గ్రంధి—క్షేత్రము—శాంతి
గ్రంధి — క్షేత్రము — శాంతి క్రియల అనుష్ఠానము మేరుదండములో కుండలినీశక్తిని ఆనుకొనియున్నదే మూలాధార చక్రము లేక సహదేవచక్రము. మేరుదండములో రెండున్నర (చూపుడువ్రేలు మొదటి కణుపు) కణుపులపైన మేరుదండములో ఉన్నది స్వాధిష్ఠానచక్రము లేక నకులచక్రము , నాభి వెనకాల మేరుదండములోనున్నది మణిపురచక్రము అర్జున చక్రము. హృదయము వెనకాలనున్నది అనాహతచక్రము , భీమచక్రము. గొంతులోనున్నది విశుద్ధచక్రము , ధర్మరాజచక్రము. రెండు కనుబొమ్మలమధ్య కూటస్థములోనున్నది ఆజ్ఞాచక్రము శ్రీకృష్ణ చక్రము. తలకాయమధ్యలో బ్రహ్మరంధ్రముక్రిందనున్నది సహస్రారచక్రము , పరమాత్మచక్రము. . ప్రతిమనిషిలోను మూలాధార , స్వాధిష్ఠాన , మణిపుర , అనాహత , విశుద్ధ , ఆజ్ఞా మరియు సహస్రార అని కారణ చేతనకు నిలయములయిన ఆధ్యాత్మిక మేరుదండ సంబంధిత చక్రములు ఉంటాయి. వీటిలో మూలాధార , స్వాధిష్ఠాన , మణిపుర , అనే మొదటిమూడు సంసారచక్రములు. దీనిని కురుక్షేత్రము అంటారు. మణిపుర , అనాహత , విశుద్ధ అనే చక్రములను కురుక్షేత్ర ధర్మక్షేత్రము అంటారు. విశుద్ధ , ఆజ్ఞా మరియు సహస్రార చక్రములను ధర్మక్షేత్రము అంటారు. శరీరములో ముడ్డి వద్...