Kriya 1 in Telugu with Mudras.
ఓం శ్రీ యోగానంద గురు పరబ్రహ్మణేనమః గమనిక: గురుముఖతః ఇది నేర్చుకొనుట అతిఉత్తమము. మహాముద్ర: తూర్పు లేదా ఉత్తర దిక్కును చూస్తూ మేరుదండమును మరియు మెడను నిఠారుగా ఉంచుకొని, వజ్రాసనములో, పద్మాసనములో, లేదా సుఖాసనములో, జ్ఞానముద్ర లేదా లింగముద్ర లోగాని కూర్చుండ వలయును. కొంచెము రిలాక్స్ (Relax) అవ్వాలి. కూటస్థములో దృష్టి నిలిపి ఖేచరీ ముద్రలో ఉండ వలయును.. నోరు పూర్తిగా తెరిచి శ్వాస పూర్తిగా బయటికి వదలవలయును. నాలుక వెనక్కి ముడిచి అంగిటిలో కొండనాలుక క్రింద ఉంచవలయును. దీనిని ఖేచరీ ముద్ర అంటారు. నోరు బాగా తెరిచిఉంచుకొనవలయును. ఖేచరీ ముద్రలోఉండి కాళ్ళు బారజాచుకోవాలి. ఎడమ కాలి నడమ గుదస్థానము క్రింద ఉంచవలయును. కుడికాలును పూర్తిగా వెనక్కిలాగి ముడుచుకొని కూర్చొనవలయును. ఇలా గొంతుకూర్చోని ఖేచరీ ముద్రలో ఉండాలి. ఖేచరీ ముద్రలోఉండి నోరు బాగా తెరిచిఉంచుకొని శ్వాస పూర్తిగా లోపలికి తీసుకోవాలి. ఎడమ కాలి నడమ గుదస్థానము క్రిందనే ఉంచి శ్వాస పూర్తిగా బయటికి వదలుతూ కుడికాలును పూర్తిగా బారజాచుకో...