ధ్యాన పద్ధతి



ధ్యాన పద్ధతి
ముద్రలు  బంధములు  వాటి ఉపయోగములు
                    
వేలు
ప్రతీక, తత్వము
రుగ్మతనివారణ
బొటన /అంగుష్ఠం
పరమాత్మ మరియు అగ్ని (చూపు లేక రూపం)
దుర్బల జీర్ణశక్తి, ఊబకాయం 
చూపుడు/తర్జని
ఆత్మ మరియు వాయు స్పర్శ)
చర్మ, పార్కిన్సన్, వ్యాధులు
మధ్య/ మధ్యమ
ఆకాశ (శబ్దం)
చెవివ్యాధులు
ఉంగరం/అనామిక
పృథ్వీ(గంధ)
వ్యాదినిరోధకశక్తి తగ్గుదల, బలహీనత, ముక్కు వ్యాధులు
చిటికిన/కనిష్ఠ
జల (రస)
రక్తహీనత, అరుచి
ఒక్క అభయ ముద్ర తప్ప మిగిలిన ముద్రలన్నీ 20 నిమిషాలకు తక్కువకాకుండా చేయండి. ప్రయోజనం పొందండి. 
ధ్యానముద్రలు మానసికప్రశాంతిని, శాంతిని, ముఖములోవర్ఛస్సు, కుండలినీశక్తిని జాగృతిపరచటము  కలగచేస్తాయి.
మనలో ప్రవహిస్తున్న ప్రాణశక్తిని మనభౌతికమైన నరముల ద్వార అవయవాలకి అందజేసి ఆరోగ్యకరముగా ఉండేటట్లు చేసేవే ముద్రలు. ఇవి భౌతికముగా, మానసికముగా, ఆధ్యాత్మికముగా శరీరాన్ని సమతుల్యముగా ఉంచును. ఒక టన్ను సిద్ధాంతముల కంటే ఒక ఔన్సు అభ్యాసము చాలా ఉత్తమం. కనుక ఆరోగ్యము కొఱకై  ప్రతి ఒక్కరు  అభ్యసించదగినవి .
ఖేఛరి ముద్ర: కూటస్థములోదృష్టి నిలిపి కనులు మూసిగాని తెరిచి గాని ఉంచి తాళువులో నాలుకను ప్రవేశ పెట్టి ప్రాణాయామ క్రియ చేయుట.
భూచరి ముద్ర: అర్థనిమీళిత నేత్రములతో దృష్టిని ముక్కు మీద నిలుపుట.
మధ్యమ ముద్ర: కూటస్థములో దృష్టి నిలిపి కనులు రెండు, చెవులు రెండు మూసికొని ప్రాణశక్తిని అంతః కుంభకము చేయుట.

తూర్పు లేదా ఉత్తర దిక్కును చూస్తూ మేరుదండమును మరియు మెడను నిఠారుగా ఉంచుకొని, వజ్రాసనములో, పద్మాసనములో, లేదా సుఖాసనములో, జ్ఞానముద్ర లేదా లింగముద్ర లోగాని కూర్చుండ వలయును. కొంచెము రిలాక్స్ (Relax)అవ్వాలి.   కూటస్థములో దృష్టి నిలిపి ఖేచరీ ముద్రలో ఉండాలి.


ప్రాణముద్ర: చిటికినవ్రేలు, ఉంగరపువ్రేలు, మరియు బొటనవ్రేలు గోరు ఉన్నభాగములు గట్టిగా నొక్కిపెట్టి ఉంచవలయును. మిగిలిన వ్రేళ్ళు నిఠారుగా ఉంచవలయును. ప్రతిరోజూ 25 నిమిషములు వేస్తె శరీర
దుర్వాసన పోవును. మనః శాంతి కలుగును. రోగనిరోధకశక్తి పెరుగును. రక్త మరియు ప్రాణశక్తిప్రసరణ చక్కగా చేసి శరీరము మరియు నేత్రములు కాంతివంతము చేయును. విటమిన్ లోపము తగ్గించును.        

అపానముద్ర: చూపుడువ్రేలు బొటనవ్రేలు మూలములో నొక్కిపెట్టి ఉంచవలయును. ఉంగరపువ్రేలు, మధ్యవ్రేలు, మరియు బొటనవ్రేలు గోరు ఉన్నభాగములు గట్టిగా నొక్కిపెట్టి ఉంచవలయును. మిగిలిన చిటికినవ్రేలు నిఠారుగా ఉంచవలయును. ప్రతిరోజూ25 నిమిషములు వేస్తె హృదయదుర్బలత, హృద్రోగం, పొట్టలోని వాయువు, తలనొప్పి,  ఉబ్బసం మరియు రక్తపోటు ఉపశమించును.   

