ఓంకారం


ఓంకారం ఓంకారం ఓంకారం
సకలకళాస్వీకారం చతుర్వేద సాకారం
చైతన్యసుధాపూరం జ్ఞానకమల కాసారం
ధ్యానపరిమళాధారం మధురభక్తిసింధూరం
మహాభక్త మందారం భవభేదీభాంకారం
హృదయశంఖ ఓంకారం ధర్మధనుష్టంకారం
జగత్విజయఝంకారం అద్వైత ప్రాకారం భజేహం
అండాకారాండ పిండ భాస్వత్  బ్రహ్మాండ భాండ నాద లయ
బ్రహ్మాత్మక నవ్య జీవనాధారం  వరణ రహిత వరద మహిత
లలిత లలిత భావ లులిత భాగ్యరచిత భోగ్యమహిత వసుధైక కుటీరం
కాళిదాస బంధురం కళ్యాణకంధరం సద్గునైకమందిరం
సకలలోక సుందరం పుణ్యవర్ణపుష్కరం దురితకర్మ దుష్కరం  
శుభకరం శుధాకరం  సురుచిరం సుదీపరం భవకరం భవాకరం
క్రియక్షరం మచ్చరం భజేహం
మాధవమాయా మయమౌ కఠిన వికట కంటకపద
సంసారకానన సుఖ జ్ఞానశకట విహారం అష్టాక్షరీ ప్రతిష్ట
పంచాక్షరీ విశిష్ట మహామంత్ర యంత్ర తంత్ర  మహిమాలయగోపురం
కనకంబీరాంబరం శంభూ భూబంభరం నిర్మలయుగ నిర్ధరం
నిరుపమాననిర్జరం మధురభోగి కుంజరం పరమయోగి పంజరం
ఉత్తరం నిరుత్తరం మనుత్తరం మహత్తరం మహాతరం మహాంకురం తత్వమసితత్పరం కటికరక్త మోహరం మృత్యోరను
తత్వతరం అజరం అమరం మకారం ఉకారం అకారం
ఓంకారం అద్వైత ప్రాకారం
   


Comments

Popular posts from this blog

Mantrapushpam with Telugu meaning మంత్రపుష్పం

49 Maruts mentioned by Sri Sri Yogiraj LahiriMahasya Maharaj

Shree vidya upaasana