Jataka Dosha nivaarinee Kriyas in Telugu
12) అనుష్ఠాన గాయత్రీ:
గాయంతం త్రాయతే ఇతి గాయత్రీ. పాడుతున్నకొలది సాధకుడ్ని రక్షించును.
ఓం = బ్రహ్మ, భూః = ప్రణవ స్వరూపము, భువః = దుఃఖనాశనం, స్వః = సుఖ స్వరూపము, తత్= ఆ, సవితుః= తేజస్సుచే, దేవస్య= దేవునియొక్క, వరేణ్యం= శ్రేష్ఠమయిన, భర్గః= పాపనాశమయినతేజ మును, ధీమహి = ధ్యానింతుము. యః = ఏదయితే,నః= మాయొక్క, దియః= బుద్ధులను, ప్రచోదయాత్=ప్రేరేపించుగాక.
ఓం భూర్భవస్వః తత్సవితర్వరేణ్యం
భర్గో దేవస్య ధీమహిధీయో యోనః ప్రచోదయాత్
ఓ బ్రహ్మ, నీవే ప్రణవ స్వరూపము, దుఃఖనాశనం, సుఖ స్వరూపము, నీ ఆ, తేజస్సుచే, దేవునియొక్క, శ్రేష్ఠమయిన, పాపనాశమయిన తేజ మును, ధ్యానింతుము. ఏదయితే, మాయొక్క, బుద్ధులను, ప్రేరేపించుగాక.
పూరకము = శ్వాసను పూరించటము లేక లోపలికి తీసుకోవటము.
అంతఃకుంభకము = శ్వాసను కూటస్థములో అట్టేపెట్టుట,
రేచకము = శ్వాసను వెలుపలికి వదులుట.
బాహ్య కుంభకము = శ్వాసను వెలుపలనే అట్టేపెట్టుట.
పూరకము, అంతఃకుంభకము, రేచకము మరియు బాహ్య కుంభకము కలిపి ఒక హంస అగును.
తూర్పు లేదా ఉత్తర దిక్కును చూస్తూ మేరుదండమును మరియు మెడను నిఠారుగా ఉంచుకొని, వజ్రాసనములో, పద్మాసనములో, లేదా సుఖాసనములో, జ్ఞానముద్ర లేదా లింగముద్ర లోగాని కూర్చుండ వలయును. కొంచెము రిలాక్స్ (Relax)అవ్వాలి. కూటస్థములో దృష్టి నిలిపి ఖేచరీ ముద్రలో ఉండాలి.
మనస్సులో గాయత్రీ మంత్రమును అనుకుంటూ దీర్ఘముగా ఒక హంస చేయాలి. పూరకము, అంతఃకుంభకము, మరియు రేచకము మూడూ సమాన ప్రతిపత్తిలో ఉండాలి. సాధకుని సామర్థ్యమును అనుసరించి బాహ్య కుంభకము ఎంత సమయమయినా చేయవచ్చు.
ఈ విధముగా హంసలు తమతమ సామర్థ్యము మరియు సమయ ముననుసరించి బాహ్య కుంభకములు ఎన్నైనా, ఎంత సమయ మయినా చేయవచ్చు.
ఇప్పుడు ‘హ హ ‘ అని రేచకములు 10 లేక 12 పర్యాయములు చేయాలి.
ఆ పిమ్మట కూటస్థములో లేక సహస్రారములో దృష్టి నిలిపి లింగ ముద్ర లేక జ్ఞానముద్ర వేసికొని ఖేచరీముద్రలో ధ్యానం చేయాలి.
13): సోహం క్రియ:
తూర్పు లేదా ఉత్తర దిక్కును చూస్తూ మేరుదండమును మరియు మెడను నిఠారుగా ఉంచుకొని, వజ్రాసనములో, పద్మాసనములో, లేదా సుఖాసనములో, జ్ఞానముద్ర లేదా లింగముద్ర లోగాని కూర్చుండ వలయును. కొంచెము రిలాక్స్ (Relax)అవ్వాలి. కూటస్థములో దృష్టి నిలిపి ఖేచరీ ముద్రలో ఉండాలి.