లింగముద్ర: అన్నివ్రేళ్ళు ఒకదానిలో ఒకటి పెనవేసి ఉంచవలయును. ఎడమచేతి బొటనవ్రేలు నిఠారుగా ఉంచవలయును.
శరీరములో ఉష్ణము పెంచి చలి, దగ్గు, తుమ్ములు, సైనస్(Sinus), రొంప, పార్శ్వపునొప్పి, పక్షవాతము, దిగువ రక్తపోటు, బ్రోంకియల్ ఆస్థమాని శాంతింపచేయును.
  జ్ఞానముద్ర
చూపుడువ్రేలు బొటనవ్రేలు గోరు ఉన్న భాగములు నొక్కిపెట్టి ఉంచవలయును.   మిగిలిన వ్రేళ్ళు నిఠారుగా ఉంచవలయును.
చదువులోశ్రద్ధ, జ్ఞానవృద్ధి, తల నరాలు బలంగా ఉంచి తల నరాలు చిట్లకుండాఉంచటం, హిస్టీరియ, తలతిరగడం, అనిద్ర, తగ్గిస్తుంది.  క్రోధంతగ్గించి ప్రవర్తనలో మార్పు తెస్తుంది.

  శూన్యముద్ర

మధ్యవ్రేలు బొటనవ్రేలు గోరు ఉన్నభాగములు గట్టిగా నొక్కిపెట్టి ఉంచవలయును. మిగిలిన వ్రేళ్ళు నిఠారుగా ఉంచవలయును.
అన్నిరకాల చెవ్వు, ముక్కు, గొంతు, థైరాయిడ్, పంటిచిగురులు మరియు మెడ నొప్పుల  బాధలు ఉపశమించును.  

 వాయుముద్ర
చూపుడువ్రేలు బొటనవ్రేలు మూలములో నొక్కిపెట్టి ఉంచవలయును.  మిగిలిన వ్రేళ్ళు నిఠారుగా ఉంచవలయును.
వాయుశాంతి, పక్షవాతము, సయాటికా, కీళ్లనొప్పులు, మోకాళ్ళనొప్పులు, వెన్నుపూసలోనొప్పి, పార్కిన్సన్ వ్యాధి, చేతులుగుంజటము ఉపశమనము లభిస్తుంది.    

    అగ్నిముద్ర
ఉంగరపువ్రేలు,  బొటనవ్రేలు మూలములో గట్టిగా నొక్కిపెట్టి ఉంచవలయును. మిగిలిన వ్రేళ్ళు నిఠారుగా ఉంచ వలయును.
ఊబకాయం తీసివేసి శరీర సమతుల్యత పెంచును. శరీరములోని కొవ్వును తగ్గించును. మధుమేహము, కాలేయవ్యాధులకు, మేహవాతనొప్పులకు, టెన్షన్ లకు ఉపశమనము కలిగించును. 
పృథ్వీముద్ర



  
 ఉంగరపువ్రేలు మరియు బొటనవ్రేలు గోరున్న భాగములు కలిపి గట్టిగా నొక్కిపెట్టి ఉంచాలి. మిగిలిన మూడు వ్రేళ్ళు నిఠారుగా ఉంచవలయును.
పొడి చర్మాన్ని మృదువుగా చేయుట, చర్మవ్యాధులు దూరం చేయుట, రక్తం, నీరు తక్కువగా ఉండటం, నీటి సంబంధ మైన వ్యాధులు, పచ్చ కామెర్లు, టైఫాయిడ్ లాంటి వ్యాధులు, మూత్రపిండములవ్యాధులు, అతిమూత్రం, మూత్రపిండములలో రాళ్ళు కరిగించి ఉపశమనము కలిగించుట,  కలుగును.

 వరుణముద్ర
 
చిటికెనవ్రేలు మరియు బొటన వ్రేలు గోరున్న భాగములు కలిపి గట్టిగా నొక్కిపెట్టి ఉంచాలి. మిగిలిన మూడు వ్రేళ్ళు నిఠారుగా ఉంచవలయును.
విటమిన్ లోపాలు సరిదిద్దుట, మొలలబాధలు మరియు మొటిమలబాధల ఉపశమనము, శాంతి, కాంతి, తేజస్సు, శరీరములో స్పూర్తి, జీవనవికాసవృద్ధి కలుగును. 

అభయ ముద్ర
కుడిచెయ్యిఛాతి దగ్గిర పెట్టి తెరిచి ఉంచాలి.
ముద్రతో శాంతి సౌఖ్యాలకై పెద్దలు తమ ఆశీస్సులు తెలుపుతారు.
మేరుదండ ముద్ర
వెన్నెముక దృఢంగాఉంచి నడుము నొప్పి తగ్గించును.
ఇది ధ్యానముద్ర.
నాలుగువ్రేళ్ళు మడిచి, అంగుష్ఠం నిఠారుగా ఉంచాలి.
ఆది ముద్ర
అంగుష్ఠం మడిచి దానిని మిగిలిన నాలుగు వ్రేళ్ళతో పిడికిలిలాగా  మూసి ఉంచాలి.
ఊపిరితిత్తులలో శ్వాస బాగానింపబడి రక్తము శుద్ధబరుస్తుంది. హృదయమునకు మంచిది.
అంజలి ముద్ర.
చెవులను నొక్కునట్లుగా చేతులు నిఠారుగా పైకెత్తి నమ్మస్కారము చేయాలి.
గొంతు బాధలు తగ్గిస్తుంది.


