సౌందర్యలహరి


సౌందర్యలహరి
(ఆదిశంకరాచార్య)

మొదటి 41 శ్లోకములు "ఆనంద లహరి"  మరియు 42వ శ్లోకమునుండి "సౌందర్య లహరి"అని అర్థము చేసికోవలయును.
 అనుష్ఠానము కలిపి "శ్రీవిద్య".  సౌందర్యలహరిలో శ్రీచక్రం గురించి 11వ శ్లోకంలో చెప్పబడింది.
శ్రీ లలిత, బాలా త్రిపురసుందరి, కామేశ్వరి, రాజరాజేశ్వరి ఇత్యాది నామములతో అర్చింపబడే శక్తి స్వరూపిణియే సౌందర్యలహరిలో స్తుతింపబడే శ్రీమాత.





సౌందర్యలహరి
(ఆదిశంకరాచార్య)

కౌతా మార్కండేయ శాస్త్రి 
సృష్టి, స్థితి, లయలకు క్రమముగా బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ప్రతీకలు. వీరి మహిమలె త్రిగుణములు. బ్రహ్మ రజో గుణమునకు, విష్ణువు సత్వ గుణమునకు, మహేశ్వరుడు తమో గుణమునకు ప్రతీకలు.  బ్రహ్మ మహిమను ప్రతిబింబించు ప్రకృతిని సరస్వతి అని, విష్ణువు మహిమను ప్రతిబింబించు ప్రకృతిని లక్ష్మి అని, మహేశ్వరుని మహిమను ప్రతిబింబించు ప్రకృతిని  పార్వతి అని చెప్తారు. ఇవి ప్రతిబింబించని ప్రకృతిని పరాశక్తి, లేదా మహాదేవి, లేదా ఆదిశక్తి అని చెప్తారు.  ఈమె ఎవరికీ అధీనముగా ఉండునో ఆయనని విష్ణు పురాణములో మహావిష్ణువు అని,  శివపురాణములో మహాదేవుడు లేదా సదాశివుడు లేదా పరమేశ్వరుడు అని, భగవద్గీతలో పురుషోత్తముడు  అని, భాగవతములో నారాయణుడు, వేదాంతములో పరబ్రహ్మ అని,  వేదములో పురుషుడు అని చెప్తారు.  
వివిధ ఆరాధన పద్ధతులు: 1--. సూర్య ఆరాధన లేదా సౌర్యము, 2. గణపతి ఆరాధన లేదా గాణాపత్యము, 3. శివ ఆరాధన, 4. విష్ణు ఆరాధన లేదా వైష్ణవము లేదా శైవము  5. శక్తి ఆరాధన లేదా శాక్త్యేయము. 
 భాగః - ఆనంద లహరి
శివః శక్త్యా యుక్తో యది భవతి శక్తః ప్రభవితుం
న చేదేవం దేవో న ఖలు కుశలః స్పందితుమపి|
అతస్త్వామ్ ఆరాధ్యాం హరి-హర-విరించాదిభి రపి
ప్రణంతుం స్తోతుం వా కథ-మక్ర్త పుణ్యః ప్రభవతి|| 1 ||

భగవతీ! ఈశ్వరుడు కూడా శక్తితో కూడినప్పుడే జగములను సృష్టించ గలడు. శివుడు (ఇక్కడ potential energy) తనంతట తానుగా  స్పందించడు మరియు స్పందించలేడు. జగద్రచన జరుగుటకు శక్తి (kinetic energy) తోడ్పాటు తప్పనిసరి.   కేశవ చతుర్ముఖాదుల (సృష్టి, స్థితి, మరియు లయ) జరగాలన్నా శక్తి (kinetic energy) తోడ్పాటు తప్పనిసరి. ఆ కదిలే శక్తే  (kinetic energy) అమ్మవారు.   (Potential energy) శివ (destruction), కేశవ (maintainance), బ్రహ్మ (creation)  అందరికి ప్రోత్సాహకము(Catalyst) లాగా తోడ్పడే అమ్మా,  నిన్ను నావంటి శక్తిహీనుడు పొందడం ఎలా సాధ్యమౌతుంది?

తనీయాంసుం పాంసుం తవ చరణ పంకేరుహ-భవం
విరించిః సంచిన్వన్ విరచయతి లోకా-నవికలమ్ |
వహత్యేనం శౌరిః కథమపి సహస్రేణ శిరసాం
హరః సంక్షుద్-యైనం భజతి భసితోద్ధూళ నవిధిమ్|| 2 |

ఇచ్ఛా శక్తి, క్రియా శక్తి, మరియు జ్ఞానశక్తి, మూడు శక్తులుగా  ఈ జగత్తును నడిపించేది ఆ అమ్మే. బ్రహ్మ(సృష్టి),  విష్ణు(స్థితి), మరియు  మహేశ్వరులే (లయ) తమ తమ పరిధిలోని కార్యములను ఈ దివ్య అమ్మ (kinetic energy) ద్వారానే చేస్తూ  శక్తిమంతులుగా గుర్తింపబడుతున్నారు.

అవిద్యానా-మంత-స్తిమిర-మిహిర ద్వీపనగరీ
జడానాం చైతన్య-స్తబక మకరంద శ్రుతిఝరీ |
దరిద్రాణాం చింతామణి గుణనికా జన్మజలధౌ
నిమగ్నానాం దంష్ట్రా మురరిపు వరాహస్య భవతి|| 3 ||

అవిద్యానా-మంత-స్తిమిర-మిహిర ద్వీపనగరీ అనగా అవిద్య అనే లోపలి చీకటినిపోగొట్టగల అమ్మవారి కరుణా పాదరేణువు
జడానాం చైతన్య-స్తబక మకరంద శ్రుతిఝరీ అనగా మందబుద్ధులలో జడత్వమును పోగొట్టగల చైతన్యము తీసుకురాగల తేనెప్రవాహము లాంటిది అమ్మవారి కరుణ
దరిద్రాణాం చింతామణి గుణనికా జన్మజలధౌ అనగా దరిద్రము పోగొట్టగల మరియు ఐశ్వర్యము ఇవ్వగల చింతామణి మాలలాంటిది అమ్మవారి కరుణ,
నిమగ్నానాం దంష్ట్రా మురరిపు వరాహస్య భవతి అనగా హిరణ్యాక్షుడు సముద్రములో పడవేసిన భూమి మునిగిపోతున్నప్పుడు ప్రజలను రక్షించుటకు వరాహ రూపములో ఆభూమిని పైకి తీసికొని వచ్చిన శ్రీ మహావిష్ణువు దంతద్వయములాంటిది ఆ అమ్మ కరుణ.
 
వరాహ అవతారములో పృథ్వీని పరమాత్మ రెండు దంతములతో పైకెత్తును. పృథ్వీకి ప్రతీక మనిషి. సంసారము నీటికి ప్రతీక.  మనిషికి రెండు జ్ఞానదంతములుండును. రెండుదంతములు జ్ఞానమునకు ప్రతీకలు. మనిషి పెద్దవాడయ్యేసరికి రెండుజ్ఞానదంతములు వచ్చును.  ఓ మనిషీ,  సంసారమనే నీటిలో మునిగిపోకు. క్రియాయోగసాధనతో సాధించిన  జ్ఞానముతో సంసారమునుండి బయటపడు. పరమాత్మతో అనుసంధానం పొందు అని తెలియజెప్పుటకు ఉద్దేశించినది వరాహావతారము. వరాహ/నర సింహ అవతారములలో స్థూలశరీరమునకు సంబంధించిన  బ్రహ్మగ్రంధి విచ్ఛేదము జరుగుతుంది. ఇది తెలియజేసేదే వరాహ పురాణము.
  
త్వదన్యః పాణిభయా-మభయవరదో దైవతగణః
త్వమేకా నైవాసి ప్రకటిత-వరభీత్యభినయా |
భయాత్ త్రాతుం దాతుం ఫలమపి చ వాంఛాసమధికం
శరణ్యే లోకానాం తవ హి చరణావేవ నిపుణౌ || 4 ||
ప్రపంచములోని అందరు దేవుళ్ళూ దేవతలు తిరస్కరించినా అమ్మా, నీ వొక్క దానివే అడక్కుండానే వరములు ఇస్తావు. కాని ఎంత గొప్ప వరములు ఇచ్చినా ప్రపంచమునకు అనగా బయటికి నీవు ఇట్లా వరములు ఇస్తున్నట్లుగా తెలియబరచవు. నా సేద తీర్చుటకు.నీ పాదరేణువులు చాలు తల్లీ. 
హరిస్త్వామారాధ్య ప్రణత-జన-సౌభాగ్య-జననీం
పురా నారీ భూత్వా పురరిపుమపి క్షోభ మనయత్ |
స్మరోఽపి త్వాం నత్వా రతినయన-లేహ్యేన వపుషా
మునీనామప్యంతః ప్రభవతి హి మోహాయ మహతామ్ || 5 ||

నిన్ను పూజించిన వారినందరికీ కోరిన వరములను ఇస్తావు.  నిన్ను మోహినీ స్త్రీ రూపమును పొందిన శ్రీ విష్ణువు కూడా నిన్ను పూజిస్తాడు. మన్మథుడు తన భార్య మెప్పుపొందే శరీరమును పొందాడు. జితేంద్రియులయిన ఋషి మునులను సైతము పరవశము చేయు శరీర సౌందర్యమును పొందాడు. 

ధనుః పౌష్పం మౌర్వీ మధుకరమయీ పంచ విశిఖాః
వసంతః సామంతో మలయమరు-దాయోధన-రథః |
తథాప్యేకః సర్వం హిమగిరిసుతే కామపి కృపాం
అపాంగాత్తే లబ్ధ్వా జగదిద-మనంగో విజయతే || 6 ||

ఓ హిమవత్పర్వత రాజపుత్రీ, పుష్పమయమయిన ధనుస్సు, తుమ్మెదల వరుసతో కూర్చిన వింటి త్రాడు, లెక్కకు అయిదు మాత్రమే బాణములు, అల్పాయుష్కుడు జడుడు అయిన వసంతుడు చెలికాడు, మలయమారుతమే నీ రథము, --- ఏ మాత్రము సమర్థము మరియు సమర్థనీయము కానివగు ఇట్టి సాధన సామగ్రిలతో,  కనీసము శరీరముకూడా లేని వాడయ్యును మన్మథుడు  నిన్ను ఆరాథించి అనిర్వచనీయమయిన నీ కరుణా కటాక్షమును పొంది ఈ జగత్తును జయించుచున్నాడుకదా.
వసంతఋతువు, మలయమారుతము రెండూను అల్పకాలము ఉండునవే. పుష్పమయమయిన పంచజ్ఞానేంద్రియములు, జ్ఞానేంద్రియములకు నాయకుడు మనస్సులాంటి  ధనుస్సు, తుమ్మెదలఝుంకారముతో కూర్చిన వింటిత్రాడు, లెక్కకు అయిదు మాత్రమే బాణములు, అనగా పంచ జ్ఞానేంద్రియములు,  ఇందియముల  ప్రలోభాలకు లోబడని జితేంద్రియుడయిన మానవుడు అమ్మ కరుణా కటాక్షమును పొంది క్రియాయోగ ధ్యానముతో నిశ్చల మనస్కుడై ఈ జగత్తును జయించుచున్నాడుకదా.

క్వణత్కాంచీ-దామా కరి కలభ కుంభ-స్తననతా
పరిక్షీణా మధ్యే పరిణత శరచ్చంద్ర-వదనా |
ధనుర్బాణాన్ పాశం సృణిమపి దధానా కరతలైః
పురస్తా దాస్తాం నః పురమథితు రాహో-పురుషికా || 7 ||

చిరు సవ్వడి చేయు గజ్జేలమొలనూలు కలదియు (అయిన మూలాధరచక్రము), గున్న ఏనుగు కుంభములనుపోలు స్తనములు (అనగా ఇడా  పింగళ నాడులు)  కలిగి కొద్దిగా వంగినట్లు కనబడునదియు, సన్నని నడుము కలదియు, శరద్ ఋతువునందలి పరిపూర్ణమయిన పూర్ణిమా చంద్రుని పోలెడు ముఖము (కూటస్థము) కలదియు, క్రమంగా నాలుగు చేతులలోను ధనుస్సు, బాణము, పాశము, అంకుశము, ధరించి యున్నదియు, త్రిపురహరుడు అయిన శివుని యొక్క ప్రకృతి స్వరూపిణియునగు జగన్మాత మాకు  సాక్షాత్కరించుగాక. ఈ వర్ణన సగుణోపాసకులకు తగును.
ధనుస్సు ఓం బీజాక్షరమునకు,  బాణము క్లీం బీజాక్షరమునకు, పాశము అం బీజాక్షరమునకు, అంకుశము క్రోం బీజాక్షరమునకు,  ప్రతీకలు.
అవి క్రమముగా ఓం బీజాక్షరము – మనస్చంచలతను రూపుమాపి సంకల్పసిద్ధి, క్లీం బీజాక్షరము – ఇంద్రియప్రలోభములను పోగొట్టి లక్ష్యసిద్ధి,  అం బీజాక్షరము – మోహము పోగొట్టి దమము అనగా ఇంద్రియ నిగ్రహము,  క్రోం బీజాక్షరము – క్రోధము పోగొట్టి  సాధన మీద శ్రద్ధ కలుగజేయును. 
సుధాసింధోర్మధ్యే సురవిట-పివాటీ-పరివృతే
మణిద్వీపే నీపో-పవనవతి చింతామణి గృహే |
శివకారే మంచే పరమశివ-పర్యంక నిలయామ్
భజంతి త్వాం ధన్యాః కతిచన చిదానంద-లహరీమ్ || 8 ||
జగజ్జననీ, సుధాసముద్రమునందలి మధ్యప్రదేశమునందు, కల్పవృక్షములవరుసచే చుట్టబడిన మణిమయద్వీపమునందు, కదిమిచెట్ల ఉద్యానవనముననందు, చింతామణులచే కట్టబడిన గృహమునందు శివాకార మంచమునందు, సదాశివుని తొడను నిలయముగా కలిగి, జ్ఞానానందతరంగ రూపమునున్న, నిన్ను కృతార్థులైన ఎవరో కొందరుమాత్రమే సేవించితరించుచున్నారు.
అమ్మ అహంకార స్వరూపిణి. అహంకార = అ, +హ్, +అంక్, +అర, + స్వరూపము.  అనగా అ నుండి హ వరకు గల చిహ్నములను తెలుపు స్వరూపము.  సుధాసముద్రము అనగా కేంద్ర బిందువు. కల్పవృక్షము అనగా మేరుదండము. మణిద్వీపము అనగా ఓంకారమునందు,  శివకారే మంచే పరమశివ-పర్యంక నిలయామ్ అనగా శుద్ధ మనస్సునందు, జ్ఞానానందతరంగ రూపమునున్న, ఓంకార ధ్యానములో ఆనందస్థితిలో మునిగియున్న ఓ తల్లి.
అమ్మ కేంద్రము. సాధారణమనుజులకు ఆలోచనలు కప్పబడియుండి కోరికలు తీర్చు కల్పవృక్షములాంటి మేరుదండము ఉపయోగము తెలియదు. అందువలన చింతామణులచే అనగా ఆలోచనలతో కట్టబడిన గృహమునందు జీవచ్చవాలుగా నివసించుదురు.  



మహీం మూలాధారే కమపి మణిపూరే హుతవహం
స్థితం స్వాధిష్టానే హృది మరుత-మాకాశ-ముపరి |
మనోఽపి భ్రూమధ్యే సకలమపి భిత్వా కులపథం
సహస్రారే పద్మే స హరహసి పత్యా విహరసే || 9 ||

మూలాధారచక్రమునందు పృథ్వీతత్వమును, స్వాధిష్టానచక్రమునందు జలతత్వమును, మణిపురచక్రమునందు అగ్నితత్వమును, అనహతచక్రమునందు వాయుతత్వమును, విశుద్ధచక్రమునందు ఆకాశతత్వమును, భ్రూ మధ్యముననున్న ఆజ్ఞాచక్రమునందు మనస్ తత్వమును, ఈ విధముగా కుల మార్గమును ఛేదించుకొని పోయి సహస్రార కమలమునందు రహసి అనగా ఏకాంతముగానున్న నీ పతి దేవుడయిన సదాశివునితోకలిసి రహస్యముగా విహరించుచున్నావు.
మూలాధార, స్వాధిష్ఠాన, మణిపుర, అనాహత , విశుద్ధ, మరియు ఆజ్ఞా చక్రములను కులము అందురు.
అమ్మ ప్రకృతి. పరమాత్మ ప్రకృతి రెండును కలిస్తే జగత్. అనగా Potential energy kinetic energy క్రింద మారితేనే ప్రపంచము, మరియు ప్రపంచము నడిచేది. 
దీనిద్వారా కుండలినీ యోగము మరియు శ్రీవిద్యకు ప్రాధాన్యత ఇవ్వబడినది. ప్రతివ్యక్తిలోనూ ఉండు కుండలినీ శక్తియే అమ్మవారు. సృష్టి క్రమము సూక్ష్మమునుండి స్థూలమునకు జరుగును. ఇదియే మాయ. మా = కాదు, య = యదార్థము.
స్థూలమునుండిసూక్ష్మము జరుగు క్రమమును ప్రళయ మార్గము అందురు. ఇట్లా సూక్ష్మమునుండి స్థూలమునకు, మరియు స్థూలమునుండిసూక్ష్మమునకు ఈ క్రమము జరుగుచూనే ఉండును. మానవుడు అన్న పానీయములను గ్రహిస్తాడు.  అవి క్రమముగా రస, రక్త, మాంస, మేధస్, అస్థి, మజ్జ, శుక్రములుగా మారును. ఈ శుక్రము  అధోముఖముగ ప్రయాణిస్తే కామ లేక మాయా మార్గము లేక పితృయాన మార్గము లేక కృష్ణ మార్గము. ఇట్టి శుక్రమునకు గార్హపత్యాగ్ని మరియు మందాకినీ అనునవి  సంకేతములు.   ఓజస్సు, సహస్సు, భ్రాజస్సు, మొదలుగునవి అత్యంత సూక్ష్మమైనవి శుక్రమునకు ధాతువులు. ఆవహనీయాగ్ని, వియత్ గంగా అనే పేర్లతో పిలవబడును. శుక్రము ఊర్ధ్వ మార్గము. లేక  దేవయాన మార్గము లేక శుక్ల మార్గము.

సుధాధారాసారై-శ్చరణయుగళాంత-ర్విగళితైః
ప్రపంచం సించంతీ పునరపి రసామ్నాయ-మహసః|
అవాప్య స్వాం భూమిం భుజగనిభ-మధ్యుష్ట-వలయం
స్వమాత్మానం కృత్వా స్వపిషి కులకుండే కుహరిణి || 10 ||

అమ్మా, నీ పాద కమల ద్వయము నుండి జాలువారు అమృతపు ధారావాహినిచే శరీరమునందలి 72000 నాడీమండల మార్గమునంతను తడిపి అమృతచంద్రకాంతులు గల చంద్రుని అనగా సహస్రార చక్రమును వీడి స్వస్థానమైన మూలాధారచక్రము చేరి అక్కడ నీ స్వరూపమును సర్పము వలే అధిష్టించబడిన వర్తులాకారముగానుండు సర్పమువలేఉందువు.  అనగా మూడున్నర చుట్టలు చుట్టుకొని తామరపూవు బొడ్డువద్ద సన్నని రంధ్రమువలెనుండు సూక్ష్మమైన సుషుమ్నా అధోమార్గములో మూలాధార చక్రమువద్ద కుండలినీ శక్తిగా నిద్రించును
అనగా ఊర్ధ్వ మార్గములో సహస్రారచక్రములోనుండు పరమాత్మనుచేర్చు కుండలినీ శక్తిరూపమయిన అమ్మే, అధో మార్గములో మూలాధారచక్రమువద్దకూడా మాయా రూపముగా నుండును. 
మానవ కక్ష్య లోనికి వచ్చుటకు ముందుగా, మూడు కక్ష్యలు దాటవలయును. అవి 1)ఖనిజలవణ  కక్ష్య, (Mineral plane), 2) వృక్షకక్ష్య (plant plane),  3) జంతుకక్ష్య (animal plane).  మిగిలిన అరచుట్ట పరిపూర్ణత పొందవలయును. అప్పుడు ముక్తికలుగును. అదే మానవజన్మకు సాధకత.
 
చతుర్భిః శ్రీకంఠైః శివయువతిభిః పంచభిరపి
ప్రభిన్నాభిః శంభోర్నవభిరపి మూలప్రకృతిభిః |
చతుశ్చత్వారింశద్-వసుదల-కలాశ్చ్-త్రివలయ-
త్రిరేఖభిః సార్ధం తవ శరణకోణాః పరిణతాః || 11 ||

నలుగురు శివులచేతను, అయిదుగురు అయిన శివ శక్తులతోడను,  తొమ్మిది మూలకారణములచేతను, నీయొక్క నిలయమగు శ్రీచక్రము యొక్క కోణములు,  వసు అనగా ఎనిమిది దళములచేతను, కలాశ్ర అనగా పదహారు దళములచేతను,  మూడు మేఖలల అనగా వర్తుల రేఖలచేతను, నీయొక్క శరణ అనగా నిలయమగు శ్రీచక్రము యొక్క కోణములు, వసుదల అనగా అష్టదళములచేతను, త్రివలయ మూడు వర్తులా రేఖలచేతను, త్రిరేఖాభిసార్థం అనగా మూడు భూపుర రేఖలతోనూ, పరిణతాః అనగా పరిణామము పొందినవై నలుబదినాలుగు అవుచున్నవి.
నలుగురు శివులచేతను, శివునికంటే వేరైన అయిదుగురు శివశక్తులచేతను, తొమ్మిది మూలప్రకృతులతో, అష్టదళ, షోడశ దళ, త్రివలయ త్రిరేఖలచేతను, నీకు నిలయమైన శ్రీ చక్రము, నలుబదినాలుగు అంచులు గలది అగుచున్నది.  నలుగురు శివులనగా నాలుగు శివ సంబంధమైన చక్రములు, అయిదు శివశక్తులనగా అయిదు శక్తిసంబంధ మైన చక్రములు. మొత్తము కలిపి తొమ్మిది చక్రములతో అనగా నవ చక్రాత్మకమై అలరారుతున్నది.
వ్యష్టిలో చర్మము, రక్తము, మాంసము, మెదడు, ఆస్థి అనగా ఎముక , ఈ అయిదు శక్తి సంబంధితకోణములు. మజ్జ, శుక్ర, ప్రాణ, జీవ ఇవి శివ సంబంధిత కోణములు. 
సమిష్టిలో పంచభూతములు, పంచతన్మాత్రలు, పంచకర్మేంద్రియములు, పంచ ప్రాణములు, మనస్సు, ఇవి శక్తిసంబంధిత కోణములు.  మాయ, శుద్ధవిద్య, మహేశ్వర, సదాశివులు ఇవి శివ సంబంధిత కోణములు.
శ్రీచక్రమునే శ్రీయంత్రము అందురు.  అన్ని మంత్రములకు, యంత్రములకు, తంత్రములకు,  రాజు లేక రాజ్ఞి కనుక శ్రీచక్రమునే శ్రీ చక్రరాజము లేదా యంత్రరాజము అందురు. ఈ చక్రము సమయాచార మరియు కౌలాచార పధ్ధతి చక్రము అని రెండు రకములు.
కౌలాచార పధ్ధతి చక్రము లో పైకి శీర్షము కలిగిన త్రిభుజములు  (triangles)అయిదు, (vertices or apexes), క్రిందకి శీర్షము కలిగిన త్రిభుజములు  (triangles)నాలుగు, (vertices or apexes), కలిగిన శ్రీచక్రము ఉండును. దీనిని తామస గుణ సంపన్నులు అర్చించుదురు.
సమయాచారపధ్ధతి చక్రములో క్రిందకి శీర్షము కలిగిన త్రిభుజములు  (triangles) అయిదు, (vertices or apexes), పైకి శీర్షము కలిగిన త్రిభుజములు  (triangles) నాలుగు, (vertices or apexes), కలిగిన శ్రీచక్రము ఉండును. దీనిని సత్వగుణ సంపన్నులు అర్చించుదురు.
పకృతి పురుషుడు కలిసినదే ప్రపంచము. శివుడు పురుషుడు, స్త్రీ ప్రకృతి. ఇదే సంకేతముగా శ్రీచక్రములో చూపించుదురు. శ్రీచక్రములోని కేంద్రమే శ్రీచక్రములో నిలయము. శివుడు ఊర్ధ్వ ముఖుడు, శక్తి అధోముఖము. 
ఊర్ధ్వముఖము > గా శీర్షములుగల త్రిభుజములతో ఏర్పడు శ్రీచక్రము అయ్య శివునిది.
అధోముఖము < గా శీర్షములుగల త్రిభుజములతో ఏర్పడు శ్రీచక్రము అమ్మది.
తొమ్మిది మూల ప్రకృతులు:
శ్రీచక్రము మధ్య లో ఉండు త్రికోణము (triangle) --1,  
ఈ త్రికోణము బాహ్యముగా ఉండు ఎనిమిది అంచులుగల అష్ట కోణము --1 ,
ఈ అష్ట కోణము బాహ్యముగా ఉండు  పది అంచులుగల దశకోణములు  --2 ,
ఈ దశకోణములు -2 కి బాహ్యముగా నుండు పదునాలుగు అంచుల చతుర్దశ కోణము –1,
ఈ మొత్తము అయిదు కోణములను శక్తి చక్రములు అంటారు.
అష్ట దళము, షోడశ దళము, మేఖలాత్రయము, భూపుర త్రయము, -- ఈ మొత్తము నాలుగు కోణములను శివచక్రములు అంటారు.
అయిదు కోణములు శక్తి,  శివ కోణములు నాలుగు మొత్తము తొమ్మిది అగును. 
ఈ తొమ్మిది కోణములు తొమ్మిది మూల ప్రకృతులు లేదా నవ యోనులు, లేదా పిండాండ బ్రహ్మాండ నిర్మాణ హేతువులు.
శ్రీచక్ర మధ్యమ కేంద్ర బిందువు పదవ యోని. 
ఈ పదవయోని ఈశ్వరి, పరాశక్తి.
నలుబదినాలుగు కోణములు.
శ్రీచక్ర కేంద్ర బిందువు – 1, త్రికోణము -- 3, అష్ట కోణము—8,   దశారయుగ్మము –10x2 ,
చతుర్దశ కోణము –14, ఇవి మొత్తము 46. ఇందులో 2 కోణములు త్రికోణము క్రిందుగానుండును.   బిందువుతో కలిపి 44 కోణములను లెక్కించవలయును.
శ్రీ చక్ర గోపుర ప్రస్తారము ( three dimensional) మూడు విధములు: 1) భూ ప్రస్తారము, 2) మధ్య కైలాస ప్రస్తారము, 3)  మేరుప్రస్తారము.  ఈ మేరుప్రస్తారమే సుమేరు శృంగ మధ్య స్థానము.
 
