5. సుందరకాండ -- రామాయణం
5.
సుందరకాండ
స సూర్యాయ మేహేంద్రాయ పవనాయ స్వయంభువే
భూతేభ్యశ్చాఞ్జలిం కృత్వా చకార గమనే మతిం 01
తదుపరి హనుమంతుడు సూర్యునకు, ఇంద్రునకు, వాయుదేవునకు, బ్రహ్మదేవునకు, భూతములకు
చేతులు జోడించి నమస్కరించి సముద్రముయొక్క ఆవలితీరమునకు పోవుటకు నిశ్చయించెను.
పిమ్మట తూర్పుకు తిరిగి తనతండ్రిఅయిన వాయుదేవునకు నమస్కరించెను. తరువాత కార్యశీలుడగు హనుమంతుడు దక్షిణదిక్కునకు
వెళ్ళుటకు తన శరీరమును పెంచదొడంగెను. తనను
తాను గరుత్మంతుడితో సమానముగా తలచెను.
అప్పుడు ఆకాశామందున్న హనుమంతునితో ఆకాశామందున్న మైనాకపర్వతము ప్రసన్నచిత్తుడై
మనుష్యరూపము ధరించి తన శిఖరమునుండి ఇట్లు పలికెను. శ్రీరాముని పూర్వీకులు
సముద్రమును వృద్ధి చేసిరి. ఇప్పుడు నీవు
వారి బాటలోనే నడుస్తున్నావు. కావున
సముద్రుడు నీకు నమస్కరించుచున్నాడు.
కృతేచ ప్రతికర్తవ్యమేష ధర్మః సనాతనః
సోయం తత్ ప్రతికారార్థీ త్వత్తః సమ్మానమర్హతి 2
మనసనాతనధర్మము ప్రకారము ఉపకారికి ప్రత్యుపకారముచేయుట మన ధర్మము. ఇట్టి దృష్టి చే సముద్రుని ప్రత్యుపకారమును
గ్రహింపుడు.
అతిథిః కిలపూజార్హః ప్రాకృతోపి విజానతా
ధర్మం జిజ్ఞాసమానేన కిం పునర్యాదృశో భవాన్ 3
ధర్మ జిజ్ఞాసువులగు విజ్ఞులచే ఒక సామాన్యుడగు అతిథియు నిశ్చయముగా గౌరవించదగినవాడేయని
తలంచబడుచున్నాడు. ఇక నీవంటి అసాథారణమైన సౌర్యశాలివిషయమైన అతిథి విషయమై
ప్రత్యేకముగా చెప్పవలయునా?
మైనాకపర్వతము ఇట్లువచింపగా, కపిశ్రేష్ఠుడగు హనుమంతుడు ఇట్లు చెప్పెను. ఓ
మైనాకా, నిన్ను కలవటం నాకు అమితమైన సంతోషము కలుగచేసినది. నాకు ఆతిథ్యము పూర్తి అయినది. నీ ఆతిథ్యము గురించి చింతను వదిలిపెట్టుము.
నేను శీఘ్రముగా పోవలెను. నేను మధ్యలో ఎక్కడా
ఆగనని ప్రతిజ్ఞ చేసితిని. హనుమంతుడి మైనాకుని చేతితో నవ్వుతూ త్రాకి ఆకాశామార్గమున
ఎగిరిపోసాగేను. అటుపిమ్మట దేవతలు,
గంధర్వులు, సిద్ధులు, మహర్షులు సూర్యునివలె తెజస్వినియగు నాగామాతయైన సురాసతో ఇట్లు
చెప్పిరి. నీవు పర్వతమువలె మహాభయంకరమైన
రూపమును ధరింపుము., మేము హనుమంతుని ధైర్యమును
బలమును పరీక్షించెదము. అప్పుడు నిన్ను జయించునా లేక విచారములో పడునా అని పరీక్షించెదము.
దేవతలు ఇట్లు వచింపగా సురసాదేవి సముద్రమధ్యమున రాక్షసి రూపమును ధరించి నిలిచెను. ఆమె
రూపము మహావికృతముగాను, భయంకరముగాను ఉండెను.
ఆమె సముద్రమును దాటుచున్న హనుమంతుని అడ్డగించెను. రాక్షసరూపము ధరించిన సరసాదేవి హనుమంతునితో
ఇట్లనెను. నిన్ను భక్షించెదను. నా నోటియండు
ప్రవేశింపుము. సురస హనుమంతునితో ఇట్లు వచింపగా అప్పుడు బొనవ్రేలంత అంగుష్టము రూపమును
ధరించి హనుమంతుడు దాని నోటిద్వార ఉదరములో ప్రవేశించెను. వె౦టనె బయటికివచ్చి సురసతో ఇట్లనెను.
దక్షకుమారి, నీ నోటియందు ప్రవేశించి నీ కోరికతీర్చితిని. ఇప్పుడు వైదేహి కొరకు
వెళ్తున్నాను. నమస్కారము అని చెప్పి తన కార్యమునకై వెళ్ళుచుండెను. అప్పుడు సింహిక చూచి ఇట్లనుకొనెను. చాలా కాలముతరువాత పెద్దజీవిని భక్షించే అవకాశము
నాకు లభించినది దీనిని వదులుకొనగూడదు అని అనుకొనెను. అప్పుడు హనుమంతుడు తన శరీరమును చిన్నదిచేసి
దాని ముఖములో ప్రవేశించెను. తనతీక్షణమైన
నఖములతో ఆ రాక్షసి సింహిక యొక్క మర్మాంగములను చీల్చి బయటికి వచ్చెను. ఆ సింహిక
నీటిలో పడి చచ్చిపోవుటనుజూచి ఆకాశమున సంచరించు ప్రాణులు కపిశ్రేష్ఠునితో యిట్లనిరి.
యస్య త్వేతాని చత్వారి వానరేంద్ర యథాతవ
ధృతిర్దృష్టిః మతిర్దాక్ష్యం స కర్మసు న సీదతి 4
ఓ, వానరశ్రేష్ఠ, ఎవనియందు మీలోవలె ధైర్యం, వివేకము, ముందుచూపు, బుద్దికౌసల్యము—ఈ
నాలుగు గుణములు ఉండునో, అతడు తనకార్యమందు ఎన్నడు అసఫలత పొందడు. ఇది నిశ్చయము.
ఆకాశమార్గమున ఎగురుతూ పోతున్న ఆంజనేయుడు అంతటా వివిధవృక్షములతొ సుశొభితమైన
లంకా పట్టణమును చూచెను. ఉత్తరమందువలె, దక్షిణమందుగూడ మలయపర్వతమున్ను దాని
ఉపవనములున్ను గోచరించెను. అప్పుడు
మనస్వియగు హనుమంతుడు తనమనస్సును వశమందుంచుకొనేను.
తన ఆకారమును చిన్నది చేసికోనేను. హనుమంతుడు అంతట అలంఘనీయమగు సముద్రమును
దాటివేసెను. త్రికూటము అను పర్వతశిఖరముపైన
స్థిరముగా కూచుండి లంకా పట్టణశోభను
వీక్షించుచుండెను.
యోజనానాం శతం శ్రీమాం స్తీర్త్వా
వ్యుత్తమ విక్రమః
అనిఃశ్వసన్ కపిస్తత్ర న గ్లానిమధిగచ్ఛతి. 5
ఉత్తమ పరాక్రమశాలియైన హనుమంతుడు నూరు యోజనముల సముద్రమును దాటెను. ఒక్క
క్షణమైనను విశ్రాంతి తీసుకొనలేదు. మరియు క్లేశమును అనుభవించలేదు. అతని కార్యదక్షత
అట్టిది.
శతాన్యహం యోజనానాం క్రమేయం సుబహూన్యాపి
కిం పునః సాగరస్యాంతం సంఖ్యాతం శతయోజనం 6
హనుమంతుడు ఇట్లనుకొనేను: నేను
వందలకొద్దీ యోజనముల వైశాల్యముగల పెక్కు సాగరములను దాటగలను. ఇక స్వల్పమైన నూరు
యోజనముల సముద్రమును దాటుట నాకొక లెక్కలోనిది కాదు.
ఆ లంకా నగరమున పెద్ద భవంతులు, సముద్రము, రావణుని వంటి శత్రువు,--వీరిని
గురించి ఆంజనేయుడు ఇట్లు తలంచెను.
చతుర్ణామేవ హి గతిర్వానరాణాం తరస్వినాం
వాలిపుత్రస్య నీలస్య మమ రాజ్ఞశ్చ ధీమతః 7
ఇక్కడికి నలుగురు వేగశాలురగు వానరులు మాత్రమె చేరగలరు. వారు వాలి పుత్రుడగు
అంగదుడు, నీలుడు, నేను, మరియు సుగ్రీవుడు.