అంకుశ ముద్ర.
చేతి వ్రేళ్ళని మడిచి ఒక్క మధ్యవ్రేలుని మాత్రము నిఠారుగా ఉంచాలి.
ఏకాగ్రతకు, కంటివ్యాధులకు మంచిది.
జలధారానాశక ముద్ర.
కనిష్ఠ అంగుష్ఠమూలముతో నొక్కి పెట్టి ఉంచాలి. మిగిలినవేళ్ళు  నిఠారుగా ఉంచాలి.
ముక్కు కారుట, డయోరియా, ఊబకాయం నివారణ, నివారిస్తుంది.
మకర ముద్ర.
ఒక అరచేతి అనామిక మరియు కనిష్ఠల మధ్య రెండవ అరచేతి అంగుష్ఠమునుంచాలి. ఇప్పుడు మొదటి అరచేతి అంగుష్ఠమును రెండవ అరచేతి అనామికను కలిపి నొక్కి ఉంచవలయును.
మూత్రపిండములు, కాలేయ వ్యాధి పీడితులకు మంచి ఉపశనము.
శక్తి ముద్ర.
కనిష్ఠ మరియు అనామికలను వంచి కలపాలి. గోరున్న అంగుష్ఠ, మధ్యమ. మరియు తర్జనిలను నిలువుగాకలపాలి.
పొత్తికడుపు కండరాలను బలోపేతము చేస్తుంది. స్త్రీల ఋతు
బాధలను తొలగిస్తుంది.

పృష్ఠ ముద్ర.

ఎడమ చేయి అంగుష్ఠ మధ్యభాగములోతర్జని  గోరున్న భాగము నొక్కిపెట్టి ఉంచాలి. మిగిలిన వ్రేళ్ళు నిఠారుగా ఉంచాలి..  కుడిచేయి అంగుష్ఠము, మధ్యమ మరియు కనిష్ఠ  గోరున్న భాగములు భాగము నొక్కిపెట్టి ఉంచాలి. మిగిలిన వ్రేళ్ళు నిఠారుగా ఉంచాలి.
నడుమునొప్పికి చాలా మంచిముద్ర.


చిన్ముద్ర:
తర్జనిగోరున్నభాగముమరియుఅంగుష్ఠం గోరున్నభాగముకలిపినొక్కిచేతులుత్రిప్పి కాలిముణుకుల పైన ఉంచాలి. మిగిలిన వేళ్ళు  నిఠారుగాఉంచాలి. జ్ఞానముద్రను త్రిప్పిచేస్తే చిన్ముద్ర అవుతుంది.
రక్తపోటునివారణ,సకారాత్మక ఆలోచనలు,జ్ఞాపకశక్తి,చూపు పెరుగుదలకు, కాళ్ళకి నీరు బడితే నివారిస్తుంది. ఊపిరితిత్తులలో శ్వాస బాగా నింపబడి రక్తము శుద్ధబరుస్తుంది. ఇది ధ్యానముద్ర.

చిన్మయ ముద్ర.
తర్జని గోరున్న భాగము మరియు అంగుష్ఠం గోరున్న భాగము కలిపి నొక్కి చేతులు త్రిప్పి కాలి ముణుకులపైన ఉంచాలి. మిగిలినవేళ్ళు  అరచేతిని నొక్కి మూసి ఉంచాలి.
ఊపిరితిత్తులలో శ్వాస బాగా నింపబడి రక్తము శుద్ధబరుస్తుంది. హృదయమునకు మంచిది. ఇది ధ్యానముద్ర.
బ్రహ్మ ముద్ర.

అంగుష్ఠం మడిచి దానిని మిగిలిన నాలుగు వ్రేళ్ళతో పిడికిలిలాగా  మూసి ఉంచాలి. అలా రెండుచేతులు చేసి ఒకదానితో ఇంకొకటి వత్తిపెట్టి వ్రేళ్ళు ఆకాశము వైపు చూసేటట్లుగాఉంచి బొడ్డుక్రింద ఆనించి ఉంచాలి.
ఊపిరితిత్తులలో శ్వాస బాగా నింపబడి రక్తము శుద్ధబరుస్తుంది. హృదయమునకు మంచిది. ఇది ధ్యానముద్ర.
భైరవ ముద్ర.
ఎడమ అరచేతిపై కుడిఅరచేతిని ఉంచాలి.
కుడి అరచేతిపై ఎడమ అరచేతిని ఉంచితే భైరవీ ముద్ర అవుతుంది.
కండరాలకుబలం, నిశ్చలమనస్సు.ఇది ధ్యానముద్ర.
బుద్ధి ముద్ర.
ఇది ధ్యానముద్ర.
తర్జనిని అంగుష్ఠమూలములో ఉంచాలి. మిగిలినవేళ్ళు  నిఠారుగా ఉంచాలి.
రెండు చేతులు వెనకనుంచి ఒకదానిని ఒకటి ఒత్తిపెట్టాలి. బొడ్డుక్రింద ఉంచాలి.
ధ్యాన ముద్ర.
ఇది ధ్యానముద్ర.
ఎడమ అరచేతిపై కుడిఅరచేతిని ఉంచాలి. అంగుష్ఠములు రెండూ కలిపి  ఉంచాలి.
యోని ముద్ర.
ఇది ధ్యానముద్ర.