శ్వాస మేరుదండములోని మూలాధారచక్రములోనుండి ఆజ్ఞా పాజిటివ్ అనగా కూటస్థము వరకు వస్తున్నట్లు, తిరిగి కూటస్థమునుండి మూలాధారచక్రములోనుండి వెళ్తున్నట్లుగా భావించాలి.
దీర్ఘముగా ‘సో’ అని మనస్సులోనే అనుకుంటూ పూరకము చేయాలి. కూటస్థములో అంతఃకుంభకము చేసి శ్వాసని అట్టేపెట్టాలి. మనస్సును దృష్టిని కూటస్థములోనే నిలిపి ఉంచాలి. నిలిపి ఉంచిన ఆశ్వాస తనంతటతానే వెళ్లిపోవు వరకు వేచి ఉండాలి. వెళ్లిపోవున ప్పుడు ‘హం’ అని శ్వాసని సాగనంపాలి. వెళ్లిపోవు శ్వాసని రేచకము అంటారు. ఆ వెళ్లిపోవు శ్వాసను మనస్సు మరియు దృష్టి అనుస రించాలి. అనగా శ్వాసని గమనిస్తూ ఉండాలి. శ్వాసని బలవంతముగా అంతఃకుంభకము చేయకూడదు.
మొదటి సారిమాత్రమే కూటస్థములో అంతఃకుంభకము చేసి శ్వాసని అట్టేపెట్టాలి. ఆ తరువాతనుంచి శ్వాస తనంతట తానే రావాలి, తనంతట తానే వెళ్లిపోవాలి. పూరకములో శ్వాస ఏ చక్రము వరకు వస్తే అంతవరకే రానివ్వాలి. రేచకములో శ్వాస ఏ చక్రము వరకు వెళ్తే అంతవరకే పోనివ్వాలి.
ఇట్లా శ్వాసని గమనిస్తున్నప్పుడు మనస్సు అంతర్ముఖమై సమాధి లభ్య మయిన ఆనందించాలి.
ఆ పిమ్మట కూటస్థములో లేక సహస్రారములో దృష్టి నిలిపి లింగ ముద్ర లేక జ్ఞానముద్ర వేసికొని ఖేచరీముద్రలో ధ్యానం చేయాలి.
14) ఓంకారాన్ని వినుట:
తూర్పు లేదా ఉత్తర దిక్కును చూస్తూ మేరుదండమును మరియు మెడను నిఠారుగా ఉంచుకొని, వజ్రాసనములో, పద్మాసనములో, లేదా సుఖాసనములో, జ్ఞానముద్ర లేదా లింగముద్ర లోగాని కూర్చుండ వలయును. కొంచెము రిలాక్స్ (Relax)అవ్వాలి. కూటస్థములో దృష్టి నిలిపి ఖేచరీ ముద్రలో ఉండాలి.
రెండు కళ్ళు, రెండు చెవులు, రెండు ముక్కులు, రెండు పెదవులు రెండు చేతుల వ్రేళ్ళతో మూసివేయాలి. దీనినే జ్యోతిముద్ర అంటారు.
దీర్ఘముగా ‘ఓం’ అని మనస్సులోనే అనుకుంటూ పూరకము చేయాలి. శ్వాసని బలవంతముగా తన సామర్థ్యమును బట్టి అంతఃకుంభకము చేసి నిలిపి ఉంచాలి.. మనస్సును దృష్టిని కూటస్థములోనే నిలిపి ఉంచాలి.
వెళ్లిపోవున ప్పుడు ‘ఓం’ అని పంపాలి. శ్వాసని బలవంతముగా తన సామర్థ్యమును బట్టి బాహ్యకుంభకము చేసి నిలిపి ఉంచాలి.. మనస్సును దృష్టిని కూటస్థములోనే నిలిపి ఉంచాలి.
