుకూలముగా వ్రాసియున్నారు.  మూర్తి పూజప్రస్థావనలేదు. 
పరితవ్యంతదపిమర్తవ్యం.దంతకటకటేతికింకర్తవ్యం
కేవలము పశ్చాత్తాపమువలననూ, అయ్యోఅనిపళ్ళు కటకట లాడించి పశ్చాత్తాప పడిఏమిచేయాలి అనిఅనుకున్నా విషముత్రాగితేచావవలసినదేగదా.అట్లే పాపములు చేసి, ప్రజలకు అన్యాయముచేసి తీర్థయాత్రలుచేసినంత  మాత్రమున పాపప్రక్షాళన జరగదు.కనుక మానవుడు బ్రతికిఉన్నంతవఱకు ధర్మకార్యములు చేస్తూ ఉండుట ఉత్తమము. 
టకాధర్మఃటకాకర్మ టకాహిపరమంపదం యశ్యగృహేటకానాస్తిహా టకాటకటకాయతే. డబ్బే ధర్మం.డబ్బేకర్మం,డబ్బేముక్తి,ఎవరిఇంట్లోడబ్బేఉండదో డబ్బుడబ్బుడబ్బు అనికలవరించిచచ్చును.కానిఎవ్వడూపరమాత్మపొందుకోరటములేదు. ఓపరమాత్మా అని కలవరించిచావటంలేదు. 
ఆధారములేకున్నఆధేయము,కారణములేనికార్యము,అవయవిలేకున్నఅవయవము,కర్తలేకున్నకర్మఎట్లుఅసంభవమో,అట్లేపరమాత్మలేనిజగత్తుఅసంభవము.  ఆకాశము అన్నిటియందు వ్యాపించియున్నను, పృథివి ఆకాశము ఒకటిగాదు. ఇక్కడఆకాశమువ్యాపకము,పృథివివ్యాపి. పరమాత్ముడుపరమాణువులచే జగత్తును చేసి ఆజగత్తు(వ్యాపి)నందువ్యాపించివసించియున్నాడు.  అటులనే తల్లి,తండ్రి అనే నిమిత్తకారణముచే ఉత్పత్తి, ఏర్పడుట అనే నియమములను స్థిరపఱచియున్నాడు.  అనంతస్వరూపగుణకర్మస్వభావయుక్తుడగుపరమాత్ముడు ఈస్వల్పమైనజగత్తును రచించుచు,ధరించుచు, ప్రళయముగావించుచూ బంధనమునబడడు. పరమాత్మ సర్వదేశీయుడు, ముక్తుడు, నిర్మలుడు, నిర్గుణుడు, నిరామయుడు. జీవుడు ఏకదేశీయుడు,బద్ధుడు,మలినుడు,గుణుడు.
కర్తపరమాత్మ,కర్మజీవుడు,కార్యముజగత్తు.                                 కర్మరహితుడైనజీవుడుముక్తిపొందును. తిరిగిజన్మనెత్తవలిసినఅవసరంలేదంటారు అద్వైతులు.
పూర్ణమదఃపూర్ణమిదంపూర్ణాత్పూర్ణముదచ్యతే పూర్ణశ్యపూర్ణమాదాయపూర్ణమేవావశిష్యతే. శుక్లయజుర్వేదం   ఈశోపనిషత్   కంటికికనబడనిబ్రహ్మంపరిపూర్ణం.కంటికికనబడుప్రపంచంపరిపూర్ణం.కంటికికనబడని బ్రహ్మంనుండి  ఈకంటికికనబడు ప్రపంచం ఉత్పన్నమైనది.  ఆపూర్ణంనుండి ఈపూర్ణం ఉత్పన్నమైననూ, మిగిలినదికూడా పరిపూర్ణ బ్రహ్మమే.  ఈశావాస్యమిదంసర్వంయత్కించ జగత్యాంజగత్తేనత్యక్తేనభుంజీథామాగృథఃకస్యస్వి ద్ధనం    ఈశోపనిషత్
జగత్తుక్షరముఅనగానశించిపోయేది.  నశించిపోయేజగత్తంతానశించిపోని ఈశ్వరునిచే ఆవరించి యున్నది. పరులసొమ్ముకిఆశించకు. నశించిపోని ఈశ్వరుని పొందుకై సర్వముత్యాగముచెయ్యి.      బాలవస్తాత్క్రీడాసక్తఃతరుణస్తావత్తరుణీరక్తఃవృద్ధస్తావచ్చింతామగ్నఃపరమేబ్రహ్మణికోపినలగ్నః                        ఆదిశంకరాచార్య  బాల్యంలోఆటలయందుఆసక్తి, యౌవనంలో స్త్రీలయందు అనురక్తి, వృద్ధాప్యంలో పిల్లల పెళ్ళిల్లుమొదలగువాటియందుసమయము వెచ్చిస్తారు.  పరమాత్మయందు ఆసక్తికిమాత్రము సమయములేదు.

అణోరణీయాన్మహతోమహీయాన్నాత్మాగుహాయాంనహితోస్యజంతోః   అణువులోఅణువైన, గరిష్ఠంలోగరిష్ఠంఅయిన ఆత్మని గుహలలోను, పుట్టలలొ, చెట్లలోను,పశువులలోనుకాదు వెతకవలిసినది, తమతమహృదయాలలో వెదుకు కొనవలయును. 
సంపాదితాత్మాజితాత్మాభవతి జితాత్మాసర్వార్థైఃసముజ్యతే.
