అష్టాదశ పురాణములు:



వేద వేదాంగులములలో వ్రాసినది చెప్పినది:
ఇంద్రియములు + మనస్సు + ప్రాణశక్తి వీటి నియంత్రణ గురించే చెప్పబడినది.
అష్టాదశ పురాణములు:
18 పురాణములలో సృష్టి కార్యక్రమము కథ పునరావృతం అవుతూ ఉంటుంది.
ప్రాచేతసుడి భార్య మరిష.  ప్రాచేతసుడు అనగా శుద్ధ చేతన. మరిష అనగా కోరిక. భౌతిక జగత్తుకి మూలకారణము కోరికలతో కూడిన శుద్ధ చేతన. అప్పుడు వ్యక్తీకరించినవాడినే దక్షుడు అంటారు. క్రమముగా ఆ దక్షుడే ప్రజాపతిగా వ్యవహరించబడ్డాడు.  తత్తదుపరి అనేకమంది ప్రజాపతులు వ్యక్తీకరించబడ్డారు. కనుక మొదటి పురుషుడే దక్ష ప్రజాపతి. మనస్సే బ్రహ్మ.
పరమాత్మ లోనిదే మాయ. మాయకు స్వతంత్ర ప్రతిపత్తి లేదు. విష్ణు, లలితా, కృష్ణ, రామ, బ్రహ్మ, శివ ఇత్యాది దేవీ దేవతలుగా పిలవబడేది మాయ. మా అనగా కాదు, య అనగా యదార్థము. పదార్ధము యదార్థము కానేరదు. మాయ అనగా పరమాత్మ శక్తి తనను తాను సృష్టి స్థితి లయలుగా విభజించుకొని పని నడుపుతూ ఉంటుంది.  సృష్టి అనగా బ్రహ్మ, స్థితి అనగా విష్ణు, శివ లయ అనగా శివ. ఒకే మనిషి భర్తగా, తండ్రిగా, కొడుకుగా, తాతగా, అధికారిగా వివిధములయిన రూపధారణ గావిస్తూ పనులు చేస్తూ ఉంటాడు. ఆ విధముగానే ఒకే పరమాత్మ శక్తి సృష్టి స్థితి లయలుగా విభజించుకొని ఈ జగత్తును  నడుపుతూ త్రిమూర్తులుగా వ్యవహరించబడుతూ ఉంటుంది. అనగా ఈ త్రిమూర్తులు ఒకే శక్తి యొక్క మూడు రూపములు.
 
1) బ్రహ్మ పురాణము: బ్రహ్మ అనగా సృష్టి. సృష్టి  ఎట్లా ఏర్పడినదీ తెలియ పరుస్తుంది ఈ పురాణము.   
2) పద్మ పురాణము: పద్మము నీటిలో ఉన్ననూ కుళ్ళి పోదు. సంసారము నీరులాంటిది. బోటు (boat) నీటిలో ఉండవచ్చు. నీరు బోటులో ఉండకూడదు. అదే విధముగా మనిషి సంసారము అనే నీటిలో ఉన్ననూ, సంసారము అనే నీరు మనిషి అనే బోటులో ఉండకూడదు. అనగా సంసారములో ఉంటూ సంసార తగులము ఉండకూడదు. ఇది తెలియజేసేదే పద్మపురాణము.
3) విష్ణుపురాణము: ఏర్పడిన జగత్తు స్థితివంతము ఎట్లా అగునో తెలియజేసేదే విష్ణుపురాణము.
భరతుడు అనే ధ్యానపరుడయిన రాజు ఒక లేడిపిల్లను ప్రాణసమానముగా పెంచుచూ దానిమీది మిక్కలి వ్యామోహముతో మరణించెను. దానివలన జింకగా జన్మించెను. కాని దానికి పూర్వజన్మ స్మృతి వలన ధ్యానముపయిననే మక్కువ ఉండెడిది. తదుపరి జన్మలో ఒక ధ్యానపరుని ఇంట జన్మించాడు. పూర్వజన్మజ్ఞానము వలన ఆయనకి ధ్యానముపయిననే మక్కువ ఉండెడిది. ఈ తడవ ఆయన దేనిమీదనూ వ్యామోహము పెట్టుకోనకుండా కేవలము పరమాత్మ మీదనే అనునిత్యము ధ్యాసతోనుండెడివాడు.  కాని బయటికి మందబుద్ధిగా ఉండెడివాడు. అందువలన జడభరతుడుగా పిలవబడేవాడు. అటుగా వెళ్తున్న రాజుగారి పల్లకిని మోయుటకు ఆయన్ని నియోగించారు. కానీ ఆ పల్లకీకి కుదుపులు కలిగి అసౌకర్యానికిగురి అయిన ఆ మహారాజు అడిగిన ప్రశ్నలకు అంతయూ మిథ్య, నేను ఈ పల్లకి మోయుట మిథ్య, నీవు మోయబడ్డావనుకొనుటయూ మిథ్యయే రాజాఅని చెప్పిన ఆ జడభరతుని సమాధానము విన్న రాజుగారు చకితుడవుతాడు. ఆ తరువాత జడభరతునికి శిష్యుడై బ్రహ్మజ్ఞానము పొంది ముక్తుడవుతాడు. 
