యోగిరాజ్ శ్రీ శ్రీ లాహిరీమహాశయ ప్రసాదించిన చిత్రములోని 50 మరుత్తుల వివరణ






ఆకాశము శబ్దమునకు మూలము. వాయువు స్పర్శ మరియు శబ్దమునకు మూలము. అగ్ని శబ్దస్పర్శ రూపములకు మూలము. జలము శబ్దస్పర్శ రూప రసములకు మూలము. పృథ్వీ శబ్దస్పర్శ రూప రస గంధములకు మూలము. పృథ్వీ శబ్దస్పర్శ రూప రస గంధములనేవి వివిధములయిన స్పందనలు.  వీటన్నిటికీ మూలము ఓంకారము. దీనినే సూక్ష్మ ప్రాణశక్తి అందురు.
ముందుగా గుర్తు పెట్టుకోవలసిన విషయము: ఈ వివిధములయిన అక్షరములను ఆయా చక్రములలో ఉచ్ఛారణ చేయుట వలన ఆయా చక్రములలోని దుర్గుణ లక్షణములను తొలగించుకొనవచ్చు.
ఒక మొబైల్ (mobile cell) సెల్ లోని బాటరీ లోని ఛార్జి అయిపోతే దానిని రిఛార్జి(recharge) చేయకపోతే ఆ మొబైల్ (mobile cell) సెల్ పనిచేయటము క్రమముగా ఆగి పోతుంది. కనుక ఈ అక్షరములను ఉచ్ఛారణ చేయుట అనేది మొబైల్ (mobile cell) సెల్ రిఛార్జి(recharge)లాంటిది.  లాహిరీ మహాశయుడు ప్రతి చక్రములోని ఆయా ఉపవాయువుల పనుల(functioning )గురించి వ్రాశారు.
ఈ చక్రములన్నిటికీ నెగటివ్ మరియు మరియు పాజిటివ్ అని ఉండదు. ఒక్క ఆజ్ఞా చక్రమునకు మాత్రము నెగటివ్ మరియు మరియు పాజిటివ్  ఉంటాయి. ఈ ఆజ్ఞా చక్రమునకు రెండు అక్షరములు అనగా ‘హ’ మరియు ‘క్ష’ అక్షరములు ఉంటాయి. ఈ రెండు అక్షరములను ఒకే అక్షరముగా అందుకనే పరిగణలోకి తీసికొనవలయును.  అందువలననే మొత్తము అక్షరములు 49 గానే అర్ధము చేసికొనవలయును. అందువలననే ఆజ్ఞా నెగటివ్ చక్రమునకు  మరియు ఆజ్ఞా పాజిటివ్ చక్రము రెండూ కలిపి ఒకే చక్రముగాపరిగణలోకి తీసికుంటారు. అంతేగాదు, ఈ మొత్తము గొట్టములాగా ఉండే ఆజ్ఞా చక్రమునకు రెండే దళములుగా లెక్కలోనికి తీసికుంటారు. ‘హ’ అనే ఆజ్ఞా నెగటివ్ చక్రమునుండి పరమాత్మశక్తి/చేతన లోనికి ప్రవహిస్తుంది. దీనినే సృష్టి లోని పరమాత్మ లేదా  శ్రీకృష్ణచైతన్యము అంటారు. ‘క్ష’ అనే ఆజ్ఞా పాజిటివ్ చక్రముద్వారా ఆ పరమాత్మశక్తి/చేతన సహస్రారచక్రము లోనికి ప్రవహిస్తుంది. అక్కడినుండి ఆజ్ఞా పాజిటివ్ చక్రముద్వారా మిగిలిన చక్రములలోనికే పంచబడుతుంది. అందువలననే ‘ఓం’ ని ముఖ్యప్రాణశక్తి అంటారు. 
సూక్ష్మ ప్రాణశక్తిగా పిలవబడే ఓంకారమే శరీరములో ప్రవేశించిన తదుపరి ముఖ్య ప్రాణశక్తిగా వ్యక్తీకరించబడుచున్నది. అదియే ప్రాణ, అపాన, వ్యాన, సమాన, మరియు ఉదాన వాయువులుగా అది చేయుపనులను బట్టి వ్యవహరించబడుచున్నది. అవి తిరిగి ముఖ్యప్రాణముతో కలిపి 50 వాయువులుగా/మరుత్తులుగా వ్యవహరించబడుచున్నవి.  ఈ మరుత్తులు ఒక్కొక్కటి ఒక్కొక్క వ్యవహారమునకు తోడ్పడును.    50 వాయువులు నిజానికి 50 రకములయిన స్పందనలను శరీరములో కలుగ చేయును.
మనము ఈ చక్రములలో ఆయా చక్ర సంబంధిత అక్షరములను ఉచ్ఛారణ చేయుటవలన వాటి నకారాత్మక స్పందనలు ఉపశమించును.ఇది ముఖ్యముగా గుర్తు పెట్టుకోవలసిన విషయము. 
50 వాయువులుగా/మరుత్తులుగా వ్యవహరించబడుచున్న ఈ మరుత్తులే 50 అక్షరములుగా వివిధ చక్రములలో వ్యవహరించబడుచున్నవి.
ఈ సందర్భముగా మహేశ్వర సూత్రములను ఉటంకించడమైనది.
మహేశ్వర సూత్రములు:
అయిఉణ్ ఋలుక్ ఏ ఓయ్ ఐఓచ్ హయవరాట్ లణ్ జ్ఞమణ్ణనమ్ జభగడదస్ ఖఫచఠదవ్ కపయ్
అనే శబ్దములవలన అచ్చులు, హల్లులు, హల్లులు మరియు అచ్చులు,  హల్లులతో కూడిన సంయుక్తాక్షరములు ఏర్పడినవి. 
జ్ఞానము మరియు శక్తి రెండునూ గలది సూక్ష్మప్రాణశక్తి. దీని మూలము  సహస్రారచక్రము. ఈ 49 ముఖ్యఉపవాయువుల మూలము సహస్రారచక్రము మూలముగాగల సూక్ష్మప్రాణశక్తి.
ప్రతి ఉపవాయువునకు అద్భుతమైన తన తన ప్రత్యేకమైన విధులున్నాయి.  అవి ఆజ్ఞా చక్రముద్వారా విశుద్ధ, అనాహత, మణిపుర, స్వాధిష్ఠాన మరియు మూలాదారచక్రములకు పంచ/పంప బడినవి. ఈ చక్రములనుండి నరకేంద్రములకు, వాటిద్వారా వివిధ అవయవములకు పంపబడును.

 మరుత్తులు ఏడుగురు. వారు:
1)ఆవహుడు, 2)ప్రవహుడు,3)వివహుడు, 4)పరావహుడు, 5)ఉద్వహుడు,   6)సంవహుడు, మరియు 7)పరివహుడు(మరీచి).
49 ముఖ్య ఉపవాయువులు పైన పేర్కొన్నట్లుగా  ఏడు విధములుగా విభజించబడ్డాయి. ఈవాయువులు మన లోపల ఉన్నవి మరియు మన వెలుపలి బ్రహ్మాండములోను యున్నవి. అందువలననే బ్రహ్మాండము, మనస్సు మరియు శరీరమునకు సంబంధము ఏర్పడుచున్నది.
 