ఆత్మబలపడినతదుపరి జయుడుఅవుతున్నాడు. ఆత్మజయుడు సర్వైశ్వైర్యములనుపొందును.  ఏడువ్యాధులు 1)సిద్ధాంతములేనిరాజకీయము,2)సంపాదించకుండావచ్చినసంపత్తి,3)అచేతనా పూరకమైన(మనస్సుకుతెలియని)సంతోషము,4)నీతిరహితమైనశాస్త్రము,5)గుణ రహితమైనజ్ఞానము,6)పరిత్యాగములేనిఉపవాసము,7)లక్ష్యములేనివ్యాపారము   నప్రజయాధనేనత్యాగేనేకైవామృతత్వమానశుః
పిల్లలవలన, ధనమువలన పరబ్రహ్మప్రాప్తి కలగదు.  అంతఃకరణ త్యాగమువలననె పరబ్రహ్మప్రాప్తికలుగును. దానికినైష్ఠికబ్రహ్మచర్యముఅవసరములేదు. నైష్ఠిక బ్రహ్మచర్యముఅనగా మరణపర్యంతం బ్రహ్మచర్యపాలన.  అసలు బ్రహ్మచర్యం అనగా బ్రహ్మపదాన్ని ఆచరించటమె.  గ్రాహస్థబ్రహ్మచర్యము అనగా ఒకే భార్యతోగృహ/సహ జీవనము చేయుట.కనుక గృహస్థాశ్రమములో కూడా బ్రహ్మపదసాధన ఆచరణీయమే.    
పరాఅనగాశబ్దబ్రహ్మం బీజరూపముగా ఉండి అభివృద్ధి పొందే దశ.   పశ్యంతి అనగా ప్రారంభదశ.  మధ్యమ అనగా పైకిఉద్భవించి స్పష్టముగాలేని దళాలజంట.  వైఖరీ అనగా వికశించినదళాలు. 
కర్మబంధం, అజ్ఞానం అనగా యదార్థస్వరూపం గుర్తించడానికి వీలు లేక  మరుగున పడితే మలదోషముఅంటారు.  నిలకడలేక అటూఇటూ చెదిరిన మనోవ్యాపారము లను విక్షేపణ దోషము అంటారు.
ఏడుగురుయోగినీదేవతలు                               
మాత అనగా కొలిచేది,  మానము అనగా కొలత, మేయము అనగా కొలవబడేది.  ఈ మూడింటినీ కలిపి కుళం అంటారు.  ఈత్రిపుటినే శ్రీదేవి లేదా కాళీశ్వరి అంటారు.                                         1)ఢాకినీ...ఆకాశతత్వం,16దళాలు,విశుద్ధచక్రం,హంబీజం, వాహనంశ్వేతగజం,సర్వోన్మాదినీముద్ర,వశిత్వసిద్ధి, ఫలం మేధ, అ నుండి అః వఱకు అక్షరాలు,బీజ,న్యాస,మంత్రసంకేతములుగలది.                      2)రాకినీ...వాయుతత్వం,12దళాలు,అనాహతచక్రం,యం బీజం,వాహనం లేడి, సర్వ వశంకరీముద్ర, ఈశత్వసిద్ధి, ఫలంప్రజ్ఞ,కనుండిఠవఱకుఅక్షరాలు. అనాహత కొట్టబడనిది, అహతకొట్టబడినది,అనాహతశబ్దం తాకిడిలేకుండానే వెలువడుతుంది.       3)లాకినీ.... అగ్నితత్వం,10దళాలు,మణిపురచక్రం,రంబీజం,వాహనంమేక, సర్వాకర్షిణీముద్ర,డనుండిఫవఱకుఅక్షరాలు.                                  4)కాకినీ.....  జలతత్వం,6దళాలు,స్వాధిస్ఠానచక్రం,వం బీజం,వాహనంమకరం, సర్వాకర్షిణీముద్ర,బనుండిల వఱకుఅక్షరాలు,ఫలం స్మృతి,లఘిమాసిద్ధి. 
5)సాకినీ-- పృథివీతత్వం,4దళాలు,మూలాధారచక్రం, లం బీజం,వాహనంఐరావతం, సర్వసంక్షోభిణీముద్ర,వ నుండి స వఱకు అక్షరాలు, ఫలంమతి, అణిమాసిద్ధి.                                               6)శాకినీ.......తత్వంమనస్సు,2దళాలు,ఆజ్ఞాచక్రం, ఓం బీజం,వాహనంఓంకారం, సర్వాంకుశముద్ర,,,క్ష రెండే అక్షరాలు. ఫలంమతి, గురువుఆజ్ఞను పొందే కూటస్థలేదాఆజ్ఞాచక్రంస్థానం.                
7)యాకినీ......బ్రహ్మరంధ్రంలోని సహస్రారచక్రం స్థానం. బ్రహ్మతోఐక్యమగుట. ఓం అక్షరము.
చర్మము, రక్తం, మాంసం, మెదడు మరియు ఎముక అనే ఐదుధాతువులు శక్తి మూలకాలు. మిగిలినమజ్జ,శుక్ల, ప్రాణ మరియు జీవ అనే నాలుగుధాతువులు శివ సంబంధమైనవి. ఈ దేహములో తొమ్మిదిధాతువులతోకూడిన సమిష్ఠిధాతువుగా అనగాపదవధాతువుగాపరాశక్తిచెప్పబడుతోంది.   యత్రనాన్యత్పశ్యతినాన్యత్శృణోతినాన్యద్విజానాత్సిభూమ ఛాందోగ్యం                                    మరోదానినిచూడని,వినని,తెలుసుకోని స్థితి. భూమాస్థితి.
ప్రణవానికి పైరూపం నాదం.  ఈ నాదమే శ్రీచక్రంలోని త్రికోణంలో పరా గా, అష్టకోణంలో పశ్యంతిగా, దశారయుగ్మంలో మధ్యమాగా, చతుర్దశారంలో వైఖరీగా నాలుగువిధాలుగాఉంది.  శివశక్తి సంబంధమైన నాలుగుచక్రాల్లో నాదాత్మకమైనశక్తి నిండిఉన్నది.  ఇవి అన్నీదేవీరూపాలే.                                