జడ అనగా మరుగుపడిన భరత అనగా ప్రకాశము. మోహము వలన జ్ఞానము మరుగుపడుతుంది. క్రియాయోగ ధ్యానముతో ఆ మరుగుపడిన జ్ఞానమును తిరిగి ప్రకాశవంతము చేసికొనవలయును.        
4) శివపురాణము: ఏర్పడిన జగత్తు లయవంతము ఎట్లా అగునో తెలియజేసేదే శివపురాణము.
5) వామనపురాణము: వ అనగా వరిష్ఠమైన, మన అనగా మనస్సుతో ఆది భౌతిక, ఆదిదైవిక మరియు ఆధ్యాత్మిక అడ్డంకులను అధిగమించి అంకిత లేక త్యాగాభావముతో పరమాత్మతో అనుసంథానం పొందు. ఇది తెలియజేసేదే వామనపురాణము.
శ్రీమహావిష్ణువు బలిచక్రవర్తిని వామనుని అవతారములో వచ్చి మూడు అడుగుల భూమిని దానముగా ఇవ్వమని అడుగుతాడు. రాక్షస గురువు శుక్రాచార్యుడు వారిస్తున్నా వినక  మూడు అడుగుల భూమిని దానము ఇస్తాడు బలిచక్రవర్తి. 
ఇక్కడ వా అనగా వరిష్ఠ అని అర్థము. మన అనగా మనస్సు అని అర్థము. వామన అనగా వరిష్ఠ.  మనస్సు అని అర్థము. అనగా స్థిరమైన మనస్సు అని అర్థము.
స్థిరమైన మనస్సుకి మూడు అడుగులు అవసరము. సాధకునికి మూడు విధములయిన ఆటంకములు వస్తుంటాయి. అవి ఆదిభౌతిక, ఆదిదైవిక మరియు ఆధ్యాత్మిక ఆటంకములు. 
ఆదిభౌతిక ఆటంకములనగా శారీరక రుగ్మతలు,  ఆదిదైవిక ఆటంకములనగా మానసిక రుగ్మతలు మరియు ఆధ్యాత్మిక ఆటంకములనగా ధ్యానపరమయిన రుగ్మతలు. వీటినే మల, ఆవరణ మరియు విక్షేపణ దోషములు అంటారు.
శారీరక రుగ్మతలనగా జ్వరము, తలకాయనొప్పి, ఒళ్ళు నొప్పులు మొదలగునవి.
మానసిక రుగ్మతలనగా మనస్సుకు సంబంధించినవి. అనగా ఆలోచనలు మొదలగునవి.
ధ్యానపరమయిన రుగ్మతలనగా  నిద్ర, తంద్ర, విసుగు, మరియు బద్ధకము మొదలగునవి.
సాధకుడు అనగా ధ్యానయోగి పరమాత్మతో ఐక్యతకు ఈ మూడు రకములయిన విషయములయందు జాగ్రత్త వహించవలయును. అనగా స్థిరమైన మనస్సుకి ఈరకములయిన విషయములను వైరాగ్యముతో అణగద్రొక్క వలయును.  పరమాత్మని ప్రార్థించి  మూడు అడగటములు చేయవలయును. అవే ఈ  మూడు అడుగులు. రాగ్యము అనగా మోహము. ప్రతి వ్యక్తికీ తన సంతానము, ధనము, స్త్రీ, ఇత్యాదిపై రాగ్యము అనగా మోహము ఉంటుంది. వైరాగ్యము అనగా వైవిధ్యమయిన రాగ్యము అనగా మోహము. పరమాత్మ పయిన ఉండే రాగ్యమే ఈ వైరాగ్యము.  
ఏది చేసినా పరమాత్మే. కనుక ఆయనే ఈ మూడు అడుగులు సాధకుడిని అడుగుతాడు. సాధకుడు తీవ్రధ్యానములో ఉన్నప్పుడు ఆంగుష్ఠ ప్రమాణములో కూటస్థములో సూక్ష్మరూపములో వామనుడిగా  తన స్వస్వరూపములో కనబడుటయే దీనికితార్కాణం. 