తలలో ఓంకారాన్ని వినుటకు ప్రయత్నించండి. ఓంకారము వినబడితే ఓంకారముతో, లేదా ఏ శబ్దము స్పష్టముగావినబడితే ఆ శబ్దముతో మమైకమవ్వండి.
జాతక దోష నివారిణీ క్రియలు:
సహస్రార(రవి)
కుంభం
|
ఆజ్ఞా(బుధ)
|
మీనం
|
ధనుస్సు
|
విశుద్ధ(శుక్ర)
|
మకరం
|
తుల
|
అనాహత(చంద్ర)
|
వృశ్చికం
|
సింహ
|
మణిపుర(కుజ)
|
కన్య
|
మిథునం
|
స్వాధిష్ఠాన(గురు)
|
కటకం
|
మేషం
|
మూలాధార(శని)
|
వృషభం
|
1)కాలసర్పదోషము:
మేషాది రాశులలో రాహు కేతువులు స్థితులై, ఆ రాహు కేతు గ్రహముల మధ్యలో ప్రదక్షిణ పద్ధతిన గమనించిన మిగతా గ్రహములు ఉన్నచో, దానిని కాలసర్పదోషము అందురు.
అట్లు గాక మీనాది రాశులలో రాహు కేతువులు స్థితులై, ఆ రాహు కేతు గ్రహముల మధ్యలో అప్రదక్షిణ పద్ధతిన గమనించిన మిగతా గ్రహములు ఉన్నచో, దానిని విపరీత కాలసర్పదోషము అందురు.
తూర్పు లేదా ఉత్తర దిక్కును చూస్తూ మేరుదండమును మరియు మెడను నిఠారుగా ఉంచుకొని, వజ్రాసనములో, పద్మాసనములో, లేదా సుఖాసనములో, జ్ఞానముద్ర లేదా లింగముద్ర లోగాని కూర్చుండ వలయును. కొంచెము రిలాక్స్ (Relax)అవ్వాలి. కూటస్థములో దృష్టి నిలిపి ఖేచరీ ముద్రలో ఉండాలి.
మూలాధారము నుండి సహస్రారము వరకు మూలాధారచక్రములో 4 మారులు, స్వాధిష్ఠానచక్రములో 6 మారులు, మణిపుర చక్రములో 10 మారులు, అనాహత చక్రములో 12 మారులు, విశుద్ధ చక్రములో 16 మారులు, ఆజ్ఞానెగటివ్ చక్రములో18 మారులు, ఆజ్ఞాపాజిటివ్ చక్రములో 20 మారులు, మరియు సహస్రార చక్రములో 21 మారులు, అంతః కుంభకము మరియు బాహ్య కుంభకము చేయాలి.
ఇప్పుడు లింగముద్ర వేయవలయును. సహస్రారచక్రమును టెన్స్ (Tense) చేయాలి. ‘రాం’108 సార్లు ఉచ్ఛరించాలి. ‘రాం’ అనే బీజాక్షర ధ్యానము చేయాలి. ఇలా ఉదయము మరియు సాయంత్రము ముఖ్యముగా సంధ్యా సమయములో 41 దినములు చేస్తే ఈ దోషము తొలగును.
2)గురు దోషము:
గురుదోషము వలన వివాహ మరియు విద్యా విషయములో సమస్యలు వస్తాయి.
తూర్పు లేదా ఉత్తర దిక్కును చూస్తూ మేరుదండమును మరియు మెడను నిఠారుగా ఉంచుకొని, వజ్రాసనములో, పద్మాసనములో, లేదా సుఖాసనములో, జ్ఞానముద్ర లేదా లింగముద్ర లోగాని కూర్చుండ వలయును. కొంచెము రిలాక్స్ (Relax)అవ్వాలి. కూటస్థములో దృష్టి నిలిపి ఖేచరీ ముద్రలో ఉండాలి.