ఇప్పడు నేను రావణుని కంట పడకుండా సీతమ్మను కలిసే ఉపాయము ఆలోచించ వలయును.
భూతాశ్చార్థా వినశ్యంతి దేశకాలవిరోధితాః
విక్లవం దూతమాసాద్య తమః సూర్యోదయే యథా 8
బుద్ధిహీనమైన కార్యమును చేయు దూతచేతిలో పడుట వలన అనేకమార్లు దేశకాలముల విపరీత
వ్యవహారము సంభవించుటవలన అనేకమారులు సూర్యోదయంచే చీకటి వలె నశించిపోవును.
అర్థానర్థాన్తరే బుద్ధిర్నిశ్చితాపి న శోభతే
ఘాతయంతీ హ కార్యాణి దూతాః పండిత మానినః 9
రాజు, మంత్రులు వీరు బాగాక్ నిశ్చయించి కర్వాకర్తవ్య విచారణ అవివేకియినా
దూతచేతిలో పెట్టరు, పెట్టకూడదు. అట్లు చేయుటవలన ఆ కార్యము శోబించదు. దూత తననుతాను పండితుడని తలంచకూడదు. జాగ్రత్తగా మెలగవలెను
లేనియడల బూడిదపాలు అగును.
తదహం స్వేన రూపేణ రజన్యాం హ్రస్వతాం గతః
లంకామ్ అభిపతిష్యామి రాఘవస్యార్థ సిద్ధయే 10
కావున నేను శ్రీరామకార్య సిద్ధికొరకై రాత్రియందు చిన్నశరీరమును ధరియించుదును.
లంకయందు ప్రవేశించెదును.
ఈ ప్రకారముగా తలంచి పవనకుమారుడు హనుమంతుడు సూర్యాస్థమయము కాగానే రాత్రియందు
చిన్నశరీరము ధరించెను. ఆ నగరియొక్క అధిష్టాత్రి అయిన లంకాదేవి తన స్వాభావిక రూపమున
ప్రకటితమయ్యెను. ఆమె హనుమంతునిచూచెను.
అప్పుడామే భీకర ఘర్జనచేసి హనుమంతుడ్ని బలముగా కొట్టెను. హనుమంతుడికి
కోపమువచ్చి తన ఎడమచేతి పిడికిలిబిగించి ఆమెను బలముగా కొట్టెను.
స్త్రీ చేతి మన్యమానేన నాతిక్రోధః స్వయం కృతః
సా తు తేన ప్రహారేణ విహ్వలాంగీ నిశాచరీ
పపాత సహసా భూమౌ వికృతానన దర్శనా 11
లంకాదేవిని స్త్రీ అని తలచి హనుమంతునకు వలసినంత క్రోధము కలుగలేదు. ఆ చిన్న దేబ్బచేతనే ఆమె అంగములన్నియు
విహ్వలంగాఅయ్యెను. ఆమె వెంటనే భూమి పై పడెను.
అప్పుడు ఆమె ముఖము మహా వికృతముగా కన్పట్టెను.
స నిర్జిత్య పురీం లంకాం శ్రేష్ఠాం తాం కామ రూపిణీం
విక్రమేణ మహాతేజా హనుమాన్ కపిసత్తమః 12
ఆద్వారేణ మహావీర్యః ప్రకారమవ పుప్లువే
నిశి లంకాం మహాసత్వో వివేశ కపికుఞ్ఙరః
13
ఇచ్ఛానుసారము రూపమును ధరించగలదు ఆ రాక్షసి.
ఆ రాక్షసిని తన పరాక్ర మముతో ఓడించెను హనుమంతుడు. అటుపిమ్మట మహాతేజస్వియు,
మహాబలశాలి, మహా సత్వశాలియును, వానరశిరోమణి, కపిశ్రేష్ఠుడును అగు హనుమంతుడు రాత్రి
యందు ప్రవేశించే ద్వారమును ఆశ్రయించలేదు. అందుకు బదులుగా ప్రాకారమును యెగిరి దూకి
లంకా పట్టణము లోపలి ప్రవేశించెను.
శుశ్రావ జపతాం తత్ర మంత్రాన్ రక్షో గృహేషు వై
స్వాధ్యాయ నిరత శ్చైవ యాతు ధానాన్ దదర్శ సః 14
రాక్షసుల ఇళ్ళయండు పెక్కురు మంత్రములను జపియించుట అతడు వినెను. మరియు అనేక రాక్షసులు స్వాధ్యాయమందు
నిమగ్నులైయుండుటనుకూడా గాంచెను.
హనుమంతుడు రాక్షసుల నివాస స్థానములను పరీక్షించెను. అక్కడినుండి రావణుని
నివాసగ్రుహమందు ప్రవేశించెను. కొంతమంది
రాక్షు యువతులు నిండుగా ఆభరణములు పెట్టుకొనుటయు గాంచెను. కొంతమంది తలక్రింద అందమైన వస్త్రములను
పెట్టుకొని నిద్రించుచుండిరి. ఆ
స్త్రీలందరినీ రావణుడు అపహరించి తెచ్చెను. కొంతమంది స్త్రీలు రావణునిపై మోహము
కామములచే స్వయముగా వచ్సియుండిరి. వారందరి
మధ్య రాక్షసరాజగు రావణుడు గోశాలయండు శ్రేష్ఠగోవులమధ్య నిద్రించుచుండెను.
కామం దృష్టామయా సర్వా విశ్వస్తా రావణ స్త్రియః
న తు మే మనసా కించిద్ వైకృత్య ముపపద్యతే 15
అదియంతయు పరికించి చూచి హనుమంతుడిట్లు అనుకొనెను. రావణుని స్త్రిలు నిశ్శంకగా నిద్రించుచున్నారు.
ఇందులో సందేహము ఏ మాత్రము లేదు. వారిని చూసిన నాకు మనస్సులో ఏ వికారముకూడా
కలుగుటలేదు.
మనోహి హేతుః సర్వేషాం ఇంద్రియాణాం ప్రవర్తన్తే
శుభాశుభా స్వవస్థాసు తచ్చ మే సువ్యవస్థతం 16
మనస్సే ఇంద్రియమ లన్నిటినీ శుభ అశుభ అవస్థలయందు ప్రేరేపించును. మనస్సే
అన్నింటికీ మూలకారణము. కాని నామనస్సు పూర్ణముగా స్థిరమైయున్నది. నా మనస్సుకి రాగ ద్వేషములు రెండును లేవు.
ఆ రాజభావనమందున్న హనుమంతుడు సీతమ్మ దర్శనముకొరకై ఆతృత పడుతుండెను. అక్కడినుండి అన్నిగృహములందు వెతకసాగెను. కాని సీతమ్మ దర్శనము కాకుండెను.
అనిర్వేదః శ్రియో మూలమనిర్వేదః పరం సుఖం
భూయస్తత్ర విచేష్యామి న యత్ర విచయః కృతః 17
అప్పుడు హనుమంతుడు కొంత నిరాశచెందెను. తిరిగి ఇట్లు ఆలోచించెను. ఉత్సాహమే సంపత్తికి
మూలకారణము. ఉత్సాహమే సుఖమునకు హేతువు. కావున నేను ఇంతకు ముందర చూడని ప్రదేశములయందు
సీతమ్మ కొరకై జాగరూకతతో వెదకెదను.
అనిర్వేదో హి సతతం సర్వార్థేషు ప్రవర్తకః
కరోతి సఫలం జంతోః కర్మ యచ్చ కరోతి సః 18
ఉత్సాహమే ప్రాణులను సర్వదా సర్వ కర్మల యందును ప్రతిష్టితము చేయును. మరియు
అదియే వారు వారు చేయు కర్మలయందు సాఫల్యము చేకూర్చును.
తస్మాదనిర్వేదకరం యత్నం చేష్టే హ ముత్తమం
అదృష్టాంశ్చ విచేష్యామి దేశాన్ రావణ పాలితాన్ 19
కనుక ఇప్పుడు నేను ఇంకను ఉత్సాహపూర్వకమైన ప్రయత్నము చేసెదను. రావణునిచే
సురక్షితములైనవి, గూఢముగా అట్టెపెట్టినవి అగు ప్రదేశములను వెదకెదను అని
నిశ్చయించుకొనెను.
యావత్ సీతాం న పశ్యామి రామపత్నీం యశస్వినీం
తావదేతాం పురీం లంకాం విచినోమి పునః పునః 20
యశస్వినీ, శ్రీరామచంద్రుని పత్నియగు సీతమ్మ జాడ తెలిసేటంతవరకు ఈ లంకాపురియంతయు జల్లెడ పట్టెదను. ఆమె
కనబడేటంతవరకు వదిలేదిలేదు. అని అనుకొనెను హనుమంతుడు.