క్రియాయోగాసాదనలో సాధకుడు వృధాగా బయటకి వెల్తున్న ప్రాణశక్తిని తిరిగి మేరుదండముద్వారా షట్ చక్రములద్వారా కూటస్థములోనికి పంపగలుగుతాడు. శిరస్సును ఒక అయస్కాంతముగా మరల్చ కలుగుతాడు. ప్రాణశక్తిని పినియల్ గ్రంధిలో, మేడుల్లాలో పెద్ద మెదడు(Medulla and Cerebrum)లో  కేంద్రీకరించగలుగుతాడు. 
వివిధములైన  అణువులు కలిసి ఒక పురుగు, వృక్షము, పక్షి, జంతువు మరియు మనిషిగా వివిధరూపములలో వ్యక్తమగుచున్నవి. ఈ ప్రాణులలో ఆన్నింటికీ మరియు ఆయా ప్రాణులకు సంబంధించిన అణువులకీ కావలసిన రీతిలో వివిధములుగా వ్యక్తమగుచున్నది ఈ ప్రాణశక్తే.  ఈ విధముగా మొత్తము మనిషికి తగురీతిగా లభ్య మగు ప్రాణమును ముఖ్య ప్రాణశక్తి అందురు.
ఆ ముఖ్య ప్రాణశక్తి గర్భధారణసమయములో జీవాత్మతో పాటుగా ప్రవేశించును. ఆయా ప్రాణియొక్క కర్మననుసరించి జీవితాంతము వరకు ఉండును. ఆ జీవి మనుగడ ఆహారము, ప్రాణవాయువుమీద ఆధారపడి యుంటుంది. అంతేకాక ఈ ముఖ్యప్రాణశక్తి బ్రహ్మాండమునుండి పరమాత్మచేతన రూపముగా మేడుల్లా ద్వారా పెద్దమెదడు (Cerebrum) లో ప్రవిశించి నిక్షిప్తమై యుండును. అక్కడినుండి మేరుదండములోని వివిధ చక్రములకు తగురీతిలో పంచబడును. 
ప్రాణశక్తి దేహమంతావ్యపించియుండును. కాని వివిధభాగములలో వివిధములైన పనులుచేస్తూ వివిధ నామములతో వ్యక్తమగుచున్నది.
ప్రాణవాయువుగా స్ఫటికీకరణము(Crystallization)నకు అనగా అన్ని పనుల వ్యక్తీకరణకు తోడ్పడును.
అపానవాయువుగా అన్ని వ్యర్థ పదార్థముల  విసర్జన(Elimination)కు తోడ్పడును. వ్యానవాయువుగా ప్రసరణ(Circulation)కు   తోడ్పడును.
సమానవాయువుగా స్పాంజీకరణ(Assimilation)కు అనగా అరుగుదలకు, తద్వారా వివిధకణములకు, అంగములకు కావలసిన పోషకపదార్థముల వితరణ మరియు చచ్చినకణముల స్థానములలో  కొత్తకణములను సృష్టించుటకు  తోడ్పడును.
కేశవృద్ధి, చర్మము, మాంసము మొదలగు వాటికి వివిధ రకములైన కణములు కావలయును. అందుకు అనంతమైన సమీకరణములు జరుగుచుండును. ఆ పద్ధతిని  జీవాణుపాక అందురు. ఉదానవాయువుగా జీవాణుపాక(Metabolizing)కు  తోడ్పడును.
ప్రాణ అపాన అనేవి మన శరీరములో రెండు ముఖ్యమైన విద్యుత్తులు.
మొదటిది అపానవిద్యుత్తు. అది రెండుకళ్ళ మధ్యనున్న  కూటస్థమునుండి మూలాధారముగుండా దానిని ఆనుకొని క్రిందయున్న మలద్వారము ద్వారా  బయటకు పోవునది. ఇది చంచలమైనది. మనిషిని ఇంద్రియలోలుడ్ని చేయును.
రెండవది ప్రాణవిద్యుత్తు: ఇది మలద్వారము గుండా దానిని ఆనుకొనియున్న మూలాధారము ద్వారా కూటస్థమునకు పోవునది. ఇది శాంతియుతమైనది. నిద్ర మరియు ధ్యాన సమయములోనూ, మనిషి ఏకాగ్రతను పరమాత్మతో కలుపును. కనుక ఒక విద్యుత్తు మనిషిని క్రిందకు అనగా బాహ్యప్రపంచమునకు లాగును. ఇంకొక విద్యుత్తు మనిషిని  లోపలికి అనగా అంతర్ముఖము చేయును.  సాధనకు అంతర్ముఖము అగుటద్వారా పరమాత్మపొందు సులభమగును. దీనినే క్రియాయోగమందురు. 
ముఖ్యప్రాణము కూటస్థమునుండి మలద్వారము ద్వారా బహిర్గతమగునపుడు,  కణములు, కండరములు మరియు అంగములు మెదడుకు సమాచారము తీసికెళ్ళుటకు, పట్టుకెళ్ళేందుకు ఉపయోగములోఉండే నరములవలననూ మరియు మానసిక వ్యాపారములవలననూ శక్తి ఖర్చు అగును. అప్పుడు అవి వ్యర్థ లేక కలుషితములను రక్తములో వదిలిపెట్టును. వాటిలో కార్బన్ డయాక్సైడ్ (CO2) ఒకటి. ఆ కలుషితరక్తమును వెంటవెంటనే శుద్ధీకరణ చేయుట చాలా అవసరము. లేనియడల భౌతికమరణము సంభవించును. ఆ ఖర్చయినశక్తిని పునరుద్ధరించుటకు శ్వాస ద్వారా వచ్చు ఈ ముఖ్య ప్రాణము అవసరము.
మేరుదండములోని  ప్రాణ అపానముల పరస్పర విరుద్ధమైన లాగుళ్ళ వలన శ్వాస నిశ్వాసల ప్రక్రియ జరుగును. ప్రాణశక్తి పైకి పోయినప్పుడు ప్రాణవాయువుతో కూడిన ప్రాణశక్తిని ఊపిరితిత్తుల(lungs) లోనికి తీసికొనివెళ్ళి కార్బన్ డయాక్సైడ్ ను(co2) వెంటనే  తీసివేయును. దీనినే శ్వాసపీల్చుకోవటం అంటారు.  అదే పొట్టలోని ద్రవ మరియు ఘన పదార్థముల శుద్ధీకరణ చేయుటకు ఎక్కువ సమయము పట్టును. ఆ శుద్ధీకరణ చేసిన లేక అయిన  శక్తిని కణములలోనికి పంపునది ప్రాణశక్తే. ఈశుద్ధీకరణ చేసిన లేక అయిన ప్రాణశక్తి మేరుదండములోని అన్ని చక్రములలోను, కూటస్థము మరియు  పెద్దమెదడు (cerebrum)లలోను శక్తిని పునరిద్ధరించు చుండును. శ్వాసలోని మిగులు శక్తిని రక్తము శరీరము మొత్తములోను తీసికెళ్ళుచూ ఉండును. అక్కడ పంచప్రాణములు వాటికి కావలిసినరీతిలో ఉపయోగించు కొనును.




½ స్థూల వాయువు= సమిష్టి స్థూల వ్యానవాయువు 

1/8 స్థూల వాయువు +1/8 స్థూల ఆకాశము = స్థూల సమిష్టిసమాన వాయువు
1/8 స్థూల వాయువు +1/8 స్థూల అగ్ని = స్థూల సమిష్టి ఉదాన
1/8 స్థూల వాయువు +1/8 స్థూల జలము = స్థూల సమిష్టి ప్రాణ
1/8 స్థూల వాయువు +1/8 స్థూల పృథ్వి = స్థూల సమిష్టి అపాన






పంచప్రాణములు/ఉపప్రాణములు
స్థానము
ఉదాన(విశుద్ధ )
కంఠము
ప్రాణ(అనాహత)
హృదయము
సమాన(మణిపుర)
నాభి
వ్యాన(స్వాధిష్ఠాన)
లింగం వెనకాలలో
అపాన(మూలాధారము)
ముడ్డి
నాగ
గొంతులో (త్రేణుపులకు కారణము)
కూర్మ
కనురెప్పలకదలికకు కారణము
కృకర
తుమ్ములు వచ్చుటకు కారణమైనది
దేవదత్త
ఆవలింతలు వచ్చుటకు కారణ మైనది.
ధనంజయ
సర్వశరీరములోను,ఆఖరికిస్థూలశరీరపతనానంతరము గూడా శరీరములో ఉండి ప్రాణము పోయిన పదినిమిషముల వరకు స్థూలలశరీరమును వేడిగా నుంచును.