మూలాధారము నుండి సహస్రారము వరకు మూలాధారచక్రములో 4 మారులు, స్వాధిష్ఠానచక్రములో 6 మారులు, మణిపుర చక్రములో 10 మారులు, అనాహత చక్రములో 12 మారులు, విశుద్ధ చక్రములో 16 మారులు, ఆజ్ఞానెగటివ్ చక్రములో18 మారులు, ఆజ్ఞాపాజిటివ్ చక్రములో 20 మారులు, మరియు సహస్రార చక్రములో 21 మారులు, అంతః కుంభకము మరియు బాహ్య కుంభకము చేయాలి.
ఇప్పుడు స్వాధిష్ఠానచక్రమును టెన్స్ (Tense) చేయాలి. లింగముద్ర వేయవలయును. ‘వం’ 108 సార్లు ఉచ్ఛరించాలి. ‘వం’ అనే బీజాక్షర ధ్యానము చేయాలి. ఇలా ఉదయము మరియు సాయంత్రము ముఖ్యముగా సంధ్యా సమయములో 41 దినములు చేస్తే ఈ దోషము తొలగును.
3) శుక్రదోషము:
శుక్రదోషము వలన సంతానలోపము, సంసారములో కలతలు, కలహములు మరియు వీర్యలోపములు వస్తాయి.
తూర్పు లేదా ఉత్తర దిక్కును చూస్తూ మేరుదండమును మరియు మెడను నిఠారుగా ఉంచుకొని, వజ్రాసనములో, పద్మాసనములో, లేదా సుఖాసనములో, జ్ఞానముద్ర లేదా లింగముద్ర లోగాని కూర్చుండ వలయును. కొంచెము రిలాక్స్ (Relax)అవ్వాలి. కూటస్థములో దృష్టి నిలిపి ఖేచరీ ముద్రలో ఉండాలి.
మూలాధారము నుండి సహస్రారము వరకు మూలాధారచక్రములో 4 మారులు, స్వాధిష్ఠానచక్రములో 6 మారులు, మణిపుర చక్రములో 10 మారులు, అనాహత చక్రములో 12 మారులు, విశుద్ధ చక్రములో 16 మారులు, ఆజ్ఞానెగటివ్ చక్రములో18 మారులు, ఆజ్ఞాపాజిటివ్ చక్రములో 20 మారులు, మరియు సహస్రార చక్రములో 21 మారులు, అంతః కుంభకము మరియు బాహ్య కుంభకము చేయాలి.
ఇప్పుడు విశుద్ధ చక్రమును టెన్స్ (Tense) చేయాలి. శూన్యముద్ర వేయవలయును.‘హం’108 సార్లు ఉచ్ఛరించాలి. ‘హం’ అనే బీజాక్షర ధ్యానము చేయాలి. ఇలా ఉదయము మరియు సాయంత్రము ముఖ్యముగా సంధ్యా సమయములో 41 దినములు చేస్తే ఈ దోషము తొలగును.
4) చంద్రదోషము:
చంద్రదోషమువలన మానసికమైన, వాణిజ్యపరమైన మరియు ఉద్యోగ పరమైన సమస్యలు వస్తాయి.
తూర్పు లేదా ఉత్తర దిక్కును చూస్తూ మేరుదండమును మరియు మెడను నిఠారుగా ఉంచుకొని, వజ్రాసనములో, పద్మాసనములో, లేదా సుఖాసనములో, జ్ఞానముద్ర లేదా లింగముద్ర లోగాని కూర్చుండ వలయును. కొంచెము రిలాక్స్ (Relax)అవ్వాలి. కూటస్థములో దృష్టి నిలిపి ఖేచరీ ముద్రలో ఉండాలి.
మూలాధారము నుండి సహస్రారము వరకు మూలాధారచక్రములో 4 మారులు, స్వాధిష్ఠానచక్రములో 6 మారులు, మణిపుర చక్రములో 10 మారులు, అనాహత చక్రములో 12 మారులు, విశుద్ధ చక్రములో 16 మారులు, ఆజ్ఞానెగటివ్ చక్రములో18 మారులు, ఆజ్ఞాపాజిటివ్ చక్రములో 20 మారులు, మరియు సహస్రార చక్రములో 21 మారులు, అంతః కుంభకము మరియు బాహ్య కుంభకము చేయాలి.