మహాతేజస్వి అగు హనుమంతుడు ఒక ముహూర్తకాలము ఆలోచన జరిపెను. సీతాదేవిని ధ్యానించి హనుమంతుడు రావణుని భవనమునుండి
దూకి ఆశోక వాటికయందు ప్రవేశించెను. అక్కడ
రాక్షసస్త్రీలతో చుట్టబడియున్న ఒక అత్యంతసుందర స్త్రీని చూచెను. ఆమె ఉపవాసములు చేయుటవలన మహాదుర్బలముగా దీనముగా
ఉండెను. ఈమె సీతమ్మ అయి ఉండవచ్చు అని నిశ్చయించుకొనెను. అశోక వనములోని ఒక వృక్షముయొక్క
ఆకులమధ్యములో కూర్చొని గమనిస్తూ ఉండెను. ఇంతలోకే రావణాసురుడు వచ్చెను. సీతమ్మతో ఇట్లు మాట్లాడ దొడంగెను. సీతా, నిన్ను
అపేక్షించుచున్నాను. సుందరీ, నీవు నన్ను విశేషముగా ఆదరింపుము. నా ప్రార్థనను
స్వీకరింపుము. నీవు నన్ను నీవు స్వయముగా కోరనంతవరకు నిన్ను నీ శరీరమును స్పృశించను.
త్వం కృత్వోపరతో మన్యే రూపకర్తా స విశ్వకృత్
న హిరూపోసమా హ్యన్యాతవాస్తి శుభదర్శనే 21
శుభదర్శనా, రూపకర్త అయిన బ్రహ్మదేవుడు నిన్ను సృష్టించిన పిమ్మట విరక్తిపొంది ఉంటాడు.
. అట్లాగా నేను అనుకుంటున్నాను. ఎందుకంటె నీతో సమానమైన రూపముగల స్త్రీని అందుకనే
ఆయన సృశించలేకపోయాడు.
సీతా, కుబేరుని అత్యుత్తమ రత్నములు, ధనము మరియు సమస్త లోకములను నాతోడ అనుభవించెదవు.
దుఃఖార్తా రుదతీ సీతా వేపమానా తపస్వినీ
చిన్తయంతీ వరారోహ పతిమేవ పతివ్రతా 22
అటు పిమ్మట సుందరమైన అంగములతో కూడినదియు, పతివ్రతయు, తపస్విని అగు సీతమ్మ
దుఃఖముతో కూడి ఏడ్చుచుండెను. భయముతో వణుకుచుండెను. మరియు తనపతిదేవునే స్మరించుచుండెను.
అంతట పవిత్రమూర్తియగు వైదేహి తనక్ రావణునికి మధ్యలో గడ్డిపరకను అట్టెపెట్టుకొనేను.
పరాయి మగవాడితో ప్రత్యక్షముగా మాట్లాడకూడదు. ఏమీ లేనప్పుడు, ఆచ్ఛాదనకోసరము, కనీసరము
మధ్యలో గడ్డిపరకను అట్టెపెట్టుకొని మాట్లాడవలయును కులస్త్రీలు. రావణా, , నీవు నీ మనస్సునుండి నన్ను తీసివెయుము. స్వజనులయందే ప్రేమ కలిగియుండుము.
నమాం ప్రార్థయితుం యుక్తస్వం సిద్ధిమివ పాపకృత్
అకార్యం న మయా కార్యమేక పత్న్యా నిగర్హితం 23
పాపకర్మలను ఆచరించువాడు సిద్ధిని పొందజాలడు. అట్లే పాపత్ముడవైన నీవు నన్ను
పొందుట అసంభవం. పతివ్రతకు నింద్యమైనది ఏది
నేను ఎన్నటికి చేయజాలను.
ఇహ సంతో న వా సంతి సతో వా నానువర్తసే
యథాహి విపరీతా తే బుద్ధిరాచారవర్జితా 24
ఇక్కడ సత్పురుషులు లేరా? లేక ఉన్నాను వారిని నీవు అనుసరించటం లేదా? ఎందు కంటే
నీ బుద్ధి విపరీతముగాను, సదాచార శూన్యముగాను మారిపొయినది.
అక్రుతాత్మానమాసాద్య రాజానమనయే రతం
సమృద్ధాని వినశ్యంతి రాష్ట్రాణి నగరాణిచ 25
అపవిత్రమైన మనస్సు సదుపదేశమును గ్రహింపజాలదు.. అట్టి మనస్సుగల అన్యాయవంతుడగు
రాజు చేతిలో పడిన గొప్ప గొప్ప సమృద్ధివంతమగు రాజ్యములు, నగరములు నాశనమయిపోవును.
అట్లే రత్నరాసులచే పూర్ణమగు ఈ లంకా పురముకూడా నీలాంటి నీచుడి చేతిలో
నాశానమయిపోతున్న్హది. నాశనమగును.
శక్యా లోభయితుం నాహమైశ్వర్యమేణ ధనేన వా
అనన్యా రాఘవేణాహం భాస్కరేణ యథా ప్రభా 26
కాంతి సూర్యునినుండి వేరుకాదు. అట్లే శ్రీరాముడు నేను వేరుకాదు. ఐశ్వర్యముద్వారాకాని, ధనముద్వారాకాని నన్ను
లోభపెట్టలేవు.
వేదవిద్యాజ్ఞానము ఆత్మజ్ఞానిసొత్తు. అట్లే నేను శ్రీరాముని సొత్తుని.
విదితః సర్వధర్మజ్ఞః శరణాగతవత్సలః
తేన మైత్రీభవతు యది జీవితుమిచ్ఛసి 27
శ్రీరామచంద్రుడు సమస్త ధర్మములను తెలిసిన సర్వజ్ఞుడు. మరియు శరణాగత వత్సలురు. నీవు జీవించి ఉండదలచినచో శ్రీరామునితో
మత్రీభావము కలిగియుండుము.
నీవు శ్రీరాముని శరణు కోరుము. వారిని
ప్రసన్నుని చేసికొనుము. మరియు
శుద్ధహృదయుడవై నన్ను వారికడకు చేర్చుము.
నీకు మేలుచేకూరును. లేనియడల నాశనమగుదువు.
వామః కామో మనుష్యాణాం యస్మిన్ కిలనిబధ్యతే
జనే తస్మిన్ స్త్వను క్రోశః స్నేహశ్చ కిలజాయతే 28
మనుష్యులలో ఈ కామము చాలా వక్రమైనది ఆ
కామము అనగా కోరిక వలననే మనుజుడు బంధించబడుతాడు. ఈ కామము అనగా ప్రేమ వలన మనుజునకు
కరుణ, స్నేహము ఉత్పన్నమగును.
రావణుడు సీతమ్మతో ఇట్లనెను. నీవు
నన్ను తిరస్కరించుచున్నప్పటికి నాకు క్రోధం రావట్లేదు. అందుకే నిన్ను వదలుటలేదు. నేను నీకు రెండు నెలలు గడువు విధించితిని. తదుపరి నిన్ను వదలను. నిన్ను ముక్కలు ముక్కలుగా వధించెదను. అక్కడి రాక్షసస్త్రీలు, దేవతా స్త్రీలు, మరి
ఇతరులు నేత్రములయొక్కయు, నోటిద్వారాను ఆమెకి ధైర్యము చెప్పిరి.
రావణా, నీవు నిజముగా శూరుడవైతే మోసముచేసి ఎలా నన్ను ఎత్తుకొచ్చితివి? నీవు
మోసగాడివి. అదివిన్న రావణుడు కుపితుడయ్యెను. రాక్షస స్త్రీలు కూడా క్రోధితులయ్యిరి. వారు సీతమ్మను రావణుని అంతఃపురమందు నివసింపమని చెప్పిరి.
అప్పుడు సీతమ్మ కన్నీటితోనిండిన నేత్రములతో బాధతో ఆ రాక్షసస్త్రీలతో ఇట్లు చెప్పెను.
న మానుషీ రాక్షసస్య భార్యా భవితుమర్హతి
కామం ఖాదత మాం సర్వా న కరిష్యామి వో వచః 29
ఒక మానవకన్య రాక్షసుని భార్య కాజాలదు.
మీరందరూ నన్ను భక్షించినను నాకు సమ్మతమే. నన్నుభక్షించినను నేను మీ మాటలను
అంగీకరించను.
దీనోవా రాజ్యహీనోవా యోమే భర్తా స మే గురుః
తమ్ నిత్యమనురక్తాస్మి యథా సూర్యం సువర్చలా 30
నా భర్త దీనుడైనను, రాజ్యవిహీనుడైనను వారే నా ప్రభువు. వారే నా గురువు.
సువర్చల సూర్యునియందు అనురక్తమైయుండును.
అట్లే నేను వారియందే సర్వదా అనురక్తమై యున్నాను. అనురక్తయై యుందును.