జీవుడు స్థూలదేహపతనానంతరము, శరీరబీజములగు సూక్ష్మభూతములతోచేరి, తొలుతఆకాశములో ప్రవేశించి, చంద్రకిరణములద్వారామేఘములను ప్రవేశించి, వర్షరూపముగ భూమినిప్రవేశించి, అగ్నిరూపమున పురుషుని ప్రవేశించి, స్త్రీగర్భమున రేతోరూపమునప్రవేశించి,శిశువుగాపుడుతున్నాడని జైమినిమహర్షి గౌతమునికి  ద్యుపర్జన్యపృథివీపురుషయోషిత్సు  అనే సూత్రముద్వారాచెప్పెను. ఇదే తదంతరప్రతిపత్తౌరంహతిసంపరిష్వక్తః అనే బ్రహ్మసూత్రములో వ్యాసభగవానుడు కూడా చెప్పారు. సాంఖ్యులు జగత్తుకు ప్రధానమేకారణము పరమాత్మ కాదంటారు.   గౌతముడు(న్యాయదర్శనం), కణాదుడు (వైశేషిక దర్శనం) జగత్తుకు పరిణామమే కారణము అంటారు.
 ప్రాతఃజూదప్రసంగేనమధ్యాహ్నేస్త్రీప్రసంగేన రాత్రౌచోరప్రసంగేనకాలోగఛ్ఛతిధీమతాం           
దీనికి లౌకికముగ ఒక అర్థము, బ్రాకెట్లో అలౌకికార్థము వ్రాయబడినది.  పాఠకులుగమనించగలరు. ఉదయము జూదము(మహాభారతము)గురించి, మధ్యాహ్నము స్త్ర్రీ (రామాయణము)గురించి, రాత్రిపూటదొంగల(శ్రీమద్భాగవతము) గురించి,చర్చించుకుంటూజనులుకాలముగడుపుతారు.  ఓజస్సుఅనగా శారీరకప్రాణబలం క్రియాశక్తి,   తేజస్సు అనగా మానసికవికాసం ఇఛ్ఛాశక్తి,     ద్యుతి అనగా బుద్ధిప్రకాశం జ్ఞానశక్తి.   
వేదాంతము     గ్రీకులుమరియుయూరోపియన్లుజీవముమరియుపురుషుడుమొదలగుపవిత్రమైన పరిశోధనలనుబాహ్యప్రపంచమునకేపరిమితంచేశారు.ఆధ్యాత్మికప్రపంచానికిఅవసరమైనశాశ్వతమైనపద్ధతులుకనుగొన్నఋషులుఅంతరంగములోనికిచొచ్చుకొనిపోయిసఫలమైనారు.వేదాంతంధర్మశాస్త్రాన్నిఇంద్రియాతీతానుభూతిగావర్ణిస్తుంది.ధర్మశాస్త్రాన్ని ప్రకృతిబాహ్యమని అనగా ప్రకృతికి అందనిదిగా లేక అతీతముగా చెప్పదు. ఉపనిషత్తుఅనగాఅంతఃకరణపఠనము.ఉపనిషత్తునిశృతిఅంటారు.మహనీయులకృషిమాత్రమేకనబడుతుంది.వారిచరిత్రకనబడదు.శృతులుఅన్నికాలములలోనుఒక్కటిగానేఉండును.కాలానుగుణముగామార్పుచెందవు. సలహాలు,ఆచారాలు,ప్రతిపాదనలకలయికతోమతంమనస్సులోనుండివచ్చినది.మతకర్తపేరుండును.సాధారణముగామతంమతకర్తజీవితముమీదఆధారపడిఉంటుంది. హిందూమతంసాధారణముగావేదమును,పురాణాలనుఆధారముగాచేసికుంటుంది. తదేతత్బ్రహ్మాపూర్వంఅనంతరంఅబాహ్యం అయంఆత్మాబ్రహ్మసర్వానుభూ.బృహదారణ్యకం5---19
ఈ బ్రహ్మానికి బాహ్యాభ్యంతరాలు, పూర్వొత్తరాలు లేవు.  ఈఆత్మయేబ్రహ్మము. సర్వము అనుభవించునది బ్రహ్మమే.హిందూమతం సగుణోపాసనద్వారా నిర్గుణ బ్రహ్మను చేరుమార్గముచూపుతుంది. సత్యాన్ని ఒకజాతికి, కులమునకు, వర్గమునకు, లింగమునకు(స్త్రీపురుషలింగభేదములేకుండుట) పరిమితిచేయలేదు హిందూమతం. సత్యాన్వేషణ అందరిసొత్తని చాటిచెప్పినది హిందూమతం.  ఎవడు సత్యమార్గానపయనించునో,ఎవనికిప్రశ్నించేసామర్థ్యంకలదోవాడేవిద్వాంసుడు. తనమతములోచేరుటకుజనులనుహింసించదుహిందూమతం.హిందూధర్మం మరియుకర్మభూమిఅయినహిందూదేశంనాశనమైతేప్రపంచంమొత్తంనాశనమగును.హిందూధర్మం,హిందూదేశంనాశనమునకుతలపెట్టినవారుఎవరైననునామరూపములులేకుండాపోదురుఅనుటలోసందేహములేదుభౌతికశాస్త్రసిద్ధాంతములన్నీకేవలమువ్యక్తీకరణములుమాత్రమే.అవిసృష్టికాదు.కేంద్ర,రాష్ట్రప్రభుత్వములుశాసనములను చేయును. అవిసృష్టి.