మన అలవాట్లకు సంస్కారములే కారణము . సంస్కారముల వల్ల ఇంద్రియ ప్రలోభములకు అలవాటుపడ్డ మనిషి తన ఇచ్ఛాశక్తితో ఆ అలవాట్లను అధిగమించుటకై క్రియాయోగ ధ్యాన సాధనకు ఉపక్రమిస్తాడు . 1. అన్నమయకోశం : పంచీకరణమువలన ఏర్పడిన స్థూల పంచ భూతములనుండి వ్యక్తీకరించిన 24 తత్వములుగల స్థూల శరీరమే అన్నమయకోశము . పంచ జ్ఞానేంద్రియాలు , పంచ కర్మేంద్రియాలు , పంచ ప్రాణములు , పంచభూతములు , తన్మాత్రలు అనగా శక్తులు , మరియు అంతఃకరణ . దీనినే స్థూల శరీరము అందురు . తన్మాత్ర అనగా శక్తి . ఆకాశమునకు శబ్దము , వాయువునకు స్పర్శ , అగ్నికి రూపం , జలమునకు రస , పృథ్వికి గంధ తత్వములు ఉండును . 2. ప్రాణమయకోశం : సూక్ష్మ శరీరములోని అపంచీకృత పంచ ప్రాణములు ,( ప్రాణ , అపాన , వ్యాన , సమాన మరియు ఉదాన ) పంచ కర్మేంద్రియములు ( నోరు , పాణి , పాదం , ముడ్డి , శశినం ) కలిసి ప్రాణమయకోశము . 3. మనోమయకోశము : సూక్ష్మశరీరములోని పంచ జ్ఞానేంద్రియాలు , మనస్సు , చిత్తము కలిసి మనోమయకోశము . 4. విజ్ఞానమయకోశము : సూక్ష్మశరీరములోని పంచ ...