రథసప్తమి:
రథసప్తమి:
జన్మరాహిత్యము పొందుటకు ఈ క్రింద తెలిపిన
సప్తజ్ఞానభూమికలు అవసరము:
1))శుభేఛ్ఛ—సేవ చేయాలనే శ్రేయస్కరమైన కోరిక,
2))అన్వేషణ—శ్రేయస్కరమైన కోరికను ఎట్లు అమలు పరచ వలయును.
3))తనుమానసి—మనసును సన్నగిల్ల చేయుట,
4))సత్యాపత్తి—సాధకుడు జ్యోతిని దర్శించుట,
5))అసంసక్తి —స్థూల చైతన్యము, సూక్ష్మ చైతన్యము నందు లయ మగుట,
6))పదార్థభావన—స్థూల, సూక్ష్మ చైతన్యములను విడనాడి తన తేజస్సును సర్వత్ర వ్యాపింప జేయుట,
7) )తురీయము—సాధకుడు స్వయముగా దేదీప్యమానముగా ప్రకాశించుట.
ఈ శరీరమును రథము అందురు. దీనిలో ఏడు చక్రములు ఉన్నవి. అవి: మూలాధార, స్వాధిష్ఠాన, మణిపుర, అనాహత, విశుద్ధ, ఆజ్ఞా, మరియు
సహస్రార.
క్రియాయోగాములో ఆత్మసూర్యుడ్ని ఈ ఏడుచక్రములలోను సాధకుడు చూడకలుగుతాడు.
సాధకుడు శుక్ల పక్ష మాఘమాసము ఉత్తరాయణములో ఎక్కువ సమయము, తీవ్రమయిన సాధనను, ఈ ఏడు రోజులు
చేయకలిగితే, ఈ తెలిపిన సప్తజ్ఞానభూమికలను అధిగమించ కలుగుతాడు. దానినే
రథసప్తమి అంటారు.
Comments
Post a Comment