బలి అనగా తనలోని విషయవాంఛలను  వైరాగ్యముతో అణగ ద్రొక్కుట.
చక్రవర్తి అనగా ఆలోచనా వృత్తులు వర్తులాకారముతో చక్రములాగా వస్తూ ఉంటాయి. బలిచక్రవర్తి అనగా వర్తులాకారములో వస్తున్న ఆలోచనలను వైరాగ్యముతో అణగద్రొక్కుట.
శుక్రాచార్యుడు అనగా అహంకారమును ఆచరించేవాడు. కామ, క్రోధ, లోభ,మోహ,మద మరియు మాత్సర్యములకు కారణభూతమయిన అహంకారమును త్యజించుటే బలి. వీటిని మనలోనే ఉంచుకొని వాటికి అతీతముగా సాధకుడు ఎదగవలయును. మనలోనే ఉంచుకొనటమే పాతాళానికి అణగద్రొక్కుట.  పాతాళము అనగా ఎక్కడోలేదు., మనలోనే ఉన్నది. అతీతము అనగా విషయవాంఛలను వైరాగ్యముతో అధిగమించి వాటికి అతీతముగా సాధకుడు ఎదుగుట.

6)మార్కండేయపురాణము: శ్వాసను అస్త్రముగా ఉపయోగించుటయే శ్వాస్త్రము. అది కాలక్రమేణ శాస్త్రము అయినది. శ్వాసను అస్త్రముగా ఉపయోగించి చిరంజీవిగా ఎలా ఉండవచ్చో తెలియజేసేదే మార్కండేయ పురాణము.
మహా మృత్యుంజయ మంత్రము: దీనిని త్రయంబక మంత్రం అనికూడా పిలుస్తారు. ఇది మృత్యువును జయించు మంత్రం. ఈ మంత్రం శివ లేదా మూడు కన్నుల వాడికి అంకితమయినది. ఇది మార్కండేయ మహర్షి విరచితము.
మనస్సుకకావికలమయినప్పుడు, కాలసర్పదోషమును నివారించుటకు, భయంకరమయిన రోగముల నివారణకు  ఈ మంత్రం తప్పక పఠించ వలయును.
 ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం
ఉరు వారుకమివ బంధనాత్ మృత్యోర్ముఖ్ క్షీయమామృతాత్ ।।
తాత్పర్యము: ఓం = పరమాత్మ,  త్రయంబకం = మూడుకన్నులవాడిని, యజామహే = ప్రార్థిస్తున్నాను.సుగంధిం = సువాసన గల,  పుష్టివర్ధనం =ఐశ్వర్యయుక్త మయిన దృఢమయిన, ఉరువారుకమివ = పెద్దది  శక్తిగల,  బంధనాత్ = మాయ అనే బంధమునుండి,  మృత్యోర్ముఖ్ క్షీయ = మృత్యువునుండి,   మా = నన్ను,  మృతాత్= అమృతత్వమునకు తీసికెళ్ళుగాక.
పరమాత్మ మూడుకన్నులవాడిని ప్రార్థిస్తున్నాను. సువాసన గల  ఐశ్వర్యయుక్త మయిన దృఢమయిన పెద్దది  శక్తిగల  మాయ అనే బంధముఅనే  మృత్యువునుండి  నన్ను అమృతత్వమునకు తీసికెళ్ళుగాక.  ఈ మంత్రమును 108 సార్లు కూటస్థములో మనస్సు దృష్టి పెట్టి చేయవలయును. తద్వారా నకారాత్మక శక్తులను అరికట్టవచ్చు.
7) వరాహ పురాణము: భక్తి, క్రమశిక్షణలు అనే దంత ద్వయంతో,  వ అనగా వరిష్ఠ మైన,  రాహ అనగా దారి, వరిష్ఠమైన దారిలో నడుస్తూ నీ కర్తవ్యమును నిర్వహించు. వ  వరిష్ఠమైన రాహ  మార్గము, వరాహమనగా  గొప్ప మార్గము. క్రియాయోగసాధనా మార్గము. అని ఉద్భోదించటమే హిరణ్యాక్ష వధ.
