మూడు శరీరములు, పంచ కోశములు
మన
అలవాట్లకు సంస్కారములే
కారణము. సంస్కారముల
వల్ల ఇంద్రియ ప్రలోభములకు
అలవాటుపడ్డ మనిషి తన ఇచ్ఛాశక్తితో
ఆ అలవాట్లను అధిగమించుటకై క్రియాయోగ ధ్యాన సాధనకు ఉపక్రమిస్తాడు.
1. అన్నమయకోశం: పంచీకరణమువలన
ఏర్పడిన స్థూల పంచ భూతములనుండి వ్యక్తీకరించిన 24 తత్వములుగల
స్థూల శరీరమే అన్నమయకోశము.
పంచ జ్ఞానేంద్రియాలు, పంచ
కర్మేంద్రియాలు, పంచ
ప్రాణములు, పంచభూతములు, తన్మాత్రలు అనగా శక్తులు, మరియు అంతఃకరణ. దీనినే స్థూల శరీరము అందురు.
తన్మాత్ర
అనగా శక్తి. ఆకాశమునకు
శబ్దము, వాయువునకు
స్పర్శ, అగ్నికి రూపం, జలమునకు రస,
పృథ్వికి గంధ తత్వములు ఉండును.
2. ప్రాణమయకోశం:
సూక్ష్మ శరీరములోని అపంచీకృత పంచ ప్రాణములు,(ప్రాణ, అపాన, వ్యాన, సమాన మరియు ఉదాన)
పంచ కర్మేంద్రియములు (నోరు, పాణి, పాదం, ముడ్డి, శశినం) కలిసి ప్రాణమయకోశము.
3.మనోమయకోశము:
సూక్ష్మశరీరములోని పంచ జ్ఞానేంద్రియాలు, మనస్సు, చిత్తము కలిసి మనోమయకోశము.
4.విజ్ఞానమయకోశము: సూక్ష్మశరీరములోని పంచ జ్ఞానేంద్రియాలు, అహంకారము, నిశ్చయాత్మక
బుద్ధి కలిసి విజ్ఞానమయకోశము.
ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ కోశములు మూడింటినీ కలిపి సూక్ష్మ శరీరము అంటారు.
5. ఆనందమయకోశము:
త్రిగుణాత్మకమయిన,
మూల
అజ్ఞానమైన,
మోహనస్వరూపమైన అవిద్యాకవచమే ఆనందమయకోశము.
దీనినే
కారణశరీరము
అంటారు..
Comments
Post a Comment