యథా శచీ మహాభాగా శక్రం సముపతిష్ఠతి
అరుంధతీ వసిష్ఠం చ రోహిణీ శశినం యథా 31
లోపాముద్రా యథష్ఠ అగస్త్యం సుకన్యాచ్యేవనం యథా
సావిత్రీ సత్య్తవంతం చ కపిలం శ్రీమతీ యథా 32
సౌదాసం మదయంతీవ కేశినీ సగరం యథా
నైషధం దమయంతీవ భైమీ పతిమనువ్రతా
తథాహమి ఇక్ష్వాకువరం రామం పతి మను వ్రతా
33
మహాభాగ్యవతియగు శచీదేవి ఇంద్రుని సేవయండు వర్తించును. అరుంధతి వశిష్ట మహర్షి
సేవయందు, మరియు రోహిణీ చంద్రుని సేవయందు నిమగ్నమై ఉండును. లోపాముద్ర అగస్త్యుని
సేవయందు, మరియు సుకన్య చ్యవనుని సేవయందు నిమగ్నమై ఉండును. కేశిని సగరుని యందు,
భీమకుమారి అగు దమయంతి తనపతి అయిన నిషధరాజగు నలుని సేవయందు నిమగ్నమై ఉండును. అట్లే
నేనున్ను ఇక్ష్వాకు వంశ శిరోమణి అయిన శ్రీరాముని సేవయందు నిమగ్నమై ఉండును.
చెట్లచాటున కొమ్మలమధ్యలో కూర్చున్న ఆంజనేయుడు సీతమ్మను గద్దించుచున్న
రాక్షస్తీలను చూచెను. సీతమ్మ శోకముచే ఉచ్చ్వాస నిశ్వాసములు దీర్ఘముగా తీయుచుండెను
మరియు విలపించుచుండెను.
హా రామేతి చ దుఃఖార్తా హా పునర్లక్ష్మణేతి చ
హా శ్వశ్రూర్మమ కౌసల్యే హా సుమిత్రేతి భామినీ 34
ఓ, రామా, ఓ లక్ష్మణ, అత్తా కౌసల్యా, సుమిత్రా, అని బోధించుచు దుఖముచే పీడింప బడి సీత ఏడవ దొడంగెను.
సర్వతా తేన హీనాయా రామేణ విదితాత్మనా
తీక్ష్ణం రషమివాస్వాద్య దుర్లభం మమ జీవనం 35
శ్రీరాముడు ఆత్మాజ్ఞాని. శ్రీరామునినుండి వేరై నేను జీవించలేను. అది భయంకర
విషమును త్రాగి జీవించుటవలె దుర్లభమైనది.
కీ దృశం తు మహాపాపం మయా దేహాన్తరే కృతం
తేనేదం ప్రాప్యతే ఘోరం మహాదుఃఖం సుదారుణం 36
నేను పూర్వజన్మలో మహా ఘోర పాపమును చేసితిని. అందువలనే ఈ కఠోరమైన ఘోరదుఃఖము
నాకు సంప్రాప్తించినది.
అధర్మాత్ తు మహోత్పాతో భవిష్యతి హి
సాంప్రతం
నైతే ధర్మం విజానంతి రాక్షసాః పిశితాశనాః 37
ఇప్పుడు అధర్మమువలన గొప్ప ఉత్పాదము జరుచున్నది. మాంస భక్షకులయిన ఈ రాక్షసులు ధర్మమును ఏమాత్రము
తెలియకున్నారు.
ధన్యా దేవాః సగంధర్వాః సిద్దాశ్చ పరమర్షయః
మమ పశ్యన్తి యే వీరం రామం రాజీవలోచనం 38
నా పతిదేవుదు శ్రీరాముడు వీర శిరోమణి, కమలనేత్రుడు, మహా పురుషుడు. అట్టి నా
పతిదేవుని చూడగలిగిన ఈ దేవతలు, సిద్ధులు, మహర్షులు ధన్యులు.
ధన్యాః ఖలు మహాత్మానో మునయః సత్యసమ్మతాః
జితాత్మానో మహాభాగా యేషాం నస్తః ప్రియాప్రియే 39
సత్యస్వరూపుడగు ఆ పరమాత్మనే తమ ఆత్మగా తలచు మహర్షులు ధన్యులు. ఆ ధన్యులైన మహర్షులకు ప్రియము అప్రియము అనే
ద్వంద్వములు లేనివారును. వారి అంతఃకరణ
వారి వశమందుండును. అట్టి మహర్షులు మహా భాగ్యశాలురు.
ప్రియాన్న సంభవేద్ దుఖమప్రియాదధికం భవేత్
తాభ్యాం హి తే వియుజ్యంతే నమస్తేషాం
మహాత్మనాం 40
ఎవనికి ప్రియ వస్తువుచే వియోగము సంభవించినప్పుడు దుఃఖముగాని, అప్రియ
వస్తువుయొక్క సంయోగముచే అధిక కష్టానుభవము పొందడో, అనగా ప్రియా అప్రియ ములు
రెండింటికినీ అతీతులో అట్టి మహాత్ములకు నమస్కారము.
ఆ రాక్షస స్త్రీలు సీతమ్మను భయపెట్టుట చూచి, వారిలో వృద్ధురాలైన త్రిజట అను
రాక్షసి వారితో ఇట్లనెను.
తదకౄ క్రోరవాక్యైశ్చ సాన్త్వమేవాభి ధీయతాం
ఆభియాచాను వైదేహే మే తద్ధి మమ రోచతే
41
ఇక మీరు కఠోర వాక్యములను ఈ విధముగా పలుకకుడు.
ఎందుకంటె వీటి వలన ఉపయోగము లేదు. ఇక ప్రియమైన వాక్యములనే పలుకుడు. మనము సీతనుండి కృపను క్షమను యాచించుటే మంచిది.
దుఃఖితమతి అయిన సీతమ్మను చూసిన హనుమంతుడు ఇట్లనుకొననెను.
అసత్యాని చ యుద్ధాని సంశయో మే న రోచతే
కశ్చ నిఃసశయం కార్యం కుర్యాత్ ప్రాజ్ఞః స సంశయం 42
యుద్ధము అనిశ్చయాత్మకము. ఆ యుద్ధములో ఎవరు గెలుచుడురో చెప్పుట కష్టము. అటువంటి సందేహత్మకమైన పని చేయుట యుక్తము కాదు.
బుద్ధిమంతుడు యెవ్వడు ఇటువంటి పనిని చేయడు.
ఆర్థానర్థాన్తరే బుద్ధిర్నిశ్చితాపి న శోభతే
ఘాతయంతి హి కార్యాణి దూతాః పండిత మానినః 43
కర్తవ్యము, అక్కర్తము విషయమై యజమానియొక్క నిశ్చిత బుద్దికూడా అవివేకి అయిన
దూతవలన శోభను పొందదు.. తను తాను తెలివిగలవానిగా తలచు దూత తన తెలివితక్కువతనముచే
తనను తానె కాక యజమానినికూడా నాశనమొనర్చును.
ఈ కార్యము చెడకూడదు. తను ఏమాత్రము ప్రమత్తత కలిగి యుండకూడదు. తన సముద్ర లంఘనము
వృథా కాకూడదు. ఇట్లా ఆలోచించిన హనుమంతుడు ఇట్లనుకోనేను. నేను ఇక్ష్వాకు కులభూషణుడు, ఆత్మజ్ఞాని యగు శ్ర్రీరామచంద్రుని
గుణగణములను తలంచుచూ ఇచ్చోటే కూర్చోనియుండెదను. సీతకుమాత్రమే వినబడునట్లు శ్రీరామచరితను
ఆలాపించ దొడంగెను. కేశములతో కప్పబడిన తన
సుందర ముఖమును ఆ చెట్టు కొమ్మల మధ్యకు తరలించెను. హనుమంతుని చూచిన సీతమ్మకు
సాక్షాత్ తన పతిని చాచిన ఆనందము కలిగెను. ఆమెకు చాలాసేపటికి తెప్పరించుకొనేను. అమ్మ ఈ ప్రకారముగా
చింతనచేసేను.
నమోస్తు వాచస్పతయే సవజ్రిణే స్వయంభువే చైవ హుతాశనాయ
అనేన చోక్తం యదిదం మమాగ్రతో వనౌ కసా తచ్చ తథాస్తు నాన్యథా 44
వాచాస్పతి అయిన బృహస్పతికి, వజ్రధారియగు ఇంద్రునకు, స్వయంభువగు బ్రహ్మదేవునకు,
వాక్కుకు అధిష్ఠానదేవత అయిన అగ్నికి నమస్కరిస్తున్నాను. ఈ వానరుడు నాకు చెప్పినది
సత్యమగుగాక్. మరియొక విధముగా లేకుండునుగాక.