వరాహ అవతారములో పృథ్వీని పరమాత్మ రెండు దంతములతో పైకెత్తును. పృథ్వీకి ప్రతీక మనిషి. సంసారము నీటికి ప్రతీక.  మనిషికి రెండుజ్ఞానదంతములుండును. రెండుదంతములు జ్ఞానమునకు ప్రతీకలు. మనిషి పెద్దవాడయ్యేసరికి రెండుజ్ఞానదంతములు వచ్చును.  ఓ మనిషీ, సంసారమనే నీటిలో మునిగిపోకు. క్రియాయోగాసాధనతో సాధించిన  జ్ఞానముతో సంసారమునుండి బయటపడు. పరమాత్మతో అనుసంధానం పొందు అని తెలియజెప్పుటకు ఉద్దేశించినది వరాహావతారము. వరాహ/నరసింహా వతారములలో స్థూలశరీరమునకు సంబంధించిన  బ్రహ్మగ్రంది విచ్ఛేదము జరుగుతుంది. ఇది తెలియజేసేదే వరాహ పురాణము.
  
8) అగ్నిపురాణము: కర్మలను ఎట్లు దగ్ధము చేసికొనవచ్చునో తెలియజేసేదే అగ్నిపురాణము. ఆచారములు, దగ్ధ యోగములు, సూక్ష్మ నాడీ వివరణలు తెలియజేసేదే అగ్ని పురాణము.
9) కూర్మ పురాణము: కూర్మము అనగా తాబేలు. శతృవులనుండి తనను రక్షించుకోవటము కొఱకు తాబేలు తన అవయములను లోపలి ముడుచుకొనును. దినమునకు తాబేలు అతి తక్కువ శ్వాసక్రియచేయును. అందువలన ఎవ్వరూ హాని చేయనియడల కూర్మము దీర్ఘకాలము జీవించగలదు. అదేవిధముగా సాధకుడు తన ఇంద్రియ వ్యాపారములను క్రియాయోగము ద్వారా ఉపసంహరించుకొనవలయును. ప్రాణశక్తి నియంత్రణా ప్రావీణ్యము సంపాదించ వలయును. ఇది తెలియజేసేదే కూర్మ పురాణము.
    
10) భగవత్ మహాపురాణము: భగవత్ మహాపురాణమునకు మరొక పేరే శ్రీమద్భాగవతము. భ అనగా భక్తి, గ అనగా జ్ఞానము, వ అనగా వైరాగ్యము, త అనగా తత్ అనగా అది త్వమ్ నీవే అసి అనగా అయి ఉన్నావు. శ్రీ అనగా పవిత్రమయిన మత్ అనగా మనస్సు. భక్తి, జ్ఞానము, వైరాగ్యము, అది నీవే  అయి ఉన్నావు అనేదే పవిత్రమయిన మనస్సు.

శ్రీకృష్ణ తులాభారము

సత్యభామ అనగా సత్యము ఎప్పుడూ భామే. అనగా సత్యము నిత్య యౌవ్వని. అట్టి భామ శ్రీకృష్ణునితన్నుట  అనగా నిత్య యౌవ్వని అయిన సత్యము శ్రీకృష్ణ చైతన్యమును తలదన్నినది అనగా మిన్న అని అర్ధము. అట్టి సత్యమునకు కానుకగా పారి అనగా పరాశక్తి వలన జాతము అనగా  పుట్టిన పారిజాత వృక్షమే సరి అయిన కానుక. కనుక సత్యమునకు పరాకాష్ఠగా నిలిచిన సాధకునకు కూటస్థము నుండి అనగా శ్రీకృష్ణ చైతన్యము ఇచ్చే కానుకయే పారిజాతవృక్షము.  సముద్రమును సముద్రముతోనే పోల్చవలయును. శ్రీకృష్ణ చైతన్యమును శ్రీకృష్ణ చైతన్యము తోనే తుల అనగా తూచగల సి అనగా వు. అనగా శ్రీకృష్ణ చైతన్యమును శ్రీకృష్ణ చైతన్యముతోనే తూచగలవు. దానికి సాటి వేరొకటి లేదు. రుక్ మణి అనగా రుక్కులకు మణి ఓంకారము. భారము అనగా బరువు. కనుక శ్రీకృష్ణచైతన్య బరువును ఓంకారము తూచగలిగినది. ఇదియే శ్రీకృష్ణ తులాభారము.