 


ఆజ్ఞాచక్రమురెండు అక్షరములు –‘& క్ష’. ఓం కేంద్ర అక్షరము.
విశుద్ధచక్ర- 16 – అక్షరములు, , , , , , , అలు, అలూ, , , , , అం, అః ఉదానవాయువు,
అనాహతచక్ర —12 అక్షరములు, , , , , , , , , , , ప్రాణవాయువు,
మణిపురచక్ర—10 అక్షరములు, ,, , , , , , , సమానవాయువు,
స్వాధిష్ఠానచక్ర—6 అక్షరములు, , , , , వ్యానవాయువు,
మూలాధార చక్ర—4 అక్షరములు, , , అపానవాయువు,


ఆజ్ఞాచక్రము లో ముఖ్యప్రాణము ఓంగా వ్యక్తీకరించుకొనుచున్నది.  అందువలననే హిందువులు అక్షరాభ్యాస సమయమున ఓంఅనే అక్షరమును ప్రథమముగా  పిల్లలచేత ఉచ్ఛారణ చేయించుదురు.  సౌలభ్యముకొరకు  క్రింద సంగ్రహముగా తత్తదుపరి విపులముగానూ ఇవ్వబడినది.
50 వాయువులు 50 రకములయిన స్పందనలను కలగజేయును.  విశుద్ధ చక్రములలోని కేంద్ర సంయుక్త అక్షరము హం’.  ఆజ్ఞాచక్రము మరియు విశుద్ధ చక్రములలోని ఈ కేంద్ర  అక్షరములు  అనగా వాయువులు అనగా స్పందనలు  స్వతంత్రమయినవిగా గమనించవలయును.  అనాహత(కేంద్ర సంయుక్త అక్షరము యం), మణిపుర(రం), స్వాధిష్ఠాన(వం),  మూలాధార (లం) అనే అక్షరములు  అనగా వాయువులు అనగా స్పందనలు  స్వతంత్రమయినవికానివిగా  గమనించవలయును. అవి ఒకదానిపై ఒకటి ఆధారపడి పనిచేస్తాయి.
మూలాధార, స్వాధిష్ఠాన, మరియు మణిపురచక్రములు బ్రహ్మగ్రంథి ప్రాంతము.
మణిపుర, అనాహత, మరియు విశుద్ధచక్రములు రుద్రగ్రంథి ప్రాంతము.
విశుద్ధ, ఆజ్ఞా, మరియు సహస్రారచక్రములు విష్ణుగ్రంథి ప్రాంతము.
బ్రహ్మగ్రంథి, మరియు రుద్రగ్రంథి విచ్ఛేదన జరిగితేనే ముక్తి లేదా పరమాత్మతో అనుసంధానమునకు మార్గము సుగమము అవుఉంది. కుండలినీ జాగృతి చెంది విశుద్ధను త్రాకితే, అప్పుడు క్రింది చక్రముల లాగుడునుంచి తప్పించుకోవచ్చు. అందువలననే అనాహతచక్రము దాటువరకు సాధకుడు చాలా జాగ్రత్తగా మరియు తీవ్రముగా ధ్యానము చేయవలయును. తన ధ్యాన సాధనకు అంతరాయము కలగకుండా చూచుకొనవలయును. 
పరమపూజనీయ పరమహంస శ్రీ శ్రీయోగానంద స్వామివారి శ్రీమద్భగవద్గీతలోని యోగిరాజ్ శ్రీ శ్రీ లాహిరీమహాశయ ప్రసాదించిన చక్రముల చిత్రములో మరుత్తులగురించి ప్రస్తావించారు. దీనిలోని అంకెలు మరియు అక్షరములు బెంగాలీ లిపిలో ఉన్నది. అవి యథాతథముగా వ్రాయబడినది. ఏవైనా దోషములుంటే అది నా అవగాహనా దోషమే.

1)ప్రవహ శ్వాసిని టానా మహాబల్,
2) పరివహ విహగ ఉడ్డీయాన ఋతవాహ
3) పరివహ సప్తస్వర శబ్ద స్థితి,
4) పరివహ ప్రాణ నిమీళన బహిర్గమన త్రిశక్ర
5) పరావహ మాతరిశ్వా అణు సత్యజిత్,
6) పరావహ జగత్ ప్రాణ బ్రహ్మఋత 
7) పరావహ పవమాన క్రియార్ పరావస్థఋతజిత్
8) పరావహ నవప్రాణ ప్రాణరూపో చిత్వహిత్ ధాతా
9) పరావహ హమి మోక్ష అస్తిమిత్ర
10) పరావహ సారఙ్ నిత్య పతివాస 
11) పరావహ స్తంభన సర్వవ్యాపిమిత 
12) ప్రవహ శ్వసనశ్వాస ప్రశ్వాసాదిఇంద్ర
13) ప్రవహ సదాగతి గమనాదౌ గతి 
14) ప్రవహపృవదశ్యస్పర్శశక్తిఅదృశ్యగతి   
15) ప్రవహగంధ వాహ అనుష్ణ అశీతఈదృక్ష
16) ప్రవహ వాహ చలన వృతిన
17) ప్రవహవేగికంతభోగకామ
18) ఉద్వహ వ్యాన జృంభణ ఆకుంచన ప్రసారణ ద్విశక్ర
19) ఆవహ గంధవహ గంధేర్ అణుకే ఆనే త్రిశక్ర
20) ఆవహ ఆశుగ శైఘ్రం అదృక్ష
21) ఆవహ మారుత భిత్తరేర్  వాయు అపాత్
22) ఆవహ పవన పవన అపరాజిత
23) ఆవహ ఫణిప్రియ ఊర్ధ్వగతి ధృవ
24) ఆవహ నిశ్వాసక త్వగింద్రియ వ్యాపి యుతిర్గ
25) ఆవహ ఉదాన ఉద్గీరణ సకృత్
26) పరివహ అనిల్ అనుష్ణ అశీత అక్షయ
27) పరివహ సమిరణపశ్చిమేర్ వాయు సుసేన
28) పరివహ అనుష్ణ  శీతస్పర్శ పసదీక్ష 
29) పరివహ సుఖాస సుఖదా దేవదేవ
30) వివహ వాతివ్యక్ సంభవ
31) వివహ ప్రణతి ధారనా  అనమిత్ర
32) వివహ ప్రకంపన కంపన భీమ
33) వివహ సమాన పోషణ ఏక జ్యోతి
34) ఉద్వహ మరుత ఉత్తరదిగేర్ వాయుసేనాజిత్
35) ఉద్వహ నభస్థాన అపంకజ అభియుక్త
36) ఉద్వహ ధునిధ్వజ ఆదిమిత 
37) ఉద్వహ కంపనా సేచనా ధర్తా
38) ఉద్వహ వాస దేహవ్యాపి విధారణ
39) ఉద్వహ మృగవాహన విద్యుత్ వరణ
40) సంవహ చంచల ఉత్క్షేపణ ద్విజ్యోతి
41) సంవహ పృషతాంపతి బలంమహాబల
42) సంవహ అపాన క్షుధాకర అధోగమన ఏకశక్ర
43) వివహ స్పర్శన స్పర్శ విరాట్
44) వివహ వాత తిర్యక్  గమన పురాణహ్య 
45) వివహ ప్రభంజన మన పృథక్ సుమిత 
46) సంవహ అజగత్ ప్రాణ జన్మమరణ అదృశ్య
47) సంవహ ఆవక్ ఫేలా పురిమిత్ర
48) సంవహ సమిర ప్రాతఃకాలేర్ వాయుసఙ్ మిత
49) సంవహ ప్రకంపన గంధేర్ అణుకే ఆనే మితాసన 

