మంత్రాలకు చింతకాయలు
మంత్రాలకు చింతకాయలు:
మన్ త్రాయతే ఇతి
మంత్రః = మనస్సును ఆలోచనలనుండి రక్షించును
గాన మంత్రము.
చింతలు అనగా ఆలోచనలు.
ఆలోచనలు ఎక్కువగా ఎడతెరిపి లేకుండా వస్తూ ఉంటె అవి కాయలు అనగా గుత్తులు కడతాయి.
అవి పోవాలంటే ఆపకుండా మంత్రాలు ఒక దాని వెంబడి ఒకటి చదువుతే ఇంకొక ఆలోచనకు తావు
ఉండదు. కూటస్థము అనగా రెండు కనుబొమ్మల
అనగా భ్రూమధ్య భాగము. ఆ కూటస్థము మీద మనస్సు దృష్టి పెట్టవలయును. ‘ఓంకారము’.
వెంటవెంటనే ఉచ్ఛారణ చేస్తూ ఉందవలయును.
మంత్రము ఎక్కువ నిడివి ఉండకూడదు. ఎక్కువ నిడివి ఉండని మంత్రము
‘ఓంకారము’. ఆ కూటస్థములో మనస్సు దృష్టి
పెట్టి ‘ఓంకారము’ అనగా ‘ఓం’ అని వెంటవెంటనే
ఉచ్ఛారణ చేస్తూ ఉంటె ఆలోచనలు చస్తాయి. వేరే ఆలోచనరాదు. రాలిపోతాయి. అందువలన మంత్రాలకు
చింతకాయలు రాలిపోతాయా అంటే
తప్పక రాలి పోతాయి.
Comments
Post a Comment