రెండుచేతుల తర్జని గోరున్న భాగములు నొక్కిపెట్టి ఉంచాలి. రెండు చేతుల అంగుష్ఠముల గోరున్న భాగములు నొక్కిపెట్టి ఉంచాలి. మిగిలిన వ్రేళ్ళు ఒకదానితో ఇంకొకటి పెనవేసి ఉంచాలి.. అంగుష్ఠముల గోరున్న భాగములు బొడ్డుకి ఆనించిపెట్టాలి. అంగుష్ఠముల గోరున్న భాగములు దూరంగా ఉంచాలి.
కుండలినీ ముద్ర.
ఇది ధ్యానముద్ర.
రెండుచేతులపిడికళ్లనుగట్టిగామూయాలి. ఒకదానిపైన ఒకటి నాభిక్రింద ఆనించి పెట్టాలి.

గరుడ ముద్ర.
చేతులు రెండూ తెరిచిఉంచి, అంగుష్ఠములు రెండూ ఒకదానికొకటి ముడివేసి  ఉంచాలి.
శ్వాసరోగములకు, పక్షవాతమునకు మంచిది.
గోముఖ ముద్ర. ఇది ధ్యానముద్ర.
ఒక అరచేతిని ఇంకొక అరచెయ్యి కప్పి బోర్లించినట్లుగాఉంచాలి.  అంగుష్ఠములు రెండూ ఒకదానికొకటి ముడివేసి  ఉంచాలి.
పిచ్చి, హిస్టీరియా, బద్ధకం, కోపం, డిప్రెషన్ తగ్గిస్తుంది. ప్రాణశక్తి పెంపుదల..

కైలాస ముద్ర. ఇది ధ్యానముద్ర.
నమస్కారస్థితిలోచేతులనుంఛి, పైకిఎత్తి తలని తాకుతూమీదఉంచాలి.
ఖేచరీ ముద్ర. ఇది ధ్యానముద్ర.
నాలుక వెనకకి త్రిప్పి అంగుటికి ఆనించిఉంచాలి. క్రియాయోగమునకు ఇది చాలా ముఖ్యమైనది. సాధకునికి సాధనలో నిద్ర, ఆకలిదప్పులు బాధించవు.
కుంభ. ఇది ధ్యానముద్ర.
రెండు అరచేతులు పెనవేసి అంగుష్ఠములు రెండూపైకి నిఠారుగా నిలబెట్టి ఉంచాలి.
నాగ ముద్ర.  ఇది ధ్యానముద్ర.
ఒక అరచేతి పైన రెండవ అరచేతి నుంచాలి. ఒక అంగుష్ఠము పైన రెండవ అంగుష్ఠమును కత్తెరలాగా ఉంచాలి. 
ప్రాణ ముద్ర.  ఇది ధ్యానముద్ర.
ఇప్పుడు కనిష్ఠ మరియు అనామికల గోరున్న భాగములుو  గోరున్న అంగుష్ఠముతో కలిపి 5నిమిషాలు నొక్కి ఉంచాలి. అనగా ప్రాణ ముద్ర వెయ్యాలి. మిగిలిన వ్రేళ్ళు నిఠారుగా ఉంచాలి.
అపాన ముద్ర.
అనామిక, మధ్యమల గోరున్న భాగములు  అంగుష్ఠం గోరున్న భాగము కలిపి నొక్కి ఉంచాలి. మిగిలినవేళ్ళు  నిఠారుగా ఉంచాలి.
మలబద్ధకం, మూలశంకల బాధితులకు  చాలా మంచిది.


వాయన/వాతకారక ముద్ర.
తర్జని మరియు మధ్యమల గోరున్న భాగములుو  గోరున్న అంగుష్ఠముతో కలిపి 5 నిమిషాలు నొక్కి ఉంచాలి. మిగిలిన వ్రేళ్ళు నిఠారుగా ఉంచాలి.
విరోచనాలకి, వడదెబ్బలకి మరియు ఊబకాయ నివారణలకి మంచిది.
పూషుని ముద్ర.
ఇది రోగవినాశినీ ముద్ర
అపాన ముద్ర, వాయన  మరియు ప్రాణ ముద్రలు కలిపి  పూషుని ముద్ర అంటారు.. మూడుముద్రలు కలిపి 10 నిమిషముల చొప్పున మార్చిమార్చివేయాలి.
శాంభవీ ముద్ర.  ఇది ధ్యానముద్ర.
కనుబోమ్మలమధ్యదృష్టి నిలిపి ధ్యానం చేయుట.