 విభజన:
అ)
1)ప్రవహ శ్వాసిని టానా మహాబల్
12) ప్రవహ శ్వసనశ్వాస ప్రశ్వాసాదిఇంద్ర
13) ప్రవహ సదాగతి గమనాదౌ గతి 
14) ప్రవహపృవదశ్యస్పర్శశక్తిఅదృశ్యగతి   
15) ప్రవహగంధ వాహ అనుష్ణ అశీతఈదృక్ష
16) ప్రవహ వాహ చలన వృతిన
17) ప్రవహవేగికంతభోగకామ                                7
ఆ)
2) పరివహ విహగ ఉడ్డీయాన ఋతవాహ
3) పరివహ సప్తస్వర శబ్ద స్థితి,
4) పరివహ ప్రాణ నిమీళన బహిర్గమన త్రిశక్ర
26) పరివహ అనిల్ అనుష్ణ అశీత అక్షయ
27) పరివహ సమిరణపశ్చిమేర్ వాయు సుసేన
28) పరివహ అనుష్ణ  శీతస్పర్శ పసదీక్ష 
29) పరివహ సుఖాస సుఖదా దేవదేవ                      7
ఇ)
5) పరావహ మాతరిశ్వా అణు సత్యజిత్,
6) పరావహ జగత్ ప్రాణ బ్రహ్మఋత 
7) పరావహ పవమాన క్రియార్ పరావస్థఋతజిత్
8) పరావహ నవప్రాణ ప్రాణరూపో చిత్వహిత్ ధాతా
9) పరావహ హమి మోక్ష అస్తిమిత్ర
10) పరావహ సారఙ్ నిత్య పతివాస 
11) పరావహ స్తంభన సర్వవ్యాపిమిత                         7
ఈ)
18) ఉద్వహ వ్యాన జృంభణ ఆకుంచన ప్రసారణ ద్విశక్ర
34) ఉద్వహ మరుత ఉత్తరదిగేర్ వాయుసేనాజిత్
35) ఉద్వహ నభస్థాన అపంకజ అభియుక్త
36) ఉద్వహ ధునిధ్వజ ఆదిమిత 
37) ఉద్వహ కంపనా సేచనా ధర్తా
38) ఉద్వహ వాస దేహవ్యాపి విధారణ
39) ఉద్వహ మృగవాహన విద్యుత్ వరణ                    7
ఉ)
19) ఆవహ గంధవహ గంధేర్ అణుకే ఆనే త్రిశక్ర
20) ఆవహ ఆశుగ శైఘ్రం అదృక్ష
21) ఆవహ మారుత భిత్తరేర్  వాయు అపాత్
22) ఆవహ పవన పవన అపరాజిత
23) ఆవహ ఫణిప్రియ ఊర్ధ్వగతి ధృవ
24) ఆవహ నిశ్వాసక త్వగింద్రియ వ్యాపి యుతిర్గ
25) ఆవహ ఉదాన ఉద్గీరణ సకృత్                              7
ఊ)
30) వివహ వాతివ్యక్ సంభవ
31) వివహ ప్రణతి ధారనా  అనమిత్ర
32) వివహ ప్రకంపన కంపన భీమ
33) వివహ సమాన పోషణ ఏక జ్యోతి
43) వివహ స్పర్శన స్పర్శ విరాట్
44) వివహ వాత తిర్యక్  గమన పురాణహ్య 
45) వివహ ప్రభంజన మన పృథక్ సుమిత                7
ఋ)
40) సంవహ చంచల ఉత్క్షేపణ ద్విజ్యోతి
41) సంవహ పృషతాంపతి బలంమహాబల
42) సంవహ అపాన క్షుధాకర అధోగమన ఏకశక్ర
46) సంవహ అజగత్ ప్రాణ జన్మమరణ అదృశ్య
47) సంవహ ఆవక్ ఫేలా పురిమిత్ర
48) సంవహ సమిర ప్రాతఃకాలేర్ వాయుసఙ్ మిత
49) సంవహ ప్రకంపన గంధేర్ అణుకే ఆనే మితాసన          7

ఆరు చక్రములలో ఉన్న అన్ని అక్షరములు కలిపి సహస్రారములో ఉండును.
ఆయా చక్రమునకు సంబంధించిన అక్షరములు, వాయువుల పనులు (functions)ఈ క్రింద ఇవ్వబడినవి.
వీటికి అర్థములు తెలుగులో ఇచ్చుటకు ప్రయత్నమూ చేసితిని. నా ఈ ప్రయత్నమును ఆశీర్వదించ ప్రార్థన:   

A)ఆజ్ఞా  (సూక్ష్మప్రాణశక్తి)
ఆజ్ఞా చక్రము(ప్రవహ ప్రాణ’) శ్రీకృష్ణతత్వమునకు అనగా సృష్టిలోని పరమాత్మకు ప్రతీక, దీని కూతురు విశుద్ధచక్రము.  విశుద్ధచక్రము ఆకాశతత్వమునకు అనగా (పరివహ ప్రాణ’) అనగా శబ్దమునకు ప్రతీక. విశుద్ధచక్రము కూతురు అనాహతచక్రము, అనాహత చక్రము వాయుతత్వమునకు అనగా స్పర్శకు (ఆవహ ప్రాణ’) ప్రతీక.  దీని కూతురు మణిపుర చక్రము అగ్నితత్వము.  అనగా రూపమునకు (ఉద్వహ ప్రాణ’) ప్రతీక. దీని కూతురు స్వాధిష్ఠాన చక్రము జలతత్వము.  అనగా రసమునకు (వివహ ప్రాణ’) అనగా రుచికి ప్రతీక. స్వాధిష్ఠానచక్రము కూతురు మూలాధారచక్రము పృథ్వీతత్వము.   గంధమునకు అనగా వాసనకి (సంవహ ప్రాణ’) ప్రతీక.
1)ప్రవహ శ్వాసిని టానా మహాబల్  (ఓం) = ఓం అనే అక్షరమే అన్ని ప్రాణ శక్తులకూ మూలమయిన  మహత్తరమయిన సూక్ష్మప్రాణశక్తి.  దీనినే ప్రవహ శ్వాసినిగా వ్యవహరిస్తారు.
ఈ ఆజ్ఞాచక్ర కేంద్రమును స్పందింపచేసే అక్షరము ఓం’.  ఈ చక్రమునకు రెండు దళములు ఉన్నవి. & క్ష  అక్షరములు అనేవి ఆ రెండు దళములు వాటిని గట్టిగా ఉచ్ఛారణ చేస్తే ఆ చక్రమును  రెండు ప్రక్కలా స్పందింపచేయవచ్చు. తద్వారా ముఖ్యప్రాణశక్తి మిగిలిన విశుద్ధ, అనాహత, మణిపుర, స్వాధిష్ఠాన, మరియు మూలాధార చక్రములకు అందుతుంది. కుండలినీ జాగృతి చెందుతుంది. ఆరోగ్యము కుదుటగా ఉండుటయేగాక   పరమాత్మ పొందు సౌలభ్యమగుతుంది.  
B)విశుద్ధ చక్రము: ఇది ఉదానవాయువు స్థానము. (కేశవృద్ధి, చర్మము, మాంసము మొదలగు వాటికి వివిధ రకములైన కణములు కావలయును. అందుకు అనంతమైన సమీకరణములు జరుగుచుండును. ఆ పద్ధతిని  జీవాణుపాక అందురు. ఉదానవాయువు గా జీవాణుపాక(Metabolism)కు  తోడ్పడును.
        ఆజ్ఞా చక్రము(ప్రవహ ప్రాణ’) శ్రీకృష్ణతత్వమునకు అనగా సృష్టిలోని పరమాత్మకు ప్రతీక, దీని కూతురు విశుద్ధచక్రము.  విశుద్ధచక్రము ఆకాశతత్వమునకు అనగా (పరివహ ప్రాణ’) అనగా శబ్దమునకు ప్రతీక. విశుద్ధచక్రము కూతురు అనాహతచక్రము, అనాహత చక్రము వాయుతత్వమునకు అనగా స్పర్శకు (ఆవహ ప్రాణ’) ప్రతీక.  దీని కూతురు మణిపుర చక్రము అగ్నితత్వము.  అనగా రూపమునకు (ఉద్వహ ప్రాణ’) ప్రతీక. దీని కూతురు స్వాధిష్ఠాన చక్రము జలతత్వము.  అనగా రసమునకు (వివహ ప్రాణ’) అనగా రుచికి ప్రతీక. స్వాధిష్ఠానచక్రము కూతురు మూలాధారచక్రము పృథ్వీతత్వము.   గంధమునకు అనగా వాసనకి (సంవహ ప్రాణ’) ప్రతీక.
   