ఆయాశాసనములను కేంద్ర,రాష్ట్రప్రభుత్వ అధికారులు అమలు చేయుటను వ్యక్తీకరణఅందురు. కానిశాసనములనుచేయుఅధికారము కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వఅధికారుల అధీనములోఉండదు. గుప్తశక్తిమరియువిముక్తశక్తి అని వస్తు స్వరూపము రెండువిధములు. గుప్తశక్తిఅనేది అవ్యక్తం. అదిఅనంతం నిశ్చలం, మరియు కేవలము. అదితప్పితే దానికిసాటి రెండవదిలేదు.  ఈగుప్తశక్తినే అవ్యక్త బ్రహ్మం అంటారు. విముక్తశక్తినే వ్యక్తబ్రహ్మం అంటారు. అదిసృజనాత్మకశక్తి, అది కదలుతుంది, ప్రకంపిస్తుంది. బ్రహ్మము,శక్తి, భగవంతుడు మరియు విశ్వముఒకటే.  న్యూటనుఒకయాపిలుకాయక్రింబడటంచూశాడు.  యాపిలుకాయనిచూడటంఒకభౌతికఘటనైతే,క్రిందబడతుండగాచూడటమనేదిఇంకొకభౌతికఘటన.ఈరెండుభౌతికఘటనలసంబంధమనేదిభూమ్యాకర్షణలేదాగురుత్వాకర్షణ సిద్ధాంతానికి దారితీసినది.  జేమ్సువాటు ద్వారా వచ్చిన ఆవిరియంత్రముకూడా ఇట్లా రెండుభౌతికఘటనల మధ్యనున్నసంబంధంవలనవచ్చినదే. రెండుభౌతిక ఘటనలసంబంధంవలనభౌతికశాస్త్రముఏర్పడినది. అటులనేప్రాణులకుప్రాణులకు, ప్రాణులకువాతావరణమునకు ఉన్నసంబంధం వలన జీవశాస్త్రము ఏర్పడినది. ఆఖరికిఅన్నిరకములైనకిరణములులేకతరంగములుఅనగా,రేడియో,గామా,ఎక్సురే,తరంగములనేవి విద్యుదయస్కాంతతరంగముల వివిధరూపములని, విద్యుదయ స్కాంతతరంగములుకూడా పరమాత్మశక్తిరూపాలేఅని మనఋషులు ధ్యానము ద్వారాకనుగొన్నారు.  విశ్వములో ప్రతిఒక్కవస్తువుకి చర(కదిలేవి) అచర(కదలనివి) వస్తువులన్నిటికీ ఐక్యతఉన్నదనిఋషులు ధ్యానముద్వారా మనోస్థిరత్వంద్వారాకనుగొన్నారు.  జగత్తు,శారీరకమరియుమానసికప్రవృత్తులన్నియుకలిపిప్రకృతిఅగును.శారీరకప్రవృత్తినిజాగ్రతావస్థ(స్థూలశరీరము)మరియుమానసికప్రవృత్తినిస్వప్నావస్థ(సూక్ష్మశరీరము)అంటారు.ఈజాగ్రతమరియుస్వప్నావస్థలలోకనిపించుదృశ్యములనుఅహంకృతులుఅంటారు. ఈఅహంకృతులుసుషుప్తి(కారణశరీరము)లోకలిసిపోయిఅదృశ్యమౌతవి.ఇవిఆఖరికిపరమాత్మచైతన్యములోఅనగాజ్ఞాతలోలీనమగును. జాగ్రతమరియుస్వప్నావస్థలలో కనిపించు ఆకారముగాని లేదా పదార్థముగాని జ్ఞాతయొక్కఆకృతులే. మనము నేనుఅనే కర్తృత్వభావనని వదలుకుంటె దక్కేది ఆత్మసాక్షాత్కారమే.  శ్రీభగవానురమణమహర్షిచెప్పినట్లుగానేనుఏమిసాధించానుఅనేప్రశ్నబదులుగానేను ఎవరినిఅనిశోధించుకోవాలి.దానికినీవుయముడుఅనగాఆత్మసంయమనంకలవాడివిఅవ్వాలి.
శ్రీవివేకానందఇలాఅన్నారు. ప్రత్యక్షవాదాన్నినమ్మేవారు మతధర్మం ఆవశ్యకతను ఆక్షేపించవచ్చు.మానవసమాజంనుండిమతమును తొలగిస్తేమిగిలేది అడవిమృగాలు మాత్రమే.మానవజీవితలక్ష్యంఇంద్రియభోగాలుకాదు.  జ్ఞానసాధనమేలక్ష్యము. ఆత్మజ్ఞానమే సర్వోత్కృష్ఠజ్ఞానం.  ఈజ్ఞానమే ఆనందోపలబ్ధి. ఈప్రాపంచిక విషయము లన్నీ ఛాయామాత్రములు.                     
ఇంద్రియసౌఖ్యంప్రకృతిసహజం. అంతిమ సౌఖ్యం అయిన ఆధ్యాత్మికస్వేఛ్ఛను వదలి ప్రకృతిసౌఖ్యమయినఇంద్రియసౌఖ్యాన్నిపట్టుకొని వ్రేళ్ళాడుట ఆత్మహత్యా సదృశం.     యోవైభూమాతత్సుఖంనాల్పేసుఖమస్తిభూమైవసుఖంభూమాత్వేవవిజిజ్ఞాసితవ్యైతి     ఛాందోగ్యం..........723                                అనంతమేసుఖం,ఆద్యంతాలుకలదానిలోసుఖంలేదు.కనుకఅనంతమేతెలియగోరవలయుననిసనత్కుమారులుఅన్నారు.  