మాండూక ముద్ర.
ఇది ధ్యానముద్ర.
ఒక అరచేతిని ఇంకొక అరచెయ్యి కప్పి బోర్లించినట్లుగాఉంచాలి.  అంగుష్ఠములు రెండూ ఒకదానిపై ఇంకొకటితాకునట్లుగా  ఉంచాలి.. పద్మాసనంలో ఉన్నప్పుడు, కుడిదికాలుపైన ఉన్నప్పుడు కుడిచెయ్యి పైన ఉండాలి. ఎడమకాలుపైన ఉన్నప్పుడు ఎడమచెయ్యి పైన ఉండాలి.
పిచ్చి, హిస్టీరియా, బద్ధకం, కోపం, డిప్రెషన్ తగ్గిస్తుంది. ప్రాణశక్తి పెంపుదల.
భూచరీ ముద్ర.
ముక్కు పైన దృష్టి ఉంచాలి.
ఏకాగ్రత వృద్ధి, ఇది ధ్యానముద్ర.
మూలబంధ.
మలద్వారాన్ని బంధించాలి.
మలబద్ధకం, మూలశంకలబాధితులకు  చాలా మంచిది.. ఆస్తమా, బ్రొంకైటిస్, కీళ్ళనొప్పులు తగ్గుతాయి.

అశ్వని ముద్ర.

మలద్వారాన్ని బంధించుట, విడుచుట, కనీసం 100 సార్లు చేయాలి.
మలబద్ధకం, మూలశంకల బాధితులకు  చాలా మంచిది. ఆస్తమా, బ్రొంకైటిస్, కీళ్ళనొప్పులు తగ్గుతాయి. ప్రసవము తేలికగును.
               
              

PRAYER BEFORE ENERGIZATION EXERCISES:
Heavenly Father, it is thou who dost directly sustain my body. Awaken within me conscious will conscious health  conscious vitality conscious realization. Oh eternal youth of body and mind abide in me forever and forever. Om Santi. Om Santi. Om Santi.
శరీర వ్యాయామమునకు ముందర ప్రార్థన
పరమపితా, నా శరీరమును ప్రత్యక్షముగా స్థితివంతముగా ఉంచునది నీవే. నాలో చేతనా పూర్వకముగా ఇచ్ఛని, ఆరోగ్యమును, సామర్థ్యమును  మరియు సఫలతను మేల్కొలుపు. పరమపితా, నా శరీరమునకు  మనస్సునకు నిత్యమయిన యౌవనమును ప్రసాదించు. ఓం శాంతి, ఓం శాంతి, ఓం శాంతి.
12 పర్యాయమములు ఓంకారము చేయుము.
Prayer before starting of Sadhana (క్రియాయోగాసాధన ఉపక్రమణకు ప్రార్థన)
1)బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం
ద్వంద్వాతీతం గగనసదృశం తత్వ మశ్యాదిలక్ష్యం
ఏకం నిత్యం విమలం అచలం సర్వధి సాక్షీభూతం
భావాతీతం త్రిగుణరహితం సద్గురుం తం నమామి.  
2)Heavenly Father, Mother, Friend, beloved God, Bhagavan Srikrishna, Jesus Christ, Mahavatar Babaji, Lahiri Mahasaya, Swami Sri Yukteswarji, Guru-preceptor Paramahansa Yoganandaji, Saints & Sages of all religions, I bow to you all.
Lead me from ignorance to wisdom, desires to contentment & restlessness to peace.
Let thy love shine forever on the sanctuary of my devotion, and may I be able to awaken thy love in all hearts.
2) పరమపితా, జగన్మాతా, బంధు సఖా, ప్రియమైన ప్రభు, భగవాన్ శ్రీకృష్ణ, జీసస్ క్రైస్త్, మహావతార్ బాబాజీ, యోగావతార్ లాహిరీ మహాశయ మహారాజ్, జ్ఞానవతార్ శ్రీ యుక్తేస్వర  స్వామీజీ,  ప్రేమావతార్ ప్రియగురు పరమహంస శ్రీ యోగానంద స్వామీజీ, తథా సర్వ మతముల ఋషి మునులకు అందరికీ నమస్కారం. 
అసతోమా సద్గమయ, తమసోమా జ్యోతిర్గమయ, మృత్యోర్మా అమృతం గమయ.
పరమాత్మా, నీ ప్రేమజ్యోతిని నా హృదయంలో సదా ప్రజ్వరిల్లనీ, నేను ప్రేమజ్యోతిని అందరి హృదయములలో జాగృతి చేయనీ, నా ప్రార్థనని స్వీకరించు ప్రభూ.      ఓం ఓం ఓం
3) గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణుః గురుర్ దేవో మహేశ్వరః
   గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మైశ్రీ గురవేనమః           ఓం ఓం ఓం
ఇప్పుడు అనుష్ఠాన గాయత్రీ చెయ్యాలి.
1) అనుష్ఠాన గాయత్రీ:
గాయంతం త్రాయతే ఇతి గాయత్రీ. పాడుతున్నకొలది సాధకుడ్ని రక్షించును.
ఓం = బ్రహ్మ,  భూః = ప్రణవ స్వరూపము, భువః = దుఃఖనాశనం, స్వః = సుఖ స్వరూపము, తత్=, సవితుః= తేజస్సుచే, దేవస్య= దేవునియొక్క,  వరేణ్యం= శ్రేష్ఠమయిన, భర్గః= పాపనాశమయినతేజ మును, ధీమహి = ధ్యానింతుము. యః = ఏదయితే,నః= మాయొక్క, దియః= బుద్ధులను, ప్రచోదయాత్=ప్రేరేపించుగాక.
ఓం భూర్భవస్వః తత్సవితర్వరేణ్యం
భర్గో దేవస్య ధీమహిధీయో యోనః ప్రచోదయాత్
ఓ బ్రహ్మ, నీవే ప్రణవ స్వరూపము, దుఃఖనాశనం, సుఖ స్వరూపము,  నీ ఆ, తేజస్సుచే, దేవునియొక్క, శ్రేష్ఠమయిన, పాపనాశమయిన తేజ మును, ధ్యానింతుము. ఏదయితే, మాయొక్క,  బుద్ధులను,  ప్రేరేపించుగాక.
పూరకము = శ్వాసను పూరించటము లేక లోపలికి తీసుకోవటము. 
అంతఃకుంభకము = శ్వాసను కూటస్థములో   అట్టేపెట్టుట,
రేచకము = శ్వాసను వెలుపలికి వదులుట.
బాహ్య కుంభకము = శ్వాసను వెలుపలనే  అట్టేపెట్టుట.
పూరకము, అంతఃకుంభకము, రేచకము మరియు బాహ్య కుంభకము కలిపి ఒక హంస అగును.
తూర్పు లేదా ఉత్తర దిక్కును చూస్తూ మేరుదండమును మరియు మెడను నిఠారుగా ఉంచుకొని, వజ్రాసనములో, పద్మాసనములో, లేదా సుఖాసనములో రిలాక్స్ (Relax)గా ఏ ఆలోచనయు లేకుండా ఉండవలయును.   శాంభవీ ముద్రలో కూటస్థములో మనస్సు దృష్టి పెట్టి మెడను వెనక్కు వంచుకొని అధిచేతనావస్థలో ధ్యానము పూర్తి అగునంతవరకు కూర్చుండ వలయును. 

