Vemana oka Kriyayogi in Telugu

Jaiguru,
Recently I have written a book mentioned and sent it to Jeevana surabhi, Adhyatmika Telugu Masa Patrika. . Interested Telugu knowing people can contact Manibhushan, Editor, Jeevana surabhi, 09491044365. Presently I am busy writing Telugu commentary" Gita-- Kriyayogam".
Some verses r given below:
                             ఓం నమో శ్రీ యోగానందగురవేనమః
నేను ఒక క్రియాయోగిని. నా ధ్యానసమయములో ఒకసారి యోగివేమన గురించి ధ్యానము చేశాను. ఆ సమయములో ఆ మహాయోగిని ఈ విధముగా ప్రశ్నించాను:
నీవు వ్రాసిన పద్యములలో యోగము గురించి ప్రస్థావన ఏమీలేదు, పైగా వినురవేమా, వినురవేమా అని స్వంత డబ్బా కొట్టుకుంటావేమిటి? అని అడిగాను. దానికి ఆ మహాయోగి ఈవిధముగా ఒక్కొక్క పద్యమునకు అంతరార్థము స్ఫురింపచేశాడు ఆ మహాయోగి. ఆ అంతరార్థమునుబట్టి ఆ మహాయోగి ఒక క్రియాయోగి అనిఅర్థము అయినది. అందులో మచ్చుకు కొన్ని పద్యములు పొందు పరుస్తున్నాను:
1)      చెప్పులోనరాయి చెవులోన జోరీగ
          కంటిలోన నలుసు కాలులోన ముల్లు
          ఇంటిలోన పోరు ఇంతింత కాదయా
          విశ్వదాభిరామ వినురవేమా
          వినురవేమా అనగా వేరయిన మనసుతో వినురా అని అర్థము..
          వేరయిన మనసు అనగా  స్థిరమయిన మనసు అని అర్థము.
          స్థిరమయిన మనసుతో చెవులోన జోరీగ అనగా గొంతులోని విశుద్ధ చక్రములో ఉపాంశు
         రీతిలో జోరీగ మాదిరిగా ఓంకారాన్ని చెప్పులోనరాయి అనగా మనస్సులో చెప్తూ రాయి.
         ఇంటిలోన పోరు ఇంతింత కాదయా అనగా దేహో దేవాలయోప్రోక్తః జీవోదేవః సనాతనః
          ఈ దేహమే ఒక ఇల్లు. ఆ ఇంటిలోని పోరు అనగా ఇంద్రియములపోరు అనగాఇంద్రియములు
          అనగా కన్ను సినిమాచూద్దామని, నోరు నానా గడ్డితిందామని వగయిరా , అనుకుంటూ
          ఉంటాయి. కనుక ఓంకారాన్ని మనస్సులో చెప్తూ రాసుకుంటూఉంటే,  అప్పుడు కంటిలోన నలుసు కాలులోన ముల్లు అనగా  లోపల ఉన్న అజ్ఞానాన్ని నలుసును అనగా అజ్ఞానాన్ని కంటావు. ఓంకారాన్ని మనస్సులో చెప్తూ రాసుకుంటూఉన్నావు కాబట్టి లోపలి ముల్లుఅనగా అజ్ఞానము కాలిపోతుంది.
తాత్పర్యము ఏమిటంటే,  ఓంకారాన్ని మనస్సులో చెప్తూరాసుకుంటూ ఉంటే, ఇంటిలోని ఇంద్రియములపోరు బాధతప్పి, మనలోని  అజ్ఞానాన్ని కంటాము. అది కాలిపోతుంది. .
 అంతరంగమందు అభవునుద్దేశించి నిలిపిచూడచూడనిలుచుగాక
బాహ్యమందు శివుని భావింపనిలుచునా విశ్వదాభిరామ వినురవేమా                  2
వినురవేమా అనగా వేరయిన అనగా  స్థిరమనసుతో వినురా ఓ సాధకుడా,
మెడని నిఠారుగా ఉంచి చూపుడువేలును రెండుకనులమధ్య ఉంచి పాలభాగమునకు ఆనించి కొద్ది కొద్దిగా ఆవేలు కొనని పైకెత్తుతూ చూస్తూ ఉండాలి. ఆ కొన కనబడుట ఆగినచోట దృష్టిని నిలుపవలెను. దీనిని కూటస్థములోదృష్టి నిలుపుట అందురు. దీనినే అంతరంగమందుదృష్టి నిలుపుట అనికూడా అంటారు. అనగా అంతర్ముఖమగుట. అంతర్ముఖ దృష్టిని అభ్యాసము చేయగా చేయగా దృష్టి స్థిరమగును. శివుని పొందుకు అనగా పరమాత్మ పొందుకు అంతర్ముఖ దృష్టి అత్యవసరము.  ఇది ఒక క్రియాయోగ ప్రక్రియ. పరమాత్మ పొందుకు స్థిర శ్వాస లేక స్థిర మనస్సు అవసరము. శ్వాసని స్థిరము చేసిన మనస్సు స్థిరమగును. మనస్సు స్థిరము చేసిన శ్వాస స్థిరమగును. అనగా ఒకటి స్థిరమయిన రెండవది తనంతటతానె స్థిరమగును. చంచలశ్వాస లేదా చంచలమనస్సు  చంచలదృష్టికి లేదా బాహ్యదృష్టికి కారణమగుచున్నది. అనగా కన్ను, ముక్కు లాంటి  ఇంద్రియ విషయములు బాహ్యమందు సంచరించును. కనుక బాహ్యమందు శివుని భావింప, నిలుచునా అనగా అంతర్ముఖమవనిది శివుని పొందు సాధ్యమా అని అర్థము. సాధ్యముకాదు..              

