Posts

క్రియాయోగము

     క్రియాయోగము పరమాత్మే ఆదిపురుషుడు. పరాప్రకృతిని కలిగియున్నాడు. పరాప్రకృతియే రాధ.ప్రత్యేకముగా కనబడు ప్రతి జీవాత్మయు ఆ పరమాత్మే. కర్మను అనుసరించి జన్మ వచ్చును. గ్రహ రాశులు మనిషికి తన కర్మ ప్రకారము అంగీకృతమయినప్పుడు, సూక్ష్మశరీరము మాతృయోనియందు ప్రవేశించి, స్థూలశరీర నిర్మాణమునకు ఉపయుక్తమగును. మరణము అనగా స్థూలసూక్మశరీరములు రెండును జన్మ కారణమయిన ప్రారబ్ధకర్మ పూర్తిఅగుటతో విడిపోవుట. మానవుడు సజీవముగా ఉన్నప్పుడే చైతన్య స్ఫూర్తితో శరీరమును ఆత్మను వేరుచేయు స్థితికి చేరుకున్నచో మరణము బాధించదు.   కాని ఇట్టి స్థితికి చేరుకొనుటకు క్రమము తప్పని దృఢమైన నిశ్చయముతో చేయు ధ్యానము అవసరము. సద్గురువు కృపవలన మూలాధార, స్వాధిష్ఠాన, మణిపుర, అనాహత, విశుద్ధ, మరియు ఆజ్ఞా చక్రములున్న మేరుదండమును శుద్ధము చేసి సాధకునిలోని సహజముగనున్న అనంతమయిన శక్తిని ప్రజ్వరిల్లజేయవలయును. దీనివలన సాధకునికి 1) జ్యోతిదర్శనము, 2) శబ్దము, మరియు 3) ప్రకంపనములు కలుగును.అప్పుడు కుండలినీ శక్తి ఉత్తెజించబడి ఆరుచక్రములలోను పరిభ్రమించబడి మెదడునకు చేరును. అప్పుడు సాధకుడు దైవశక్తియుతుడు అగును. ...