మనస్సులో గాయత్రీ  మంత్రమును అనుకుంటూ దీర్ఘముగా ఒక హంస చేయాలి. పూరకము, అంతఃకుంభకము, రేచకము, మరియు బాహ్య కుంభకము నాలుగూనూ  సమాన ప్రతిపత్తిలో ఉండాలి. సాధకుని సామర్థ్యమును అనుసరించి ఎంత సమయమయినా చేయవచ్చు.
ఈ విధముగా  హంసలు తమతమ సామర్థ్యము మరియు సమయ ముననుసరించి బాహ్య కుంభకములు ఎన్నైనా, ఎంత సమయ మయినా చేయవచ్చు. కనీసము 12 పర్యాయమములు  చేయుము.
2) హు (tense) హూ(relax):
ఇప్పుడు హు అని చిన్నగా, హూ అని పొడుగ్గా శ్వాస ముక్కుతో లోపలికి తీసుకోవాలి. అనగా పూరకము చేయాలి. పూరకము చేస్తున్నంత సేపూ  అరచేతిని నిదానముగా  ముడుచుకోవాలి.
మూడునాలుగు సెకండ్లు అట్టెపెట్టాలి. అనగా అంతఃకుంభకము చేయాలి.
ఇప్పుడు హ అని చిన్నగా, హా అని పొడుగ్గా శ్వాస నోటితో బయటికి నిశ్వాస చేయాలి. అనగా రేచకము చేయాలి. రేచకము చేస్తున్నంత సేపూ  అరచేతిని నిదానముగా తెరవాలి.
మూడునాలుగు సెకండ్లు అట్టెపెట్టాలి. అనగా బాహ్యకుంభకము చేయాలి.  
ఈ విధముగా కనీసము 12 పర్యాయమములు  చేయుము.
3)హంస క్రియ:
 శ్వాస మేరుదండములోని మూలాధారచక్రములోనుండి ఆజ్ఞా పాజిటివ్ అనగా కూటస్థము వరకు  వస్తున్నట్లు, తిరిగి కూటస్థమునుండి మూలాధారచక్రములోనుండి వెళ్తున్నట్లుగా భావించాలి.
దీర్ఘముగా హం అని మనస్సులోనే అనుకుంటూ పూరకము చేయాలి.  కూటస్థములో అంతఃకుంభకము చేసి శ్వాసని అట్టేపెట్టాలి. మనస్సును దృష్టిని కూటస్థములోనే నిలిపి ఉంచాలి. నిలిపి ఉంచిన ఆ శ్వాస తనంతటతానే వెళ్లిపోవువరకు వేచి ఉండాలి. వెళ్లిపోవున ప్పుడు అని శ్వాసని సాగనంపాలి. వెళ్లిపోవు శ్వాసని రేచకము అంటారు. ఆ వెళ్లిపోవు శ్వాసను  మనస్సు మరియు  దృష్టి  అనుసరించాలి. అనగా శ్వాసని గమనిస్తూ ఉండాలి. శ్వాసని బలవంతముగా అంతఃకుంభకము చేయకూడదు.
మొదటి సారిమాత్రమే కూటస్థములో అంతఃకుంభకము చేసి శ్వాసని అట్టేపెట్టాలి. ఆ తరువాతనుంచి శ్వాస తనంతట తానే రావాలి, తనంతట తానే వెళ్లిపోవాలి.  పూరకములో శ్వాస ఏ చక్రము వరకు వస్తే అంతవరకే రానివ్వాలి. రేచకములో శ్వాస ఏ చక్రము వరకు వెళ్తే అంతవరకే పోనివ్వాలి.
ఇట్లా శ్వాసని గమనిస్తున్నప్పుడు మనస్సు  అంతర్ముఖమై సమాధికి చేరుతుంది.  లభ్యమయిన ఆనందించాలి.
ఆ పిమ్మట కూటస్థములో లేక సహస్రారములో దృష్టి నిలిపి  ధ్యాన లేక జ్ఞానముద్ర వేసికొని     శాంభవీముద్రలో  ధ్యానం చేయాలి.