ఈ విశుద్ధచక్ర కేంద్రమును స్పందింపచేసే అక్షరము హం. విశుద్ధచక్రము లోని    స్పందనలు ఉదానవాయువు యొక్క స్పందనలు. దీనిని  పరివహ ప్రాణ అనగా ఉదానవాయు మార్గము అంటారు. 
స్థూలదేహ పతనానంతరము, సూక్ష్మ, కారణ, మరియు కర్మలను వాయుమండలములోనికి పక్షిమాదిరి  తీసికెళ్ళునది  ఈ ఉదానవాయువె. పరివహ ప్రాణమరియు ప్రవాహ శ్వాసినిరెండూ interact అవుతాయి. కంప్యూటర్ లోని  CPU లోకి అన్ని విద్యుత్తులూ ప్రవేశించి ఆ తరువాత తమ కార్యక్రమములను (programmes) చేసికొనే రీతిన అన్ని వాయువులూ అనగా ప్రాణ, అపాన, సమాన, వ్యాన, మరియు ఉదాన వాయువులు  ప్రవాహ శ్వాసినితో అనగా ముఖ్య ప్రాణశక్తి తో interact అవుతాయి.
విశుద్ధచక్రమునకు పదహారు దళములు ఉన్నవి.   , , , , , , ,ఋూ, అలు, అలూ, , , , , అం, అః  అక్షరములు అనేవి ఆ పదహారు దళములు.  వాటిని గట్టిగా ఉచ్ఛారణ చేస్తే ఆ చక్రమును  పదహారు ప్రక్కలా స్పందింపచేయవచ్చు. తద్వారా ముఖ్యప్రాణశక్తి మిగిలిన  అనాహత, మణిపుర, స్వాధిష్ఠాన, మరియు మూలాధార చక్రములకు అందుతుంది. కుండలినీ జాగృతి చెందుతుంది. ఆరోగ్యము కుదుటగా ఉండుటయేగాక   పరమాత్మ పొందు సౌలభ్యమగుతుంది.    
2) పరివహ విహగ ఉడ్డీయాన ఋతవాహ (అ)= విశుద్ధచక్రముచుట్టూ ఉదానవాయువుయొక్క స్పందనలు పదహారువిధములుగా ఉంటాయి. ఒక్కొక్కప్పుడు తనకుతానే, మరికొన్ని సమయములలో ఇతర వాయువులతో కలిపి స్పందిస్తుంది ఈ ఉదాన వాయువు. పరివహ అనగా మార్గము లేక స్పందన. పరివహ ప్రాణ అనగా ఉదానవాయువు. కాని ఈ పదహారువిధముల ఉదానవాయువు స్పందనలు కూడా ఆ  ప్రవాహ శ్వాసినితో అనగా ముఖ్య ప్రాణశక్తి తో interact అవుతాయి.
ఇక్కడి (అ) అక్షరము యొక్క ఉచ్ఛారణ  ఎగిరే పక్షిమాదిరి పరమాత్మతో అనుసంధానం చూపు స్పందన.  
3) పరివహ సప్తస్వర శబ్ద స్థితి ( ఆ)= ఇక్కడి (ఆ) అక్షరము యొక్క ఉచ్ఛారణ సప్తస్వరములతో కూడిన సంగీతము మాదిరి ఉండే ఉదానవాయువు యొక్క శబ్ద స్థితి స్పందన. 
4) పరివహ ప్రాణ నిమీళన బహిర్గమన త్రిశక్ర (ఇ)= ఇక్కడి (ఇ) అక్షరము యొక్క ఉచ్ఛారణ బయటకు వెడలు త్రిగుణాత్మకమైన మనస్సును నియంత్రించగల ఉదానవాయువు యొక్క స్పందన.
5) పరావహ మాతరిశ్వా అణు సత్యజిత్, (ఈ) = ఇక్కడి (ఈ) అక్షరము యొక్క ఉచ్ఛారణ పరావహ అనగా తరువాత లేదా క్రమశః సత్యమును జయించ గల ఉదానవాయువు యొక్క స్పందన.
6) పరావహ జగత్ ప్రాణ బ్రహ్మఋత  (ఉ)= ఇక్కడి (ఉ) అక్షరము యొక్క ఉచ్ఛారణ బ్రహ్మను పొంద గల ఉదానవాయువు యొక్క స్పందన.
7) పరావహ పవమాన క్రియార్ పరావస్థఋతజిత్  (ఊ)= ఇక్కడి (ఊ) అక్షరము యొక్క ఉచ్ఛారణ క్రియాపరావస్థను పొంద గల ఉదానవాయువు యొక్క స్పందన.
8) పరావహ నవప్రాణ ప్రాణరూపో చిత్వహిత్ ధాతా (ఋ)= ఇక్కడి (ఋ) అక్షరము యొక్క ఉచ్ఛారణ మనస్సును నవప్రాణములకు ప్రాణమయిన  బ్రహ్మమార్గమునకు మళ్ళించ గల ఉదానవాయువు యొక్క స్పందన.
9) పరావహ హమి మోక్ష అస్తిమిత్ర (ఋూ) = ఇక్కడి (ఋూ) అక్షరము యొక్క ఉచ్ఛారణ మనలను అనగా సాధకుడుని మోక్ష మార్గమునకు మళ్ళించ గల ఉదానవాయువు యొక్క స్పందన.
10) పరావహ సారఙ్ నిత్య పతివాస (అలు)= ఇక్కడి (అలు) అక్షరము యొక్క ఉచ్ఛారణ శివుని వశపరచుకొన గల ఉదానవాయువు యొక్క స్పందన. 
11) పరావహ స్తంభన సర్వవ్యాపిమిత  (అలూ) = ఇక్కడి (అలూ) అక్షరము యొక్క ఉచ్ఛారణ సాధకునిసర్వవ్యాప్తి చెందించ గల ఉదానవాయువు యొక్క స్పందన.
12) ప్రవహ శ్వసనశ్వాస ప్రశ్వాసాదిఇంద్ర (ఎ)= ఇక్కడి (ఎ) అక్షరము యొక్క ఉచ్ఛారణ మనస్సును శ్వాస నిశ్వాసలకు లోనుచేయు అనగా చంచలము చేయ గల ఉదానవాయువు యొక్క స్పందనను మళ్ళించగలది.  ఇక్కడ ఉదానవాయువు ప్రవాహ అనగా ముఖ్యప్రాణశక్తితో interact అవటము గమనించ ప్రార్థన.
13) ప్రవహ సదాగతి గమనాదౌ గతి  (ఐ)= ఇక్కడి (ఐ) అక్షరము యొక్క ఉచ్ఛారణ సదాగతి అనగా మంచిమార్గమునకు దారితీయ గల ఉదానవాయువు యొక్క స్పందన.
14) ప్రవహపృవదశ్యస్పర్శశక్తిఅదృశ్యగతి  (ఒ) = ఇక్కడి (ఒ) అక్షరము యొక్క ఉచ్ఛారణ పరమాత్మ స్పర్శను పొందించ గల ఉదానవాయువు యొక్క స్పందన. 
15) ప్రవహగంధ వాహ అనుష్ణ అశీతఈదృక్ష(ఔ)= ఇక్కడి (ఔ) అక్షరము యొక్క ఉచ్ఛారణ శీతోష్ణములు లేని భావము కలిగించగల ఉదానవాయువు యొక్క స్పందన.
16) ప్రవహ వాహ చలన వృతిన (అం) = ఇక్కడి (అం) అక్షరము యొక్క ఉచ్ఛారణ మనస్సును స్థిరపరచ గల ఉదానవాయువు యొక్క స్పందన.
17) ప్రవహవేగికంతభోగకామ(అః) =ఇక్కడి (అః) అక్షరము యొక్క ఉచ్ఛారణ శుభేచ్ఛను ప్రసాదించ గల ఉదానవాయువు యొక్క స్పందన.
C)అనాహత  (ప్రాణవాయువుగా స్ఫటికీకరణము(Crystallization)నకు అనగా అన్ని పనుల వ్యక్తీకరణకు తోడ్పడును).
ఆజ్ఞా చక్రము(ప్రవహ ప్రాణ’) శ్రీకృష్ణతత్వమునకు అనగా సృష్టిలోని పరమాత్మకు ప్రతీక, దీని కూతురు విశుద్ధచక్రము.  విశుద్ధచక్రము ఆకాశతత్వమునకు అనగా (పరివహ ప్రాణ’) అనగా శబ్దమునకు ప్రతీక. విశుద్ధచక్రము కూతురు అనాహతచక్రము, అనాహత చక్రము వాయుతత్వమునకు అనగా స్పర్శకు (ఆవహ ప్రాణ’) ప్రతీక.  దీని కూతురు మణిపుర చక్రము అగ్నితత్వము.  అనగా రూపమునకు (ఉద్వహ ప్రాణ’) ప్రతీక. దీని కూతురు స్వాధిష్ఠాన చక్రము జలతత్వము.  అనగా రసమునకు (వివహ ప్రాణ’) అనగా రుచికి ప్రతీక. స్వాధిష్ఠానచక్రము కూతురు మూలాధారచక్రము పృథ్వీతత్వము.   గంధమునకు అనగా వాసనకి (సంవహ ప్రాణ’) ప్రతీక.