హనుమంతుని శ్రీరాముని గురించిన మాటలువిన్న సీతమ్మపరమానందముపోడెను. సీతమ్మ
హనుమంతునితో ఇట్లు చెప్పెను. శ్రీరామునికి
తండ్రి దశరథుని మాటలు అత్యంత ప్రియమైనవి.
దద్యాన్న ప్రతిగ్రుహ్ణీయాత్ సత్యం బ్రూయాత్
న చ అనృతం
అపి జీవితహేతోర్హి రామః సత్య పరాక్రమః 45
సత్యపరాక్రమశీలుడగు శ్రీరాముడు ఇచ్చునేగాని పుచ్చుకొనాడు. వారు సదా సత్యమునే
పలుకుదురు. తన ప్రాణములను
రక్షించుటకొరకైనను అసత్యము పలుకరు.
నన్ను దురాత్ముడగు రావణుడు మోసముచేసి ఎత్తుకొని వచ్చెను. అతడు నాకు ఇంకను
రెండు నెలల గడువు ఇచ్చెను. ఆ గడువు తీరినవెంతనే నేను నా ప్రాణములను
పరిత్యజించెదను. ఆమెను ఓదార్చుచు హనుమంతుడు సీతమ్మతో ఇట్లుచేప్పెను.
అమ్మ నేను శ్రీరాముని దూతను. ఆయన పంపగా వచ్చితిని. అమ్మా శ్రీరాముడు క్షేమంగా ఉన్నాడు. సీతా, సీతా
అని విలపిస్తున్నాడు. మీ మరిది మహాతేజస్వియగు లక్ష్మణుడు మీకు నమస్కృతులు
అందజేయమన్నాడు. ఆప్పుడు ఆనందముతో సీతమ్మ ఇట్లు పలికెను.
కళ్యాణీ బత గాథేయం లౌకికీ ప్రతిభాతి మా
ఏతి జీవంతమానందో నరం వర్ష శతాదపి 46
మనిషి మానవత్వముతో జీవించినచో వంద సంవత్సరములు అయిన తదుపరికూడా ఆనందము
కలుగును. అది నా విషయములో పరమ సత్యముగా,
కళ్యాణ దాయకముగా తోచుచున్నది.
పవనపుత్రుడగు హనుమంతుడు సీతమ్మకు ఆశ్వాసన కలుగచేయుటకు శ్రీరాముడు ఇచ్చిన అంగుళీకమును
సీతమ్మకు ఇచ్చెను. మీరు ధైర్యమును వహింపుడు. త్వరలో మీ దుఃఖము పరిసమాప్తమగును. సీతమ్మ ఆ అంగుళీకమును ఏకాగ్రతతో చూడసాగెను. అంగుళీకమును
చూసిన ఆమెకు పతిని కలిసినంత ఆనందము కలిగెను. ఆమె హనుమంతుని ఆదరించి ఇట్లు
చెప్పెను.
హనుమాన్, నేను నిన్ను అసామాన్య వ్యక్తిగా తలంచుచున్నాను. హనుమాన్, కౌసల్యా
పుత్రుడైన శ్రీరామచంద్రుడుడు, మరియు సుమిత్రాదేవి కుమారుడైన లక్ష్మణుల క్షేమమును గురించి
విని సంతోషపడ్డాను. అప్పుడు హనుమంతుడు సీతమ్మతో ఇట్లనెను. అమ్మ, సీతమ్మ, నేను
ఇక్కడినుండి వెడలగానే శ్రీరాముడు విశాలసేనను వెంటబెట్టుకొని రాగలడు. రావణుని
వధించి నిన్ను ఆ దుష్టుడి చెరనుండి విడిపించగలడు.
న మాంసం రాఘవో భఙ్క్తే న చైవ మధుసేవతే
వన్యం సువిహితం నిత్యం భక్తమశ్నాతి పఞ్చమం 47
రఘువంశీయుడు ఎవ్వడూ మాంసము భుజింపడు. అట్టి వస్తువులను శ్రీరాముడు త్రాకను
కూడా త్రాకడు. వారు సదా నాలుగు వేళలా ఉపవశించెదరు. అనగా భగవంతుడి సమీపములో నివశించెదరు. మనిషి నిజమైన నివాసము కూటస్థమే. వారు శాస్త్ర
సమ్మతములైన ఫల, మూలాదులను భుజించెదరు ఎందుకనగా మాంసము భుజించుట శాస్త్ర సమ్మతము
కాదు, నిషేదము. వారు ఐదవవేళ శాస్త్ర సమ్మతములైన ఫల, మూలాదులను భుజిందరు.
హనుమంతుడు ఇట్లనెను. అమ్మా, సీతమ్మ, శ్రీరాముడు సదా మీ పేరు తలచుకుంటూ
కుమిలిపోతూ ‘సీతా, సీతా’ అని వ్యాకులతచెండుచున్నారు. అప్పుడు సీతమ్మ దుఃఖితమతియైన
సీతమ్మ ఇట్లనెను.
ఐస్వర్యే వా సువిస్తీర్ణే వ్యసనే వా సుదారుణే
రజ్జ్యేవ పురుషం బధ్వా కృతాన్తః పరికర్షతి 48
గొప్ప ఐర్యమందు ఉన్నను, లేక మహాభయంకర విపత్తునందు ఉన్నను, కాలుడు మనుషుని
త్రాడుచేత కట్టబడిలాగబడిన చందమున లాగివేయుచునే ఉండును.
సీర్తమ్మ ఇట్లనెను. దైవ నిర్ణయమును అడ్డుపెట్టుట దుర్లభము. లక్ష్మణుడు,
శ్రీరాముని, మరియు నన్ను దృష్టాంతముగా గైకొనుము.
ఉత్సాహః పౌరుషం సత్వమానృశంస్యం కృతజ్ఞతా
విక్రమశ్చ ప్రభావశ్చ సంతి వానర రాఘవే. 49
వానరా, ఉత్సాహము, పౌరుషం, బలము, దయాళుత్వము, కృతజ్ఞతా, పరాక్రమము, ప్రభావము
ఇత్యాది గుణములన్నియు మూర్తీభవించిన స్వరూపమే శ్రీరామచంద్రుడు.
ఇట్లు చెప్తూ సీతమ్మ కన్నీరు కారుస్తూ ఉండెను. అప్పుడు హనుమంతుడు సీతమ్మతో,
అమ్మా, మీరు ధైర్యమును వహింపుడు. అమ్మ, శ్రీరాముడు గొప్ప వానరసేనను వెంటబెట్టుకొని
వచ్చి మెమ్మల్ని తీసుకొని వెళ్ళగలరు. లేదా నేనే మిమ్మల్ని భుజముల మీద
కోర్చోబెట్టుకొని తీసుకోనివెళ్ళగలను. అంతట హనుమంతుడు చెట్టుపైనుండి క్రిందకి
దూకేను. సీతమ్మకు విశ్వాసము కలిగించుటకొఱకు
తనశరీరమును పెద్దదిచేయసాగెను. క్షణకాలములో వారి శరీరము పర్వతమంత పెద్దదిగా
అయ్యెను. ఆయన ప్రజ్వరిల్లు తేజస్వి అయ్యెను. అంతట సీతమ్మ హనుమంతునితో ఇట్లనెను.
నాయనా, నేను నీతో వచ్చుట ఏ దృష్టితో చూచినను మంచిదిగాదు. శ్రీరాముని యశస్సుకు
అపకీర్తి వచ్చును శ్రీరామచంద్రుడు స్వయముగా ఏమి చేయలేకపోయెను అను
అపకీర్తి వచ్చును.
భర్తుర్ భక్తిం పురస్కృత్య రామాదన్యస్య వానర
నాహం స్ప్రష్టుం స్వతో గాత్ర మిచ్చేయం వానరోత్తమ 50
ఓ వానరా, నేను భర్తను తప్ప వేరొక శరీరమును స్పృశించజాలను. మరియు ఏ ఇతర
శరీరమును స్పృశించను, స్పృశించలేను.
ఆమెమాటలు విన్న హనుమంతునికి సంతోషము అమితముగా కలిగెను. హనుమంతుడు సీతమ్మతో ఇట్లనెను. అమ్మా, మీరు
చెప్పినది అన్నివిధాల ఆమోదయోగ్యమై ఉన్నది. కాని శ్రీరామునికి చూపించుటకు గుర్తుగా
ఏదైనా వస్తువును ఇమ్ము. అప్పుడు సీతమ్మ చూడామణిని తీసి ఇచ్చెను. అమ్మకు ప్రదక్షిణచేసి హనుమంతుడు దగ్గిరగా
నిలబడెను.