ఓంకారం                      
 ఓంశబ్దవాచ్యంచఓంశబ్దప్రతీకంచఆదిశంకరాచార్య     ఓంఅనేదిఒకశబ్దమోలేకపదమోకాదు.ఓంఅనేదిఒకశబ్దము.దానిప్రతీకకూడాఓంకారమే. వాగర్థావివసంతృప్తౌ అన్నారు మహకవికాళిదాసు. పదము, దాని అర్థము అవినాభావాలు. సూర్యుడు లేకుండా కిరణములుండవు. సూర్యుడు మరియు సూర్యకిరణములుఅవినాభావాలు. వివిధసంజ్ఞలసముదాయమేభాష.గణితముఇంకేదన్నను సంజ్ఞల సముదాయమే. అకార,ఉకార,మకారములతోకూడియున్నఓంకారమువిశ్వజనీనలక్షణములుకలిగియున్నది.సమస్తభౌతికజగత్తుస్ఫోటము అనగాశబ్దమునుండి వచ్చినదే.స్ఫోటము. అనగాశబ్దమునుండివచ్చినసమస్తభౌతికజగత్తువ్యక్తబ్రహ్మము.దానివాచకముఅన్ని స్వరములనుతనలోఇముడ్చుకోగలఓంకారము.ఓంకారములోఅమాత్రనిబిందురూపములో(బ్రహ్మ)సృష్టి,ఉమాత్రని(విష్ణు)స్థితి,మ్.మాత్రని(మహేశ్వర)లయ,లకుప్రతీకలు. ఒకవస్తువుపెద్దదైనాలేదాచిన్నదైనాకావచ్చు.కానీఒకేసారిరెండూకాజాలదు.కానివేరువేరువస్తువులతోపోల్చినపుడు ఒకసారిపెద్దదిగానూ, ఒకసారిచిన్నదిగానూ కనబడ వచ్చు.ఫోటానువిశ్వమంతావ్యాపించగలిగినంతపెద్దదిగానూ,సూదిబెజ్జంలోదూరిపో గలిగినంతచిన్నదిగానూఉంటుందనిశాస్త్రజ్ఞులుఅంటున్నారు.కానిఆత్మఅణువుకంటే సూక్ష్మమైనది, బ్రహ్మాండంకంటేపెద్దది. ఇందులో సందేహములేదు. మొదటిశబ్దము స్పోటమేఅనగాఓంకారమే. ధ్యానినిదగ్గిరకితీసికెళ్ళి, చివరికి ఆపరమాత్మతో ఐక్యము చేయగలిగేదిఈనాదబ్రహ్మఓంకారమే. ఓంతద్బ్రహ్మఓంతద్వాయుఃఓంతద్విష్ణుఃఓంతత్పురోన్నమః మంత్రపుష్పం               బ్రహ్మ,విష్ణు,శివ,సకలదేవతలు ఓం నుండి వచ్చినవారే. సర్వవేదాయత్పదంఆమనన్తి.............. కఠోపనిషద్ సకలవేదాలకులక్ష్యముఓంకారమేఅన్నాడుయముడు నచికేతునితో. అష్టాంగంచచతుష్పాదంత్రిస్థానంపంచదైవతం ఓంకారంయోనజానాతిబ్రాహ్మణోనసబ్రాహ్మణః          1)విశ్వ,2)తైజస,3)ప్రాజ్ఞ,4)ప్రత్యగాత్మ,5)విరాట్,6)హిరణ్యగర్భ,7)అవ్యాకృత,8)పరమాత్మఅనే ఎనిమిది అంగములు., అకార,ఉకార,మకార,అర్థమాత్రఅనేనాలుగు పాదములు, జాగ్రత,స్వప్న,సుషుప్తిఅనేమూడుస్థానములు,బ్రహ్మ, విష్ణు,రుద్ర,సదాశివ, మహేశ్వర అనే ఐదుదేవతలు గల ఓంకారమునుగురించి తెలియనివాడుబ్రహ్మపదమునుపొందలేడు.                            హ్రస్వోదహతిపాపానిదీర్ఘోమోక్షప్రదాయకః    అధ్యాయనఃప్లుతోవాపిత్రివిధోఛ్ఛారణేనతు         హ్రస్వం(పొట్టిగాను),ప్లుతం(కొంచెందీర్ఘంగానూ),దీర్ఘం(బాగా దీర్ఘంగానూ), ఓంకారాన్ని ఉఛ్ఛరించవచ్చు.హ్రస్వంపాపములనుతొలగించునదిగానూ,ప్లుతంఇష్టసిద్ధినొసంగునదిగానూ,దీర్ఘంముక్తిప్రదాయినిగానూ,ఓంకారంవిలసిల్లుతున్నది.ఓంకారాన్నిస్థూలముఅనగావినబడునట్లుగా ఉఛ్ఛరిస్తే వాచికముఅంటారు. సూక్ష్మముఅనగా నోరు తెఱవ కుండా గొంతులోనే ఉఛ్ఛరిస్తే ఉపాంశు అంటారు.కారణము అనగా మనస్సులోనే ఉఛ్ఛరిస్తే మానసికము అంటారు. ఓంకారములో నాదం,బిందుమరియుకళ మూడూఉంటాయి. ఓంకారమును వివిధ ప్రదేశములలో జపిస్తే లేదా ధ్యానము చేస్తే ఆయా ప్రదేశమునుబట్టి ఆయాదేహము దానిపైదేహములో లయమయ్యి తగుఫలితమును వెంటనేకలుగజేయును.  
 నాద బిందు కళలు సత్వ, రజస్సు, తమస్సు, అనే మూడుగుణములకు, జాగ్రత, స్వప్న, సుషుప్తి అవస్థలకు, అకార, ఉకార, మకారములకు ప్రతీకలు. ప్రణవనాదంజపత్వాంతదాముక్తోభవిష్యంతి  ఓంకారమంత్రంజపిస్తూ,ధ్యానముచేస్తూముక్తుడవుకమ్ము.