ప్రాణవాయువు యొక్క స్థానము అనాహత చక్రము. అందువలన ఇక్కడి స్పందనలు ప్రాణవాయువు యొక్క స్పందనలు. దీనిని  ఆవహ ప్రాణ అనగా ప్రాణవాయు మార్గము అంటారు.
అనాహత చక్రముచుట్టూ ప్రాణవాయువుయొక్క స్పందనలు 12 విధములుగా ఉంటాయి. ఒక్కొక్కప్పుడు తనకుతానే, మరికొన్ని సమయములలో ఇతర వాయువులతో కలిపి స్పందిస్తుంది ఈ ప్రాణ వాయువు.   కాని 12 విధముల ప్రాణవాయువు స్పందనలు కూడా ఆ  ప్రవాహ శ్వాసినితో అనగా ముఖ్య ప్రాణశక్తి తో interact అవుతాయి.  
ఈ అనాహత చక్ర కేంద్రమును స్పందింపచేసే అక్షరము యం’.  ఈ చక్రమునకు 12 దళములు ఉన్నవి.   , , , , , , , , , , , , ’  అక్షరములు అనేవి ఆ 12 దళములు. వాటిని గట్టిగా ఉచ్ఛారణ చేస్తే ఆ చక్రమును  12 ప్రక్కలా స్పందింపచేయవచ్చు. తద్వారా ముఖ్యప్రాణశక్తి మిగిలిన  మణిపుర, స్వాధిష్ఠాన, మరియు మూలాధార చక్రములకు అందుతుంది. కుండలినీ జాగృతి చెందుతుంది. ఆరోగ్యము కుదుటగా ఉండుటయేగాక   పరమాత్మ పొందు సౌలభ్యమగుతుంది.    

18) ఉద్వహ వ్యాన జృంభణ ఆకుంచన ప్రసారణ ద్విశక్ర (క)= ఉద్వహఅనగా కూతురు. ఉద్వహ వ్యాన జృంభణ  అనగా తగ్గిన  వాయును ఎక్కువచేసి   ముడుచుకున్నహృదయ స్పందలను సరి చేయు స్పందన  ఇక్కడి (క) అక్షరము యొక్క ఉచ్ఛారణ. ప్రాణవాయువు మరియు సమానవాయువు ల మిశ్రమస్పందన.
19) ఆవహ గంధవహ గంధేర్ అణుకే ఆనే త్రిశక్ర (ఖ)= ఇక్కడి (ఖ) అక్షరము యొక్క ఉచ్ఛారణ వాసనకలగజేయు అణువులను తీసుకొనిరాగల  ప్రాణవాయువు యొక్క మనో/హృదయ స్పందన
20) ఆవహ ఆశుగ శైఘ్రం అదృక్ష (గ)= ఇక్కడి (గ) అక్షరము యొక్క ఉచ్ఛారణ కంటికి కనబడనంత శీఘ్రముగా వచ్చు ప్రాణవాయువు యొక్క స్పందన.
21) ఆవహ మారుత భిత్తరేర్  వాయు అపాత్ (ఘ)= ఇక్కడి (ఘ) అక్షరము యొక్క ఉచ్ఛారణ లోపల ప్రకంపనలను కలగచేయు ప్రాణవాయువుయొక్క  అద్భుత స్పందన
22) ఆవహ పవన పవన అపరాజిత ( ఙ)= ఇక్కడి (ఙ) అక్షరము యొక్క ఉచ్ఛారణ జయించలేని అనగా అమితమయిన ప్రాణవాయువుయొక్క స్పందన.
23) ఆవహ ఫణిప్రియ ఊర్ధ్వగతి ధృవ ( చ)= ఇక్కడి (చ) అక్షరము యొక్క ఉచ్ఛారణ పయికిలేచే పాముపడగలాంటి ప్రాణవాయువుయొక్క స్పందన.
24) ఆవహ నిశ్వాసక త్వగింద్రియ వ్యాపి యుతిర్గ( ఛ)= ఇక్కడి (ఛ) అక్షరము యొక్క ఉచ్ఛారణ చర్మమును గగుర్పాటు కలిగించు ప్రాణవాయువుయొక్క స్పందన
25) ఆవహ ఉదాన ఉద్గీరణ సకృత్ (జ)= ఇక్కడి (జ) అక్షరము యొక్క ఉచ్ఛారణ మధ్య మధ్య త్రేపులు తెప్పించు/కలగజేయు ప్రాణవాయువు మరియు ఉదానవాయువు ల మిశ్రమస్పందన.  
26) పరివహ అనిల్ అనుష్ణ అశీత అక్షయ (ఝ)=  ఇక్కడి (ఝ) అక్షరము యొక్క స్పందన ఉదానవాయువుతో కలిసిన మిశ్రమ స్పందన. ఇది శీతలరహిత ఉష్ణరహిత  మరియు తరగని  ప్రాణవాయువు ఉదానవాయువుతో కలిసిన మిశ్రమ స్పందన.
27) పరివహ సమిరణపశ్చిమేర్ వాయు సుసేన (ఞ)=ఇక్కడి (ఞ) అక్షరము యొక్క స్పందన ఉదానవాయువుతో కలిసిన మిశ్రమ స్పందన. ప్రాణవాయువు ఉదానవాయువుతో కలిసిన ఈ మిశ్రమ స్పందన పశ్చిమము వయిపు పోవు స్పందన. 
28) పరివహ అనుష్ణ  శీతస్పర్శ పసదీక్ష  (ట)= ఇక్కడి (ట) అక్షరము యొక్క స్పందన ఉదానవాయువుతో కలిసిన మిశ్రమ స్పందన. ప్రాణవాయువు ఉదానవాయువుతో కలిసిన ఈ మిశ్రమ స్పందన ఉష్ణరహిత శీతల స్పర్శసామర్థ్యముగల స్పందన.
29) పరివహ సుఖాస సుఖదా దేవదేవ (ఠ)= ఇక్కడి (ఠ) అక్షరము యొక్క స్పందన ఉదానవాయువుతో కలిసిన మిశ్రమ స్పందన. ప్రాణవాయువు ఉదానవాయువుతో కలిసిన ఈ మిశ్రమ స్పందన  ఆనందము కలగజేయు సామర్థ్యముగల స్పందన.

D)మణిపుర (సమానవాయువుగా స్పాంజీకరణ(Assimilation)కు అనగా అరుగుదలకు, తద్వారా వివిధకణములకు, అంగములకు కావలసిన పోషకపదార్థముల వితరణ మరియు చచ్చినకణముల స్థానములలో  కొత్తకణములను సృష్టించుటకు  తోడ్పడును).
ఆజ్ఞా చక్రము(ప్రవహ ప్రాణ’) శ్రీకృష్ణతత్వమునకు అనగా సృష్టిలోని పరమాత్మకు ప్రతీక, దీని కూతురు విశుద్ధచక్రము.  విశుద్ధచక్రము ఆకాశతత్వమునకు అనగా (పరివహ ప్రాణ’) అనగా శబ్దమునకు ప్రతీక. విశుద్ధచక్రము కూతురు అనాహతచక్రము, అనాహత చక్రము వాయుతత్వమునకు అనగా స్పర్శకు (ఆవహ ప్రాణ’) ప్రతీక.  దీని కూతురు మణిపుర చక్రము అగ్నితత్వము.  అనగా రూపమునకు (ఉద్వహ ప్రాణ’) ప్రతీక. దీని కూతురు స్వాధిష్ఠాన చక్రము జలతత్వము.  అనగా రసమునకు (వివహ ప్రాణ’) అనగా రుచికి ప్రతీక. స్వాధిష్ఠానచక్రము కూతురు మూలాధారచక్రము పృథ్వీతత్వము.   గంధమునకు అనగా వాసనకి (సంవహ ప్రాణ’) ప్రతీక.

సమానవాయువు యొక్క స్థానము మణిపురచక్రము. అందువలన ఇక్కడి స్పందనలు సమానవాయువు యొక్క స్పందనలు. దీనిని  ఉద్వహ ప్రాణ అనగా సమానవాయు మార్గము అంటారు.
మణిపుర చక్రముచుట్టూ సమానవాయువుయొక్క స్పందనలు  10 విధములుగా ఉంటాయి. ఒక్కొక్కప్పుడు తనకుతానే, మరికొన్ని సమయములలో ఇతర వాయువులతో కలిపి స్పందిస్తుంది ఈ సమాన వాయువు.  కాని   10 విధముల సమానవాయువు స్పందనలు కూడా ఆ  ప్రవాహ శ్వాసినితో అనగా ముఖ్య ప్రాణశక్తి తో interact అవుతాయి.
ఈ మణిపుర చక్ర కేంద్రమును స్పందింపచేసే అక్షరము రం’.  ఈ చక్రమునకు 10 దళములు ఉన్నవి.   , , , , , , , , ,  అక్షరములు అనేవి ఆ 10 దళములు. వాటిని గట్టిగా ఉచ్ఛారణ చేస్తే ఆ చక్రమును  10 ప్రక్కలా స్పందింపచేయవచ్చు. తద్వారా ముఖ్యప్రాణశక్తి మిగిలిన స్వాధిష్ఠాన, మరియు మూలాధార చక్రములకు అందుతుంది. కుండలినీ జాగృతి చెందుతుంది. ఆరోగ్యము కుదుటగా ఉండుటయేగాక   పరమాత్మ పొందు సౌలభ్యమగుతుంది.    

