ఇక్ష్వాకు - మూడవకన్ను
ఇమం వివస్వతే యోగం ప్రోక్త వానహమవ్యయం వివస్వాన్ మనవే ప్రాహ మనురిక్ష్వాకవేబ్రవీత్ 4-- 1 శ్రీ భగవానుడు ఇట్లు పలికెను :- నేను నిత్యసత్యమయిన ఈ యోగమును సూర్యునికి తెలిపితిని . సూర్యుడు వైవస్వత మనువునకు చెప్పెను . ఆ మనువు ఇక్ష్వాకునకు బోధించెను . పరమాత్మ మొదటి వ్యక్తీకరణ పరమాత్మ ప్రకాశము . పరమాత్మ తన చేతనని సర్వజ్ఞత్వముగల సర్వశక్తివంతమైన శక్తిగా లేక ప్రకాశముగా వ్యక్తీకరించాడు . దీనినే సూర్యుడు అంటారు . ఈసర్వశక్తివంతమైన శక్తి లేక ప్రకాశమే మనిషియొక్క కూటస్థము లోని మూడవకన్ను లోని వ్యష్టాత్మ లేక ఆత్మ సూర్యుడు . సాధకుడు తన తీవ్ర సాధనతో తన మానవచేతనని మరియు తన రెండుకళ్ళలోని ద్వంద్వ విద్యుత్తులను కూటస్థములో కేంద్రీకరించినపుడు ఈమూడవకన్నును చూడగలడు . సర్వ శక్తివంతమైన పరమాత్మ ప్రకాశమును అయిదు భుజములుగల వెండినక్షత్రముగా ఈ మూడవ కన్నులో చూడగ...