6 .యుద్ధకాండ –రామాయణము
6 . యుద్ధకాండ –రామాయణము హనుమంతుడు తన లంకా ప్రయాణమును గూర్చి విపులముగా శ్రీరామునికి విశదీకరించిన తదుపరి మిక్కిలి సంతోషించిన శ్రీరాముడు ఇట్లనెను. కృతం హనుమతా కార్యం సుమహద్ భువి దుర్లభం మనసాపి యదన్యేన న శక్యం ధరణీతలే. 1 హనుమంతుడు చాలా గొప్ప కార్యమును నెరవేర్చెను. ఈ భూతలముపై అంతటి మహత్ కార్యమును జరుపుట ఇంకొకడికి దుర్లభము. ఇంకొకడు ఇట్టి కార్యమును చేయుటకు యోచింపనుకూడా కష్టము. న హితం పరిపశ్యామి యస్తరేత మహోదధిం అన్యత్ర గరుడాద్ వాయోరన్యత్ర చ హనూమతః 2 గరుత్...