త్వదీయం సౌందర్యం తుహినగిరికన్యే తులయితుం
కవీంద్రాః కల్పంతే కథమపి విరించి-ప్రభృతయః |
యదాలోకౌత్సుక్యా-దమరలలనా యాంతి మనసా
తపోభిర్దుష్ప్రాపామపి గిరిశ-సాయుజ్య-పదవీమ్ || 12 ||

ఓ, హిమవత్ రాజపుత్రీ, (తీవ్ర ధ్యానము చేయు సాధకునికి సహస్రారమునుండి చల్లటి తియ్యటి చేతనా స్పందనలు బయలేదేరతాయి. అనగా చల్లటి తియ్యటి చేతనను  పరమాత్మచేతన అంటారు. అట్టి చేతన కలవాడిని హిమవంతుడు లేక పరావంతుడు  అంటారు. అట్టి పరమాత్మ చేతనా కలస్త్రీని సౌంధర్యము హైమవతి లేక పరావతి లేదా పార్వతి అంటారు.)
పరమాత్మ చేతనతో కూడిన సౌంధర్యము  కలస్త్రీని పార్వతిని తూచుటకు, బ్రహ్మ, విష్ణు, ఇంద్రాదులకైనా, కవీంద్రులకైనా సామర్థ్యము లేదు.   అమ్మ పార్వతిదేవిని ఏ కారణమువలననుకూడా  దేవకన్యలకు కూడా శక్యముకాదు.  తపస్సుచేతకూడా  శక్యము కాదు.   కేవలము శివుని శుద్ధమనస్సుతో కూడిన యోగముచేతనే విజ్ఞులు  పొందగలుగుచున్నారు.

నరం వర్షీయాంసం నయనవిరసం నర్మసు జడం
తవాపాంగాలోకే పతిత-మనుధావంతి శతశః |
గలద్వేణీబంధాః కుచకలశ-విస్రస్త-సిచయాః
హటాత్ త్రుట్యత్కాఞ్యో విగళిత-దుకూలా యువతయః || 13 ||

నరం వర్షీయాంసం = ఎంతటి వృద్ధుడయినాను, నయనవిరసం =వికారము గొలుపు చూపుగలవాడయినాను, నర్మసు జడం= గోప్యమయిన విషయముల  యందు జడుడయినాను, తవాపాంగాలోకే= అమ్మా నీ క్రీగంటి చూపుకు నోచుకున్నచో, గలద్వేణీబంధాః = బంధమునుండి విడివడుదురు, కుచకలశ- విస్రస్త -సిచయా= కడవలవంటి స్తనములనుండి జారిన పైటకొంగులుగలవారై, అనగా జగన్మాతవైన నీ కరుణా కటాక్షముతో  హటాత్ = హటాత్తుగా, త్రుట్యత్కాఞ్యో= తెగి పడిపోయిన మొలనూళ్ళుకలవారై, విగలిత-దుకూలా యువతయః = విడిపోయిన పోకముడులు కలవారై, వందలకొలది యౌవన దశలోనున్న ముద్దరాండ్రు, అనగా వస్త్రధారణ,  కేశ సంస్కారము సంగతి మర్చి పోయి, అనుధావంతి = అనుసరించి వెంట పరుగెత్తు తున్నారు.
ఎంతటి వృద్ధుడయినాను, వికారము గొలుపు చూపుగలవాడయినాను,  గోప్యమయిన విషయముల  యందు జడుడయినాను,  అమ్మ క్రీగంటి చూపుకు నోచుకున్నచో బంధమునుండి విడివడుదురు. కడవలవంటి  జగన్మాత కరుణా కటాక్షముతో స్త్రీలు వస్త్రధారణ,  కేశ సంస్కారము సంగతి మర్చి పోయి, జగన్మాతను  అనుసరించి వెంట పరుగెత్తు తున్నారు.
సాధనకు వయస్సుతో నిమిత్తములేదు. రూపసౌందర్యముతో నిమిత్తములేదు. అమ్మ కరుణాకటాక్షము ఉన్న చాలును. 
మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరీం
యత్ కృపా తమహం వందే పరమానంద మాధవం
ఆ మాధవుని అనుగ్రహము ఉంటె మూగవాడు మాట్లాడగలడు. కుంటివాడు కొండలు కూడా ఎక్కగలడు.

క్షితౌ షట్పంచాశద్-ద్విసమధిక-పంచాశ-దుదకే
హుతాశే ద్వాషష్టి-శ్చతురధిక-పంచాశ-దనిలే |
దివి ద్విః షట్ త్రింశన్ మనసి చ చతుఃషష్టిరితి యే
మయూఖా-స్తేషా-మప్యుపరి తవ పాదాంబుజ-యుగమ్ || 14 ||

అమ్మా జగజ్జననీ, క్షితౌ = మూలాధారచక్రమునందు, షట్పంచాశద్=56 సంఖ్య, ఉదకే = స్వాధిష్ఠానచక్రమునందు, ద్విసమధిక-పంచాశ-ద్ = 52 సంఖ్య,  హుతాశే ద్వాషష్టి = మణిపురచక్రమునందు 62 సంఖ్య, అనిలే పంచాశ- ద్ = అనాహత చక్రమునందు 54 సంఖ్య, దివి ద్విః షట్ త్రింశన్ = విశుద్ధ చక్రమునందు 72 సంఖ్య, మనసి చ చతుఃషష్టిరితి =ఆజ్ఞా చక్రమునందు 64 సంఖ్య, యే మయూఖా-స్తేషాం = ఏ కిరణములు ఉన్నవో వాటి అన్నిటికికూడా, ఉపరి తవ పాదాంబుజ-యుగమ్ = వీటి అన్నిటికీ పైన నీ పాదముల ద్వయము ఉన్నది.
అమ్మా జగజ్జననీ మూలాధారచక్రమునందు  56 సంఖ్యగల,  స్వాధిష్ఠాన చక్రమునందు  52 సంఖ్యగల, మణిపురచక్రమునందు 62 సంఖ్యగల,  అనాహతచక్రమునందు  54 సంఖ్యగల,  విశుద్ధ చక్రమునందు 72 సంఖ్యగల,  ఆజ్ఞాచక్రమునందు 64 సంఖ్యగల,  ఏ కిరణములు ఉన్నవో వాటి అన్నిటికి పైన నీ పాదముల ద్వయము ఉన్నది.

శరజ్జ్యోత్స్నా శుద్ధాం శశియుత-జటాజూట-మకుటాం
వర-త్రాస-త్రాణ-స్ఫటికఘుటికా-పుస్తక-కరామ్ |
సకృన్న త్వా నత్వా కథమివ సతాం సన్నిదధతే
మధు-క్షీర-ద్రాక్షా-మధురిమ-ధురీణాః ఫణితయః || 15 ||

తల్లీ,జగజ్జననీ, శరజ్జ్యోత్స్నా= శరత్ కాలపు వెన్నెలవలె, శుద్ధాం శశియుత =శుద్ధమైన స్వచ్ఛమైన చంద్రకాంతుల కూడిన,  జటాజూట-మకుటాం= సమూహము కిరీటము గలదియు, వర-త్రాస-త్రాణ= వర ముద్రయు అభయముద్రను, స్ఫటికఘుటికా=స్ఫటికములతోకూర్చబడిన అక్ష మాలయు, పుస్తక-కరామ్ త్వా= చేతిలో పుస్తకముగల నిన్ను, సకృత్=ఒక్కమారు, నత్వా= నమస్కరించిన, సతాం= సత్ పురుషులకు, మధు-క్షీర-ద్రాక్షా-మధురిమ= తేనె, పాలు, ద్రాక్షా ఫలముల తీయదనమును,  ఫణితయః = వాగ్విలాస వైఖరులు, కథమివ సన్నిదధతే= ఎట్లు ప్రాప్తించకుండును.
తల్లీ,జగజ్జననీ, శరత్ కాలపు వెన్నెలవలె, శుద్ధమైన స్వచ్ఛమైన చంద్రకాంతుల సమూహముతోకూడిన,  కిరీటము గలదియు, వరముద్రయు అభయముద్రను,   స్ఫటికాక్షమాల,  పుస్తకము నాలుగు హస్తములయందు గలవిగాను, నిన్ను ధ్యానించి ఒక్కమారు నమస్కరించునట్టి సత్ పురుషులకు,  తేనె, పాలు, ద్రాక్షా ఫలముల తీయదనమును, వాగ్విలాస వైఖరులు, ఎట్లు ప్రాప్తించకుండును. అమ్మ కరుణాకటాక్షములు ఉండవలెను. అప్పుడు సమస్తము ప్రాప్తించును.

కవీంద్రాణాం చేతః కమలవన-బాలాతప-రుచిం
భజంతే యే సంతః కతిచిదరుణామేవ భవతీమ్ |
విరించి-ప్రేయస్యా-స్తరుణతర-శృంగార లహరీ
గభీరాభి-ర్వాగ్భిః ర్విదధతి సతాం రంజనమమీ || 16 ||

కవీంద్రాణాం = కవిశ్రేష్ఠులయొక్క, చేతః కమలవన= చిత్తములు అనెడి పద్మవనములకు, బాలాతప-రుచిం=ఉదయసూర్యుని లేత అరుణకాంతియై, అరుణామేవ భవతీమ్= అరుణ వర్ణముగల నిన్ను, కతిచిద్=కొందరు, యే సంతః= ఏ సత్పురుషులు, భజంతే= నిన్ను ప్రార్థించుదురో, అమీ విరించి-ప్రేయస్యాః= వీరు సరస్వతీ దేవియొక్క, తరుణతర =ఉప్పొంగు యౌవనపు, శృంగార= శృంగార రసము యొక్క, లహరీ= పొంగిప్రవహించు ప్రవాహమువలె, గభీరాభిః=గంభీరములైన, వాగ్భిః= వాగ్విలాసముచేత,  సతాం= సత్ పురుషులకు, రంజనమ్= హృదయానందమును,  విదధతి= చేయుచున్నారు. 
అమ్మా, జగజ్జననీ, కవిశ్రేష్ఠుల చిత్తములు అనెడి పద్మవనములకు,  ఉదయసూర్యుని లేత అరుణకాంతియై, అరుణ వర్ణముగల నిన్ను, ఏ కొందరు సత్పురుషులు  నిన్ను ప్రార్థించుదురో,  వీరు జ్ఞానవంతులై తమతమ శుద్ధ జ్ఞానముతో సత్ పురుషులకు,  హృదయానందమును కలగ   చేయుచున్నారు.
 
సవిత్రీభి-ర్వాచాం శశి-మణి శిలా-భంగ రుచిభి-
ర్వశిన్యద్యాభి-స్త్వాం సహ జనని సంచింతయతి యః |
స కర్తా కావ్యానాం భవతి మహతాం భంగిరుచిభి-
ర్వచోభి-ర్వాగ్దేవీ-వదన-కమలామోద మధురైః || 17 ||

సవిత్రీభి-ర్వాచాం = వాక్కుకు మూలకారణమైన,  శశి-మణి శిలా-భంగ రుచిభిః = చంద్రకాంతిమణుల ముక్కల కాంతులనుబోలెడు, వశిన్యద్యాభి సహ= వశిని  మొదలగు శక్తులతోగూడ,  జనని త్వాం సంచింతయతి యః = అమ్మా నిన్ను ఎవడు ధ్యానించునో, స మహతాం భంగిరుచిభిః = అతడు మహానుభావులైన రసవత్తర మైన,  ర్వాగ్దేవీ-వదన-కమలామోద = సరస్వతీ దేవి ముఖపద్మము నుండి ఆమోదయోగ్యమైన, మధురైః వచోభిః కావ్యానాం కర్తా భవతి = మధురమైన వచనములతో కూడిన కావ్యకర్త అగుచున్నాడు.

వాక్కుకు మూలకారణమైన, చంద్రకాంతిమణుల ముక్కల కాంతులనుబోలెడు,  వశిని  మొదలగు శక్తులతోగూడ, అమ్మా నిన్ను ఎవడు ధ్యానించునో, అతడు మహానుభావులైన రసవత్తరమైన, సరస్వతీదేవి ముఖపద్మమునుండి ఆమోదయోగ్యమై వెలువడు, మధురమైన వచనములతో కూడిన కావ్యకర్త అగుచున్నాడు.
మాతృకాం వశినీయుక్తాం యోగినీభిసమన్వితాం
గంధాద్యాకర్షిణీనీయుక్తాం సంస్మరే త్రిపురాంబికాం
అమ్మ ఎనిమిది వశీన్యాది, విద్యాయోగినీ శక్తులు కలిగియున్నది.
మాతృకా వర్ణరూపిణీ పంచాశత్పీఠ రూపిణీ అనగా అమ్మ 50 అక్షరముల స్వరూపిణీ.
“అ”  వర్గము =అ ఆ ఇ ఈ ఉ ఊ ఋ ఋూ ఎ ఏ ఐ ఒ ఓ ఔ అం అః - 16
  వర్గము = క ఖ గ ఘ ఙ (5)
చ వర్గము = చ ఛ జ ఝ ఞ  (5)
ట వర్గము = ట ఠ డ ఢ ణ   (5)
త వర్గము = త థ ద ధ న    (5)
ప వర్గము = ప ఫ బ భ మ   (5)
య వర్గము = య ర  ల వ     (4)
  వర్గము = శ ష స హ ళ      (5)
-------------------------------------
మొత్తం  =   50 అక్షరములు
యోగినులు:
1)విద్యాయోగినీ, 2)రేచికాయోగినీ, 3)మోచికాయోగినీ,  4)అమృతాయోగినీ, 5)దీపికాయోగినీ, 6)జ్ఞానయోగినీ, 7)ఆప్యాయనీయోగినీ, 8)వ్యాపినీయోగినీ, 9)మేథాయోగినీ, 10)వ్యోమరూపాయోగినీ, 11)సిద్ధరూపాయోగినీ,  12)లక్ష్మీ యోగినీ, మరియు వశిన్యాది శక్తులు ఎనిమిది మొత్తము కలిపి 20 శక్తులు అగును. ఇవి శ్రీచక్రము నందలి దశారయుగ్మమునందు ఉండు 20 (10 x 2 )  కోణములు ఇవే.
గంధాకర్షిణ్యాదులు:
శ్రీచక్రమునకు నాలుగు ద్వారములు ఉండును. ఈ నాలుగుద్వారములవద్ద నాలుగుశక్తులు ఉండును. వీరిని ధ్యానించవలయును. అవి: 1) గంధా కర్షిణీ,   2) రసాకర్షిణీ, 3)రూపాకర్షిణీ,  మరియు 4)స్పర్శాకర్షిణీ.

తనుచ్ఛాయాభిస్తే తరుణ-తరణి-శ్రీసరణిభి
ర్దివం సర్వా-ముర్వీ-మరుణిమని మగ్నాం స్మరతి యః |
భవంత్యస్య త్రస్య-ద్వనహరిణ-శాలీన-నయనాః
సహోర్వశ్యా వశ్యాః కతి కతి న గీర్వాణ-గణికాః || 18 ||

తరుణ-తరణి = ఉదయసూర్యునియొక్క,  శ్రీసరణిభిః = కాంతినిబోలు, తనుచ్ఛాయాభిః తే= నీ దేహకాంతులచేత, సర్వా- దివం ఉర్వీం = సమస్త ఆకాశము భూమిని, అరుణిమని మగ్నాం =అరుణవర్ణమునందు నిమగ్నమైనదానినిగా, స్మరతి యః అస్య త్రస్యత్ = ఏ సాధకుడు స్మరించునో వానికి బెదిరిచుండు, వనహరిణ- = అడివిలేళ్ళయొక్క, శాలీన-నయనాః= సిగ్గుతో కూడిన కన్నులతో, ఊర్వశ్యాః గీర్వాణ-గణికాః= ఊర్వశిలాంటి దేవతా స్త్రీలు, కతి కతి న వశ్యాః భవంతి = ఎందరెందరో ఎట్లు వశముకారు.

ఉదయసూర్యునియొక్క కాంతివంటి  నీ దేహకాంతులచేత,  సమస్త ఆకాశము భూమిని, అరుణవర్ణమునందు నిమగ్నమైనదానినిగా, ఏ సాధకుడు స్మరించునో వానికి బెదిరిచుండు,  అడివిలేళ్ళయొక్క, సిగ్గుతో కూడిన కన్నులతో,  ఊర్వశిలాంటి దేవతా స్త్రీలు,  ఎందరెందరో ఎట్లు వశముకారు.

ముఖం బిందుం కృత్వా కుచయుగమధ-స్తస్య తదధో
హరార్ధం ధ్యాయేద్యో హరమహిషి తే మన్మథకలామ్ |
స సద్యః సంక్షోభం నయతి వనితా ఇత్యతిలఘు
త్రిలోకీమప్యాశు భ్రమయతి రవీందు-స్తనయుగామ్ || 19 ||

హరమహిషి = పరమేశ్వరీ, ముఖం బిందుం కృత్వా= ముఖమును బిందువు అనగా ఆజ్ఞాచక్రమునందు ధ్యానము చేసి, తస్య అధః కుచయుగమ్ కృత్వా= దాని క్రిందిభాగమునందు అనాహతను ధ్యానము చేసి, తదధో హరార్ధం కృత్వా= దాని క్రిందిభాగమునందు మూలాధారమును ధ్యానము చేసిన, యః ధ్యాయేత్ స సద్యః = ధ్యానముచేసిన భక్తుడికి వెంటనే, సంక్షోభం నయతి వనితా ఇతి అతిలఘు= స్త్రీ వ్యామోహము నుండి విడివడుటస్వల్పవిషయము, అశు భ్రమయతి= శీఘ్రముగా భ్రమనుండి విడివడి, రవీందు-స్తనయుగామ్ త్రిలోకీమపి= పరమాత్మను విశుద్ధచక్రమునందు మూడు లోకములయందు ధ్యానించును.

పరమేశ్వరీ ముఖమును బిందువు అనగా ఆజ్ఞాచక్రమునందు ధ్యానము చేసి, దాని క్రిందిభాగమునందు అనాహతను ధ్యానము చేసి, దాని క్రిందిభాగమునందు మూలాధారను ధ్యానము చేసిన, ధ్యానముచేసిన భక్తుడికి వెంటనే, స్త్రీ వ్యామోహమునుండి విడివడుటస్వల్పవిషయము శీఘ్రముగా భ్రమనుండి విడివడి, పరమాత్మను విశుద్ధచక్రమునందు మూడులోకములయందు ధ్యానించును,
ఆత్మ = సూర్యుడు, మనస్సు = చంద్రుడు, బిందువు = మూలాధారము సంకల్ప కేంద్రము.

కిరంతీ-మంగేభ్యః కిరణ-నికురుంబామృతరసం
హృది త్వా మాధత్తే హిమకరశిలా-మూర్తిమివ యః |
స సర్పాణాం దర్పం శమయతి శకుంతాధిప ఇవ
జ్వరప్లుష్టాన్ దృష్ట్యా సుఖయతి సుధాధారసిరయా || 20 ||

యఃఅంగేభ్యః= ఏ భక్తుడు అవయవములనుండి, కిరణ-నికురుంబామృతరసం = వెలుగులనుండిపుట్టిన అమృత రసమును, కిరంతీం త్వాం = వర్షించుచున్న నీనుండి, హృది త్వా మాధత్తే హిమకరశిలా-మూర్తిమివ= చంద్రకాంతి మణిమయ ప్రతిమవలె, ఆధత్తే సః = ధ్యానించు సాధకుడు, సర్పాణాం దర్పం= సర్పముల గర్వమును,  శమయతి శకుంతాధిప ఇవ= గరుడపక్షివలె శాంతింప జేయు చున్నాడు, జ్వరప్లుష్టాన్ దృష్ట్యా సుఖయతి సుధాధారసిరయా = జ్వరతాపముచే బాదింపబడువారిని అమృతధారా వీక్షణముచే సుఖమును కలుగజేయుచున్నాడు.

 ఏ భక్తుడు అవయవముల వెలుగుల నుండిపుట్టిన నీ అమృత రసమును,  వర్షించుచున్న చంద్రకాంతి మణిమయ ప్రతిమవలె, నిన్ను ధ్యానించు సాధకుడు, సర్పముల గర్వమును, గరుడపక్షివలె శాంతించును.   జ్వరతాపముచే బాదింపబడువారిని నీ అమృతధారా వీక్షణముచే సుఖమును కలుగజేయును. 
పాతాళము=మూలాధార - నాభి మధ్య ప్రదేశము, సంకల్ప కేంద్రము, ఇదే బ్రహ్మగ్రంథి విచ్ఛేదన.
మర్త్యలోకము= నాభి స్తనముల మధ్యభాగము, ఇదే రుద్ర గ్రంథి విచ్ఛేదన.
దేవలోకము = కంఠమునకు పైన ఉండే భాగము. ఇదే విష్ణు గ్రంథి విచ్ఛేదన.

తటిల్లేఖా-తన్వీం తపన శశి వైశ్వానర మయీం
నిషణ్ణాం షణ్ణా మప్యుపరి కమలానాం తవ కలాం |
మహాపద్మాటవ్యాం మృదిత-మలమాయేన మనసా
మహాంతః పశ్యంతో దధతి పరమాహ్లాద-లహరీమ్ || 21 ||

తటిల్లేఖా-తన్వీం= మెఱుపుతీగె వంటి శరీర కాంతితో, తపన శశి వైశ్వానర మయీం= సూర్యచంద్రాగ్ని రూపముతో,  కమలానాం తవ కలాం షణ్ణామప్యుపరి = ఆరుచక్రముల పై భాగమందున్న, మహాపద్మాటవ్యాం ని షణ్ణా = సహస్రారచక్రమందున్న, తవ కలాం మృదిత-మలమాయేన= నీ కళను క్షాళనము గావింపబడిన కామాది మలినములు, మనసా మహాంతః పశ్యంతః పరమాహ్లాద-లహరీమ్ =మనస్సుచేత మహాపురుషులు చూస్తూ పరమాహ్లాద-లహరిని పొందుచున్నారు.
  
మెఱుపుతీగె వంటి శరీర కాంతితో  సూర్యచంద్రాగ్ని రూపముతో ఆరుచక్రముల పై భాగమందున్న సహస్రారచక్రమందున్న నీ కళను క్షాళనము గావింపబడిన కామాది మలినములు మనస్సుచేత మహాపురుషులు చూస్తూ పరమాహ్లాద-లహరిని పొందుచున్నారు.
సుషుమ్నా మార్గమును కులపథము లేక చక్రమార్గము అంటారు. కుండలినీ శక్తిని అనగా అమ్మవారిని సహస్రార కమల కేంద్రమందలి  ప్రజ్ఞా సంకేతకుడైన శివునితో ఐక్యము చెందుట సాధకుని ఉపాసానకు పరమావధి.  సహస్రార చక్రమునందలి కేంద్రమును బిందువు అంటారు. అమ్మవారి ఆసనము ఇదే. దీనిని లలితా సహస్రానామములలో శివ శక్త్యైక రూపిణీ అని చివరి శ్లోకములో చెప్పారు. 
సూక్ష్మము, వికాసము, అత్యంతప్రకాశము గలది సౌదాఖ్యకళ. ఈకళ గలది కనుక అమ్మని సౌదామిని అంటారు.
కుండలినీశక్తి మొదట మూలాధార, స్వాధిష్ఠాన, మణిపుర చక్రములను దాటును. బ్రహ్మగ్రంధిని (brain of instincts and emotions) ఛేదించు కొనును.  56 + 52 + 62 =170 ఇవి అగ్ని జ్వాలలు.
ఇప్పుడు మణిపుర అనాహత విశుద్ధ చక్రములను దాటును. రుద్రగ్రంధిని ఛేదించుకొనును.  62 + 54+ 72= 158. ఇవి చంద్రకళలు. 
విశుద్ధ ఆజ్ఞా చక్రములను దాటును. విష్ణుగ్రంధిని ఛేదించుకొనును. 72  + 64= 136. ఇవి సూర్య కిరణములు.
ఊర్ధ్వ మార్గములో ఈ విధముగా, బ్రహ్మగ్రంధిని, రుద్రగ్రంధిని, మరియు విష్ణుగ్రంధిని, లేదా అగ్నితత్వ, సోమతత్వ, మరియు సూర్యతత్వ స్థితులను దాటి,  సహస్రార కమలము చేరిన కుండలినీ శక్తినే “మూలాధారైక నిలయా బ్రహ్మగ్రంధి విభేదనీ,  కుండలినీ  బిసతంతు తనీయసీ విష్ణుగ్రంధి విభేదనీ, అనే నామములతో చెప్పబడినది. అట్టివానికి సౌదాఖ్యకళ ద్యోతకమగును. యోగి అగును. భౌతిక ప్రపంచములో ఉండికూడా,  భౌతిక దృష్టి ఉండదు. కోరికలు ఉండవు. అన్నియి సాపెక్షములైన సుఖములని తెలియును. నిరపేక్ష, నిరతిశయ, ఆనందమును కలుగచేయును. దీనినే జీవన్ముక్తి స్థితి అందురు.