బ్రహ్మసాక్షాత్కారానికిపేర్లు
రాజయోగంసమాధిశ్చఉన్మనీచమనోన్మనీ అమరత్వంలయస్తత్వం శూన్యాశూన్యం పరంపదం అమనస్కంతథాఅద్వైతంనిరాలంబంనిరంజనం జీవన్ముక్తిశ్చ సహజా తుర్యాచ ఇత్యేకవాచకా  రాజయోగం,సమాధి,ఉన్మనీ,మనోన్మనీ,అమరత్వం, లయ, తత్వం,శూన్యాశూన్యం,పరంపదం,అమనస్కం,  అద్వైతం,నిరాలంబం, నిరంజనం, జీవన్ముక్తి, సహజ,తురీయం అని బ్రహ్మసాక్షాత్కారానికిపేర్లు
 మూడుశరీరములుపంచకోశములు
 1)స్థూలశరీరం.....అన్నమయకోశం, ఇంద్రియగోచరమైనది, జాగ్రదావస్థ, శరీర నిర్మాణ,విజ్ఞానశాస్త్రాలలోఅధ్యయనంచేస్తారు.,2)సూక్ష్మశరీరం.....ప్రాణమయకోశం,మనోమయకోశంమరియువిజ్ఞానమయకోశం,స్వప్నావస్థ,మానవునివ్యక్తిత్వం,పునర్జన్మవాదముమొత్తముఇందులోనెవున్నది.,నాడీమండలశాస్త్రం,తత్వశాస్త్రం,మనస్తత్వశాస్త్రాలలోఅధ్యయనంచేస్తారు.3)కారణశరీరం.....ఆనందమయకోశం.న్యాయ,మీమాంస,మనస్తత్వశాస్త్రాలలోదీనిగురించేచెప్పారు.  ఈమూడుశరీరాలు అనాత్మసంబంధితాలు, జడప్రకృతియొక్కస్థూల,సూక్ష్మరూపాలు.  యదిదంకించజగత్సర్వంప్రాణఎజతినిఃసృతః       ఋగ్వేదం          సర్వజగత్తు,ప్రాణముస్పందించుటవలన ఆవిష్కరించబడుచున్నది.వస్తువుఒక్కటె.ఆవస్తువే నామరూపాలతోకూడిన జడమైన జగత్తుగానూ,బ్రహ్మాండంగానూ,పరమాత్మచైతన్యముతోపరివర్తనశీలముచెందుతూ మనస్సుగానూపరిణితిచెందును.అవ్యక్తంఅనగాబీజశక్తి.మహత్తుదాని ప్రథమాంకురం.
మరణముఆత్మ                            స్థూలశరీరముపతనముచెందుటయేమరణము. మరణించినతదుపరిఆయావ్యక్తి యొక్కప్రాణములు మరియు జీవుడు బయటికి వస్తాడు లేక వస్తుంది. వాయు మండలములోసంచరిస్తుంది.వాయుమండలములోఅటువంటిజీవులుఅనేకముంటాయి.ఈజీవులువిభిన్నమైనవాటివాటిఅనుభవములతో,తీరనికోరికలతో,కర్మఫలములతో,శక్తులతో,వాయుమండలములోతెలిసేతిరుగాడుతూఉంటాయి.ఈవాసనలతోకూడినస్థూలశరీరములేని,సూక్ష్మమరియుకారణశరీరముగలఈజీవులనుప్రేతములందురు.వీటిప్రపంచముప్రేతప్రపంచము.ఏప్రదేశమునవ్యక్తిచనిపోవునోఆప్రదేశమునందేఆవ్యక్తిమరియొకప్రపంచపుఅనుభూతులనుపొందుతూఉండును.చనిపోయినవ్యక్తియొక్కచూపుసూర్యునిలోప్రాణశక్తివాయువులో,వాక్కుఅగ్నిలో,రక్తముశుక్లశోణితములునీటిలో,శరీరముపృథివిలోకలిసిపోవును.చనిపోయినవ్యక్తియొక్కసూక్ష్మమరియుకారణ శరీరములనుకంఠములోనుండుఉదానవాయువుస్థూలశరీరమునుండిబయటికిపంపును. అసలుమరణముఅంటేఏమిటి?నిద్రకుముందుఉండేశారీరక,మానసికఅలసటలనుపోగొట్టుకొనిద్విగుణీకృత ఉత్సాహముతో మనము మనపనులను ఆనందముగా చేసికొనటానికిఉపయోగించేనిద్రలాంటిదేఈమరణముఅనేదీర్ఘనిద్ర.ఒకస్థూలశరీరమునుండిఇంకొకస్థూలశరీరమువఱకుజరుగుప్రయాణమేమరణము.అనుభవముపొంది పరిణితిచెందిపరమాత్మలోస్థూల,సూక్ష్మమరియుకారణశరీరములఐక్యతచెందుటకై జీవబ్రహ్మైక్యతకై ఈమరణము అనే దీర్ఘనిద్ర నిర్దేశించబడినది. కనుక ప్రవేశము జన్మ,  మరణమునిష్క్రమణ.ఏజీవముకైనాఇదితప్పనిసరి. పిడికెడుమట్టితీసికొనినీరున్నగాజుపాత్రలోవేస్తే,ఆయామట్టిలోనిపదార్ధములబరువునిబట్టికొన్నిపదార్ధములుఅన్నిటికంటెక్రింద,కొన్నిమధ్యలో,కొన్నిపైనతేలునట్లుగానే జీవులువివిధసూక్ష్మమండలాల్లోతమతమపరిధులనిఅతిక్రమించకుండాతిరుగుతూఉంటారు సాధించిన ప్రగతినిబట్టి,వారివారికర్మానుసారం జంతువుగానో, పక్షి గానో మరేదిగానో భూమిమీదపునర్జన్మఎత్తుతారు. పునర్జన్మఎత్తుటకు 2సంవత్సరముల నుండి 5000సంవత్సరములుపట్టవచ్చు. రుచి, వాసన, తినటం, త్రాగటం, వినడం వగైరాలుచేస్తూఉంటేనీవుస్థూల,సూక్ష్మ,కారణమూడుశరీరములతోనూ,ముఖ్యముగాస్థూలశరీరముతోపనిచేస్తున్నట్లులెక్క.సంకల్పములు,కలలు,అంతఃదర్శనములు కలుగుతున్నపుడుసూక్ష్మ,కారణరెందుశరీరములతోనూ,ముఖ్యముగాసూక్ష్మశరీరముతోపనిచేస్తున్నట్లులెక్క.దీర్ఘాలోచన, గాఢనిద్ర,తీవ్రధ్యానముఅనేవికలుగుతే కారణశరీరముతోపనిచేస్తున్నట్లులెక్క...స్థూలశరీరముతోపనిచేస్తున్నమానవుడు భౌతికమానవుడు,సూక్ష్మశరీరముతోపనిచేస్తున్నమానవుడుసూక్ష్మమానవుడు కారణశరీరముతోపనిచేస్తున్నమానవుడుప్రజ్ఞామానవుడు.