మద్విశిష్టాశ్చ తుల్యాశ్చ సంతి తత్ర
వనౌకసః
మత్తః ప్రత్యవరః కశ్చిన్నాస్తి సుగ్రీవ సన్నిధౌ 51
అమ్మా సీతమ్మా, సుగ్రీవుని సేనలో నాకంటే అధికపరాక్రమము గలవారు పెక్కురు గలరు.
నా కంటే తక్కువ పరాక్రమముగలవారు ఎవ్వడును లేడు. అందరును మహా పరక్రమవంతులే.
నేనే ఇక్కడికి రాగాలిగినట్లు మిగిలినవారు వచ్చుటలో సందేహమేమియును లేదు. తల్లీ, శ్రీరాముడు రావణుని, అతనిని సేనను తప్పక
వధించెదరు. మిమ్ములను వెంటబెట్టుకొని వెళ్ళగలరు. అందు సందేహము లేశమైనను లేదు.
సీతమ్మ హనుమంతునితో ఇట్లనెను. పూర్వము శ్రీరాముడు క్రోధముతో కాకి యొక్క ఒక కన్నను
పోగొట్టెను. మీరు శ్రీరామునికి ఇది
జ్ఞాపకము చేయుడు. అప్పుడు హనుమంతుడు అక్కడినుండి చెంగున ఇంకొక చోటికి యెగిరి ఇట్లు
ఆలోచించసాగెను.
అల్ప శేషమిదం కార్యం దృష్టేయ మసితే క్షణా
త్రీనుసాయానతిక్రమ్య చతుర్థ దృశ్యతే 52
ఇప్పుడు నేను సీతమ్మ దర్శనము చేసికొంటిని. ఇక కొద్ది కార్యము మిగిలియున్నది
అది శతృవు బలమును శక్తిని అంచనావేయుట. దీనికై సామ, దాన, భేధ, దండము అను అను నాలుగు పద్ధతులు
ఉన్నవి. సామ దాన భేదము అనే మూడింటినీ వదిలి నాలుగవది అయిన దండమును ఉపయోగించెదను. అదే
యుక్తముగా తోచుచున్నది.
కార్యే కర్మణి నిర్వృత్తే యో బహూన్యపి సాధయేత్
పూర్వకార్యా నిరోధేనే స కార్యం కర్తుమర్హతి 53
యెవ్వడు ప్రదానకార్యము పూర్తి అయ్యిన పిమ్మట దానికి హానికలుగకుండా ఇంకను
కొన్ని కార్యములను దానికి అనుబంధముగా నేరవేర్చునో అతనే కార్యశీలుడు.
స హి ఏకః సాధకో హెతుః స్వల్పస్యాపీహ కర్మణః
యో హ్యర్థం బహుథా వేద సమర్థోర్థ సాధనే 54
చిన్న చిన్న కార్యములను కూడా సిద్ధింపజేయుట కొరకు సాధకమగు హేతువు ఒక్కటే
ఉండదు. ఎవడు ఏ కార్యమైనాను లేక ప్రయోజనమునైనాను అనేక విధములుగా సిద్ధింపజేయు కళ
ఎరుగునో అతడే కార్యసాధనయందు సమర్థుడు కాగలడు.
యుద్ధము జరిగినప్పుడు, రెండు పక్షములలో ఏది బలమైనదో తెలిసికొనుటకు ఇది ఒక
చక్కని అవకాశము. అప్పుడు సుగ్రీవుని యొక్క ఆజ్ఞను పరిపూర్ణముగా పాలింపబడినట్లు
అర్థము. అప్పుడు క్రోధపూరితుడైన హనుమంతుడు
చెట్లను పెరికి పారవేయనారంభించెను. ఆ
ఉద్యానవనములో ఆంజనేయుడు నాశనముచేయని భాగమే లేదు ఒక్క సీతమ్మ ఉన్న
ప్రదేశాముతప్ప. ఆ వినాశమును గూర్చిన
రాక్షస స్త్రీలు చెప్పిన మాటలు విన్న రావణుడు కుపితుడయ్యెను. కింకరులు అనే రాక్షసులను హనుమంతుని బంధించుటకై
పంపెను. ప్రమాదావనము యొక్క ద్వారముపై
నిలబడియున్న హనుమంతుని చూచి ఆ రాక్షసులు మండిపడ్డారు. వారందరూ అతివేగముతో
హనుమంతునిపైకి విరుచుకబడ్డారు. అప్పుడు హనుమంతుడు క్రోధముతో తన తోకను బలముగా నేలపై
కొట్టెను. పెద్దగా గర్జనచేయదొడంగెను.
అప్పుడు పెద్ద స్వరముతో హనుమంతుడు ఇట్లనెను.
జయత్యతి బలో రామో లక్ష్మణశ్చ మహాబలః
రాజా జయతి సుగ్రీవో రాఘవేణ అభిపాలితః 55
దాసోహం కోసలేన్ద్రస్య రామస్యా క్లిష్టకర్మణః
హనుమాన్ శతృ సైన్యానాం నిహంతాం మారుతాత్మజః 56
న రావణం సహస్రం మేయుద్ధే ప్రతిబలం భవేత్
శిలాభిశ్చ పాదపైశ్చ సహస్రశః 57
అర్థయిత్వా పురీం లంకామ్ అభివాద్య చ మైథిలీం
సమృద్ధార్ధో గమిష్యామి మిషతాం సర్వ రక్షసాం 58
మహాబలవంతుడు అయిన శ్రీరామచంద్రునకు, మహా బలశాలియగు లక్ష్మణునకు జయమగుగాక్.
శ్రీరామునిచే రక్షింపబడు సుగ్రీవ మహారాజునకు జయమగుగాక. గొప్ప పరాక్రమవంతుడయిన శ్రీరాముని బంటును నేను. నేను శ్రీరాముని దాసుడను. నా పేరు హనుమంతుడు.
నేను వాయుదేవుని కుమారుడను. శతృసైన్యమును
చీల్చి చెండాడు వాడిని. యుద్ధమున రావణుడు
కూడా నాకు సమానుడుగాడు. సీతమ్మ చూస్తుండగానే నా కార్యము నెరవేర్చుకొని వెళ్ళెదను. అమ్మకు నమస్కారము.
తదుపరి హనుమంతుడు కింకరులను ఆ రాక్షసులను సంహరించెను. అదివిని రావణుడు మహాపరాక్రమశాలియగు ప్రహస్తుని
కుమారుడు జంబుమాలిని పంపెను. హనుమంతుడు
బలముగా జంబుమాలిని రొమ్ముపై కొట్టెను. ఆ రాక్షసుడు అరుస్తూ క్రిందబడి
మరణించెను. పిమ్మట రావణుని మంత్రి యొక్క
ఏడుగురు కొడుకులు వేగముగా హనుమంతుడి పైకి వచ్చిరి. వారందరినీ చంపివేశేను.
రావణుడు అంతటి పరాక్రమవంతులను హనుమంతుడు సంహరించేసెను అనే వార్త విని భయపడెను.
సర్దుకొని రావణుడు అంతట విరూపాక్షుడు, యూపాక్షుడు, దుర్ధరుడు, ప్రఘనుడు,
భానకర్ణుడు అను అయిదుగురు సేనాపతులను పంపెను.
ఆంజనేయుడు వారిని వధించెను. ఆ
తరువాత వారి సేననుకూడా సంహరింపనారంభించెను.
హనుమంతునిచే అయిదుగురు సేనాపతులు, రథము సహితముగా చంపబడిరను వార్తవిన్న రావణుడు
తన కొడుకు, మరియు మహా పరాక్రమవంతుడయిన అక్షకుమారుని పంపెను. హనుమంతుడు వాడిని
గిరగిర త్రిప్పి నేలకేసి కొట్టి చంపెను.
అగివిన్న రావణుడు మరింత భయపడెను. అప్పడు తన పుతృడు మరియు మహా పరాక్రమవంతుడు, అస్త్ర శాస్త్ర నిపుణుడు, తన
పుతృడు అయిన ఇంద్రజిత్తుని పంపెను. ఇంద్రజిత్తు అస్త్ర శాస్త్రములలో మహాజ్ఞాని.
హనుమంతుడు ఏ అస్త్రమునకు లొంగడని తెలిసికున్న ఇంద్రజిత్తు హనుమంతుడి మీద
బ్రహ్మాస్త్రము ఉపయోగించి బంధించెను. హనుమంతుడు బ్రహ్మాస్త్రమును గౌరవించెను.
బంధించబడెను. హనుమంతుడ్ని ఇంద్రజిత్తు రావణుడి సభకు తీసికెళ్ళెను. దశకంఠుడు, మ్కరియు మహాబలశాలియగు రావణునితో హనుమంతుడు
ఇట్లు పలికెను.
