Budha dosha in Telugu బుధదోషము




బుధదోషము
కనుబొమ్మల మధ్యప్రదేశమును కూటస్థము లేక ఆజ్ఞా + చక్ర మందురు. కూటస్థము positive, మూలాధారము negative.
ధ్యానము వలన సర్వ రోగములు వినాశమగును.
తూర్పు లేదా ఉత్తర దిక్కును చూస్తూ మేరుదండమును మరియు మెడను నిఠారుగా ఉంచుకొని, వజ్రాసనములో, పద్మాసనములో, లేదా సుఖాసనములో,  జ్ఞానముద్రలో   ఉండవలయును.
చూపుడువ్రేలు బొటనవ్రేలు గోరు ఉన్న భాగములు నొక్కిపెట్టి ఉంచవలయును.   మిగిలిన వ్రేళ్ళు నిఠారుగా ఉంచవలయును.
పీనల్ గ్లాన్డ్స్, కి సంబంధించిన రోగముల నివారణ. మానసిక బలహీనతను తొలగించుట, సప్త ధాతువులను బలోపేతము చేయుట, మంచి సంతాన ప్రాప్తి, Low B.P.

ఆజ్ఞనెగటివ్ చక్రము tense చేయవలయును. మనస్సు దృష్టి ఆజ్ఞనెగటివ్ చక్రముమీద ఉంచ వలయును.
మనము ఇప్పుడు 108 మారులు ఆజ్ఞనెగటివ్ చక్రములో ‘ఓం’ ఉచ్ఛారణ చేద్దాము.
తదుపరి “హ”  “క్ష” అక్షరములు 108 మారులు  ఉచ్ఛారణ చేయవలయును.
ఇది 41 దినములు ఉదయము మరియు సాయంత్రము చేయవలయును.
ఆజ్ఞ చక్రము బుధగ్రహమునకు స్థానము.
దీనికి ఎడమవయిపు అనగా ఇడావయిపు అనగా  ఆజ్ఞ నెగటివ్ వయిపు కుంభరాశి ఉండును. 
దీనికి కుడివయిపు అనగా పింగళావయిపు ఆజ్ఞ పాజిటివ్ చక్రములో మీనరాశి ఉండును.
మనము ఇప్పుడు 108 మారులు ఆజ్ఞపాజిటివ్ చక్రములో ‘ఓం’ ఉచ్ఛారణ చేద్దాము.
తదుపరి “హ”  “క్ష” అక్షరములు 108 మారులు ఆజ్ఞపాజిటివ్ చక్రములో ఉచ్ఛారణ చేయవలయును.
తలకాయనొప్పులు, టెన్షన్, కాన్సర్, డిప్రెషన్, ద్వేషము, రోగముల నివారణ. జ్ఞాపకశక్తి పెంపొం దించుట, సెంట్రల్ నర్వస్ సిస్టంను బలోపేతము చేయుట, High B.P.
దీనివలన బుధ దోషము తొలగును.
ఇది 41 దినములు ఉదయము మరియు సాయంత్రము చేయవలయును.

Comments

Popular posts from this blog

Mantrapushpam with Telugu meaning మంత్రపుష్పం

Mantrapushpam in English

49 Maruts mentioned by Sri Sri Yogiraj LahiriMahasya Maharaj