ఆవరణముచేయదార్థము కప్పబడియుండును. విక్షేపముచే యదార్థరూపము ఇంకొక రూపముగాకనిపించును. చీకటిలో త్రాడునుచూచి పాము అని భ్రమించెదము. ఇక్కడచీకటిఆవరణ. పాముఅనిభ్రమించటం విక్షేపణదోషము.

 ప్రాణశక్తులఘోషని నాదం,శుద్ధసత్వమైనబుద్ధిని బిందు, ఈశుద్ధసత్వమైనబుద్ధి యందుప్రతిబింబించు పరతత్వమును కళ అంటారు. ఈనాద,బిందు,కళ మూడింటినీ కలిపిప్రణవంలేదాసగుణ/సాకారబ్రహ్మఅంటారు.ఈనాద,బిందు,కళమూడింటికీఅతీతంపరమాత్మ.చరాచరప్రపంచంఅంతానిండిఉన్నఈప్రణవంయొక్కరూపంజ్యోతిర్మయం. శబ్దబ్రహ్మమయి,చరాచరమయి,జ్యోతిర్మయి, వాంగ్మయి, నిత్యానందమయి, పరాత్పరమయి, మాయామయి మరియుశ్రీమయి అనేవిభగవంతుని అష్టైశ్వర్యాలు. వ్యక్తీకరణ(materialization)అనగాపదార్థంలేకదేహం,ఈపదార్థంకదలటానికిప్రాణశక్తి (vibration)అవసరము,ఈప్రాణశక్తినిసరిగ్గాఉండేటట్లుచూడటానికిప్రజ్ఞాశక్తి(radiation) అవసరము..
 కొన్నిఅర్థములు                                    చక్రముమనోతత్వమునకు,గదబుద్ధితత్వమునకు,ధనుస్సుఅహంకారమునకు, ఓజస్సుక్రియాశక్తికి,తేజస్సు ఇఛ్ఛాశక్తికి, ద్యుతిజ్ఞానశక్తికి, నీలివర్ణంఅనంతానికి, ఆదిశేషుడుఇంద్రియములకు,పాంచజన్యముపంచభూతములకు,వైజయంతిమాలభూతతన్మాత్రలమాలకు,స్తంభముదేహములకుచిహ్నములు. అస్తిభాతిప్రియంరూపంనామచేతస్యపంచకమ్ అద్యత్రయంబ్రహ్మరూపంజగద్రూపంతతోద్వయం     అస్తిఅనగాసత్తు,భాతిఅనగాచిత్తు,ప్రియంఅనగాఆనందంఅనేవిశాశ్వతము.నామము,రూపముఅశాశ్వతము.
ధ్యానము                                     
మానవుడుగా పుట్టటమే   అదృష్టము.  కేవలము మానవుడుమాత్రమే ధ్యానము చేసి పరమాత్మతో ఐక్యము పొందగలడు.  ఆస్తేయము అనగా శాస్త్రవిరుద్ధముగా ద్రవ్యగ్రహణము చేయకూడదు.  ప్రతిరోజూ ఉదయము సాయంత్రము మరియు వీలున్నప్పుడుతప్పకక్రియాయోగధ్యానముచేయాలి. పరమహంసశ్రీశ్రీ యోగానందలాంటి గురువులభ్యమగుట  అదృష్టము. ఇతరులను నిన్ను నీవు ప్రేమించుకునేదానికంటె ఎక్కువగా నిస్స్వార్ధముగా ప్రేమించు. మనగమ్యము మోక్షము.నిస్స్వార్ధముగాకర్మలుచెయ్యి.అదేకర్మయోగము.        ఆత్మానంరథినంవిద్ధిశరీరంరథమేవచబుద్ధింతుసారథింవిద్ధిమనఃప్రగ్రహమేవచ             ఆత్మరథికుడు,శరీరము,రథము,బుద్ధిసారథి,మనస్సు కళ్ళెము, బాణము ధ్యానము. విల్లుఆమనస్సునుస్థిరపరచేశ్వాసమీదధ్యాస.లక్ష్యముమోక్షము.        ఇంద్రియాణిహయానాహువిషయాంతేషుగోచరం ఆత్మేంద్రియంమనోయుక్తంభోక్తత్యాహుఃమనీషణః     కర్మమరియుజ్ఞానఅనేపదిఇంద్రియములనేవిగుఱ్ఱములు,శబ్ద,స్పర్శ,రూప,రస,గంధ విషయములనేవిఅశ్వ సంచారమార్గములు, శరీర,ఇంద్రియ,మనస్సులతో కూడిన ఆత్మయేభోక్త.                                    మనముతిట్టేతిట్లకుమహాత్ములుచలించరు. అట్లే ఎవరి పరిహాసములకు చలించకు. మనమేమనలనుదుర్బలులనుచేసికున్నఏదీసాధించలేము.దేవుడుసర్వదామంగళస్వరూపుడు.ఒకప్రక్కదేవుడు మరియొకప్రక్కరాక్షసుడు ఉండడు. మంచినిప్పుఅని, చెడునిప్పుఅనిరెండురకాల నిప్పులుండవు. ఉన్నది ఒక నిప్పే.  ఉన్నది ఒకదేవుడే.  సుషుమ్నసూక్ష్మనాడిజ్యోతికిబయటితొడుగు.సూక్ష్మశరీరముయొక్కస్థూలపనులన్నీఏడుచక్రములద్వారానియంత్రిస్తూఉంటుంది. మూలాధారమునుండిసహస్రారము వఱకుఉంటుందీసుషుమ్న.