Actual meaning of Shiva Ratri unveiled by our beloved Guru " Sri Sri Kowta Markandeya Sastry garu" ( in telugu)
మహాశివరాత్రి:
సాధారణముగా ప్రతి మాసము లోను ఒక శివరాత్రి వస్తుంది. ఈ మహాశివరాత్రి ఉత్తరాయణములో మాఘ మాస కృష్ణపక్ష చతుర్దశి వెళ్ళిన అమావాస్య నాడు వస్తుంది. కృష్ణపక్ష చతుర్దశి మరియు అమావాస్య సంగమము (junction)తదుపరి వచ్చు ఈ మహాశివరాత్రికి ఒక ప్రత్యేకతయున్నది.
ఉత్తరాయణములో మూలాధారమునుండి సహస్రార చక్రమునకు పోవు విద్యుత్తులు అనగా కర్రెంట్స్(currents) ఎక్కువగా ఉంటాయి. క్రియా సాధకుడుకి ఆనందము ఎక్కువగా ఉంటుంది. కృష్ణపక్షము అనగా అంధకారపక్షములో ఉన్నసాధకుడు చతురముగా అనగా యుక్తిగా క్రియాయోగము తీవ్రతరము చేస్తాడు. అప్పుడు మంగళకరమయిన మూడవనేత్రమును దర్శిస్తాడు. దీనినే మహాశివరాత్రి అంటారు.
అందుకనే ఈ మహాశివరాత్రి అనేది మహా=గొప్ప, శివ= మంగళకరమయిన, రాత్రి.
Astrologer Master Rudra Ji is the best astrologer in New York who was practicing Vedic Astrologer for the past many years.
ReplyDeleteBest Astrologer in USA