భవాని త్వం దాసే మయి వితర దృష్టిం సకరుణాం
ఇతి స్తోతుం వాంఛన్ కథయతి భవాని త్వమితి యః |
తదైవ త్వం తస్మై దిశసి నిజసాయుజ్య-పదవీం
ముకుంద-బ్రహ్మేంద్ర స్ఫుట మకుట నీరాజితపదామ్ || 22 ||

భవాని త్వం దాసే మయి= అమ్మా, నేను నీ దాసుడను, వితర దృష్టిం సకరుణాం= నీ కరుణ దృష్టిని నా యందు ప్రసరింపజేయి, ఇతి స్తోతుం వాంఛన్ కథయతి భవాని= ఇట్లా ఎవడు నిన్ను ప్రార్థించునో,  తదైవ త్వం తస్మై= వానికి ఆ విధముగానే, ముకుంద-బ్రహ్మేంద్ర స్ఫుట మకుట నీరాజితపదామ్ = బ్రహ్మ విష్ణు మహేంద్రులయొక్క స్పష్టముగా కనబడు కాంతికిరీటములచేత హారతి ఇవ్వబడిన అడుగులచేత, దిశసి నిజసాయుజ్య-పదవీం= నీతో సమానమైన పదవిని ఇచ్చెదవు.

అమ్మా, నేను నీ దాసుడను. నీ కరుణ దృష్టిని నా యందు ప్రసరింపజేయి,  ఇట్లా ఎవడు నిన్ను ప్రార్థించునో,  వానికి ఆ విధముగానే, బ్రహ్మ విష్ణు మహేంద్రులయొక్క స్పష్టముగా కనబడు కాంతులచేత హారతి ఇవ్వబడిన అడుగులచేత, నీతో సమానమైన పదవిని ఇచ్చెదవు.

త్వయా హృత్వా వామం వపు-రపరితృప్తేన మనసా
శరీరార్ధం శంభో-రపరమపి శంకే హృతమభూత్ |
యదేతత్ త్వద్రూపం సకలమరుణాభం త్రినయనం
కుచాభ్యామానమ్రం కుటిల-శశిచూడాల-మకుటమ్ || 23 ||

త్వయా హృత్వా వామం వపు= నీ చేత శివుని ఎడమవైపు శరీరము అపహరించినా, అపరితృప్తేన మనసా అపరమ్= సంతృప్తినొందని మనస్సుతో కుడివైపు కూడా, శరీరార్ధం శంభోః అపి శంకే హృతం అభూత్ =అపహరించేనని అనుమానము వచ్చేను, యదేతత్ త్వద్రూపం సకలమరుణాభం= ఎందుకనగా నీ రూపము మొత్తము అరుణవర్ణము కలిగియున్నదై, త్రినయనం= మూడుకన్నులు కలదై,  కుచాభ్యామానమ్రం = స్తనద్వయముచే కొంచెము వంగినదియై, కుటిల-శశిచూడాల-మకుటమ్=వక్రమైన చంద్రకళచే శిరోమణిగల కిరీటముగలదిగాయున్నది.
 
 నీ చేత శివుని ఎడమ శరీరము అపహరించినా, సంతృప్తినొందని మనస్సుతో కుడివైపు కూడా, అపహరించేనని అనుమానము వచ్చేను. ఎందుకనగా నీ రూపము మొత్తము అరుణవర్ణము కలిగియున్నదై, మూడుకన్నులు కలదై,   స్తనద్వయముచే కొంచెము వంగినదియై, వక్రమైన చంద్రకళచే శిరోమణిగల కిరీటముగలదిగాయున్నది.  అమ్మవారు అరుణవర్ణము అనగా కదిలే శక్తి (kinetic energy), అయ్యవారు శ్వేతవర్ణము అనగా కదలని శక్తి (Potential enenrgy)కి సంకేతము.  శివుడు తనరూపమును వ్యక్తపరచలేడు. ఆయన వ్యక్తరూపమే అమ్మవారు.
అమ్మవారి అరుణవర్ణము అనురాగమునకు, కిరీటము సర్వేశ్వరీ తత్వము నకు, చంద్రుడు ఆహ్లాదమునకు, స్తనద్వయము జగత్తును పోషించు శక్తికి, మూడుకన్నులు త్రికాలజ్ఞత్వమునకు సంకేతము.
స్తనద్వయము అనగా ఇడా పింగళా నాడులు.
వక్రమైన చంద్రకళ అనగా మూడవ నేత్రము.

జగత్సూతే ధాతా హరిరవతి రుద్రః క్షపయతే
తిరస్కుర్వ-న్నేతత్ స్వమపి వపు-రీశ-స్తిరయతి |
సదా పూర్వః సర్వం తదిద మనుగృహ్ణాతి చ శివ-
స్తవాజ్ఞా మాలంబ్య క్షణచలితయో ర్భ్రూలతికయోః || 24 ||

జగత్సూతే ధాతా=జగత్తును సృష్టించేది బ్రహ్మ, హరిరవతి = విష్ణువు పాలించుచున్నాడు,  క్షపయతే= శివుడు లయము చేయుచున్నాడు. ఈశః ఏతత్ తిరస్కుర్వన్ =ఈశ్వరుడు  ఈ ముగ్గురినీ తిరస్కరించినవాడై, స్వమపి వపుః తిరయతి = తన శరీరమును అంతర్ధానము పొందించుచున్నాడు. సదా పూర్వః శివః తదిదం= సదాశివుడు క్షణచలితయోః=క్షణకాలమాత్ర వికాసము గల, తవ ఆలంబ్య భ్రూలతికయోః =నీకను సన్నలననుసరించి, అనుగృహ్ణాతి = అనుగ్రహించుచున్నాడు.

జగత్తును సృష్టించేది బ్రహ్మ, విష్ణువు పాలించుచున్నాడు,  శివుడు లయము చేయుచున్నాడు. ఈశ్వరుడు  ఈ ముగ్గురినీ     తన శరీరమున అంతర్ధానము పొందించుచున్నాడు.  వీరందరిపైన ఉన్న సదాశివుడు  నీ కనుసన్నలను అనుసరించి,   అనుగ్రహించుచున్నాడు.

త్రయాణాం దేవానాం త్రిగుణ-జనితానాం తవ శివే
భవేత్ పూజా పూజా తవ చరణయో-ర్యా విరచితా |
తథా హి త్వత్పాదోద్వహన-మణిపీఠస్య నికటే
స్థితా హ్యేతే-శశ్వన్ముకుళిత కరోత్తంస-మకుటాః || 25 ||

త్రయాణాం దేవానాం త్రిగుణ-జనితానాం తవ శివే= అమ్మ, నీ సత్వ, రజస్తమో గుణములవలన ఉద్భవించిన ముగ్గురు దేవతలైన బ్రహ్మ, విష్ణు, రుద్రులకు, పూజా తవ చరణయో-ర్యా విరచితా భవేత్ పూజా = నీపాదములయందు ఏ పూజ చేయబడినదో ఆ పూజయే అగును. తథా హి త్వత్పాదోద్వహన-మణిపీఠస్య నికటే= అట్లాగే నీపాదములను వహించు రత్న సింహాసన సమీపమునందు,  శశ్వన్ముకులిత కర= ఎల్లప్పుడు మోడ్పబడిన హస్తములే, ఉత్తంస-మకుటాః స్థితా హ్యేతే= భూషణముగాగల కిరీటముగలవారై ఈ త్రిమూర్తులు ఉన్నారు.

అమ్మ, నీ సత్వ, రజస్తమో గుణములవలన ఉద్భవించిన ముగ్గురు దేవతలైన బ్రహ్మ, విష్ణు, రుద్రులకు,  నీపాదములయందు ఏ పూజ చేయబడినదో వారికినీ ఆ త్రిమూర్తులకునూ ఆ పూజయే చేయబడుతున్నది. 


విరించిః పంచత్వం ప్రజతి హరిరాప్నోతి విరతిం
వినాశం కీనాశో భజతి ధనదో యాతి నిధనమ్ |
వితంద్రీ మాహేంద్రీ-వితతిరపి సమ్మీలిత-దృశా
మహాసంహారేఽస్మిన్ విహరతి సతి త్వత్పతి రసౌ || 26 ||

విరించిః పంచత్వం ప్రజతి = బ్రహ్మ మరణము పొందుచున్నాడు, హరిరాప్నోతి విరతిం = విష్ణువు చైతన్యత్వము పోగొట్టుకుంటున్నాడు, వినాశం కీనాశో భజతి =యముడు వినాశమును పొందును, ధనదో యాతి నిధనమ్= కుబేరుడు దరిద్రుడు అగును. మాహేంద్రీ-వితతిరపి వితంద్రీ  సమ్మీలిత-దృశా = ఇంద్రుని పరివారము కూడా కన్నులు మూతపడి నిద్రించును.   మహాసంహారేఽస్మిన్ విహరతి సతి త్వత్పతి రసౌ = మహా సంహారములో నీ భర్త సదాశివుడు మాత్రము విహరించును.

బ్రహ్మ మరణము పొందుచున్నాడు.  విష్ణువు చైతన్యత్వము పోగొట్టు కుంటున్నాడు.  యముడు వినాశమును పొందును,   కుబేరుడు దరిద్రుడు అగును. ఇంద్రుని పరివారము కూడా కన్నులు మూతపడి నిద్రించును.  మహా సంహారములో నీ భర్త సదాశివుడు మాత్రము విహరించును.
అనగా సాధనలో త్రిమూర్తులను దాటి సాధకుడు/సాధకి కేవలము శివత్వము అనగా పరమానందముపొందును.
 
జపో జల్పః శిల్పం సకలమపి ముద్రావిరచనా
గతిః ప్రాదక్షిణ్య-క్రమణ-మశనాద్యా హుతి-విధిః |
ప్రణామః సంవేశః సుఖమఖిల-మాత్మార్పణ-దృశా
సపర్యా పర్యాయ-స్తవ భవతు యన్మే విలసితమ్ || 27 ||

మాత్మార్పణ-దృశా= ఆత్మార్పణ-దృష్టితో, జపో జల్పః=నేను నీకు చేయు జపము, శిల్పం సకలమపి= నా సమస్తమైన క్రియాకల్పములు, ముద్రావిరచనా= నా ముద్రలు, గతిః= నా గమనములు, ప్రాదక్షిణ్య-క్రమణం = నేను చేయు ప్రదక్షిణలు, అశనా= భోజనాదులు,  ఆహుతి-విధిః= నీకు సమర్పించు హవిస్సులు, ప్రణామః సంవేశః= ప్రణామములు, సాష్టాంగ నమస్కారములు, సుఖమఖిల విలసితమ్= సుఖకరమైన నా విలాసములు, సపర్యా పర్యాయ-స్తవ= నీ సేవలే, నీ పూజలే.

ఆత్మార్పణ-దృష్టితో నేను నీకు చేయు జపము నా సమస్తమైన క్రియాకల్పములు, నా ముద్రలు, నా గమనములు,  నేను చేయు ప్రదక్షిణలు,  భోజనాదులు, నీకు సమర్పించు హవిస్సులు,  ప్రణామములు, సాష్టాంగ నమస్కారములు, సుఖకరమైన నా విలాసములు, అన్నీ నీ సేవలే, నీ పూజలే.
   
సుధామప్యాస్వాద్య ప్రతి-భయ-జరామృత్యు-హరిణీం
విపద్యంతే విశ్వే విధి-శతమఖముఖాద్యా దివిషదః |
కరాళం యత్ క్ష్వేలం కబలితవతః కాలకలనా
న శంభోస్తన్మూలం తవ జనని తాటంక మహిమా || 28 ||
జనని = అమ్మా, విశ్వే విధి-శతమఖముఖాద్యా దివిషదః=  బ్రహ్మ ఇంద్రుడు మొదలగు ముఖ్య దేవతలందరూ, ప్రతి-భయ-జరామృత్యు-హరిణీం= అత్యంత భయంకరమైన జరామృత్యువులను పోగొట్టునది అయిన, సుధామప్యాస్వాద్య విపద్యంతే= అమృతము సేవించిననూ కాలధర్మము చెందుచున్నారు, శంభోః కరాళం యత్ క్ష్వేలం కబలితవతః కాలకలనా న = కఠోరమైన ఏ కాలకూటవిషమును సేవించి కూడా కాలధర్మము చెందుట లేదు.  తన్మూలం తవ  తాటంక మహిమా= అందుకు కారణమున్నూ సూర్యచంద్రులవంటి చెవుల తాటంకులుగల  నీ మహిమే.

అమ్మా, బ్రహ్మ ఇంద్రుడు మొదలగు ముఖ్య దేవతలందరూ,  అత్యంత భయంకరమైన జరామృత్యువులను పోగొట్టునది అయిన,  అమృతము సేవించి ననూ కాలధర్మము చెందుచున్నారు,  కఠోరమైన కాలకూటవిషమును సేవించి కూడా కాలధర్మము చెందుట లేదు.   అందుకు కారణమున్నూ సూర్యచంద్రులవంటి చెవుల తాటంకులుగల  నీ మహిమే. అనగా విష్ణుగ్రంథి దన అని అర్థము.

కిరీటం వైరించం పరిహర పురః కైటభభిదః
కఠోరే కోటీరే స్ఖలసి జహి జంభారి-మకుటమ్ |
ప్రణమ్రేష్వేతేషు ప్రసభ-ముపయాతస్య భవనం
భవస్యాభ్యుత్థానే తవ పరిజనోక్తి-ర్విజయతే || 29 ||

కిరీటం వైరించం పరిహర పురః= నీ ముందు బ్రహ్మను తప్పించి దూరముగా నడువుము. కైటభభిదః కఠోరే కోటీరే స్ఖలసి= విష్ణుమూర్తియొక్క కిరీటమును వదలి దూరముగానుండుము. జహి జంభారి-మకుటమ్= మహేందుని వదలి వదలి దూరముగా నుండుము. ప్రణమ్రేష్వేతేషు = వీరు నమస్కరించు చుండగా, ముపయాతస్య భవనం = నీ మందిరమునకు వచ్చిన,  భవస్య  ప్రసభ= పరమేశ్వరునకు వెంటనే, అభ్యుత్థానే తవ పరిజనోక్తి-ర్విజయతే= నీ పరిజనుల ముందు సర్వోత్కర్షతో విరాజిల్లుచున్నది.

 నీ ముందు బ్రహ్మను తప్పించి దూరముగా నడువుము.  విష్ణుమూర్తియొక్క కిరీటమును వదలి దూరముగానుండుము.  మహేంద్రుని వదలి  దూరముగా నుండుము. వీరు నమస్కరించుచుండగా,  నీ మందిరమునకు వచ్చిన,   పరమేశ్వరునకు వెంటనే, నీ పరిజనుల ముందు సర్వోత్కర్షతో విరాజిల్లు చున్నది.
మూడు గ్రంథులుదాటి సదాశివస్థితికి చేరిన/చేరగలిగిన సాధకునకు జగత్తు ప్రణమిల్లును.

స్వదేహోద్భూతాభి-ర్ఘృణిభి-రణిమాద్యాభి-రభితో
నిషేవ్యే నిత్యే త్వా మహమితి సదా భావయతి యః |
కిమాశ్చర్యం తస్య త్రినయన-సమృద్ధిం తృణయతో
మహాసంవర్తాగ్ని-ర్విరచయతి నీరాజనవిధిం || 30 ||

నిషేవ్యే నిత్యే = అమ్మా నీవు నిత్యమూ, ఆద్యంతాలు లేనిదానావు, స్వదేహోద్భూతాభిః= నీనుండి ఉద్భవించిన, ఘృణిభిః = కిరణములతోను, అణిమాద్యాభిః= అణిమాదిసిద్ధులతోను,  అభితః= చుట్టియున్న నిన్ను, త్వాం = నిన్ను, అహమితి సదా భావయతి యః= తనదానిగా ఎవ్వడు ధ్యానము చేయునో, త్రినయన-సమృద్ధిం తృణయతో= సర్వ సమృద్ధిని తృణీకరించు వానికి, తస్య మహాసంవర్తాగ్ని= వానికి మహా ప్రళయాగ్ని, నీరాజనవిధిం కరోతి కిం = నీరాజనమును ఇచ్చుటలో ఏమి ఆశ్చర్యము.

అమ్మా నీవు నిత్యమూ, ఆద్యంతాలు లేనిదానవు, నీనుండి ఉద్భవించిన,  కిరణములతోను, అణిమాదిసిద్ధులతోను,  చుట్టియున్న నిన్ను, తనదానిగా ఎవ్వడు ధ్యానము చేయునో,  సర్వసమృద్ధిని తృణీకరించు అట్టి వానికి,  మహా ప్రళయాగ్నికూడా నీరాజనమును ఇచ్చుటలో ఆశ్చర్యము ఏమిఉన్నది.

చతుః-షష్ట్యా తంత్రైః సకల మతిసంధాయ భువనం
స్థితస్తత్త-త్సిద్ధి ప్రసవ పరతంత్రైః పశుపతిః
పునస్త్వ-న్నిర్బంధా దఖిల-పురుషార్థైక ఘటనా-
స్వతంత్రం తే తంత్రం క్షితితల మవాతీతర-దిదమ్ || 31 ||

తత్త-త్సిద్ధి ప్రసవ పరతంత్రైః = ఆ యా తంత్రములప్రయోజనములు ఇష్టపడునవైన, చతుః-షష్ట్యా తంత్రైః= 64 తంత్ర గ్రంథములచేత, సకల మతిసంధాయ భువనం పశుపతిః= సమస్త ప్రపంచము మోహింపచేసిన శివుడు, స్థిత పునస్త్వ-న్నిర్బంధా దఖిల-పురుషార్థైక ఘటనా = స్థిమితముగానుండెను. మరల నాలుగు పురుషార్థములను ముఖ్యముగా సమకూర్చుటయందు, స్వతంత్రం తే తంత్రం క్షితితల మవాతీతర-దిదమ్= స్వ ‘తంత్రం’ అయిన నీయొక్క  ఈ శ్రీవిద్యాతంత్రమును మానవులకి అవతరింప చేసెను.

ఆ యా తంత్రములప్రయోజనములు ఇష్టపడునవైన 64 తంత్ర గ్రంథములచేత,  సమస్త ప్రపంచమును తన మాయ చేత మోహింపచేసిన శివుడు, స్థిమితము గా నుండెను. అయినను భక్తులయడల ప్రేమతో  అమ్మ శివుని ఆజ్ఞతో ఈ శ్రీవిద్యాతంత్రమును మానవులకి అవతరింప చేసెను.
విశ్వమంతానిండిఉన్నది బ్రహ్మవిద్య. తనగురించి చెప్పునది ఆత్మవిద్య. ఈ రెండింటినీ సమన్వయ పర్చునది శ్రీవిద్య. ఇది మోక్ష ప్రదాయిని. మిగిలిన విద్యలన్నిటికంటే అతి ఉత్తమమైనది.

శివః శక్తిః కామః క్షితి-రథ రవిః శీతకిరణః
స్మరో హంసః శక్ర-స్తదను చ పరా-మార-హరయః |
అమీ హృల్లేఖాభి-స్తిసృభి-రవసానేషు ఘటితా
భజంతే వర్ణాస్తే తవ జనని నామావయవతామ్ || 32 ||

శివః శక్తిః కామః క్షితి-రథ రవిః శీతకిరణః= శివుడు (క కారము), శక్తిః = ‘ఏ’ కారము, కామః= మన్మథుడు ‘ఈ’ కారము, క్షితిః= భూమి ఏ కారము, రవిః= ‘హ’ కారము, శీతకిరణః = చంద్రుడు ‘స’ కారము, స్మరః= మన్మథుడు ‘క’ కారము, హంసః= సూర్యుడు ‘హ’ కారము, శక్రః = ఇంద్రుడు ‘ల’ కారము, తదను చ= వీటి తరువాత, పరా= పరాశక్తి ‘స’ కారము, మారః= మన్మథుడు ‘క’ కారము,  హరిః= విష్ణువు  ‘ల’  కారము, అమీ= ఇవి  తిసృభి = మూడు వర్ణములు. హృల్లేఖాభిః= ‘హ్రీం’ కారములచేత, అవసానేషు ఘటితా= వర్గాంతమునందు సంకలితమై, తే వర్ణాః జనని= అమ్మా నీ వర్ణములు, భజంతే  తవ  నామావయవతామ్= నీ మంత్రస్వరూపమును పొందుచున్నవి.
 
శివుడు ‘క’ కారము  శక్తి ‘ఏ’ కారము,   మన్మథుడు ‘ఈ’ కారము,   భూమి ‘ఏ’ కారము,  ‘హ’ కారము,   చంద్రుడు ‘స’ కారము,  మన్మథుడు ‘క’ కారము,  సూర్యుడు ‘హ’ కారము, ఇంద్రుడు ‘ల’ కారము  వీటి తరువాత,  పరాశక్తి ‘స’ కారము,  మన్మథుడు ‘క’ కారము, విష్ణువు ‘ల’ కారము, ఈ మూడు, వర్ణములు. హ్రీంకారములచేత, వర్గాంతమునందు సంకలితమై, అమ్మా నీ వర్ణములు, నీ మంత్రస్వరూపమును పొందుచున్నవి.
శివుడు శక్తి మన్మథుడు భూమి ‘క’  ‘ఏ’ ‘ఈ’  ల అక్షర కూటమి.
సూర్యుడు చంద్రుడు మన్మథుడు సూర్యుడు ఇంద్రుడు ‘హ’ ‘స’ ‘క’ ‘హ’ ‘ల’  అక్షర కూటమి.
పరాశక్తి మన్మథుడు విష్ణువు ఈ మూడు వర్ణములు ‘స’ ‘క’ ‘ల’  అక్షర కూటమి.
వీటి అంతమునందలి విరామ స్థానములు,  హ్రీంకారములచేత, సమకూర్చ బడినపుడు ఏర్పడు ఆ మూడు కూటములలోని మొత్తము 15 అక్షరములు  అమ్మ పంచ దశాక్షరీ మంత్రస్వరూపమునకు అవయవములుగా భాసించబడు చున్నవి.
‘క  ఏ ఈ    హ్రీం            హ్రీం          హ్రీం’   అమ్మ యొక్క పంచ దశాక్షరీ మంత్రస్వరూపము.
వాగ్భవ కూటమి, మధ్య కూటమి లేదా కామరాజ కూటమి, శక్తి కూటమి అని అమ్మవారి స్వరూపము మూడువిధములు.
‘క  ఏ ఈ    హ్రీం’  అమ్మవారి ముఖము.  ఇది వాగ్భవ కూటమి
‘హ          హ్రీం’ అమ్మవారి కంఠమునుండి కటి ప్రదేశము. ఇది అమ్మవారి మధ్య కూటమి లేదా కామరాజ కూటమి,
‘స       హ్రీం’  అమ్మవారి  కటి ప్రదేశము నుండి క్రిందివరకు. ఇది అమ్మవారి శక్తి కూటమి.

స్మరం యోనిం లక్ష్మీం త్రితయ-మిద-మాదౌ తవ మనో
ర్నిధాయైకే నిత్యే నిరవధి-మహాభోగ-రసికాః |
భజంతి త్వాం చింతామణి-గుణనిబద్ధాక్ష-వలయాః
శివాగ్నౌ జుహ్వంతః సురభిఘృత-ధారాహుతి-శతై || 33 ||

స్మరం యోనిం లక్ష్మీం త్రితయ-మిద-మాదౌ తవ మనో నిధాయైకే = ఓ, నిత్యస్వరూపులారా, నీ మంత్రమునకు మొదట మన్మథ బీజము (క్లీం) భువనేశ్వరీ బీజమును(హ్రీం) శ్రీ బీజమును(శ్రీం) ఈ మూడింటినీ ఉంచి కొందరుమాత్రము,నిత్యేనిరవధి-మహాభోగ-రసికాః=హద్దులులేని మహానందము యొక్క రసజ్ఞులు, చింతామణి-గుణ నిబద్ధాక్ష-వలయాః= చింతామణుల సమూహము చేత కూర్చబడిన అక్షమాలలు గలవారై, శివాగ్నౌ త్వాం= శివాగ్నియందు నిన్ను, సురభిఘృత-ధారాహుతి-శతై జుహ్వంతః= కామధేనువుయొక్క నెయ్యి ధారలచేత ఆహుతులయొక్క పలుమారులు హోమముచేయుచు సేవించు చున్నారు.

 ఓ, నిత్యస్వరూపులారా, నీ మంత్రమునకు మొదట మన్మథ బీజము (క్లీం) భువనేశ్వరీ బీజమును(హ్రీం) శ్రీ బీజమును(శ్రీం) ఈ మూడింటినీ ఉంచి కొందరు మాత్రము, హద్దులులేని మహానందముయొక్క రసజ్ఞులు,  చింతా మణుల సమూహము చేత కూర్చబడిన అక్షమాలలు గలవారై, శివాగ్నియందు నిన్ను,  కామధేనువుయొక్క నేతిధారల ఆహుతులయొక్క పలు మారులు హోమముచేయుచు సేవించు చున్నారు.

కామరాజబీజాక్షరము క్లీం, భువనేశ్వరీ బీజాక్షరము హ్రీం, లక్ష్మీ బీజాక్షరము శ్రీం, ఈ మూడింటినీ 
  ఏ ఈ    హ్రీం             హ్రీం          హ్రీం  
లకు ముందుగ కలిపి ధ్యానం చేస్తారు.   అనగా
  ఏ ఈ    హ్రీం             హ్రీం          హ్రీం
లకు ముందుగ క్లీం, హ్రీం, శ్రీం,  కలిపి అష్టాదశాక్షరీ మంత్రం ధ్యానం చేస్తారు. అనగా 18 అక్షరములు
క్లీం, హ్రీం, శ్రీం    ఏ ఈ    హ్రీం             హ్రీం           హ్రీం  అని ధ్యానము చేయవలయును.  అట్టివారు నిరుపమాన, శాశ్వత, మహాభొగరోపమైనశాశ్స్వత సుఖమును పొందుదురు. శివాగ్ని అయిన మణిపుర చక్రములో ధ్యానము చేయవలయును.  శ్రీవిద్యలో భక్తి పరాకాష్ఠ పొందెదరు. దీనినే మహాభోగము అందురు.
శరీరం త్వం శంభోః శశి-మిహిర-వక్షోరుహ-యుగం
తవాత్మానం మన్యే భగవతి నవాత్మాన-మనఘమ్ |
అతః శేషః శేషీత్యయ-ముభయ-సాధారణతయా
స్థితః సంబంధో వాం సమరస-పరానంద-పరయోః || 34 ||

శరీరం త్వం శంభోః శశి-మిహిర-వక్షోరుహ-యుగం= నీవు సూర్యుడు చంద్రుడు స్తనద్వయము శరీరముగలదానవు, తవాత్మానం మన్యే భగవతి నవాత్మాన-మనఘమ్ = నీ దేహమును దోషములేని శివునిగా తలుస్తాను,  అతః శేషః శేషీత్యయ- = అందువలన గుణముగానుండునది, ఆధారమైఉండు ప్రధానము,  ఇతి అయం సంబంధః=అను ఈ సంబంధము,  సమరస-పరానంద-పరయోః= సామరస్యముతోకూడిన ఆనందరూపుడైన శివుడు భైరవీ రూపుడుగా, వాం ఉభయ-సాధారణతయా=మీ ఇరువురకు సాధారణమై ఉండుట, స్థితః =ధ్రువము.