సుషుమ్నకిఇరువైపులాఉన్నఇడామరియుపింగళానాడులురెండూసింపథటిక్ నెర్వస్ సిస్టంని నియంత్రిస్తాయి. సుషుమ్న లోపల వజ్ర, వజ్ర లోపల చిత్ర మరియు చిత్ర లోపల బ్రహ్మనాడి అని మూడు కారణనాడులుంటాయి.  సుషుమ్న,ఇడమరియుపింగళనాడులకుకావలిసినశక్తినిచేకూరిస్తాయి ఈవజ్రమరియుచిత్ర.వజ్రస్వాధిస్ఠానమునుండిసహస్రారమువఱకుఉంటుంది.క్రియాశక్తిఅనగానోరు,పాణి,పాదముశిశినముమరియుముడ్డిలకుకావలసినశక్తినిచేకూరిస్తుందీవజ్ర.చిత్రమణిపురనుండిసహస్రారమువఱకుఉంటుందిజ్ఞానశక్తిఅనగానాలుక,ముక్కు,చెవ్వు,కన్ను మరియు చర్మములకుకావలసినశక్తినిచేకూరిస్తుందిఈచిత్ర.అనగా చేతనకుసంభంధించినపనులనునియంత్రిస్తుందీచిత్ర... మణిపురవచక్రమునకుసంబంధించినఅర్జునుడుదీనికికావలసిన ఆత్మనిగ్రహశక్తిని చేకూరుస్తాడు. వీటన్నిటికీ సహస్రారచక్రము తత్సంబంధిత వెలుగుకిరణములను పంపిఆయాచక్రసంబంధితఅంగములనుపనిచేసేటట్లుచూస్తుంది.ఈవిధముగానెమనస్థూలబుర్రలోనిభాగాలు తత్ సంబంధితనరములకు,నరకేంద్రములకుఅలాగే కలపబడి ఉంటాయి.వజ్ర,చిత్రలలోపల బ్రహ్మనాడి అనగాబ్రహ్మచైతన్యము మూలాధారమునుండిసహస్రారమువఱకువ్యాపించియుంటుంది.పరమాత్మఈవిధముగా స్థూల,సూక్ష్మమరియుకారణ శరీరములలో వ్యాపించియున్నాడు. ఈవ్యాపించి యున్నభగవత్.పదార్థముపై వివిధరకములప్రయోగములుజరుపుతున్నారు ప్రస్తుత వైజ్ఞానికశాస్త్రవేత్తలు.మనకర్మఫలములనుమోయునదిచిత్ర.దీనినెచిత్రగుప్తచిట్టాఅందురు.వజ్రనాడిఖచ్చితముగాఈకర్మఫలములనుఅనుభవించేటట్లుచేస్తుంది.అందువలనవజ్ర,చిత్రముందరవచ్చినతదుపరిబ్రహ్మనాడిఅనగాబ్రహ్మచైతన్యమువచ్చును.బ్రహ్మచైతన్యముప్రధానమంత్రి,చిత్రసెక్రెటరీ,వజ్రపోలీసు.  పరిణితిచెందినయోగికిబ్రహ్మచైతన్యముతక్కమిగిలినవన్నియు తృణప్రాయములు.  ఆ బ్రహ్మచైతన్యములోనికి ప్రవేశించునంతవఱకు మాయవెంటబడుతునేఉంటుంది. పరిణితిచెందినయోగికి పురుషులు బిడ్డలలాంటివారు, స్త్రీలుమాతృసమానులు. అట్లుకానియడల మహానుభావుడైన శ్రీవిశ్వామితృని ధ్యానమును భంగముచేసిన మేనకల బెడద తప్పదు. మాయని తప్పించుకొనుట దుర్లభము.  శ్రీరామకృష్ణ పరమహంస కాంతాకనకములను దూరముగానుంచెడువారు. తనభార్య అయిన శ్రీశారదాదేవిని తల్లిగా పూజించెడువారు. యోగికిఅంతటినిగ్రహముఅవసరము.  మహాయోగి నుండి నిష్కల్మషమైన ప్రేమ ఆయన దగ్గిర ఉన్నాదూరముగాఉన్నా, శరీరములోఉన్నాలేకపోయినా పొంగిపొరలుతూఉంటుంది.అటువంటి మహాయోగి పేరు తలచినంతనే కనీసము ఆక్షణమైనా ఆనందము కలుగుతుంది, చెడ్డపని చేయనిచ్చగింపడుమనిషి. శ్రీశ్రీఅన్నమాచార్య,శ్రీశ్రీపోతులూరివీరబ్రహ్మేంద్రియస్వామి, పరమహంసశ్రీశ్రీయొగానంద,స్వామివివేకానందఇత్యాదియోగులనుఎన్నియుగాలుగడిచినాజ్ఞాపకముపెట్టుకునేందుకుకారణమువారియోగనిష్ఠాగరిష్టమే.

దివ్యానందరసామృతపూరితుడై,మూర్తీభవించినపరమజ్ఞానమై,పరమోత్కృష్టమైనఆనందప్రదాతయై, నిర్మలుదై, పరిపూర్ణుడై, నిత్యుడై, సుఖదుఃఖాతీతుడై, భావాతీతుడై, గుణాతీతుడై,సర్వాతీతుడైననాగురుదేవులైన పరమహంసశ్రీశ్రీయోగానందస్వామికినా నమస్కారము. 

Comments

Popular posts from this blog

Mantrapushpam with Telugu meaning మంత్రపుష్పం

49 Maruts mentioned by Sri Sri Yogiraj LahiriMahasya Maharaj

Shree vidya upaasana