5. సుందరకాండ -- రామాయణం
5. సుందరకాండ స సూర్యాయ మేహేంద్రాయ పవనాయ స్వయంభువే భూతేభ్యశ్చాఞ్జలిం కృత్వా చకార గమనే మతిం 01 తదుపరి హనుమంతుడు సూర్యునకు, ఇంద్రునకు, వాయుదేవునకు, బ్రహ్మదేవునకు, భూతములకు చేతులు జోడించి నమస్కరించి సముద్రముయొక్క ఆవలితీరమునకు పోవుటకు నిశ్చయించెను. పిమ్మట తూర్పుకు తిరిగి తనతండ్రిఅయిన వాయుదేవునకు నమస్కరించెను. తరువాత కార్యశీలుడగు హనుమంతుడు దక్షిణదిక్కునకు వెళ్ళుటకు తన శరీరమును పెంచదొడంగెను. తనను తాను గరుత్మంతుడితో సమానముగా తలచెను. అప్పుడు ఆకాశామందున్న హనుమంతునితో ఆకాశామందున్న మైనాకపర్వతము ప్రసన్నచిత్తుడై మనుష్యరూపము ధరించి తన శిఖరమునుండి ఇట్లు పలికెను. శ్రీరాముని పూర్వీకులు సముద్రమును వృద్ధి చేసిరి. ఇప్పుడు నీవు వారి బాటలోనే నడుస్తున్నావు. కావున సముద్రుడు నీకు నమస్కరించుచున్నాడు. కృతేచ ప్రతికర్తవ్యమేష ధర్మః సనాతన...