గోవర్ధనగిరిపర్వతము
గోలోకము అనగా ఇంద్రియలోకము. ఇంద్రియములకు రాజు ఇంద్రుడు అనగా మనస్సు. మనస్సు అనేక వర్షములను అనగా ఆలోచనలను వర్షిస్తుంది. ఇంద్రియ విషయములు అనగా ఆలోచనలను గోవులు అంటారు. గోపాలురు ఆ ఇంద్రియ విషయములను పాలించేవారు.   ఇంద్రియములను నియంత్రించని యడల ఇంద్రియ విషయములు అనగా ఆలోచనలు పర్వతమంత ఎత్తుగా    పెరుగుతూనే ఉంటాయి. దానినే గోవర్ధన పర్వతము అంటారు. నియంత్రించని మనస్సు ఇంద్రుడు అనగా మనస్సు  వర్షిస్తూనే ఉంటుంది. ఆజ్ఞా చక్రము  అనగా కూటస్థములో తీవ్రమైన ధ్యానము చేయు క్రియాయోగ సాధకుడు కూటస్థుడు అయిన శ్రీకృష్ణ స్థితిని పొందుతే ఆలోచనా రహిత స్థితిని అనగా క్రియా పరావస్థ స్థితిని పొందగలుగుతాడు. అట్టి స్థితిని సాధించిన సాధకునికి వర్షములాంటి ఆలోచనలను నియంత్రించ గలుగుట చిటికిన వ్రేలుతో గోవర్ధన పర్వతము ఎత్తినంత తేలికగా అవుతుంది.
దీనినే శ్రీకృష్ణుడు గోవర్ధనపర్వతమును చిటికిన వ్రేలుతో ఎత్తుట అందురు.
గోపి అనేది గోప్యములోనుండి వచ్చినది. గోపిక అనగా ఆలోచన అని అర్థము. ప్రతి ఆలోచనలో ఉండే చైతన్యమె కృష్ణచైతన్యము. సాధారనమనుష్యునికి మాటవరసకు 16000గోపికలుఉంటాయి. వాటి వెనకాల పరమాత్మలేనిదే ఈ గోపికలు ఉండవు. దానినే నిరాకారస్థితికి చేరిన యోగీశ్వరుడు శ్రీకృష్ణ పరమాత్మకు 16000 గోపికలుఉండును అని చెప్పుటలో ఉద్దేశ్యము. ఆయన స్త్రీలోలుడు అనిచేప్పుట నీతిబాహ్యము.
నీ ఆలోచనంతా నామీదనే ఉండవలయునని చెప్పటమే గోపికా వస్త్రాపహరణముయొక్క ఉద్దేశ్యము.
ఇది తెలియజేసేదే భగవత్ మహాపురాణము లేదా శ్రీమద్భాగవతము.
11) లింగపురాణము: లింగ అనగా సూక్ష్మము అని అర్ధము.  మహా ప్రళయానంతరము సృష్టి సూక్ష్మరూపములో పరమాత్మలో నిక్షిప్తమై యుండును. తిరిగి సృష్టి ప్రారంభము అయినప్పుడు ఏ విధముగా స్థూల రూపము దాల్చునో తెలియజేసేదే లింగ పురాణము.
12) నారదపురాణము: నా లేని రద శరీరము అనగా ఆత్మ అని అర్ధము. సాధకునికి కలిగే ఆత్మ బోధయే నారదపురాణము.
ఈ సృష్టి యావత్తు పరమాత్మ అనగా సృష్టికి అతీతమైన సత్తు వలననే కలిగినది. సత్తునుండే సృష్టిలోని పరమాత్మ అనగా పరమాత్మ యొక్క సర్వశక్తిమంతమైన శుద్ధచైతన్యము కూటస్థచైతన్యముగానూ, మహాప్రకృతిగానూ, దానియొక్క ఆరువిధములైన  సమిష్టి కారణ, వ్యష్టి కారణ, సమిష్టిసూక్ష్మ, వ్యష్టి సూక్ష్మ, సమిష్టిస్థూల, వ్యష్టి స్థూల, చైతన్యములు ఆవిర్భవించినవి.
మహాప్రకృతి మరియు ఆరు చైతన్యములు కలిసి సప్తమహర్షులు అనగా మరీచి, అత్రి, అంగీరస, పులహ, క్రతు, పులస్త్య, మరియు వశిష్టులుగా పిలవబడుచున్నారు.   
సనక, సనందన, సనాతన మరియు సనత్కుమారులు సృష్టికర్తయైన బ్రహ్మయొక్క ఆది మానసపుత్రులుగా ఆవిర్భవించారు. వారినుండి మిగిలిన జీవసృష్టి ఆవిర్భవించినది. వీరిని పరమాత్మయొక్క  శుద్ధ నిర్మాణాత్మక మహాప్రకృతిగా చెప్పవచ్చు. 
సనక అనగా మొట్టమొదటి అని అర్థము. సానంద అనగా సంతోషముతోకూడిన అని అర్థము. సనాతన అనగా నిత్యమైన అని అర్థము.  సనత్కుమార అనగా నిత్యయౌవనము అని అర్థము. కాని ఈ బ్రహ్మ మానసపుత్రులైన సనక సనందనాదులు శుద్ధముగా, అమాయకముగా, ఉండిపోయి సంతానోత్పత్తికి ఇష్టపడలేదు.