4) ఓంకారాన్ని వినుట:
కూటస్థములో దృష్టి నిలిపి శాంభవీముద్రలో ఉండాలి. 
రెండు కళ్ళ మూలలు  రెండు చిటికిన వ్రేళ్ళతో మూసివేయాలి. దీనినే ఓం ముద్ర అంటారు.
దీర్ఘముగా శ్వాస తీసికుంటూ పూరకము చేయాలి. శ్వాసని బలవంతముగా తన సామర్థ్యమును బట్టి అంతఃకుంభకము చేసి నిలిపి ఉంచాలి.. మనస్సును దృష్టిని కూటస్థములోనే నిలిపి ఉంచాలి.
శ్వాసని బలవంతముగా తన సామర్థ్యమును బట్టి బాహ్యకుంభకము చేసి నిలిపి ఉంచాలి.. మనస్సును దృష్టిని కూటస్థములోనే నిలిపి ఉంచాలి.
తలలో ఓంకారాన్ని వినుటకు ప్రయత్నించండి. ఓంకారము వినబడితే ఓంకారముతో, లేదా ఏ శబ్దము స్పష్టముగావినబడితే  ఆ శబ్దముతో మమైకమవ్వండి.

ఇప్పుడు మహాముద్ర వేయాలి.
క్రియలు చేయాలి.
ఇప్పుడు జ్యోతిముద్ర వేయాలి.
ఇప్పుడు ధ్యానము చేయాలి.
ధ్యానము అనగా:  అధిచేతనావస్థలో శాంభవీ ముద్రలో కూర్చొని కూటస్థములో మనస్సు దృష్టి ఉంచాలి.
దీర్ఘముగా శ్వాస తీసికొని అంతఃకుంభకం చేయాలి. ఓపిక ఉన్నంతసేపు శ్వాసను కూటస్థములో  అట్టే పెట్టాలి. శబ్దము వినబడితే శబ్దములో, ప్రకాశము కనబడితే ప్రకాశములో ఏకాగ్రత ఉంచాలి. రెండింటినీ ప్రయత్నము చేయకూడదు.
అదేవిధముగా నిశ్వాస చేసి బాహ్యకుంభకం చేయాలి. ఓపిక ఉన్నంతసేపు శ్వాసను అట్టే పెట్టాలి. శబ్దము వినబడితే శబ్దములో, ప్రకాశము కనబడితే ప్రకాశములో ఏకాగ్రత ఉంచాలి. రెండింటినీ ప్రయత్నము చేయకూడదు.   
అట్లా చేస్తూ ధ్యానము చేయాలి.  క్రమముగా సమాధిలోకి వెళ్ళాలి
Healing Prayers:
Heavenly father, you are omni present your are in all their children, manifest thy healing presence in all their bodies.

Heavenly father, you are omni present your are in all their children, manifest thy healing presence in all their minds.

Heavenly father, you are omni present your are in all their children, manifest thy healing presence in all their souls.
Chant OM for universal peace and brotherhood.

Heavenly father, teach me us to heal our bodies by recharging them with thy cosmic consciousness, to heal our minds with concentration and cheerfulness on thee, and to heal the decease of soul ignorance by devotion medicine of meditation on thee.
Om Santi, Om Santi, and OM santi.