అమ్మా, నీవు సూర్యుడు చంద్రుడు అనాహత చక్రముగలదానవు, నీ దేహమును దోషములేని శివునిగా తలుస్తాను, అందువలన గుణముగా నుండునది, ఆధారమైఉండు ప్రధానము, అను ఈ సంబంధము, సామరస్యము తో కూడిన ఆనందరూపుడైన శివుడు భైరవీ రూపుడుగా, మీ ఇరువురకు సాధారణమై ఉండుట, ధ్రువము.
ఒక సంఘటన భౌతికంగా జరిగిన తరువాత మనకు తెలియును. దానికి ముందుగా తెలిసిన వానిని భైరవుడు అంటారు. కాలజ్ఞానము తెలిసినట్టి వీరిని కాల భైరవుడు అంటారు. జగజ్జననీ జనకులనుకూడా  భైరవీ -  భైరవుడు అంటారు. వారిని ఆనంద భైరవీ – ఆనంద భైరవుడుగా కూడా వ్యవహరిస్తారు.
కాలవ్యూహము కులవ్యూహము నామవ్యూహము జ్ఞానవ్యూహము చిత్త వ్యూహము నాదవ్యూహము బిందువ్యూహము కళావ్యూహము జీవ వ్యూహము అని మొత్తము తొమ్మిది వ్యూహములు అనగా నవ  వ్యూహములు.
కాలవ్యూహము — కాల సంబంధితము
కులవ్యూహము — వర్ణ (రంగులు) సంబంధితము
నామవ్యూహము — చరాచర జీవుల నామధేయ  సంబంధితము
జ్ఞానవ్యూహము — మనస్సు బుద్ధి ద్వారా పొందు జ్ఞాన సంబంధితము
చిత్తవ్యూహము — మనస్సు బుద్ధి మహత్తు చిత్తం అహంకార సంబంధితము
నాదవ్యూహము — నాదము పరా పశ్యంతి మధ్యమా ప్రియా వైఖరీ మరియు వాక్కుల సంబంధితము
బిందువ్యూహము — మూలాధార స్వాధిష్ఠాన  చక్ర సంబంధితము
కళావ్యూహము — పంచాశత్ (50) అక్షర  సంబంధితము
జీవ వ్యూహము — జీవాత్మ సముదాయ సంబంధితము’
శివ శక్తి ఇద్దరినీ ‘ఆనంద భైరవీ – ఆనంద భైరవుడు’ ఇద్దరినీ పరా – పరానందుడు అని ఈ శ్లోకములో వ్యవహరిస్తారు.
సృష్టియందు అనగా సృష్టి విచ్చుకొనునప్పుడు పర కు (Principal factor) లేదా శక్తికి లేదా ఆనందభైరవికి  ప్రాధాన్యము.  ఇది చెట్టుకు ఆ చెట్టుకున్న
ఫలము  లోని బీజము వంటిది.
పరానందునకు (subsidiary factor)అప్రాధాన్యము.
ప్రళయమునందు శివునకు లేదా పరానందునకు (subsidiary factor) లేదా ఆనంద భైరవునికి  ప్రాధాన్యము. ఇది వృక్షసారము విత్తనములోనికి లీనమైన స్థితి లాంటిది. ఆ స్థితిలో వృక్షము అంకురప్రాయముగా విత్తనములో నిక్షిప్తమై యుండును. అప్పుడు విత్తనప్రాదాన్యత అధికము.  చెట్టు కాదు.
ప్రధానత్వము శేషిత్వము. అప్రధానత్వము శేషత్వము.
పర కు (Principal factor) అప్రాధాన్యము.
ఈ ఇద్దరి తాదాత్యమునందు నవాత్మకము సమానముగా చెల్లును.
 
మనస్త్వం వ్యోమ త్వం మరుదసి మరుత్సారథి-రసి
త్వమాప-స్త్వం భూమి-స్త్వయి పరిణతాయాం న హి పరమ్ |
త్వమేవ స్వాత్మానం పరిణ్మయితుం విశ్వ వపుషా
చిదానందాకారం శివయువతి భావేన బిభృషే || 35 ||

మనస్త్వం వ్యోమ త్వం మరుదసి మరుత్సారథి-రసి= ఆజ్ఞాచక్రమునందలి మనస్తత్వమును, విశుద్ధి లోని ఆకాశ తత్వమును,  అనాహతలోని వాయు  తత్వమును, మణిపురలోని అగ్నితత్వమును, త్వమాప-స్త్వం భూమి-స్త్వయి పరిణతాయాం న హి పరమ్= స్వాధిష్ఠానలోని జలతత్వమును, మూలాధార చక్రములోని పృధ్వితత్వమును, నీవే తప్ప ఇంకొకరు లేరు.  త్వమేవ స్వాత్మానం పరిణ్మయితుం విశ్వ వపుషా= నీవే నీ స్వస్వరూపమును ప్రపంచ రూపముతో పరిణమింపచేయుటకు, చిదానందాకారం శివయువతి భావేన బిభృషే= చిచ్ఛక్తియుతుడైన ఆ ఆనంద భైరవుని లేదా శివ తత్వమును శివ యువతి భావముచే ధరించుచున్నావు.
ఆజ్ఞాచక్రమునందలి మనస్తత్వమును, విశుద్ధిలోని ఆకాశతత్వమును,  అనాహతలోని వాయుతత్వమును, మణిపురలోని అగ్నితత్వమును,  స్వాధిష్ఠానలోని జలతత్వమును, మూలాధారచక్రములోని పృధ్వితత్వమును, నీవే తప్ప ఇంకొకరు లేరు. నీవే నీ స్వస్వరూపమును ప్రపంచరూపముతో పరిణమింపచేయుటకు, చిచ్ఛక్తియుతుడైన ఆ ఆనంద భైరవుని లేదా శివ తత్వమును శివయువతి భావముచే ధరించుచున్నావు.
పంచభూతములు, మనస్సు వీటన్నిటిలోను ఉన్నది అమ్మ పరాతత్వమే. అమ్మ తత్వమే మనస్సు, ఆకాశము, వాయువుగా, అగ్ని, జలము, మరియు పృధ్వీ లుగా షట్ చక్రములలో పరిణామము చెందుచున్నది. ప్రళయమునుండి సృష్టి వరకు శివశక్తులు కలిసే ఉందురు. దీనిని శ్రీ విద్యలో ‘ప్రకాశము’ నుండి (బిందువు అనగా శుద్ధప్రజ్ఞ) ‘విమర్శ’ బిందువు ఏర్పడుట అంటారు.  ఈ పరిణామ లేదా మార్పిడి ప్రక్రియనే ‘నాద బిందు కళా’ ప్రేరణ అంటారు.  ప్రకాశములోని అహంకార తత్వమును motivate అనగా రగుల్కొల్పునది ఈ  ‘విమర్శ’ యొక్క పరావర్తిత లక్షణమే. ‘విమర్శ’ శక్తియే ‘శివయువతి’ అంటారు.
సృష్టికి దోహదకారి అగు శక్తితత్వమునే ‘మహాత్రిపురసుందరి’ అంటారు.
ప్రళయమునకు దోహదకారి అగు శక్తితత్వమునే ‘మహాకాళి’ అంటారు.

తవాజ్ఞా చక్రస్థం తపన-శశి కోటి-ద్యుతిధరం
పరం శంభుం వందే పరిమిలిత-పార్శ్వం పరచితా |
యమారాధ్యన్ భక్త్యా రవి శశి శుచీనా-మవిషయే
నిరాలోకే ఽలోకే నివసతి హి భాలోక -భువనే || 36 ||
తవాజ్ఞా చక్రస్థం తపన-శశి కోటి-ద్యుతిధరం= నీ ఆజ్ఞా చక్రమందున్న కోటి సూర్య చంద్ర కాంతులను ధరించిన, పరం శంభుం వందే పరిమిలిత-పార్శ్వం పరచితా= పరమగు చిచ్ఛక్తివలన కలిసిన రెండు ప్రక్కలు కలవాడును, పరుడైన శంభుని నమస్కరించుచున్నాను, యమారాధ్యన్ భక్త్యా రవి శశి శుచీనా-మవిషయే = ఎవనిని భక్తితో ఆరాధించి సాధకుడు రవి చంద్రుల ప్రకాశమును అగోచరమై, నిరాలోకే ఽలోకే నివసతి హి భాలోక-భువనే= బాహ్యదృష్టికి అందని ఏకాంతమైన సహస్రార కమలమునందు. నివసిస్తున్నాడు.

 నీ సంబంధిత ఆజ్ఞా చక్రమందున్న కోటి సూర్య చంద్ర కాంతులను ధరించిన,  పరమగు చిచ్ఛక్తివలన కలిసిన రెండు ప్రక్కలు కలవాడును, పరుడు అయిన శంభుని నమస్కరించుచున్నాను,  ఆ శంభుని భక్తితో ఆరాధించి సాధకుడు రవి చంద్రుల ప్రకాశమునకు అగోచరమై, బాహ్యదృష్టికి అందని ఏకాంతమైన సహస్రార కమలమునందు నివసిస్తున్నాడు.
భ్రూమధ్య స్థానము జ్ఞాన (wisdom) దిశ తూర్పు దిక్కు. ఇక్కడి అధిష్ఠాన దేవతలు—పరశంభునాధుడు, చిత్పరాంబ.
 
విశుద్ధౌ తే శుద్ధస్ఫటిక విశదం వ్యోమ-జనకం
శివం సేవే దేవీమపి శివసమాన-వ్యవసితామ్ |
యయోః కాంత్యా యాంత్యాః శశికిరణ-సారూప్యసరణేః
విధూతాంత-ర్ధ్వాంతా విలసతి చకోరీవ జగతీ || 37 ||
విశుద్ధౌ తే శుద్ధస్ఫటిక విశదం వ్యోమ-జనకం = నీ విశుద్ధచక్రమునందు శుద్ధ స్ఫటికము లాగా నిర్మలమైన ఆకాశ తత్వమును ఉత్పాదించువాడు,   
శివం సేవే దేవీమపి శివసమాన-వ్యవసితామ్=శివుని శివునితో సమానమైన సామర్థ్యము కల భగవతి అయిన నిన్ను ఉపాసించెదను,
యయోః కాంత్యా యాంత్యాః శశికిరణ-సారూప్యసరణేః= ఏ శివా శివులనుండి వచ్చుచున్నదైన చంద్ర కిరణ మార్గ సదృశమైన కాంతివలన,   విధూతాంత-ర్ధ్వాంతా విలసతి చకోరీవ జగతీ =ముజ్జగములు వదలగొట్టబడిన అంతర్ అజ్ఞానము గలదై చకోరపక్షివలె ప్రకాశించుచున్నది. అనగా శివా శివులను సేవించెదను.

 నీ విశుద్ధచక్రమునందు శుద్ధ స్ఫటికము లాగా నిర్మలమైన ఆకాశ తత్వమును ఉత్పాదించువాడు,  శివుని శివునితో సమానమైన సామర్థ్యము కల భగవతి అయిన నిన్ను ఉపాసించెదను, ఆ శివా శివులనుండి వచ్చుచున్నదైన చంద్రకిరణమార్గ సదృశమైన కాంతివలన,  ముజ్జగములు వదలగొట్టబడిన అంతర్ అజ్ఞానము గలవై చకోరపక్షివలె ప్రకాశించుచున్నవి.

సమున్మీలత్ సంవిత్కమల-మకరందైక-రసికం
భజే హంసద్వంద్వం కిమపి మహతాం మానసచరం |
యదాలాపా-దష్టాదశ-గుణిత-విద్యాపరిణతిః
యదాదత్తే దోషాద్ గుణ-మఖిల-మద్భ్యః పయ ఇవ || 38 ||

సమున్మీలత్ సంవిత్కమల-మకరందైక-రసికం= వికసించుచున్న, జ్ఞాన పద్మమునందలి తేనే మాత్రమె ఇష్టపడునది,   భజే హంసద్వంద్వం కిమపి మహతాం మానసచరం = యోగీశ్వరుల మనస్సులో చరించునది ఇట్టిదని చెప్పుటకు వీలులేని రాజహంసల జంటను సేవించెదను, యదాలాపా-దష్టాదశ-గుణిత-విద్యాపరిణతిః= పరస్పర మథుర సంభాషణలవలన 18 విద్యలయొక్క పరిణామము, యదాదత్తే దోషాద్ గుణ-మఖిల-మద్భ్యః పయ ఇవ = ఏ హంసలజంట అవలక్షణములనుండి సమస్తమైన సద్గుణ సముదాయమును నీళ్ళనుండి పాలను గ్రహించుచున్నదో.

వికసించుచున్న, జ్ఞాన పద్మమునందలి తేనె మాత్రమె ఇష్టపడునది,  యోగీశ్వరుల మనస్సులో చరించునది ఇట్టిదని చెప్పుటకు వీలులేని రాజ హంసల జంటను సేవించెదను, పరస్పర మథుర సంభాషణలవలన 18 విద్యల యొక్క పరిణామము, ఏ హంసలజంట అవలక్షణములనుండి సమస్తమైన సద్గుణ సముదాయమును నీళ్ళనుండి పాలను గ్రహించుచున్నదో.

ఓ జగజ్జననీ జ్ఞాన కమలము(అనగా సంసారము) నందలి తేనెను మాత్రమెగ్రోలుటయందు ఆసక్తి కలిగినదియు, యోగీశ్వరుల మనస్సులో చరించునదియు, నీరు పాలు (పర అపర జ్ఞానము) వేరుచేయు సామర్థ్యము గలదియు, దేనిని భజించినచో 18 విద్యలు కరతలామలకము అగునో, అట్టి అనిర్వచనీయమైన శివ శక్తులు అనెడి రాజహంసలజంటను ప్రార్థించు చున్నాను.
రాజహంసల జంట =
రాజ = రహస్యమైన, హంసల జంట= శ్వాస + నిశ్వాస
అనగా క్రమశిక్షణతోకూడిన ప్రాణాయామ అభ్యాసము.
రహస్యము అనగా రహితమయిన హాస్యముగలది. అనగా క్రమశిక్షణతోకూడిన ప్రాణాయామ అభ్యాసము అనేది చాలా serious business అని అర్థము.  
హృత్ పుండరీకము అనగా పద్మము అనగా హృదయములో దహరాకాశము ఉండును.
నాలుగు వేదములు, ఆరు వేదాంగములు, మీమాంస, న్యాయ, దర్శన, ధర్మశాస్త్ర, ఆయుర్వేద, గాంధర్వవేద, ధనుర్వేద, అర్థశాస్త్రములను కలిపి   అష్టాదశ విద్యలు అంటారు.   శివ శక్తులు అనే రాజహంసల నంభాషణలే ఈ వేదం వేదాంగ విద్యలు. శివ శక్తులను అనాహతచక్రము వద్ద ధ్యానము చేయవలయును.  శివ శక్తుల జంటను హంసేశ్వర హంసేశ్వరి అంటారు.

తవ స్వాధిష్ఠానే హుతవహ-మధిష్ఠాయ నిరతం
తమీడే సంవర్తం జనని మహతీం తాం చ సమయామ్ |
యదాలోకే లోకాన్ దహతి మహతి క్రోధ-కలితే
దయార్ద్రా యా దృష్టిః శిశిర-ముపచారం రచయతి || 39 ||

తవ స్వాధిష్ఠానే హుతవహ-మధిష్ఠాయ నిరతం= స్వాధిష్ఠానచక్రమునందలి జలతత్వమును అధిష్ఠించి ఎల్లప్పుడు, తమీడే సంవర్తం జనని మహతీం తాం చ సమయామ్ = ఆ జల రూపుడయిన శివుడిని స్తుతించెదను. సమయము అనుపెరుగల మహిమాన్వితమైన నిన్ను స్తుతించెదను.  యదాలోకే లోకాన్ దహతి మహతి క్రోధ-కలితే=మిక్కిలి గొప్పదై క్రోధముతో కూడిన ఏ విధముగా ఆ పరమేశ్వరుని చూపు భూలోకాది లోకములను దహించును, దయార్ద్రా యా దృష్టిః శిశిర-ముపచారం రచయతి= పరమేశ్వరుని కృపతోకూడిన చూపు శీతలమును ఉపశమనమును కావించుచున్నది.

స్వాధిష్ఠానచక్రమునందలి జలతత్వమును అధిష్ఠించి ఎల్లప్పుడు, ఆ జల రూపుడయిన శివుడిని స్తుతించెదను. అదే విధముగా ‘సమయ’ అనుపేరుగల మహిమాన్వితమైన నిన్ను స్తుతించెదను. మిక్కిలి గొప్పదై  ఏకాగ్రతతో కూడిన   ఆ పరమేశ్వరుని ధ్యానాగ్ని చూపు భూలోకాది లోకములను దహించును. ,  నీ కృపతో కూడిన చూపు శీతలమును ఉపశమనమును కావించుచున్నది.
స్వాధిష్ఠానచక్రము వద్ద శివశక్తులనుధ్యానము చేయవలయును. 

తటిత్వంతం శక్త్యా తిమిర-పరిపంథి-స్ఫురణయా  
స్ఫుర-న్నానారత్నాభరణ-పరిణద్ధేంద్ర-ధనుషమ్ |
తవ శ్యామం మేఘం కమపి మణిపూరైక-శరణం
నిషేవే వర్షంతం-హరమిహిర-తప్తం త్రిభువనమ్ || 40 ||

తవ మణిపూరైక-శరణం= నీ మణిపురచక్రమే  ముఖ్యనివాసముగా,  తటిత్వంతం శక్త్యా తిమిర-పరిపంథి-స్ఫురణయా = చీకటికి శతృవై ప్రకాశించు శక్తిచేత విద్యుల్లత మెరుపుగల,  స్ఫుర-న్నానారత్నాభరణ-పరిణద్ధేంద్ర- ధనుషమ్= ప్రకాశించుచున్న వివిధములైన రత్నములతోకూడిన ఆభరణము లచే కూర్చిన ఇంద్రధనుస్సు గలదియు,   శ్యామం హరమిహిర-తప్తం = నీలి వన్నెలుగల, శివునిచే దగ్ధమైన, నిషేవే వర్షంతం- త్రిభువనమ్ మేఘం కమపి = మూడులోకములగూర్చి వర్షించునది అయిన ఇట్టిది అని చెప్పుటకు వీలుకాని మేఘస్వరూపుడయిన శివుని సేవించెదను.

మణిపురచక్రమే నివాసముగా కలిగి, చీకటికి శతృవై ప్రకాశించు శక్తిచేత విద్యుల్లత మెరుపుగల,  ప్రకాశించుచున్న వివిధములైన రత్నములతోకూడిన ఆభరణములచే కూడిన ఇంద్రధనుస్సువలె వెలుగునదియు,  నీలి వన్నెలుగల, శివునిచే దగ్ధమైన, మూడులోకములగూర్చి వర్షించునది అయిన ఇట్టిది అని చెప్పుటకు వీలుకాని మేఘస్వరూపమయిన శివుని ధ్యానస్వరూపమును సేవించెదను.

తవాధారే మూలే సహ సమయయా లాస్యపరయా
నవాత్మానం మన్యే నవరస-మహాతాండవ-నటమ్ |
ఉభాభ్యా మేతాభ్యా-ముదయ-విధి ముద్దిశ్య దయయా
సనాథాభ్యాం జజ్ఞే జనక జననీమత్ జగదిదమ్ || 41 ||

తవాధారే మూలే సహ సమయయా లాస్యపరయా= నీ మూలాధార చక్రమునందు నృత్యాసక్తిగల ‘సమయా’ అనే పేరుగల శక్తికూడా,  నవాత్మానం మన్యే నవరస-మహాతాండవ-నటమ్ = తొమ్మిది శృంగారాది రసము గల అద్భుతమైన తాండవ నాట్యమునందు తొమ్మిది  రూపములుగల ఆనంద భైరవుని తలచెదను.  ఉభాభ్యా మేతాభ్యా-ముదయ-విధి ముద్దిశ్య దయయా=జగదుత్పత్తి కార్యమును ఉద్దేశించి ఈ ఆనంద మహా భైరవులచేత కరుణచేత, సనాథాభ్యాం జజ్ఞే జనక జననీమత్ జగదిదమ్=ఇద్దరితో ఈ జగత్తు తల్లీ తండ్రి కలదని తెలుసుకొనుచున్నాను.
 నీ మూలాధార చక్రమునందు నృత్యాసక్తిగల ‘సమయా’ అనే పేరుగల శక్తితోకూడి, శృంగారాది నవరసములతో నొప్పావు.  ప్రళయమునందు అద్భుతమైన తాండవ నాట్యమును అభినయించు శివుని తలచెదను. నవాత్మునిగా తలచెదను. ఆనందభైరవునిగా తలచెదను.  ప్రళయాగ్నికి దగ్ధమైన లోకములను మరల   జగదుత్పత్తి కార్యమును ఉద్దేశించి ఈ ఆనంద మహాభైరవులచేత కరుణచేత,  ఈ ఇద్దరి కలయికతో ఈ జగత్తు తల్లీ తండ్రి కలదని తెలుసుకొనుచున్నాను.
సృష్టి ఆవిర్భావమున జరుపు అమ్మ నృత్యమును ‘లాస్యము’ అందురు. ఇక్కడ లాస్యము చేయు జగన్మాతను ఆనందభైరవి గా తలచవలయును.
ప్రళయ ప్రారంభమున అయ్యవారు జరుపు నృత్యమును ‘తాండవ నాట్యము’ అందురు. ఇక్కడ తాండవము చేయు జగత్ పితను ఆనందభైరవునిగా తలచవలయును.
శక్తిరూపమును సమయాదేవిగాను, శివుని నవాత్మకునిగాను మూలాధారము వద్ద ధ్యానము చేయవలయును.

శృంగారాది నవరసములు ఇవి:
      నాట్యము పేరు                  రంగు                     అధిష్టాన దేవత
1.   శృంగారం                       లేత ఆకుపచ్చ                  విష్ణు
2.  వీరం                            కాషాయం                       ఇంద్ర
3.  కారుణ్యం                       బూడిద తెలుపు                యమ
4.  అద్భుతం                       పసుపుపచ్చ                    బ్రహ్మ
5.  హాస్యం                             తెలుపు                       ప్రమత
6.   భయానకం                       నలుపు                     కాళరాత్రి
7.  బీభత్సం                           నీలం                            శివ
8.  రౌద్రం                              ఎఱుపు                         రుద్ర
9.  శాంతం                             తెల్లటి తెలుపు                 విష్ణు
శక్తిని ‘సమయాదేవి’, మరియు శివుడుని  ‘నవాత్మకుడు’ అంటారు. శక్తి అయిదు విధములు . అవి 1) అనుష్ఠాన సామ్యము, 2)అవస్థా సామ్యము, 3) అధిష్ఠాన సామ్యము,4) రూప సామ్యము, మరియు  5) నామ సామ్యము.
1)అధిష్ఠాన సామ్యము: శివశక్తులిరువురికి షట్ చక్రములు అధిష్ఠానములు,
2)అనుష్ఠాన సామ్యము: జగత్తుకు శివశక్తులిరువురు తల్లి తండ్రి.  వారు ఇరువురు—సృష్టి—ప్రళయములు,  లాస్య, తాండవ, నృత్య, మరియు రూప కార్యములు. అందువలన ఇది అనుష్ఠాన సామ్యము.
3) అవస్థా సామ్యము: వర్షాకాలం మరియు ప్రళయాగ్ని ఇద్దరూ శివశక్తులే. ఇదే అవస్థా సామ్యము.
4) రూప సామ్యము: పరస్పర దేహార్ధ పరిపూరక శోభనత్వము వలన ఇది రూప సామ్యము.
5) నామ సామ్యము: శివ శర్వాణీ, భవ భవానీ, రుద్రా రుద్రాణీ లాంటి నామ యుగళములు. ఇది నామ సామ్యము. 
1) కులవ్యూహము, 2) నామవ్యూహము, 3) కాలవ్యూహము, 4)జ్ఞాన  వ్యూహము, 5) చిత్తవ్యూహము, 6) నాదవ్యూహము, 7) బిందువ్యూహము, 8) కళా వ్యూహము, 9) జీవవ్యూహము,  అను నవ వ్యూహాత్మకుడు శివుడు.
1)వామ  2)జ్యేష్ఠ  3) రౌద్రీ 4)అంబికా 5)ఇచ్ఛా 6) జ్ఞాన 7) క్రియా 8)శాంతి  9) పరా  ఇవి శక్తి వ్యూహములు.
ఆథార వాతరోథేనశరీరం కంపతే యథా
ఆథార వాతరోథేనయోగీ నృత్యతిసర్వదా 
ఆథార వాతరోథేనవిశ్వం తత్రైవ దృశ్యతే
సృష్టిరాధారమాధారే  ఆధారే సర్వదేవతాః
ఆధారే సర్వవేదాశ్చ తస్మాదాధార మాశ్రయేత్
మూలాధారచక్రము ప్రాణశక్తిని అవరోథించుటవలన చక్ర స్పందనకు తద్వారా జీవము వికాసము పొందుతుంది. అదే కుండలినీ యోగము.
మూలాధారము జాగృతి చెందుట వలన శరీరం కంపిస్తుంది. యోగి నృత్యము చేస్తాడు. ఈ  నృత్యము శివ శక్తుల లాస్య తాండవ నృత్యముతో శృతి లయ బద్ధమగుతుంది. అప్పటినుండి సాధకుని జీవితమూ సార్ధకము అగును. విశ్వ ప్రణాళికతో శృతి కలుపుతుంది. న్యాసము చెందుతుంది.
శివాశివుల లాస్యతాండవముల నృత్యము యోగ ప్రక్రియకు ముఖ్యము.
యోగానందలహరికి ప్రథమ జనక స్థానము.

