సౌందర్యలహరి
సౌందర్యలహరి (ఆదిశంకరాచార్య) మొదటి 41 శ్లోకములు "ఆనంద లహరి" మరియు 42వ శ్లోకమునుండి "సౌందర్య లహరి"అని అర్థము చేసికోవలయును. అనుష్ఠానము కలిపి "శ్రీవిద్య". సౌందర్యలహరిలో శ్రీచక్రం గురించి 11వ శ్లోకంలో చెప్పబడింది. శ్రీ లలిత , బాలా త్రిపురసుందరి , కామేశ్వరి , రాజరాజేశ్వరి ఇత్యాది నామములతో అర్చింపబడే శక్తి స్వరూపిణియే సౌందర్యలహరిలో స్తుతింపబడే శ్రీమాత. సౌందర్యలహరి (ఆదిశంకరాచార్య) కౌతా మార్కండేయ శాస్త్రి సృష్టి, స్థితి, లయలకు క్రమముగా బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ప్రతీకలు. వీరి మహిమలె త్రిగుణములు. బ్రహ్మ రజో గుణమునకు, విష్ణువు సత్వ గుణమునకు, మహేశ్వరుడు తమో గుణమునకు ప్రతీకలు. బ్రహ్మ మహిమను ప్రతిబింబించు ప్రకృతిని సరస్వతి అని, విష్ణువు మహిమను ప్రతిబింబించు ప్రకృతిని లక్ష్మి అని, మహేశ్వరుని మహిమను ప్రతిబింబించు ప్రకృతిని పార్వతి అని చెప్తారు. ఇవి ప్రతిబింబించని ప్రకృతిని పరాశక్తి, లేదా మహాదేవి, లేదా ఆదిశక్తి అని చెప్తారు. ఈమె ఎవరికీ అధీనముగా ఉండునో ఆయనని విష్ణు పురా...