7. రామాయణము ఉత్తరకాండ
7. ఉత్తరకాండ రాక్షసులను సంహరించిన పిదప ఆనందము పొందిన మహర్షులు శ్రీరాముని అభినందించిరి. అందుకై అయోధ్యకు వచ్చిరి. కౌశికః అథ యవక్రీతో గార్గ్యో గాలవ ఏవచ కణ్వోమేదాతిథేః పుత్రః పూర్వస్యాం దిశియేశ్రితాః 1 తూర్పు దిక్కునందు ఉండు కౌశికుడు, యవక్రీతుడు, గార్గ్యుడు, గాలవుడు, అట్లాగే మేదాతిథి పుత్రుడైన కణ్వుడు అక్కడికి వచ్చిరి. స్వస్త్యాత్రేయశ్చ భగవాన్ నముచిః ప్రముచిస్తథా అగస్త్యః అత్రిశ్స్చ భగవాన్ సుముఖో విముఖస్తథా ఆజగ్ముస్తే సహాగస్త్యా యే శ్రితా దక్షిణాం దిశం 2 ...