ద్వితీయ భాగః - సౌందర్య లహరీ

గతై-ర్మాణిక్యత్వం గగనమణిభిః సాంద్రఘటితం
కిరీటం తే హైమం హిమగిరిసుతే కీర్తయతి యః ||
స నీడేయచ్ఛాయా-చ్ఛురణ-శబలం చంద్ర-శకలం
ధనుః శౌనాసీరం కిమితి న నిబధ్నాతి ధిషణాం || 42 ||
 అమ్మ పార్వతీ, మాణిక్యాదులచే పొందబడిన ఆకాశములో మణులవలె ప్రకాశించు ద్వాదశ ఆదిత్యులచే, దగ్గిరగా కూర్చబడినదియగు, బంగారపు నీ కిరీటమును ఎవడు కీర్తించునో వాడు, ఆ రత్న కాంతిచేత,  వ్యాపించుటయందు చిత్రవర్ణములుగల, చంద్రరేఖను చూచి, ఇంద్రధనుస్సు ఇది అని, అతని బుద్ధి ఎట్లు తలచకుండును?

ధునోతు ధ్వాంతం న-స్తులిత-దలితేందీవర-వనం
ఘనస్నిగ్ధ-శ్లక్ష్ణం చికుర నికురుంబం తవ శివే |
యదీయం సౌరభ్యం సహజ-ముపలబ్ధుం సుమనసో
వసంత్యస్మిన్ మన్యే బలమథన వాటీ-విటపినామ్ || 43 ||

దలితేందీవర-వనం = వికసించిన తామరతోటవలెఉన్న, ఘనస్నిగ్ధ = నల్లని మేఘమువలె సుగంధముతో,  శ్లక్ష్ణం తవ = మెత్తని నీ,  చికుర నికురుంబం = కురులు, ధ్వాంతం నః= మా అజ్ఞాన అంథకారమును,  ధునోతు= తొలగించునుగాక, యదీయం సౌరభ్యం సహజ-ముపలబ్ధుం = ఏదైతే తన సహజ సువాసనను పొందుటకు, సుమనసః అస్మిన్ వలమథన వాటీ-విటపినామ్= ఈ కేశపాశమందు ఇంద్రుని ఉద్యానవనమునందలి కల్ప వృక్షముల పుష్పములు, వసంతిమన్యే= వసించుచున్నవని తలచెదను.

అమ్మా, వికసించిన తామరతోటవలెఉన్ననల్లని మేఘమువలె సుగంధముతో ఉన్న మెత్తని నీ కురులు మా అజ్ఞాన అంథకారమును తొలగించునుగాక, అవి తన సహజ సువాసనను పొందుటకు, ఇంద్రుని ఉద్యానవనమునందలి కల్పవృక్షముల పుష్పములు, వసించుచున్నవని తలచెదను.
కేశములు తమోగుణనివృత్తికి ప్రతీకగా ఆ పద ప్రయోగము చేస్తారు.
నివృత్తి అయిన తదుపరి సుగంధము వస్తుంది.

తనోతు క్షేమం న-స్తవ వదనసౌందర్యలహరీ
పరీవాహస్రోతః-సరణిరివ సీమంతసరణిః|
వహంతీ- సింధూరం ప్రబలకబరీ-భార-తిమిర
ద్విషాం బృందై-ర్వందీకృతమివ నవీనార్క కిరణమ్ || 44 ||

తవ వదనసౌందర్యలహరీ పరీవాహ =నీ సౌందర్య అలల ప్రవాహమందు, స్రోతః-సరణిరివ = పారుచున్నదారివలెనున్న,  సీమంతసరణిః = నీ పాపిడి,  ప్రబల కబరీ-భార-తిమిర= దట్టముగానున్న కురుల చీకటి, ద్విషాం బృందై-ర్వందీ కృతమేవ= శత్రువులచేత బందీకృతమైన బృందముచేత, నవీనార్క కిరణమ్ =ప్రాతః కాల సూర్యునివలె, వహంతీ- సింధూరం= సింధూరం పెట్టుకున్నట్లుగా, తనోతు క్షేమం నః = మాకు క్షేమం కలుగచేయుచున్నది.

 నీ సౌందర్య అలల ప్రవాహమందు పారుచున్నదారివలెనున్న నీ పాపిడి,    దట్టముగానున్న కురుల చీకటి  శత్రువులచేత బందీకృతమైన బృందముచేత,  ప్రాతః కాల సూర్యునివలె  సింధూరం పెట్టుకున్నట్లుగా మాకు క్షేమం కలుగ చేయుచున్నది.
 
అరాళైస్వాభావ్యా-దళికలభ-సశ్రీభి రలకైః
పరీతం తే వక్త్రం పరిహసతి పంకేరుహరుచిమ్ |
దరస్మేరే యస్మిన్ దశనరుచి కింజల్క-రుచిరే
సుగంధౌ మాద్యంతి స్మరదహన చక్షు-ర్మధులిహః || 45 ||

అరాళైస్వాభావ్యా-దళికలభ-సశ్రీభి రలకైః= సహజముగా వంకర అయిన తుమ్మెదలవంటి ముంగురులచేత, పరీతం తే వక్త్రం పరిహసతి పంకేరుహరుచిమ్ = అందమైన నీ పద్మములాంటి ముఖము పరిహాసము చేయునట్లు ఉన్నది.  దరస్మేరే = వికాసముగల,  దశనరుచి= దంత కాంతులతో,   కింజల్క-రుచిరే = కేసరముల సుందరబంధురమై, యస్మిన్ సుగంధౌ మాద్యంతి స్మరదహన చక్షు-ర్మధులిహః = సుగంధముతో ఏ ముఖము మన్మథుని దహించిన శివునియొక్క కన్నులు తేనెవలె ఆస్వాదించుచున్నవి.

సహజముగా వంకర అయిన తుమ్మెదలవంటి ముంగురులచేత, అందమైన నీ పద్మములాంటి ముఖము పరిహాసము చేయునట్లు ఉన్నది.   వికాసముగల,   దంత కాంతులతో, మన్మథుని దహించిన శివుని ముఖము సుగంధముతో కూడిన తేనెవలె తుమ్మెదలు ఆస్వాదించుచున్నవి.

లలాటం లావణ్య ద్యుతి విమల-మాభాతి తవ యత్
ద్వితీయం తన్మన్యే మకుటఘటితం చంద్రశకలమ్ |
విపర్యాస-న్యాసా దుభయమపి సంభూయ చ మిథః
సుధాలేపస్యూతిః పరిణమతి రాకా-హిమకరః || 46 ||

లలాటం లావణ్య ద్యుతి విమల-మాభాతి తవ యత్= నీ లలాటము సౌందర్యముతో స్వచ్ఛముగా ప్రకాశించుచు, ద్వితీయం తన్మన్యే మకుట ఘటితం చంద్రశకలమ్ = దానిని కిరీటమునందు కూర్చబడినదియై రెండవ చంద్ర అర్ధభాగముగా ఊహించుచున్నాను. విపర్యాస-న్యాసా దుభయమపి సంభూయ చ మిథః= దేనిని ఆ లలాటభాగం- చంద్రఖండము, రెండూను, వ్యత్యస్తముగా కలుపుటవలన పరస్పరము కలుసుకొని, సుధాలేపస్యూతిః పరిణమతి రాకా-హిమకరః = అమృతస్రావలేపనమువలన  పూర్ణచంద్రునిగా అగుచున్నది.

 నీ లలాటము సౌందర్యముతో స్వచ్ఛముగా ప్రకాశించు కిరీటము రెండవ చంద్ర అర్ధభాగముగా ఊహించుచున్నాను. ఆ లలాటభాగం- చంద్రఖండము, రెండూను, వ్యత్యస్తముగా కలుపుటవలన పరస్పరము కలుసుకొని,  అమృత స్రావ లేపనమువలన  పూర్ణచంద్రునిగా అగుచున్నది.

భ్రువౌ భుగ్నే కించిద్భువన-భయ-భంగవ్యసనిని
త్వదీయే నేత్రాభ్యాం మధుకర-రుచిభ్యాం ధృతగుణమ్ |
ధను ర్మన్యే సవ్యేతరకర గృహీతం రతిపతేః
ప్రకోష్టే ముష్టౌ చ స్థగయతే నిగూఢాంతర-ముమే || 47 ||

ఉమే= అమ్మా పార్వతీ, భువన- భయ -భంగవ్యసనిని = లోకముల భయ వాసినీ దేవీ, త్వదీయే భ్రువౌ భుగ్నే కించిత్ = నీ కొద్దిగా వంగిన కనుబొమ్మలు, 
నేత్రాభ్యాం మధుకర-రుచిభ్యాం ధృతగుణమ్ = తుమ్మెదల వరుసలాంటి కనుదోయి, సవ్యేతరకర గృహీతం రతిపతేః= మన్మథుని ఎడమ చేతితో పట్టుకొనిన , ప్రకోష్టే ముష్టౌ చ స్థగయతే నిగూఢాంతర-ముమే = మణికట్టు, పిడికిలియు కప్పుచున్నదికాగా, నిగూఢమైన వింటినారి,  ధను ర్మన్యే = ధనుస్సుగా అనుకుంటున్నాను.

అమ్మా పార్వతీ, లోకముల భయముపోగొట్టు దేవీ, నీ వంగిన కనుబొమ్మలు,  తుమ్మెదల వరుసలాంటి కనుదోయి, మన్మథుని ఎడమచేతితో పట్టుకొనిన,  మణికట్టు, పిడికిలియు కప్పుచున్న ధనుస్సు గా అనుకుంటున్నాను.

అహః సూతే సవ్యం తవ నయన-మర్కాత్మకతయా
త్రియమాం వామం తే సృజతి రజనీనాయకతయా |
తృతీయా తే దృష్టి-ర్దరదళిత-హేమాంబుజ-రుచిః
సమాధత్తే సంధ్యాం దివసనిశయో-రంతరచరీమ్ || 48 ||

సవ్యం తవ  = నీ కుడి  నయనం= కన్ను, అర్కాత్మకతయా = సూర్య సంబంధితమైనదగుటచే,  అహః సూతే= పగటిని పుట్టించుచున్నది,  వామం తే = నీ ఎడమ కన్ను, రజనీనాయకతయా = చంద్ర సంబంధితమైనదగుటచే, త్రియమాం సృజతి= రాత్రిని పుట్టించుచున్నది, దరదళిత-హేమాంబుజ-రుచిః= కొద్దిగా వికసించిన తామరపూవు రంగుగల, తృతీయా తే దృష్టిః = నీ లలాటముననున్న  మూడవకన్ను,  సమాధత్తే సంధ్యాం దివసనిశయో-రంతరచరీమ్ = పగలు రాత్రి అను మధ్యననున్న సంధ్యను ధరించుచున్నది.
 
 నీ కుడి కన్ను సూర్యసంబంధితమైనదగుటచే పగటిని పుట్టించుచున్నది,   నీ ఎడమ కన్ను చంద్ర సంబంధితమైనదగుటచే రాత్రిని పుట్టించుచున్నది,  కొద్దిగా వికసించిన తామరపూవు రంగుగల  నీ లలాటముననున్న  మూడవకన్ను,   పగలు రాత్రి అను మధ్యననున్న సంధ్యను కలిగియున్నది.

దక్షిణే పింగళానాడీ వహ్నిమండలగోచరా
దేవయానమితి జ్ఞేయం  పుణ్య కర్మానుసారినీ
ఇడాచ వామవిశ్వాసా సోమ మండలగోచరా
పితృయానమితి జ్ఞేయం  వామమాశ్రిత్య తిష్ఠతి

జీవికి జన్మ వచ్చుటకు పితృయానమార్గము. ఇది చంద్ర సంబంధితము. ఇడా నాడి సంబంధితము.
జీవికి ముక్తి వచ్చుటకు దేవయానమార్గము. ఇది సూర్య సంబంధితము. పింగళానాడి సంబంధితము.
ఈ పై రెండింటినీ సమన్వయ పరచేది యోగ మార్గము. అది సుషుమ్నా మార్గము. ఫాలనేత్ర సంబంధితము.

విశాలా కల్యాణీ స్ఫుటరుచి-రయోధ్యా కువలయైః
కృపాధారాధారా కిమపి మధురాఽఽభోగవతికా |
అవంతీ సృష్టిస్తే బహునగర-విస్తార-విజయా
ధ్రువం తత్తన్నామ-వ్యవహరణ-యోగ్యావిజయతే || 49 ||

అమ్మ, నల్లకలువలవంటి నేత్రములుగల నీ దృష్టి విశాలము, మంగళము, స్పష్టము,  అభేద్యమైనది, కరుణా ప్రవాహమునకు ఆధారము, చెప్పుటకు వీలు కానిది, మనోజ్ఞము విశాలదృక్పథము గలది,  రక్షణ లక్షణము గలది, అనేక విస్తారమైన ఆయా నగరముల పేర్లచేత వ్యవహరించుటకు యోగ్యమైనది గా వర్దిల్లుతున్నది అని నా నిశ్చయమైన అభిప్రాయము.

కవీనాం సందర్భ-స్తబక-మకరందైక-రసికం
కటాక్ష-వ్యాక్షేప-భ్రమరకలభౌ కర్ణయుగలమ్ |
అముంచంతౌ దృష్ట్వా తవ నవరసాస్వాద-తరళౌ
అసూయా-సంసర్గా-దళికనయనం కించిదరుణమ్ || 50 ||

కవీనాం సందర్భ-స్తబక-మకరందైక-రసికం=కవుల రసవత్తరమైన పుష్పగుచ్ఛమునందలి తేనె యందు మాత్రము ముఖ్యముగా ఇష్టపడు,  కటాక్ష-వ్యాక్షేప-భ్రమరకలభౌ కర్ణయుగలమ్ = నీ రెండుచెవులను, కడగంటి చూపులను నెపముగా పెట్టుకొని తుమ్మెదలు రెండు,  అముంచంతౌ దృష్ట్వా తవ నవరసాస్వాద-తరళౌ=నవరస ఆస్వాదమునందు అత్యంత ఆసక్తి కలిగినవై నీ కళ్ళనుచూచి,  అసూయా-సంసర్గా-దళికనయనం కించిదరుణమ్= నీ మూడవ నేత్రము ఈర్ష్యచెందుట వలన కొంచెము ఎఱ్ఱబడినది.
కవుల రసవత్తరమైన పుష్పగుచ్ఛమునందలి తేనె యందు మాత్రము ముఖ్యముగా ఇష్టపడు, నీ రెండుచెవులను, కడగంటి చూపులను నెపముగా పెట్టుకొని తుమ్మెదలు రెండు, నవరస ఆస్వాదమునందు అత్యంత ఆసక్తి కలిగినవై నీ కళ్ళనుచూచి, నీ మూడవ నేత్రము ఈర్ష్యచెందుట వలన కొంచెము ఎఱ్ఱబడినది.

శివే శృంగారార్ద్రా తదితరజనే కుత్సనపరా
సరోషా గంగాయాం గిరిశచరితే విస్మయవతీ |
హరాహీభ్యో భీతా సరసిరుహ సౌభాగ్య-జయినీ
సఖీషు స్మేరా తే మయి జనని దృష్టిః సకరుణా || 51 ||

జనని తే దృష్టిః = అమ్మా నీ చూపు, శివే శృంగారార్ద్రా తదితరజనే కుత్సనపరా=సదాశివుని ప్రేమతో ఇతరులకై అయిష్టము వలన,  సరోషా గంగాయాం గిరిశచరితే విస్మయవతీ = గంగయందు కోపముతో శివుని ఫాలభాగము చూచినప్పుడు అద్భుతరసముగలదియు, హరాహీభ్యో భీతా సరసిరుహ సౌభాగ్య-జయినీ= శివుని సర్పములవలన భయముతో పద్మముల ప్రకాశముతో జయించిన,  సఖీషు స్మేరా మయి సకరుణా=సఖుల హాస్యముతో నా అనుగ్రహమువలన కలిగియుండును.

అమ్మా నీ చూపు, సదాశివునియందు ప్రేమ కలిగియుండును.
ఇతరులకై అయిష్టము వలన భీభత్సరసమును కలిగియుండును. ,  గంగయందు క్రోధరసమును కలిగియుండును.
శివుని ఫాలభాగము చూచినప్పుడు అద్భుత రసమును కలిగియుండును.
శివుని సర్పములను చూచినప్పుడు భయానకరసమును కలిగియుండును.
పద్మముల ప్రకాశముతో సంసారమును జయించినప్పుడు చూచినప్పుడు వీరరసమును కలిగియుండును.
సఖులయందు స్నేహముతో హాస్య రసమును కలిగియుండును.
నాలాంటి భక్తులయడల  అనుగ్రహమువలన  కరుణ రసమును కలిగి యుండును

గతే కర్ణాభ్యర్ణం గరుత ఇవ పక్ష్మాణి దధతీ
పురాం భేత్తు-శ్చిత్తప్రశమ-రస-విద్రావణ ఫలే |
ఇమే నేత్రే గోత్రాధరపతి-కులోత్తంస-కలికే
తవాకర్ణాకృష్ట స్మరశర-విలాసం కలయతః|| 52 ||

గోత్రాధరపతి-కులోత్తంస-కలికే=అమ్మా పార్వతి,  ఇమే నేత్రే తవ= నీ ఈ నేత్రములు, కర్ణాభ్యర్ణం గతే పక్ష్మాణి గరుత ఇవ దధతీ =చెవులవద్దపొందినవై కనురెప్పలు ఈకలవలె ధరించుచున్నవై,  పురాం భేత్తు శ్చిత్తే -ప్రశమ-రస- =త్రిపురములు ఛేదించిన శివుని, మనస్సునందు శాంతముగానుండు నిస్పృహను విద్రావణ ఫలే = పారద్రోలుట అను, ప్రయోజనముగా గలవియై,  కర్ణాకృష్ట స్మరశర = చెవుల వరకు లాగబడిన మన్మథబాణ, -విలాసం కలయతః =సౌభాగ్యమును చేయుచున్నవి. ఇయే= నా హృదయపద్మమందు ప్రకాశించుచున్నది.
అమ్మా పార్వతి, నీ ఈ నేత్రములు, కనురెప్పలు, చెవులు,  త్రిపురములు ఛేదించిన శివుని, మనస్సునందు శాంతముగానుండు నిస్పృహను పారద్రోలును. మన్మథబాణము శివుని  హృదయపద్మమందు మోహము కలుగ చేయుచున్నది.

విభక్త-త్రైవర్ణ్యం వ్యతికరిత-లీలాంజనతయా
విభాతి త్వన్నేత్ర త్రితయ మిద-మీశానదయితే |
పునః స్రష్టుం దేవాన్ ద్రుహిణ హరి-రుద్రానుపరతాన్
రజః సత్వం బిభ్రత్ తమ ఇతి గుణానాం త్రయమివ || 53 ||

ఈశానదయితే =అమ్మా, విభాతి త్వన్నేత్ర త్రితయ మిదం= ప్రకాశించుచున్న నీ మూడు కన్నులు, విభక్త-త్రైవర్ణ్యం వ్యతికరిత-లీలాంజనతయా = అర్ధ వల యముగానున్న నల్లని వేరుపరచిన తెలుపు నలుపు ఎరుపుగలదై,  పునః స్రష్టుం దేవాన్ ద్రుహిణ హరి-రుద్రానుపరతాన్= లీనమైనవారగు, బ్రహ్మ విష్ణు శివ త్రిమూర్తులను, మరల సృష్టించుటకు, తమ తమ, ఇతి గుణానాం త్రయ మివ రజః సత్వం బిభ్రత్ = సత్వ రజస్ తమో గుణములను ధరించును.

అమ్మా, ప్రకాశించుచున్న నీ మూడు కన్నులు, అర్ధ వలయముగానున్న  వేరుపరచిన తెలుపు(సత్వ గుణమునకు ప్రతీక), నలుపు (తమో గుణమునకు ప్రతీక), మరియు ఎరుపు (రజస్ గుణమునకు ప్రతీక)గలదై, మరల సృష్టించుటకు, బ్రహ్మ విష్ణు శివ త్రిమూర్తులు, తమ తమ సత్వ రజస్ తమో గుణములను ధరించును.
పవిత్రీకర్తుం నః పశుపతి-పరాధీన-హృదయే
దయామిత్రై ర్నేత్రై-రరుణ-ధవల-శ్యామ రుచిభిః |
నదః శోణో గంగా తపనతనయేతి ధ్రువమయమ్
త్రయాణాం తీర్థానా-ముపనయసి సంభేద-మనఘమ్ || 54 ||

పశుపతి-పరాధీన-హృదయే= అమ్మా జగజ్జననీ, దయామిత్రై ర్నేత్రై-రరుణ-ధవల-శ్యామ రుచిభిః= దయతో తడిసిన తెలుపు(సత్వ గుణమునకు ప్రతీక), నలుపు (తమో గుణమునకు ప్రతీక), మరియు ఎరుపు (రజస్ గుణమునకు ప్రతీక)గల నేత్రములతో,  నదః శోణో గంగా తపనతనయేతి ధ్రువమయమ్= శోణనది గంగా నది యమునా నది అని, త్రయాణాం తీర్థానా-ముపనయసి సంభేద-మనఘమ్ పవిత్రీకర్తుం నః = మూడుగానున్న మూడు పవిత్రములైన ఈ నదీ సంగమస్థానమును మమ్ములను పవిత్రులనుజేయుటకు ఒక్కచోట చేర్చుచున్నావు.

అమ్మా జగజ్జననీ, దయతో తడిసిన (ఆర్ద్రతతో కూడిన) తెలుపు(సత్వ గుణమునకు ప్రతీక), నలుపు (తమో గుణమునకు ప్రతీక), మరియు ఎరుపు (రజస్ గుణమునకు ప్రతీక)గల నేత్రములతో, శోణనది గంగా నది యమునా నది అని, మూడుగానున్న ఈ నదీ సంగమస్థానమును మమ్ములను పవిత్రులను జేయుటకు ఒక్కచోట చేర్చుచున్నావు.

నిమేషోన్మేషాభ్యాం ప్రలయముదయం యాతి జగతి
తవేత్యాహుః సంతో ధరణిధర-రాజన్యతనయే
త్వదున్మేషాజ్జాతం జగదిద-మశేషం ప్రలయతః
పరేత్రాతుం శంకే పరిహృత-నిమేషా-స్తవ దృశః || 55 ||
ధరణిధర-రాజన్యతనయే = అమ్మా, తవ నిమేష ఉన్మేషాభ్యాం = నీవు కళ్ళు మూసి తెరచినప్పుడు, జగతీ ప్రళయం= జగత్తు ప్రళయమును, ఉదయం యాతి = ఉద్భవమును పొందిన, ఆహుః సంతో= సత్పురుషులు చెప్పుదురు,
అతః త్వదున్మేషాత్ = అందువలన ఆ కళ్ళు తెరుచుకోవటం వలన, జగదిద-మశేషం జాతం =ఉద్భవించిన ఈ సమస్త జగత్తు, ప్రళయతః పరిత్రాతుం =ప్రళయమునుండి రక్షించుటకొరకు, తవ దృశః= నీ చూపులు, పరిహృత నిమేషాః =తిరస్కరించిన రెప్పపాటుగలవి, ఇతి శంకే= అని తలచుదును.

అమ్మా, నీవు కళ్ళు మూసి తెరచినప్పుడు, జగత్తు ప్రళయమును, ఉద్భవమును చెందునని, సత్పురుషులు చెప్పుదురు.    అందువలన ఆ నేత్రముల వలన ఈ సమస్త జగత్తు రక్షించబడును.

తవాపర్ణే కర్ణే జపనయన పైశున్య చకితాః
నిలీయంతే తోయే నియత మనిమేషాః శఫరికాః |
ఇయం చ శ్రీ-ర్బద్ధచ్చద పుటకవాటం కువలయం
జహాతి ప్రత్యూషే నిశి చ విఘటయ్య ప్రవిశతి|| 56 ||

తవాపర్ణే కర్ణే జపనయన పైశున్య చకితాః= అమ్మా జగజ్జనీ, చెవులవద్దనున్న కనుదోయి రహస్యము వలన భయపదినదియై, శఫరికాః= ఆడుచేపలు, నిలీయంతే తోయే నియతం= నీళ్ళలో నిశ్చయముగా దాక్కునున్నవి, ఇయం చ శ్రీః = నీ నేత్రములు పొందిన అమ్మ లక్ష్మి, బద్ధచ్చద పుటకవాటం కువలయం= మూయబడిన రేకు దొప్పలను, తలుపుగలదైన, ప్రత్యూషే= ఉషః కాలమందు, జహాతి= విడుస్తున్నది, నిశి చ విఘటయ్య ప్రవిశతి= రాత్రియందు ఆ కలువను తెరుచుకొని  ప్రవేశించుచున్నది.

 అమ్మా జగజ్జనీ, నీ చెవులవద్దనున్న అందమైన నీ కనుదోయి,  చేపలు, నీళ్ళలో  దాక్కున్నట్లుగా ఉన్నవి,  సౌందర్యలక్ష్మి నీ నేత్రములు పొందినట్లుగా ఉన్నది.

