Kriyayoga interpretation of Balaji charitra and Mahabharata with Telugu commentary
Kriyayoga interpretation of Balaji charitra and Mahabharata with Telugu commentary బాలాజీ మందిరము తిరుపతిలో ఉన్నది. నేను ఇక్కడ ఆ మందిరమునకు యోగార్థము చెప్పుచున్నాను. అంతేకాదు మహాభారతమునకు , మరియు సమాధిల గురించి కూడా యోగార్థము చెప్పుచున్నాను. In Balaji charitra Kundalinee is called Padmavati, in Mahabharat it is Draupadi, and in Ramayana it is Sita. Let us start. చక్రములలో ధ్యానము.: తూర్పు లేదా ఉత్తర దిక్కును చూస్తూ మేరుదండమును మరియు మెడను నిఠారుగా ఉంచుకొని , వజ్రాసనములో , పద్మాసనములో , లేదా సుఖాసనములో , జ్ఞానముద్ర లేదా లింగముద్ర లోగాని కూర్చుండ వలయును. కొంచెము రిలాక్స్ (Relax) అవ్వాలి. కూటస్థములో దృష్టి నిలిపి ఖేచరీ ముద్రలో ఉండాలి. పృధ్వీముద్ర వేసికోవాలి. మూలాధారచక్రము టెన్స్ (Tense) చేసి దాని మీద మనస్సు ఉంచాలి. మూలాధార చక్రములో ఆరోగ్యమయిన వ్యక్తికి 24 గంటలలో 96 నిమిషములలో 600 హంసలు జరుగును. ఖేచరీ ముద్రలో నాలుగు దీర్ఘహంసలు చేయండి. సాధకుడు కలియుగములో , ఋగ్వేదకాలములో ఉన్నట్లు లెక్క. ఇక్కడి సాధకుని క్...