కాని నిత్యసంతోషియైన పరమాత్మ మరియు మహాప్రకృతిలోని అంతర్గతమైన ఆనందము కలిసి సత్వ, రజో మరియు తమో గుణములకు దారితీసినవి. ఈ మూడుగుణములు మహాప్రకృతిలో కదలకుండా యున్న చెరువులోని నీరులాగా శాంతముగా ఉన్నవి.
కాని కదిలే లేక కదిలించే గుణముగల రజోగుణముయొక్క స్పందనలు మిగిలిన స్థితివంతమైన సత్వగుణమును, లయ లేదా నాశనము చేసే తమోగుణమును గూడా కదిలించేటట్లు చేసినది. తన స్పందనలతో రజోగుణము సృష్టికి కారణమయినది గాన దీనిని బ్రహ్మ అంటారు. స్థితివంతమైన సత్వగుణమును విష్ణువంటారు. లయ కారణమయినది గాన తమోగుణమును శివుడంటారు.
మహాప్రకృతిలోని అనేక రూపములలో అనుభూతి చెందటము అనే ఇచ్ఛ అంతర్గత ఆనందమును ఈ మూడుగుణములమీద నాలుగు ప్రధానమైన నిర్మాణాత్మక భావనలను (Ideas)రుద్దుతుంది.      అవి: స్పందన(ఓం)(vibration), కాలము(Time), దేశము(Space), మరియు అణు(the idea of division of one into many)అనగా ఒకే పరమాత్మను అనేక రూపములగావిభజించుట).
స్వయంభువ, స్వారోచిష, ఔత్తమి, తమస, రైవత, చక్షుష, వైవస్వత, సావర్ణి,దక్షసావర్ణి, బ్రహ్మసావర్ణి, ధర్మసావర్ణి, రుద్రసావర్ణి, రౌచ్య లేక దేవసావర్ణి,  భౌత్య లేక ఇంద్రసావర్ణి, అని  మనువులు పధ్నాలుగురు.  ప్రతిమనువు ఒక్కొక్క మన్వంతరమునకు ఆది పురుషుడు. ఒక మన్వంతరము పూర్తి అయిన తదుపరి ప్రళయము సంభవించి తత్తదుపరి మన్వంతరమునకు నాందిపలుకుతుంది.   
ప్రస్తుతము వైవస్వత మన్వంతరము జరుగుచున్నది. వైవస్వత అనగా  పరమాత్మ ప్రకాశము. మనువు అనగా మనస్సు. ఈ మనస్సు ద్వారానే చేతన గల మనిషి అవతరించేది. 
13) స్కందపురాణము: సర్వసిద్ధులను సమకూర్చొడి మహేశ్వర ధర్మములు కుమార స్వామిచే లోకానుగ్రహ బుద్ధితో చెప్పబడిన పురాణము ఇది. స్వామి అనగా తనను తాను తెలిసికునే కుమార అనగా శక్తి.  మహా అనగా అత్యంత తేజవంతము అయిన, ఈశ్వర అనగా ఈక్షణములను శ్వరములుగా గలవాడు.  తీవ్ర క్రియాయోగ సాధకుని ఈక్షణములు అనగా చూపులు అత్యంత తేజవంతము అయిన శ్వరములు అనగా బాణములు గా ఉండును.  అవి సర్వసిద్ధులను మరియు తనను తాను తెలిసికునే  శక్తిని సమకూర్చును.
మనలోని లోకములను వ్యష్టి అని, బ్రహ్మాండములోనివి సమిష్ఠిలోకములు అని అంటారు. వ్యష్టి లోనిది పాతాళ (మూలాధారచక్రము)  లోకము  సమిష్ఠిలోనిది భూలోకము.
వ్యష్టి లోనిది మహాతల (స్వాధిష్ఠానచక్రము)  లోకము  సమిష్ఠిలోనిది  భువర్ లోకము.
వ్యష్టి లోనిది తలాతల (మణిపురచక్రము)  లోకము  సమిష్ఠిలోనిది స్వర లోకము.
వ్యష్టి లోనిది రసాతల (అనాహతచక్రము)  లోకము  సమిష్ఠిలోనిది మహర్ లోకము.
వ్యష్టి లోనిది సుతల (విశుద్ధచక్రము)  లోకము  సమిష్ఠిలోనిది జనలోకము.
వ్యష్టి లోనిది వితల (ఆజ్ఞాచక్రము)  లోకము  సమిష్ఠిలోనిది తపోలోకము.
వ్యష్టి లోనిది అతల (సహస్రారచక్రము)  లోకము  సమిష్ఠిలోనిది సత్య లోకము.