తద్ భవాన్ దృష్ట ధర్మార్థస్తపః కృత పరిగ్రహః
పరదారాన్ మహాప్రాజ్ఞ నోపరోద్ధుం త్వమర్హసి 59
నీవు ధర్మార్తముల యొక్క తత్వమును తెలిసికొని యున్నావు. నీవు గొప్ప
తపస్వివి. కావున ఇతరస్త్రీలను వంచించుట
యుక్తముగాదు.
నహి ధర్మ విరుద్దేషు బహ్వ పాయేషు కర్మసు
మూల ఘాతిషు సజ్జన్తే బుద్ధిమంతో భవద్ విధాః 60
ధర్మ విరుద్ధ కార్యముములు అర్థవంతమైనవి.
అవి సజ్జనులను దుర్జనులను చేసి నాశనమొనర్చును. కాబట్టి నీ వంటి
బుద్ధిమంతులు వీటియందు పాల్గొనరాదు.
కావున ధర్మార్థములను పాటించుము. ఇవి ముల్లోకహితములు. నా ఈ మాటలు విశ్వసింపుడు.
మరియు గౌరవప్రదముగా సీతమ్మను శ్రీరామునివద్దకు పంపివేయుము.
న తు ధర్మోపసంహారమధర్మఫల సంహితం
తదేవ ఫలమన్వేతి ధర్మశ్చాధర్మ నాశనః 61
ప్రబలమైన అధర్మముయొక్క ఫలముచే బంధింపబడినవాడు ఫలము దుష్ఫలమే. అట్టివాడు అధర్మఫలము ఫలమునే పొందెదడు. ధర్మమును
అనుష్టించినవాడికి మొదట అధర్మము నశించును.
ప్రాప్తం ధర్మఫలం తావద్ భవతా నాత్ర సంశయః
ఫలమప్యాస్యధర్మస్య క్షిప్రమేవ ప్రవత్స్యసే 62
నీవు మొదట చేసిన కర్మ ఫలమును ఇంతవరకు అనుభావిన్చిటివి. ఇప్పుడు సీతాపహరణ కర్మఫలమును త్వరలోనే
అనుభవించగలవు.
కామం ఖల్వ హ మష్యేకః సవాజి రథ కుఞ్జరాం
లఙ్కాం నాశయితుం శక్తస్తస్యైష తు న నిశ్చయః 63
ఏనుగులు, గుఱ్ఱములు, రథములు—వీటితో కూడిన ఈ లంకా పురమును నేనొక్కడినే నాశనము
చేయగలను. కాని శ్రీరాముడు అట్టి ఆజ్ఞను
నాకు ఇవ్వలేదు.
అపకుర్వన్ హాయ్ రామస్య సాక్షాదపి పురందరః
న సుఖం ప్రాప్ను యాదన్యః కిం పునస్తద్విధో జనః 64
శ్రీరామునికి అన్యాయము చేసి సాక్షాత్ ఇంద్రుడుకూడా సుఖమును పొందలేడు. ఇక నీవంటి పాపాత్ముల సంగతి వేరుగా చెప్పవలెనా?
ఈ స్నేహితులు, మంత్రులను, కుటుంబ జనులను, సోదరులను, పుత్రులను, హితైభిలాషులను,
స్త్రీలను, సుఖభోగ సాధనాలను, అంతేగాదు, సమస్త
లంకాపురమును మృత్యుముఖమున పడద్రోయకుము.
సత్యం రాక్షస రాజేంద్ర శృణుష్వ వచనం మమ
రామదాసస్య దూతస్య వానరస్య విశేషతః 65
రాక్షసుల రాజాధిరాజా, నేను శ్రీరాముని దాసుడను, దూతను, మరియు వానరుడను. నా
సత్యమైన మాటను వినుము.
సర్వాం లోకాన్ సుసంహృత్య సభూతాన్ సచరాచరాన్
పునరేవ తథా స్రష్టుం శక్తో రామో మహా యశాః 66
మహా యశశ్వి యగు శ్రీరామచంద్రుడు చరాచర ప్రాణులతో కూడిన ఈ సమస్తలోకములను
సంహరించగలడు. తిరిగి వాటిని నిర్మించగలడు. అట్టి శక్తిగల మహానుభావుడు శ్రీరాముడు.
సంపూర్ణ లోకాధీశ్వరుడైన రాజసింహుడు శ్రీరాముడు. అట్టి మహానుభావుడికి వారి
భార్యను అపహరించుట మహాఘోరాపరాధము. అట్టి నీవు జీవించుట అసంభవం.
దేవాశ్చ దైత్యాశ్చ నిశాచరేంద్ర గంధర్వ విద్యాధర నాగయక్షాః
రామస్య లోకత్రయస్య నాయకస్య స్థాతుం న శక్తాః సమరేషు సర్వే 67
ఓ నిశాచారరాజ, శ్రీరాముడు, ముల్లోకాలకు ప్రభువు. దేవతలు, గంధర్వులు, రాక్షసులు, విద్యాధికులు,
నాగులు, యక్షులు, వీరందర్ కలిసినా ఆయనతో యుద్ధమునందు గెలవలేరు.
హనుమంతుడి మాటలు రావణునికి క్రోధము తెప్పించెను. రావణుడు ‘ఈ వానరుని వధింపుము’
అని తన భటులను ఆదేశించెను. అప్పుడు అతని తమ్ముడు మరియు మంత్రి అయిన విభీషణుడు అక్కడే ఉండెను. అతను రావణుని ఆజ్ఞను ఆమోదించలేదు. హనుమంతుడు
శ్రీరాముని దూత సేవకుడు. విభీషణుడు రావణునితో ఇట్లనెను.
క్షమస్వ రోషం త్యజ రాక్షసేంద్ర ప్రసీద మే వాక్యమిదం శృణుష్వ
వధం న కుర్వన్తి వరావరజ్ఞా దూతస్య సంతో వసుధాధిపేంద్రాః 68
రాక్షసరాజా, క్షమింపుము, క్రోధమును వదిలివీయుము. ప్రక్సంనుడవు కమ్ము. నా ఈ
మాటలను విశ్వసించుము. మంచి చెడ్డలు తెలిసిన శ్రేష్ఠులగు రాజులు దూతను చంపరు.
రాజన్ ధర్మవిరుద్ధమ్ చ లోకవృత్తేశ్చ గర్హితం
తవ చాసదృశం వీర కపీరస్య ప్రమాపణమ 69
వీరుడగు మహారాజా, ఈ వానరుని వధించుట ధర్మ విరుద్ధము. లోకాచార దృష్టి చేతను
నిందితము. నీ వంటి వీరునకు ఇది ఎన్నటికి సమ్మతము కాదు.
గృహ్యంతే యది రోషేణ త్వాదృశోపి విచక్షణాః
తతః శాస్త్ర విపశ్చిత్వం శ్రమ ఏవ హి కేవలం 70
నీవంటి విద్వాంసునకు ఇది తగదు. నీవంటివాడు రోషావేశములకు వశుడు కాకూడదు. అట్లైన
సమస్త శాస్త్రములయొక్క పాండిత్యమును పొందుట కేవలము వృథాయగును.
కావున బాగుగా ఆలోచించి ఇంకేదన్నా దండనను విధింపుము.
కథంచ ధర్మార్థ వినీతబుద్ధిః పరాపర ప్రత్యయ నిశ్చితార్థః
భవద్విధః కోపవశే హి తిష్ఠేత్ కోపం న గచ్ఛంతి
హి సత్వవంతః 71
నీ బుద్ధి ధర్మార్థములతో కూడిన శిక్షణగలది.
నీవు మంచిచెడ్డలను బాగుగా
విచారింపుము. అప్పుడు కర్తవ్యమును
నిశ్చయింపుడు. నీ వంటి నీతిజ్ఞుడు కోపమునకు వశుడు కాకూడదు. ఎందుకంటె శక్తిశాలురు కోపముతో నిర్ణయముచేయరు.
మహాత్ముడగు విభీషణుడి వాక్యములు దేశాకాలములకు తగినట్లుగాను, హితకర మైనవిగాను
ఉన్నవి. ఆ మాటలు విన్న రావణుడు ఇట్లు పలికెను. విభీషణా నీవు పలికినది సత్యము. దూతని వధ చేయవలయును. కాని దానికి అన్యముగా
ఇంకొక తగిన కఠినమైన దండన ఇతనికి అవశ్యము
ఇవ్వవలయును. వానరులకు వాలము అనగా తోక చాలా ప్రియమైనది. అదియే వారికి భూషణము,
అలంకారము. కావున వీడి తోకకు నిప్పంటించండి.