ఇప్పుడు అనాహతచక్రమును టెన్స్ (Tense) చేయాలి. వాయుముద్ర వేయ వలయును.‘యం’108 సార్లు ఉచ్ఛరించాలి. ‘యం’ అనే బీజాక్షరధ్యానము చేయాలి. ఇలా ఉదయము మరియు సాయంత్రము ముఖ్యముగా సంధ్యా సమయములో 41 దినములు చేస్తే ఈ దోషము తొలగును.
5) శనిదోషము:
శనిదోషమువలన దరిద్రము, ఇంటిపోరు, కష్టాలు, మానహాని మరియు వ్యవహార విషయములో సమస్యలు వస్తాయి.
తూర్పు లేదా ఉత్తర దిక్కును చూస్తూ మేరుదండమును మరియు మెడను నిఠారుగా ఉంచుకొని, వజ్రాసనములో, పద్మాసనములో, లేదా సుఖాసనములో, జ్ఞానముద్ర లేదా లింగముద్ర లోగాని కూర్చుండ వలయును. కొంచెము రిలాక్స్ (Relax)అవ్వాలి. కూటస్థములో దృష్టి నిలిపి ఖేచరీ ముద్రలో ఉండాలి.
మూలాధారము నుండి సహస్రారము వరకు మూలాధారచక్రములో 4 మారులు, స్వాధిష్ఠానచక్రములో 6 మారులు, మణిపుర చక్రములో 10 మారులు, అనాహత చక్రములో 12 మారులు, విశుద్ధ చక్రములో 16 మారులు, ఆజ్ఞానెగటివ్ చక్రములో18 మారులు, ఆజ్ఞాపాజిటివ్ చక్రములో 20 మారులు, మరియు సహస్రార చక్రములో 21 మారులు, అంతః కుంభకము మరియు బాహ్య కుంభకము చేయాలి.
ఇప్పుడు మూలాధార చక్రమును టెన్స్ (Tense) చేయాలి. పృథ్వీముద్ర వేయవలయును. ‘లం’ 108 సార్లు ఉచ్ఛరించాలి. ‘లం’ అనే బీజాక్షరధ్యానము చేయాలి. ఇలా ఉదయము మరియు సాయంత్రము ముఖ్యముగా సంధ్యా సమయములో 41 దినములు చేస్తే ఈ దోషము తొలగును.
6)కుజ దోషము:
కుజదోషమువలన శత్రువుల వలననూ, స్వయంకృతాపరాధము వలననూ, సమస్యలు వస్తాయి.
తూర్పు లేదా ఉత్తర దిక్కును చూస్తూ మేరుదండమును మరియు మెడను నిఠారుగా ఉంచుకొని, వజ్రాసనములో, పద్మాసనములో, లేదా సుఖాసనములో, జ్ఞానముద్ర లేదా లింగముద్ర లోగాని కూర్చుండ వలయును. కొంచెము రిలాక్స్ (Relax)అవ్వాలి. కూటస్థములో దృష్టి నిలిపి ఖేచరీ ముద్రలో ఉండాలి.
మూలాధారము నుండి సహస్రారము వరకు మూలాధారచక్రములో 4 మారులు, స్వాధిష్ఠానచక్రములో 6 మారులు, మణిపుర చక్రములో 10 మారులు, అనాహత చక్రములో 12 మారులు, విశుద్ధ చక్రములో 16 మారులు, ఆజ్ఞానెగటివ్ చక్రములో18 మారులు, ఆజ్ఞాపాజిటివ్ చక్రములో 20 మారులు, మరియు సహస్రార చక్రములో 21 మారులు, అంతః కుంభకము మరియు బాహ్య కుంభకము చేయాలి.
ఇప్పుడు మణిపుర చక్రమును టెన్స్ (Tense) చేయాలి. శూన్యముద్ర వేయ వలయును.‘హం’108 సార్లు ఉచ్ఛరించాలి. ‘రం’ అనే బీజాక్షరధ్యానము చేయాలి. ఇలా ఉదయము మరియు సాయంత్రము ముఖ్యముగా సంధ్యా సమయములో 41 దినములు చేస్తే ఈ దోషము తొలగును.