క్రియయోగాసాధన ద్వారా ఈ వ్యష్టి లోని ఏడు మరియు  బ్రహ్మాండము లోని ఏడు సమిష్ఠిలోకములు  మొత్తము పదునాలుగు లోకములూ అనుగ్రహించబడును. ఇది తెలియజేసేదే స్కందపురాణము.
14. గరుడపురాణము: గ శబ్దము జ్ఞానమునకు ప్రతీక. అందుకనే గం గణపతయేనమః అంటారు. గ అనగా జ్ఞాన,  రుడ అనగా రూఢుడు  అనగా జ్ఞానారూఢుడు అవ్వాలని తెలియజేసేదే గరుడపురాణము. క్రియాయోగ ధ్యానము చేసి ఆ జ్ఞానప్రాప్తి పొందమని తెలియజేసేదే గరుడపురాణము.
కశ్యపునికి వినత మరియు కద్రువ అని ఇద్దరు భార్యలు. కద్రువది దుష్ట స్వభావము, వినతది శిష్ట స్వభావము. కద్రువకి పాములు సంతానము. వినతకి గరుడుడు సంతానము. వారిద్దరూ ఒక రోజున వాహ్యాళికి వెళ్తారు. తోకతో సహా ధవళ కాంతులతో మెరుస్తున్న గుర్రమును దూరమునుండి చూస్తారు. గుర్రము తోకతో సహా తెలుపు అని వినత, లేదు గుర్రము తోకనలుపు మిగిలినదంతా  తెలుపు అని కద్రువ, పందెము వేసికుంటారు. పందెములో ఓడినవారు ఇంకొకరికి ఊడిగము చేయవలయు షరతు పెట్టుకుంటారు. దుష్ట కద్రువ సలహాతో ఆవిడ పిల్లలు అయిన పాములు ఆ గుర్రముతోకకు వ్రేళ్ళాడుతారు. దానితో ఆ తోక నల్లగాకనబడి వినత మరియు వినత బిడ్డ అయిన గరుడుడు కద్రువకి బానిసలవుతారు. ఇంద్రుని వద్దనుండి అమృతము తెచ్చి ఇచ్చే పధ్ధతి మీద దాశ్యవిముక్తి కలుగ జేస్తాను అని మోసము చేసిన కద్రువ తెలియయజేస్తుంది. గరుడుడు ఆ అమృతము తెచ్చి ఇచ్చి దాశ్యమునుండి విముక్తులవుతారు.  ఇదీ కథ.
కశ్యపుడు అనగా మనిషి. ప్రతి మనిషిలోను దుష్ట స్వభావము, శిష్ట స్వభావము అని ఇద్దరు భార్యలు ఉంటారు. గుర్రము మరియు పాములు ఇంద్రియములకు ప్రతీకలు. తెల్ల గుర్రము ఇంద్రియ వ్యాపారములు నశించినదానికి ప్రతీక. కద్రువ అనగా ఇంద్రియములకు వశమయిన మనస్సు. అందువలన క్రియాయోగ సాధన చేయని సాధకుడు. వినత అనగా ఇంద్రియముల వశమునుండి దూరమయిన మనస్సు. క్రియాయోగ సాధన చేయుచున్న సాధకుడు. ఇట్టి సాధకుని మనస్సు క్రమముగా స్థిరత్వం చెందుతుంది. అది గరుడుడు అనగా జ్ఞానారూఢునికి జన్మనిస్తుంది. ఆ గరుడుడు ఇంద్రియములకు రాజైన ఇంద్రుడిని అనగా మనస్సును నియంత్రించగలుగుతాడు. అట్టి మనస్సు అమృతమును ఇస్తుంది. అంతవరకూ గుడ్డిగాఉన్న మనస్సు (కద్రువ) దాని సంతానము (ఇంద్రియములు) లకు అమృతమును అందకుండా చేస్తుంది.  సాధకుని దాశ్య విముక్తికి జ్ఞానారూఢుడు అయిన ఆ గరుడుడు కారణభూతుడు అవుతాడు.

15. మత్స్యపురాణము: మత్స్యము అనగా చేప. సంసారము అనేది నీరులాంటిది. మత్స్యము నీటిలో ఉన్ననూ కుళ్ళిపోదు. అదేవిధముగా సంసారములో ఉన్ననూ వ్యక్తికి సంసారతగులము ఉండకూడదు.
ఒక కాష్ఠ = 15 రెప్పపాటుల కాలము.
30 కాష్ఠలు = కల
30 కలలు = ముహూర్తము = 2 గడియలు =6 విఘడియలు  
30 ముహూర్తములు = 24 గంటలు.
