మహా మృత్యుంజయ మంత్ర



 మహా మృత్యుంజయ మంత్ర 

దీనిని త్రయంబక మంత్రం అనికూడా పిలుస్తారు. ఇది మృత్యువును
జయించు మంత్రం. ఈ మంత్రం శివ లేదా మూడు కన్నుల వాడికి
అంకితమయినది. ఇది మార్కండేయ మహర్షి విరచితము. మనస్సు
కకావికలమయినప్పుడు, కాలసర్పదోషమును నివారించుటకు, భయంకరమయిన రోగముల నివారణకు  ఈ మంత్రం తప్పక పఠించ వలయును.
 ॐ त्र्यम्बकम् यजामहे सुगन्धिम् पुष्टिवर्धनम् ।
उर्वारुकमिव बन्धनान् मृत्योर्मुक्षीय माम्रतात् ।।
ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం
ఉరు వారుకమివ బంధనాత్ మృత్యోర్ముఖ్ క్షీయమామృతాత్ ।।
महामृत्युंजय बीज मंत्र   
మహా మృత్యుంజయ  బీజ మంత్రము:  
ॐ ह्रों ॐ जूं सः भूर्भुवस्वः
ॐ त्र्यम्बकम् यजामहे सुगन्धिम् पुष्टिवर्धनम् ।
उर्वारुकमिव बन्धनान् मृत्योर्मुक्षीय माम्रतात् ।।
ఓం హ్రోం ఓం జూం సః భూర్భువస్వః
ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం
ఉరు వారుకమివ బంధనాత్ మృత్యోర్ముఖ్ క్షీయమామృతాత్ ।।
 తాత్పర్యము:
ఓం = పరమాత్మ
త్రయంబకం = మూడుకన్నులవాడిని
యజామహే = ప్రార్థిస్తున్నాను.
సుగంధిం = సువాసన గల
 పుష్టివర్ధనం =ఐశ్వర్యయుక్త మయిన దృఢమయిన
ఉరువారుకమివ = పెద్దది  శక్తిగల
బంధనాత్ = మాయ అనే బంధమునుండి
మృత్యోర్ముఖ్ క్షీయ = మృత్యువునుండి  
 మా = నన్ను
మృతాత్= అమృతత్వమునకు తీసికెళ్ళుగాక.
పరమాత్మ మూడుకన్నులవాడిని ప్రార్థిస్తున్నాను. సువాసన గల  ఐశ్వర్యయుక్త మయిన దృఢమయిన పెద్దది  శక్తిగల  మాయ అనే బంధముఅనే  మృత్యువునుండి  నన్ను అమృతత్వమునకు తీసికెళ్ళుగాక. ఇంటి చుట్టూ నీరు పోయవలయును, తన ఆసనము చుట్టూ నీరు చల్లుకోవలయును. ఈ మంత్రమును 108 సార్లు కూటస్థములో మనస్సు దృష్టి పెట్టి చేయవలయును. మంత్రము ప్రారంభములోను అయిన తదుపరి కొంచెము నీరు త్రాగవలయును. తద్వారా నకారాత్మక శక్తులను అరికట్టవచ్చు.



Comments

Popular posts from this blog

Mantrapushpam with Telugu meaning మంత్రపుష్పం

49 Maruts mentioned by Sri Sri Yogiraj LahiriMahasya Maharaj

Shree vidya upaasana