రథసప్తమి : జన్మరాహిత్యము పొందుటకు ఈ క్రింద తెలిపిన సప్తజ్ఞానభూమికలు అవసరము : 1) ) శుభేఛ్ఛ — సేవ చేయాలనే శ్రేయస్కరమైన కోరిక , 2) ) అన్వేషణ — శ్రేయస్కరమైన కోరికను ఎట్లు అమలు పరచ వలయును . 3) ) తనుమానసి — మనసును సన్నగిల్ల చేయుట , 4) ) సత్యాపత్తి — సాధకుడు జ్యోతిని దర్శించుట , 5) ) అసంసక్తి — స్థూల చైతన్యము , సూక్ష్మ చైతన్యము నందు లయ మగుట , 6) ) పదార్థభావన — స్థూల , సూక్ష్మ చైతన్యములను విడనాడి తన తేజస్సును సర్వత్ర వ్యాపింప జేయుట , 7) ) తురీయము — సాధకుడు స్వయముగా దేదీప్యమానముగా ప్రకాశించుట . ఈ శరీరమును రథము అందురు. దీనిలో ఏడు చక్రములు ఉన్నవి. అవి: మూలాధార , స్వాధిష్ఠాన , మణిపుర , అనాహత , విశుద్ధ , ఆజ్ఞా , మరియు సహస్రార. క్రియాయోగాములో ఆత్మసూర్యుడ్ని ఈ ఏడుచక్రములలోను సాధకుడు చూడకలుగుతాడు. సాధకుడు శుక్ల పక్ష మాఘమాసము ఉత్తరాయణములో ఎక్కువ సమయము , తీవ్రమయిన సాధనను , ఈ ఏడు రోజులు చేయకలిగితే , ఈ తెలిపిన సప్తజ్ఞానభూమికలను అధిగమించ కలుగుతాడు. దానినే రథసప్తమి అంటారు.