దృశా ద్రాఘీయస్యా దరదళిత నీలోత్పల రుచా
దవీయాంసం దీనం స్నపా కృపయా మామపి శివే |
అనేనాయం ధన్యో భవతి న చ తే హానిరియతా
వనే వా హర్మ్యే వా సమకర నిపాతో హిమకరః || 57 ||

శివే = అమ్మా తల్లీ, దృశా ద్రాఘీయస్యా దరదళిత నీలోత్పల రుచా= మిక్కిలి పొడవుగా విశాలముగానున్నవికసించిన నల్లకలువవంటి కడగంటి చూపునే, దవీయాంసం దీనం స్నపా కృపయా మామపి శివే =దీనుడనైన, దూరముగానున్న  నన్ను కూడా కృపతో దయతో చూడుము.  అనేన్యాయం ధన్యో భవతి న చ తే హానిరియతా=ఈ భక్తుడు కృతార్థుడు అగును. ఇంతమాత్రముచేత నీకు హానిలేదు. వనే వా హర్మ్యే వా సమకర నిపాతో హిమకరః = చంద్రుడు అరణ్యమునందైనను భవనములనందైనను సమాన వెలుతురునిస్తున్నాడుగదా.
అమ్మా తల్లీ, మిక్కిలి పొడవుగా విశాలముగానున్నవికసించిన నల్లకలువవంటి కడగంటి చూపునే, దీనుడనైన, దూరముగానున్న నన్ను కూడా దయతో చూడుము. ఈ భక్తుడు కృతార్థుడు అగును. ఇంతమాత్రముచేత నీకు హానిలేదు. చంద్రుడు అరణ్యమునందైనను భవనములనందైనను సమాన వెలుతురునిస్తున్నాడుగదా.

అరాళం తే పాళీయుగళ-మగరాజన్యతనయే
న కేషా-మాధత్తే కుసుమశర కోదండ-కుతుకమ్ |
తిరశ్చీనో యత్ర శ్రవణపథ-ముల్లంఘ్య విలసన్
అపాంగ వ్యాసంగో దిశతి శరసంధాన ధిషణామ్ || 58 ||

అరాళం తే పాళీయుగళ-మగరాజన్యతనయే= అమ్మా, పార్వతీ, నీ వంకరగానున్న కణతలజంట, న కేషా-మాధత్తే కుసుమశర కోదండ-కుతుకమ్=పువ్వులు బాణముగాగల మన్మథుని వింటి సౌభాగ్యముగా ఎవరికి సందేహము కలిగించదు? తిరశ్చీనో యత్ర శ్రవణపథ-ముల్లంఘ్య విలసన్= ఏది నీ కణతలజంటయందు అడ్డముగా ప్రసరించుచు ప్రకాశించుచు, అపాంగ వ్యాసంగో దిశతి శరసంధాన ధిషణామ్= కంటి వ్యాపన విలాసము అమ్మునిగూర్చుబుద్ధిని ఇచ్చుచున్నది.

అమ్మా,పార్వతీ, నీ సుందరముగానున్న కణతలజంట,  పువ్వులు బాణముగాగల మన్మథుని వింటి సౌభాగ్యముగాఉన్నది. నీ కణతలజంటయందు అడ్డముగా ప్రసరించు ప్రకాశించు, కంటివ్యాపన విలాసము సుందరముగా నున్నది.

స్ఫురద్గండాభోగ-ప్రతిఫలిత తాటంక యుగళం
చతుశ్చక్రం మన్యే తవ ముఖమిదం మన్మథరథమ్ |
యమారుహ్య ద్రుహ్య త్యవనిరథ మర్కేందుచరణం
మహావీరో మారః ప్రమథపతయే సజ్జితవతే || 59 ||

తవ ఇదం ముఖం = నీ ఈ ముఖము, స్ఫురద్గండాభోగ-ప్రతిఫలిత తాటంక యుగళం= నీ చెక్కిళ్ళు అందముగా ప్రతిబింబించిన చెవికమ్మల జతయందుప్రకాశించుచున్నవి. చతుశ్చక్రం మన్యే తవ ముఖమిదం మన్మథరథమ్ = నీ ముఖము నాలుగు చక్రములుగల మన్మథరథమును తలపించుచున్నది.  యమారుహ్య మహావీరో మారః =ఆ రథమును ఎక్కి వీరుడైనమన్మథుడు, అర్కేందుచరణం = సూర్య చంద్రులు చక్రముగాగల,  అవనిరథం = భూమి అను రథమును,  సజ్జితవతే= యుద్ధమునకై సిద్ధపరచిన ఆ రథమును ఎక్కియున్న, ప్రమథపతయే = శివునికి, ద్రుహ్యతి = ద్రోహము చేయుచున్నాడు.

 అమ్మ, నీ ఈ ముఖము,  చెక్కిళ్ళు అందముగా ప్రతిబింబించిన చెవికమ్మల జతయందు ప్రకాశించుచున్నవి. అది నాలుగు చక్రములుగల మన్మథ రథమును తలపించుచున్నది.  వీరుడైన మన్మథుడు,  సూర్య చంద్రులు దాని చక్రములుగాను ఉన్న  భూమి అను ఆ రథమును ఎక్కి  శివునిమోహ పరచు చున్నాడు.
 
సరస్వత్యాః సూక్తీ-రమృతలహరీ కౌశలహరీః
పిబంత్యాః శర్వాణి శ్రవణ-చులుకాభ్యా-మవిరళమ్
చమత్కారః-శ్లాఘాచలిత-శిరసః కుండలగణో
ఝణత్కారైస్తారైః ప్రతివచన-మాచష్ట ఇవ తే|| 60 ||

శర్వాణి = అమ్మా శర్వాణి, సరస్వత్యాః సూక్తీ-రమృతలహరీ కౌశలహరీః= సరస్వతీదేవియొక్క మథుర గానామృతముయొక్క సౌభాగ్యసంపదను,  పిబంత్యాః శ్రవణ-చులుకాభ్యా-మవిరళమ్=ఎడతెగని దోసిళ్ళతో త్రాగుచు  చమత్కారః-శ్లాఘాచలిత-శిరసః కుండలగణో=ఆశ్చర్యముతోకంపించుశిరస్సుగల నీ కర్ణాభరణములన్నియు, ఝణత్కారైస్తారైః ప్రతివచన-మాచష్ట ఇవ తే=అధికఝణఝణధ్వనులతో ప్రతిమాటలు పలుకుతున్నవి.
 
 అమ్మా శర్వాణి,  సరస్వతీదేవియొక్క మథుర గానామృతముయొక్క సౌభాగ్య సంపదను, ఎడతెగని దోసిళ్ళతో త్రాగుచు ఆశ్చర్యముతో కంపించు శిరస్సుగల నీ కర్ణాభరణములన్నియు, అధికఝణఝణధ్వనులతో అనగా అధిక ఓంకారనాదములు ప్రతిమాటలుగా  పలుకు చున్నవి.
  
అసౌ నాసావంశ-స్తుహినగిరివంశ-ధ్వజపటి
త్వదీయో నేదీయః ఫలతు ఫల-మస్మాకముచితమ్ |
వహత్యంతర్ముక్తాః శిశిరకర-నిశ్వాస-గళితం
సమృద్ధ్యా యత్తాసాం బహిరపి చ ముక్తామణిధరః || 61 ||

తుహినగిరివంశ-ధ్వజపటి = ఓ హైమవతి అమ్మా,  త్వదీయఃఅసౌ  నాసా వంశ= నీ ఈ నాసిక, అస్మాకముచితమ్ =మాకు తగినవిధముగా, నేదీయః ఫలతు  =చక్కగా ప్రాప్తింపజేయుగాక.   వహత్యంతర్ముక్తాః - =ముక్కు లోపలి ముత్యములను ధరించుచున్నది. సమృద్ధ్యా యత్తాసాం = ఆ ముత్యముల నిండుతనముచేత, శిశిరకర= చంద్ర సంబంధమైన , నిశ్వాస గళితం =ఎడమ ఇడానాడి మార్గముచే వెళ్ళిన దానిని, బహిరపి చ ముక్తామణిధరః= నాసిక బయటకూడా ముత్యమును ధరించునది అయ్యెను.

 ఓ హైమవతి అమ్మా, నీ ఈ నాసిక, మాకు తగినవిధముగా,  చక్కగా కోరికలను ప్రాప్తింపజేయుగాక. ముక్కు లోపలి ముత్యములను ధరించుచున్నది అని చెప్పవచ్చును.  ఇక్కడ ముక్తాః అనగా ముక్తులే ముత్యములు.
  
ప్రకృత్యాఽఽరక్తయా-స్తవ సుదతి దంతచ్ఛదరుచేః
ప్రవక్ష్యే సాదృశ్యం జనయతు ఫలం విద్రుమలతా |
న బింబం తద్బింబ-ప్రతిఫలన-రాగా-దరుణితం
తులామధ్యారోఢుం కథమివ నలజ్జేత కలయా || 62 ||
సుదతి = అమ్మా జగజ్జననీ, ప్రకృత్యాఽఽరక్తయా-స్తవ దంతచ్ఛదరుచేః= స్వభావ సిద్ధముగానే కెంపురంగుగల నీ పెదవుల అందమునకు, ప్రవక్ష్యే సాదృశ్యం ఫలం విద్రుమలతా=సరియైన పోలికను చెప్పుచున్నాను, పగడపు తీగె, న బింబం జనయతు= పండును పుట్టించినదైనదై,  త్వద్బింబ= ఆ నీ రెండు పెదవులయొక్క, ప్రతిఫలన-రాగాత్= ప్రతిఫలించిన ఎఱుపు రంగువలన,  అరుణితం=ఎఱుపు రంగుపొందినదై, కలయా అపి= కొంచెముకూడా, తులామధ్యారోఢుం = సామ్యమును అధిష్టించుటకు, కథమివ నలజ్జేత = ఏల సిగ్గుపడకుండును ?

అమ్మా జగజ్జననీ, స్వభావ సిద్ధముగానే కెంపురంగుగల నీ పెదవుల అందమునకు,  సరియైన పోలికను చెప్పుచున్నాను. పగడపు తీగె,  పండును పుట్టించిగలిగినచో  నీ రెండు పెదవులు దానికి సరిపోతాయి.

స్మితజ్యోత్స్నాజాలం తవ వదనచంద్రస్య పిబతాం
చకోరాణా-మాసీ-దతిరసతయా చంచు-జడిమా |
అతస్తే శీతాంశో-రమృతలహరీ రామ్లరుచయః
పిబంతీ స్వచ్ఛందం నిశి నిశి భృశం కాంచిక ధియా || 63 ||

స్మితజ్యోత్స్నాజాలం తవ వదనచంద్రస్య పిబతాం= అమ్మా, నీ ముఖ చంద్రుని చిరునవ్వును త్రాగుచున్న చకోర పక్షులకు, చకోరాణా-మాసీ-దతిరసతయా చంచు-జడిమా = చకోరపక్షులకు అతి మథురిమతో నాలుక మొద్దుబారి నది,
అతస్తే శీతాంశో-రమృతలహరీ రామ్లరుచయః= అందువలన ఆ చకోరపక్షులు పులుపు రుచిని కోరుచు చంద్రుని వెన్నెల కోరుచు, పిబంతీ స్వచ్ఛందం నిశి నిశి భృశం కాంచిక ధియా= అన్నపు గంజి ఇష్టము వచ్చినట్లుగా ప్రతి రాత్రియందు బాగా త్రాగుచున్నవి.

అమ్మా, నీ ముఖ చంద్రుని చిరునవ్వును త్రాగుచున్న చకోరపక్షులకు అతి మథురిమతో నాలుక మొద్దుబారినది,  అందువలన ఆ చకోరపక్షులు పులుపు రుచిని కోరుచు చంద్రుని వెన్నెల కోరుచు, అన్నపు గంజి ఇష్టము వచ్చినట్లుగా ప్రతి రాత్రియందు బాగా త్రాగుచున్నవి.

అవిశ్రాంతం పత్యుర్గుణగణ కథామ్రేడనజపా
జపాపుష్పచ్ఛాయా తవ జనని జిహ్వా జయతి సా |
యదగ్రాసీనాయాః స్ఫటికదృష-దచ్ఛచ్ఛవిమయీ
సరస్వత్యా మూర్తిః పరిణమతి మాణిక్యవపుషా || 64 ||

అవిశ్రాంతం పత్యుర్గుణగణ కథామ్రేడనజపా=నిరంతరము సదాశివుని గుణ గణ ములుగల వృత్తాంతమును మరల మరల వచించుటకు జపముగలదై, జపాపుష్పచ్ఛాయా తవ జనని జిహ్వా జయతి సా= జపాపుష్పములతో ప్రకాశించుచున్నది. యదగ్రాసీనాయాః సరస్వత్యా మూర్తిః స్ఫటికదృష-దచ్ఛచ్ఛవిమయీ=ఏ జిహ్వాగ్రమునందు ఉన్న సరస్వతీదేవి స్ఫటికమణివలె అధికస్వచ్ఛమైన రూపము, పరిణమతి మాణిక్యవపుషా= పద్మవర్ణముతో పరిణామము చెందుచున్నది.
నిరంతరము సదాశివుని గుణ గణములుగల వృత్తాంతమును మరల మరల వచించుటవలన నీ నాలుక ఎర్రబడ్ఢది. నీ జిహ్వాగ్రమునందు సరస్వతీదేవి ఎల్లప్పుడూ ఉంటుంది. అందువలన ఎర్రరంగుగా మారినది.

రణే జిత్వా దైత్యా నపహృత-శిరస్త్రైః కవచిభిః
నివృత్తై-శ్చండాంశ-త్రిపురహర-నిర్మాల్య-విముఖైః |
విశాఖేంద్రోపేంద్రైః శశివిశద-కర్పూరశకలాః
విలీయంతౌ మాతస్తవ వదనతాంబూల-కబళాః || 65 ||

రణే జిత్వా దైత్యా నపహృత-శిరస్త్రైః కవచిభిః=అమ్మా, యుద్ధమునందు రాక్షసులను జయించి తీసివేయబడిన తలపాగాలు కవచములుగలవారును, నివృత్తై-శ్చండాంశ-త్రిపురహర-నిర్మాల్య-విముఖైః= యుద్ధమునుండి వచ్చిన చండుడు అను ప్రమథుని భాగమైన త్రిపురాసురులసు జయించిన శివుని నిర్మలమందు గ్రహింపనివారు అయిన,  విశాఖేంద్రోపేంద్రైః శశివిశద-కర్పూరశకలాః= కుమారస్వామి ఇంద్రుడు విష్ణువు అను ముగ్గురుచేత స్వచ్చ్చమైన చంద్రునిలా  కర్పూరం వలెనున్న, విలీయంతౌ మాతస్తవ వదనతాంబూల-కబళాః= నీ నోటినుండి వచ్చిన తాంబూలపు ముద్దలు మ్రింగబడుచున్నవి.

అమ్మా, యుద్ధమునందు రాక్షసులను జయించి ఆ రాక్షసుల తలపాగాలు తీసివేయబడినవి. ఆ రాక్షసులు కవచములు మాత్రము ధరించారు. యుద్ధమునుండి వచ్చిన చండుడు అను ప్రమథుని భాగమైన త్రిపురాసురులసు జయించిన శివుని నిర్మలము చండుడుకే వదలబడ్డది.  కుమారస్వామి ఇంద్రుడు విష్ణువు అను ముగ్గురిచేత అమ్మ నోటినుండి వచ్చిన తాంబూలపు ముద్దలు మ్రింగబడుచున్నవి.

విపంచ్యా గాయంతీ వివిధ-మపదానం పశుపతే-
స్త్వయారబ్ధే వక్తుం చలితశిరసా సాధువచనే |
తదీయై-ర్మాధుర్యై-రపలపిత-తంత్రీకలరవాం
నిజాం వీణాం వాణీం నిచుళయతి చోళేన నిభృతమ్ || 66 ||

విపంచ్యా గాయంతీ వివిధ-మపదానం పశుపతే=వివిధములైన ఈశ్వరుని సాహస కృత్యములు, వీణా గానముచేయు, స్త్వయారబ్ధే వక్తుం చలితశిరసా సాధువచనే = సరస్వతి వచించుటకు, సంతోషమైన మనస్సుతో, నీ మథురవచనముల ముందర, తదీయై-ర్మాధుర్యై-రపలపిత-తంత్రీకలరవాం= అపహసింపబడిన తీగె ధ్వనులు అనగా తీగెధ్వనులముందు ఓడిపోయినవై, నిజాం వీణాం వాణీం నిచులయతి చోళేన నిభృతమ్=తన వీణను తన పైన గుడ్డచేత కనబడకుండా కప్పుచున్నది.

వివిధములైన ఈశ్వరుని సాహస కృత్యములు, సరస్వతి వీణా గానముచేయు, చుండగా  నీ మథుర గానము ముందర ఆ వీణానాదము ఓడిపోయినది.

కరాగ్రేణ స్పృష్టం తుహినగిరిణా వత్సలతయా
గిరిశేనో-దస్తం ముహురధరపానాకులతయా |
కరగ్రాహ్యం శంభోర్ముఖముకురవృంతం గిరిసుతే
కథంకారం బ్రూమ-స్తవ చుబుకమోపమ్యరహితమ్ || 67 ||

కరాగ్రేణ స్పృష్టం తుహినగిరిణా వత్సలతయా=అమ్మా, నీ తండ్రిచేత వాత్సల్యముతో చేతిఅంచుతో త్రాకబడి గిరిశేనో-దస్తం ముహురధర పానాకులతయా = శివుని చేత పైకెత్తబడి అధరపాన తొట్రుపాటుచేత మాటిమాటికి కరగ్రాహ్యం శంభోర్ముఖముకురవృంతం గిరిసుతే=శివుని చేతిని పట్టుకొని ముఖమునకు పిడి అయినదియు కథంకారం బ్రూమ-స్తవ చుబుకమోపమ్యరహితమ్= సాటిలేనిదగు నీ క్రింది పెదవిని ఎట్లా వర్ణించను?

అమ్మా, నీ తండ్రిచేత వాత్సల్యముతో చేతి తో త్రాకబడి  శివుని చేత పైకెత్తబడి ఆధారపాన తొట్రుపాటుచేత మాటిమాటికి శివుని చేతిని పట్టుకొని  పైకెత్తు నీ క్రింది పెదవిని ఎట్లా వర్ణించను?

భుజాశ్లేషాన్నిత్యం పురదమయితుః కంటకవతీ
తవ గ్రీవా ధత్తే ముఖకమలనాళ-శ్రియమియమ్ |
స్వతః శ్వేతా కాలా గరు బహుళ-జంభాలమలినా
మృణాలీలాలిత్యం వహతి యదధో హారలతికా || 68 ||

తవ గ్రీవా ఇయమ్ భుజాశ్లేషాన్నిత్యం పురదమయితుః కంటకవతీ= నీ శివుని కంఠనాళముయొక్క బాహువుల కౌగిలింతవలన, ఎల్లప్పుడూ గగుర్పాటుగలదై
ధత్తే ముఖకమలనాళ-శ్రియమి=ముఖ పద్మ కాండ అందమును ధరించుచున్నది. యదధో =ఏ కారణమువలన క్రింద  స్వతః శ్వేతా కాలా గరు బహుళ-జంభాలమలినా= స్వయముగా స్వచ్ఛమైనదై, నల్ల అగురు గంధపు విసినకర్రతో  మృణాలీలాలిత్యం వహతి హారలతికా=ముత్యాల హారముతో తామరతూడులాగా ఉన్నది.

శివుని కంఠనాళముయొక్క బాహువుల కౌగిలింతవలన, ఎల్లప్పుడూ గగుర్పాటుగలదై నీ పద్మము లాంటి ముఖము  అందముగా ఉన్నది. అది స్వచ్ఛమైనదై, ముత్యాల హారముతో తామరతూడులాగా ఉన్నది.
గళేరేఖాస్తిశ్రో గతిగమకగీతైక నిపుణే 
వివాహ-వ్యానద్ధ-ప్రగుణగుణ-సంఖ్యా ప్రతిభువః |
విరాజంతే నానావిధ-మధుర-రాగాకర-భువాం
త్రయాణాం గ్రామాణాం స్థితి-నియమ-సీమాన ఇవ తే || 69 ||

గలే రేఖాస్తిస్రో గతి గమక గీతైక నిపుణే=సంగీత గానములో ముఖ్యమైన నేర్పరితనముగలదానా, నీ కంఠములో మూడు ముడతలు, వివాహ-వ్యానద్ధ-ప్రగుణగుణ-సంఖ్యా ప్రతిభువః=పెళ్లిసమయములో కట్టిన దారములయొక్క సంఖ్యకు తగిన, విరాజంతే నానావిధ-మధుర-రాగాకర-భువాం=కల్యాణి మొదలగు రాగములకు ఆశ్రమస్థానములైనవియు, త్రయాణాం గ్రామాణాం స్థితి-నియమ-సీమాన ఇవ తే=షడ్జ మధ్యమ గాంధారముల ఉనికికై ఏర్పరచిన సరిద్దులవలె ప్రకాశించుచున్నవి. 
సంగీత గానములో ముఖ్యమైన నేర్పరితనముగలదానా, నీ కంఠములో మూడు ముడతలు, పెళ్లిసమయములో కట్టిన ముప్పేటల సూత్రమును గుర్తుసుస్తున్నవి  అనేక కల్యాణి మొదలగు రాగములకు ఆశ్రమస్థానములైన  షడ్జ మధ్యమ గాంధారముల ఉనికికై ఏర్పరచిన సరిద్దులవలె ప్రకాశించు చున్నవి.

మృణాలీ-మృద్వీనాం తవ భుజలతానాం చతసృణాం
చతుర్భిః సౌందర్యం సరసిజభవః స్తౌతి వదనైః |
నఖేభ్యః సంత్రస్యన్ ప్రథమ-మథనా దంతకరిపోః
చతుర్ణాం శీర్షాణాం సమ-మభయహస్తార్పణ-ధియా || 70 ||

మృణాలీ-మృద్వీనాం తవ భుజలతానాం చతసృణాం =మెత్తని నీ నాలుగు భుజముల, చతుర్భిః సౌందర్యం సరసిజభవః స్తౌతి వదనైః = సౌందర్యంమును నాలుగు ముఖముల బ్రహ్మ, నఖేభ్యః సంత్రస్యన్ ప్రథమ-మథనా దంతకరిపోః=తన అయిదవ ముఖమును గిల్లి ఖండించెను. సదాశివుని గోళ్ళకు భయపడి 
చతుర్ణాం శీర్షాణాం సమ-మభయహస్తార్పణ-ధియా=తన నాలుగు శిరస్సులకు సమానముగానున్న నీ హస్తములను అభ్యర్ధించెను.

 మెత్తని నీ నాలుగు భుజముల సౌందర్యమును చూచి అబ్బురపడు నాలుగు ముఖముల బ్రహ్మయొక్క అయిదవ  ముఖమును గిల్లి ఖండించెను. సదాశివుని గోళ్ళకు భయపడి మిగిలిన తన నాలుగు శిరస్సులకు సమానముగానున్న నీ హస్తములను అభ్యర్ధించెను.
అనగా ప్రళయమందు సదాశివుడు అయిదవది అయిన ఆకాశ తత్వమును తనలో ఉంచుకొనును అని అర్థము.

నఖానా-ముద్యోతై-ర్నవనళినరాగం విహసతాం
కరాణాం తే కాంతిం కథయ కథయామః కథముమే |
కయాచిద్వా సామ్యం భజతు కలయా హంత కమలం
యది క్రీడల్లక్ష్మీ-చరణతల-లాక్షారస-చణమ్ || 71 ||

నఖానా-ముద్యోతై-ర్నవనళినరాగం విహసతాం=గోళ్లతో ఉత్పన్నమగు ఎఱ్ఱతామర అపహసించుచున్న, కరాణాం తే కాంతిం కథయ కథయామః కథముమే=హస్తకాంతిని ఏమి చెప్పగలము?  కయాచిద్వా సామ్యం భజతు కలయా హంత కమలం=మరి పద్మము యొక్క 1/16 భాగము ఏ విధముగా పొందెదము? యది క్రీడల్లక్ష్మీ-చరణతల-లాక్షారస-చణమ్ = క్రీడించు లక్ష్మీదేవి పాదం యొక్క లత్తుక రసమును ఆమె కరుణతో పొందవచ్చును.

గోళ్లతో కూడిన ఎఱ్ఱతామర అపహసించుచున్న, హస్తకాంతిని ఏమి చెప్ప గలము? క్రీడించు లక్ష్మీదేవి పాదం యొక్క లత్తుక రసముముందర మరి పద్మము యొక్క  భాగము కించిత్ కూడా ఏ విధముగానూ సరితూగదు.

సమం దేవి స్కంద ద్విపవదన పీతం స్తనయుగం
తవేదం నః ఖేదం హరతు సతతం ప్రస్నుత-ముఖమ్ |
యదాలోక్యాశంకాకులిత హృదయో హాసజనకః
స్వకుంభౌ హేరంబః పరిమృశతి హస్తేన ఝటితి || 72 |

సమం దేవి స్కంద ద్విపవదన పీతం స్తనయుగం ప్రస్నుత-ముఖమ్ = ఒకే సమయములో కుమారస్వామిచేతను గజముఖుని చేతను, దయగల నీ అనాహతచక్రమువద్ద, తవేదం నః ఖేదం హరతు సతతం =మా దుఃఖమును సతతమూ తెలిసికొని తొలగించుగాక, యదాలోక్యాశంకాకులిత హృదయో హాసజనకః= ఆ అనాహతచక్రము నా సంశయముచేత ఆలోచనలోపడిన మనస్సుతో, హేరంబః= వినాయకుడు  స్వకుంభౌ పరిమృశతి హస్తేన ఝటితి= నవ్వుతో తన ముఖమును తొండముతో తడుముకొనుచున్నాడు.

ఒకే సమయములో కుమారస్వామి మరియు గజముఖుడు ఇద్దరూ   దయతో  నీ అనాహతచక్రముతో అనగా హృదయముతో మా దుఃఖమును సతతమూ తెలిసికొని తొలగించుగాక,  దయకలిగిన ఆ అమ్మ అనాహతచక్రమును అనగా హృదయమును తడిమిన వినాయకుడిని నవ్వుతో  చూచెను.