16. వాయు పురాణము: అష్టాంగ యోగము ద్వారా ప్రాణశక్తి నియంత్రణ చేయుట, క్రియాయోగ ధ్యాన సాధన ద్వారా పరమాత్మతో మమైకము అగుటయే మానవజన్మ యొక్క సార్ధకత అని తెలియజేసేదే వాయు పురాణము.
12 మాత్ర (చిటికవేయునంత కాలము)ల కాలము పూరకము, 12 మాత్రల కాలము కుంభకము మరియు 12 మాత్రల కాలము రేచకము   చేయు ప్రాణాయామము మందము అంటారు.
21 మాత్రల కాలము పూరకము, 21 మాత్రల కాలము కుంభకము మరియు 21మాత్రల కాలము రేచకము, చేయు ప్రాణాయామము మధ్యమము అంటారు.
36 మాత్రల కాలము పూరకము, 36 మాత్రల కాలము కుంభకము మరియు 36 మాత్రల కాలము రేచకము, చేయు ప్రాణాయామము ఉత్తమము అంటారు.
ఈ పై విధముగా ప్రాణాయామ ప్రక్రియలను అని తెలియజేసేదే వాయు పురాణము.
17.  భవిష్య పురాణము: క్రియాయోగ సాధన చేయని వ్యక్తి ప్రవృత్తి, లక్షణములు, స్వభావములు, ఎట్లా ఉండునో తెలియజేసేదే భవిష్య పురాణము.
బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య మరియు శూద్ర కులములు అనేవి వారి వారి గుణములను బట్టి ఏర్పడినవి.
ఇంద్రియవిషయవాంఛలోలుడు, కాయకష్టము చేసేవాడు లేక కేవలము స్థూలశరీరము పైన ఆధారపడేవాడు శూద్రుడు, జ్ఞానసముపార్జనకై పాటుబడుతూ తన అజ్ఞానమును తొలగించుకొని ఆధ్యాత్మికతవైపు మనస్సును మళ్ళించుకొనేవాడు వైశ్యుడు, అంతఃశత్రువులను అరికట్టి, ఆత్మనిగ్రహశక్తిని పెంపొందించు కొని  ధ్యానము వైపు తీవ్రముగా ప్రయత్నము చేసేవాడు క్షత్రియుడు, ధ్యానముద్వారా పరమాత్మతో అనుసంధానము పొందేవాడు బ్రాహ్మణుడు.
ప్రతి వ్యక్తిలోనూ నకారాత్మక మరియు సకారాత్మక శక్తులు రెండూ ఉంటాయి. యోగాభ్యాసములు మరియు క్రియాయోగ ధ్యానముద్వారా తనలోని నకారాత్మక ప్రకృతిని ప్రవృత్తిని తొలగించుకొని సకారాత్మక ప్రకృతిని ప్రవృత్తిని వృద్ధి చేసికొని క్రమముగా అహం బ్రహ్మాస్మిఅనగా మానవుడు స్వయముగా తనలోని దైవత్వమును పెంపొందిచుకొని, తను కేవలము పరమాత్మచైతన్య స్వరూపుడని అర్ధము చేసికోనవలయును.  లేనియడల భవిష్యత్ లో తనలోని నకారాత్మక శక్తులు విజృంభించి మానవుడు దానవుడుగా మారతాడు. అకారణముగానే దేశ విధ్వంసమునకు పాల్పడుతాడు.  దేవాలయములను పవిత్ర స్థలములను నాశనము చేస్తాడు. అమాయకులను అతి దారుణముగా  ఊచకోతకోస్తాడు.    
18.బ్రహ్మాండపురాణము: సృష్టి కార్యక్రమము, ప్రపంచము వసతి కార్యములు అనగా మానవాళి నివసించుటకు వాస్తు ఇత్యాది వ్యవహారము లన్నియు ఈ బ్రహ్మాండపురాణము తెలియజేస్తుంది. మనిషికి గాలి వెలుతురు మరియు నీరు వసతులగురించి తెలియజెప్పేదే బ్రహ్మాండపురాణము.  
19. బ్రహ్మవైవర్త పురాణము: సృష్టి కార్యక్రమము జరిగిన తదుపరి ఆ సృష్టి ఎట్లా వ్యాప్తి చెందినదో తెలియజేస్తుందిబ్రహ్మవైవర్త పురాణము.

Comments

Popular posts from this blog

Mantrapushpam with Telugu meaning మంత్రపుష్పం

49 Maruts mentioned by Sri Sri Yogiraj LahiriMahasya Maharaj

Shree vidya upaasana