30) వివహ వాతివ్యక్ సంభవ (డ)= ఇక్కడి (డ) అక్షరము యొక్క ఉచ్ఛారణ స్పష్టమయిన రుచికి హేతువయిన వ్యానవాయు స్పందన.
31) వివహ ప్రణతి ధారనా  అనమిత్ర (ఢ)= ఇక్కడి (ఢ) అక్షరము యొక్క ఉచ్ఛారణ ధారనా కలగజేయు వ్యానవాయు స్పందన.
32) వివహ ప్రకంపన కంపన భీమ (ణ) = ఇక్కడి (ణ) అక్షరము యొక్క ఉచ్ఛారణ భయంకరమయిన స్పందనలు కలగజేయు వ్యానవాయు స్పందన.
33) వివహ సమాన పోషణ ఏక జ్యోతి (త) = ఇక్కడి (త) అక్షరము యొక్క ఉచ్ఛారణ పోషణ పదార్థముల అరుగుదలకై సమాన మరియు వ్యానవాయువుల మిశ్రమ స్పందన.
34) ఉద్వహ మరుత ఉత్తరదిగేర్ వాయుసేనాజిత్ (థ) = ఇక్కడి (థ) అక్షరము యొక్క ఉచ్ఛారణ ఉత్తరదిక్కు  అనగా హృదయము వయిపునకు మళ్ళు సమాన వాయు ప్రకంపనలు.
35) ఉద్వహ నభస్థాన అపంకజ అభియుక్త (ద) = ఇక్కడి (ద) అక్షరము యొక్క ఉచ్ఛారణ నాభి ప్రదేశములోని సమాన వాయు ప్రకంపనలు.
36) ఉద్వహ ధునిధ్వజ ఆదిమిత  (ధ) = ఇక్కడి (ధ) అక్షరము యొక్క ఉచ్ఛారణ శబ్దముతో కూడిన సమాన వాయు ప్రకంపనలు.
37) ఉద్వహ కంపనా సేచనా ధర్తా  (న) = ఇక్కడి (న) అక్షరము యొక్క ఉచ్ఛారణ ఆర్ద్రతతో కూడిన సమాన వాయు ప్రకంపనలు.
38) ఉద్వహ వాస దేహవ్యాపి విధారణ (ప) = ఇక్కడి (ప) అక్షరము యొక్క ఉచ్ఛారణ దేహమంతయు వ్యాపించు సమాన వాయు ప్రకంపనలు.
39) ఉద్వహ మృగవాహన విద్యుత్ వరణ (ఫ) = ఇక్కడి (ఫ) అక్షరము యొక్క ఉచ్ఛారణ విద్యుత్ తో కూడిన  సమాన వాయు ప్రకంపనలు.

E)స్వాధిష్ఠాన (వ్యానవాయువుగా ప్రసరణ-Circulation కు   తోడ్పడును).
ఆజ్ఞా చక్రము(ప్రవహ ప్రాణ’) శ్రీకృష్ణతత్వమునకు అనగా సృష్టిలోని పరమాత్మకు ప్రతీక, దీని కూతురు విశుద్ధచక్రము.  విశుద్ధచక్రము ఆకాశతత్వమునకు అనగా (పరివహ ప్రాణ’) అనగా శబ్దమునకు ప్రతీక. విశుద్ధచక్రము కూతురు అనాహతచక్రము, అనాహత చక్రము వాయుతత్వమునకు అనగా స్పర్శకు (ఆవహ ప్రాణ’) ప్రతీక.  దీని కూతురు మణిపుర చక్రము అగ్నితత్వము.  అనగా రూపమునకు (ఉద్వహ ప్రాణ’) ప్రతీక. దీని కూతురు స్వాధిష్ఠాన చక్రము జలతత్వము.  అనగా రసమునకు (వివహ ప్రాణ’) అనగా రుచికి ప్రతీక. స్వాధిష్ఠానచక్రము కూతురు మూలాధారచక్రము పృథ్వీతత్వము.   గంధమునకు అనగా వాసనకి (సంవహ ప్రాణ’) ప్రతీక.

వ్యానవాయువు యొక్క స్థానము స్వాధిష్ఠాన చక్రము. అందువలన ఇక్కడి స్పందనలు వ్యానవాయువు యొక్క స్పందనలు. దీనిని  వివహ ప్రాణ అనగా వ్యానవాయు మార్గము అంటారు.

స్వాధిష్ఠాన చక్రముచుట్టూ వ్యానవాయువుయొక్క స్పందనలు  6 విధములుగా ఉంటాయి. ఒక్కొక్కప్పుడు తనకుతానే, మరికొన్ని సమయములలో ఇతర వాయువులతో కలిపి స్పందిస్తుంది ఈ వ్యాన వాయువు.  కాని   6 విధముల వ్యానవాయువు స్పందనలు కూడా ఆ  ప్రవాహ శ్వాసినితో అనగా ముఖ్య ప్రాణశక్తి తో interact అవుతాయి.
ఈ స్వాధిష్ఠానచక్ర కేంద్రమును స్పందింపచేసే అక్షరము వం.  ఈ చక్రమునకు 6 దళములు ఉన్నవి.   , , , , ,   అక్షరములు అనేవి ఆ 6 దళములు. వాటిని గట్టిగా ఉచ్ఛారణ చేస్తే ఆ చక్రమును  6 ప్రక్కలా స్పందింపచేయవచ్చు. తద్వారా ముఖ్యప్రాణశక్తి మిగిలిన  మూలాధార చక్రమునకు అందుతుంది. కుండలినీ జాగృతి చెందుతుంది. ఆరోగ్యము కుదుటగా ఉండుటయేగాక   పరమాత్మ పొందు సౌలభ్యమగుతుంది.    
 
40) సంవహ చంచల ఉత్క్షేపణ ద్విజ్యోతి (బ)= ఇక్కడి (బ) అక్షరము యొక్క ఉచ్ఛారణ ఎగజిమ్ము అనగా అధికమయిన చంచలమయిన అపాన వాయువు ప్రకంపనలు లేక స్పందనలు. 
41) సంవహ పృషతాంపతి బలంమహాబల (భ) = ఇక్కడి (భ) అక్షరము యొక్క ఉచ్ఛారణ మహా బలమయిన తడితోకూడిన వ్యాన మరియు అపాన వాయువుల మిశ్రమ  ప్రకంపనలు లేక స్పందనలు.
42) సంవహ అపాన క్షుధాకర అధోగమన ఏకశక్ర (మ)= ఇక్కడి (మ) అక్షరము యొక్క ఉచ్ఛారణ ఆకలితో కూడి మనస్సును క్రిందకి అనగా భౌతికత అనగా మాయాప్రపంచము వయిపునకు లాగు ఆకలితో కూడిన వ్యాన మరియు అపాన వాయువుల మిశ్రమ ప్రకంపనలు లేక స్పందనలు.
43) వివహ స్పర్శన స్పర్శ విరాట్ (య)=  ఇక్కడి (య) అక్షరము యొక్క ఉచ్ఛారణ కామముతో కూడిన స్పర్శకై వ్యాన వాయువు ప్రకంపనలు లేక స్పందనలు.
44) వివహ వాత తిర్యక్  గమన పురాణహ్య  (ర)= ఇక్కడి (ర) అక్షరము యొక్క ఉచ్ఛారణ భౌతికమైన ఆనందముకై మాయవయిపు లాగే  వ్యానవాయువు ప్రకంపనలు లేక స్పందనలు.
45) వివహ ప్రభంజన మన పృథక్ సుమిత (ల)= ఇక్కడి (ల) అక్షరము యొక్క ఉచ్ఛారణ భౌతికత అనగా మాయాప్రపంచము వయిపునకు లాగు వ్యానవాయువు ప్రకంపనలు లేక స్పందనలు.

