మంత్రము, యంత్రము, మరియు తంత్రము
మంత్రము, యంత్రము, మరియు తంత్రము:
మంత్రము, యంత్రము, మరియు తంత్రము అని మూడు విధములు.
శబ్దము
అనగా ఓంకారము. దానినే సృష్టి కారణమయిన నాద బ్రహ్మము అందురు.
అదియే
అనాదిగా వస్తున్న లేదా రాబోయే ప్రప్రథమ మంత్రము. దానిలోనుండే మిగిలిన అనేకానేక
మంత్రములు ఉద్భవించినవి.
మన్
త్రాయతే ఇతి మంత్రః =
మనస్సును రక్షిస్తుందిగాన మంత్రము అంటారు. అనగా అనేకానేక ఆలోచనలతో కకావికలమయిపోయే
చంచలమయిన మనస్సును నిశ్చల పరుస్తుందిగాన మంత్రము అయినది. అదియే ఓంకారము.
యన్
త్రాయతే ఇతి యంత్రః = శక్తి(energy)నొసగి
రక్షిస్తుందిగాన యంత్రము అంటారు.
యంత్రమునకు
శక్తి(energy)
అవసరము. లేనియడల నడవదు. అదేవిధముగా మానవాళికి శక్తి(energy)కి కారణమయిన ఆ నాద బ్రహ్మ
ఓంకారమునే యంత్రము అందురు.
తన్
త్రాయతే ఇతి తంత్రః = తనువును రక్షిస్తుందిగాన తంత్రము అంటారు.
శక్తి(energy)నొసగి రక్షిస్తుందిగాన యంత్రము
అంటారు.ఆ శక్తి(energy)ని
అట్టెపెట్టుటకు ఒక శరీరము అనే ఒక పరికరము అవసరము. ఆ శరీరమును పరిరక్షించునుగాన ఆ నాద బ్రహ్మ ఓంకారమునే తంత్రము అందురు.
కనుక
ఓంకారమే మంత్రము, యంత్రము, మరియు తంత్రము.
నారు
పోసినవాడు నీరు పోయడా’ అనే సామెత ఇందులోనుండి వచ్చినదే.
Comments
Post a Comment