అమూ తే వక్షోజా-వమృతరస-మాణిక్య కుతుపౌ
న సందేహస్పందో నగపతి పతాకే మనసి నః |
పిబంతౌ తౌ యస్మా దవిదిత వధూసంగ రసికౌ
కుమారావద్యాపి ద్విరదవదన-క్రౌంచదళనౌ || 73 ||
నగపతి పతాకే = అమ్మా, గిరిజాదేవీ, అమూ తే వక్షోజా-వమృతరస-మాణిక్య కుతుపౌ=ఈ నీ అనహతచక్రము అనగా  హృదయము అమృతరసముతో కూడినది,  న సందేహస్పందో మనసి నః = అది నిస్సందేహము.   పిబంతౌ తౌ యస్మా దవిదిత వధూసంగ రసికౌ=తెలియని స్త్రీలయొక్క కూటమియందు పాలు త్రాగుచున్న,  కుమారావద్యాపి ద్విరదవదన-క్రౌంచదళనౌ= వినాయకుడు కుమారస్వామి ఇరువురూ బాలురుగానే ఉన్నారు.

 అమ్మా, గిరిజాదేవీ, ఈ నీ అనహతచక్రము అనగా  హృదయము అమృతరసముతో కూడినది, అది నిస్సందేహము.  అది గ్రోలిన వినాయకుడు విశిస్ఠ నాయకుడు అయ్యాడు. కుమారస్వామి యౌవనంతోనూ, శక్తివంతముగాను  ఉన్నాడు.
గణేశునికి ఇద్దరు భార్యలు. వారు సిద్ధి, బుద్ధి.
కుమారస్వామికి ఇద్దరు భార్యలు. వారు వల్లి, దేవసేన.
చంద్రః మనసో జాతః = చంద్రుడు మనస్సునుండి పుట్టాడు.
వినాయకుడిది శుద్ధ మనస్సు. శుద్ధ మనస్సు. శుద్ధ బుద్ధి మరియు శుద్ధ ఆత్మా ఒక్కటే.    శుద్ధ బుద్ధి ఉన్నవానికి తప్పక సిద్ధి చేకూరును.
కుమారస్వామి అనగా తనను తను తెలుసుకున్న బ్రహ్మచారి అని అర్థము.  అట్టివాడి కుండలినీశక్తి  అనగా వల్లి అతని అధీనములో ఉండును. అట్టివాడు  దేవతల సేనకి అనగా దేవసేనకి నాయకుడిగా ఉండును.
 
వహత్యంబ స్తంబేరమ-దనుజ-కుంభప్రకృతిభిః
సమారబ్ధాం ముక్తామణిభిరమలాం హారలతికామ్ |
కుచాభోగో బింబాధర-రుచిభి-రంతః శబలితాం
ప్రతాప-వ్యామిశ్రాం పురదమయితుః కీర్తిమివ తే || 74 ||

అమ్మా జగజ్జననీ, కుచాభోగో వహత్యంబ స్తంబేరమ-దనుజ-కుంభప్రకృతిభిః= అనాహత మరియు విశుద్ధల మధ్య గజాసురుని కుంభస్థలమునుండి పుట్టిన, సమారబ్ధాం ముక్తామణిభిరమలాం హారలతికామ్=ముత్యములచే చేయబడిన దోషములేనిస్వచ్ఛమైన ముత్యాల హారమును, బింబాధర-రుచిభి-రంతః శబలితాం=ఎర్రని రంగు పెదవులను, ప్రతాప-వ్యామిశ్రాం పురదమయితుః కీర్తిమివ తే= శివునికీర్తిని వహించు చున్నది.
 
అమ్మా జగజ్జననీ, అనాహత మరియు విశుద్ధల మధ్య ముత్యములచే చేయబడిన స్వచ్ఛమైన ముత్యాల హారము శివునికీర్తిని వహించు చున్నది.

తవ స్తన్యం మన్యే ధరణిధరకన్యే హృదయతః
పయః పారావారః పరివహతి సారస్వతమివ |
దయావత్యా దత్తం ద్రవిడశిశు-రాస్వాద్య తవ యత్
కవీనాం ప్రౌఢానా మజని కమనీయః కవయితా || 75 ||

తవ స్తన్యం మన్యే ధరణిధరకన్యే హృదయతః= అమ్మా, నీ అన్నహత చక్రమునుండి అనగా హృదయము నుండి పుట్టిన, పయః పారావారః పరివహతి సారస్వతమివ = దయామృతము వాఙ్మయము వల ప్రవహించుచున్నదని తలంచెదను.   దయావత్యా దత్తం ద్రవిడశిశు-రాస్వాద్య తవ యత్=నీ దయచేత ఇచ్చిన శివుడ్ని ఆస్వాదించి, కవీనాం ప్రౌఢానా మజని కమనీయః కవయితా=కవులలో కవిగా పుట్టెను.

అమ్మా, నీ అన్నహత చక్రమునుండి అనగా హృదయము నుండి పుట్టిన,  దయామృతము వాఙ్మయము వల ప్రవహించుచున్నదని తలంచెదను.    నీ దయచేత ఇచ్చిన శివుడు ఆస్వాదించి,  కవులలో కవిగా పుట్టెను. శివుడు అనగా ఆది శంకరాచార్యులు అని అర్థము.

హరక్రోధ-జ్వాలావళిభి-రవళీఢేన వపుషా
గభీరే తే నాభీసరసి కృతసంగో మనసిజః |
సముత్తస్థౌ తస్మా-దచలతనయే ధూమలతికా
జనస్తాం జానీతే తవ జనని రోమావళిరితి || 76 ||

అచలతనయే= అమ్మా, మనసిజః హరక్రోధ-జ్వాలావళిభి-రవళీఢేన వపుషా = మన్మథుడు శివుని క్రోధ-జ్వాలలతో క్రమ్మిన శరీరముతో,  గభీరే తే నాభీసరసి కృతసంగో = లోతైన నీ నాభిలో మునిగిపోయెను.   సముత్తస్థౌ తస్మా-ద ధూమలతికా= అందువలన పొగ పైకి ప్రాకేను. జనస్తాం జానీతే తవ జనని రోమావళిరితి= ఓ తల్లీ, అందరు దానిని నీ నూగారుగాతెలుసుకున్నారు.

అమ్మా, మన్మథుడు శివుని క్రోధ-జ్వాలలతో క్రమ్మిన శరీరముతో, లోతైన నీ నాభిలో మునిగిపోయెను.  అందువలన పొగ పైకి ప్రాకేను.  ఓ తల్లీ, అందరు దానిని నీ నూగారుగాతెలుసుకున్నారు.
ఇక్కడ నాబి మణిపుర, స్తనద్వయమధ్యమము అనాహత,  స్తనద్వయము ఇడా పింగళ,  నాభినుండి పైకిప్రోవు నూగారు సుషుమ్నా.

యదే తత్కాళిందీ-తనుతర-తరంగాకృతి శివే
కృశే మధ్యే కించిజ్జనని తవ యద్భాతి సుధియామ్
విమర్దా-దన్యోన్యం కుచకలశయో-రంతరగతం
తనూభూతం వ్యోమ ప్రవిశదివ నాభిం కుహరిణీమ్|| 77 ||

జనని= అమ్మా, కృశే మధ్యే తవ = సన్నని నే నడుమునందు  యదేతత్= ఏదైతే కాళిందీ-తనుతర-తరంగాకృతి శివే= యమునా నదియొక్క చిన్న తరంగములుగలదై, కించిత్= కొంచెము, సుధియామ్= విద్వాంసులకు, యద్భాతి= ఏది  కనబడుతున్నదో, తవ కుచకలశయో-రంతరగతం=నీ అనాహత చక్రము వద్దనున్న హృదయములోని, తనూభూతం=సూక్ష్మమైన, వ్యోమ అన్యోన్యం = ఆకాశము పరస్పరము, విమర్దాత్= స్పృసించుట వలన,  ప్రవిశదివ నాభిం కుహరిణీమ్=నాభిలో ప్రవేశించుచున్నది.

అమ్మా, యమునా నది తరంగమువలె సన్నగాఉండే నీ నడుముపైన నీ అనాహత చక్రము, ఆకాశము అనగా విశుద్ధ చక్రము పరస్పరము,  స్పృసించు కొనుచున్నవి. అవి నాభిని అనగా మణిపురను ప్రవేశించునట్లుగా ఉన్నది.

స్థిరో గంగా వర్తః స్తనముకుళ-రోమావళి-లతా
కలావాలం కుండం కుసుమశర తేజో-హుతభుజః |
రతే-ర్లీలాగారం కిమపి తవ నాభిర్గిరిసుతే
బిలద్వారం సిద్ధే-ర్గిరిశనయనానాం విజయతే || 78 ||

తవ నాభిర్గిరిసుతే  = అమ్మా, నీ మణిపురచక్రము, స్థిరో గంగావర్తః = స్థిరమైన గంగానది  స్తనముకుళ-రోమావళి-లతా= అనాహత యొక్క నూగారు అను తీగెకు, కలావాలం కుండం కుసుమశర తేజో-హుతభుజః = పాదుగాను,  మన్మథాగ్ని హోమకుండముగాను,  రతే-ర్లీలాగారం కిమపి= రతీదేవి విలాసగృహముగాను, బిలద్వారం సిద్ధే-ర్గిరిశనయనానాం విజయతే= సదాశివుని తపః సిద్ధికై గుహద్వారము అగుచు వర్ణాతీతమై సర్వోత్కృష్టముగా ప్రకాశించుచున్నది.

 అమ్మా, నీ మణిపురచక్రము, స్థిరమైన గంగానది   అనాహత యొక్క నూగారు అను తీగెకు,  పాదుగాను,  మన్మథాగ్ని హోమకుండముగాను,  సుషుమ్నా మార్గము నూగారుగాను, రతీదేవి విలాసగృహముగాను, సదాశివుని తపః సిద్ధికై గుహద్వారము అగుచు వర్ణాతీతమై సర్వోత్కృష్టముగా ప్రకాశించుచున్నది.
మణిపురచక్రము అనే పాదు వద్ద ఈర్ష్య అసూయలు తగలబడిపోవును. 
మన్మథాగ్నికి అమ్మవారి నాభి హోమగుండము, అమ్మవారి నాభి రతీదేవి విలాసగృహము, మరియు అమ్మవారి నాభి శివుని తపఃసిద్ధికి గుహ ద్వారము. నాభిద్వారానే గర్భాశయములోని బిడ్డకు ఆహారము అందును. జీవుడు పుట్టుటకు పూర్వము సమాధిస్థితి లో ఉండును. ఆ పూర్వస్థితినే శివుడు అందురు. ఆ పూర్వస్థితినే గుహద్వారము అందురు. అందువలన అమ్మవారి నాభి వర్ణనాతీతం.

నిసర్గ-క్షీణస్య స్తనతట-భరేణ క్లమజుషో
నమన్మూర్తే ర్నారీతిలక శనకై-స్త్రుట్యత ఇవ |
చిరం తే మధ్యస్య త్రుటిత తటినీ-తీర-తరుణా
సమావస్థా-స్థేమ్నో భవతు కుశలం శైలతనయే || 79 ||

నారీతిలక శైలతనయే=అమ్మా జగజ్జననీ, నిసర్గ-క్షీణస్య స్తనతట-భరేణ క్లమజుషః= స్వభావ సిద్ధముగా సంనగానున్న, అనాహత చక్రముచేత అలసటపొందినదైన, నమన్మూర్తే ర్నా శనకై-స్త్రుట్యత ఇవ=కొంచెముగా వంగిన కొంచెము విడిగానున్న, చిరం తే మధ్యస్య త్రుటిత తటినీ-తీర-తరుణా=తెగిన నదీ గట్టునందలి వృక్షము వలె, సమావస్థా-స్థేమ్నో భవతు కుశలం = నీ నడుమునకు క్షేమము అగుగాక.

అమ్మా జగజ్జననీ, స్వభావ సిద్ధముగా పలుచగానున్న,  అలసట పొందినదైన, కొంచెముగా వంగిన, కొంచెము విడిగానున్న ఇడా పింగళా(స్తనద్వయ)మధ్య ప్రదేశము అయిన అనాహత చక్రము,  తెగిన నదీ గట్టునందలి వృక్షము వలె నున్న నీ నడుమునకు అనగా స్వాధిష్టాన చక్రమునకు క్షేమము అగుగాక.

కుచౌ సద్యః స్విద్య-త్తటఘటిత-కూర్పాసభిదురౌ
కషంతౌ-దౌర్మూలే కనకకలశాభౌ కలయతా |
తవ త్రాతుం భగ్నా దలమితి వలగ్నం తనుభువా
త్రిధా నద్దం దేవీ త్రివళి లవలీవల్లిభిరివ || 80 ||

కుచౌ సద్యః స్విద్య-త్తటఘటిత-కూర్పాసభిదురౌ= తల్లీ, అప్పుడే చెమర్చుచున్న పార్శ్వములందు కూర్చబడిన రవికె చినుగును అన్నట్లుగా, కషంతౌ-దౌర్మూలే కనకకలశాభౌ కలయతా=బాహు మూలములను ఇరుకుగా సువర్ణ రంగుతో స్తనములను నిర్మించుచున్నవాడైన,  తవ త్రాతుం భగ్నా దలమితి వలగ్నం తనుభువా= మన్మథునిచేత స్తనభారముతో రక్షణగా,  త్రిధా నద్దం దేవీ త్రివళి లవలీవల్లిభిరివ=మూడు ముడుతలుగల నీ మధ్య భాగము తీగెలచేత మూడువరసలుగా కట్టబడినట్లుగానున్నది.

తల్లీ, అప్పుడే చెమర్చుచున్న పార్శ్వములందు కూర్చబడిన రవికె, సువర్ణరంగుతోకూడిన అనాహతచక్ర ప్రదేశము, మూడు ముడుతలుగల నీ స్వాధిష్టాన మణిపుర మధ్య భాగము చూడ ముచ్చటగానున్నది.
 
గురుత్వం విస్తారం క్షితిధరపతిః పార్వతి నిజాత్
నితంబా-దాచ్ఛిద్య త్వయి హరణ రూపేణ నిదధౌ |
అతస్తే విస్తీర్ణో గురురయమశేషాం వసుమతీం
నితంబ-ప్రాగ్భారః స్థగయతి లఘుత్వం నయతి చ || 81 ||

గురుత్వం విస్తారం క్షితిధరపతిః పార్వతి నిజాత్ =అమ్మా, నీ తండ్రి, విస్తారమైన తన బరువును, నితంబా-దాచ్ఛిద్య త్వయి హరణ రూపేణ నిదధౌ = కొండ మధ్యనుండి  నీనుండి వేరుచేసి నీకు స్త్రీధనముగా ఇచ్చెను.   అతస్తే విస్తీర్ణో గురురయమశేషాం వసుమతీం= అందువలన నీకు కనబడుచున్న విశాలమైన బరువైన పిఱుదులు సమస్తమైన భూమండలమును, నితంబ-ప్రాగ్భారః స్థగయతి లఘుత్వం నయతి చ= భరించుచున్నది, (ఆ  భారము) భూమిని మ్రోయుట తేలికయినది.

అమ్మా, నీ తండ్రి, విస్తారమైన తన బరువును, కొండ మధ్యనుండి  నీనుండి వేరుచేసి నీకు స్త్రీధనముగా ఇచ్చెను. అందువలన నీకు కనబడుచున్న విశాలమైన బరువైన పిఱుదులు సమస్తమైన భూమండలమును, భరించుచున్నది, (ఆ  భారము) భూమిని మ్రోయుట తేలికయినది.
అమ్మ మోసే బరువు ముందర భూమి ఒక లెక్ఖలోనిదికాడు.

కరీంద్రాణాం శుండాన్-కనకకదళీం-కాండపటలీం
ఉభాభ్యామూరుభ్యా-ముభయమపి నిర్జిత్య భవతి |
సువృత్తాభ్యాం పత్యుః ప్రణతికఠినాభ్యాం గిరిసుతే
విధిజ్ఞే జానుభ్యాం విబుధ కరికుంభ ద్వయమసి || 82 ||

గిరిసుతే = అమ్మా, విధిజ్ఞే కరీంద్రాణాం శుండాన్-కనకకదళీం-కాండ పటలీం = దేవి, నీవు ఏనుగు తొండముల అరటి స్తంభములవంటి బంగారు తొడలచే, ఉభాభ్యామూరుభ్యా-ముభయమపి నిర్జిత్య భవతి=నీ బంగారు తొడలచే జయించెదవు.   సువృత్తాభ్యాం పత్యుః ప్రణతికఠినాభ్యాం =అందముగానున్న నీ మోకాళ్ళు శివునికి కఠినమైన నమస్క్రుతులతో అరిగిపోయిన,  జానుభ్యాం విబుధ కరికుంభ ద్వయమసి= ఐరావతములు కూడా ఆమె అరిగిపోయిన మోకాళ్ళకి సమానము కావు.

అమ్మా, దేవి, నీవు ఏనుగు తొండముల అరటి స్తంభములవంటి బంగారు తొడలచే, నీ బంగారు తొడలచే జయించెదవు. అందముగానున్న నీ మోకాళ్ళు శివునికి కఠినమైన నమస్క్రుతులతో అరిగిపోయిన, ఐరావతములు కూడా ఆమె అరిగిపోయిన మోకాళ్ళకి సమానము కావు.
అనగా అమ్మ తొడలు ఐరావతము కన్నా దృఢముగా, అందముగాను ఉండును అని అర్థము. 

పరాజేతుం రుద్రం ద్విగుణశరగర్భౌ గిరిసుతే
నిషంగౌ జంఘే తే విషమవిశిఖో బాఢ-మకృత |
యదగ్రే దృశ్యంతే దశశరఫలాః పాదయుగళీ
నఖాగ్రచ్ఛన్మానః సుర ముకుట-శాణైక-నిశితాః || 83 ||

విషమవిశిఖో  పరాజేతుం రుద్రం ద్విగుణశరగర్భౌ గిరిసుతే= అమ్మా, అయిదు బాణములుగల మన్మథుడు శివుని జయించుటకు వాటికంటే శక్తిగల,  నిషంగౌ జంఘే తే బాఢ-మకృత= పిక్కలు బాణములుగా చేసినాడు, ఇది నిజము. 
యదగ్రే దృశ్యంతే దశశరఫలాః పాదయుగళీ=నీ అమ్ములపొదిలో అడుగు భాగము,  నఖాగ్రచ్ఛన్మానః సుర ముకుట-శాణైక-నిశితాః= గ్రోళ్ళ నెపముతో దేవతల కిరీటములోని రాళ్ళు పదునుపెట్టబడినవై. బాణముల ములుకులు వలె కనబడుతున్నవి.
 అమ్మా, మన్మథుడు శివుని జయించుటకు అయిదు బాణములు అనగా పంచభూతములను (భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశము) అనగా ప్రకృతి  మరియు వాటికంటే శక్తిగల,  నీ అమ్ములపొది పైన మరియు  అడుగు భాగములు అనగా పిక్కలు బాణములుగా చేసినాడు, ఇది నిజము.  నీ గ్రోళ్ళ జ్ఞాపకము వచ్చు నెపముతో అవి శివునిపై బాణములుగా వేసెను.

శ్రుతీనాం మూర్ధానో దధతి తవ యౌ శేఖరతయా
మమాప్యేతౌ మాతః శిరసి దయయా దేహి చరణౌ |
యయోః పాద్యం పాథః పశుపతి జటాజూట తటినీ
యయో-ర్లాక్షా-లక్ష్మీ-రరుణ హరిచూడామణి రుచిః       84

శ్రుతీనాం మూర్ధానో దధతి తవ యౌ శేఖరతయా=అమ్మా నీ పాదములను వేదం వేదాంతములు అనగా ఉపనిషత్తులు నెత్తినపెట్టుకొని పూజించుచున్నవి
మమాప్యేతౌ మాతః శేరసి దయయా దేహి చరణౌ = ఆ నీ పాదములను నా మీద కరుణతో ఉంచుము. యయోః పాద్యం పాథః పశుపతి జటాజూట తటినీ=నీ చరణములను తడిపిన ఆ గంగా జలము శివుని జటాజూటమందలి ముడులను తడిపిన గంగయే,  యయో-ర్లాక్షా-లక్ష్మీ-రరుణ హరిచూడామణి రుచిః =  విష్ణువు చూడామణి కాంతియున్నూఇదియే.

అమ్మా నీ పాదములను వేదం వేదాంతములు అనగా ఉపనిషత్తులు నెత్తినపెట్టుకొని పూజించుచున్నవి,  ఆ నీ పాదములను నా మీద కరుణతో ఉంచుము. నీ చరణములను తడిపిన ఆ గంగా జలము శివుని జటాజూట మందలి ముడులను తడిపిన గంగయే, విష్ణువు చూడామణి కాంతియున్నూఇదియే..
శివుని జటాజూట మందలి ముడులు అనగా శుద్ధ మనస్సుల సమూహము.

నమో వాకం బ్రూమో నయన-రమణీయాయ పదయోః
తవాస్మై ద్వంద్వాయ స్ఫుట-రుచి రసాలక్తకవతే |
అసూయత్యత్యంతం యదభిహననాయ స్పృహయతే
పశూనా-మీశానః ప్రమదవన-కంకేళితరవే || 85 ||

నయన-రమణీయాయ స్ఫుట-రుచి రసాలక్తకవతే నమో వాకం బ్రూమో పదయోః తవాస్మై ద్వంద్వాయ = నయనానందకరముగా ప్రకాశముతో పారాయిణితో విలసిల్లు నీ పాదయుగ్మములకు నమస్కారము.  పశూనా-మీశానః యదభిహననాయ స్పృహయతే = శివుడునీ పాదయుగ్మపు తాకిడిని కోరుచున్నాడు. అసూయత్యత్యంతం ప్రమదవన-కంకేళితరవే= ఉద్యానవన మందలి అశోక వృక్షము కొరకు మిక్కిలి అసూయ పడుచున్నాడు. అవి నీ దర్శనము ఎల్లప్పుడూ పొందుతున్నవిగనుక.

నయనానందకరముగా ప్రకాశముతో పారాయిణితో విలసిల్లు నీ పాదయుగ్మములకు నమస్కారము.  అనగా శుభప్రదమైన నీ పాదయుగ్మములకు నమస్కారము. శివుడు అనగా శుద్ధ మనస్సు నీ పాదయుగ్మపు తాకిడినే కోరతాడు. అనగా శుద్ధ మనస్సు నీ పాదయుగ్మపు తాకిడినే కోరుతుంది.
మృషా కృత్వా గోత్రస్ఖలన-మథ వైలక్ష్యనమితం
లలాటే భర్తారం చరణకమలే తాడయతి తే |
చిరాదంతః శల్యం దహనకృత మున్మూలితవతా
తులాకోటిక్వాణైః కిలికిలిత మీశాన రిపుణా || 86 ||

మృషా కృత్వా గోత్రస్ఖలన-మథ వైలక్ష్యనమితం= అమ్మా, పొరపాటున సవతిపేరు పలికి ఆ తరువాత కిమ్మనక కూర్చోవటము. లలాటే భర్తారం చరణకమలే తాడయతి తే = అందువలన శివుని పాదపద్మముతో ఫాలభాగము తన్నెను.   ఈశాన రిపుణాచిదంతః శల్యం దహనకృత మున్మూలితవతా= మన్మథునిచే హృదయములో బాధించబడు శివుని కదిలినదై   తులాకోటిక్వాణైః కిలికిలిత మీ = కాలి అందెల కిల కిల మోతచేత  మన్మథుడు జయించెను.
 
అమ్మా, పొరపాటున సవతిపేరు పలికి ఆ తరువాత కిమ్మనక కూర్చోవటము. అందువలన శివుని పాదపద్మముతో ఫాలభాగము తన్నెను.   
అనగా పరమాత్మ మరియు ప్రకృతిల కలయికే ఈ మాయాసంసారమునకు హేతువు అని చమత్కార పూర్వకముగా చెప్పకనే చెప్పారు ఆదిశంకరులు  ఇక్కడ.
ఊర్ధ్వదిశకు వెళ్ళు శుక్రము ఓజస్సు భ్రాజస్సు స్థితులను దాటును.  అప్పుడు కుండలినీ సహస్రార చక్రమునకు చేరును.
త్రేతాగ్నులలోని శుక్రము దక్షిణాగ్ని అందురు. ఇది ఇంద్రియ పరితృప్తికి లేదా కామ పరితృప్తికి ఉపయోగించు శుక్రము.
సంతానోత్పత్తికి ఉపయోగించు శుక్రమును  గార్హపత్యాగ్ని అందురు..
ఆధ్యాత్మిక ఉన్నతికి ఉపయోగించు శుక్రమును  లేదా కుండలినీ సిద్ధికి ఉపయోగించు శుక్రమును  ఆహవనీయాగ్ని అందురు.
దక్షిణాగ్ని మరియు గార్హపత్యాగ్ని రెండూను అథోమార్గము,  ఆహవనీయాగ్ని ఊర్ధ్వదిశా మార్గము లేదా సుషుమ్నా మార్గము అందురు.
దక్షిణాగ్ని శుక్రముది అథో అనగా పాతాళలోక మార్గము.   గార్హపత్యాగ్ని శుక్రముది అథో అనగా మర్త్యలోక మార్గము.
కుండలినీ సిద్ధికి ఉపయోగించు శుక్రమును  అనగా ఆహవనీయాగ్నిది ఊర్ధ్వదిశా మార్గము లేదా దేవలోక మార్గము.
గోత్ర స్ఖలనము = గో అనగా ఇంద్రియము,  త్ర అనగా రక్షణ, స్ఖలనము అనగా  సడలిపోవుట.
గోత్ర స్ఖలనము అనగా ఇంద్రియ నిగ్రహ శక్తి పడిపోవుట.
శుక్రమునే ‘గంగా’ అందురు.  శుక్రము సహస్రార చక్రమును చేరుటే అర్థనారీశ్వర తత్వము అందురు.
శివుడ్ని కాలితో తన్నుట అనగా  పరప్రకృతి శుద్ధమనస్సును లొంగ తీసుకొనుట. అదే సంసారము.