రావణుడి మాటలు విన్నంతనే రాక్షసులు కాలుచున్న తోకతోనే యితడు ఇచ్చటనుండి
వెళ్ళవలెను. అప్పుడు రాక్షసులు ఆ తోకకు గుడ్డలుచుట్టి
నూనె పోసి నిప్పంటించిరి. హనుమంతుడి ముఖము
రోషముతోనూ, మరియు క్రోధముతో ఎర్రగా మండుచున్న సూర్యుని వలే అయ్యెను. అప్పుడు హనుమంతుడు తన మండుతున్న తోకతో ఆ
రాక్షసులను కొట్టదొడంగెను. ఈ క్రూర కార్యమును విన్న దుఃఖమతి అయిన సీతమ్మ వెంటనే అగ్నిదేవుని
ప్రార్థించెను.
మఙ్గలాభిముఖీ తస్య సా తదాసీన్మహాకపే
ఉపతస్థే విశాలాక్షీ ప్రయాతా హవ్యవాహనం 72
ఆ సమయమున సీతమ్మ పవిత్రహృదయముతో హనుమంతుని క్షేమము కోరుతూ అగ్నిదేవుని ఈ
క్రింది విధముగా ప్రార్థించెను.
అగ్నిదేవా, నేను పతిసేవ ఒనర్చినదానినే అయితే మీరు హనుమంతునికి శీతలము
చేకూర్చుడు. అక్కడ హనుమంతుడు
ఇట్లనుకోనేను: ఈ అగ్ని అన్నివైపులా మండుచున్నను నాకు హాని కలగచేయుటలేదు.
సీతాయాశ్చ నృశంస్యేన తేజసా రాఘవస్యచ
పితుశ్చ మమసఖ్యేన న మాం దహతి పావకః 73
నిశ్చయముగా, సీతమ్మ దయ, శ్రీరాముని కరునవన, నాతండ్రి వాయుదీవుని దయవలన—అగ్నిదేవుడు
నన్ను కాల్చుటలేదు.
అంతట ఆ మండుతున్నతోకతో ఆ లంకా పట్టణ భవనముల పైకి ఎక్కి వాటిపై తిరగనారంభించెను.
వర్జయిత్వా మహాతేజా విభీషణ గృహం ప్రతి
క్రమమాణః క్రమేణైవ దదాహ హరిపుఙ్గవః 74
అప్పుడు మహాతేజస్వియగు కపిశ్రేష్ఠుడగు ఆంజనేయుడు విభీషణుడి భవంతిని వదిలి మిగిలిన
అన్ని భవంతులకు క్రమముగా నిప్పు అంటించెను.
ఈ ప్రకారముగా లంకా నగరమునకు పీడా కలగజేసి సముద్ర జలమున తనతోకను ముంచి వేడి
చల్లార్చుకొనేను. అయ్యో నేను యెంత తెలివితక్కువ పని చేసితిని, సీతమ్మ క్షేమమును
ఆలోచన చేయకనే నిప్పు అటించితిని.
ధన్యాః ఖలు మహాత్మానో యె బుద్ధ్యా
కోపముత్థితం
నిరుంధంతి మహాత్మనో దీప్తమగ్ని మ్రివాంభసా 75
మహనీయులు తమయందు కలిగిన కోపమును తమ బుద్ధితో చల్లర్చుకొనవలయును. యెట్లా అంటే
జలము అగ్నిని చల్లార్చినట్లుగా. అట్టివారు
ఈ ప్రపంచమున ధన్యులు.
క్రుద్ధః పాపం న కుర్యాత్ కః క్రుద్దో హన్యాద్ గురూనపి
క్రుద్ధః పరుషయా వాచా నరః సాధూ నధిక్షిపేత్ 76
క్రోధముతో ఎవ్వడైనా పాపముచేయును. క్రోధమునకు లోనైనవాడు గురువునుకూడా చంపును.
క్రోధముతోకూడినవాడు సాదు జనులను కూడా ఆక్షేపించును.
వాచ్యావాచ్యం ప్రకుపితోన విజానాతి కర్హిచిత్
నా కార్యమస్తి క్రుద్ధస్య నా వాచ్యం విద్యతే క్వచిత్ 77
క్రోధికి యుక్తా యుక్త విచక్షణా జ్ఞానము ఉండదు. ఏమి మాట్లాడాలో ఏది
మాట్లాడకూడదో తెలియదు. క్రోధి
అన్నిచెడ్డపనులే చేస్తూ ఉంటాడు. మరియు
క్రోధి గురించి అన్నిచెడ్డమాటలే చెప్పతగును.
యః సముత్పతితం క్రోధం క్షయయైవ నిరస్యతి
యథో రగాస్త్వచం జీర్ణాం స వై పురుష ఉచ్యతే 78
ఎవడు తన హృదయమున పుట్టిన క్రోధమును వదిలినవాడు ఉత్తమమానవుడు. మనుజుడు పాము తన
కుబుసమును వదిలినట్లు తన కోపమును వదలవలెను.
ధిగస్తు రాజసం భావ మనీశమనవవస్థితం
ఈశ్వరేణాపి యద రాగాన్మయా సీతా న రక్షితా 79
ఈ రాజసభావము కార్యసాధనయండు అసమర్థమైనది. దీనికి ధిక్కారము. ఎందుకనగా ఈ
రజోగుణసంబంధమైన కోపమువలన నేను సీతమ్మను రక్షింపకుంటిని.
ఆ తరువాత అశోకవనమున కుశలముగా కోర్చొనిఉన్న సీతమ్మను చూచి ఆనందించెను. అమ్మా,
సీతమ్మ మీరు ఓపికపట్టుడు. సమయమునకు ప్రతీక్షింపుడు. రావణుడు త్వరలోవే రణమున
శ్రేరాముని చెంతనె సంహరింపబడగలడు. సీతమ్మకు ప్రణమిల్లి అక్కడినుండి
నిష్క్రమించెను.
పర్వతములలో ఎత్తైన అరిష్టగిరి పర్వతమును అధిరోహించెను. ఆయన అక్కడినుండి దక్షిణము వైపునుండి
ఉత్తరదిశవైపు ప్రయాణించెను. అరిష్టగిరి
నుండి మహేంద్రపర్వత శిఖరముపైకి దూకేను.
అప్పుడు శ్రేష్ఠులగు వానరులు ఆయనను చుట్టుముట్టిరి. జాంబవంతుడు అంగదుడు లాంటి
వాళ్ళు సీతమ్మ క్షేమ సమాచారములను నడిగిరి. హనుమంతుడువాళ్ళతో ఇట్లనెను. అమ్మ
క్షేమముగానున్నది. ఆమె లంకాపురమున అశోకవనమున రాక్షస్త్రీల పర్యవేక్షణలో క్షేమముగాఉన్నది.
ఆమె శ్రీరాముని రాకకొరకు నిరీక్షించుచున్నది అని అమ్మ క్షేమసమాచారములను
వివరించెను.
స నియుక్తస్తతస్తేన సంప్రహృష్ట తనూరుహః
నమస్యఞ్శరసా దేవ్యై సీతాయై ప్రత్యభాషత 80
అప్పుడు హనుమంతునకు శరీరమున గగుర్పాటు కలిగెను. ఆయన సీతమ్మకు మనస్సులో శిరస్సు వంచి
ప్రణమిల్లెను. తత్తదుపరి సీతమ్మగురిచి జరిగిన వృత్తాంతమంతయు చెప్పెను. మరియు
ఇట్లనెను.
రాఘవస్య ప్రసాదేన భవతాం చైవ తేజసా
సుగ్రీవస్య చ కార్యార్థం మయా సర్వమనుష్ఠితం 81
శ్రీరాముని దయచేతను, మీ అందరియొక్క అభిలాష మరియు అభిమానము చేతను నేను
సుగ్రీవుని కార్యసిద్ధి కొరకై అంతయు నెరవేర్చితిని.
నేను నా కిచ్చిన కార్యమును పూర్తిగా నెరవేర్చితిని. ఇక మీరు మీ కార్యమును
నేరవేర్చుడు. వెంటనే అంగదుడు మొదలగు
హనుమంతుని వెంటబెట్టుకొని ఆకాశమార్గమున యెగిరి పెద్ద ఘర్జన చేస్తూ కిష్కింధ సమీపమునకు
వచ్చిరి. అటుపిమ్మట శ్రీరాముని మరియు
సుగ్రీవుని సమీపమున దిగిరి.
హనుమాంశ్చ మహాబాహుః ప్రణమ్య శిరసాతతః
నియతా మక్షతాం దేవీం రాఘవాయ న్యవేదయత్ 82
అంతట మహాబాహువగు ఆంజనేయుడు శ్రీరాముని పాదములపై తన శిరస్సును ఉంచి ప్రణామము
చేసి ప్రణమిల్లెను. హనుమంతుడు ఇట్లనెను. సీతమ్మ తన యొక్క కఠోర నియములను పాలించుచు
కుశలముగా ఉన్నది.
Comments
Post a Comment