అడవిదిరుగజిక్కదాకసమునలేదుఅవనితీర్థయాత్రలందులేదు
ఒడలుశుద్ధిచేసిఒడయనిచూడరా విశ్వదాభిరామ వినురవేమా                              3
వినురవేమా అనగా వేరయిన అనగా  స్థిరమనసుతో వినురా ఓ సాధకుడా,
అడవులలోదిరిగినాచిక్కదుపరమాత్మపొందు,ఆకాశములోచిక్కదు, భూమిమీది తీర్థయాత్రా స్థలము లందునూ దొరకదు. ఒడయని అనగా పరమాత్మని కేవలము ఒడలు అనగా స్థూల, సూక్ష్మ మరియు కారణ  శరీరములు శుద్ధిచేసిన యడలచూడగలవురా సాధకుడా అని అర్థము.  

అదిమిమనసునిలిపిఆనందకేళిలోబ్రహ్మమయుడుముక్తిబడయగోరు
జిహ్వరుచులచేత జీవుండు చెడునయా విశ్వదాభిరామ వినురవేమా                     4
వినురవేమా అనగా వేరయిన అనగా  స్థిరమనసుతో వినురా ఓ సాధకుడా,
అదిమిమనసునిలిపి అనగా మనసు స్థిరము చేసి బ్రహ్మమయుడు అనగా బ్రహ్మ సాధకుడు ఆనందకేళిలో అనగా పరమానందప్రాప్తి బడయగోరు అనగా పొందగోరును.. జిహ్వరుచులచేత జీవుండు చెడునయా అనగా నాలుక, చెవి, చర్మము, కన్ను, ముక్కు లాంటి ఇంద్రియసుఖములతో మనిషి ఇంద్రియలోలుడై జననమరణ చక్రములోబడి చెడిపోవును.  

అనగననగ రాగ మతిశయిల్లుచునుండు తినగ తినగ వేము తీయనుండు
సాధనమునపనులు సమకూరు ధరలోన విశ్వదాభిరామ వినురవేమా                   5
వినురవేమా అనగా వేరయిన అనగా  స్థిరమనసుతో వినురా ఓ సాధకుడా,
ఏ విధముగా తినగ తినగ వేము తీయగా నుండునో  అదేవిధముగా అనగననగ రాగ మతిశయిల్లుచునుండు అనగా ఓంకార ఉచ్చారణ చేయగా చేయగా శోబిల్లుతుంది
ఆ ఓంకార ఉచ్చారణ సాధనమున ధరలోని అనగా ఈ భూమిమీదిమనిషి చేయవలసిన సాధనా పనులు సమకూరును. 

Comments

Popular posts from this blog

Mantrapushpam with Telugu meaning మంత్రపుష్పం

49 Maruts mentioned by Sri Sri Yogiraj LahiriMahasya Maharaj

Shree vidya upaasana