హిమానీ హంతవ్యం హిమగిరినివాసైక-చతురౌ
నిశాయాం నిద్రాణాం నిశి-చరమభాగే చ విశదౌ |
వరం లక్ష్మీపాత్రం శ్రియ-మతిసృజంతౌ సమయినాం
సరోజం త్వత్పాదౌ జనని జయత-శ్చిత్రమిహ కిమ్ || 87 ||
హిమగిరినివాసైక-చతురౌ=అమ్మా, నీ పాదములు మంచు కొండ యందు నివాసముండుటలో నేర్పరితనము గలవి, రాత్రి, రాత్రిచివరిలో  నిశి-చరమభాగే చ విశదౌ= ప్రకాశ వికాశము గలదియు, శ్రియ-మతిసృజంతౌ సమయినాం= భక్తులకు సంపదను అధికముగా కలుగజేయునదియు త్వత్పాదౌ హిమానీ హంతవ్యం = నీ పాదములు మంచుతో నశింపచేయ తగినవియు, నిశాయాం నిద్రాణాం= రాత్రియందు నిద్రించునవియు, వరం లక్ష్మీపాత్రం=  లక్ష్మీదేవికి ఇష్ట మైనవియు, సరోజం జయతః= పద్మమును జయించుచున్నవి.  జనని చిత్ర మిహ కిమ్= అమ్మా, ఇందులో విచిత్రమేమి ఉన్నది?
అమ్మా నీ పాదములు మంచు కొండ యందు నివాసముండుటలో నేర్పరితనము గలవి, రాత్రి, రాత్రిచివరిలో కూడా  ప్రకాశ వికాశము గలవియు,   భక్తులకు సంపదను అధికముగా కలుగజేయునవియు అయినవి. అట్టి నీ పాదములను మంచు నశింపచేయజాలదు.   రాత్రియందు నిద్రించునవియు,  లక్ష్మీదేవికి ఇష్టమైనవియు, అగు పద్మములను జయించుచున్నవి. అట్టి   పద్మములకు అతీతమైన నీ పాదములు.
ఇక్కడ పార్వతి అనగా పరా + వాటి అనగా పరాశక్తిగలది. పరాశక్తి మొదట్లో వేడిగాయుండును. కుండలినీ జాగృతి ఎక్కువైనప్పుడు క్రమముగా చల్ల బడును. అందుకనే ఆవిడని హైమవతి అందురు.

పదం తే కీర్తీనాం ప్రపదమపదం దేవి విపదాం
కథం నీతం సద్భిః కఠిన-కమఠీ-కర్పర-తులామ్ |
కథం వా పాణిభ్యా-ముపయమనకాలే పురభిదా
యదాదాయ న్యస్తం దృషది దయమానేన మనసా || 88 ||
పదం తే కీర్తీనాం ప్రపదమపదం దేవి విపదాం= అమ్మా పార్వతీ, యశస్సులకు ఉనికిపట్టును, ఆపదలకు కానిచోటును,  కథం నీతం సద్భిః కఠిన-కమఠీ-కర్పర-తులామ్ = సత్కవులచేత కఠినమైన తాబేలుయొక్క వీపు డిప్ప పోలికను ఏ విధముగాచెప్పబడినది, దయమానేన మనసా=దయగల మనస్సుచేత, ఉపయమనకాలే పురభిదా= శివుని వివాహసమయమందు,  పాణిభ్యామ్= హస్తములచేత, యదాదాయ= నీ పాదము పట్టుకొని, కథం వా న్యస్తం దృషది= నీ సన్నికల్లునందుఉంచబడినది.

అమ్మా పార్వతీ, యశస్సులకు ఉనికిపట్టును, ఆపదలకు కానిచోటును,    కఠినమైన తాబేలుయొక్క వీపు డిప్ప  లాంటివి  నీ పాదములు.  ఆడవారి అయిదవతనమునకు గుర్తు అయినది పసుపు. సన్నికల్లునందు పసుపు నూరుదురు. దానికి నీ పాదములు  ఆధారముగ  గౌరవ ప్రదముగా ఉంచుదురు.

నఖై-ర్నాకస్త్రీణాం కరకమల-సంకోచ-శశిభిః
స్తరూణాం దివ్యానాం సహత ఇవ తే చండి చరణౌ |
ఫలాని స్వఃస్థేభ్యః కిసలయ-కరాగ్రేణ దదతాం
దరిద్రేభ్యో భద్రాం శ్రియమనిశ-మహ్నాయ దదతౌ || 89 ||

కిసలయ-కరాగ్రేణ = చిగురుటాకువంటి చేతులతో, స్వఃస్థేభ్యః = దేవతలకొఱకు,  ఫలాని దదతాం= ఫలములను ఇచ్చు, తరూణాం దివ్యానాం= దివ్యమైన కల్పవృక్షములకు,  దరిద్రేభ్యో భద్రాం శ్రియమ్= దరిద్రులకు భద్రమైన సంపదను, అనిశ-మహ్నాయ దదతౌ =వెంటనే యిచ్చునట్టి, తే చండి =అమ్మా నీ పాదములు,  నాకస్త్రీణాం = స్వర్గలోక స్త్రీలు, కరకమల-సంకోచ-శశిభిః= హస్తములను ముడుచుట యందు, చంద్రునివలె  నఖై-అసహత ఇవ= గోళ్లచేత ఉన్నవి.

కల్పవృక్షములు చిగురుటాకువంటి చేతులతో దేవతలకు ఫలములను ఇచ్చును. అమ్మా నీ దివ్యమైన పాదములు, దరిద్రులకు భద్రమైన సంపదను, వెంటనే యిచ్చును.  

దదానే దీనేభ్యః శ్రియమనిశ-మాశానుసదృశీం
అమందం సౌందర్యం ప్రకర-మకరందం వికిరతి |
తవాస్మిన్ మందార-స్తబక-సుభగే యాతు చరణే
నిమజ్జన్ మజ్జీవః కరణచరణైః ష్షట్  చరణతామ్ || 90 ||

దదానే దీనేభ్యః శ్రియమనిశ-మాశానుసదృశీం=దరిద్రులకు సిరిసంపదలను ఎల్లప్పుడూ వారివారి యుక్తమైన కోరికలకు అనుగుణముగా   అమందం సౌందర్యం ప్రకర-మకరందం వికిరతి =అధిక సౌందర్యముయొక్క గుణములు అను తేనెనువేదజల్లుతున్నదియు   తవాస్మిన్ మందార-స్తబక-సుభగే యాతు చరణే= మందార కల్ప వృక్షముయొక్క పుష్పగుచ్ఛం నీ పాదమునందు   నిమజ్జన్ మజ్జీవః కరణచరణైః ష్షట్  చరణతామ్=మనస్సు కర్మ వాచా అనగా ఇంద్రియములతో ఈ జీవుడు నమస్కారము. ఆ భ్రమర భావమును పొందెదను గాక.
అమ్మా, దరిద్రులకు సిరిసంపదలను ఎల్లప్పుడూ వారివారి యుక్తమైన కోరికలకు అనుగుణముగా అనుగ్రహించెదవు.  అట్టి అధిక సౌందర్యముయొక్క గుణములు అను తేనెనువెదజల్లుతున్నదియు మందార కల్ప వృక్షముయొక్క పుష్పగుచ్ఛం నీ పాదమునందు ఉంచి మనస్సు కర్మ వాచా అనగా ఇంద్రియములతో ఈ భక్తుడు నమస్కారము. ఆ భ్రమరకీటకము వలె  ఆ భావమును పొందెదను గాక.

పదన్యాస-క్రీడా పరిచయ-మివారబ్ధు-మనసః
స్ఖలంతస్తే ఖేలం భవనకలహంసా న జహతి |
అతస్తేషాం శిక్షాం సుభగమణి-మంజీర-రణిత-
చ్ఛలాదాచక్షాణం చరణకమలం చారుచరితే || 91 ||

చారుచరితే = అమ్మా జగజ్జననీ,  పదన్యాస-క్రీడా = పదన్యాస ఆటలో పరిచయ-మివారబ్ధు-మనసః=చూసి నేర్చుకావాలి అనే మనస్సు గల  స్ఖలంతస్తే ఖేలం భవనకలహంసా న జహతి =రాజహంసలు జారుచున్నవై నీ ఆటను వదలుట లేదు, అతః చరణకమలం = అందువలన నీ పాదపద్మముల   సుభగమణి-మంజీర= సుందర మణులతో కూడిన అందియల  స్తేషాం రణిత చ్ఛలాత్= సవ్వడులతో, ఆ రాజహంసలు నడక శిక్షణకు   దాచక్షాణం =వేచి యున్నవి.

అమ్మా జగజ్జననీ పదన్యాస ఆటను  చూసి నేర్చుకావాలి అనే మనస్సు గల   రాజహంసలు జారుచున్ననూ నీ ఆటను వదలుట లేదు,   అందువలన నీ పాదముల సుందర మణులతో కూడిన అందియల   సవ్వడులకై ఆ రాజహంసలు శిక్షణకు   వేచియున్నవి.
రాజహంస అనగా బయటికి వినబడని ఒక శ్వాస + ఒక నిశ్వాస.
12 నియమిత శ్వాసలు + 12 నియమిత నిశ్వాసలు కలిపి ధారణా ప్రాణా యామము అందురు.
అమ్మ వారు మరాళీ మందగమన అనగా నిదానముగా పట్టువడవకుండా చేయు ధారణా ప్రాణాయామములో మహా ప్రావీణ్యురాలు.
ప్రావీణ్యత సంపాదించిన సాధకుడ్ని ‘పరమహంస’ అందురు.
 
గతాస్తే మంచత్వం ద్రుహిణ హరి రుద్రేశ్వర భృతః
శివః స్వచ్ఛ-చ్ఛాయా-ఘటిత-కపట-ప్రచ్ఛదపటః |
త్వదీయానాం భాసాం ప్రతిఫలన రాగారుణతయా
శరీరీ శృంగారో రస ఇవ దృశాం దోగ్ధి కుతుకమ్ || 92 ||

గతాస్తే మంచత్వం ద్రుహిణ హరి రుద్రేశ్వర భృతః=అమ్మా, నీ మంచము రూపం పొందుటకు బ్రహ్మ, విష్ణు, రుద్రుడు, ఈశ్వరుడు, ఈ నలుగురు సేవకులుగా ఉన్నవారై, శివఃస్వచ్ఛ-చ్ఛాయా-ఘటిత-కపట-ప్రచ్ఛదపటః=సదాశివతత్వము నిర్మలకాంతితో కూడిన నెపముగల దుప్పటిలాగా,  త్వదీయానాం భాసాం ప్రతిఫలన రాగారుణతయా=నీకు సంబంధించిన కాంతుల ప్రతిబింబముల ఎఱ్ఱధనముతో, శరీరీ శృంగారో రస ఇవ దృశాం దోగ్ధి కుతుకమ్=భౌతికరూపు పొందినవి అందమైన నీ చూపులకు ఆనందము పొందుచున్నాడు.
అమ్మా, నీ మంచము రూపం పొందుటకు బ్రహ్మ, విష్ణు, రుద్రుడు, ఈశ్వరుడు, ఈ నలుగురు నాలుగు మంచము కోళ్ళవలె  ఉన్నవారై,  సదాశివతత్వముతో శివుడు ఆనందము పొందుచున్నాడు.
సాధనలో కుండలినీ సుషుమ్న మార్గములో ఊర్ధ్వగతిని పొందును. అప్పుడు,
బ్రహ్మగ్రంథి (brain of instincts & desires), రుద్రుగ్రంథి (brain of emotions & affections), విష్ణుగ్రంథి(brain of inintellect & wisdom), ఈ మూడింటినీ దాటి  ఈశ్వర తత్వమును చేరును. నాలుగు మంచము కోళ్ళు ఇవే. ఈ నాలుగు cardinal points అనగా సుషుమ్నా మార్గము లో ఇవి మెైలురాళ్ళ (mile stones)వంటివి. 
బ్రహ్మగ్రంథి: మూలాధార, స్వాధిష్టాన, మరియు మణిపుర
రుద్రగ్రంథి: మణిపుర,  అనాహత, మరియు విశుద్ధ
విష్ణుగ్రంథి: విశుద్ధ, ఆజ్ఞా, మరియు సహస్రార
ఈ మూడింటినీ దాటి  ఈశ్వరతత్వమును అనగా సహస్రారచక్రము దాట వలెను.  ఈ దాటుటనే సదాశివతత్వమందురు. సహస్రారే రమ్యే సహ రహసి పత్యా విహరసే.  దీనినే అర్థనారీశ్వర తత్వము అందురు.

అరాళా కేశేషు ప్రకృత సరళా మందహసితే
శిరీషాభా చిత్తే దృషదుపలశోభా కుచతటే |
భృశం తన్వీ మధ్యే పృథు-రురసిజారోహ విషయే
జగత్త్రాతుం శంభో-ర్జయతి కరుణా కాచిదరుణా || 93 ||

అరాలా కేశేషు ప్రకృత సరళా మందహసితే= వంకుల కురులతోను,  చిరునగవుతోను,  శిరీషాభా చిత్తే దృషదుపలశోభా కుచతటే = మెత్తని మనస్సుతోను, బరువైన స్తనద్వయముతో భృశం తన్వీ మధ్యే పృథు-రురసిజారోహ విషయే=విశాలమైన స్తనములు, పిఱుదులు కలదియు,  జగత్త్రాతుం శంభో-ర్జయతి కరుణా కాచిదరుణా=సదాశివుని వర్ణనాతీతమైన ‘అరుణ’ అను శక్తి కలదియు, దయ కలదియు, జగత్తును రక్షించునదియు అయి ఉన్నది.
జగన్మాత వంకుల కురులతోను,  చిరునగవుతోను, మెత్తని మనస్సుతోను, ఇడా పింగళాలతో  వాటి మధ్య సుషుమ్నా మార్గము,  పిఱుదులు కలదియు,  సదాశివుని వర్ణనాతీతమైన ‘అరుణ’ అను శక్తిగలదియు, దయగలదియు, జగత్తును రక్షించునదియు అయిఉన్నది.
 
కళంకః కస్తూరీ రజనికర బింబం జలమయం
కళాభిః కర్పూరై-ర్మరకతకరందం నిబిడితమ్ |
అతస్త్వద్భోగేన ప్రతిదినమిదం రిక్తకుహరం
విధి-ర్భూయో భూయో నిబిడయతి నూనం తవ కృతే || 94 ||

కలంకః కస్తూరీ రజనికర బింబం జలమయం=అమ్మ, మచ్చ కస్తూరి అగును,  చంద్ర బింబం జలస్వరూపమయినది,  కళాభిః కర్పూరై-ర్మరకతకరందం నిబిడితమ్= కళతో పచ్చకర్పూరముతో నిండినదియు పచ్చలతోకూడిన భరణి అగును. అతస్త్వద్భోగేన ప్రతిదినమిదం రిక్తకుహరం=ఇది ప్రతిదినము నీచేత ఖాళీ చేయబడుతున్నది. విధి-ర్భూయో భూయో నిబిడయతి నూనం తవ కృతే =బ్రహ్మ మరల మరల నీకై ఆ యా వస్తువులచేత నిశ్చయముతో నింపుతున్నాడు.
 
అమ్మ, నీకు చంద్రుడు మరకత మణులతోకూడిన  కస్తూరి పచ్చకర్పూరము తో నిండిన భరణి అగును. చంద్రునిలోని నీరు నీవు జలకమాడు నీరు. ఇది ప్రతిదినము నీచేత ఖాళీ చేయబడుతున్నది. బ్రహ్మ మరల మరల నీకై ఆ యా వస్తువులచేత నిశ్చయముతో నింపుతున్నాడు. 

పురారాతే-రంతః పురమసి తత-స్త్వచ్చరణయోః
స్సపర్యా-మర్యాదా తరలకరణానా-మసులభా |
తథా హ్యేతే నీతాః శతమఖముఖాః సిద్ధిమతులాం
తవ ద్వారోపాంతః స్థితిభి-రణిమాద్యాభి-రమరాః || 95 ||

పురారాతే-రంతః పురమసి తత-స్త్వచ్చరణయోః=శివుని భార్యవు, అనగా పరమాత్మను భారించుదానవు నీవు. అట్టి నీ పవిత్ర చరణ,  స్సపర్యా-మర్యాదా తరలకరణానా-మసులభా = పూజాభాగ్యము చపలమనస్కు లకు కష్టతరము. 
తథా హ్యేతే శతమఖముఖాః సిద్ధిమతులాం తవ ద్వారోపాంతః స్థితిభి అణిమాద్యాభిసహి =ఈ ఇంద్రాది దేవతలు నీ ద్వారసమీపమున అణిమాది సిద్దులతో  నీతాః సిద్ధిమతులాం= అపారమైన సిద్ధులు పొందిరి.

 నీవు శివుని భార్యవు, అనగా పరమాత్మను భరించుదానవు నీవు. అట్టి నీ పవిత్ర చరణ, పూజాభాగ్యము చపలమనస్కులకు కష్టతరము. ఈ ఇంద్రాది దేవతలు నీ దయతో అణిమాది  అపారమైన సిద్ధులు పొందిరి.

కళత్రం వైధాత్రం కతికతి భజంతే న కవయః
శ్రియో దేవ్యాః కో వా న భవతి పతిః కైరపి ధనైః |
మహాదేవం హిత్వా తవ సతి సతీనా-మచరమే
కుచభ్యా-మాసంగః కురవక-తరో-రప్యసులభః || 96 ||

కళత్రం వైధాత్రం కతికతి భజంతే న కవయః= అమ్మా, విధాత సరస్వతిని, ఎందరో కవులు పూజిస్తున్నారు.   శ్రియో దేవ్యాః కో వా న భవతి పతిః కైరపి ధనైః=లక్ష్మీ దేవి ధనముచేత పురుషుడు భర్త కాకున్నాడు?   మహాదేవం హిత్వా తవ కుచభ్యాం సతి సతీనా-మచరమే-మాసంగః కురవక-తరో-రప్యసులభః =అమ్మా, సదాశివుని వదలి ఉండుట  నీ హృదయమునకు అంత తేలికకాదు.

 అమ్మా, విధాత సరస్వతిని, ఎందరో కవులు పూజిస్తున్నారు.  లక్ష్మీదేవి ధనముచేత పురుషుడు ధనపతి కాకున్నాడు? కాని అమ్మా, సదాశివుని వదలి ఉండుట  నీ హృదయమునకు అంత తేలికకాదు.
కురవక అనగా గోరంట చెట్టు.
ఎర్రగోరంట చెట్టును కురవక అంటారు.   పచ్చ గోరంట చెట్టును కురంటకము అంటారు.  నీలి గోరంట చెట్టును ఖుంటి అంటారు.
కురవక కు కుత్సితమైన ‘వ’ వాక్కు అనగా కుతర్కవాదము చేసేవాడిని కురవక అంటారు. ఎర్రటి కాషాయ వస్త్రములు ధరించి  కుతర్క వాదము చేసేవాడిని కురవక వాదము చేసేవాడని అంటారు. 
సరస్వతీదేవి అనుగ్రముతో కవి అవ్వవచ్చు. లక్ష్మీదేవి అనుగ్రముతో ధనపతి అవ్వవచ్చు. కాని జగజ్జనని అనుగ్రము కష్టతరము.
అమ్మ దయవలన చిచ్ఛక్తి పుడుతుంది.

గిరామాహు-ర్దేవీం ద్రుహిణగృహిణీ-మాగమవిదో
హరేః పత్నీం పద్మాం హరసహచరీ-మద్రితనయామ్ |
తురీయా కాపి త్వం దురధిగమ-నిస్సీమ-మహిమా
మహామాయా విశ్వం భ్రమయసి పరబ్రహ్మమహిషి || 97 ||

పరబ్రహ్మమహిషి =అమ్మా పరాశక్తి, గిరామాహు-ర్దేవీం ద్రుహిణగృహిణీ-మాగమవిదో= వేద విద్వాంసులు నిన్నే సరస్వతీ దేవిగా పూజించుదురు.  హరేః పత్నీం పద్మాం హరసహచరీ-మద్రితనయామ్= నిన్నే లక్ష్మిదేవిగా పూజించుదురు. నిన్నే పార్వతీదేవిగా పూజించుదురు.  తురీయా కాపి త్వం దురధిగమ-నిస్సీమ-మహిమా=నీవు ఆముగ్గురికంటే వేరైనదానవు. కష్టమైన హద్దులులేని మహిమలతో  మహామాయా విశ్వం భ్రమయసి = మహామాయా తత్వమగుచు విశ్వమును భ్రమింపచేస్తున్నావు.
 అమ్మా పరాశక్తి, వేద విద్వాంసులు నిన్నే సరస్వతీ దేవిగా పూజించుదురు.   నిన్నే లక్ష్మిదేవిగా పూజించుదురు. నిన్నే పార్వతీదేవిగా పూజించుదురు.   నీవు ఆముగ్గురికంటే వేరైనదానవు. కష్టమైన హద్దులులేని మహిమలతో   మహామాయా తత్వమగుచు విశ్వమును భ్రమింపచేస్తున్నావు.

కదా కాలే మాతః కథయ కలితాలక్తకరసం
పిబేయం విద్యార్థీ తవ చరణ-నిర్ణేజనజలమ్ |
ప్రకృత్యా మూకానామపి చ కవితాకారణతయా
కదా ధత్తే వాణీముఖకమల-తాంబూల-రసతామ్    98

కలితాలక్తకరసం తవ చరణ-నిర్ణేజనజలమ్ = నీ ఎఱ్ఱనిపాదములు కడిగిన ఉదకము, పిబేయం విద్యార్థీ  కదాకాలే మాతః కథయ = అమ్మా, నేను ఎప్పుడు త్రాగుదునో చెప్పుము. ప్రకృత్యా మూకానామపి చ కవితాకారణతయా= ఆ జలము మూగ చెవిటివారికి సైతము మాటలు తెప్పించి కవిత్వము చెప్పించును.  కదా ధత్తే వాణీముఖకమల-తాంబూల-రసతామ్= ఆ వాణీ భాగ్యమును నేను ఎప్పుడు నోచుకుందునో అమ్మా.

 నీ ఎఱ్ఱనిపాదములు కడిగిన ఉదకము అమ్మా, నేను ఎప్పుడు త్రాగుదునో చెప్పుము.  ఆ జలము మూగ చెవిటివారికి సైతము మాటలు తెప్పించి కవిత్వము చెప్పించును.  ఆ వాణీ భాగ్యమును నేను ఎప్పుడు నోచుకుందునో అమ్మా .
సరస్వత్యా లక్ష్మ్యా విధి హరి సపత్నో విహరతే
రతేః పాతివ్రత్యం శిథిలయతి రమ్యేణ వపుషా |
చిరం జీవన్నేవ క్షపిత-పశుపాశ-వ్యతికరః
పరానందాభిఖ్యం రసయతి రసం త్వద్భజనవాన్ || 99 ||
త్వద్భజనవాన్ = నీ భక్తుడు, సరస్వత్యా లక్ష్మ్యా విధి హరి సపత్నో విహరతే= సరస్వతీదేవిబ్రహ్మకున్నూ,  లక్ష్మీదేవికున్నూ, విష్ణువుకున్నూ, సపత్నీ సమేతులై విహరించుచున్నాడు.  రతేః పాతివ్రత్యం శిథిలయతి రమ్యేణ వపుషా =రతీదేవి పాతివ్రత్యమును తక్కువ చేయుచున్నాడు.  చిరం జీవన్నేవ క్షపిత-పశుపాశ-వ్యతికరః=విదళింపబడిన జీవుల అవిద్యా సబంధము లేనివాడై   పరానందాభిఖ్యం రసయతి రసం = పరానందసుఖమును పొందుతున్నాడు.

జగన్మాత, నీ భక్తుడు, సరస్వతీదేవి బ్రహ్మకున్నూ, లక్ష్మీదేవికున్నూ విష్ణువుకున్నూ, సమానముగా విహరించుచున్నాడు.  రతీదేవి పాతివ్రత్యమును తక్కువ చేయుచున్నాడు. జీవులలో అవిద్యా సబంధము లేనివాడవుతున్నాడు. పరమానంద సుఖమును పొందుతున్నాడు.

ప్రదీప జ్వాలాభి-ర్దివసకర-నీరాజనవిధిః
సుధాసూతే-శ్చంద్రోపల-జలలవై-రఘ్యరచనా |
స్వకీయైరంభోభిః సలిల-నిధి-సౌహిత్యకరణం
త్వదీయాభి-ర్వాగ్భి-స్తవ జనని వాచాం స్తుతిరియమ్ || 100 ||

జనని వాచాం = తల్లీ,  స్వకీయైరంభోభిః జ్వాలాభిః = తన దివిటీల జ్వాలలతో -దివసకర-నీరాజనవిధిః=సూర్యునికి  కర్పూరహారతి ఇచ్చుటవలన,  యథా స్వకీయై చంద్రోపల-జలలవై= తనవైన చంద్రకాంత శిలా జల బిందువులచేత
సుధాసూతేః అర్ఘ్యరచనా= చంద్రునికి అర్ఘ్యము సమర్పించుటయో, యథా స్వకీయైః అంభోభిః = తన జలములచేత,  హి సలిల-నిధి-సౌహిత్యకరణం=సముద్రుని తృప్తికై తర్పణముచేయుట,  తథా త్వదీయాభి-ర్వాగ్భి-స్తవ స్తుతిరియమ్=ఆ నీ వాక్కులచేత ఈ స్తోత్రము అగుచున్నది.

వాక్ప్రపంచమునకు తల్లీ, తన సంబంధము వలననే  దివిటీల జ్వాలల చేత సూర్యునికి  కర్పూరహారతి ఇచ్చుట ఎట్లో, అట్లే  తన సంబంధము చేత స్రవించు తనవైన చంద్రకాంత శిలా జల బిందువులచేత,  చంద్రునికి అర్ఘ్యము సమర్పించుట ఎట్లో అట్లే తన సముద్ర జలములచేత, సముద్రుని తృప్తికై తర్పణముచేయుట ఎట్లో అట్లే నీ అనుగ్రహము చేత ఈ స్తోత్రము నాచేత చేయబడుచున్నది.

సౌందర్యలహరి స్తోత్రం సంపూర్ణం



Comments

  1. Excellent explaination. So many doubts are getting clarified. Jaiguru.

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

Mantrapushpam with Telugu meaning మంత్రపుష్పం

49 Maruts mentioned by Sri Sri Yogiraj LahiriMahasya Maharaj

Shree vidya upaasana