నిరోగ శరీరమునకయిప్రార్థన
ఓ పరమాత్మా నువ్వు సర్వవ్యాపివి,  నువ్వు నీ ఈ పిల్లలందరిలోనూ ఉన్నావు., నీ ఆరోగ్యదాయకమైన ఉపస్థితిని వారి అందరి శరీరములలోనూ ప్రకటించు,                      
ఓ పరమాత్మా నువ్వు సర్వవ్యాపివి,  నువ్వు నీ ఈ పిల్లలందరిలోనూ ఉన్నావు., నీ ఆరోగ్యదాయకమైన ఉపస్థితిని వారి అందరి మనసులలోనూ ప్రకటించు,              
ఓ పరమాత్మా నువ్వు సర్వవ్యాపివి,  నువ్వు నీ ఈ పిల్లలందరిలోనూ ఉన్నావు., నీ ఆరోగ్యదాయకమైన ఉపస్థితిని వారి అందరి హృదయములలోనూ ప్రకటించు,
విశ్వమానవ శాంతికి, విశ్వమానవ సౌభ్రాతృత్వమునకై చెప్పండి ఓఓఓఓమ్.


ఓ పరమాత్మా, నీ విశ్వశక్తితో శక్తిపూరణం చెయ్యడంద్వారా శరీరాన్ని నయం చేసికోవడం మాకు నేర్పు.
ఓ పరమాత్మా, ధారణ ప్రసన్నలతో మనస్సును నయం చేసికోవడం మాకు నేర్పు.
ఓ పరమాత్మా,  నీపై ధ్యానం అనే దివ్య ఔషధముతో ఆత్మవిషయక అజ్ఞానపు రుగ్మత నయం చేసికోవడం మాకు నేర్పు.

ఓం జయజగదీశ హరే ఓం జయజగదీశ హరే
భక్తజనోం కే సంకట్ క్షణే మే దూర్ కరే ఓం జయజగదీశ హరే
జోధ్యావే ఫల్ పావే దుఃఖ బిన్ సే మన్ కా స్వామి దుఃఖ బిన్ సే మన్ కా
                                      
సుఖసంపత్ ఘర ఆవే కష్ట్ మీటే తన్ కా  ఓం జయజగదీశ హరే
మాత పితా తుము మేరే శరణు పడూ మై జిస్ కీ స్వామి శరణు పడూ మై జిస్ కీ
తుమ్ బినా ఔర్ న దూజా ప్రభు బినా ఔర్ న దూజా
ఆశకరూ మై జిస్ కీ ఓం జయజగదీశ హరే
తుము పూరణ్ పరమాత్మా తుము అంతర్యామీ
పారబ్రహ్మ పరమేశ్వర్ తుము సబ్ కే స్వామీ ఓం జయజగదీశ హరే
తుము కరుణా కే సాగర్ తుము పాలన్ కర్తా
మై మూరఖ్ కల్ కామీ మై సేవక తుము స్వామీ కృపాకరో భర్తా
ఓం జయజగదీశ హరే
తుము హో ఏక్ అగోచర్ సబ కే ప్రాణపతీ
కిస్ దిన్ మిలూ దయామయి తుము కో మై కుమతీ
ఓం జయజగదీశ హరే
దీనబంధు దుఃఖ హర్తా  తుము రక్షక్ మేరా
అపనే హాత్ బడావో అపనే శరణు లగావో ద్వార పడే తేరే
ఓం జయజగదీశ హరే
విషయ వికార్ మిటావో పాప హరో దేవా
శ్రద్ధా భక్తీ బఢావో సన్ తన్ కీ సేవా
ఓం జయజగదీశ హరే
తన మన్ ధన్ హై తేరా సబ్ కుఛ్ హై తేరా
తేరా సబ్ కుఛ్  తుఝ్ కో అర్పణ్ క్యాలాగే మేరా
ఓం జయజగదీశ హరే
 ఉపనిషద్ ప్రార్థన:-----
ఓం సర్వేషాం స్వస్తిర్భవతు ఓం సర్వేషాం శాంతిర్భవతు
ఓం సర్వేషాం పూర్ణం భవతు ఓం సర్వేషాం  మంగళం భవతు

ఓం సర్వేభవంతు సుఖినః సర్వే భద్రాణి పశ్యంతు
సర్వే సంతు నిరామయః మా కశ్చిత్ దుఃఖ భాగ్ భవేత్ 
ఓం అసతోమా సద్గమయ తమసోమా జ్యోతిర్గమయా
మ్రిత్యోర్మా అమృతం గమయ
ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్  పూర్ణ ముదచ్యతే
పూర్ణశ్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతు
ఓం శాంతిః ఓం శాంతిః ఓం శాంతిః
ఓం నమో నమస్తేస్తు సహస్రక్రిత్వా పునశ్చ భూయోపి నమో నమః
నమో పురస్తాధత పృష్ఠతస్తె నమోస్తుతే సర్వతా ఏవ సర్వః      
ఓం శాంతిః ఓం శాంతిః ఓం శాంతిః

Comments

Popular posts from this blog

Mantrapushpam with Telugu meaning మంత్రపుష్పం

49 Maruts mentioned by Sri Sri Yogiraj LahiriMahasya Maharaj

Shree vidya upaasana