        
F)మూలాధారము(అపానవాయువుగా అన్ని వ్యర్థ పదార్థముల  విసర్జన(Elimination)కు తోడ్పడును).
ఆజ్ఞా చక్రము(ప్రవహ ప్రాణ’) శ్రీకృష్ణతత్వమునకు అనగా సృష్టిలోని పరమాత్మకు ప్రతీక, దీని కూతురు విశుద్ధచక్రము.  విశుద్ధచక్రము ఆకాశతత్వమునకు అనగా (పరివహ ప్రాణ’) అనగా శబ్దమునకు ప్రతీక. విశుద్ధచక్రము కూతురు అనాహతచక్రము, అనాహత చక్రము వాయుతత్వమునకు అనగా స్పర్శకు (ఆవహ ప్రాణ’) ప్రతీక.  దీని కూతురు మణిపుర చక్రము అగ్నితత్వము.  అనగా రూపమునకు (ఉద్వహ ప్రాణ’) ప్రతీక. దీని కూతురు స్వాధిష్ఠాన చక్రము జలతత్వము.  అనగా రసమునకు (వివహ ప్రాణ’) అనగా రుచికి ప్రతీక. స్వాధిష్ఠానచక్రము కూతురు మూలాధారచక్రము పృథ్వీతత్వము.   గంధమునకు అనగా వాసనకి (సంవహ ప్రాణ’) ప్రతీక.

అపానవాయువు యొక్క స్థానము మూలాధారచక్రము. అందువలన ఇక్కడి స్పందనలు అపానవాయువు యొక్క స్పందనలు. దీనిని  సంవహ ప్రాణ అనగా అపానవాయు మార్గము అంటారు.

మూలాధారచక్రముచుట్టూ అపానవాయువుయొక్క స్పందనలు నాలుగువిధములుగా ఉంటాయి. ఒక్కొక్కప్పుడు తనకుతానే, మరికొన్ని సమయములలో ఇతర వాయువులతో కలిపి స్పందిస్తుంది ఈ అపాన వాయువు.   కాని ఈ నాలుగువిధముల (అపాన వాయువు స్పందనలు కూడా ఆ  ప్రవాహ శ్వాసినితో అనగా ముఖ్య ప్రాణశక్తి తో interact అవుతాయి.
ఈ మూలాధారముచక్ర కేంద్రమును స్పందింపచేసే అక్షరము లం’.  ఈ చక్రమునకు 4 దళములు ఉన్నవి.   , , ,  అక్షరములు అనేవి ఆ 4 దళములు. వాటిని గట్టిగా ఉచ్ఛారణ చేస్తే ఆ చక్రమును  4 ప్రక్కలా స్పందింపచేయవచ్చు. తద్వారా ముఖ్యప్రాణశక్తి  మూలాధార చక్రమునకు అందుతుంది. కుండలినీ జాగృతి చెందుతుంది. ఆరోగ్యము కుదుటగా ఉండుటయేగాక   పరమాత్మ పొందు సౌలభ్యమగుతుంది.    
46) సంవహ అజగత్ ప్రాణ జన్మమరణ అదృశ్య (వ)= ఇక్కడి (వ) అక్షరము యొక్క ఉచ్ఛారణ జన్మమరణములుగల ఈ కదిలే  మాయాప్రపంచము వయిపునకు లాగు అపానవాయువు ప్రకంపనలు లేక స్పందనలు.
47) సంవహ ఆవక్ ఫేలా పురిమిత్ర  (శ)= ఇక్కడి (శ) అక్షరము యొక్క ఉచ్ఛారణ చంచలమయిన  అపానవాయువు ప్రకంపనలు లేక స్పందనలు.
48) సంవహ సమిర ప్రాతఃకాలేర్ వాయుసఙ్ మిత (ష)= ఇక్కడి (ష) అక్షరము యొక్క ఉచ్ఛారణ ఉదయమే బహిర్భూమికి వెళ్ళుటకై  వచ్చు అపానవాయువు ప్రకంపనలు లేక స్పందనలు.
49) సంవహ ప్రకంపన గంధేర్ అణుకే ఆనే మితాసన. (స)= ఇక్కడి (స) అక్షరము యొక్క ఉచ్ఛారణ ఉదయమే బహిర్భూమికి వెళ్ళుటకై  వచ్చు వాసనతోకూడినఅపానవాయువు ప్రకంపనలు లేక స్పందనలు.

* మూలాధారచక్ర కేంద్రమును స్పందింపచేసే అక్షరము లం’.
 స్వాధిష్ఠానచక్ర కేంద్రమును స్పందింపచేసే అక్షరము వం’.
 , , ,అనేవి మూలాధారమును   4 ప్రక్కలా స్పందింపచేసే అక్షరములు. వీటిలోని వ అక్షరముతో అం అనే అచ్చు కలిపి వం అనే సయుక్తాక్షరము ఏర్పడుతుంది. అది స్వాధిష్ఠానచక్రము యొక్క కేంద్రము అవుతుంది. అపానవాయువు మూలాధారచక్రము యొక్క స్థానము. అపానవాయువుగా అన్ని వ్యర్థ పదార్థముల  విసర్జన(Elimination)కు తోడ్పడును.  
 కనుక స్వాధిష్ఠానచక్ర సంబంధిత అనగా లింగ సంబంధిత అంగములకు అపానవాయువు వ్యర్థ పదార్థముల  విసర్జన(Elimination) యొక్క Inter action అవసర నిమిత్తము ఈ విధమయిన ఏర్పాటు మనిషికి జన్మతః లభించిన వరము.
మణిపుర చక్ర కేంద్రమును స్పందింపచేసే అక్షరము రం’.
స్వాధిష్ఠానచక్రము యొక్క    , , , , , లోని    అక్షరమునకు అం అనే అచ్చు కలిపి రం అనే సయుక్తాక్షరము ఏర్పడుతుంది. అది మణిపుర చక్రము యొక్క కేంద్రము అవుతుంది. సమానవాయువు మణిపురచక్రము యొక్క స్థానము. సమానవాయువు స్పాంజీకరణ(Assimilation)కు అనగా అరుగుదలకు, తద్వారా వివిధకణములకు, అంగములకు కావలసిన పోషకపదార్థముల వితరణ మరియు చచ్చినకణముల స్థానములలో  కొత్తకణములను సృష్టించుటకు  తోడ్పడును. కనుక మణిపురచక్ర సంబంధిత అనగా ఉదర సంబంధిత అంగములకు వ్యానవాయువు ప్రసరణ(Circulation) యొక్క Inter action అవసర నిమిత్తము ఈ విధమయిన ఏర్పాటు మనిషికి జన్మతః లభించిన వరము.
అనాహతచక్ర కేంద్రమును స్పందింపచేసే అక్షరము యం’.
స్వాధిష్ఠానచక్రము యొక్క    , , , , , లోని    అక్షరమునకు అం అనే అచ్చు కలిపి యం అనే సయుక్తాక్షరము ఏర్పడుతుంది. అది అనాహతచక్రము యొక్క కేంద్రము అవుతుంది. ప్రాణవాయువు అనాహత చక్రము యొక్క స్థానము.  ప్రాణవాయువు స్ఫటికీకరణము(Crystallization)నకు అనగా అన్ని పనుల వ్యక్తీకరణకు తోడ్పడును. కనుక హృదయ సంబంధిత అంగములకు వ్యానవాయువు ప్రసరణ(Circulation) యొక్క Inter action అవసర నిమిత్తము ఈ విధమయిన ఏర్పాటు మనిషికి జన్మతః లభించిన వరము.
విశుద్ధచక్ర కేంద్రమును స్పందింపచేసే అక్షరము హం’.
ఆజ్ఞాచక్రము యొక్క    , క్ష లోని    అక్షరమునకు అం అనే అచ్చు కలిపి హం అనే సయుక్తాక్షరము ఏర్పడుతుంది. అది విశుద్ధచక్రము యొక్క కేంద్రము అవుతుంది. ఉదానవాయువు విశుద్ధచక్రము యొక్క స్థానము. కేశవృద్ధి, చర్మము, మాంసము మొదలగు వాటికి వివిధ రకములైన కణములు కావలయును. అందుకు అనంతమైన సమీకరణములు జరుగుచుండును. ఆ పద్ధతిని  జీవాణుపాక అందురు. ఉదానవాయువు జీవాణుపాక(Metabolizing)కు  తోడ్పడును.
ముఖ్యప్రాణము యొక్క Inter action ఈ విధమయిన ఏర్పాటు మనిషికి జన్మతః లభించిన వరము.


Comments

  1. This post clearly explains the aksharas of corresponding chakras... Thank you.

    Jai Guru

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

Mantrapushpam with Telugu meaning మంత్రపుష్పం

49 Maruts mentioned by Sri Sri Yogiraj LahiriMahasya Maharaj

Shree vidya upaasana