7) రవిదోషము:
రవిదోషము వలన విద్యా,, ఆధ్యాత్మిక శూన్యత లేక న్యూనత మరియు ఆర్థికపరమైన విషయములో సమస్యలు వస్తాయి.
తూర్పు లేదా ఉత్తర దిక్కును చూస్తూ మేరుదండమును మరియు మెడను నిఠారుగా ఉంచుకొని, వజ్రాసనములో, పద్మాసనములో, లేదా సుఖాసనములో, జ్ఞానముద్ర లేదా లింగముద్ర లోగాని కూర్చుండ వలయును. కొంచెము రిలాక్స్ (Relax)అవ్వాలి. కూటస్థములో దృష్టి నిలిపి ఖేచరీ ముద్రలో ఉండాలి.
మూలాధారము నుండి సహస్రారము వరకు మూలాధారచక్రములో 4 మారులు, స్వాధిష్ఠానచక్రములో 6 మారులు, మణిపుర చక్రములో 10 మారులు, అనాహత చక్రములో 12 మారులు, విశుద్ధ చక్రములో 16 మారులు, ఆజ్ఞానెగటివ్ చక్రములో18 మారులు, ఆజ్ఞాపాజిటివ్ చక్రములో 20 మారులు, మరియు సహస్రార చక్రములో 21 మారులు, అంతః కుంభకము మరియు బాహ్య కుంభకము చేయాలి.
ఇప్పుడు సహస్రార చక్రమును టెన్స్ (Tense) చేయాలి. అగ్నిముద్ర వేయ వలయును. ‘రాం’ 108 సార్లు ఉచ్ఛరించాలి. ‘రాం’ అనే బీజాక్షరధ్యానము చేయాలి. ఇలా ఉదయము మరియు సాయంత్రము ముఖ్యముగా సంధ్యా సమయములో 41 దినములు చేస్తే ఈ దోషము తొలగును.
8) బుధ దోషము:
బుధదోషము వలన విద్యా, వ్యాపార విషయములో మరియు వాచాలత వలననూ సమస్యలు వస్తాయి.
తూర్పు లేదా ఉత్తర దిక్కును చూస్తూ మేరుదండమును మరియు మెడను నిఠారుగా ఉంచుకొని, వజ్రాసనములో, పద్మాసనములో, లేదా సుఖాసనములో, జ్ఞానముద్ర లేదా లింగముద్ర లోగాని కూర్చుండ వలయును. కొంచెము రిలాక్స్ (Relax)అవ్వాలి. కూటస్థములో దృష్టి నిలిపి ఖేచరీ ముద్రలో ఉండాలి.
మూలాధారము నుండి సహస్రారము వరకు మూలాధారచక్రములో 4 మారులు, స్వాధిష్ఠానచక్రములో 6 మారులు, మణిపుర చక్రములో 10 మారులు, అనాహత చక్రములో 12 మారులు, విశుద్ధ చక్రములో 16 మారులు, ఆజ్ఞానెగటివ్ చక్రములో18 మారులు, ఆజ్ఞాపాజిటివ్ చక్రములో 20 మారులు, మరియు సహస్రార చక్రములో 21 మారులు, అంతః కుంభకము మరియు బాహ్య కుంభకము చేయాలి.
ఇప్పుడు ఆజ్ఞాపాజిటివ్ చక్రమును టెన్స్ (Tense) చేయాలి. జ్ఞానముద్ర వేయ వలయును.‘ఓం’108 సార్లు ఉచ్ఛరించాలి. ‘ఓం’ అనే బీజాక్షర ధ్యానము చేయాలి. ఇలా ఉదయము మరియు సాయంత్రము ముఖ్యముగా సంధ్యా సమయములో 41 దినములు చేస్తే ఈ దోషము తొలగును.
Comments
Post a Comment